దళితుడికి యూపీ బీజేపీ పీఠం
లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా కేశవ్ ప్రసాద్ మౌర్యను ఎంపిక చేసిన బీజేపీ.. ఆయన్ను పార్టీ రాష్ట్ర అధ్యక్ష నుంచి తప్పించనుందా?. తాజా పరిణామాలు ఈ విషయాన్నే ధ్రువపరుస్తున్నాయి. బీసీ వర్గానికి చెందిన మౌర్య ఎలాగూ డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్న తరుణంలో దళితుడిని రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిని చేసే యోచనలో బీజేపీ ఉన్నట్లు తెలిసింది.
ఓబీసీలు ఎక్కువగా ఉన్న యూపీలో 2017 ఎన్నికల్లో విజయానికి వ్యూహంగా మౌర్యను రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఎంపిక చేసింది బీజేపీ. తాజాగా జరిగిన ఎన్నికల్లో విజయం తర్వాత బలహీనంగా ఉన్న దళిత మద్దతును పెంచుకునేందుకు ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. అయితే, అధ్యక్షుడిగా ఎవరిని ఎంపిక చేస్తారనే విషయం ఇంకా స్పష్టత రాలేదు.