ముంబై : పురుషాధిక్యం కలిగిన సినీ పరిశ్రమలో మహిళల ఇతివృత్తాలతో సినిమాలు వెల్లువెత్తడంపై బాలీవుడ్ నటీమణి విద్యాబాలన్ స్పందించారు. అక్షయ్ కుమార్ వంటి దిగ్గజ స్టార్‌లు లేకుండానే మహిళా స్టార్‌లతో ఏదో ఒక రోజు రూ 200 కోట్ల నుంచి రూ 500 కోట్ల బడ్జెట్‌తో సినిమాలు తెరకెక్కుతాయని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. అక్షయ్ కుమార్‌తో జోడీగా గత ఏడాది విడుదలైన మిషన్ మంగళ్‌లో మహిళా నటులు అధికంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర విజయంలో అందరి పాత్ర ఉన్నా ప్రధానంగా సక్సెస్ ఖిలాడీ ఖాతాలోకి వెళ్లింది. కమర్షియల్ సినిమాలో మహిళల పాత్రపై విద్యాబాలన్ మాట్లాడుతూ గతంలో మహిళా ఓరియెంటెడ్ సినిమాలు తక్కువగా వచ్చేవని, ఇప్పుడు మెయిన్‌స్ర్టీమ్ కమర్షియల్ చిత్రాల్లో మహిళల చుట్టూ కథ తిరిగే చిత్రాలు పెరిగాయని చెప్పుకొచ్చారు. విద్యాబాలన్ కహానీ, తుమ్హరీ సులు, డర్టీ పిక్చర్, బేగం జాన్, పరిణీత వంటి పలు మహిళా ప్రాధాన్యత కలిగిన చిత్రాల్లో లీడ్ రోల్‌లో నటించి ప్రేక్షకులను మెప్పించారు.
Comments
Please login to add a commentAdd a comment