ప్రతినెలా ప్రెగ్నెంట్‌ని చేశారు: హీరోయిన్
ముంబై: బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్ మాటలు ఆమె సినిమాల్లాగే బోల్డ్‌గా ఉంటాయి. నాలుగేళ్ల క్రితం ఫిల్మ్ ప్రొడ్యూసర్ సిద్ధార్థ్ రాయ్ కపూర్‌ను విద్యాబాలన్ పెళ్లి చేసుకున్నారు. అయితే ఇటీవల ఆమె వైవాహిక జీవితంలో విభేదాలు తలెత్తాయన్న రూమర్స్ సినీ సర్కిల్స్‌లో గుప్పుమన్నాయి.
దీనిపై విద్యాబాలన్ తనదైన స్టైల్‌లో క్లారిటీ ఇచ్చారు. సిద్ధార్థ్ తో తనకెలాంటి విభేదాలు లేవని ఆమె స్పష్టం చేశారు. అసలు ఇలాంటి అవాస్తవాలు ఎక్కడ నుంచి వస్తాయో తనకు అర్థం కాదన్నారు. తన ప్రెగ్నెన్సీపై కూడా ఇలాంటి రూమర్స్ క్రియేట్ చేసిన విషయాన్ని గుర్తుచేశారు. గాసిప్ మేకర్స్ నన్ను ప్రతినెలా ప్రెగ్నెంట్‌ని చేశారు అంటూ చెప్పుకొచ్చారు. మొదట్లో ఇలాంటి రూమర్స్ విషయంలో కాస్త బాధపడేదాన్నని.. అయితే రానురాను అసలు పట్టించుకోవడమే మానేశానని ఓ జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ విద్యా బాలన్ అన్నారు.