KR Narayanan: దళితునిగా పుట్టి.. రాష్ట్రపతిగా ఎదిగి.. | KR Narayanan First Dalit President | Sakshi
Sakshi News home page

KR Narayanan: దళితునిగా పుట్టి.. రాష్ట్రపతిగా ఎదిగి..

Published Sun, Oct 27 2024 8:44 AM | Last Updated on Sun, Oct 27 2024 10:18 AM

KR Narayanan First Dalit President

ఈ రోజున అంటే అక్టోబర్ 27న దేశ మాజీ రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ జన్మించారు. ఆయన భారత రాజకీయాలు, అంతర్జాతీయ సంబంధాలపై వివిధ రచనలు చేశారు. ఇంతేకాదు అతని మేధో పనితనం, నిర్ణయాలు దేశానికి ఎంతో మేలు చేశాయి. కేఆర్ నారాయణన్ జయంతి సందర్భంగా ఆయన జీవితానికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం...

కేఆర్ నారాయణన్ 1921, ఫిబ్రవరి 4న జన్మించారు. ఇంటికి 8 కి.మీ దూరంలోని మిషనరీ పాఠశాలలో నారాయణన్ ప్రాథమిక విద్యను అభ్యసించారు. నారాయణన్‌ తెలివైన విద్యార్థి కావడంతో ట్రావెన్‌కోర్ రాజకుటుంబం అతనికి కాలేజీకి వెళ్లడానికి స్కాలర్‌షిప్ ఇచ్చింది. దీంతో ఆయన కొట్టాయంలోని సీఎంఎస్‌ కళాశాలలో 12వ తరగతి పూర్తి చేశారు. ఆ తర్వాత ఆంగ్ల సాహిత్యంలో ఆనర్స్ డిగ్రీని  అందుకున్నారు.  అనంతరం లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో  చదువుకున్నారు.

1948లో భారతదేశానికి తిరిగి వచ్చిన తరువాత కేఆర్‌ నారాయణన్‌ పండిట్ జవహర్‌లాల్‌ నెహ్రూను కలుసుకున్నారు. ఈ సమయంలో నెహ్రూ ఆయనను ఇండియన్ ఫారిన్ సర్వీస్‌లో చేరమని కోరారు. 1949లో నారాయణన్‌ ఇండియన్ ఫారిన్ సర్వీస్‌లో చేరారు.  ఈ నేపధ్యంలోనే ఆయన టోక్యో, రంగూన్, లండన్, కాన్బెర్రా, హనోయిలలో రాయబారిగా పనిచేశారు. అనంతరం ఆయన టర్కియే, చైనాలలో భారత రాయబారిగా నియమితులయ్యారు.

1980 నుండి 1984 వరకు అమెరికా రాయబారిగా  ఉన్నారు. 1955లో కెఆర్ నారాయణన్‌ను దేశంలోనే అత్యుత్తమ దౌత్యవేత్తగా నెహ్రూ పేర్కొన్నారు. అదే సమయంలో ఆయన విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో కార్యదర్శిగా కూడా పనిచేశాడు. ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో ప్రొఫెసర్‌గానూ సేవలందించారు. 1978లో పదవీ విరమణ తర్వాత జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్‌గా పనిచేశారు.

1984లో తొలిసారిగా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేశారు. ఈ సమయంలో కేరళలోని ఒట్టప్పలం స్థానం నుంచి ఆయన విజయం సాధించారు. నారాయణన్‌ కాంగ్రెస్‌ టికెట్‌పై వరుసగా మూడుసార్లు సాధారణ ఎన్నికల్లో పోటీ చేసి, విజయం సాధించారు. రాజీవ్ గాంధీ ప్రభుత్వంలో రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. ప్రధాని ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ ప్రభుత్వాలలో వివిధ మంత్రి పదవులు నిర్వహించారు.

1992లో కేఆర్‌ నారాయణన్ భారత ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1997లో దేశ 10వ రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. కేరళ నుంచి రాష్ట్రపతి పదవిని అధిష్టించిన మొదటి వ్యక్తి, మొదటి దళితునిగా పేరుగాంచారు.కేఆర్‌ నారాయణన్ తన 84వ ఏట 2005 నవంబర్‌ 9న కన్నుమూశారు.

ఇది కూడా చదవండి: వంట నూనె ధరలకు రెక్కలు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement