డిటెక్టివ్ విద్యాబాలన్
డిటెక్టివ్ విద్యాబాలన్
Published Thu, Sep 26 2013 1:11 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM
నీటుగా చీర కట్టుకుని అభినయించే పాత్రలే కాదు.. హాట్‌గా మినీ డ్రెస్‌లేసుకుని కూడా అద్భుతంగా అభినయించగలరు విద్యాబాలన్. అయితే ఆ అభినయం జుగుప్సాకరంగా మాత్రం ఉండదు. అందుకే ‘డర్టీ పిక్చర్’లో ఆమె కాస్తంత విజృంభించినా ప్రేక్షకులు మెచ్చుకున్నారు... జాతీయ అవార్డు కూడా వచ్చింది.
ఎప్పటికప్పుడు వినూత్న పాత్రలు చేయడానికి ఇష్టపడే విద్యాబాలన్ ఈసారి డిటెక్టివ్‌గా కనిపించబోతున్నారు. తన భర్త సాహిల్ సంగాతో కలిసి నటి దియా మిర్జా ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఇందులో డిటెక్టివ్ పాత్ర చేయాలని కోరగానే విద్యా కథ విన్నారు. ఈ స్టోరీ, తన పాత్ర బాగా నచ్చడంతో ఎగ్జయిట్ అయ్యి, వెంటనే పచ్చజెండా ఊపేశారామె.
ఈ చిత్రానికి ‘బాబీ జాసూస్’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. సమర్ షైక్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమా నవంబర్‌లో ప్రారంభం అవుతుంది. ఇదిలా ఉంటే, విద్యాబాలన్, దియా మంచి స్నేహితులు. ఈ చిత్రంలో విద్యా నటించడానికి అది కూడా ఓ కారణం. ఈ షూటింగ్ ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతుందా? అని ఎదురు చూస్తున్నానని విద్యా అంటున్నారు.
Advertisement
Advertisement