
అక్టోబర్‌లో దియామీర్జా పెళ్లి
‘బాబీ జాసూస్’ నిర్మాత, బాలీవుడ్ తార దియా మీర్జా ఈ ఏడాది అక్టోబర్‌లో పెళ్లి చేసుకోనుంది. ఈ విషయాన్ని ఆమే స్వయంగా వెల్లడించింది. ‘బాబీ జాసూస్’ సహ నిర్మాత అయిన బాయ్‌ఫ్రెండ్ సాహిల్ సంఘాతో తన పెళ్లి అక్టోబర్‌లో జరగనుందని ఆమె చెప్పింది. తమ పెళ్లి భారత్‌లోనే జరుగుతుందని, వచ్చే వారం నుంచే పెళ్లి పనులపై ప్లానింగ్ ప్రారంభించనున్నామని తెలిపింది.