శృంగారం, పోర్నోగ్రఫీ ఒకటేనా? | Erotica and Pornography Put Same Category in India: Amrita Narayanan | Sakshi
Sakshi News home page

శృంగారం, పోర్నోగ్రఫీ ఒకటేనా?

Published Sat, Nov 2 2019 3:37 PM | Last Updated on Sat, Nov 2 2019 4:04 PM

Erotica and Pornography Put Same Category in India: Amrita Narayanan - Sakshi

అమృత నారాయణన్‌, మాధురి బెనర్జీ

న్యూఢిల్లీ: మన దేశంలో శృంగారాన్ని, పోర్నోగ్రఫీని ఒకేవిధంగా చూస్తున్నారని ప్రముఖ రచయిత్రి అమృత నారాయణన్‌ అభిప్రాయపడ్డారు. ఈ రెండింటికీ చాలా తేడా ఉందని.. శృంగారం ఆత్మాశ్రయమని ఇందులో ఒకరిపట్ల ఒకరికి ఆపేక్ష, భావోద్వేగాలు కలగలసి ఉంటాయని వెల్లడించారు. పోర్నోగ్రఫీలో కామం మాత్రమే ఉంటుందని వివరించారు. సాహిత్య ఆజ్‌తక్‌ కార్యక్రమంలో భాగంగా ‘రైటింగ్‌ ఎరోటికా ఇన్‌ ఇండియా’  అంశంపై జరిగిన చర్చలో మాధురి బెనర్జీతో కలిసి ఆమె పాల్గొన్నారు. మన భావాలను స్వేచ్ఛగా వెల్లడించే అవకాశం పుస్తకాలు కల్పిస్తాయని, అందుకే తాను రాయడం మొదలుపెట్టానని అమృత వెల్లడించారు.

‘కష్టపడి పనిచేసే మనుషులున్న దేశంగానే స్వాతంత్ర్యం వచ్చాక మనదేశం గుర్తింపు కోరుకుంది. హార్డ్‌వర్క్‌, లైంగికత రెండింటినీ కలపలేదు. స్వాతంత్ర్యం వచ్చాక సాంస్కృతిక వారసత్వంలో ఈ అంశాన్ని మనం వదిలేశాం. మన దేశానికి ఇంగ్లీషు పరిచయమైన కొత్తలో మనల్ని అనాగరీకులుగా చూశారు. మనం కూడా అలాగే వ్యవహరించాం. నైతిక విలువలను మధ్యతరగతి మీద రుద్దడంతో అది కూడా ఇలాగే కొనసాగింది. ఎందుకంటే దేశాన్ని ప్రమోట్‌ చేయడానికి ఈ ఇమేజ్‌ అవసరమైంది. అయితే పుస్తకాలు చదివినంతమాత్రాన ప్రజలు స్వతంత్రులుగా మారరు. తమంతట తామే ప్రజలు స్వేచ్ఛ సాధించాలి. దీనికి కచ్చితంగా పుస్తకాలు సహాయపడతాయ’ని అమృత వివరించారు. క్లినికల్‌ సైకాలజిస్ట్‌ అయిన ఆమె పారెట్స్‌ ఆఫ్‌ డిజైర్‌, ఏ ప్లెజెంట్‌ కెండ్‌ ఆఫ్‌ హెవీ వంటి పుస్తకాలు రాశారు. భారతదేశ శృంగార చరిత్రపై పరిశోధన కూడా సాగించారు.

మాధురి బెనర్జీ మాట్లాడుతూ.. ‘కామసూత్ర’ స్థాయిలో ‘తమిళ సంగం’ పుస్తకాలకు పేరు రావాల్సివుందని అభిప్రాయపడ్డారు. ఈ పుస్తకాల్లో భావోద్వేగాలు ఉంటాయని, కామసూత్రలో ఎటువంటి ఎమోషన్స్‌ ఉండవని చెప్పారు. శృంగార సాహిత్యంవైపు ఎందుకు మొగ్గుచూపారని ప్రశ్నించగా.. ‘నేను మానవ సంబంధాల గురించి మాట్లాడుతున్నాను. మహిళ కన్యత్వాన్ని కోల్పోతే సమాజం ఎలా స్పందిస్తుందనే దాని గురించి నా మొదటి పుస్తకంలో రాశాను. మన దేశంలో సెక్సువాలిటీ గురించి బహిరంగంగా మాట్లాడరు. నా పుస్తకం 2010లో విడుదలైంది. లైంగిక​త గురించి చర్చ జరగాలని ఈ పుస్తకం రాశాను. కానీ నా లక్ష్యం నెరవేరలేదు. నా పుస్తకాలు లైంగికత, శృంగారానికి పరిమితం కావు. మానవ సంబంధాలను లోతుగా చర్చిస్తాయి. శృంగార సాహిత్యాన్ని మన విద్యావ్యవస్థలో భాగం చేయాలి. లైంగికత గురించి గోప్యత పాటిస్తుండటంతో పిల్లలు ఇంటర్నెట్‌ను ఆశ్రయించి పెడతోవ పడుతున్నారు. లైంగికతపై పిల్లలకు సదావగాహన కల్పించి, వారి భావాలను స్వేచ్ఛగా వెల్లడించేలా చేయాల’ని చెప్పారు. మాధురి బెనర్జీ.. లాసింగ్‌ మై వర్జినిటీ, గాళ్స్‌ నైటవుట్‌, మై క్లింజీ గాళ్‌ఫ్రెండ్‌, అడ్వాంటేజ్‌ లవ్‌, ఫర్‌బిడెన్‌ డిజైర్స్‌ వంటి శృంగార సాహిత్య పుస్తకాలు రాశారు. (చదవండి: పోర్న్‌ ఎక్కువగా చూడటం వల్ల...)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement