స్కామ్‌లో ఇరుకున్న నటుడు | Spying On Wife Allegations Nawazuddin Siddiqui Summoned | Sakshi
Sakshi News home page

భార్యపై నిఘా.. స్కామ్‌లో ఇరుకున్న నటుడు

Published Sat, Mar 10 2018 2:59 PM | Last Updated on Sat, Aug 11 2018 6:59 PM

Spying On Wife Allegations Nawazuddin Siddiqui Summoned - Sakshi

భార్య అంజలితో సిద్ధిఖీ

సాక్షి, ముంబై : కాల్‌ డేటా రికార్డ్‌ స్కామ్‌లో బాలీవుడ్‌ నటుడికి పోలీసులు సమన్లు జారీ చేశారు. విలక్షణ నటుడిగా గుర్తింపుపొందిన నవాజుద్దీన్‌ సిద్ధిఖీ, తన భార్య అంజలిపై అనుమానంతో ఓ డిటెక్టివ్‌ను నియమించాడని.. ఆమె కాల్‌ డేటాను సేకరించాడని ఆరోపణలు ఉన్నాయి.

వ్యక్తిగత కాల్స్‌ను ట్రాప్‌ చేస్తున్నారంటూ కొందరు ఫిర్యాదులు రావటంతో థానే క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ వ్యవహారం చిన్నది కాదని తేల్చిన పోలీసులు.. కాల్‌ డేటా రికార్డ్‌ స్కామ్‌ పేరిట దీని దర్యాప్తు చేపట్టారు. మొత్తం 11 మందిని అరెస్ట్‌ చేయగా.. అందులో ప్రైవేట్‌ డిటెక్టివ్‌లు కూడా ఉన్నారు. నవాజ్‌ తన భార్యపై అనుమానంతో నిఘా వేయించాడని, కాల్‌ డేటా సేకరించాడని ఓ డిటెక్టివ్‌ వెల్లడించాడు. అందుకు గానూ నవాజ్‌ తనకు రూ. 50 వేల దాకా చెల్లించాడని అతను చెప్పాడు. 

దీంతో విచారణకు సహకరించాల్సిందిగా నవాజుద్దీన్‌ పోలీసులు కోరారు. అయినా ఎటువంటి స్పందన లేకపోవటంతో థానే పోలీసులు సమన్లు జారీ చేశారు. ఇక ఈ వ్యవహారంపై నవాజుద్దీన్‌ ట్విట్టర్‌లో స్పందించాడు. తన కూతురు స్కూల్‌ ప్రాజెక్టు కోసం హాజరయ్యానని చెబుతూ.. అసత్య ఆరోపణలపై మీడియా తనను ప్రశ్నించటం దిగ్భ్రాంతి కలగజేస్తోందని అంటున్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement