కొత్తరకమైన ఆండ్రాయిడ్ మాల్‌వేర్ 'దామ్'తో జాగ్రత్తగా ఉండమని కేంద్ర సైబర్ సెక్యూరిటీ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. మెుబైల్ ఫోన్‍లలోకి దామ్ ప్రవేశించి డేటాను హ్యాక్ చేస్తుంది. కాల్ రికార్డ్స్, హిస్టరీ, కెమెరాలోని సమాచారాన్ని స్వాధీనం చేసుకుంటుంది. లక్షిత డివైజ్‌లపై రాన్‍సమ్‌వేర్‌ను సృష్టించి యాంటీ వైరస్ ప్రోగ్రామ్‌లను కూడా సులభంగా ఛేదించగలదని వెల్లడించింది.
డివైజ్‌లోకి ఈ మాల్‌వేర్ చొరబడిన తర్వాత మెుబైల్ సెక్యూరిటీని మభ్యపెడుతుంది. ఆ తర్వాత సున్నితమైన డేటాను హ్యాక్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఒకసారి తన ప్రయత్నంలో సఫలమైతే ఫోన్‌లోని హిస్టరీని, బుక్‌మార్క్‌ను, కాల్ లాగ్స్ వంటి కీలక సమాచారాన్ని సులభంగా రాబడుతుంది. సమాచారాన్ని రాబట్టుకున్న తర్వాత ఒరిజినల్ డేటాను డిలీట్ చేసి, హ్యాక్ చేసిన డేటాను '.enc' ఫార్మాట్‌లో ఎన్‌క్ట్రిప్ట్ చేసుకుని భద్రపరుచుకుంటుందని వెల్లడించాయి.
దీంతో పాటు ఫైల్స్‌ను అప్‌లోడ్, డైన్‌లోడ్, అడ్వాన్స్‌డ్ ఎన్‌క్రిప్టెడ్ స్టాండర్డ్ ఆల్‌గారిథంతో కమాండ్ అండ్ కంట్రోల్‌ను తన ఆధీనంలోకి తెచ్చుకోగలుగుతుందని అధికార వర్గాలు తెలిపాయి. దీని భారిన పడకుండా ఉండాలంటే అనుమానాస్పద మెసేజ్‌లు, లింక్స్‌పై క్లిక్ చేయకూడదని సైబర్ సెక్యూరిటీ టీం తెలిపింది. యూఆర్‌ఎల్‌లో 'bitly','tinyur' వంటివి ఉంటే అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment