నటిపై లైంగిక వేధింపులు.. ప్రసాద్‌కు పెళ్లి కూడా అయిందా? | Do You Know Youtuber Prasad Behara Married His Co Actress And Get Divorced, Check About Her | Sakshi
Sakshi News home page

Prasad Behara: యువతిపై లైంగిక వేధింపులు.. మరో నటితో ప్రసాద్‌కు పెళ్లి!

Published Thu, Dec 19 2024 8:46 PM | Last Updated on Fri, Dec 20 2024 11:21 AM

Youtuber Prasad Behara Married Actress Goes Viral

టాలీవుడ్‌లో ఫేమస్ యూట్యూబర్ ప్రసాద్‌ బెహరాను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఆయన అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఓ వెబ్ సిరీస్‌ షూటింగ్ సెట్‌లో తనతో అసభ్యంగా ప్రవర్తించాడని జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.

అయితే తాజా పరిణామాల నేపథ్యంలో ప్రసాద్‌ బెహరాకు సంబంధించి ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. అతనికి ఇప్పటికే పెళ్లయిందని తెలుస్తోంది. గతంలో ఓ ఇంటర్వ్యూలో ప్రసాద్ ఈ విషయాన్ని వెల్లడించారు. తనతో కలిసి నటించిన జాను నారాయణ అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నట్లు వివరించాడు. అయితే ఆ తర్వాత ఆమెతో విడిపోయినట్లు తెలిపారు. మా ఇద్దరి సెట్ కాకపోవడంతో విడిపోవాలని నిర్ణయించుకున్నామని ప్రసాద్ పేర్కొన్నారు.

(ఇది చదవండి: నటిపై లైంగిక వేధింపులు.. యూట్యూబర్ ప్రసాద్ బెహరా అరెస్ట్)

కాగా.. మావిడాకులు వెబ్ సిరీస్‌తో టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్నారు. యూట్యూబ్‌లో వెబ్ సిరీస్‌ల ద్వారా టాలీవుడ్‌లో ఫేమస్ అయ్యారు. అంతేకాకుండా పెళ్లివారమండి లాంటి సిరీస్‌లతో ప్రేక్షకులను అలరించారు. ఈ ఏడాది రిలీజైన కమిటీ కుర్రోళ్లు చిత్రంలోనూ కీలక పాత్రలో కనిపించారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement