నటించడం మొదలెట్టాక నా ఆలోచన మారింది | idea started to become acting | Sakshi
Sakshi News home page

నటించడం మొదలెట్టాక నా ఆలోచన మారింది

Published Thu, Aug 27 2015 12:22 AM | Last Updated on Fri, Aug 17 2018 2:24 PM

నటించడం మొదలెట్టాక  నా ఆలోచన మారింది - Sakshi

నటించడం మొదలెట్టాక నా ఆలోచన మారింది

సోహా అలీఖాన్
 
‘మొదట నేను డిటెక్టివ్ కావాలనుకున్నాను. యుక్త వయసులో లాయర్ కావాలనుకున్నా. ఇంకా ఏవేవో చేయాలనుకున్నా. రాయాలని కూడా అనుకున్నా. చివరికి నటినయ్యా. సిటీబ్యాంక్‌లో ఏడాదిన్నర పాటు పనిచేసిన తర్వాత నేను సినిమాల్లోకి వచ్చా. ఒకప్పుడు సినిమా అంటే ఏముంది? పాటలు పాడడం, డ్యాన్సులు చేయడం.. అంతే కదా అనుకున్నా. నటించడం మొదలుపెట్టాక నా ఆలోచన మారింది. మనలోని ప్రతిభను వెలికితీసే నటనకు అవకాశం ఇచ్చే పాత్రలు కూడా ఉన్నాయని గుర్తిస్తున్నాను. షర్మిల తల్లి పాత్రలు చేసిన సినిమాలన్నింటిలోనూ చనిపోతుంది.

నిజానికి ప్రేక్షకులు కూడా అదే కోరుకున్నారు. అయితే, తల్లిపాత్రలు చేయడంలో ఎటువంటి నష్టం కలగదనే విషయంలో ఆమెతో నేను అంగీకరిస్తాను. ఈ ఏడాది అక్టోబరు 30న రిలీజ్ అవుతున్న నా సినిమాలో నేను ముగ్గురు బిడ్డల తల్లిగా చేస్తున్నా. చాలా మంది యువకులు తాము అభిమానించేలా యుక్తవయసు మహిళలనే తెరపై చూడాలని కోరుకుంటారు. అలాంటి యవతులతో మాత్రమే ఫాంటసైజ్ చేసుకుంటారనేది నిజం (నవ్వు). ఏదేమైనా మన దేశం రెండు రకాల కాలాల్లో జీవిస్తోంది. ఒకటేమో 12వ శతాబ్ధంలో అయితే, మరొకటి ఆధునిక భారతదేశాన్ని నడిపిస్తోంది. ఈ రెండు యుగాల మనస్తత్వాలను అర్థం చేసుకుని ముందుకు వెళ్లగలిగే సత్తా మన మహిళలకు ఉంది’.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement