
వీడుతున్న రాజలింగమూర్తి హత్య కేసు మిస్టరీ
నేడు 8 మంది అరెస్ట్ చూపనున్న పోలీసులు
హైదరాబాద్‌లో కొత్త హరిబాబు అదుపులోకి..
సహకరించిన మరో ఇద్దరు పరారీలో..
భూపాలపల్లి: సామాజిక కార్యకర్త నాగవెల్లి రాజ లింగమూర్తి హత్య కేసు మిస్టరీ నేటితో వీడనుంది. బుధవారం రాత్రి ఆయన దారుణ హత్యకు గురి కాగా, పోలీసులు మూడు రోజుల పాటు దర్యాప్తు చేపట్టి నిందితులను గుర్తించినట్లు సమాచారం. వి శ్వసనీయ సమాచారం మేరకు వివరాలు ఇలా ఉ న్నాయి. భూపాలపల్లి పట్టణానికి చెందిన నాగవెల్లి రాజలింగమూరి్త(49) ఈ నెల 19న రాత్రి సుమారు 7 గంటల సమయంలో హత్యకు గురైన విషయం తెలిసిందే. పోలీసులు మూడు రోజులు పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించగా.. హత్యకు పాల్పడింది, సహకరిచింది ఎవరనేది సాక్ష్యాధారాలతో నిర్ధారించుకున్నట్లు సమాచారం.
మారణాయుధాలను చెరువులో పడేసి తప్పించుకునే యత్నం..
ప్రధాన నిందితులుగా ఉన్న నలుగురు రాజలింగమూర్తిని హత్య చేసిన అనంతరం తప్పించుకునేందుకు యత్నించినట్లు తెలుస్తోంది. రెడ్డికాలనీ మలుపు వద్ద హత్య చేసిన తర్వాత ఒక కత్తిని అక్కడే విసిరి, మరో కత్తి, రాడ్డు, రాయిని తమ వెంట ఆటోలో తీసుకెళ్లి భూపాలపల్లి మండలం కొంపె ల్లి చెరువులో పడేసినట్లు పోలీసుల విచారణలో నిందితులు వెల్లడించినట్లు సమాచారం. అక్కడి నుంచి పారిపోయేందుకు యత్నించగా ఫోన్ కాల్ డేటా ఆధారంగా పోలీసులు పట్టుకున్నట్లు తెలుస్తోంది. అలాగే, హత్యకు సహకరించిన మరో ముగ్గురిని పోలీసులు పట్టుకుని పూర్తి స్థాయిలో విచారించగా.. రాజలింగమూర్తి రాకపోకల సమాచారం ఇవ్వడం, నిందితులను తప్పించేందుకు సహకారం అందించామని ఒప్పుకున్నట్లు సమాచారం.
పోలీసుల అదుపులో కొత్త హరిబాబు ?
నిందితుల ఫోన్ కాల్ డేటా ఆధారంగా భూపాలపల్లి మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్, బీఆర్‌ఎస్ నాయకుడు కొత్త హరిబాబును కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. హత్యకు పాల్పడిన నిందితులు.. హరిబాబుతో ఫోన్‌లో మాట్లాడినట్లు పోలీసులు గుర్తించి హైదరాబాద్‌లో ఉన్న అతడిని అదుపులోకి తీసుకుని శనివారం రాత్రి భూపాలపల్లికి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. కాగా, ఈ హత్య కేసులో సహకరించిన మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు సమాచారం.
నేడు నిందితుల అరెస్ట్ చూపించనున్న పోలీసులు..
రాజలింగమూర్తి హత్య కేసులో 8 మంది నిందితులను నేడు(ఆదివారం) ఉదయం 8.30 గంటలకు అరెస్ట్ చూపించనున్నారు. ఈ మేరకు జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రెస్‌మీట్ ఏర్పాటు చేసి హత్య కేసు వివరాలు ఎస్పీ కిరణ్ ఖరే వెల్లడించనున్నారు.
హత్యకు పాల్పడింది నలుగురు..
భూపాలపల్లి పీఎస్ ఎదుట గల సర్వే నంబర్ 319లోని భూమికి సంబంధించి తలెత్తిన వివా దంతోనే రాజలింగమూర్తిని ప్రత్యర్థులు హతమార్చారని పోలీసుల విచారణలో వెల్లడైనట్లు సమాచారం. హత్యకు పాల్పడిన రేణుకుంట్ల సంజీవ్, పింగిలి శ్రీమాంత్(బబ్లూ), మోరె కుమార్, కొ త్తూరి కుమార్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి ఏ–1, ఏ–2, ఏ–3, ఏ–4 గా చేర్చినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment