Sahil Sangha
-
దియా మీర్జాకు కొత్త చిక్కు
చక్కటి అమ్మాయి. దాంపత్యం చిక్కుల్లో పడింది. భర్తతో వచ్చిన చిక్కుల్ని విడాకులతో తొలగించుకుని బయటికి వచ్చేసింది. అలా వచ్చేశాక, ఆమె ఎవరికైనా సలహాలు ఇవ్వగలుగుతుందా? ‘విడిపోయాక ధైర్యంగా ఉండగలుగుతున్నావా.. ధైర్యంగా ఉండాలంటే ఏం చేయాలి?’ అని ఎవరైనా తనను అడుగుతుంటే!! దియా మీర్జాకు ఇప్పుడు ఇలాంటి సమస్యే ఎదురవుతోంది. ఏవో మనస్పర్థలతో ఈ మధ్యే భర్త నుంచి విడిపోయి, వేరుగా ఉంటున్నారు దియా మీర్జా. దియా హైద్రాబాద్ అమ్మాయి. తన బిజినెస్ పార్టనర్‌నే లైఫ్ పార్ట్నర్గా చేసుకుంది. ఆరేళ్ల తర్వాత, గత ఏడాది సెప్టెంబర్‌లో ఇద్దరూ విడిపోయారు. తనే భర్తను వద్దనుకుందని అంటారు. ఆయన పేరు సహీల్ సింఘా. ‘ఒక బంధం నుంచి బయటికి వచ్చాక స్ట్రాంగ్‌గా ఉండగలమా?’ అని అడుగుతున్నారట దియా ఫ్రెండ్స్. వాళ్లు కూడా విడాకులు తీసుకున్నవారే. వాళ్ల ప్రశ్నలకు దియా దగ్గర సమాధానం లేదు. ‘‘ఎవరి జీవితమూ ఎవరికీ అనుభవంగా పనికిరాదు. పరిష్కారమూ చూపదు’’ అని మాత్రం అంటున్నారు. ఆ మాట కూడా.. నవ్వుతూనే. -
విడిపోయి కలిసుంటాం: దియా మీర్జా
ముంబై: బాలీవుడ్ నటి దియామీర్జా సోషల్ మీడియా వేదికగా అసక్తికర ట్వీట్ చేసింది. మాజీ భర్త సాహిల్‌సంగాతో కలిసిన ఉన్న ఫోటోను షేర్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. గత వారం వీరు విడిపోతున్నట్లు ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రకటించి అందరిని షాక్‌కు గురి చేసిన విషయం విదితమే. 2014లో వీరికి వివాహమైన విషయం తెలిసిందే. దియా, సాహిల్ విడిపోయిన తరువాత మొదటిసారి కలుసుకోవడం విశేషం. వారిద్దరు వేర్వేరు కార్లలో ముంబై నగరంలో కలుసుకున్నారు, అయితే తమ బంధం గురించి వారు స్పందిస్తూ మేము విడిపోయినా ఎప్పటికీ స్నేహితులుగా కలిసే ఉంటామని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. గత పదకొండేళ్లుగా కలిసున్నామని మా ఇద్దరి ప్రయాణాలు వేరవడంతో విడిపోయామని వారు అన్నారు. ఎప్పటికి ప్రేమ, అనురాగాలతో పరస్పరం సహకరించుకుంటామని వారు పేర్కొన్నారు. -
రెండు విడాకులు.. ఒక రూమర్!
ఉబుసుకోక ఊహాలకు పనిచెప్పే గాసిప్‌రాయుళ్లు కొందరుంటారు. తలా-తోకాలేని ఊహాలతో కథనాలల్లి.. మీడియాలో పుకార్లకు షికార్లు తొడుగుతారు. తాజాగా ఓ రెండు జంటలు తాము వేరవుతున్నట్టు ప్రకటించాయి. వైవాహిక బంధం నుంచి తప్పుకొని.. పరస్పర సామరస్యంతో విడాకులు తీసుకుంటున్నట్టు వెల్లడించాయి. అంతే, రాసిప్రాయుళ్లు తమ చెత్తబుర్రలకు పదును పెట్టారు. ఈ జంటల విడాకులకు మధ్య ఇంటర్‌లింక్‌ను సృష్టించి.. ఎఫైర్ కారణంగానే వాళ్లు విడిపోయారంటూ కథనాలు అల్లారు. దీనిపై ఆ జంటలు స్పందించి.. ఆ పుకార్లకు ఫుల్స్టాప్ పెట్టాయి. ఇటీవల విడాకులు తీసుకున్న సినీ జంటలు దియా మీర్జా-సాహిల్ సంఘా, ప్రకాశ్ కోవెలముడి-కనికా దిల్హాన్ విషయంలో ఇది జరిగింది. బాలీవుడ్ నటి దియా మీర్జా తన భర్త సాహిల్ సంఘా నుంచి వేరవుతున్నట్టు ప్రకటించగా.. అదే సమయంలో దర్శకుడు ప్రకాశ్ కోవెలమూడి భార్య, స్క్రీన్‌రైటర్ కనికా దిల్హాన్ తాము విడాకులు తీసుకున్నట్టు వెల్లడించారు. దీంతో దియా-సాహిల్ విడాకులకు