
ఒక క్రిమినల్ ముగ్గురు వ్యక్తులను కిడ్నాప్ చేశాడు. వారి ముందు మూడు వాటర్ గ్లాస్‌లు పెట్టాడు. ఒక్కొక్కరికి రెండు పిల్స్ ఇచ్చాడు. ‘మీకు ఇచ్చిన పిల్స్‌లో ఒకటి విషం ఉన్నది. రెండోది విషం లేనిది. అందులో ఒకటి నోట్లో వేసుకొని గ్లాస్‌లో నీళ్లు తాగండి. మీ అదృష్టం ఎలా ఉందో పరీక్షించుకోండి’ అని హుకుం జారీ చేశాడు.
మొదటి వ్యక్తి రెండిట్లో ఒకటి వేసుకొని, గ్లాస్‌లో నీళ్లు తాగాడు. చనిపోయాడు. రెండో వ్యక్తి రెండిట్లో ఒకటి నోట్లో వేసుకొని నీళ్లు తాగాడు. చనిపోయాడు. మూడో వ్యక్తి బా...గా ఆలోచించి ఒకటి సెలెక్ట్ చేసుకొని, నోట్లో వేసుకొని నీళ్లు తాగాడు. అతడు కూడా చనిపోయాడు.
రెండు పిల్స్‌లో ఒకటి మాత్రమే విషపూరితమైనప్పుడు ఒక్కరికైనా బతికే అదృష్టం ఎందుకు లేకుండా పోయింది?
అసలు విషయం: నిజానికి అందులో ఒకటి కూడా పాయిజన్ పిల్ లేదు. వారికి ఇచ్చిన వాటర్‌గ్లాస్‌లలోనే పాయిజన్ ఉంది!
చదవండి: నిద్ర లేకపోతే ఎంత డేంజరో తెలుసా? మీకు తెలియని షాకింగ్ విషయాలు
Comments
Please login to add a commentAdd a comment