Narayanan
-
ఇస్రోకు వైఎస్ జగన్ అభినందనలు
సాక్షి, తాడేపల్లి: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) శాస్త్రవేత్తలకు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి(YS Jagan) అభినందనలు తెలిపారు. అంతరిక్షంలో ఉపగ్రహాలను విజయవంతంగా డాకింగ్ చేసిన సందర్బంగా వైఎస్ జగన్.. ఇస్రోను అభినందించారు.ఇస్రో(ISRO) విజయంపై వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ సందర్బంగా వైఎస్ జగన్.. ఇస్రో శాస్త్రవేత్తలు అంతరిక్షంలో ఉపగ్రహాలను విజయవంతంగా డాకింగ్ చేయడం ద్వారా ఒక అద్భుతమైన మైలురాయిని సాధించారు. ఈ ముఖ్యమైన విజయం రాబోయే సంవత్సరాల్లో భారతదేశ ప్రతిష్టాత్మక అంతరిక్ష కార్యకలాపాలకు కీలకమైన ముందడుగు వేస్తుంది. ఇస్రోకు అభినందనలు! అంటూ కామెంట్స్ చేశారు.The scientists at @isro have achieved a remarkable milestone with the successful docking of satellites in space. This significant accomplishment is a pivotal step forward for India’s ambitious space missions in the years ahead. Kudos to ISRO!— YS Jagan Mohan Reddy (@ysjagan) January 16, 2025ఇది కూడా చదవండి: ఇస్రో సరికొత్త చరిత్ర.. ఆ మూడు దేశాల సరసన నిలిచిన భారత్ -
డాకింగ్ సక్సెస్
సూళ్లూరుపేట/ సాక్షి బెంగళూరు: సొంతంగా భారతీయ అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవాలన్న ఇస్రో కలను సాకారం చేసేలా స్పేడెక్స్ జంట ఉపగ్రహాల అనుసంధాన ప్రక్రియ (డాకింగ్) విజయవంతమైంది. దీంతో ప్రపంచంలో డాకింగ్ సాంకేతికతను సాధించిన నాలుగోదేశంగా భారత్ అవతరించింది. అత్యంత క్లిష్టమైన డాకింగ్‌ను పూర్తిచేసి ఇస్రో మరోసారి తన సత్తా చాటింది. దీంతో నూతన సంవత్సరంలో ఇస్రో విజయాల బోణీ కొట్టింది. ఇంతకాలం అమెరికా, రష్యా, చైనాలకు మాత్రమే సాధ్యమైన ఈ ఫీట్‌ను సాధించి ఇస్రో తన కీర్తికిరీటంలో మరో కలికితురాయిని చేర్చుకుంది. ఈ మిషన్ లో పాలు పంచుకున్న సిబ్బందికి నా శుభాకాంక్షలు. భారత భవిష్యత్ ప్రతిష్టాత్మక అంతరిక్ష ప్రయోగాలకు ఈ డాకింగ్ తొలిమెట్టు’’ అని మోదీ హర్షం వ్యక్తం చేశారు.𝗦𝗽𝗮𝗗𝗲𝗫 𝗠𝗶𝘀𝘀𝗶𝗼𝗻 𝗨𝗽𝗱𝗮𝘁𝗲:Following the docking, ISRO has successfully managed both satellites as a combined unit. In the upcoming days, ISRO will proceed with undocking and power transfer evaluations.#SPADEX #ISRO pic.twitter.com/tMmCcF5opG— ISRO InSight (@ISROSight) January 16, 2025గురువారం ఉదయం 9 గంటలకు చేజర్ (ఎస్‌డీఎక్స్01), టార్గెట్ (ఎస్‌డీఎక్స్02) అనే జంట ఉపగ్రహాలను అనుసంధానించామని, డాకింగ్ తర్వాత వీటిని ఒకే ఉపగ్రహంగా కంట్రోల్ చేస్తు న్నాం. త్వరలో మళ్లీ వీటిని దూరంగా విడగొడతాం. వీటి మధ్య ఇంధన, విద్యుత్ సరఫరా వ్యవస్థల బదిలీని పరీక్షిస్తాం’’ అని ఇస్రో గురువారం ప్రకటించింది. ‘‘ అంతరిక్ష చరిత్రతో భారత్ తన పేరును ‘డాకింగ్’చేసింది. స్పేడెక్స్ మిషన్ ద్వారా చరిత్రాత్మక స్థాయిలో డాకింగ్ విజయవంతమైంది. ఈ చిరస్మరణీయ క్షణానికి సాక్షిగా నిలిచినందుకు గర్విస్తున్నాం’’ అని ఇస్రో ‘ఎక్స్’లో ఒక పోస్ట్పెట్టింది. ఇస్రో తన డాకింగ్ సామర్థ్యాన్ని పరీక్షించేందుకు ఉద్దేశించిన స్పేడెక్స్ ప్రయోగం విజయవంతమవడంతో సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ‘‘అద్భుత ఘనత సాధించిన ఇస్రో శాస్త్రవేత్తలు, ఈ మిషSpaDeX Docking Update:🌟Docking SuccessSpacecraft docking successfully completed! A historic moment.Let’s walk through the SpaDeX docking process:Manoeuvre from 15m to 3m hold point completed. Docking initiated with precision, leading to successful spacecraft capture.…— ISRO (@isro) January 16, 2025వైఫల్యాల నుంచి విజయం దాకాగత ఏడాది డిసెంబర్ 30వ తేదీన పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ (పీఎస్ఎల్వీ– సీ60) రాకెట్ ద్వారా స్పేస్ డాకింగ్ ఎక్స్పరిమెంట్(స్పేడెక్స్) మిషన్‌ను చేపట్టారు. ఇందులోభాగంగా చెరో 220 కేజీల బరువైన చేజర్, టార్గెట్ ఉపగ్రహాలను ప్రయోగించిన 15 నిమిషాల తర్వాత 475 కిలోమీటర్ల పొడవైన వేర్వేరు వృత్తాకార కక్ష్యల్లో ప్రవేశపెట్టారు. తర్వాత వాటిని నెమ్మదిగా ఒకే కక్ష్యలోకి తీసుకొచ్చారు. వాటిని అనుసంధానించేందుకు పలుమార్లు ప్రయత్నించారు. కానీ వేగాల్లో సారూప్యత లేకపోవడంతో డాకింగ్ సాధ్యంకాలేదు. చివరిసారిగా జనవరి 12వ తేదీన ఒకే కక్ష్యలో కేవలం 15 మీటర్ల సమీపానికి తీసుకొచ్చారు. తర్వాత దూరాన్ని కొంచెం కొంచెంగా తగ్గిస్తూ మూడు మీటర్ల సమీపానికి తీసుకొచ్చారు. అయితే భూమ్మీది కమాండ్ సెంటర్ నుంచి స్పష్టంగా వీక్షించేందుకు సరిపడా వెలుతురు లేక, అననుకూల వాతావరణ పరిస్థితుల కారణంగా డాకింగ్‌ను నిలిపేసి మళ్లీ వాటిని సురక్షిత దూరాలకు పంపేశారు. ఎట్టకేలకు గురువారం ఉదయం 9 గంటలకు అంతరిక్షంలో అత్యంత వేగంగా ప్రయాణించే ఈ రెండు ఉపగ్రహాలను అత్యంత కచ్చితత్వంతో ఒకదానికొకటి జోడించేందుకు మళ్లీ డాకింగ్‌కు ప్రయత్నించారు. టార్గెట్ ఉపగ్రహం నుంచి 15 మీటర్ల దూరంలో ఉన్న చేజర్ ఉపగ్రహాన్ని తొలుత అత్యంత జాగ్రత్తగా 3 మీటర్ల సమీపానికి తెచ్చారు. లేజర్ రేంజ్ ఫైండర్, డాకింగ్ సెన్సార్లను ఉపయోగించి ఎట్టకేలకు చేజర్ ఉపగ్రహాన్ని టార్గెట్ ఉపగ్రహంతో డాకింగ్ చేశారు. భవిష్యత్తులో నిర్వహించబోయే చంద్రయాన్–4, గగన్‌యాన్ ప్రయోగాలకు కూడా ఈ డాకింగ్ సాంకేతికత దోహదపడుతుందని ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇంతటి ఘన విజయాన్ని సాధించిన స్పేడెక్స్ ప్రయోగం బృందానికి ఇస్రో చైర్మన్ డాక్టర్ నారాయణన్ అభినందనలు తెలియజేశారు.Dr. V. Narayanan, Secretary DOS, Chairman Space Commission and Chairman ISRO, congratulated the team ISRO.#SPADEX #ISRO pic.twitter.com/WlPL8GRzNu— ISRO (@isro) January 16, 2025 ఇస్రోకు వైఎస్ జగన్ అభినందనలు సాక్షి, అమరావతి: అంతరిక్షంలో ఉపగ్రహాలను విజయవంతంగా అనుసంధానం చేసిన ఇస్రో శాస్త్రవేత్తలకు వైఎస్సార్సీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలిపారు. ‘అంతరిక్షంలో ఉపగ్రహాలను విజయవంతంగా డాకింగ్ చేయ డం ద్వారా ఇస్రో శాస్త్రవేత్తలు అద్భుతమైన మైలురాయిని సాధించారు. ఈ విజయంతో భవిష్యత్‌లో భారత్ చేపట్టే ప్రతిష్టాత్మక అంతరిక్ష కార్యక్రమాలకు కీలకమైన ముందడుగు పడింది. ఈ సందర్భంగా ఇస్రోకు అభినందనలు’ అంటూ గురువారం సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో ఆయన పోస్ట్ చేశారు. Congratulations to our scientists at @isro and the entire space fraternity for the successful demonstration of space docking of satellites. It is a significant stepping stone for India’s ambitious space missions in the years to come.— Narendra Modi (@narendramodi) January 16, 2025 -
చంద్రయాన్–4, గగన్‌యాన్‌పై ప్రత్యేక దృష్టి
తిరువనంతపురం/చెన్నై: చంద్రయాన్–4, గగన్‌యాన్ వంటి ప్రయోగాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) నూతన చైర్మన్‌గా నియమితులైన ప్రముఖ రాకెట్ సైంటిస్టు డాక్టర్ వి.నారాయణన్ చెప్పారు. ఇస్రో ఇప్పటికే ఎన్నో విజయాలు సాధించిందని అన్నారు. రాబోయే కాలంలో ఎన్నో ముఖ్యమైన మిషన్లు చేపట్టబోతున్నట్లు తెలిపారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. తనను ఇస్రో చైర్మన్‌గా, ‘డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్’ కార్యదర్శిగా కేంద్ర ప్రభుత్వం నియమించడం పట్ల ఆనందం వ్యక్తంచేశారు. ఇస్రోకు గతంలో ఎంతోమంది ప్రఖ్యాత సైంటిస్టులు నేతృత్వం వహించారని, అలాంటి ప్రతిష్టాత్మక సంస్థలో తాను భాగస్వామి కావడం పట్ల చాలా సంతోషంగా ఉందని, ఇదొక గొప్ప అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. ఇస్రో చైర్మన్‌గా తన నియామకంపై తొలుత ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంఓ) నుంచి తనకు సమాచారం అందిందని తెలిపారు. అన్ని విషయాలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్ణయిస్తారని, పీఎంఓ సమాచారం చేరవేస్తుందని అన్నారు. ఇటీవలి కాలంలో ఇస్రో చేపడుతున్న ప్రయోగాలన్నీ విజయవంతం అవుతున్నాయని గుర్తుచేశారు. ప్రస్తుతం ఇస్రో ముందున్న అతిపెద్ద ప్రయోగం గగన్‌యాన్ అని వెల్లడించారు. శ్రీహరికోట నుంచి నావిగేషన్ శాటిలైట్ ఎన్వీఎస్–02ను ప్రయోగించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని వివరించారు. అమెరికాకు చెందిన వాణిజ్యపరమైన ఉపగ్రహాన్ని ఇస్రో మార్క్–3 రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి పంపించబోతున్నామని, అలాగే గగన్‌యాన్‌లో భాగంగా రాకెట్ తయారీ ప్రక్రియ కొనసాగుతోందని పేర్కొన్నారు. చంద్రయాన్–4లో భాగంగా చంద్రుడి దక్షిణ ధ్రువం నుంచి నమూనాలు సేకరించి తీసుకురావాలని సంకల్పించామని చెప్పారు. ఇందుకోసం ఇప్పటికే కార్యాచరణ మొదలైందని తెలిపారు. అంతరిక్షంలో సొంతంగా స్పేస్ స్టేషన్ ఏర్పాటు చేసుకోవడం మన లక్ష్యమని, ఇందుకు ప్రధాని మోదీ ఇప్పటికే అనుమతి మంజూరు చేశారని వి.నారాయణన్ చెప్పారు. ఈ స్పేస్ స్టేషన్లో ఐదు మాడ్యూల్స్ ఉంటాయని, ఇందులో మొదటి మాడ్యూల్‌ను 2028లో ప్రయోగించడానికి ఆమోదం లభించిందని పేర్కొన్నారు. నారాయణన్‌కు అభినందనల వెల్లువ ఇస్రో చైర్మన్‌గా నియమితులైన వి.నారాయణన్‌కు పలువురు ప్రముఖులు అభినందనలు తెలియజేశారు. ఆయన నియామకం పట్ల తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి, పీఎంకే అధ్యక్షుడు అన్బుమణి రాందాస్ తదితరులు హర్షం వ్యక్తంచేశారు. తమిళనాడులో సాధారణ కుటుంబంలో జన్మించిన నారాయణన్ ఇస్రోకు చైర్మన్ కావడం సంతోషంగా ఉందన్నారు. నారాయణన్ నేతృత్వంలో ఇస్రో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. నాలుగు దశాబ్దాల అనుభవం తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా నాగర్‌కోయిల్ సమీపంలోని మేలకట్టు గ్రామంలో ఓ సాధారణ రైతు కుటుంబంలో వి.నారాయణన్ జన్మించారు. తొమ్మిదో తరగతి వరకు ఆయనకు విద్యుత్ సౌకర్యం అందుబాటులోకి రాలేదు. ఇబ్బందులు ఎదుర్కొంటూనే చదువులో రాణించారు. తమిళనాడులో ప్రాథమిక విద్య పూర్తిచేశారు. డిప్లొమో ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్‌లో మొదటి ర్యాంక్ సాధించారు. ఏఎంఐఈ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్ చదివారు. 1989లో ఐఐటీ–ఖరగ్‌పూర్‌లో క్రయోజెనిక్ ఇంజనీరింగ్‌లో ఎంటెక్ చదివారు. 2021లో ఏరోస్పేస్ ఇంజనీరింగ్‌లో పీహెచ్డీ పూర్తిచేసి డాక్టరేట్ పొందారు. 1984లో ఇస్రోలో అడుగుపెట్టారు. విక్రమ్ సారాభాయి స్పేస్ సెంటర్లో సేవలందించారు. ప్రొపల్షన్ సిస్టమ్స్ అభివృద్ధికి కృషి చేశారు. ఎన్నో రాకెట్ ప్రయోగాల్లో కీలక పాత్ర పోషించారు. రాకెట్, స్పేస్‌క్రాఫ్ట్ ప్రొపల్షన్ రంగంలో నారాయణన్‌కు నాలుగు దశాబ్దాల అనుభవం ఉంది. చంద్రయాన్–3 విజయానికి దోహదపడిన జాతీయస్థాయి నిపుణుల కమిటీకి ఆయన అధ్యక్షత వహించారు. ద్రవ, ఘన ఇంధన మోటార్లను రూపొందించడంలో నిపుణుడిగా పేరుగాంచారు. ప్రస్తుతం ఆయన ఇస్రోకు చెందిన లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్(ఎల్పీఎస్సీ) డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. ఈ నెల 14న ఇస్రో చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టబోతున్నారు. -
ఇస్రో తదుపరి చైర్మన్‌గా నారాయణన్
ఢిల్లీ: కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) తదుపరి ఛైర్మన్‌గా వి.నారాయణన్ (Narayanan) నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర కేబినెట్ నియామకాల కమిటీ అధికారిక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.ఇస్రో తదుపరి చైర్మన్‌గా వి.నారాయణన్‌ను కేంద్రం నియమించింది. ప్రస్తుత ఇస్రో ఛైర్మన్ ఎస్.సోమనాథ్ పదవీకాలం ముగుస్తుండటంతో ఈ నెల 14న నారాయణన్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఇక, నారాయణన్ రెండేళ్ల పాటు ఇస్రో చైర్మన్‌గా బాధ్యతల్లో కొనసాగనున్నారు. ప్రస్తుతం ఆయన వలియమలాలోని లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. రాకెట్ వ్యవస్థ, స్పేస్‌క్రాఫ్ట్ ప్రొపల్షన్‌కు సంబంధించి నాలుగు దశాబ్దాలుగా పలు హోదాల్లో ఆయన పనిచేస్తున్నారు.నారాయణన్ ఖరగ్‌పూర్ ఐఐటీలో క్రయోజనిక్ ఇంజనీరింగ్‌లో ఎంటెక్‌తో పాటు ఏరోస్పేస్ ఇంజనీరింగ్‌లో పీహెచ్డీ చేశారు. ఎంటెక్‌లో మొదటి ర్యాంక్ సాధించినందుకు అతనికి సిల్వర్ మెడల్ లభించింది. ఇక, 1984లో ఆయన ఇస్రోలో చేరారు. 2018లో లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. నారాయణన్ సేవలను గుర్తిస్తూ ఆయనకు ఎన్నో అవార్డులు వచ్చాయి.🚨 V. Narayanan has been appointed as the New Chairman of ISRO and Secretary, Department of Space for a period of two years with effect from February 14, 2025.Currently leading ISRO's Liquid Propulsion Systems Centre(LPSC),#ISRO #Space #VNarayanan #SSomanath #ISROChairman pic.twitter.com/IkiaHzXVv7— Aman Kumar 🇮🇳 (@amankmr02) January 7, 2025ఇస్రో చైర్మన్‌గా బాధత్యలు చేపట్టనున్న నేపథ్యంలో నారాయణన్ స్పందించారు. ఈ సందర్బంగా కేరళలోని తిరువనంతపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భారత్ కోసం మాకు స్పష్టమైన రోడ్ మ్యాప్ ఉంది. మా వద్ద ప్రభావంతులైన శాస్త్రవేత్తలు ఉన్నారు. ప్రయోగాల్లో ఇస్రోను మరింత ముందుకు తీసుకెళ్లాలని ఆశిస్తున్నాను అంటూ కామెంట్స్ చేశారు.ఇదిలా ఉండగా.. ఎల్పీఎస్సీ డైరెక్టర్‌గా నారాయణన్ జీఎస్ఎల్వీ ఎంకే 3కి సంబంధించి సీఈ20 క్రయోజెనిక్ ఇంజిన్ అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషించారు. నారాయణన్ సారథ్యంలోనే పలు ఇస్రో మిషన్ల కోసం ఎల్పీఎస్సీ ఇప్పటివరకు 183 లిక్విడ్ ప్రొపల్షన్ వ్యవస్థలను, కంట్రోల్ పవర్ ప్లాంట్లను అందించింది. పలు ఇస్రో ప్రాజెక్టులో ఆయన కీలక పాత్ర పోషించారు. వాటిల్లో ఆదిత్య స్పేస్‌క్రాప్ట్ రూపకల్పన, జీఎస్ఎల్వీ ఎంకే 3 మిషన్ వంటి కీలకమైనవి. కాగా, ప్రస్తుత చైర్మన్ సోమనాథ్ 2022 జనవరిలో ఇస్రో చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. -
KR Narayanan: దళితునిగా పుట్టి.. రాష్ట్రపతిగా ఎదిగి..
ఈ రోజున అంటే అక్టోబర్ 27న దేశ మాజీ రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ జన్మించారు. ఆయన భారత రాజకీయాలు, అంతర్జాతీయ సంబంధాలపై వివిధ రచనలు చేశారు. ఇంతేకాదు అతని మేధో పనితనం, నిర్ణయాలు దేశానికి ఎంతో మేలు చేశాయి. కేఆర్ నారాయణన్ జయంతి సందర్భంగా ఆయన జీవితానికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం...కేఆర్ నారాయణన్ 1921, ఫిబ్రవరి 4న జన్మించారు. ఇంటికి 8 కి.మీ దూరంలోని మిషనరీ పాఠశాలలో నారాయణన్ ప్రాథమిక విద్యను అభ్యసించారు. నారాయణన్ తెలివైన విద్యార్థి కావడంతో ట్రావెన్కోర్ రాజకుటుంబం అతనికి కాలేజీకి వెళ్లడానికి స్కాలర్షిప్ ఇచ్చింది. దీంతో ఆయన కొట్టాయంలోని సీఎంఎస్ కళాశాలలో 12వ తరగతి పూర్తి చేశారు. ఆ తర్వాత ఆంగ్ల సాహిత్యంలో ఆనర్స్ డిగ్రీని అందుకున్నారు. అనంతరం లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో చదువుకున్నారు.1948లో భారతదేశానికి తిరిగి వచ్చిన తరువాత కేఆర్ నారాయణన్ పండిట్ జవహర్లాల్ నెహ్రూను కలుసుకున్నారు. ఈ సమయంలో నెహ్రూ ఆయనను ఇండియన్ ఫారిన్ సర్వీస్‌లో చేరమని కోరారు. 1949లో నారాయణన్ ఇండియన్ ఫారిన్ సర్వీస్‌లో చేరారు. ఈ నేపధ్యంలోనే ఆయన టోక్యో, రంగూన్, లండన్, కాన్బెర్రా, హనోయిలలో రాయబారిగా పనిచేశారు. అనంతరం ఆయన టర్కియే, చైనాలలో భారత రాయబారిగా నియమితులయ్యారు.1980 నుండి 1984 వరకు అమెరికా రాయబారిగా ఉన్నారు. 1955లో కెఆర్ నారాయణన్‌ను దేశంలోనే అత్యుత్తమ దౌత్యవేత్తగా నెహ్రూ పేర్కొన్నారు. అదే సమయంలో ఆయన విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో కార్యదర్శిగా కూడా పనిచేశాడు. ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో ప్రొఫెసర్‌గానూ సేవలందించారు. 1978లో పదవీ విరమణ తర్వాత జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్‌గా పనిచేశారు.1984లో తొలిసారిగా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేశారు. ఈ సమయంలో కేరళలోని ఒట్టప్పలం స్థానం నుంచి ఆయన విజయం సాధించారు. నారాయణన్ కాంగ్రెస్ టికెట్‌పై వరుసగా మూడుసార్లు సాధారణ ఎన్నికల్లో పోటీ చేసి, విజయం సాధించారు. రాజీవ్ గాంధీ ప్రభుత్వంలో రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. ప్రధాని ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ ప్రభుత్వాలలో వివిధ మంత్రి పదవులు నిర్వహించారు.1992లో కేఆర్ నారాయణన్ భారత ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1997లో దేశ 10వ రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. కేరళ నుంచి రాష్ట్రపతి పదవిని అధిష్టించిన మొదటి వ్యక్తి, మొదటి దళితునిగా పేరుగాంచారు.కేఆర్ నారాయణన్ తన 84వ ఏట 2005 నవంబర్ 9న కన్నుమూశారు.ఇది కూడా చదవండి: వంట నూనె ధరలకు రెక్కలు -
ఇది నారాయణుడి సేవ
వేసవి మండుతోంది. ప్రధాని మొన్న తన ‘మన్ కీ బాత్’లో నారాయణన్ని దేశానికి గుర్తు చేశారు. పక్షులకు గుప్పెడు గింజలు వేయకపోయినా అవి ఎలాగో బతికేస్తాయి. కాని ఈ వేసవిలో నీళ్లు లేకపోతే విలవిలలాడతాయి. సొంత ఖర్చుతో ఇంటింటికి మట్టి పాత్రలు పంచి పిట్టలకు నీరు పెట్టమని కోరిన శ్రీరామ్ నారాయణన్ అంత కాకపోయినా కొంతైనా మనం చేయొచ్చు. నరుడి సేవ నారాయణుడి సేవ. అలాగే పక్షులకు నీటి సేవ కూడా. ఈ వేసవిలో ఆత్మసంతృప్తినిచ్చే ఈ పని చేద్దామా? మనుషులు వేసవి వస్తే తమ కోసం చలివేంద్రాలు పెట్టుకుంటారు. చల్లటి నీటి కుండల దగ్గర ఆగి కోరినంత నీళ్లు తాగుతారు. వీలైన వాళ్లు తమ వెంట ఎప్పుడూ నీళ్ల బాటిల్ పెట్టుకుంటారు. మరి జంతువులు, పక్షులు ఏం చేయాలి? వేసవి వస్తే అడవుల్లో కుంటలు ఎండిపోతాయి. వాగులు వంకలు మాడిపోతాయి. ఊళ్లల్లో, రోడ్ల మీద ఎక్కడా నీటి చుక్క కనిపించదు. అడవుల్లోని జంతువుల కోసం అటవీ శాఖ ట్యాంకర్లతో నీళ్లు నింపుతుంది. కాని మనిషితో కలిసి సహజీవనం చేసే పట్టణ విహంగాలు... కాకులు, పావురాలు, పిచ్చుకలు, గోరువంకలు, గువ్వలు... ఇంకా లెక్కలేనన్ని పిట్టలు దప్పిక తీర్చుకోవాలి కదా. వాటి దాహం సంగతి? పాతకాలానికి ఇప్పటి కాలానికి తేడా పాత కాలంలో బావులు ఆరుబయట ఉండేవి. వాటి పక్కనే నీటి తొట్టెలు నింపి ఉండేవి. లేదా ఇంటి పనులన్నీ పెరళ్లల్లో సాగేవి. అందుకోసమని వాడుకునేందుకు నీళ్లు కుండల్లోనో గంగాళాల్లోనో ఉండేవి లేదా పశువులున్న ఇళ్లలో కుడితి తొట్టెలు కాకుండా వేసవిలో ఒక తొట్టెనిండా నీళ్లు నింపి ఉండేవి. కాని ఇప్పుడు పల్లెల్లో తప్ప ఈ కార్యకలాపాలన్నీ టౌన్లలో నగరాల్లో నాలుగు గోడల లోపలికి మారాయి. మట్టి, నీళ్ల తడి కనిపించే పెరళ్లు లేవు. ఇక నగరాల్లో అయితే బాల్కనీల్లోని వాష్ ఏరియా దగ్గరకు కూడా రాకుండా తెరలు కట్టిన గ్రిల్స్ ఉంటాయి. మరి ఎండకు పక్షులు నీళ్లు ఎలా తాగాలి? అడుగున నీళ్లున్న కుండ అంచుపై వాలి రాళ్లు జార విడిచి నీళ్లు పైకి రాగా తెలివిగా తాగి వెళ్లిన కథలోని కాకి ఇప్పుడు ఎక్కడకు వెళ్లాలి? నారాయణన్ ఏం చేశాడు? కేరళ ఎర్నాకుళం జిల్లాలో కలంశెర్రి ఊరికి దగ్గరగా ఉండే మూపతాడంలో ఉండే శ్రీరామ్ నారాయణన్‌కు పదేళ్ల క్రితం ఈ సందేహం వచ్చింది. వేసవిలో అల్లాడుతున్న పక్షులకు నీళ్లు ఎవరు ఇవ్వాలి? ఎవరో ఎందుకు నేనే ఇవ్వాలి అనుకున్నాడు. వెంటనే సొంత డబ్బుతో మట్టి పాత్రలు తయారు చేసి ఇంటింటికి పంచసాగాడు. ‘ఇవి మీ ఇంటి బయట పెట్టి నీళ్లు నింపండి. పక్షులు తాగుతాయి’ అని అభ్యర్థించాడు. సాధారణంగా మనుషులు మంచివాళ్లే. ఎవరైనా మంచి మాట చెప్తే చేయడానికి వెనుకాడరు. నారాయణన్ ఐడియా అందరికీ నచ్చింది. అతనిచ్చిన మట్టి పాత్రల్లో నీళ్లు నింపి బాల్కనీ గోడల మీద, బయటి గోడల మీద, టెర్రస్ల మీద పెట్టసాగారు. పిట్టలు వాలి వాటిలో తమ ముక్కుల్ని ముంచి తాగడం సంతోషంతో చూశారు. నీళ్లు ఉన్న చోట పిట్టలు నిస్సంకోచంగా వాలి మీటింగ్ పెట్టుకునేవి. కొన్ని జలకాలాడేవి. ఈ మనోహర దృశ్యాలన్నీ నారాయణన్ పెట్టిన భిక్షే. ఇప్పటికి దాదాపు లక్ష పాత్రలు తొమ్మిదేళ్లుగా ఈ మట్టి పాత్రలు పంచుతున్న నారాయణన్ గాంధీజీని ఆదర్శంగా తీసుకుని ఈ పని చేస్తున్నాడు. తన ఊరిలో ఎప్పటి నుంచో ఆయన తన సొంత ఖర్చులతో గాంధీజీ ఆత్మకథ ‘సత్యశోధన’ పంచుతూ ఉన్నాడు. అతను రచయిత కూడా. పిల్లల కోసం కవితలు రాశాడు. అతడున్న ప్రాంతంలో పారిశ్రామిక కేంద్రాలున్నాయి. దాంతో అక్కడ ప్రవహించే పెరియార్ నది కాలుష్యం అవుతూ ఉంటుంది. ఆ కాలుష్యానికి వ్యతిరేకంగా పుస్తకం రాశాడు. అదే దారిలో పక్షులకు నీళ్లు పెట్టే పాత్రల పంపిణీ మొదలెట్టాడు. ఇప్పటికి పది లక్షల సొంత డబ్బు ఇందుకు ఖర్చు పెట్టాడు. నారాయణన్‌కు హోల్‌సేల్ లాటరీ ఏజెన్సీ ఉంది. ఊళ్లో చిన్న హోటల్ ఉంది. వాటి మీద వచ్చే ఆదాయం ఇందుకు ఖర్చు పెడతాడు. ‘నాకు ముగ్గురు కూతుళ్లు. నా భార్య చనిపోతే పెంచి పెద్ద చేసి పెళ్లిళ్లు చేశాను. వాళ్లంతా జీవితాల్లో హ్యాపీగా ఉన్నారు. వర్తమానం ధ్వంసం అవుతుంటే భవిష్యత్తు కోసం డబ్బు దాచుకోవడం నాకు నచ్చలేదు. అందుకే ఇలాంటి పనులకు ఖర్చు పెడుతున్నాను’ అంటాడు. ఈ నారాయణనే సొంత డబ్బుతో మొక్కలు పంచి ప్రతి ఇంట్లో ఒక చెట్టుకు కాసే పండ్లను పక్షులకు వదిలేయమని రిక్వెస్ట్ చేస్తుంటాడు. నారాయణన్ చేస్తున్న పనులు అందరూ చేయదగ్గవే. అందరూ చేయకపోవడం వల్లే చేసిన అతని గురించి ఇలా రాయాల్సి వస్తోంది. పక్షులకు నీళ్లు పెట్టడం వార్త. ఒక మొక్క పెంచడం వార్త అవుతున్నాయి. మనం నివసించే ఈ నేలకు మనకు తోడైన జీవరాశిని కాపాడుకోవడం మన విధి. ఈ వేసవి పక్షులకు చల్లగా గడిచేలా చూద్దాం. శ్రీరామ్ నారాయణన్ పంచిన మట్టిపాత్రలతో కాలనీవాసులు -
ఎందుకీ గొడవ.. ఇదేం తర్కం?
సోషల్ నెట్ వర్కింగ్ వెబ్సైట్లు ఫేస్బుక్, ట్విట్టర్లలో సెలబ్రిటీల ‘మనసులోని మాట’లు తాజాగా ఇలా...! మనదేం బాగుంది? శ్రీలంకలో 17.5 శాతం ‘చిల్లర వర్తక ద్రవ్యోల్బణం’ తర్వాత, గ్యాస్ సిలిండర్ ధర ప్రస్తుతం 4,500 శ్రీలంక రూపాయలు. (అంటే దాదాపు 1,200 ఇండియా రూపాయలు.) ఇండియాలో కూడా సిలిండర్ ధర దాదాపు అంతే ఉంది, అదీ 17.5 శాతం ద్రవ్యోల్బణం లేకుండానే. – అక్షత్ శ్రీవాస్తవ, ఆంట్రప్రెన్యూర్ ఎందుకీ గొడవ? నేను ముప్పై ఐదేళ్ల క్రితం ఢిల్లీ వచ్చినప్పటినుంచీ హలాల్ మటన్ మాత్రమే కొంటున్నాను. ఎందుకంటే నా ఉత్తరాది హిందూ మిత్రులు అదే కొనమన్నారు. అదే రుచికరం అని చెప్పారు. కేరళలో ఉన్నప్పుడు ఈ హలాల్, ఝట్కాల గురించి వినలేదు. పిల్లలుగా ఉన్నప్పుడు మటన్ ఇంటికి వచ్చేది. పెద్దయ్యాక బీఫ్ కూడా తినడం మొదలుపెట్టాం. – ఆర్. రాజమోహన్, పబ్లిషర్ ఇదేం తర్కం? ముస్లింలు ఝట్కా మాంసాన్ని తిరస్కరించడమంటే అది విశ్వాసానికి సంబంధించినది. హిందువులు హలాల్ మాంసాన్ని వద్దనడమంటే అది ఇస్లామోఫోబియానా? – నార్బర్ట్ ఎలెకెస్, వ్యాఖ్యాత మిత్రుడిని కోల్పోయాను ఇప్పుడిది అధికారికం. మాక్స్ లెవిన్ చనిపోయాడు. ఉక్రెయిన్‌లోని అత్యుత్తమ ఫొటో జర్నలిస్టుల్లో ఒకడు. ప్రతిభతో పాటు సమగ్రత అతడి సొంతం. ఉక్రెయిన్‌లోని ఆటిజం పిల్లల మీద అతడు రాసిన వ్యాసాన్ని మరిచిపోలేను. 2012లో నేను దానివల్లే కలిశాను. కీవ్ దగ్గరలో రష్యన్ల చేతిలో లెవిన్ చనిపోయాడు. – అలెక్సాండర్ షేర్బా, ఉక్రెయిన్ దౌత్యవేత్త ఒకే తీరు రష్యా మీద ఉక్రెయినియన్లలో ఎలాంటి భావం ఉంటుందో, పాకిస్తాన్ మీద అఫ్గానియన్లకు కూడా అలాంటి భావమే ఉంటుంది. – బహార్ జలాలీ, అసోసియేట్ ప్రొఫెసర్ సొగసరి భారతం అందరికీ కొంచెం ఆలస్యంగా ఉగాది శుభాకాంక్షలు. భారతదేశంలోని సౌందర్యం ఏమిటంటే, మనకు ప్రతీ సంవత్సరంలో పది పన్నెండు నూతన సంవత్సరాదులు వస్తాయి. మన గందరగోళంలో కూడా కొంత సొగసుంది. – మాధవన్ నారాయణన్, పాత్రికేయుడు పరిస్థితేం బాలేదు విమానం ఎక్కడానికి ముందు చేసుకోవాల్సిన(ప్రి–ఫ్లైట్) కోవిడ్ పీసీఆర్ పరీక్షతో పాటు కొన్ని సామాన్లు కొందామని టౌను(లండన్)లోకి వెళ్లాల్సి వచ్చింది. ఖాళీగా ఉన్న షాపుల సంఖ్య దిగ్భ్రాంతికి గురిచేసింది. మనం స్పష్టంగా ఆర్థికమాంద్యంలో ఉన్నాం. – కాథరీన్ షొఫీల్డ్, హిస్టారియన్ -
తెలుగు–తమిళ భీష్మాచార్యుడు
‘‘ఆంధ్రదేశంలో తెలుగు వాళ్లు తమిళనాడుకు వలస పోవడానికి ఎన్నో రాజకీయ, సాంఘిక, మత కారణాలు కలవు. అందులో తురక రాజులు రాజ్యాంగం చేసేట ప్పుడు మన ఆడవాళ్లపై కన్ను పడి ఆశపడే కారణం చేత ఆ రాజుల చేతులో పడి మానాన్ని పోగొట్టుకోవడానికి ఇష్టపడక దక్షిణం దిక్కుకు పయనమై వచ్చేస్తిరి. ఆంధ్రదేశం నుండి అలా వచ్చేట ప్పుడు మావాళ్ల అనుభవాలు, పడిన కష్టాలు, మా ముత్తాత, అవ్వ, తాతలు వారి బిడ్డలకు, మనవళ్లు, మనవరాళ్లకు కథలు కథలుగా చెప్పేవారు. ఇట్ట ఆది నుంచి వచ్చిన కథలు మా అవ్వ నాకు చిన్నప్పుడు చెప్పేది. అట్టా ఆ కథను మళ్లీ మళ్లీ ఎన్ని సార్లు విన్నానో లెక్కలేదు. ఉత్తరాన్నుంచి ఎనిమిది వందల ఏళ్ల క్రిందట వలస వచ్చి ఇక్కడ అడవులను నరికి నేలను సాగులోనికి తెచ్చిన మా పెద్దల కథే గోపల్లె’’ అంటూ తమిళ సాహితీ లోకంలో ‘కీరా’ గా సుప్రసిద్ధులైన కీ.రాజనారాయణన్ తమ తెలుగు జాతి మూలాలను గూర్చి ‘గోపల్లె’ నవలకు సంతరించిన ముందుమాటలో విశదం చేశారు. కీ. రా. పూర్తి పేరు రాయంకుల కృష్ణరాజు నారా యణ పెరుమాళ్ రామానుజ నాయకర్. ఎనిమిది శతాబ్దాల క్రిందట ఉత్తరాన ఉన్న ఆంధ్రప్రాంతం నుంచి తమిళనాడు పాండ్య మండలం (కరిచల్కాడు: నల్లరేగడి నేల)కు వలస వెళ్లిన కుటుంబానికి చెందిన వారు. వీరు తూత్తుకూడి జిల్లా కోవిల్పట్టి మండలం, ఇడై చేవల్ గ్రామంలో 1923 సెప్టెంబర్ 16న శ్రీకృష్ణ రామానుజం, లక్ష్మీ అమ్మ దంపతులకు జన్మించారు. 1965 నుంచి రచనా వ్యాసంగం ప్రారంభించి 1976లో ‘గోపల్లె గ్రామం’, దానికి కొనసాగింపుగా ‘గోపల్లె పురత్తు మక్కళ్’ పేరిట రెండో నవలను వెలువరించారు. నాటి గోపల్లె శతాబ్దాల కాలంలో పరిణామం చెందుతూ స్వాతంత్య్రోద్యమ కాలం నాటికి రూపుదిద్దుకున్న విధం ‘గోపల్లె పురత్తు మక్కళ్’ వివరిస్తుంది. దీనికి 1991లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. వర్షం లేక ఎండిన నేలతల్లి కథలను అక్షరీకరిం చడంలో కీరా సిద్ధహస్తుడు. వీరివి ఏడు కథాసంపు టాలు, నాలుగు నవలలు, మూడు వ్యాస సంకల నాలు అచ్చయినాయి. 1982లో వీరు తమిళ మాండ లిక పద నిఘంటువును రూపొందించారు. 1984లో ఆయన ‘‘కరిసై కథైగళ్’’ సంపుటానికి సంపాదకునిగా వ్యవ హరించారు. తమిళనాడు టెక్స్›్టబుక్ కార్పొరేషన్ (టీఎన్టీబీ) దీన్ని ఆంగ్లంలోకి అనువ దింపజేసి హార్పర్ కోల్లిన్స్ వారిచే ముద్రింపజేసింది. ఆ పుస్తకం మార్చి 2021లో వెలుగుచూసింది. ‘గోపల్లె’లో కథా సంవిధానం పఠితకు విశ్రాం తిని కలిగిస్తుంది. విషాదంలో అద్భుత మాయావాద రసం రంగరించి ‘గోపల్లె’ నవలను తీర్చిదిద్దారు. భారతీయ సంస్కృతి, వైదిక విజ్ఞానం, భారతీయ ఆత్మ ఆవిష్కరణ నవల అంతటా పరుచుకొని ఉంటుంది. కథలో అతీతం, వర్తమానం కలిసి నడుస్తూ ఉంటాయి. పాశ్చాత్య సాహితీ విమర్శకులు చెప్పిన ‘మాజికల్ రియలిజం’, మహాభారతంలో వేదవ్యాసుడు ఆవిష్కరించిన అద్భుత రసావిష్కరణ ‘గోపల్లె’లో ఆవిష్కరించటం విశేషం. ‘గోపల్లె’ గ్రామం నవలను నంద్యాల నారాయణ రెడ్డి, ‘గోపల్లె పురత్తు మక్కళ్’ను ఆచార్య శ్రీపాద జయప్రకాశ్ తెలుగులోకి అనువదించారు. 1989లో పాండిచ్చేరి విశ్వవిద్యా లయం తమ ఫోక్ టేల్స్ డాక్యుమెంటేషన్ అండ్ సర్వే సెంటర్ శాఖకు కీరాను డైరెక్టర్‌గా నియమించి గౌరవించింది. ‘గోపల్లె’ నవలకు శరీరం తమిళమైతే ఆత్మ తెలుగు అన్నారాయన. ‘తెలుగు రాతల్ని (అక్షరాల్ని) చేత్తో తాకితే చాలుబా, అదే నిండా భాగ్యం’ అనే నిండైన తెలుగు భాషాభిమాని. ‘నాయన’, ‘భీష్మా చార్య’ అని తమిళులు ఆప్యాయంగా పిలుచుకున్న రాజనారాయణన్ ఈ మే 17న కన్నుమూశారు. ఆ సాహితీ మూర్తికి ఇదే అశ్రునివాళి. వ్యాసకర్త ప్రముఖ సాహితీవేత్త. డాక్టర్ తుర్లపాటి రాజేశ్వరి మొబైల్: 90787 43851 -
స్కాలర్ షిప్‌తో చదివాడు.. భారత రాష్ట్రపతి అయ్యాడు
న్యూఢిల్లీ : టాటా గ్రూపు స్కాలర్ షిప్‌తో విదేశంలో చదువుకుని భారత రాష్ట్రపతి స్థాయికి ఎదిగిన కెఆర్ నారాయణన్ స్పూర్తిదాయక కథ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. టాటా గ్రూపు బ్రాండ్ కస్టోడియన్ హరీశ్ భట్ లింక్డ్ఇన్లో ఈ కథను షేర్ చేశారు. గత కొద్దిరోజులుగా ‘షార్ట్ టాటా స్టోరీస్’ పేరిట సంస్థ ద్వారా లబ్ధిపొందిన వారి కథలను ఆయన తన ఖాతాలో పోస్టు చేస్తున్నారు. తాజాగా, ‘ఏ టాటా స్కాలర్’ పేరిట మాజీ రాష్ట్రపతి కెఆర్ నారాయణన్ కథను షేర్ చేశారు. ‘‘1940లలో ఓ యువకుడి స్కాలర్ షిప్‌కు సంబంధించిన ఓ లేఖ జేఆర్డీ టాటాకు అందింది. ఆ లేఖలో.. ‘కేఆర్ నారాయనణ్ అనే యువకుడు ట్రావెన్కోర్ యూనివర్శిటీలో ఎంఏలో మొదటి ర్యాంకు సాధించాడు. ఎంఏ పూర్తి చేయటానికి ఎన్నో కష్టాలు పడ్డాడు. అతడు చాలా పేద కుటుంబానికి చెందిన వాడు. తండ్రి నెలకు సంపాదించే 20 రూపాయలు మాత్రమే తొమ్మిది మంది ఉన్న కుటుంబానికి ఆధారం. కెఆర్ నారాయణన్ ఇంగ్లాండ్‌లో ఉన్నత చదువులు చదవాలని ఆశిస్తున్నాడు’ అని ఉంది. టాటా గ్రూపు జారీ చేసిన స్కాలర్ షిప్ ప్రతి టాటా గ్రూపు అతడ్ని ఇంటర్వ్యూ చేసింది. అతడు ఇంటర్వ్యూలలో మంచి మార్కులు సాధించాడు. టాటా గ్రూపు స్కాలర్ షిప్ ఇవ్వటానికి ముందుకొచ్చింది. 16 వేల రూపాయల స్కాలర్ షిప్, రూ. 1000 లోన్‌ను అందించింది. దీంతో అతడు లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో చదివాడు. 1949లో ఇండియన్ ఫారెన్ సర్వీసెస్‌లో చేరాడు. 1992లో భారత ఉప రాష్ట్రపతిగా..1997లో రాష్ట్రపతిగా అయ్యాడు. ప్రతీ భారతీయుడికి స్పూర్తిదాయకంగా నిలిచాడు’’ అని రాసుకొచ్చారు. టాటా గ్రూపు జారీ చేసిన స్కాలర్ షిప్‌కు సంబంధించిన కాపీని పోస్ట్ చేశారు. చదవండి : లక్ష ఏళ్ల నాటి ఆదిమానవుల అవశేషాలు.. వాళ్లను చంపింది.. -
హీరో సిద్దార్థ్‌కు బెదిరింపులు.. ఖండించిన బీజేపీ
తనను, తన కుటుంబ సభ్యులను చంపేస్తామంటూ సందేశాలు వస్తున్నాయని హీరో సిద్దార్థ్ తెలిపిన సంగతి తెలిసిందే. అంతేగాక అత్యాచారం బెదిరింపులు కూడా వస్తున్నాయని చెప్పాడు. అయితే రాష్ట్ర బీజేపీ ఐటీ సెల్ తన పర్సనల్ ఫోన్ నంబర్ లీక్ చేయడం వల్లే ఇలా జరిగిందని సోషల్ మీడియా వేదికగా ఆరోపించాడు. ఈ నేపథ్యంలో ఇవాళ సిద్దార్థ్ మరో ట్వీట్ చేస్తూ తనకు, తన కుటుంబం భద్రత దృష్ట్యా పోలీసు సెక్యూరిటీని ఏర్పాటు చేసినందుకు తమిళనాడు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపాడు. ఇదిలా ఉంటే రాష్ట్ర బీజేపీ స్పోక్స్‌పర్సన్ నారాయణన్ తిరుపతి కూడా దీనిపై స్పందించారు. సిద్దార్థ్ ప్రధాని మోదీని అగౌరపరిచి మరోసారి నేరస్థుడయ్యాడంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘సిద్ధార్థ్ తరచూ నేరాలకు పాల్పడుతున్నాడు. గతంలో నేను అతడిపై కేసు పెట్టాను. అది ఇప్పటికీ కోర్టులోనే ఉంది. తాజాగా అతడు ప్రధాన మంత్రి, హోంమంత్రి, సీఎంలపై అసభ్యకరమైన పదజాలంతో దూషించి మరోసారి అపరాది అయ్యాడు. ఇటీవల సిద్దార్థ్ చేసిన ట్వీట్లో కూడా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌పై వివాస్పద వ్యాఖ్యలు చేశాడు. అయితే ప్రస్తుతం తనకు వస్తున్న బెదిరింపుల్లో ఎంతవరకు నిజముందో నాకు తెలియదు. ఒకవేళ అతనికి సమస్య ఉంటే చట్టపరమైన చర్య తీసుకోవాలి. కానీ, ప్రధానమంత్రి, హోంమంత్రి, సీఎంలపై అసభ్యకర వ్యాఖ్యలు చేస్తూ వ్యతిరేకత తీసుకురావడం సరైనది కాదు. ఇది ఖండించదగిన చర్య’ అంటూ ఆయన ట్వీట్ చేశారు. అలాగే రాష్ట్ర బీజేపీ ఐటీ సెల్ వింగ్ హెడ్ సీటీఆర్ నిర్మల్ కుమార్ సిద్దార్థ్ ఆరోపణలను ఖండించారు. ఆయన ట్వీట్ చేస్తూ.. ‘సిద్దార్థ్‌కు వస్తున్న బెదిరింపులకు బీజేపీకి ఎలాంటి సబంధం లేదు. సిద్దార్థ్ వంటి వ్యక్తులపై దృష్టి పెట్టొద్దని పార్టీ సభ్యులు, అనుచరులను అభ్యర్థిస్తున్న’ అని పేర్కొన్నారు. కాగా తమిళనాడు బీజేపీ ఐటీ సెల్ తన మొబైల్ నంబర్ లీక్ చేసిందని, గడిచిన 24 గంటల్లో తనకు దాదాపు 500 అసభ్య సందేశాలు వచ్చినట్లు సిద్దార్థ్ పేర్కొన్న సంగతి తెలిసిందే. అలాగే తనను తన కుటుంబ సభ్యులను చంపేస్తామని.. అత్యాచారం చేస్తామని బెదిరిస్తూ మెసేజ్‌లు చేస్తున్నారని, ఆ నంబర్లంన్నింటిని రికార్డ్ చేశాను.. వీటిలో చాలా వరకు బీజేపీతో లింక్ ఉన్నవి.. ఆ పార్టీ గుర్తు డీపీగా పెట్టుకున్నవే అని తెలిపాడు. అంతేగాక వీట్నింటిని పోలీసులుకు అందించానని కూడా సిద్దార్థ్ తన ట్వీట్లో పేర్కొన్నాడు. During this pandemic all of us very much focused on supporting people in providing food, medicine..etc Requesting all supporters not to give any attention to individuals like @Actor_Siddharth who are just trying to pass time, pls stay focused on covid support to people. pic.twitter.com/1d9Eirnqx3 — CTR.Nirmal kumar (@CTR_Nirmalkumar) April 29, 2021 చదవండి: నాపై అత్యాచారం చేస్తామని బెదిరిస్తున్నారు: హీరో సిద్ధార్థ్ పెట్రో సెగ : కేంద్ర ఆర్థికమంత్రిపై హీరో సెటైర్ -
శృంగారం, పోర్నోగ్రఫీ ఒకటేనా?
న్యూఢిల్లీ: మన దేశంలో శృంగారాన్ని, పోర్నోగ్రఫీని ఒకేవిధంగా చూస్తున్నారని ప్రముఖ రచయిత్రి అమృత నారాయణన్ అభిప్రాయపడ్డారు. ఈ రెండింటికీ చాలా తేడా ఉందని.. శృంగారం ఆత్మాశ్రయమని ఇందులో ఒకరిపట్ల ఒకరికి ఆపేక్ష, భావోద్వేగాలు కలగలసి ఉంటాయని వెల్లడించారు. పోర్నోగ్రఫీలో కామం మాత్రమే ఉంటుందని వివరించారు. సాహిత్య ఆజ్‌తక్ కార్యక్రమంలో భాగంగా ‘రైటింగ్ ఎరోటికా ఇన్ ఇండియా’ అంశంపై జరిగిన చర్చలో మాధురి బెనర్జీతో కలిసి ఆమె పాల్గొన్నారు. మన భావాలను స్వేచ్ఛగా వెల్లడించే అవకాశం పుస్తకాలు కల్పిస్తాయని, అందుకే తాను రాయడం మొదలుపెట్టానని అమృత వెల్లడించారు. ‘కష్టపడి పనిచేసే మనుషులున్న దేశంగానే స్వాతంత్ర్యం వచ్చాక మనదేశం గుర్తింపు కోరుకుంది. హార్డ్‌వర్క్, లైంగికత రెండింటినీ కలపలేదు. స్వాతంత్ర్యం వచ్చాక సాంస్కృతిక వారసత్వంలో ఈ అంశాన్ని మనం వదిలేశాం. మన దేశానికి ఇంగ్లీషు పరిచయమైన కొత్తలో మనల్ని అనాగరీకులుగా చూశారు. మనం కూడా అలాగే వ్యవహరించాం. నైతిక విలువలను మధ్యతరగతి మీద రుద్దడంతో అది కూడా ఇలాగే కొనసాగింది. ఎందుకంటే దేశాన్ని ప్రమోట్ చేయడానికి ఈ ఇమేజ్ అవసరమైంది. అయితే పుస్తకాలు చదివినంతమాత్రాన ప్రజలు స్వతంత్రులుగా మారరు. తమంతట తామే ప్రజలు స్వేచ్ఛ సాధించాలి. దీనికి కచ్చితంగా పుస్తకాలు సహాయపడతాయ’ని అమృత వివరించారు. క్లినికల్ సైకాలజిస్ట్ అయిన ఆమె పారెట్స్ ఆఫ్ డిజైర్, ఏ ప్లెజెంట్ కెండ్ ఆఫ్ హెవీ వంటి పుస్తకాలు రాశారు. భారతదేశ శృంగార చరిత్రపై పరిశోధన కూడా సాగించారు. మాధురి బెనర్జీ మాట్లాడుతూ.. ‘కామసూత్ర’ స్థాయిలో ‘తమిళ సంగం’ పుస్తకాలకు పేరు రావాల్సివుందని అభిప్రాయపడ్డారు. ఈ పుస్తకాల్లో భావోద్వేగాలు ఉంటాయని, కామసూత్రలో ఎటువంటి ఎమోషన్స్ ఉండవని చెప్పారు. శృంగార సాహిత్యంవైపు ఎందుకు మొగ్గుచూపారని ప్రశ్నించగా.. ‘నేను మానవ సంబంధాల గురించి మాట్లాడుతున్నాను. మహిళ కన్యత్వాన్ని కోల్పోతే సమాజం ఎలా స్పందిస్తుందనే దాని గురించి నా మొదటి పుస్తకంలో రాశాను. మన దేశంలో సెక్సువాలిటీ గురించి బహిరంగంగా మాట్లాడరు. నా పుస్తకం 2010లో విడుదలైంది. లైంగికత గురించి చర్చ జరగాలని ఈ పుస్తకం రాశాను. కానీ నా లక్ష్యం నెరవేరలేదు. నా పుస్తకాలు లైంగికత, శృంగారానికి పరిమితం కావు. మానవ సంబంధాలను లోతుగా చర్చిస్తాయి. శృంగార సాహిత్యాన్ని మన విద్యావ్యవస్థలో భాగం చేయాలి. లైంగికత గురించి గోప్యత పాటిస్తుండటంతో పిల్లలు ఇంటర్నెట్ను ఆశ్రయించి పెడతోవ పడుతున్నారు. లైంగికతపై పిల్లలకు సదావగాహన కల్పించి, వారి భావాలను స్వేచ్ఛగా వెల్లడించేలా చేయాల’ని చెప్పారు. మాధురి బెనర్జీ.. లాసింగ్ మై వర్జినిటీ, గాళ్స్ నైటవుట్, మై క్లింజీ గాళ్‌ఫ్రెండ్, అడ్వాంటేజ్ లవ్, ఫర్బిడెన్ డిజైర్స్ వంటి శృంగార సాహిత్య పుస్తకాలు రాశారు. (చదవండి: పోర్న్ ఎక్కువగా చూడటం వల్ల...) -
ఓటమి భయంతోనే డబ్బుల పంపిణి : అనిల్ కుమార్
సాక్షి, నెల్లూరు: వచ్చే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే నెల్లూరు టీడీపీ అభ్యర్థి మంత్రి నారాయణ ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. ఆదివారం దేలుగుదేశం పార్టీ నాయకులు చిన్న బజారులో రు. 50 లక్షలు పంచుతుండగా వైఎస్సార్సీపీ నేతలు, స్థానికులు పటుకునేందుకు ప్రయత్నించగా డబ్డు సంచులు పడవేసి పరారైన ఇద్దరు టీడీపీ నేతులు. సంచుల్లో సుమారు రు. 15 లక్షలు నగదును పోలీసులకు అప్పగించారు. అనంతరం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ... మంత్రి నారాయణ డబ్బుతో ఓటర్లను కొనేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండే ప్రాంతాలను ఎంచుకుని డబ్బులు పంపిణి చేస్తున్నారని అన్నారు. జిల్లాలో నారాయణ విద్యాసంసస్థల సిబ్బంది డబ్బులు పంపిణిలో కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీ నేతలపై ప్రభుత్వ అధికారులు స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. -
సీపీఎం సీనియర్ కార్యకర్త హత్య
కన్నాంఘడ్: కేరళలో సీనియర్ సీపీఐ కార్యకర్తను హత్య చేశారు. ఆయన సోదరుడిని తీవ్రంగా గాయపరిచారు. కాసర్ఘోడ్ జిల్లాలోని కాయకున్ను వద్ద శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఆరెస్సెస్, బీజేపీ కార్యకర్తలే ఈ పనిచేసి ఉంటారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసు బలగాలు ఆ చుట్టూపక్కల నిషేదాజ్ఞలు జారీ చేశారు. దాదాపు 20 ఏళ్లకు పైగా నారాయణన్(45) అనే వ్యక్తి సీపీఎంలో పనిచేస్తుండగా అతడి సోదరుడు అరవిందాన్ కూడా ఆయనతో కలిసిపనిచేస్తున్నాడు. వారిద్దరిపై ఒకేసారి ఓ గ్రూపు దాడికి దిగింది. పదునైన ఆయుధాలతో విచక్షణా రహితంగా దాడి చేసింది. దీంతో నారాయణన్ అక్కడికక్కడే మృతిచెందగా అరవిందన్ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాగా, తమపై వచ్చిన ఆరోపణలను బీజేపీ, ఆరెస్సెస్ శ్రేణులు కొట్టిపారేశాయి. -
ఐ యామ్ హ్యాపీ
మొదట సందిగ్ధంలో పడ్డా, ఇప్పుడు నేను హ్యాపీ అంటోంది నటి ధన్సిక. ఇంతకు ఈమె ఏ విషయం గురించి మాట్లాడుతుందనేగా మీ ప్రశ్న. పేరాన్మై చిత్రంతో నటిగా తానేమిటో నిరూపించుకున్న ఈ అమ్మడు తాజాగా నటించిన చిత్రం తిరుందిడుసిసే సుధాస్ ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందిన ఈ చిత్రంలో నవ నటులు వీరవన్ స్టాలిన్, నారాయణ్, అంజెనా కీర్తి ముఖ్య పాత్రలు పోషించారు. దర్శకుడు శంకర్ శిష్యుడు నిమేష్ వర్షన్ దర్శకుడిగా పరిచయం అయిన ఈ చిత్రం శుక్రవారం తెరపైకి వచ్చింది. ఈ చిత్రంలో నటించిన అనుభవాన్ని నటి ధన్సిక తెలుపుతూ తిరుందిడు సిసే యథార్థ సంఘటన ఆధారంగా రూపొందించిన కథా చిత్రం అని పేర్కొంది. ఈ చిత్ర కథను దర్శకుడు తనకు చెప్పినప్పుడు చాలా ఎగ్జైట్ అయ్యానని చెప్పింది. అయితే మొదట చిత్రం చేద్దామా? వద్దా అన్న సందిగ్ధంలో పడ్డానని అంది. కారణం ఇందులోని పాత్రకు న్యాయం చేయగలనా? అన్న సందేహమేనని పేర్కొంది. అయితే ఇప్పుడు చాలా హ్యాపీ అని అంది. ఈ చిత్రంలో చార్మి అనే పాత్రలో నటించానని తెలిపింది. ఇది అత్యాచారానికి గురైన యువతి పాత్ర అని చెప్పింది. ఈ పాత్రలో తన నటనకు పలువురి నుంచి ప్రశంసలు లభిస్తున్నాయని చెప్పింది. తనది చాలా బ్యాలెన్సింగా నటించాల్సిన పాత్ర అని ఏ మాత్రం అటూ ఇటూ అయినా దాన్ని స్వభావం మారిపోతుందని అంది. ఇది సమాజంపై చెడు ప్రభావం చూపే అంశాలపై కనువిప్పు కలిగించే కథాచిత్రం అని ముఖ్యంగా మద్యానికి బానిసలైన వ్యక్తులు అత్యాచారాలు లాంటి అంశాలను చర్చించే చిత్రం అని పేర్కొంది. సమాజానికి చక్కని సందేశాన్నిచ్చే ఇలాంటి చిత్ర యూనిట్‌తో కలిసి పని చేయడం సంతోషంగా ఉందని నటి ధన్సిక అంది.