Bihar Diwas: బీహార్‌ @ 113.. ప్రముఖుల శుభాకాంక్షలు | Bihar Diwas: Why It Is Celebrated On 22nd March? | Sakshi
Sakshi News home page

Bihar Diwas: బీహార్‌ @ 113.. ప్రముఖుల శుభాకాంక్షలు

Published Sat, Mar 22 2025 11:10 AM | Last Updated on Sat, Mar 22 2025 11:20 AM

Bihar Diwas: Why It Is Celebrated On 22nd March?

బీహార్‌.. దేశంలో అభివృద్దికి ఆలవాలంగా నిలిచిన ఒక రాష్ట్రం. నేడు బీహార్‌ దినోత్సవం(Bihar Diwas). ప్రతి ఏటా మార్చి 22న బీహార్ ఆవిర్భావ వార్షికోత్సవాన్ని జరుపుకుంటారు. 1912, మార్చి 22న బెంగాల్ ప్రావిన్స్ నుంచి వేరు చేసి, బీహార్‌ను కొత్త రాష్ట్రంగా ఏర్పాటు చేశారు. ఈ రాష్ట్రం ఏర్పడి నేటికి 113 ఏళ్లు. బీహార్‌ దినోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.

భారత చరిత్రలో బీహార్‌కు ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడే బుద్ధుడు(Buddha) జ్ఞానోదయం పొందాడు. పురాతన కాలంలో నలంద విశ్వవిద్యాలయాన్ని ఇక్కడే నెలకొల్పారు. చంద్రగుప్త మౌర్య, అశోకుడు వంటి గొప్ప చక్రవర్తులు బీహార్‌ను ఏలారు. ఖగోళ శాస్త్రవేత్త ఆర్యభట్ట కూడా బీహార్‌లోనే జన్మించాడు. బీహార్ అద్భుతమైన వారసత్వానికి చిహ్నంగా నిలిచింది. బీహార్ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలో జరిగే వేడుకల్లో కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు పాల్గొననున్నారు. బీహార్‌ దినోత్సవం సదర్భంగా ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.

జ్ఞానానికి ఆలవాలం: రాష్ట్రపతి ముర్ము 

 

 బీహార్ రాష్ట్ర స్థాపన దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(President Draupadi Murmu) రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.  సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎ‍క్స్‌’లో ఆమె ఇలా రాశారు బీహార్ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు. పురాతన కాలం నుండి బీహార్ భూమి జ్ఞానం, అభివృద్ధికి కేంద్రంగా వెలుగొందుతోంది. బీహార్ ప్రజలు అభివృద్ధి చెందిన భారతదేశాన్ని తీర్చిదిద్దడంలో తమ వంతు కృషిని కొనసాగిస్తారని నమ్ముతున్నానని అమె పేర్కొన్నారు.

 

సర్వతోముఖాభిృద్ధికి ప్రయత్నిస్తాం: ప్రధాని మోదీ 

 

 బీహార్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని మోదీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఇలా రాశారు ‘బీహార్‌లోని నా సోదరులు, సోదరీమణులందరికీ బీహార్ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు. భారత చరిత్ర గర్వించేలా చేసిన మన రాష్ట్రం  అభివృద్ధి ప్రయాణంలో ఒక ముఖ్యమైన దశను దాటుతోంది. ఇందులో ప్రతిభావంతులైనవారు ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. ఈ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి  మేము నిరంతరం ప్రయత్నిస్తాం’ అని పేర్కొన్నారు.

 

బీహార్‌ కలను సాకారం చేద్దాం: సీఎం నితీష్ కుమార్

 

 బీహార్ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి నితీష్ కుమార్(Chief Minister Nitish Kumar) రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ‘బీహార్ దినోత్సవం సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు. బీహార్‌కు అద్భుతమైన చరిత్ర ఉంది. మనం మన దృఢ సంకల్పంతో బీహార్‌కు అద్భుతమైన భవిష్యత్తును సిద్ధం చేస్తున్నాం. అభివృద్ధి చెందిన బీహార్ కలను సాకారం చేసుకోవడంలో మీరందరూ భాగస్వాములు కావాలని నేను పిలుపునిస్తున్నాను’ అని పేర్కొన్నారు. 

ఇది కూడా చదవండి: విద్యార్థినిపై లైంగిక వేధింపులు.. నిట్‌ ప్రొఫెసర్‌ అరెస్ట్‌

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement