Siddharth Roy Kapur
-
ఎంత పిచ్చి ఉంటే మాత్రం భర్తను పట్టించుకోవా?.. నెటిజన్స్ ఆగ్రహం
కెమెరా అంటే సెలబ్రిటీలకు మహా ఇష్టం. షూటింగ్‌లోనే కాదు, బయట ఎవరైనా ఫోటోలు క్లిక్ చేయడానికి ప్రయత్నించినా ఐయామ్ రెడీ అంటూ వెంటనే పోజులిస్తుంటారు. తాజాగా ఓ అవార్డుల ఫంక్షన్‌కు హాజరైన విద్యాబాలన్ కూడా కారు దిగగానే ఇదిగో వస్తున్నా అంటూ నడుముకు చేయి పెట్టుకుని వడివడిగా నడుచుకుంటూ వచ్చి అందంగా ఫోటోలు దిగింది. అంతా బానే ఉంది కానీ విద్యాబాలన్ తన ఫోటోల మీద పెట్టిన దృష్టి భర్త సిద్దార్థ్ రాయ్ కపూర్ మీద పెట్టినట్లు కనిపించడం లేదు. విద్యాతో ఫోటో దిగేందుకు సిద్దార్థ్ రెడీ అయినా ఆమె మాత్రం భర్తను పట్టించుకోలేదు. దీంతో అతడు ఇబ్బందికరంగా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అవేమీ పట్టించుకోని నటి హ్యాపీ ఎక్స్‌ప్రెషన్స్‌తో పోజులివ్వడంలో నిమగ్నమైంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు 'ఎంత ఫోటోల పిచ్చి ఉంటే మాత్రం భర్తను కూడా మైమరచిపోతారా?', 'అసలు వీళ్ల దాంపత్య జీవితం బాగానే ఉందా?' అని కామెంట్లు చేస్తున్నారు. ఆమెతో కలిసి ఫోటో దిగాలనుకున్న భర్తను విద్యాబాలన్ ఏమాత్రం లెక్క చేయకుండా పొగరు చూపించిందని అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆమె అభిమానులు మాత్రం విద్యాబాలన్ చబ్బీగా ఎంత బాగుందోనని మురిసిపోతున్నారు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) చదవండి: అబ్బా, నీ ముఖం చూడలేకపోతున్నాం.. స్టార్ కిడ్‌పై ట్రోలింగ్ -
వంట నేర్చుకోను
విద్యా బాలన్‌కు వంట రాదు. నేర్చుకునే ఉద్దేశం కూడా లేదు. అయినా ఆసక్తి లేని పనులను పనికట్టుకుని చేయడం ఎందుకూ? అంటారామె. 2012లో నిర్మాత సిద్ధార్థ్ రాయ్ కపూర్‌ని పెళ్లి చేసుకున్నారు విద్యాబాలన్. పెళ్లయిన వెంటనే విద్యా వాళ్ల అమ్మ ‘ఇప్పుడైనా వంట నేర్చుకో..’ అని సలహా ఇచ్చారట. ‘‘ఎందుకు నేర్చుకోవాలి? ఇప్పుడు నేను బాగా సంపాదిస్తున్నాను. కావాలంటే వంటవాళ్లను పెట్టుకుంటాను. వాళ్లు లేకపోతే బయట నుంచి తెచ్చుకుంటా. లేదా బయటకు వెళ్లి తింటా. నాకు వంటా వార్పు మీద ఆసక్తి లేదు’ అని తల్లికి బదులిచ్చారు. అది మాత్రమే కాదు.. ‘‘వంట నేర్చుకో అని నాకు చెప్పే బదులు వంట వచ్చిన వాళ్లను పెళ్లి చేసుకోవచ్చుగా అని ఎందుకు చెప్పడం లేదు’ అని తిరిగి ప్రశ్నించారు కూడా. ‘‘వీళ్లు ఈ పని కచ్చితంగా చేయాలి’’ అని తరతరాలుగా వస్తున్న ఈ ఆలోచనా విధానాన్ని నేను పట్టించుకోను. నా భర్త కూడా నా ఆలోచనలను అర్థం చేసుకున్నారు’’ అని పేర్కొన్నారు విద్యా బాలన్. -
పైరసీ చేస్తే మూడేళ్ల జైలు
చలనచిత్ర రంగానికి పెద్ద సమస్యగా మారింది పైరసీ భూతం. ఇకపై సినిమాకి చెందిన సంబంధిత వ్యక్తుల అనుమతులు లేకుండా సినిమాను కాపీ చేయాలనుకునే వారిపై కఠిన చర్యలు తీసుకునేలా సినిమాటోగ్రఫీ 1952 సవరణ బిల్లుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ కొత్త చట్టం ప్రకారం సరైన అనుమతులు లేకుండా ౖపైరసీ చర్యలకు పాల్పడిన వ్యక్తులు మూడేళ్ల కారాగార శిక్ష లేదా పది లక్షల రూపాయల జరిమానా కట్టాల్సిన అవసరం ఉంటుంది. లేదా ఆ రెండిటికీ శిక్షార్హులవుతారు. కేంద్రప్రభుత్వ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ప్రతిపాదించిన ఈ సవరణ బిల్లు గురించి సినీ ప్రముఖులు సోషల్ మీడియాలో స్పందిస్తూ తమ ఆనందాన్ని షేర్ చేసుకున్నారు. ‘‘మన దేశంలోని మేధావుల సంపత్తిని కాపాడుకోవడంలో ఇది ముఖ్యమైన ముందడుగు’’ అని ‘ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా’ ప్రెసిడెంట్ సిద్ధార్థ్‌రాయ్ కపూర్ అన్నారు. -
ప్రతినెలా ప్రెగ్నెంట్‌ని చేశారు: హీరోయిన్
ముంబై: బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్ మాటలు ఆమె సినిమాల్లాగే బోల్డ్‌గా ఉంటాయి. నాలుగేళ్ల క్రితం ఫిల్మ్ ప్రొడ్యూసర్ సిద్ధార్థ్ రాయ్ కపూర్‌ను విద్యాబాలన్ పెళ్లి చేసుకున్నారు. అయితే ఇటీవల ఆమె వైవాహిక జీవితంలో విభేదాలు తలెత్తాయన్న రూమర్స్ సినీ సర్కిల్స్‌లో గుప్పుమన్నాయి. దీనిపై విద్యాబాలన్ తనదైన స్టైల్లో క్లారిటీ ఇచ్చారు. సిద్ధార్థ్ తో తనకెలాంటి విభేదాలు లేవని ఆమె స్పష్టం చేశారు. అసలు ఇలాంటి అవాస్తవాలు ఎక్కడ నుంచి వస్తాయో తనకు అర్థం కాదన్నారు. తన ప్రెగ్నెన్సీపై కూడా ఇలాంటి రూమర్స్ క్రియేట్ చేసిన విషయాన్ని గుర్తుచేశారు. గాసిప్ మేకర్స్ నన్ను ప్రతినెలా ప్రెగ్నెంట్‌ని చేశారు అంటూ చెప్పుకొచ్చారు. మొదట్లో ఇలాంటి రూమర్స్ విషయంలో కాస్త బాధపడేదాన్నని.. అయితే రానురాను అసలు పట్టించుకోవడమే మానేశానని ఓ జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ విద్యా బాలన్ అన్నారు. -
మా దాంపత్యానికి అదే మేలు!
సాధారణంగా భార్యాభర్తలు ఒకే రంగానికి చెందితే.. వారిద్దరూ కలిసి పనిచేసే అవకాశముంటుందని ఎవరైనా అనుకుంటారు. కానీ, అలా కలిసి పనిచేయకపోవడమే తమ దాంపత్యానికి మేలు చేస్తుందని అంటోంది బాలీవుడ్ భామ విద్యాబాలన్. ఈ అమ్మడు నిర్మాత సిద్ధార్థ్ రాయ్ కపూర్‌ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. మరి భర్త నిర్మించే సినిమాలో మీరు ఎందుకు నటించరు అని విలేకరులు అడిగినప్పుడు.. 'మేం కలిసి పని చేయకుండా ఉండేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నాం. నిజానికి అదే మా వైవాహిక బంధానికి మేలు చేస్తోంది' అని విద్యాబాలన్ సెలవిచ్చింది. ఇలా కలిసి పనిచేయకపోవడం వల్ల కొన్ని మంచి సినిమాల్లో నటించే అవకాశం చేజారిపోవచ్చు. కానీ ఆమాత్రం త్యాగం చేయడం కూడా అవసరమే. అందుకే వ్యక్తిగత జీవితాన్ని, వృత్తి జీవితాన్ని మిక్స్ చేయకూడదని నేను భావిస్తాను' అని వివరణ ఇచ్చింది. 'ఎవరైనా దంపతులు కలిసి పనిచేస్తున్నారని తెలిసినప్పుడు నేను గొప్పగా భావిస్తా. దాని గురించి మేం చర్చించకుంటాం కూడా. కానీ మా ఇద్దరి విషయానికొస్తే మాత్రం మేం సేఫ్‌గా ఉండేందుకు ప్రయత్నిస్తాం. కలిసి పనిచేయకుండా ఉండటమే మా పెళ్లికి మంచిది' అని విద్య చెప్పింది. త్వరలో 'తీన్' సినిమాతో ప్రేక్షకులను పలుకరించనున్న ఈ భామ తనకు థ్రిల్లర్ సినిమాలంటే చాలా ఇష్టమని చెప్పింది. -
