ఇంగ్లిష్ మూవీ ‘చెన్నై స్టోరీ’ కోసం డిటెక్టివ్‌గా అనుగా మారనున్నారు శ్రుతీహాసన్. ‘ది అరేంజ్‌మెంట్స్ ఆఫ్ లవ్’ నవల ఆధారంగా దర్శకుడు, ‘బాఫ్తా’ అవార్డు విజేత ఫిలిప్ జాన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఓ ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెన్సీ నడిపే తమిళ మహిళ కథే ఈ చిత్రం. కనిపించకుండా ΄ోయిన తన తండ్రిని కనుగొనే ప్రయత్నంలో ఓ వ్యక్తి (బ్రిటిష్ నటుడు వివేక్ కల్రా) వేల్స్ నుంచి చెన్నైలో అడుగుపెట్టి, డిటెక్టివ్ అను సహాయం కోరడం, ఆ తర్వాత అను ఏం చేసింది? అనేది కథాంశం.
ప్రధానంగా ఇంగ్లిష్, కొంచెం తమిళ్, వేల్స్ భాషలతో ఈ రొమాంటిక్ కామెడీ చిత్రం సాగుతుంది. కాగా, ఇండో–యూకే ్ర΄÷డక్షన్ నిర్మించనున్న ఈ చిత్రానికి యూకేకి చెందిన బ్రిటిష్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ ఫండింగ్ చేయనుంది. ‘‘చెన్నై బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ చిత్రానికి అంతర్జాతీయ భాగస్వామ్యం ఉండటం హ్యాపీగా ఉంది’’ అన్నారు శ్రుతీహాసన్. కాగా ఈ సినిమాని సమంత చేయాల్సింది. కానీ కొన్నాళ్లు ఆమె సినిమాలకు గ్యాప్ ఇవ్వడంవల్ల ఈ చాన్స్ శ్రుతీహాసన్‌కి దక్కింది.
Comments
Please login to add a commentAdd a comment