
చక్కటి అమ్మాయి. దాంపత్యం చిక్కుల్లో పడింది. భర్తతో వచ్చిన చిక్కుల్ని విడాకులతో తొలగించుకుని బయటికి వచ్చేసింది. అలా వచ్చేశాక, ఆమె ఎవరికైనా సలహాలు ఇవ్వగలుగుతుందా? ‘విడిపోయాక ధైర్యంగా ఉండగలుగుతున్నావా.. ధైర్యంగా ఉండాలంటే ఏం చేయాలి?’ అని ఎవరైనా తనను అడుగుతుంటే!! దియా మీర్జాకు ఇప్పుడు ఇలాంటి సమస్యే ఎదురవుతోంది. ఏవో మనస్పర్థలతో ఈ మధ్యే భర్త నుంచి విడిపోయి, వేరుగా ఉంటున్నారు దియా మీర్జా. దియా హైద్రాబాద్ అమ్మాయి. తన బిజినెస్ పార్టనర్‌నే లైఫ్ పార్ట్‌నర్‌గా చేసుకుంది. ఆరేళ్ల తర్వాత, గత ఏడాది సెప్టెంబర్‌లో ఇద్దరూ విడిపోయారు. తనే భర్తను వద్దనుకుందని అంటారు. ఆయన పేరు సహీల్ సింఘా. ‘ఒక బంధం నుంచి బయటికి వచ్చాక స్ట్రాంగ్‌గా ఉండగలమా?’ అని అడుగుతున్నారట దియా ఫ్రెండ్స్. వాళ్లు కూడా విడాకులు తీసుకున్నవారే. వాళ్ల ప్రశ్నలకు దియా దగ్గర సమాధానం లేదు. ‘‘ఎవరి జీవితమూ ఎవరికీ అనుభవంగా పనికిరాదు. పరిష్కారమూ చూపదు’’ అని మాత్రం అంటున్నారు. ఆ మాట కూడా.. నవ్వుతూనే.
Comments
Please login to add a commentAdd a comment