కారణం కనికా దిల్హాన్ అని వదంతులకు తెరతీశారు. సాహిల్‌తో కనికకు ఉన్న ఎఫైర్ కారణంగా ఈ రెండు జంటలు వేరయ్యాయి అంటూ కథనాలు సృష్టించారు. దీనిపై దియా మీర్జా స్పందిస్తూ.. ఈ వదంతులకు అసలు అర్థమే లేదని కొట్టిపారేశారు. తాము విడిపోవడం వెనుక మూడో వ్యక్తి ప్రమేయమే లేదని ఆమె ట్విటర్లో స్పష్టం చేశారు. కనిక కూడా ట్విటర్లో ఈ కథనాలపై స్పందించారు. దియా, సాహిల్‌లను తన జీవితంలో ఏనాడూ కలుసుకోలేదని స్పష్టం చేశారు. ఇది అత్యంత దారుణమైన, జుగుప్సకరమైన వదంతులని, టాబ్లాయిడ్లు కొంచెం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని మండిపడ్డారు. ఏకకాలంలో జరిగిన రెండు ఘటనల మధ్య ఇంటర్‌లింక్‌ను సృష్టించడం సరికాదని, తాను ఫిక్షన్ రైటర్‌నని, తనను మించిపోయారని గాసిప్రాయుళ్లను ఎద్దేవా చేశారు. సాహిల్ సంఘా కూడా ఈ వదంతులను తీవ్రంగా ఖండించారు. -
‘అవును.. మేము విడిపోతున్నాం’
ముంబై : బాలీవుడ్లో మరో జంట విడాకులకు సిద్ధమైంది. ఐదేళ్ల వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతున్నట్లు నటి దియా మీర్జా, ఆమె భర్త సాహిల్ సంగా సంయుక్త ప్రకటన విడుదల చేశారు. దంపతులుగా విడిపోయినప్పటికీ తాము ఎల్లప్పుడూ స్నేహితులుగానే ఉంటామని పేర్కొన్నారు. ఈ మేరకు...‘ పదకొండేళ్లుగా ఒకరికై ఒకరుగా బతికిన మేము విడిపోవాలని నిర్ణయించుకున్నాము. మా మధ్య భార్యాభర్తల బంధం లేకపోయినా ఒకరిపై ఒకరికి ఉన్న గౌరవం ఏమాత్రం తగ్గదు. మా జీవన ప్రయాణంలో వేర్వేరు దారుల్లో ప్రయాణించాలనుకున్నప్పటికీ కలిసి గడిపిన క్షణాలను, బంధాన్ని గుర్తు చేసుకుంటూ ఒకరి పట్ల ఒకరం కృతఙ్ఞతా భావం కలిగి ఉంటాము. ఇటువంటి సమయంలో మాకు తోడుగా నిలిచి, మమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకున్న కుటుంబ సభ్యులకు, స్నేహితులకు ధన్యవాదాలు. అదేవిధంగా మా వ్యక్తిగత విషయాన్ని పూర్తిగా గోప్యంగా ఉంచడంలో..సహకరించిన వారందరికీ కృతఙ్ఞతలు. ఇక ఈ విషయంపై స్పందించాలనుకోవడం లేదు. దయచేసి మీడియా నా విన్నపాన్ని మన్నించాలి’ అంటూ దియా మీర్జా ఇన్‌స్టాగ్రామ్‌లో తన, తన భర్త పేరిట ఓ లేఖ షేర్ చేశారు. కాగా హైదరాబాద్ భామ దియా మీర్జా తన చిరకాల స్నేహితుడు సాహిల్ సంగాతో ఆరేళ్ల పాటు డేటింగ్ చేశారు. తమ బంధాన్ని ముందుకు తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో 2014, అక్టోబరులో ఢిల్లీలోని ఓ ఫామ్‌హౌజ్‌లో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరూ కలిసి బాబీ జాసూస్ వంటి పలు చిత్రాలను నిర్మించారు. ఇక సినిమాలతో పాటు సామాజిక కార్యక్రమాలతో బిజీగా ఉండే దియా... భారత్ తరఫున ఐక్యరాజ్యసమితి పర్యావరణ సంస్థకు గుడ్‌విల్ అంబాసిడర్‌గా ఉన్నారు. పర్యావరణ సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను ప్రచారంలో చేయడంలో ఆమె కీలక పాత్ర పోషించారు. ఒక స్క్రిప్ట్ వినిపించడానికి తొలిసారిగా తన దగ్గరికి వచ్చిన సమయంలో సాహిల్‌తో ప్రేమలో పడినట్లు దియా గతంలో వెల్లడించిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Dia Mirza (@diamirzaofficial) on Jul 31, 2019 at 10:37pm PDT -
దియా మీర్జా పెళ్లికి 'బాబీ జాసూస్' ఆటంకం!
బాలీవుడ్ తెరపై అప్పుడప్పుడు దర్శనమిచ్చి.. ఇటీవల నిర్మాతగా మారిన హైదరాబాద్ అమ్మాయి దియా మీర్జా త్వరలో పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకుంది. గత కొద్దికాలంగా డేటింగ్ చేస్తున్న సాహిల్ సంగాను వచ్చే ఏడాది అక్టోబర్ లో వివాహం చేసుకునేందుకు దియా మీర్జా నిశ్చయించుకున్నారు. నిర్మాత మారిన దియా మీర్జా లవ్ బ్రేక్ అప్ జిందగీ, తాజాగా విద్యాబాలన్ తో బాబీ జాసూస్ చిత్రాన్ని నిర్మించారు. వాస్తవానికి సాహిల్ తో గత సంవత్సరమే వివాహం జరగాల్సి ఉండేది. అయితే బాబీ జాసూస్ నిర్మాణం కారణంగా 2015 వరకు పెళ్లి వాయిదా పడింది. నాలుగేళ్ల క్రితం న్యూయార్క్ లో జరిగిన ఐఫా అవార్డుల కార్యక్రమం సందర్బంగా సాహిల్, దియా మీర్జాల మధ్య ప్రేమ చిగురించింది. -
అక్టోబర్‌లో దియామీర్జా పెళ్లి
‘బాబీ జాసూస్’ నిర్మాత, బాలీవుడ్ తార దియా మీర్జా ఈ ఏడాది అక్టోబర్‌లో పెళ్లి చేసుకోనుంది. ఈ విషయాన్ని ఆమే స్వయంగా వెల్లడించింది. ‘బాబీ జాసూస్’ సహ నిర్మాత అయిన బాయ్‌ఫ్రెండ్ సాహిల్ సంఘాతో తన పెళ్లి అక్టోబర్‌లో జరగనుందని ఆమె చెప్పింది. తమ పెళ్లి భారత్‌లోనే జరుగుతుందని, వచ్చే వారం నుంచే పెళ్లి పనులపై ప్లానింగ్ ప్రారంభించనున్నామని తెలిపింది. -
డిటెక్టివ్ లా వెంటబడనక్కర్లేదు:దియా మీర్జా
ముంబై:గత కొన్ని రోజులుగా మీడియాకు దూరంగా ఉంటున్న సాహిల్ సంగా- దియా మీర్జాలు మరోసారి వార్తల్లోకి వచ్చారు. ఈ మధ్యనే వారిద్దరూ బోర్న్ ఫ్రీ ఎంటర్టైన్మెంట్ ద్వారా నిర్మించిన 'బాబీ జాసెస్' చిత్రం విజయం సాధించడంతో మళ్లీ వార్తలో నిలిచారు. కొంత సాహిల్ తో వివాహానికి సంబంధించిన ఊహాగానాలపై దియా తొలిసారి స్పందించింది. ' మా పెళ్లి విషయంలో దాపరికాలు ఏమీ లేవు. మా వివాహం త్వరలోనే జరుగుతుంది. దీనిపై ఎవరూ డిటెక్టివ్ లా వెంటబడనక్కర్లేదు' అంటూ దియా పేర్కొంది. త్వరలో జరిగే తమ వివాహానికి సంబంధించిన వివరాలను ఇప్పుడే చెబితే ఇక చెప్పడానికి ఏముంటుందని ప్రశ్నించింది. సాహిల్ తో మ్యారెజ్ కు ఆత్రుతగా ఉన్న దియా.. ఈ సంవత్సరంలోనే తమ పెళ్లి వేడుకలు ఉంటాయని కచ్చితంగా చెబుతోంది. కాకపోతే డిటెక్టివ్ లా ఎవరూ దీనిపై శోధించాల్సిన అవసరం లేదని పేర్కొంది. మా పెళ్ల్లి తప్పకుండా ఇండియాలోనే జరుగుతుందని.. అది కూడా అక్టోబర్ లోనే ఉండవచ్చని స్పష్టం చేసింది. దానికి సంబంధించి వివరాలను మరోవారంలో వెల్లడిస్తా నంటూ తెలిపింది. గత ఏప్రిల్ లో తన వ్యాపారి భాగస్వామి అయిన సాహిల్ తో దియా నిశ్చితార్ధం చేసుకున్న సంగతి తెలిసిందే. దియామీర్జా, సాహిల్ సంగా కలిసి బోర్న్ ఫ్రీ ఎంటర్టైన్మెంట్ అనే నిర్మాణ సంస్థను 2011లో ఏర్పాటుచేశారు. 'లవ్ బ్రేకప్స్ జిందగీ' అనే సినిమాతో నిర్మాణం మొదలుపెట్టి, తాజాగా విద్యాబాలన్‌తో 'బాబీ జాసూస్' చిత్రాన్ని తెరకెక్కించారు.