ఆయన నన్ను అలా భావించరు
‘‘నా భర్త సిద్దార్థ్ రాయ్ కపూర్ది ఉన్నతమైన వ్యక్తిత్వం. భర్తలందరూ తన భార్యల్ని సొంత ఆస్తులుగా భావిస్తుంటారు. కానీ... నా భర్త నన్ను అలా భావించరు. ఒక వ్యక్తిగా గౌరవిస్తారు. నా అభిమతానికి అడ్డురారు’’అన్నారు విద్యాబాలన్. ఆమె కథానాయికగా రూపొందిన ‘బాబీ జాసూస్’ చిత్రం త్వరలో విడుదల కానుంది. హైదరాబాద్ నేపథ్యంతో కూడిన కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా ప్రమోషన్ నిమిత్తం ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో విద్యా తన వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. ‘‘పెళ్లి తర్వాత సినీ తారల జీవితాల్లో మార్పులు చోటుచేసుకోవడం సహజం. కానీ... పెళ్లి తర్వాత కూడా నా జీవితంలో ఎలాంటి మార్పు లేదు. 2007 నుంచి ఏడాదికి ఒకే చిత్రంలో నటిస్తున్నాను. ఇప్పుడూ అదే జరుగుతోంది. దీనికి కారణం నా భర్త సిద్దూనే’’ అని చెప్పారు విద్య. ‘‘పెళ్లికి ముందు నుంచీ సిద్దూతో నాకు రిలేషన్ ఉంది. పెళ్లి తర్వాత కూడా అదే కొనసాగుతోంది. మా ఇద్దరి రంగాలూ వేరైనా... మా వృత్తులను పరస్పర అవగాహనతో గౌరవించుకుంటాం. ప్రేమ విషయంలో మా అమ్మానాన్నలనే మరిపించాడు తను’’ అని విద్యాబాలన్ ఉద్వేగానికి లోనయ్యారు. -
కాపురంలో కలతలా?
సంసారం అనే నావ సాఫీగా సాగినంతవరకే వైవాహిక జీవితం పసందుగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య ఏవైనా మనస్పర్ధలు వచ్చాయా.. ఇక అంతే సంగతులు. ఆ సంసారం ఛిన్నాభిన్నం అయిపోతుంది. సిద్ధార్ధ్‌రాయ్‌కపూర్, విద్యాబాలన్‌ల సంసారం అంతవరకూ రాలేదు కానీ.. ఈ ఇద్దరి మధ్య చిన్నపాటి మనస్పర్ధలు నెలకొన్నాయని బాలీవుడ్ టాక్. ఈ మధ్య విద్యాబాలన్ విదేశాలకు వెళ్లినప్పుడు ఆమె భర్త వేరే నటితో స్నేహం మొదలుపెట్టారనే వార్త హల్చల్ చేస్తోంది. కేవలం స్నేహం మాత్రమే అన్న చందంగా ఈ వ్యవహారం లేకపోవడంతో విద్య కలత చెందారట. ఈ కారణంగానే తన విదేశీ కార్యక్రమాలన్నిటినీ రద్దు చేసుకుంటున్నారని సమాచారం. సిద్ధార్ధ్రాయ్కి ఇది మూడో పెళ్లి. ఇద్దరు భార్యలకు దూరమైన సిద్ధార్ధ్‌రాయ్ తన విషయంలో అలా చేయకుండా ఉంటాడా? అనే భయం విద్యను వెంటాడుతుందట. విద్య, సిద్ధార్ధ్‌రాయ్ పెళ్లయ్యి దాదాపు ఏడాదిన్నర అవుతోంది. పెళ్లయిన తర్వాత పలు సందర్భాల్లో అత్తవారిల్లు తనకు పుట్టిల్లులాంటిదని, వైవాహిక జీవితం చాలా బాగుందని చెప్పారు విద్య. ఒకవేళ సిద్ధార్ధ్‌రాయ్ కనుక ఆమెను నిర్లక్ష్యం చేస్తే... పరిస్థితిని చక్కదిద్దుకోగల నేర్పు విద్యాకి ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. ఆ మధ్య విద్యా ‘షాదీ కే సైడ్ ఎఫెక్ట్స్’ అనే చిత్రంలో నటించారు. ఆ చిత్రంలో ఆమె భర్తతనని నిర్లక్ష్యం చేస్తాడు. చివరకు తప్పు తెలుసుకుంటాడు. మరి... సిద్ధార్ధ్‌రాయ్ కనుక విద్యని అలానే చేస్తే, ‘షాదీ కే సైడ్ ఎఫెక్ట్స్’లా వీరి వైవాహిక జీవితానికి శుభం కార్డు పడాలని కోరుకోనివారు ఉండరు.