ప్రభుత్వ ఏర్పాటుకు మోదీని ఆహ్వానించిన రాష్ట్రపతి ముర్ము | NDA Alliance Leaders Meet President Droupadi Murmu Updates | Sakshi
Sakshi News home page

ఎన్డీయే మిత్రపక్షాల తీర్మానం అందజేత.. ప్రభుత్వ ఏర్పాటుకు మోదీని ఆహ్వానించిన రాష్ట్రపతి ముర్ము

Published Fri, Jun 7 2024 5:16 PM | Last Updated on Fri, Jun 7 2024 6:28 PM

NDA Alliance Leaders Meet President Droupadi Murmu Updates

న్యూఢిల్లీ, సాక్షి: కేంద్రంలో నరేంద్ర మోదీ నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆహ్వానించారు. శుక్రవారం సాయంత్రం ఎన్డీయే పక్ష నేత నరేంద్ర మోదీ, భాగస్వామ్య పక్ష నేతలు రాష్ట్రపతి భవన్‌కు వెళ్లారు. రాష్ట్రపతి ముర్మును కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు. 

 భాగస్వామ్య పక్షాల నేతలు వెంటరాగా.. మోదీ రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్నారు. తమ కూటమికి మద్దతు ఇస్తున్న పార్టీల లేఖలు, కొత్తగా ఎంపికైన మొత్తం ఎంపీల జాబితాను రాష్ట్రపతికి అందజేశారాయన. ఆ వెంటనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా రాష్ట్రపతి ముర్మును మోదీని ఆహ్వానించారు.

ఎన్డీయే పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నికైన నరేంద్రమోదీ మూడోసారి ప్రధాని కావటం ఇప్పటికే ఖరారైంది. ఆదివారం సాయంత్రం మోదీ ప్రధానిగా కర్తవ్యపథ్‌లో ప్రమాణం చేయనున్నారు.

ఎన్డీయే కూటమిలోని పార్టీల ఎంపీలు ఇవాళ ఎన్డీయే పక్ష నేతగా నరేంద్ర మోదీని ఏకగ్రీవంగా ఎన్నుకున్న విషయం తెలిసిందే. బీజేపీ సొంతంగా 240 సీట్లు గెలువగా.. సొంతంగా మ్యాజిక్‌ ఫిగర్‌ 272 సీట్లను  దాటలేకపోయింది. దీంతో బీజేపీ కూటమిలోని మిత్ర పక్షాల మద్దతు మరోసారి కేంద్రంలో ప్రభుత్వం కొలుదీరనుంది.

మరోవైపు.. కేంద్ర మంత్రి పదవులపై నిన్న ఎన్డీయే భాగస్వామ్య పక్షాల మధ్య సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. అయితే రాష్ట్రపతిని కలిసిన అనంతరం ఎన్డీయే నేతలు మరోసారి భేటీ అయ్యే అవకాశం కనిపిస్తోంది. బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో జరగబోయే భేటీకి మిత్రపక్షాల నేతలంతా హాజరుకానున్నారు. ఇప్పటికే అమిత్‌ షా, అజిత్‌ పవార్‌లు నడ్డా నివాసానికి చేరుకున్నారు. మంత్రి వర్గ కూర్పుపై ఈ భేటీలో ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement