Call data
-
Meerpet Case: గురుమూర్తి ఫోన్లో ఏముంది?.. వెలుగులోకి విస్తుపోయే విషయాలు
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మీర్‌పేట(Meerpet Case) వెంకటమాధవి హత్య కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. భర్తను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. గురుమూర్తి(Gurumurthy) కాల్ డేటా Call Data) మొత్తాన్ని చెక్ చేసిన పోలీసులు.. అతనికి ఎవరితోనైనా వివాహేతర సంబంధాలు ఉన్నాయన్న కోణంలో ఆరా తీస్తున్నారు. ఆధారాలు దొరకకుండా భార్యను హత్య చేయడం వెనుక మరో మహిళతో అక్రమ సంబంధం కారణంగానే భార్యను హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. మాధవి మృతదేహం బూడిద ఆధారాల కోసం పోలీసులు లోతైన విచారణ చేపట్టారు.ఇంకా ఎలాంటి ఆధారాలు దొరకలేదు: డీసీపీఎల్బీ నగర్ డీసీపీ ప్రవీణ్ కుమార్ ‘సాక్షి’ మీడియాతో మాట్లాడుతూ, ఈ కేసులో విచారణ కొనసాగుతుందని.. ఇప్పటివరకు మిస్సింగ్ కేసు గానే మేము విచారణ చేస్తున్నామన్నారు. ఈ కేసులో ఎలాంటి ఆధారాలు లభించలేదన్నారు. సీసీ కెమెరాలు రికార్డయిన దృశ్యాలు ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామన్నారు. వెంకట మాధవి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు తమ కూతురిని గురుమూర్తే హత్య చేశాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతుందన్నారు.బాడీని ముక్కలు ముక్కలు చేసి చెరువులో పడేసినట్లు ఇంకా ఆధారాలు దొరకలేదు. సీసీ కెమెరా ఫుటేజ్‌లో మాత్రం వెంకట మాధవి ఇంట్లోకి వెళ్లిన దృశ్యాలు మాత్రమే ఉన్నాయి. ఇంటి నుంచి బయటకు వచ్చినట్టు దృశ్యాలు లేవు. వెంకట మాధవిని భర్త గురుమూర్తి హత్య చేసినట్లు వాళ్ల కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. సైంటిఫిక్ ఎవిడెన్స్ ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నామని డీసీపీ వెల్లడించారు.ప్రకాశం జిల్లా జేపీ చెరువుకు చెందిన విశ్రాంత ఆర్మీ జవాన్ గురుమూర్తి (39), వెంకట మాధవి (35) భార్యాభర్తలు. వారికి 13 ఏళ్ల క్రితం వివాహమైంది. ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఐదేళ్ల క్రితం జిల్లెలగూడ న్యూ వేంకటేశ్వర కాలనీలోకి వచ్చి, అద్దె ఇంట్లో ఉంటున్నారు. గురుమూర్తి కంచన్‌బాగ్‌లోని డీఆర్డీఓలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. గురుమూర్తి విపరీత ప్రవర్తన, అనుమానిస్తూ వేధిస్తుండటంతో భార్య మాధవి ఇబ్బందిపడుతూ ఉండేది. ఇరువురి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి.ఈ నెల 16న గురుమూర్తి, మాధవి మధ్య మరోసారి వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో గురుమూర్తి ఆమెను పాశవికంగా హత్యచేశాడు. కానీ ఎవరికీ చెప్పకుండా ఇంట్లోంచి వెళ్లిపోయిందని అందరికీ చెప్పాడు. మాధవి తల్లి ఉప్పాల సుబ్బమ్మ తన కూతురు కనిపించకుండా పోయిందని ఈ నెల 18న మీర్‌పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.ఇదీ చదవండి: హైదరాబాద్: కిడ్నీ ఆపరేషన్ కేసులో కీలక మలుపుఇంట్లో గొడవ జరిగిన సమయంలోనే మాధవిని గురుమూర్తి హత్య చేశాడు. కానీ ఏమీ ఎరగనట్టుగా అత్తమామలతో పాటు వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కానీ భార్యభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నట్టు తెలుసుకున్న పోలీసులు గురుమూర్తిపై నిఘా పెట్టారు. అతడి ప్రవర్తన, కదలికలపై అనుమానం రావడంతో అదుపులోకి తీసుకొని విచారించగా.. అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసుకు సంబంధించి లోతుగా దర్యాప్తు చేస్తున్నామని మీర్పేట్ సీఐ నాగరాజు తెలిపారు.భార్యను హత్య చేసిన గురుమూర్తి పోలీసులకు ఎలాంటి ఆధారాలు, ఆనవాళ్లు చిక్కకుండా పక్కా ప్లాన్ చేశాడు. శరీరంలోని ఎముకలను పొడిగా ఎలా మార్చాలని యూట్యూబ్, ఇతర సామాజిక మాధ్యమాల్లో శోధించాడు. క్రైమ్, హర్రర్ సినిమాలు చూశాడు. ముందుగా వీధి కుక్క మీద ప్రయోగం చేశాడు. కుక్కను ఇంట్లోకి తీసుకొచ్చి చంపేశాడు. ముక్కలుగా నరికి, ఎముకలతో సహా కుక్కర్లో ఉడకబెట్టాడు. తర్వాత అదే తరహాలో భార్య శరీరాన్ని కూడా ముక్కలు చేసి, ఉడకబెట్టాడు. ఎండబెట్టి, కాల్చి పొడి చేశాడు.మాధవి మిస్సింగ్ కేసు నేపథ్యంలో.. జిల్లెలగూడ న్యూవేంకటేశ్వర కాలనీలో గురుమూర్తి, మాధవి నివాసమున్న ఇల్లు, పరిసర ప్రాంతాలను పోలీసులు మూడు రోజులుగా క్షుణ్నంగా పరిశీలించినట్టు తెలిసింది. ఆమె హత్యకు గురై ఉంటే ఏమైనా ఆధారాలు లభిస్తాయేమోనని డ్రైనేజీ మ్యాన్‌హోల్స్, నాలాలను కూడా తెరిచి పరిశీలించినట్టు స్థానికులు తెలిపారు. కానీ నిందితుడిని విచారించిన సమయంలో అసలు సంగతి బయటపడింది. -
గంటల కొద్దీ ఫోన్ కాల్స్!
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: కామారెడ్డి జిల్లాలో కలకలం సృష్టించిన ఎస్ఐ, కానిస్టేబుల్, మరో యువకుడి మృతి కేసులో వారి ఫోన్‌కాల్, వాట్సాప్ చాటింగ్ డేటా కీలకంగా మారింది. చనిపోయే రోజు భిక్కనూరు ఎస్ఐ సాయికుమార్, బీబీ పేట కానిస్టేబుల్ శ్రుతి, కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ ఫోన్ లో గంటలకొద్దీ మాట్లాడుకున్నట్లు పోలీసులు గుర్తించారు. వీరు ముగ్గురు ఈ నెల 25న కామారెడ్డి జిల్లా కేంద్రానికి సమీపంలోని అడ్లూర్ ఎల్లారెడ్డి పెద్ద చెరువులో నీటమునిగి చనిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై దర్యాప్తు ముమ్మ రం చేసిన పోలీసులు.. వారి కాల్ డేటాను సేకరించారు. చనిపోయేదాకా ఫోన్‌కాల్స్ బుధవారం వేకువజాము నుంచే వీరు ఫోన్లో మాట్లాడుకున్నట్లు కాల్ డేటా ద్వారా స్పష్టమైంది. సాయికుమార్ రెండు ఫోన్లలో కలిపి మూడు సిమ్‌లు వాడగా, నిఖిల్ రెండు ఫోన్లు వాడాడు. శ్రుతి ఒక ఫోన్ వాడుతుండేది. చనిపోయే వారం రోజుల ముందు నుంచి ఎక్కువ సార్లు ఫోన్లో మాట్లాడుకు న్నట్లు తెలుస్తోంది. బుధవారం ఉదయం నుంచి ఒక్క చోటు కి చేరుకునేదాకా వీరు ఫోన్లో మాట్లాడినట్టు గుర్తించారు. జిల్లా అధికారులతో ఫోన్ కాన్ఫరెన్స్‌లో ఉన్న సమయంలో తప్ప.. మిగతా సమయమంతా శ్రుతి, నిఖిల్‌తో సాయికుమార్ ఫోన్లో మాట్లాడుతూనే ఉన్నట్టు తెలుస్తోంది. ఒక్కచోటుకు చేరి..: భిక్కనూరు పోలీస్‌స్టేషన్ నుంచి సాయికుమార్ ఒక్కడే తన కారులో బయలుదేరి 44వ నంబర్ జాతీయ రహదారి మీదుగా కామారెడ్డి వైపు వెళ్లాడు. బీబీపేట నుంచి నిఖిల్ తన బైకుపై దోమకొండ, బీటీఎస్ మీదుగా హైవేకు చేరుకున్నట్టు తెలుస్తోంది. శ్రుతి బస్సులోనే బయలుదేరిందని, ఆమె నర్సన్నపల్లి శివారు వద్ద బస్సు దిగిందని అంటున్నారు. ఓ దాబా వద్ద ముగ్గురూ ఆగారని ప్రచారం జరుగుతుండగా.. అక్కడ సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో స్పష్టత రాలేదు.నిఖిల్ తన బైకును అక్కడే వదిలేసి ఎస్సై కారులో వెళ్లినట్టు స్పష్టత వచ్చింది. అదే కారులో శ్రుతి కూడా ఎక్కిందని అంటున్నారు. ముగ్గురూ బైపాస్ ద్వారా అడ్లూర్ ఎల్లారెడ్డి చెరువు వద్దకు చేరుకొని, కొంతసేపు అక్కడ మాట్లాడుకొని ఉంటారని భావిస్తున్నారు. తరువాత ఏమైందో ఏమో ముగ్గురూ చెరువులో పడి చనిపోవడం మిస్టరీగా మారింది. ఎవరైనా ఒకరు దూకితే కాపాడేందుకు మిగతా ఇద్దరు దూకారా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రేమ వ్యవహారమే కారణమా? శ్రుతి, నిఖిల్ వాట్సాప్ మెసేజ్‌లను పోలీసులు పరిశీలించా రు. వీరి మధ్య ప్రేమ వ్యవహారం ఉన్నట్టు వాట్సాప్ మెసేజ్ లు స్పష్టం చేస్తున్నాయని పోలీసు వర్గాల ద్వారా తెలుస్తోంది. అయితే, వీరి ప్రేమ వ్యవహారంలో సాయికుమార్ ఎందుకు తలదూర్చాడన్నది ఇప్పుడు కీలకంగా మారింది. నిఖిల్, శ్రుతి పెళ్లి చేసుకోవాలనుకున్నారని.. కానీ విభేదాలు తలెత్తి పెళ్లి వాయిదా వేయడం వల్లే గొడవ ముదిరింది అన్న ప్రచారం కూడా జరుగుతోంది. -
విశాఖ డ్రగ్స్ కేసు: అనుమానాస్పదంగా సంధ్య ఆక్వా బస్సు
సాక్షి, విశాఖపట్నం: సంధ్య ఆక్వా యాజమాన్యం కాల్ డేటాపై సీబీఐ దృష్టి సారించింది. అలాగే, విశాఖ పోర్టులో కస్టమ్స్ కార్యకలాపాలపై కూడా ఫోకస్ పెట్టింది. డ్రగ్ కంటైనర్ తనిఖీలకు వచ్చిన సీబీఐకి తొలుత ఆశించిన సహకారం లభించలేదని సమాచారం. పోర్ట్ నుంచి సీఎఫ్‌ఎస్‌కు వెళ్లే కంటైనర్ల తనిఖీలకు అనుసరించే విధానంపై సీబీఐ ఆరా తీస్తోంది. కస్టమ్స్ పనితీరులో లోపాలు నిర్ధారణ జరిగితే ప్రత్యేకంగా ప్రస్తావించే అవకాశం ఉంది. ఇటీవల పెద్ద ఎత్తున నగరంలో ఈ-సిగరెట్స్ పట్టుబడ్డాయి. పకడ్బందీ సమాచారంతో టాయిస్ షాపుల్లో వున్న నిషేధిత సిగరెట్టను విశాఖ టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ-సిగరెట్లు కూడా పోర్టు నుంచే బయటకు వచ్చినట్టు అనుమానం. కస్టమ్స్ పరిధిని దాటి నిషేధిత సిగరెట్లు బయటకు రావడం, ఇప్పుడు డ్రగ్ కంటైనర్ పట్టుబడటంతో అనుమానాలు బలపడుతున్నాయి. అనుమానాస్పదంగా సంధ్య ఆక్వా టెక్స్ బస్సు కాకినాడ: మూలపేట ఎస్ఈజడ్ కాలనీలో అనుమానాస్పదంగా సంధ్య ఆక్వాటెక్స్కు చెందిన బస్సు పార్కింగ్ చేసి ఉండటంతో యు.కొత్తపల్లి పోలీసులకు స్థానికులు సమాచారం ఇచ్చారు. రెండు రోజుల క్రితం సీబీఐ సోదాల సమయంలో పరిశ్రమ నుంచి బయటకు వచ్చిన బస్సులో ఆఫీస్ ఫైల్స్, కంప్యూటర్ మదర్‌బోర్డు గుర్తించారు. బస్సు బ్రేక్ డౌన్ అయ్యిందని డ్రైవర్ చెబుతున్నాడు. -
మాల్వేర్ 'దామ్'తో జాగ్రత్త.. అలా చేస్తే..మీ ఫోన్ డేటా మొత్తం హ్యాక్
కొత్తరకమైన ఆండ్రాయిడ్ మాల్వేర్ 'దామ్'తో జాగ్రత్తగా ఉండమని కేంద్ర సైబర్ సెక్యూరిటీ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. మెుబైల్ ఫోన్లలోకి దామ్ ప్రవేశించి డేటాను హ్యాక్ చేస్తుంది. కాల్ రికార్డ్స్, హిస్టరీ, కెమెరాలోని సమాచారాన్ని స్వాధీనం చేసుకుంటుంది. లక్షిత డివైజ్‌లపై రాన్సమ్వేర్ను సృష్టించి యాంటీ వైరస్ ప్రోగ్రామ్‌లను కూడా సులభంగా ఛేదించగలదని వెల్లడించింది. డివైజ్‌లోకి ఈ మాల్వేర్ చొరబడిన తర్వాత మెుబైల్ సెక్యూరిటీని మభ్యపెడుతుంది. ఆ తర్వాత సున్నితమైన డేటాను హ్యాక్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఒకసారి తన ప్రయత్నంలో సఫలమైతే ఫోన్లోని హిస్టరీని, బుక్‌మార్క్‌ను, కాల్ లాగ్స్ వంటి కీలక సమాచారాన్ని సులభంగా రాబడుతుంది. సమాచారాన్ని రాబట్టుకున్న తర్వాత ఒరిజినల్ డేటాను డిలీట్ చేసి, హ్యాక్ చేసిన డేటాను '.enc' ఫార్మాట్లో ఎన్‌క్ట్రిప్ట్ చేసుకుని భద్రపరుచుకుంటుందని వెల్లడించాయి. దీంతో పాటు ఫైల్స్‌ను అప్లోడ్, డైన్లోడ్, అడ్వాన్స్డ్ ఎన్క్రిప్టెడ్ స్టాండర్డ్ ఆల్గారిథంతో కమాండ్ అండ్ కంట్రోల్‌ను తన ఆధీనంలోకి తెచ్చుకోగలుగుతుందని అధికార వర్గాలు తెలిపాయి. దీని భారిన పడకుండా ఉండాలంటే అనుమానాస్పద మెసేజ్‌లు, లింక్స్‌పై క్లిక్ చేయకూడదని సైబర్ సెక్యూరిటీ టీం తెలిపింది. యూఆర్ఎల్లో 'bitly','tinyur' వంటివి ఉంటే అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసింది. చదవండి:హెలిప్యాడ్‌ను అలానే ఎందుకు రూపొందిస్తారో తెలుసా? -
Tollywood Drugs Case: కాల్ డేటా రికార్డింగ్స్ ఎక్కడ? ప్రశ్నించిన ఈడీ
-
దివ్యకేసు: పురోగతి సాధించిన పోలీసులు
సాక్షి, విజయవాడ: బీటెక్ విద్యార్థిని దివ్య తేజస్విని హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. కీలక ఆధారాలు సేకరిస్తున్నారు. పక్కా ప్రణాళిక ప్రకారమే దివ్యను హత్య చేసినట్టు నిర్దారణ అయ్యింది. నిందితుడు నాగేంద్ర కాల్‌డేటాను పోలీసులు పరీశీలించారు. హత్య జరగడానికి కొద్దిసేపటి ముందు నాగేంద్ర తన స్నేహితుడికి ఫోన్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. విచారణలో నాగేంద్ర స్నేహితుడు ఆసక్తికర విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. దివ్య హత్యకేసును దిశా పోలీసులు విచారిస్తున్నారు. దివ్య కుటుంబ సభ్యులతో పాటు, చుట్టు పక్కల వారిని దిశా టీం విచారిస్తోంది. డీజీపీ ఆదేశాలతో దిశ టీం శాస్త్రీయ ఆధారాలు సేకరించే పనిలో నిమగ్నమైంది. 7 రోజుల్లో చార్జిషీటు: డీజీపీ సవాంగ్ దివ్యను కిరాతకంగా హత్య చేయడం బాధాకరమని, ఆమె కుటుంబానికి అండగా ఉంటామని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. ఈ ఘటనపై సీఎం వైఎస్ జగన్ వెంటనే స్పందించారని చెప్పారు. హోంమంత్రి సుచరిత.. దివ్య కుటుంబ సభ్యులను స్వయంగా కలిసి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. 7 రోజుల్లో ఘటనపై చార్జిషీటు దాఖలు చేస్తామని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని డీజీపీ పేర్కొన్నారు. చదవండి: దివ్య కేసులో ఊహించని ట్విస్ట్‌లు: ఆడియోలు లీక్ -
షాకింగ్ : భారీగా పెరగనున్న మొబైల్ చార్జీలు
సాక్షి, న్యూఢిల్లీ : చౌక మొబైల్ చార్జీలకు కాలం చెల్లింది. ఈనెల 3 నుంచి కాల్ చార్జీలు భారీగా పెరగనున్నాయి. మొబైల్ కాల్స్, డేటా చార్జీలను మంగళవారం నుంచి పెంచనున్నట్టు టెలికాం ఆపరేటర్ వొడాఫోన్-ఐడియా ప్రకటించింది. ప్రీపెయిడ్ విభాగంలో రెండు రోజులు, 28, 84, 368 రోజుల వాలిడిటీతో కూడిన ప్లాన్లపై చార్జీలను పెంచనున్నట్టు కంపెనీ వెల్లడించింది. గత ప్లాన్లతో పోలిస్తే తాజా ప్లాన్లు దాదాపు 42 శాతం మేరకు భారమవుతాయని భావిస్తున్నారు. ప్రీపెయిడ్ సేవలు, ప్రోడక్టులపై నూతన టారిఫ్‌లు, ప్లాన్లను ప్రకటించామని, డిసెంబర్ 3 నుంచి ఇవి అందుబాటులోకి వస్తాయని వొడాఫోన్ ఐడియా లిమిటెడ్ ఓ ప్రకటనలో పేర్కొంది. డిసెంబర్ నుంచి మొబైల్ టారిఫ్‌లను పెంచుతామని భారత టెలికాం ఆపరేటర్లు గత నెలలో ప్రకటించిన సంగతి తెలిసిందే. టెలికాం టారిఫ్‌ల సవరణపై ట్రాయ్ సంప్రదింపుల ప్రక్రియ నేపథ్యంలో వొడాఫోన్ ఐడియా టారిఫ్ పెంపను ప్రకటించింది. మరోవైపు దేశంలో డిజిటల్ మళ్లింపు, డేటా వినియోగంపై ప్రతికూల ప్రభావం చూపని రీతిలో రానున్న వారాల్లో టారిఫ్‌లను పెంచుతామని రిలయన్స్ జియో ఓ ప్రకటనలో పేర్కొంది. ఇక ఎయిర్టెల్ సైతం టారిఫ్‌ల పెంపునకు రంగం సిద్ధం చేసింది. -
కోడెల కాల్‌డేటానే కీలకం!
సాక్షి, అమరావతి: టీడీపీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద రావు ఆత్మహత్యకు సంబంధించి పోలీసులు ప్రధానంగా ఫోన్‌కాల్ డేటాపై దృష్టి సారించారు. సూసైడ్ నోట్ కూడా లభించకపోవడంతో పోలీసులు సాంకేతిక పద్ధతులను అనుసరిస్తున్నారు. కీలక ఆధారంగా మారిన ఆయన సెల్‌ఫోన్ అదృశ్యం కావడంతో కాల్‌డేటాను హైదరాబాద్‌లోని బంజారా హిల్స్ పోలీసులు విశ్లేషిస్తున్నట్టు సమాచారం. కోడెల ఆత్మహత్యకు ముందు గంట వ్యవధిలో 10–12 మందితో మాట్లాడినట్టు గుర్తించారు. చని పోవడానికి ముందు గంట వ్యవధిలో చేసిన ఫోన్‌కాల్స్‌లో కచ్చితంగా ఎవరో ఒకరికి తన ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితుల గురించి కోడెల చెప్పి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కోడెలతో ఫోన్లో మాట్లాడిన వారిని పోలీసులు వ్యక్తిగతంగా పిలిచి ఆరా తీస్తున్నట్టు తెలిసింది. మరోవైపు బంజారాహిల్స్‌లోని కోడెల నివాసం వద్ద పోలీసులు సెక్యూరిటీని అప్రమత్తం చేసి ఎవరైనా అక్కడికి వస్తే సమాచారం ఇవ్వాలని సూచించినట్లు తెలిసింది. కోడెల కుమారుడు శివరామ్‌ను కూడా పోలీసులు విచారించనున్నారు. ఇప్పటికే విచారించిన కుటుంబ సభ్యులతోపాటు మరికొందరిని కూడా మరోసారి విచారించే అవకాశం ఉంది. మేనల్లుడి ఫిర్యాదుపైనా విచారణ.. కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య చేసుకున్న రోజు ఆయన మేనల్లుడు కంచేటి సాయిబాబు గుంటూరు జిల్లా సత్తెనపల్లి పోలీసులకు చేసిన ఫిర్యాదుపై కూడా బంజారాహిల్స్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కుమారుడు శివరామ్, కుటుంబీకుల వల్లే కోడెల ఆత్మహత్య చేసుకున్నట్లు సాయిబాబు అరోపించిన సంగతి తెలిసిందే. కోడెల మృతిపై సీబీఐ విచారణకు ఆదేశించాలని గుంటూరు జిల్లాకు చెందిన బోరుగడ్డ అనిల్‌కుమార్ తెలంగాణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వాజ్యం(పిల్) దాఖలు చేసిన సంగతి తెలిసిందే. కోడెల మరణానికి ప్రతిపక్ష నేత చంద్రబాబు కారణమని అనిల్‌కుమార్ ఆరోపించారు. -
వైఎస్సార్సీపీతో సంబంధం లేనేలేదు
సాక్షి, విశాఖపట్నం: తమ కుమారుడికి వైఎస్సార్సీపీతో అసలు సంబంధాలు లేనేలేవని వైఎస్ జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నానికి పాల్పడ్డ శ్రీనివాసరావు తల్లిదండ్రులు స్పష్టం చేశారు. మాకు కూడా ఆపార్టీతో ఎటువంటి అనుబంధం లేదని తెలిపారు. విచారణ కోసం ముమ్మిడివరం మండలం ఠానేలంక నుంచి బుధవారం రాత్రి పోలీసులు శ్రీనివాసరావు తల్లిదండ్రులు సావిత్రమ్మ, తాతారావులను విశాఖకు తీసుకొచ్చారు. తొలుత గోపాలపట్నం పోలీస్ స్టేషన్లో విచారించిన సిట్ అధికారులు అర్ధరాత్రి దాటిన తర్వాత ఎయిర్‌పోర్టు పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. గురువారం రోజంతా అక్కడ వివిధ కోణాల్లో విచారించారు. విశ్వసనీయ సమాచారం మేరకు... గ్రామంలో రాజకీయంగా ఏ పార్టీ వారితో తిరిగేవాడు, చురుగ్గా పాల్గొనే వాడా? వంటి విషయాలపై వారిని సిట్ ఆరా తీయగా... వాడు ఎప్పుడూ ఊళ్లో సరిగా ఉండనేలేదు.. వైఎస్సార్సీపీలో లేనే లేడు. ఆ పార్టీ నేతలతో పరిచయం కూడా లేదని వారు చెప్పారు. తొలుత వారిని వేర్వేరుగా విచారించిన సిట్ అధికారులు ఆ తర్వాత ఇద్దర్ని ఒకే రూమ్‌లో పెట్టి శ్రీనివాసరావు ప్రవర్తన, నడవడిక, గుణగణాలు అడిగి తెలుసుకున్నారు. తరువాత శ్రీనివాసరావును వారి ఎదురుగా పెట్టి అడిగారు. నిందితుని ప్రవర్తన, ఆలోచనా విధానాలే కాకుండా, ఎవరెవరితో ఎక్కువగా ఉండేవాడని అడిగారు. ఎంతపని చేశావ్... ఏరా ఎందుకింత పనిచేశావ్.. ఏం సాధించాలని చేశావ్.. ఎవరి కోసం చేశావ్? తలదించుకునేలా చేశావ్.. ఊళ్లో తల ఎత్తుకోలేకపోతున్నాం..నీ వల్ల అందరి పరువు పోయిందిరా.. అంటూ తాతారావు, సావిత్రమ్మలు కుమారుడిని నిలదీశారు. రాజకీయంగా ఎంతో పేరున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి హత్యాయత్నం కేసులో నిందితునిగా నిలబడిన తన కొడుకును చూసి అతని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. నీకు ఈ పాడు బుద్ధి ఎందుకు పుట్టిందిరా? ఎవరుచెయ్యమన్నారు ? అసలెందుకు చేశావ్? అంటూ కొట్టినంత పనిచేశారు. మందలించినా కనిపించని పశ్చాత్తాపం మధ్యాహ్నం 2 గంటల సమయంలో కొడుకు ఉన్న గదిలోకి ఇద్దర్ని తీసుకెళ్లగానే వారు ఒక్కసారిగా ఉద్వేగానికి గురయ్యారు. గదిలో ఓ మూలన చేతికి బేడీలు వేసు కుని కూర్చొన్న కొడుకును చూసి కన్నీటి పర్యంతమయ్యారు. తమ తల్లిదండ్రులు కన్నీరు పెట్టుకుంటున్నా అతనిలో కనీస పశ్చాత్తాపం కూడా కన్పించలేదు. మౌనంగా నిల్చుని ఏం సమాధానం చెప్పలేదు. కొనసాగిన విచారణ నిందితుడు శ్రీనివాసరావుపై విచారణ ఐదో రోజు గురువారం నిందితుని కాల్ డేటా చుట్టూనే తిరిగింది. కాల్ డేటా ఆధారంగా గుంటూరు జిల్లా పిడుగురాళ్ల, ప్రకాశం జిల్లా కనిగిరి నుంచి తీసుకొచ్చిన సయ్యద్ బీ షేక్, అమ్మాజీ షేక్, నాగర్ వల్లీ, రసూల్‌ను మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం అర్ధరాత్రి వరకు విచారించి స్టేట్మెంట్లు రికార్డు చేసుకుని గురువారం తెల్లవారు జామున పంపించేశారు. ఫ్యూజన్ ఫుడ్స్ యజమాని హర్షవర్ధన్ ప్రసాద్ చౌదరితో పాటు ఆ రెస్టారెంట్లో పనిచేసిన ముగ్గురు యువతులను విచారించారు. పాదయాత్ర సందర్భంగా విశాఖ ఎయిర్ పోర్టుమీదుగా వైఎస్ జగన్ రాకపోకలు సాగించడం మొదలు పెట్టినప్పటి నుంచి సీసీ కెమెరాల పుటేజ్‌ను విశ్లేషిస్తున్నారు. మరో వైపు శ్రీనావాసరావు ఫోన్లో 321 మందితో గడిచిన నెల రోజులుగా ఎక్కువసార్లు మాట్లాడినట్టుగా నిర్ధారణకు వచ్చారు. వారిలో వందమందికి పైగా పేర్లను నిందితుడు చెప్పడంతో వారి వివరాలు ఆరా తీస్తున్నారు.ఇప్పటి వరకు 40 మందిని విచారించగా, వారిలో 25 మంది మహిళలే కావడం గమనార్హం. నిందితుడికి కేజీహెచ్ వైద్యలు పరీక్షలు నిర్వహించి పూర్తి ఆరోగ్యంతో ఉన్నాడని ప్రకటిం చారు. కస్టడీ ముగియనుండడంతో శుక్రవారం నిందితుడిని తిరిగి సెంట్రల్ జైలుకు తరలించాల్సి ఉంది. -
6 నెలల్లో 3500 ఫోన్ కాల్స్.. పొసెసివ్‌నెస్ వల్లే
సాక్షి, న్యూఢిల్లీ : సహోద్యోగి భార్యను హత్య చేసిన కేసులో నిందితుడు, ఆర్మీ మేజర్ నిఖిల్ హండాను ఆదివారం ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. నిఖిల్‌ను సోమవారం కోర్టులో ప్రవేశపెట్టిన పోలీసులు.. ఈ కేసులో కీలక సాక్ష్యాధారాలు, వివరాలు రాబట్టేందుకు అతడిని తమ కస్టడీకి ఇవ్వాల్సిందిగా కోరారు. విచారణ అనంతరం పలు కీలక విషయాలు వెల్లడించారు. పోలీసుల వివరాల ప్రకారం... సహోద్యోగి, మేజర్ అమిత్ ద్వివేది భార్య శైలజను వివాహం చేసుకోవాలని భావించిన నిఖిల్.. శైలజను కలవడానికి ముందు రోజే తన భార్యతో గొడవ పడ్డాడు. అనంతరం ఢిల్లీకి వచ్చి శైలజను తన హోండా సిటీ కారులో ఎక్కించుకుని తీసుకెళ్లాడు. తనను పెళ్లి చేసుకోవాల్సిందిగా ఆమెను కోరాడు. అందుకు శైలజ నిరాకరించడంతో పదునైన ఆయుధంతో ఆమె గొంతు కోసి హత్య చేశాడు. తర్వాత ఆమె మరణాన్ని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు మృతదేహాన్ని తన కారులో తీసుకెళ్లి రోడ్డుపై పడేశాడు. ఆ తర్వాత మీరట్‌కు వెళ్లిన అనంతరం కారును పూర్తిగా శుభ్రం చేశాడు. శైలజ, తన ఫోన్లలో ఉన్న కొన్ని అప్లికేషన్లను డెలిట్ చేశాడు. అంతేకాకుండా తన ఫోన్‌ను పూర్తిగా ధ్వంసం చేసి, ఇంటి సమీపంలో ఉన్న ఓ చెత్త డబ్బాలో పడేశాడు. తర్వాత తన స్నేహితుడికి ఫోన్ చేసి శైలజను చంపేసినట్టు చెప్పాడు. అయితే ఆమెతో తనకు అంతగా చనువు లేదని తెలిపాడు. అయితే నిఖిల్ కారును పరిశీలించిన ఫోరెన్సిక్ నిపుణులు రక్తపు మరకలు, వేలి ముద్రలు, ముందు సీటు భాగంలో ఇరుక్కున్న తల వెంట్రుకలు గుర్తించారు. అవి శైలజకు సంబంధించినవిగా తేల్చారు. నిఖిల్ ఫోన్ డేటాను పరిశీలించినన పోలీసులు గడిచిన ఆరు నెలల్లో 3500 సార్లు శైలజకు ఫోన్ చేసినట్లుగా గుర్తించారు. శైలజ, నిఖిల్ ఫోన్లలో తొలగించిన యాప్స్‌ను తిరిగి పొందేందుకు ప్రయత్నిస్తునట్లు పోలీసులు తెలిపారు. ఈ అంశాలన్నీ పరిశీలిస్తుంటే శైలజ విషయంలో పొసెసివ్నెస్తోనే నిఖిల్ ఉన్మాదిగా మారినట్టు తెలుస్తోందని పోలీసు ఉన్నతాధికారి పేర్కొన్నారు. అయితే శైలజను హత్య చేసేందుకు ఉపయోగించిన ఆయుధం మాత్రం ఇంకా లభించలేదని ఆయన తెలిపారు. -
సర్పంచ్ హత్యతో మూడపల్లిలో పోలీసుల విచారణ
సాక్షి, చందుర్తి/వేములవాడ : మండలంలోని మూడపల్లి సర్పంచ్ గోలి శంకర్‌ను గుర్తు తెలియని వ్యక్తులు ఆదివారం రాత్రి హతమార్చడంతో పోలీసులు మూడపల్లి గ్రామంలో అనుమానితులను సోమవారం విచారించినట్లు సమాచారం. ఏడేళ్ల క్రితం ఇదే గ్రామానికి చెందిన వివాహిత మహిళ కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకోగా, ఆమె ఆత్మహత్యకు శంకర్ బాధ్యుడని సదరు మహిళా మృతదేహంతో గ్రామస్తులు ధర్నాను చేపట్టారు. శంకర్ కుటుంబంతో మరో రెండుమూడు కుటుంబాలకు విరోధం ఉండడంతో పోలీసులు ఆ దిశగా విచారణ చేపట్టారు. అంతేకాకుండా వేములవాడ పట్టణ శివారు ప్రాంతంలో హంతకులు వెంటాడి హతమార్చడాన్ని పోలీసులు జీర్ణించుకోవడం లేదు. ఫ్యాక్షన్ కక్షలను తలపించే రీతిలో జరిగిన హత్యోందతాన్ని సవాల్‌గా స్వీకరిస్తున్నారు. హత్య సంఘటన స్థలాన్ని ఎస్పీ రాహూల్ హెగ్డే సందర్శించి ఘటనపై ఆరా తీయడంతో జిల్లాలోనే ఈ ఘటన సంచలనంగా మారింది. చందుర్తి పోలీసులు మాత్రం మూడపల్లిలోని శంకర్‌తో విరోధం, పాత కక్షలు ఉన్న వారందరిపై నిఘా తీవత్రరం చేశారు. అంతేకాకుండా శంకర్ ఓ వివాహితతో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో సదరు మహిళ సోదరుడికి, శంకర్‌కు నెల క్రితం గొడవలు తలెత్తాయని అతడి సన్నిహితులు గ్రామంలో చర్చించుకుంటున్నారు. ఈ గొడవలే హత్యకు దా రి తీసి ఉండవచ్చునని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. హంతకులు ఎవరన్నది హత్య జరిగి 24గంటలు గడిచినా పోలీసులకు అంతు చిక్కడం లేదు. మృతుడి కాల్ డేటా సేకరణ? వేములవాడ పట్టణ శివారులో హత్యకు గురైనా మూడపల్లి సర్పంచ్ గోలి శంకర్ సెల్ ఫోన్ కాల్ డేటాతో పాటు పోలీసులు అనుమానితుడిగా భావిస్తున్న కొండన్నపల్లి వివాహిత సోదరుడి కాల్‌డేటాపై దృష్టిసారించుతున్నారు. వివాహత సోదరుడు కేరళలో ఉన్నాడన్న సమాచారం మేరకు పోలీసులు సోమవారం ఉదయం అతడి లొకేషన్‌ను పోలీసులు స్వీకరించినట్లు తెలిసింది. అనుమానితుడు కేరళలో ఉన్నా కిరాయి హంతకులను ఏర్పాటు చేసి హతమార్చాడా ? వివరాలు సేకరించి పనిలో నిమగ్నమైనట్లు ప్రచారం జరగుతోంది. ఏది ఏమైన హత్యను సవాల్‌గా స్వీకరించి నిందితులను సాధ్యమైనంత తొందరలో పట్టుకునేందుకు పోలీసు బలగాలు రంగంలోకి దిగాయి. -
దేశంలో పెరుగుతున్న డిటెక్టివ్‌ల బిజినెస్
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో ఎవరి ఫోన్ డేటాను సేకరించవద్దని, అసలు ఫోన్ డేటానే కోరవద్దని, అలా చేసినట్లయితే సంఘంలో సభ్యత్వం రద్దవుతుందని ‘అసోసియేషన్ ఆఫ్ ప్రైవేట్ డిటెక్టివ్స్ అండ్ ఇన్వెస్టిగేటర్స్–ఇండియా’ ఇటీవల దేశవ్యాప్తంగా ఉన్న తమ సభ్యులను హెచ్చరించింది. కాల్‌డేటా రికార్డులను అక్రమంగా సేకరించి వాటిని విక్రయిస్తున్నారనే ఆరోపణలపై ముంబైలో ఇటీవల ప్రైవేట్ డిటెక్టివ్‌లను వరుసగా పోలీసులు అరెస్ట్ చేస్తున్న నేపథ్యంలో అసోసియేషన్ ఈ హెచ్చరిక జారీ చేసింది. దేశంలో తొలి మహిళా ప్రైవేటు డిటెక్టివ్ రజనీ పండిత్‌ను, కంగనా రనౌత్, నవాజుద్దీన్ సిద్ధికీ లాంటి బాలీవుడ్ తారలను క్లైంటులుగా కలిగిన లాయర్ రిజ్వాన్ సిద్ధికీని ఇవే ఆరోపణలపై పోలీసులు ఇటీవల అరెస్ట్ చేసిన విషయం తెల్సిందే. భారత దేశంలో ప్రైవేటు డిటెక్టివ్ వ్యవస్థ రోజు రోజుకు పుంజుకుంటోంది. ఏడాదికి 30 శాతం చొప్పున పెరుగుతోంది. 2020 నాటికి ఈ వ్యవస్థ 1700 కోట్ల రూపాయలకు చేరుకుంటుందన్నది ఓ అంచనా. దేశంలో పోలీసు వ్యవస్థతోపాటు పలు దర్యాప్తు సంస్థలు ఉన్నప్పటికీ ప్రైవేటు డిటెక్టివ్‌ల అవసరం ఎందుకు పెరుగుతోంది? ఈ డిటెక్టివ్లు టార్గెట్ వ్యక్తులను అనుసరించి వారు ఎక్కడెక్కడికి వెళుతున్నారో ఎప్పటికప్పుడు తెలుసుకోవడం, వారి ఫోన్ కాల్స్ సమాచారాన్ని సేకరించడం నేరమా? వ్యక్తుల ఫోన్ కాల్స్ సమాచారాన్ని వారి అనుమతి లేకుండా సేకరించడం మాత్రం చట్ట ప్రకారం నేరమే. క్రిమినల్ కేసుల్లో, అది డీఎస్పీ స్థాయి పోలీసు అధికారి ఆదేశంతో పోలీసులు ఫోన్ కాల్స్ డేటాను సేకరించవచ్చు. ప్రైవేటు డిటెక్టివ్లకు ఆ అనుమతిలేదు. అయినా వారు తమ పలుకుబడిని ఉపయోగించి లేదా టెలికమ్ కంపెనీల ఉద్యోగులను ప్రలోభపెట్టి కాల్ డేటాను సేకరిస్తుంటారు. ఎవరు, ఎవరితో మాట్లాడారు? ఎక్కడి నుంచి మాట్లాడారు? ఎంత సేపు మాట్లాడారు? ఎక్కడి నుంచి మాట్లాడారు? అన్న సమాచారం టెలికమ్ సంస్థల వద్ద రికార్డయి ఉంటుంది. సాధారణంగా పోలీసులు టేకప్ చేయని కేసులను ఈ ప్రైవేట్ డిటెక్టివ్లు టేకప్ చేస్తారు. భార్య లేదా భర్త ఎవరెవరితో తిరుగుతున్నారో, ఎక్కడెక్కడ తిరుగుతున్నారో, ఎవరెవరితో మాట్లాడుతున్నారో, ఏం మాట్లాడుతున్నారో, వారి మధ్య అక్రమ సంబంధం ఉందా, లేదా? అన్న విషయాలను తెలుసుకోవడానికి ఎక్కువ మంది ప్రైవేటు డిటెక్టివ్‌లను ఆశ్రయిస్తారు. పెళ్లి చేసుకోబోయే యువకుడు లేదా యువతి నడతను తెలుసుకునేందుకు కూడా వీరు ఉపయోగపడుతున్నారు. కాలేజీ కెళుతున్న తమ పిల్లలు ఏ సమయానికి, ఏం చేస్తున్నారో, వారి స్నేహితులు ఎలాంటి వారు? వారికి చెడు అలవాట్లు ఏమైనా అబ్బాయా? అన్న అంశాలను తెలుసుకోవడానికి ఈ మధ్య తల్లిదండ్రులు తమ సేవలను ఎక్కువగా ఉపయోగించుకుంటున్నారని ముంబైలోని మరాఠా డిటెక్టివ్ ఏజెన్సీ అధిపతి జిగ్నేష్ ఛెడ తెలిపారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో భాగస్వాములు ఏమైనా మోసం చేస్తున్నారా? ఎవరు ఎవరితో కుమ్మక్కు అవుతున్నారు? అన్న విషయాలతోపాటు వివిధ రకాల ప్రాజెక్టుల్లో ఎవరి ఎంత బిడ్డింగ్ వేస్తున్నారో కూపీ లాగడం కోసం కూడా డిటెక్టివ్‌ల సేవలను ఉపయోగించుకుంటున్నారని ఆయన తెలిపారు. వ్యక్తులను ఫాలో అవడం, వారి ఫొటోలను తీయడం, వారి కాల్ డేటాను సేకరించడం చట్ట విరుద్ధం కాదా ? అని ప్రశ్నించగా, పోలీసులు టేకప్ చేయని కేసులే తమ వద్దకు వస్తాయని, ఆ కేసులను పరిష్కరించడంలో తాము ఈ పద్ధతులను అనుసరించక తప్పదని పేరు బహిర్గతం చేయడానికి ఇష్టపడని ఢిల్లీ డిటెక్టివ్ ఒకరు చెప్పారు. క్లైంట్ భార్య లేదా భర్తకు అక్రమ సంబంధం ఉందని రుజువు చేయాలంటే ఫొటోలు, వారి కాల్‌డేటా అవసరం అవుతుందని ఆయన అన్నారు. కొందరు కాబోయే భార్య లేదా భర్త మెడికల్ హిస్టరీని తెలుసుకునేందుకు కూడా వీరి సేవలను వాడుకుంటున్నారు. దేశంలో ప్రైవేటు డిటెక్టివ్‌ల ఏజెన్సీలను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం 2007లో ముసాయిదా బిల్లును తీసుకొచ్చింది. అయితే దాన్ని ఇంతవరకు ఆమోదించకుండా పక్కన పడేసింది. పాశ్చాత్య దేశాల్లో ఉన్నట్టుగా భారత్‌లో బలమైన ‘ప్రైవసీ’ చట్టాలు లేవుగానీ, ఉంటే డిటెక్టివ్‌ల ఏజెన్సీల మనుగడ ఉండేది కాదు. తమ ప్రొఫెషన్‌ను క్రమబద్ధీకరించేందుకు ఓ చట్టం ఉండాలని హైదరాబాద్‌లోని ‘థర్డ్ ఐ ఇన్వెస్టిగేషన్’ సీఈవో పీ. దామోదర్ అభిప్రాయపడ్డారు. -
వాట్సాప్‌లో సమాచారం భద్రం కాదా?
వాషింగ్టన్: మెసేజింగ్ యాప్ వాట్సాప్ మనం అనుకున్నంత భద్రమైనదేమీ కాదని నిపుణులు వ్యాఖ్యానించారు. వాట్సాప్ ద్వారా ఒక వ్యక్తి మరో వ్యక్తికి పంపే సందేశాలు ఎన్‌క్రిప్ట్ అయ్యి గోప్యంగా ఉండటం నిజమేకావచ్చని, అయితే వాట్సాప్ కాల్ డేటా సహా ఇతర సమాచారం దుర్వినియోగం అవుతుండొచ్చని అమెరికాకు చెందిన నిపుణుడు వివేక్ వాధ్వా అంటున్నారు. వాట్సాప్‌ను ఫేస్బుక్ 2014లో కొనేసింది. వినియోగదారులు వాడుతున్న ఫోన్ వివరాలు, గుర్తింపు తదితరాలను ఫేస్‌బుక్‌కు అందజేస్తున్నట్లు వాట్సాప్ ప్రకటించిన విషయాన్ని వివేక్ గుర్తుచేస్తున్నారు. వాట్సాప్ గ్రూప్ చాట్లలో భద్రత లేదని, ఏదేనీ గ్రూప్‌లోని వ్యక్తికి ఆ గ్రూప్‌లో ఉన్న సభ్యులందరి ఫోన్ నంబర్లు తెలిసిపోతుండటంపై వివేక్ ఆందోళన వ్యక్తం చేశారు. ఫేస్బుక్ వినియోగదారుల సమాచారం దుర్వినియోగమవ్వడం, గూగుల్ వంటి సంస్థలు యూజర్ల సమాచారాన్ని సేకరించి, నిర్వహిస్తుండటం తదితరాల నేపథ్యంలో కొత్త నిబంధనలు రావాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడ్డారు. -
టాలీవుడ్ నటి ఆరోపణలు.. చిక్కుల్లో సిద్ధిఖీ
సాక్షి, ముంబై : కాల్ డేటా రికార్డ్ స్కామ్(సీడీఆర్)లో నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. తన భార్యపై ప్రైవేట్ డిటెక్టివ్‌తో నిఘా వేయించి, ఆమె కాల్ డేటా సేకరించాడనే ఆరోపణలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో ఆయనకు సహకరించిన లాయర్ రిజ్వాన్ సిద్ధిఖీని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ కూడా చేశారు. అయితే ఈ కేసులో రిజ్వాన్‌పై టాలీవుడ్ నటి ఒకరు సంచలన ఆరోపణలు దిగారు. రిజ్వాన్ తన కాల్ డేటాను కూడా దొంగిలించాడని నటి ఆకృతి నాగ్‌పాల్ ఆరోపిస్తున్నారు. తెలుగులో చిన్న చిన్న పాత్రలు, బాలీవుడ్లో చిత్రాలతోపాటు మోడల్‌గానూ ఆమె గుర్తింపు పొందారు. సోమవారం థానే పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన ఆమె రిజ్వాన్‌కు వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇచ్చారు. అంతేకాదు తన వైవాహిక జీవితం నాశనం కావటానికి రిజ్వాన్ కూడా ఓ కారణమని ఆమె అంటున్నారు. అనిల్ మిస్త్రీ అనే వ్యక్తిని వివాహం చేసుకున్న ఆకృతి.. కాపురంలో కలతలు రేగటంతో 2014లో విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే అనిల్‌కు స్నేహితుడు అయిన రిజ్వాన్ తన కాల్ డేటాను దొంగిలించి తన భర్తకు అందజేసి ఉంటాడని ఆమె అనుమానిస్తున్నారు. ‘నా వైవాహిక జీవితం నాశనం కావటానికి రిజ్వాన్ కారణం. అతను అనిల్‌కు చిన్ననాటి స్నేహితుడు. పైగా విడాకుల సమయంలో ప్రొత్సహించి మరీ మరో యువతితో అనిల్‌కు మరో సంబంధం కుదిర్చాడు. సీడీఆర్ వ్యవహారం వెలుగులోకి రావటంతో నా అనుమానాలు నిజమనే భావిస్తున్నా. రిజ్వాన్‌కు అండగా ఉంటున్నవారిని కూడా విడిచిపెట్టకండి’ అని ఆకృతి చెబుతున్నారు. రిజ్వాన్ ఓ ప్రముఖ బాలీవుడ్ నటి డేటాను ఆమె భర్తకు అప్పగించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఇప్పుడు ఆకృతి ఆరోపణలతో కాల్ రికార్డింగ్ డేటా స్కామ్ పెద్ద వ్యవహారమే అయి ఉంటుందని థానే క్రైమ్ బ్రాంచ్ పోలీసులు చెబుతున్నారు. రిజ్వాన్ పాత్ర గనుక నిజమని తేలితే నవాజుద్దీన్‌కు కూడా కష్టాలు తప్పకపోవచ్చు. ఇప్పటికే ఈ స్కామ్‌లో పలువురి వీఐపీల హస్తం ఇందులో ఉందని చెబుతున్న పోలీసులు.. వారి పేర్లు వెల్లడించేందుకు సుముఖత వ్యక్తం చేయటం లేదు. -
కాల్ డేటా స్కాంలో నటుడి లాయర్ అరెస్ట్
ముంబై : కాల్ డేటా రికార్డు స్కామ్ కేసులో ప్రముఖ బాలీవుడ్ నటుడు నవాజ్ద్దీన్ సిద్ధిఖీ న్యాయవాది రిజ్వాన్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. రిజ్వాన్ ఇంతకు ముందు ప్రముఖ సెలబ్రిటీలకు న్యాయవాదిగా వ్యవహరించడంతో ఈ కేసుకు మరింత ప్రధాన్యత సంతరించుకుంది. కాగా కాల్ డేటా రికార్డు స్కాం కేసు నగరంలో కలకలం రేపుతోంది. నలుగురు ప్రవేటు డిటెక్టివ్స్ అరెస్ట్‌తో వెలుగులోకి వచ్చిన ఈ వ్యవహారంలో ఇప్పటివరకు 11మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాజాగా ఈ కేసుతో సంబంధం ఉన్న రిజ్వాన్ ను థానే పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు మాట్లాడుతూ.. చట్ట విరుద్దంగా ఇతరుల కాల్ డేటాను రికార్డ్ చేస్తోన్న నలుగురు ప్రవేటు డిటెక్టివ్స్‌ను జనవరి 24న అరెస్ట్ చేశాం. లాయర్ రిజ్వాన్ వారి నుంచి నవాజుద్దీన్ తన భార్య కాల్ డేటాను పొందినట్లు అరెస్ట్ అయిన ప్రశాంత్ పాలేకర్ విచారణలో అంగీకరించాడు. కాల్ డేటా కోసం 50వేల రూపాయలు వారికి చెల్లించినట్టు తెలిసింది. ఇదే అంశంపై రిజ్వాన్‌తోపాటు నవాజుద్దీన్ దంపతులకు నోటిసులు పంపాం. శుక్రవారం విచారణకు హాజరైన రిజ్వాన్ కాల్ డేటా పొందినట్టు రుజువు కావడంతో అతన్ని అదుపులోకి తీసుకున్నాం. నవాజుద్దీన్ దంపతులు దీనిపై విచారణకు హాజరు కావాల్సి ఉందని తెలిపారు. -
స్కామ్‌లో ఇరుకున్న నటుడు
సాక్షి, ముంబై : కాల్ డేటా రికార్డ్ స్కామ్‌లో బాలీవుడ్ నటుడికి పోలీసులు సమన్లు జారీ చేశారు. విలక్షణ నటుడిగా గుర్తింపుపొందిన నవాజుద్దీన్ సిద్ధిఖీ, తన భార్య అంజలిపై అనుమానంతో ఓ డిటెక్టివ్‌ను నియమించాడని.. ఆమె కాల్ డేటాను సేకరించాడని ఆరోపణలు ఉన్నాయి. వ్యక్తిగత కాల్స్‌ను ట్రాప్ చేస్తున్నారంటూ కొందరు ఫిర్యాదులు రావటంతో థానే క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ వ్యవహారం చిన్నది కాదని తేల్చిన పోలీసులు.. కాల్ డేటా రికార్డ్ స్కామ్ పేరిట దీని దర్యాప్తు చేపట్టారు. మొత్తం 11 మందిని అరెస్ట్ చేయగా.. అందులో ప్రైవేట్ డిటెక్టివ్లు కూడా ఉన్నారు. నవాజ్ తన భార్యపై అనుమానంతో నిఘా వేయించాడని, కాల్ డేటా సేకరించాడని ఓ డిటెక్టివ్ వెల్లడించాడు. అందుకు గానూ నవాజ్ తనకు రూ. 50 వేల దాకా చెల్లించాడని అతను చెప్పాడు. దీంతో విచారణకు సహకరించాల్సిందిగా నవాజుద్దీన్ పోలీసులు కోరారు. అయినా ఎటువంటి స్పందన లేకపోవటంతో థానే పోలీసులు సమన్లు జారీ చేశారు. ఇక ఈ వ్యవహారంపై నవాజుద్దీన్ ట్విట్టర్లో స్పందించాడు. తన కూతురు స్కూల్ ప్రాజెక్టు కోసం హాజరయ్యానని చెబుతూ.. అసత్య ఆరోపణలపై మీడియా తనను ప్రశ్నించటం దిగ్భ్రాంతి కలగజేస్తోందని అంటున్నాడు. Last evening, I was helping my daughter to prepare her school project Hydroelectric Power Generator & went to her school this morning for Project Exhibition. To my surprise the media had questions about some random allegations on me #Disgust pic.twitter.com/APPaEK373q — Nawazuddin Siddiqui (@Nawazuddin_S) 10 March 2018 -
హత్య కేసులో నిందితుడి అరెస్ట్
కడప అర్బన్ : రెండేళ్ల క్రితం నమోదైన హత్య కేసు మిస్టరీని పోలీసులు ఎట్టకేలకు ఛేదించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కడప రిమ్స్ పోలీస్ స్టేషన్లో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో సీఐ మోహన్‌ప్రసాద్, ఎస్ఐ రామాంజనేయులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కనుమలోపల్లె రైల్వే ట్రాక్ సమీపంలో 2014 అక్టోబరు 13న ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడని రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. మరసటిరోజు అతను అట్లూరు మండలం రెడ్డిపల్లెకు చెందిన వెంకటరమణ (35)గా గుర్తించారు. అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడని కేసు నమోదు చేశారు. అతని స్నేహితుడు విష్ణువర్దన్ హత్య చేసి ఉంటాడని మృతుని తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేశారు. ఈ దిశగా రిమ్స్ పోలీసులు దర్యాప్తు చేశారు. కాల్ డేటా ఆధారంగా విచారణ చేపట్టడంతో మొత్తం విషయం వెలుగు చూసింది. బద్వేలు ప్రాంతానికి చెందిన ఈశ్వరమ్మ తన భర్త నిరాదరణకు గురి చేశాడని కుమార్తె గాయత్రితో కలిసి వేరుగా నివసిస్తోంది. ఆమెతో అట్లూరు మండలం రెడ్డిపల్లెకు చెందిన సి.విష్ణువర్దన్ పరిచయమై సహజీవనాన్ని కొనసాగించాడు. ఈ క్రమంలో వెంకటరమణకు విష్ణువర్దన్ సమక్షంలోనే ఈశ్వరమ్మ పరిచయమైంది. వీరి మధ్య పరిచయం సహజీవనానికి దారి తీసింది. 2014 అక్టోబరు 13న రాత్రి విష్ణువర్దన్, అతని స్నేహితుడు నరసయ్య.. వెంకటరమణను రైల్వే ట్రాక్ వద్దకు తీసుకెళ్లారు. అక్కడ వారు మద్యం తాగారు. అంతకుముందే పథకం ప్రకారం ముళ్ల పొదల్లో దాచి ఉంచిన రాడ్డుతో వెంకటరమణ తలపై చితకబాది దారుణంగా హత్య చేశారు. రైలు పట్టాలపై పడేయాలని ప్రయత్నించారు. అంతలోపే రైలు రావడంతో మృతదేహాన్ని అక్కడే పడేసి పరారయ్యారు. విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. -
కాల్‌డేటాపై హైకోర్టును ఆశ్రయించిన ప్రభుత్వం
విజయవాడ కోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ పిటిషన్లు తదుపరి విచారణను నిలుపుదల చేయాలని అభ్యర్థన హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కాల్‌డేటా ఇవ్వాలని సెల్యులార్ ఆపరేటర్లను ఆదేశిస్తూ విజయవాడ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ (సీఎంఎం) జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉమ్మడి హైకోర్టును ఆశ్రయించింది. ట్యాపింగ్ వ్యవహారంపై విజయవాడ కోర్టులో జరుగుతున్న విచారణకు సంబంధించిన తదుపరి చర్యలన్నింటినీ నిలిపివేయాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌మిశ్రా మంగళవారం హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఇందులో కేంద్ర హోంశాఖ కార్యదర్శి, టెలికం మంత్రిత్వ శాఖ కార్యదర్శి, ఏపీ సిట్, బీఎస్ఎన్ఎల్, ఎయిర్టెల్, ఐడియా, రిలయన్స్ తదితరులను ప్రతివాదులుగా పేర్కొన్నారు. 25 ఫోన్ నంబర్ల కాల్ డేటాను, అందుకు సంబంధించిన లేఖలను ఇవ్వాలంటూ విజయవాడ కోర్టు జారీ చేసిన ఆదేశాలు ఇండియన్ టెలిగ్రాఫ్ చట్టం-1885లోని సెక్షన్ 5(2)కు విరుద్ధమని అజయ్‌మిశ్రా తన పిటిషన్లలో పేర్కొన్నారు. విజ యవాడ కోర్టు తన పరిధిని దాటి ఈ ఆదేశాలు జారీ చేసిందన్నారు. ప్రజాప్రయోజనాల దృష్ట్యా ఇండియన్ టెలిగ్రాఫ్ చట్టం కింద సెల్యులార్ ఆపరేటర్ల నుంచి కావాల్సిన సమాచారాన్ని కోరే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని తెలిపారు. దర్యాప్తు సంస్థలు కాటా డేటా వివరాలను కోరినప్పుడు వాటిని అందజేయాలని, అదే సమయంలో ఆ డేటాను సెల్యులార్ ఆపరేటర్లు తమ వద్ద ఉంచుకోరాదని, ఇదే విషయాన్ని కేంద్ర టెలి కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ ఈ నెల 13న సెల్యులార్ ఆపరేటర్లకు స్పష్టం చేసిందన్నారు. ఈ విషయాన్ని వారు విజయవాడ కోర్టుకు చెప్పినా ప్రయోజనం లేకపోయిందని, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల నిమిత్తం తమ రాష్ట్ర ఇంటెలిజెన్స్ ఐజీ, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో(ఎస్ఐబీ) ఐజీపీ తదితరులు కోరిన వివరాలను ఇవ్వాలని సెల్యులార్ ఆపరేటర్లను ఆదేశించిందన్నారు. ఇదిలా ఉంటే విజయవాడ కోర్టు ఆదేశాలపై సెల్యులార్ ఆపరేటర్లు ఇటీవల సుప్రీంకోర్టును ఆశ్రయించారని, ప్రాథమిక దశలోనే వారు తమ పిటిషన్లను ఉపసంహరించుకున్నారని తెలిపారు. ఈ సమయంలో ఈ వ్యవహారంలో తమ హక్కులకు భంగం వాటిల్లుతోందని భావించిన వారు హైకోర్టును ఆశ్రయించవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందన్నారు. టెలిగ్రాఫ్ చట్టం కింద కోరిన వివరాలను ఇవ్వాలన్న విజయవాడ కోర్టు ఆదేశాలు చట్ట విరుద్ధమని అన్నారు. కాబట్టి ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని అజయ్‌మిశ్రా హైకోర్టును కోరారు. -
సుప్రీంకోర్టులో టెలికాం కంపెనీలకు ఊరట
-
'సుప్రీం'కు కాల్ డేటా వ్యవహారం
న్యూఢిల్లీ : ఓటుకు కోట్లు కేసుకు సంబంధించిన కాల్ డేటా వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. కాల్ డేటా వివరాలు అందజేయాలన్న విజయవాడ మెట్రోపాలిటిన్ మేజిస్ట్రేట్ ఆదేశాలను సర్వీసు ప్రొవైడర్స్ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈ కేసు గురువారం విచారణకు వచ్చే అవకాశముంది. ఓటుకు కోట్లు కేసులో కాల్ డేటా వివరాలు కీలకం కావడంతో ఈ వ్యవహారం సంచలనం సృష్టిస్తోంది. కాల్ డేటా వివరాలు కోరుతూ సర్వీసు ప్రొవైడర్లకు ఆంధ్రప్రదేశ్ పోలీసులు నోటీసులిచ్చి మరీ విచారణకు పిలిపించారు. కాల్ డేటా వివరాలు ఇవ్వాలని సర్వీసు ప్రొవైడర్లపై ఒత్తిడి తెచ్చిన విషయం తెలిసిందే. -
సుప్రీంకోర్టుకు చేరిన కాల్‌డేటా వ్యవహారం
-
కాల్ డేటా దాఖలుకు గడువివ్వండి
-
కాల్ డేటా దాఖలుకు గడువివ్వండి
న్యాయస్థానానికి సర్వీస్ ప్రొవైడర్ల వినతి విజయవాడ లీగల్: ఓటుకు కోట్లు కేసులో మత్తయ్య తదితరుల కాల్ డేటాను కోర్టులో దాఖలుచేసేందుకు గడువివ్వాల్సిందిగా సర్వీస్ ప్రొవైడర్లు న్యాయస్థానాన్ని కోరారు. మే 1 నుంచి జూన్ 20 వరకు మత్తయ్య, ఆయన బంధువుల మొబైల్ ఫోన్‌కాల్ డేటా ఇవ్వాలని ఏపీ సీఐడీ పోలీసులు సర్వీస్ ప్రొవైడర్లను కోరుతూ కోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. కాల్ డేటాను గోప్యంగా ఉంచాలని కేంద్ర ప్రభుత్వం తమకు లేఖ పంపిందని, దాన్ని దాఖలు చేసేందుకు తమకు వ్యవధి కావాలని న్యాయమూర్తిని సర్వీస్ ప్రొవైడర్ల తరఫు న్యాయవాదులు కోరారు. దీంతో కేసు విచారించిన మూడో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ (సీఐడీ) కె.జయకుమార్ ఈ కేసును ఆగస్టు మూడో తేదీకి వాయిదా వేస్తూ కాల్‌డేటా పాడవకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. -
'మత్తయ్య కాల్‌డేటా ఇప్పించండి....'
-
ప్రేమ వ్యవహారమే ప్రాణం తీసిందా..?
-
ప్రేమ వ్యవహారమే ప్రాణం తీసిందా..?
పెందుర్తి: పాలిటెక్నిక్ విద్యార్థి కిల్లి వినయ్ హత్య కేసులో పోలీసులు పురోగతి సాదించినట్లు తెలుస్తోంది. ప్రేమ వ్యవహారమే హత్యకు దారితీసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కోణంలో స్థానిక పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. జీవీఎంసీ 71వ వార్డు పులగాలిపాలెంలో నివాసం ఉంటున్న వినయ్ బుధవారం హత్యకు గురికావడం తెలిసిందే. మృతుడు వినయ్ ఒకటి కంటే ఎక్కువ సిమ్‌కార్డులు వాడుతున్నట్లు తెలిసింది. వీటి కాల్‌డేటా సమాచారం అధారంగా దర్యాప్తు చేస్తున్నారు. ‘నువ్వంటే నాకిష్టం’ అని పెందుర్తి పరిసర ప్రాంతాల యువతి నుంచి వినయ్‌కు మొబైల్‌కు వచ్చిన మెసేజ్ ఆధారంగా పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. స్నేహితుల వాగ్మూలాన్ని బట్టి ప్రేమ వ్యవహారమే హత్యకు కారణం కావచ్చని పోలీసు వర్గాలు భావిస్తున్నాయి. ఇందుకు సంబంధించిన కీలక సమాచారం వారు సేకరించినట్టు తెలుస్తోంది. పథకం ప్రకారమే..: వినయ్‌ను హతమార్చేందుకు దుండగులు ముందస్తు పథకం వేసుకున్నట్లు నిర్ధారణ అయింది. వినయ్‌ను అంతమొందించేందుకు అతడి పశువుల శాలనే ఎంచుకున్నారు. పలుపుతాడు, పాలిథిన్ కవర్ ముందుగానే సిద్ధం చేసుకున్న హంతకులు వినయ్‌కు ఫోన్ చేసి పశువులశాల వద్దకు రప్పించారు. హత్యకు ముందు వారు పశువుల శాలకు సమీపంలోనే మందు పార్టీ చేసుకున్నారు. అనంతరం వినయ్ కాళ్లు చేతులు కట్టేసి పాలిథిన్ కవర్ సాయంతో హతమార్చినట్టు పోలీసులు భావిస్తున్నారు. కాల్‌డేటా ఆధారంగా దర్యాప్తు కాల్‌డేటా ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశామని సీఐ కొండపల్లి లక్ష్మణమూర్తి తెలిపారు. వినయ్ చదువుతున్న కళాశాలలో వివరాలు సేకరించినట్టు ఆయన వివరించారు. -
సీఐను పట్టించిన కాల్ డేటా
సీఐ జీవీ రమణ పాత్రపై పక్కా ఆధారాలు ప్రత్యేక ఆపరేషన్‌తో వెలుగుచూసిన వాస్తవాలు సాక్షి, విశాఖపట్నం : త్రీ టౌన్ పోలీస్‌స్టేషన్ లంచావతారాల్లో సీఐ జి.వి.రమణ పాత్రపై పక్కా ఆధారాలు ఉన్నతాధికారులకు లభ్యమయ్యాయి. ప్రత్యేక ఆపరేషన్‌లో అతడి ఫోన్ సంభాషణలే పట్టిచ్చాయి. దీంతో అతడితోపాటు ఎస్ఐ, కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేశారు. ఈ మొత్తం ఎపిసోడ్లో ఉన్నతాధికారులు చేసిన జాయింట్ ఆపరేషన్‌లో వెలుగుచూసిన అంశాలు. ఆర్కే ఫ్యామిలీ స్టోర్స్ యజమానులు దినేష్మోడీ, రాజ్కుమార్మోడీలు పాండ్య అనే స్థిరాస్తి వ్యాపారికి మూడేళ్ల క్రితం ఫ్లాట్ కొనుగోలుకు రూ.15 లక్షలు ఇచ్చారు. తర్వాత అతను అదృశ్యమయ్యాడు. ఇటీవల నగరానికి వచ్చాడని తెలిసి తమ దుకాణంలో పనిచేసే వారితో కలిసి వెళ్లి దినేష్, రాజ్‌కుమార్ అతడిని గట్టిగా నిలదీశారు. దీంతో పాండ్య మూడో పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ కేసు సీఐ జీవీ రమణ వద్దకే వెళ్లింది. ఆయన ఎస్ఐ రామారావుకు దర్యాప్తు బాధ్యతలను అప్పగించారు. ఇంత వరకూ సజావుగానే జరిగింది. అనంతరం పాండ్యపై దాడి చేసినందుకు గానూ రౌడీషీట్ తెరుస్తామంటూ దినేష్మోడీని బెదిరించడం ప్రారంభించారు. అతను అరెస్ట్ కాకుండా ఉండేందుకు ముందస్తు బెయిల్ పొందినా వీరి బెదిరింపులు ఆగలేదు. పైగా రూ. 1.5 లక్షలు డిమాండ్ చేశారు. దీంతో దినేష్ ఏసీబీని ఆశ్రయించి ఎస్ఐ, కానిస్టేబుల్‌ను పట్టించారు. తనను వేధించిన వారిలో సీఐ కూడా ఉన్నట్లు దినేష్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో తెరవెనుక సూత్రధారులపై ఉన్నతాధికారులు దృష్టి సారించారు. ఏసీబీ డీఎస్పీ నరసింహారావుతో ఇన్చార్జి సీపీ అతుల్‌సింగ్ మాట్లాడారు. ఇద్దరు అధికారులు సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టి సీఐ పాత్రపై ఆధారాలు సేకరించారు. సీఐ రమణ మాట్లాడిన ఫోన్‌కాల్స్ రికార్డ్, బాధితులతో మాట్లాడినప్పుడు చేసిన వాయిస్ రికార్డులు ఉన్నట్లు సమాచారం. దీనిపై ఏసీబీ డీఎస్పీని వివరణ కోరగా కాల్ రికార్డ్స్ లభించిన మాట వాస్తమేన్నారు. మరోవైపు మిగతా కేసుల్లోనూ సీఐలు, ఇతర అధికారుల పాత్రపైనా ఉన్నతాధికారులు, ఏసీబీ దృష్టి సారిస్తోంది. వారి కాల్ డేటా రికార్డ్స్‌ను రహస్యంగా క్రోడీకరిస్తున్నట్లుగా తెలుస్తోంది.