ఇస్రో సరికొత్త చరిత్ర.. ఆ మూడు దేశాల సరసన భారత్‌ | ISRO Satellites Dock In Space SpaDeX Mission Successful | Sakshi
Sakshi News home page

ఇస్రో సరికొత్త చరిత్ర.. ఆ మూడు దేశాల సరసన భారత్‌

Published Thu, Jan 16 2025 10:48 AM | Last Updated on Thu, Jan 16 2025 11:29 AM

ISRO Satellites Dock In Space SpaDeX Mission Successful

ఢిల్లీ: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇటీవల ఇస్రో పంపించిన పోలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌-సీ60 (పీఎస్‌ఎల్‌వీ)లో జంట ఉపగ్రహాల అనుసంధానం విజయవంతం అయినట్టు ఇస్రో తాజాగా వెల్లడించింది. దీంతో, ఈ ఘనత సాధించిన నాలుగో దేశంగా భారత్‌ రికార్డుల్లో ఎక్కింది. ఇప్పటి వరకు చైనా, రష్యా, అమెరికా మాత్రమే అంతరిక్షంలో రెండు ఉపగ్రహాలను అనుసంధానం చేస్తున్నాయి. ఈ క్రమంలో ఇస్రోకు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. 

సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌)లో నుంచి గత ఏడాది డిసెంబరు 30వ తేదీన ఇస్రో.. పోలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌-సీ60 (పీఎస్‌ఎల్‌వీ)లో జంట ఉపగ్రహాలను ఇస్రో నింగిలోకి పంపింది. అయితే, షార్‌లోని ప్రయోగ వేదిక నుంచి పీఎస్‌ఎల్‌వీ బయలుదేరిన 15.09 నిమిషాలకు స్పేడెక్స్‌-1బి, 15.12 నిమిషాలకు స్పేడెక్స్‌-1ఎ రాకెట్‌ నుంచి విడిపోయాయి. ఆ తర్వాత వీటి డాకింగ్‌ (Docking) కోసం మూడు సార్లు ప్రయత్నించగా.. పలు కారణాల వల్ల ఇది వాయిదా పడుతూ వచ్చింది.

 

ఈ ​క్రమంలో తాజాగా ఉపగ్రహాల అనుసంధానం చేపట్టగా విజయవంతం అయినట్టు ఇస్రో ట్విట్టర్‌ వేదికగా వెల్లడించింది. ఈ మేరకు స్పేడెక్స్‌ (SpaDeX) డాకింగ్‌ ప్రక్రియ విజయవంతంగా పూర్తయినట్లు ఇస్రో తెలిపింది. ఈ క్రమంలోనే రెండు ఉపగ్రహాల మధ్య దూరాన్ని 15 మీటర్ల నుంచి 3 మీటర్లకు తీసుకొచ్చారు. అక్కడ ఉపగ్రహాలను హోల్డ్‌ చేసి డాకింగ్‌ (Docking)ను మొదలుపెట్టారు. ఈ సందర్బంగా ఇందుకు శ్రమించిన సాంకేతిక బృందానికి, యావత్‌ భారతీయులకు అభినందనలు తెలిపింది.

మరోవైపు.. ఇస్రో విజయంపైపప్రధాని మోదీ స్పందించారు. ఈ క్రమంలో ట్విట్టర్‌ వేదికగా.. ఇస్రో శాస్త్రవేత్తలకు మోదీ అధినందనలు తెలిపారు. ట్విట్టర్‌లో మోదీ..‘ఉపగ్రహాల స్పేస్ డాకింగ్‌ను విజయవంతంగా ప్రదర్శించినందుకు ఇస్రోలోని మన శాస్త్రవేత్తలకు, అంతరిక్ష సోదరులకు అభినందనలు. రాబోయే రోజుల్లో భారత్‌ యొక్క ప్రతిష్టాత్మక అంతరిక్ష కార్యకలాపాలకు ఇది ఎంతో ముఖ్యమైనది. మీ అందరికీ అభినందనలు’ అంటూ కామెంట్స్‌ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement