మా దాంపత్యానికి అదే మేలు! | Why it is healthier for Vidya not to work with her husband? | Sakshi
Sakshi News home page

మా దాంపత్యానికి అదే మేలు!

Published Sun, Jun 5 2016 7:29 PM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

మా దాంపత్యానికి అదే మేలు! - Sakshi

మా దాంపత్యానికి అదే మేలు!

సాధారణంగా భార్యాభర్తలు ఒకే రంగానికి చెందితే.. వారిద్దరూ కలిసి పనిచేసే అవకాశముంటుందని ఎవరైనా అనుకుంటారు. కానీ, అలా కలిసి పనిచేయకపోవడమే తమ దాంపత్యానికి మేలు చేస్తుందని అంటోంది బాలీవుడ్‌ భామ విద్యాబాలన్‌. ఈ అమ్మడు నిర్మాత సిద్ధార్థ్‌ రాయ్‌ కపూర్‌ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

మరి భర్త నిర్మించే సినిమాలో మీరు ఎందుకు నటించరు అని విలేకరులు అడిగినప్పుడు.. 'మేం కలిసి పని చేయకుండా ఉండేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నాం. నిజానికి అదే మా వైవాహిక బంధానికి మేలు చేస్తోంది' అని విద్యాబాలన్ సెలవిచ్చింది. ఇలా కలిసి పనిచేయకపోవడం వల్ల కొన్ని మంచి సినిమాల్లో నటించే అవకాశం చేజారిపోవచ్చు. కానీ ఆమాత్రం త్యాగం చేయడం కూడా అవసరమే. అందుకే వ్యక్తిగత జీవితాన్ని, వృత్తి జీవితాన్ని మిక్స్‌ చేయకూడదని నేను భావిస్తాను' అని వివరణ ఇచ్చింది. 'ఎవరైనా దంపతులు కలిసి పనిచేస్తున్నారని తెలిసినప్పుడు నేను గొప్పగా భావిస్తా. దాని గురించి మేం చర్చించకుంటాం కూడా. కానీ మా ఇద్దరి విషయానికొస్తే మాత్రం మేం సేఫ్‌గా ఉండేందుకు ప్రయత్నిస్తాం. కలిసి పనిచేయకుండా ఉండటమే మా పెళ్లికి మంచిది' అని విద్య చెప్పింది. త్వరలో 'తీన్‌' సినిమాతో ప్రేక్షకులను పలుకరించనున్న ఈ భామ తనకు థ్రిల్లర్ సినిమాలంటే చాలా ఇష్టమని చెప్పింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement