ఆయన నన్ను అలా భావించరు | Vidya Balan: Siddharth doesn't treat me as his property | Sakshi
Sakshi News home page

ఆయన నన్ను అలా భావించరు

Published Thu, Jun 26 2014 11:42 PM | Last Updated on Sat, Sep 2 2017 9:26 AM

ఆయన నన్ను అలా భావించరు

ఆయన నన్ను అలా భావించరు

 ‘‘నా భర్త సిద్దార్థ్ రాయ్ కపూర్‌ది ఉన్నతమైన వ్యక్తిత్వం. భర్తలందరూ తన భార్యల్ని సొంత ఆస్తులుగా భావిస్తుంటారు. కానీ... నా భర్త నన్ను అలా భావించరు. ఒక వ్యక్తిగా గౌరవిస్తారు. నా అభిమతానికి అడ్డురారు’’అన్నారు విద్యాబాలన్. ఆమె కథానాయికగా రూపొందిన ‘బాబీ జాసూస్’ చిత్రం త్వరలో విడుదల కానుంది. హైదరాబాద్ నేపథ్యంతో కూడిన కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా ప్రమోషన్ నిమిత్తం ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో విద్యా తన వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పారు.
 
 ‘‘పెళ్లి తర్వాత సినీ తారల జీవితాల్లో మార్పులు చోటుచేసుకోవడం సహజం. కానీ... పెళ్లి తర్వాత కూడా నా జీవితంలో ఎలాంటి మార్పు లేదు. 2007 నుంచి ఏడాదికి ఒకే చిత్రంలో నటిస్తున్నాను. ఇప్పుడూ అదే జరుగుతోంది. దీనికి కారణం నా భర్త సిద్దూనే’’ అని చెప్పారు విద్య. ‘‘పెళ్లికి ముందు నుంచీ సిద్దూతో నాకు రిలేషన్ ఉంది. పెళ్లి తర్వాత కూడా అదే కొనసాగుతోంది. మా ఇద్దరి రంగాలూ వేరైనా... మా వృత్తులను పరస్పర అవగాహనతో గౌరవించుకుంటాం. ప్రేమ విషయంలో మా అమ్మానాన్నలనే మరిపించాడు తను’’ అని విద్యాబాలన్ ఉద్వేగానికి లోనయ్యారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement