Madhuri
-
ఎంపీగా పోటీచేయనున్న ప్రముఖ హీరోయిన్
ప్రముఖ బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్ 2024 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడంపై నిత్యం చర్చలు జరుగుతున్నాయి. ఆమె బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈలోగా, మహారాష్ట్రలోని ముంబై లోక్‌సభ నియోజకవర్గంలో మాధురీ దీక్షిత్ బ్యానర్లు వెలిశాయి. బీజేపీ ప్రస్తుత ఎంపీ పూనమ్ మహాజన్ స్థానంలో వచ్చే ఎన్నికల్లో ఆమె పోటీ చేసే సూచనలు కనిపిస్తున్నాయి. మాధురీ దీక్షిత్ రాజకీయాల్లోకి వస్తారనే వార్తలు చాలా రోజుల నుంచే వినిపిస్తున్నాయి. ఈ పుకార్లకు బలం చేకూర్చేందుకు బీజేపీ సీనియర్ నేతలతో ఆమె టచ్‌లో ఉంది. కొద్ది రోజుల క్రితం కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముంబైలోని మాధురీ దీక్షిత్ ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా మోదీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులకు సంబంధించిన బుక్‌లెట్‌ను నటికి షా బహుమతిగా ఇచ్చారు. దీని తర్వాత మాధురీ దీక్షిత్ బీజేపీలో చేరుతారనే చర్చకు మరింత బలం చేకూరింది. కాబట్టి ఆమె ఎన్నికల రంగంలోకి దిగే అవకాశం దాదాపు ఖాయం అయినట్లే. ఈ విషయంపై ఇప్పటి వరకు మాధురి ఎలాంటి స్పందనా ఇవ్వలేదు. ఉత్తర మధ్య ముంబై లోక్‌సభ నియోజకవర్గాన్ని దివంగత బీజేపీ నేత ప్రమోద్ మహాజన్ కుమార్తె పూనమ్ మహాజన్ పాలిస్తున్నారు. ఈ నియోజకవర్గం నుంచి 2014, 2019లో వరుసగా రెండుసార్లు విజయం సాధించారు. ప్రస్తుతం సాయిబాబ వార్షిక ఉత్సవాల సందర్భంగా ఈ ప్రాంతమంతా నటి మాధురీ దీక్షిత్ బ్యానర్లు వెలిశాయి. ఇందులో విశేషమేమిటంటే.. అక్కడ మాధురీ దీక్షిత్ బ్యానర్ లేదా ఫ్లెక్స్ బహిరంగంగా పెట్టడం ఇదే తొలిసారి. ముంబైలోని మొత్తం 6 లోక్‌సభ నియోజకవర్గాల్లో నార్త్-ముంబై, నార్త్ సెంట్రల్ ముంబైలు బీజేపీకి అత్యంత బలమైన రెండు నియోజకవర్గాలు. వీటిలో పూనమ్ మహాజన్ నియోజకవర్గం నార్త్ సెంట్రల్ ముంబై. ఈ నియోజకవర్గంలో మొత్తం ఆరుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ మొత్తం లోక్‌సభ నియోజకవర్గం ఎక్కువగా బీజేపీ, షిండే గ్రూపు ఆధిపత్యంలో ఉంది. పూనమ్ మహాజన్ ఈ నియోజకవర్గం నుంచి వరుసగా రెండుసార్లు విజయం సాధించారు. కాబట్టి ఈ నియోజకవర్గం ప్రస్తుతం బీజేపీకి అనుకూలమైనదిగా చెప్పవచ్చు. లోక్‌సభ ఎన్నికల్లో నటి మాధురీ దీక్షిత్ బీజేపీ నుంచి ముంబైలో పోటీ చేస్తారని గత కొన్ని నెలలుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయాన్ని నటి మాత్రమే కాదు బీజేపీ పార్టీ కూడా ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు. దీనిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర బావాంకులే మాట్లాడినా ఇంతవరకు దీనిపై ఎలాంటి ప్రతిపాదన జరగలేదని ఆయన చెప్పారు. ఈ విషయంలో పార్టీ నేతల నిర్ణయమే అంతిమమని ఆయన అన్నారు. నటి మాధురీ దీక్షిత్‌కు సంబంధించిన ఆ బ్యానర్స్‌తో బీజేపీ ఎన్నికలతో ఎటువంటి సంబంధం లేదని అక్కడి నేతలు కొందరు చెప్పుకొస్తున్నారు. మోదీ ప్రభుత్వం చేస్తున్న పనులను ప్రముఖులకు, వ్యాపారులకు, సినీ పరిశ్రమకు చెందిన వారికి చేరవేసే పని కొన్ని నెలలుగా అక్కడి పార్టీలో సాగుతోంది. దీంతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. నటి మాధురీ దీక్షిత్ ఇంటికి వెళ్లారు. అయితే మాధురీ దీక్షిత్ ఎన్నికల్లో పోటీ చేస్తారా లేదా? ఈ విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని బీజేపీ వర్గాలు తెలిపాయి. -
హ్యాపీ పేరెంటింగ్: వసపిట్ట పాఠాలు
తల్లిదండ్రులుగా పిల్లలను చూసుకోవాల్సిన విధానాన్ని, తల్లిగా తన అనుభవాన్ని కళ్లకు కడుతూ యూ ట్యూబర్‌గా రాణిస్తోంది హైదరాబాద్ కొండాపూర్‌లో ఉంటున్న చిలుకూరి కృష్ణమాధురి, నాలుగు, ఏడాదిన్నర వయసున్న పిల్లలతో కలిసి, తన స్వీయ అనుభవాలను షేర్ చేస్తుంటుంది. మాధురి మూడేళ్లుగా చేస్తున్న ఈ ప్రయత్నాలు... పిల్లల పెంపకంలో తను తీసుకునే జాగ్రత్తలు ఎంతోమంది తల్లులకు పాఠాలు అవుతున్నాయి. ఈ విషయాల గురించి మాధురి మాట్లాడుతూ ... ‘‘నేను పుట్టి పెరిగింది రాజమండ్రిలో. మావారిది గుంటూరు. మా వారి ఉద్యోగరీత్యా బెంగళూరులో ఉండేవాళ్లం. సాఫ్ట్వేర్ ఉద్యోగిగా ఉన్న నేను పిల్లల పుట్టడంతో ఇంటి దగ్గరే ఉండిపోయాను. పిల్లలపై తపన, వారి ఆరోగ్య జాగ్రత్తలు, పెంపకం విషయాలన్నీ తల్లిగా నాకు ప్రతిరోజూ ఓ పాఠమే. వీటిని నలుగురితో పంచుకుంటే కొంతమంది తల్లులకైనా ఉపయోగపడుతుంది కదా అని సరదాగా వీడియోలు తీసి, యూ ట్యూబ్‌లో పోస్ట్ చేసేదాన్ని. వాయిస్ ఆఫ్ వసపిట్ట పిల్లల అల్లరి మాటలకు పెద్దవాళ్లు ముద్దుగా పెట్టే పేరు వసపిట్ట. నలుగురిలో ప్రత్యేకంగా ఉండాలని చిన్నప్పటి నుంచి కాస్త ఎక్కువగా మాట్లాడేదాన్ని. అందుకే, అందరూ నన్ను వసపిట్ట అని పిలిచేవారు. దీంతో ఛానెల్‌కి ఇదే పేరు బాగుంటుందని ఎంచుకున్నాను. మూడేళ్లు అవుతోంది ఇది స్టార్ట్ చేసి. బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు వచ్చాక నా పోస్ట్‌లు మరిన్ని పెరిగాయి. పెంపకాన్ని పరిచయం చేస్తూ.. అమ్మ తన పిల్లలను ఏ విధంగా పెంచుతుందనే విషయాల గురించి వెతికితే తెలుగులో ఎక్కువ బ్లాగర్స్ లేరు. ఉన్నా, వివరంగా చెప్పేవారు లేరు. పిల్లల పెంపకం అనగానే చాలా వరకు డాక్టర్లు, డైటీషియన్లు కనిపిస్తారు. వాళ్లు చెప్పేవి అందరూ ఆచరణలో పెడుతున్నారో లేదో తెలియదు. నేను డాక్టర్ దగ్గరకు పిల్లలను తీసుకెళ్లినప్పుడు, అక్కడ వారిచ్చిన మందులు, జాగ్రత్తల నుంచి అన్నీ నా ఛానెల్ ద్వారా పరిచయం చేస్తుంటాను. రోజువారి పనులు చిన్న పిల్లలున్న ఇల్లు ఎలా ఉంటుందో తల్లులందరికీ అనుభవమే. ఇల్లు పీకి పందిరేస్తారు అంటుంటారు. ఇలాంటప్పుడు చిన్నపిల్లలకు క్రమశిక్షణ ఎలా అలవాటు చేయాలి, దుమ్ము, కాలుష్యం నుంచి వారిని ఎలా కాపాడాలి, టీవీ చూడకుండా తినడం ఎలా అలవాటు చేయాలి, స్క్రీన్ టైమ్ ఎందుకు తగ్గించాలి.. ఇలాంటివి పిల్లలను ఇన్వాల్వ్ చేసి చెప్పడం వల్ల చాలా మంది కనెక్ట్ అయ్యారు. అంతేకాదు, వాళ్లంతట వాళ్లు పనులు చేసుకోవడం, వంటలో సాయం చేయడం.. వంటివి పిల్లలకు పెద్దవాళ్లు అలవాటు చేయాలి. వీటిని మా పిల్లలను చూపిస్తూ ‘హ్యాపీ పేరెంటింగ్’ అనేది తెలియజేయాలనుకున్నాను. అదే చేస్తున్నాను. ఆనందకరమైన లక్ష్యం మదర్ హుడ్, ఫాదర్ హుడ్ ఎంజాయ్ చేస్తూ పిల్లలు కూడా మంచి ఫీలింగ్‌తో పెరగాలనేది నా ఆలోచన. మేం సమస్యలను ఎలా అధిగమిస్తున్నామో కూడా చూపిస్తున్నాను. వీటిని చూడటానికి నాలుగు లక్షలకు పైగా వీక్షకులున్నారు. వీరిలో పిల్లలున్నవారు 70 శాతం మంది ఉన్నారు. నా వీడియోలు చూసి తాము కూడా బ్లాగ్స్ చేస్తున్నామని కొందరు చెబుతుంటారు. ఆరోగ్య జాగ్రత్తలు... వీక్షకులలో చాలా మంది డాక్టరు చెప్పే జాగ్రత్తలు, కిడ్స్ ఫుడ్ గురించి సలహాలు సూచనలు అడుగుతుంటారు. పిల్లలు సరిగా తినరు అనేది పెద్దలు ప్రతిసారి చెబుతుంటారు. కానీ, ఎందుకు తినరు, ఎలా తింటారు.. అనే వివరాలను మా పిల్లలను ఉదాహరణగా చూపిస్తూ వివరిస్తుంటాను. వివిధ సమయాలలో పిల్లల ప్రవర్తన, మనం వారితో మాట్లాడటం, ్రపాక్టికల్గా చేస్తూ చెబుతుంటాను. పిల్లలు కూడా ఈ విధానాన్ని బాగా ఇష్టపడుతున్నారు. మా పిల్లలకు ఓ సారి ర్యాషెష్ వచ్చాయి. వాటిని ప్రాక్టికల్‌గా చూపించి, డాక్టరు చెప్పిన సూచనలతో పాటు, నేను స్వయంగా ఎలాంటి కేర్ తీసుకుంటున్నానో చూపించాను. అలాగే.. డెంటల్ ట్రీట్మెంట్, గర్భిణిగా ఉన్నప్పుడు, తల్లిపాల ప్రాముఖ్యత.. ఆ సమయాల్లో నేనెలాంటి జాగ్రత్తలు తీసుకున్నాను.. మరికొన్ని ఇతరుల ద్వారా సేకరించిన సూచనలూ ఇస్తుంటాను. మా నాన్న రైల్వేలో ఉద్యోగి. చిన్నప్పటి నుంచి కుటుంబంలో ప్రతి విషయంలో నా అభిప్రాయాన్ని కూడా అడిగేవారు. అలా వారి నుంచే నాకు నా పిల్లల పెంపకాన్ని మరింతగా నలుగురికి తెలియజేయాలనే ఆలోచన పెరుగుతూ వచ్చింది’’ అని తల్లిగా తన అనుభవ పాఠాలను ఆనందంగా వివరించారు మాధురి. – నిర్మలారెడ్డి -
మగవాళ్ల విందు.. తింటే పసందు
సాక్షి, తిరువొత్తియూరు: సాధారణంగా గొప్ప వంటను గురించి చెప్పాలంటే నలభీమ పాకం అని వర్ణిస్తుంటారు. ఆరితేరిన వంటగాళ్ల గురించి చెప్పాలంటే చారిత్రకపరంగా, సాంస్కృతిక పరంగా మగవాళ్లనే ఉదాహరణగా చెబుతుంటారు. దీన్ని నిజం చేస్తూ.. మదురై జిల్లా తిరుమంగళం సమీపం కరడిక్కల్ పంచాయతీలోని గ్రామం అనుపంపట్టి గ్రామంలో శనివారం చేపట్టిన మాంసాహార విందుకు వేలామంది పురుషులు హాజరయ్యారు. (కావల్ దైవం) కాపలా దేవుడుగా ప్రసిద్ధి చెందిన కరుపారై ముత్తయ్య సామి ఆలయంలో ఏటా మార్గళి మాసంలో పౌర్ణమి మరుసటి రోజున ఈ విందు కార్యక్రమం నిర్వహిస్తారు. ఇక్కడ భోజనం చేస్తే వీరులైన మగ సంతానం వృద్ధి చెందడంతో పాటు వంశం అభివృద్ధి చెందుతుందని భక్తుల నమ్మకం. శుక్రవారం అర్ధరాత్రి పూజలు ప్రారంభించి 60కి పైగా మేకలతో 50 బస్తాల బియ్యంతో మాంసాహార భోజనం తయారు చేశారు. శనివారం ఉదయం ముత్తయ్యస్వామికి ప్రత్యేక పూజలు చేసి తరువాత అందరికీ విందు పెట్టారు. (చదవండి: తమిళనాడులో దారుణం..) -
మాధురీ జైన్‌కు భారత్‌పే షాక్
న్యూఢిల్లీ: ఫిన్‌టెక్ కంపెనీ భారత్‌పే తాజాగా కంపెనీ సహవ్యవస్థాపకుడు, ఎండీ అష్నీర్ గ్రోవర్ భార్య మాధురీ జైన్ గ్రోవర్‌కు ఉద్వాసన పలికింది. ఆర్థిక అక్రమాలకు పాల్పడిన అభియోగాలతో బోర్డు నుంచి ఆమెను తప్పించినట్లు తెలుస్తోంది. మాధురికి గతంలో కేటాయించిన ఉద్యోగ స్టాక్ ఆప్షన్లు(ఇసాప్స్) సైతం కంపెనీ రద్దు చేసింది. కంపెనీ నిధులను వ్యక్తిగత సౌందర్య చికిత్సలకు, ఎలక్ట్రానిక్ వస్తువుల కొనుగోళ్లకు, కుటుంబ ప్రయాణాల(యూఎస్, దుబాయ్)కు వెచ్చించినట్లు వెలువడిన ఆరోపణలతో మాధురిపై చర్యలు తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. అంతేకాకుండా కంపెనీ ఖాతాల నుంచి వ్యక్తిగత సిబ్బందికి చెల్లింపులు, స్నేహపూరిత పార్టీలకు నకిలీ ఇన్వాయిస్లను సృష్టించిన ఆరోపణలు ఎదుర్కొంటున్నట్లు తెలియజేశాయి. వీటిపై మాధురి స్పందించవలసి ఉండగా.. 22 నుంచి ఈమెను సర్వీసుల నుంచి తొలగించినట్లు కంపెనీ ప్రతినిధి ఒకరు స్పష్టం చేశారు. అయితే కారణాలు వెల్లడించలేదు. సమీక్ష ఎఫెక్ట్ భారత్‌పే బోర్డు బయటి వ్యక్తులతో నిర్వహించిన ఆడిట్ నేపథ్యంలో తాజా చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది. రిస్క్‌ల సలహా సంస్థ అల్వారెజ్ అండ్ మార్సల్ ద్వారా కంపెనీ పాలనాపరమైన సమీక్షకు తెరతీసింది. రహస్యంగా ఉంచవలసిన సమాచారాన్ని తండ్రి, సోదరులకు మాధురి వెల్లడించినట్లు ఈ సమీక్షలో తేలిందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. తద్వారా కొన్ని థర్డ్‌పార్టీల ఇన్వాయిస్ సంబంధిత అవకతవకలు జరిగినట్లు తెలియజేశాయి. అన్ని బిల్లులను ఆమె ఆమోదించినట్లు పేర్కొన్నాయి. 2018 అక్టోబర్ నుంచి కంపెనీ ఫైనాన్షియల్ ఇన్చార్జిగా మాధురి వ్యవహరించారు. కాగా.. కొటక్ మహీంద్రా బ్యాంక్ సిబ్బందిపై దుర్భాషలాడటంతోపాటు, ఆర్థిక అవకతవకలకు పాల్పడిన అభియోగాల నేపథ్యంలో మాధురి భర్త గ్రోవర్ సైతం మూడు నెలల సెలవుపై వెళ్లారు. అయితే వీటిని గ్రోవర్ తోసిపుచ్చారు. భర్త గ్రోవర్ సెలవుపై వెళ్లిన కొద్ది రోజుల్లోనే మాధురి సైతం సెలవుపై వెళ్లడం గమనార్హం! -
మదురై జైలులో రూ.100 కోట్లు హాంఫట్
సాక్షి, చెన్నై: మదురై కేంద్ర కారాగారంలో రూ. వంద కోట్లు అవినీతి జరిగినట్టు న్యాయవాది పుగలేంది మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఏసీబీ విచారణకు ఆదేశించాలని కోరారు. ఖైదీలు సిద్ధం చేసిన వస్తువుల్ని ప్రభుత్వ ఆస్పత్రులు తదితర ప్రాంతాలకు తరలించినట్టుగా గణాంకాల్లో జైళ్లశాఖపేర్కొని ఉన్నట్టు సమాచార హక్కు చట్టం మేరకు వివరాల్ని పుగలేంది సేకరించారు. (చదవండి: ప్రాణాలకోసం మూగ జీవీ పాకులాట.. మనసును కదిలించేలా..) ఈ లెక్కలు తప్పుల తడకగా ఉండడంతో కోర్టు తలుపు తట్టారు. మదురై కారాగారంలో 2016–2020 మార్చి వరకు రూ. వంద కోట్లు అవినీతి జరిగినట్టు, జైళ్ల శాఖలోని కొందరి మాయా జాలంతో ప్రభుత్వం నిధులు దుర్వినియోగమైనట్టు ఆరోపిస్తూ పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే హోం శాఖ, జైళ్ల శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని సూచించారు. సమాచార హక్కు చట్టంలో పేర్కొన్న గణాంకాలే అవినీతి జరిగినట్టు స్పష్టం చేస్తున్నాయని, తక్షణం కేసును ఏసీబీ విచారణకు అప్పగించాలని కోర్టుకు విన్నవించారు. ఈ పిటిషన్ సాధ్యమైనంతవరకు త్వరిగతిన విచారణకు వచ్చే అవకాశం ఉంది. (చదవండి: అయ్! బాబోయ్!.. ఒక్కసారిగా గుండె ఆగినంత పనైంది కదరా!) -
విదేశాలకు ‘ద టీ ప్లానెట్’...
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బబుల్ టీ, కశ్మీరీ ఖావా, పీచ్ ప్యాషన్ ఐస్ టీ, వాటర్‌మిలన్ టీ, సాల్టెడ్ క్యారమెల్ మిల్క్ టీ, హాంకాంగ్ మిల్క్ బబుల్ టీ.. ఇలా చెప్పుకుంటూ పోతే నోరూరించే 900 చాయ్ రకాలను హైదరాబాద్ బ్రాండ్ ‘ద టీ ప్లానెట్’ అభివృద్ధి చేసింది. భారత్‌తోపాటు అంతర్జాతీయంగా కస్టమర్లకు ఈ బ్రాండ్ చేరువైంది. వేలాది రుచులను తయారు చేయగల సామర్థ్యం తమకుందని అంటున్నారు ‘ద టీ ప్లానెట్’ ఫౌండర్ మాధురి గనదిన్ని. మహిళలు అరుదుగా ఉండే టీ వ్యాపారంలో అడుగుపెట్టి సత్తా చాటుతున్నారు. కంపెనీకి తానే బ్రాండ్ అంబాసిడర్. సంస్థ ప్రస్థానం, భవిష్యత్ ప్రణాళికలు ఆమె మాటల్లోనే.. దశాబ్ద కాలంపైగా.. బీపీవో సేవల కంపెనీని 2007లో ప్రారంభించాను. మాంద్యం కారణంగా 2010లో మూసేయాల్సి వచ్చింది. నా జీవిత భాగస్వామి శ్రీనివాస్ గనదిన్ని న్యూయార్క్‌లో ఎంబీఏ చదువుతున్న రోజుల్లో శ్రీలంక నుంచి నాణ్యమైన టీ పొడులను సేకరించి విక్రయించేవారు. 2010లో ఆయన భారత్ రాగానే వ్యాపారాన్ని విస్తరించాం. 15 దేశాలు తిరిగి అవగాహన పెంచుకున్నాను. ద టీ ప్లానెట్ పేరుతో సొంత బ్రాండ్‌లో ఉత్పత్తులను ప్రవేశపెట్టాం. 900 రకాల రుచులను పరిచయం చేశాం. కొత్త ఫ్లేవర్లు జోడిస్తూనే ఉంటాం. ద టీ ప్లానెట్ స్టోర్లలో 80 రుచులను కస్టమర్లు ఆస్వాదించొచ్చు. బబుల్ టీ మా ప్రత్యేకత.. టీ వినియోగం అంతకంతకూ పెరుగుతోంది. ముఖ్యంగా గతేడాది వ్యవస్థాగతంగా ఔత్సాహిక యువత చాలా మంది టీ హోటళ్ల వ్యాపారంలోకి ప్రవేశించారు. టాటా సైతం ఎంట్రీ ఇచ్చిందంటే మార్కెట్ అవకాశాలను అర్థం చేసుకోవచ్చు. కన్సల్టింగ్ సేవలతోపాటు ఎగుమతులు చేస్తున్న 15 బ్రాండ్లకు థర్డ్ పార్టీగా టీ పొడులను సరఫరా చేస్తున్నాం. విదేశాలకు మా సొంత బ్రాండ్ టీని ప్రవేశపెట్టనున్నాం. ఇక మా ఔట్లెట్లలో బబుల్ టీ ప్రత్యేకం. దీనికి అవసరమైన ముడి పదార్థాలను భారత్‌లో మేము మాత్రమే తయారు చేస్తున్నాం. కార్డి ప్లస్ పేరుతో రోగనిరోధక శక్తిని పెంచే టీ సైతం రూపొందించాం. డిసెంబర్‌కల్లా 250 ఔట్లెట్లు.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, పోలాండ్‌తో కలిపి 40 ద టీ ప్లానెట్ స్టోర్లు ఫ్రాంచైజీ విధానంలో నిర్వహిస్తున్నాం. ప్రత్యక్షంగా, పరోక్షంగా 225 మంది ఉద్యోగులు ఉన్నారు. ప్రస్తుతం ఉన్న డిమాండ్ నేపథ్యంలో 50 నగరాలకు విస్తరించడం ద్వారా ఈ ఏడాది డిసెంబరుకల్లా 250 కేంద్రాల స్థాయికి చేరుకోవాలన్నది లక్ష్యం. ఏటా 10 లక్షల కిలోల టీ పౌడర్ ప్రాసెస్ చేయగల సామర్థ్యం ఉంది. 10 దేశాల నుంచి సేకరించిన 400 రకాల క్రీమర్స్, మసాలాలు, ఫ్లేవర్స్, పూలు, మొక్కలు, పండ్లతో టీ పొడులను తయారు చేసి విస్తృత పరిశోధన తర్వాత మార్కెట్లోకి తీసుకొస్తున్నాం. -
ట్రిపుల్ఐటీ విద్యార్థిని మాధురి ఆత్మహత్య
సాక్షి, నూజివీడు: నూజివీడు ట్రిపుల్ఐటీ క్యాంపస్‌లో నిర్వహిస్తున్న శ్రీకాకుళం ట్రిపుల్‌ఐటీలో సివిల్ ఇంజనీరింగ్ తృతీయ సంవత్సరం చదువుతున్న మొల్లి మాధురి (20) సోమవారం ఆత్మహత్య చేసుకుంది. హోలీ కావడంతో తరగతులు లేకపోవడంతో విద్యార్థులందరూ హాస్టల్లోనే ఉన్నారు. ఐ3 హాస్టల్ భవనంలోని మూడో అంతస్తులో తన రూమ్‌లోనే మాధురి ఉండగా, మధ్యాహ్నం 12 గంటల సమయంలో తోటి విద్యార్థినులు భోజనానికి రమ్మని పిలవగా తాను తరువాత తింటానని, మీరు తినేసి రమ్మని బదులిచ్చి రూమ్‌లోనే ఉండిపోయింది. దీంతో వారు మెస్‌కు వెళ్లి భోజనం చేసి తిరిగి వచ్చిన తరువాత రూమ్ తలుపులు ఎంత కొట్టినా తీయకపోవడంతో కేర్‌టేకర్‌కు చెప్పారు. దీంతో కేర్‌టేకర్ సెక్యూరిటీ వాళ్లకు తెలపగా వారు వచ్చి తలుపులు పగలగొట్టి చూడగా ఉరివేసుకుని ఉంది. ఆమెను కిందకు దించి చూడగా చనిపోయింది. దీంతో మృతదేహాన్ని పట్టణంలోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. రెండు రోజుల క్రితమే సెమిస్టర్ పరీక్షలు ముగిశాయి. ఈమె స్వగ్రామం తూర్పుగోదావరి జిల్లా కాకినాడ నగరంలోని గాంధీనగర్. విద్యార్థిని మృతి చెందిన విషయం తెలుసుకుని నూజివీడు ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ ఆచార్య జీవీఆర్ శ్రీనివాసరావు, సిబ్బంది తదితరులు భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. సీఐ ఎం.వెంకటనారాయణ, ఎస్ఐ అప్పారి గణేష్‌కుమార్‌లు ఘటనా స్థలానికి చేరుకుని హాస్టల్ గదిని పరిశీలించారు. రూమ్‌లోని తోటి విద్యార్థులను పోలీసులు విచారించగా, ప్రేమ వ్యవహారమే కారణమని చెప్పినట్లు సమాచారం. -
హైటెక్ సిటీ: పబ్ ప్రారంభం సెలబ్రెటీల సందడి..
-
కర్రలు విరిగేటట్లు కొట్టి.. వీడియో తీశారు
సాక్షి, విశాఖపట్నం: ‘సెల్‌ఫోన్ దొంగలించాడన్న అనుమానంతో దళితుడైన పర్రి శ్రీకాంత్‌ను దారుణంగా హింసించారు. కర్రలు విరిగేటట్టు కొట్టారు. చిత్రహింసలు పెడుతూ వీడియోలు తీశారు. శిరోముండనం చేశారు. ఇందుకు సంబంధించిన అన్ని సాక్ష్యాలు సేకరించాం. ఈ దారుణ ఘటనలో ఉన్నవారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతో పాటు ఇతర సెక్షన్ల కింద కేసులు నమోదు చేశాం. ఏడుగురిని అరెస్టు చేశాం’ అని విశాఖపట్నం పోలీస్ కమిషనర్ మనీష్‌కుమార్ సిన్హా తెలిపారు. జనసేన అధినేత పవన్‌కల్యాణ్ అభిమాని, బిగ్‌బాస్ ఫేమ్, సినీ దర్శకుడు నూతన్‌నాయుడు ఇంట్లో 20 ఏళ్ల దళిత యువకుడు పర్రి శ్రీకాంత్‌కు శిరోముండనం చేసి దారుణంగా హింసించిన సంఘటనకు సంబంధించిన వివరాలు కమిషనర్ శనివారం మీడియాకు వివరించారు. కమిషనర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇంటికి పిలిచి కొట్టారు.. ► విశాఖలోని గోపాల్కృష్ణనగర్లో నివాసం ంటున్న నూతన్‌నాయుడు ఇంట్లో శ్రీకాకుళం జిల్లా పలాస ప్రాంతానికి చెందిన శ్రీకాంత్ నాలుగు నెలల క్రితం పనికి చేరాడు. వ్యక్తిగత కారణాలతో నెల రోజుల క్రితం పని మానేశాడు. ► తమ ఇంట్లో ఐఫోన్ పోయిందని.. దాని గురించి మాట్లాడాలి ఇంటికి రావాలని నూతన్‌నాయుడి భార్య ప్రియామాధురి గతంలో శ్రీకాంత్‌ని పిలిచి విచారించారు. ► మళ్లీ శుక్రవారం మధ్యాహ్నం మరోసారి శ్రీకాంత్‌ను ఇంటికి పిలిచి తన సిబ్బందితో కొట్టించారు. బార్బర్‌ను పిలిపించి గుండు గీయించారు. ఈ దారుణాన్ని సెల్ఫోన్లో చిత్రీకరించారు. ► అనంతరం అక్కడ నుంచి బయటపడిన శ్రీకాంత్ పెందుర్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంటనే ఆధారాల సేకరణ ► ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు నూతన్‌నాయుడి ఇంటికి వెళ్లి సీసీ కెమెరాల ఫుటేజీతో పాటు ఇతర ఆధారాలను సేకరించారు. ► వీటి ఆధారంగా నూతన్‌నాయుడి భార్య ప్రియా మాధురి, బ్యూటీషియన్ ఇందిరారాణి, సూపర్వైజర్ వరహాలు, బార్బర్ రవికుమార్, పనిమనుషులు బాల గంగాధర్, సౌజన్య, ఝాన్సీలను అరెస్టు చేశారు. ► వీరికి కోవిడ్ పరీక్ష అనంతరం జ్యుడీషియల్ కస్టడీకి అప్పగిస్తామని సీపీ తెలిపారు. ► ఈ సంఘటనలో నూతన్‌నాయుడి ప్రమేయంపై కూడా దర్యాప్తు చేస్తున్నామని, ఏ ఒక్కరినీ విడిచిపెట్టబోమని స్పష్టం చేశారు. ► మీడియా సమావేశంలో డీసీపీ(క్రైం) సురేష్‌బాబు, ఏసీపీ శ్రావణ్‌కుమార్, ఎస్సీ, ఎస్టీ ఏసీపీ త్రినాథ్ తదితరులు పాల్గొన్నారు. పగబట్టి కొట్టారు తాను వాళ్ల ఇంట్లో ఉద్యోగం మానేసి వేరోచోట చేరాననే పగతోనే తనను కొట్టి, గుండు గీయించారని బాధితుడు శ్రీకాంత్ మీడియాతో చెప్పాడు. సెల్‌ఫోన్‌తో తనకేమీ సంబంధం లేదంటున్నా వినకుండా ఇందిరారాణి దారుణంగా కొట్టిందన్నారు. తన ఫోటోలు స్కాన్ చేసి బయట పెట్టావంటూ ఇందిర ఆరోపించిందని తెలిపాడు. తానిచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు చర్యలు చేపట్టడం సంతోషంగా ఉందన్నాడు. -
నరుడి బ్రతుకు నటన
తల్లాడ సాయికృష్ణ, మాధురి చిగురు జంటగా తనికెళ్ల భరణి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘నరుడి బ్రతుకు నటన’. జానీని దర్శకుడిగా పరిచయం చేస్తూ శ్రీ అన్నపూర్ణ క్రియేష¯Œ ్స పతాకంపై తల్లాడ శ్రీనివాస్ నిర్మిస్తున్న ఈ చిత్రం 70శాతం టాకీ పార్ట్ పూర్తి చేసుకుంది. ‘‘హారర్ నేపథ్యంలో రూపొందుతోన్న చిత్రమిది. శివ కాకు అందించిన కథ ప్రేక్షకులకు కొత్తగా ఉంటుంది. ఇప్పటి వరకు రెండు షెడ్యూల్స్ పూర్తయ్యాయి. మరొక షెడ్యూల్‌తో టాకీ పార్ట్ పూర్తవుతుంది’’ అన్నారు శ్రీనివాస్. ‘‘జర్నలిస్ట్‌గా వృత్తి నిర్వహిస్తున్న నాకు దర్శకత్వం చేయాలనే కోరిక ఈ సినిమాతో నెరవేరింది.’’ అన్నారు జాని. ‘‘నేను నటించిన మూడు సినిమాలు వైవిధ్యమైన కథలతోనే ఉంటాయి. ఈ చిత్రం కూడా చాలా వైవిధ్యంగా ఉంటుంది. ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ చివరి షెడ్యూల్‌ను షూట్ చేసేలా ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: శ్యాం–శ్రీకాంత్. -
రక్షణ దళానికి త్రీస్టార్ డాక్టర్
డాక్టర్ మాధురీ కణిట్కర్ శనివారం న్యూఢిల్లీలో పదోన్నతిపై లెఫ్ట్‌నెంట్ జనరల్ బాధ్యతలు స్వీకరించగానే ఆమె భుజం మీదకు భారత సైన్యంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన మూడు నక్షత్రాల గుర్తు వచ్చి వాలింది. రక్షణ దళాల వైద్య సిబ్బందికి కొత్త డిప్యూటీ చీఫ్ ఇప్పుడు ఆమె! భారత రక్షణ దళాల చరిత్రలో ఇంతవరకు ఇద్దరే మహిళా లెఫ్ట్‌నెంట్ జనరల్స్. మాధురి ఇప్పుడు మూడో జనరల్ కాగా.. మాధురి, ఆమె భర్త త్రీస్టార్ ఉన్న తొలి దంపతులుగా ఇక నుంచీ గుర్తింపు పొందుతారు. మిలటరీ రంగు చీర, జాకెట్, పైన ఆర్మీ క్యాంప్ ధరించి ఉన్న మాధురికి సైనిక దళ వైద్య సేవల (ఎ.ఎఫ్.ఎం.ఎస్) డైరెక్టర్ జనరల్ లెఫ్ట్‌నెంట్ అరూప్ బెనర్జీ భుజకీర్తులను తగిలిస్తున్నప్పుడు, పక్కనే ఉన్న మాధురి భర్త రాజీవ్ కణిక్టర్ కూడా ఆమె‘ఎపలెట్స్’ (భుజంపై ప్రతిష్ట చిహ్నాలు)ని ఎంతో గర్వంగా సవరించారు. ముందు డీజీకి అభివాదం తెలియజేసి, ఆ వెంటనే ‘థ్యాంక్యూ సర్’ అని భర్తతో అన్నారు డాక్టర్ మాధురి. రాజీవ్ కూడా సైనికాధికారే. ‘ఆర్మ్డ్ కోర్స్’ లో లెఫ్ట్‌నెంట్‌గా ఉండి, 2017 లో క్వార్టర్‌మాస్టర్ జనరల్‌గా త్రీ–స్టార్ హోదాలో రిటైర్ అయ్యారు. ఇప్పుడు డాక్టర్ మాధురికి కూడా త్రీస్టార్ రావడంతో భారత రక్షణ దళంలోనే తొలి త్రీస్టార్ కపుల్‌గా ఈ భార్యాభర్తలకు ప్రత్యేక గుర్తింపు లభించింది. ఇందుకు దక్కవలసిన అభినందనలు పూర్తిగా మాధురికే అయినప్పటికీ, ‘‘ఉద్యోగం కష్టంగా అనిపించిన పరిస్థితుల్లో.. ‘ఇలాంటప్పుడు చేసేదే ఉద్యోగం’ అని ధైర్యం చెప్పి ఆర్మీలోంచి నన్ను బయటికి రానివ్వకుండా ఆపిన నా భర్తదే ఈ క్రెడిట్ అంతా’’ అని నవ్వుతూ అన్నారు డాక్టర్ మాధురి. త్రివిధ దళాల ‘నాడీ’మణి ఎంబీబిఎస్లో గోల్డ్ మెడల్ పెళ్లయిన 36 ఏళ్లలో 12 ఏళ్లు మాత్రమే భార్యాభర్తలుగా ఉన్నారు డాక్టర్ మాధురి, రాజీవ్. మిగతా సమయమంతా భారత సైనికులుగానే ఉన్నారు. రక్షణ దళ ఉద్యోగాల్లో శిక్షణ తీసుకుంటున్నప్పటి నుంచే ఒకరిని మించిన వారొకరిగా ఉన్నారు వీళ్లు! నేషనల్ డిఫెన్స్ అకాడమీ నుంచి రాష్ట్రపతి గోల్డ్ మెడల్‌తో బయటికి వచ్చారు రాజీవ్. మాధురి కూడా అంతే. పుణెలోని ‘ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజ్’లో బెస్ట్ ఎం.బి.బి.ఎస్. స్టూడెంట్‌గా రాష్ట్రపతి నుంచి గోల్డ్ మెడల్ అందుకున్నారు. తర్వాత అదే ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజీకి డీన్, డిప్యూటీ కమాండెంట్ అయ్యారు. అలా అయిన తొలి మహిళా అధికారి కూడా ఆమే! శనివారం నాటి పదోన్నతితో రక్షణ దళాల్లోని లెఫ్ట్‌నెంట్ జనరల్ ర్యాంకుకు చేరిన మూడో మహిళా అధికారి అయ్యారు మాధురి. తొలి మహిళ ఎయిర్ మార్షల్ పద్మావతీ బందోపాధ్యాయ్, రెండో మహిళ వైస్ అడ్మిరల్ పునీతా ఆరోరా. వాళ్లిద్దరూ రిటైర్ అయ్యారు. సైన్యంలోని అన్ని విభాగాలలో స్త్రీ పురుష సమానత్వాన్ని కల్పించడానికి ‘పర్మినెంట్ కమిషన్’లోకి మహిళల్ని కూడా అనుమతించాలని ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది కానీ.. భారత సైన్యంలోని మెడికల్ వింగ్‌లో మొదటి నుంచీ మహిళలకు పర్మినెంట్ కమిషన్‌లో అవకాశం ఉంది. అందువల్లే డాక్టర్ మాధురి విశిష్ట సేవలకు ఇప్పుడీ ఉన్నతస్థాయి హోదా లభించడం సాధ్యమైంది. సైకిల్‌పై షికారు పీడియాట్రిక్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ మాధురి 1982లో ‘ఆర్మీ మెడికల్ కోర్స్’ (సైనిక వైద్య దళం)లోకి వచ్చారు. ఎం.డి. చేశాక, ఎయిమ్స్‌లో పీడియాట్రిక్ నెఫ్రాలజీ (చిన్నపిల్లల మూత్రపిండ సమస్యలు)లో శిక్షణ పొందారు. ‘ప్రధానమంత్రి శాస్త్ర సాంకేతిక రంగాల వినూత్న ఆవిష్కరణల సలహా మండలి’లో సభ్యులుగా ఉన్నారు. తాజా విధుల్లోకి రాకముందు వరకు ఆర్మీలోని నార్తర్న్ కమాండ్(జమ్మూకశ్మీర్, లఢక్) వైద్యసేవల విభాగానికి అధికారిగా ఉన్నారు. ‘‘అక్కడ పని చేస్తున్నప్పుడు యుద్ధక్షేత్రంలోని ప్రతికూల పరిస్థితుల్లో వైద్య సంరక్షణ ఎంత కీలకమైన బాధ్యతో తెలిసింది. అక్కడ ఏ రోజుకారోజు స్పష్టమైన అత్యున్నతస్థాయి సమన్వయంతో పని చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఢిల్లీ కేంద్రంగా పని చేయవలసి ఉంటుంది కాబట్టి ఆ అనుభవం ఉపయోపడుతుంది’’ అని డాక్టర్ మాధురి అన్నారు. మాధురి కణిట్కర్ కర్ణాటకలోని ధర్వార్లో జన్మించారు. తండ్రి చంద్రకాంత్ గోపాల్రావ్, తల్లి హేమలతా చంద్రకాంత్ ఖోట్. కణిట్కర్ దంపతులకు 1982లో పెళ్లయింది. ఇద్దరు పిల్లలు. నిఖిల్, విభూతి. -
శృంగారం, పోర్నోగ్రఫీ ఒకటేనా?
న్యూఢిల్లీ: మన దేశంలో శృంగారాన్ని, పోర్నోగ్రఫీని ఒకేవిధంగా చూస్తున్నారని ప్రముఖ రచయిత్రి అమృత నారాయణన్ అభిప్రాయపడ్డారు. ఈ రెండింటికీ చాలా తేడా ఉందని.. శృంగారం ఆత్మాశ్రయమని ఇందులో ఒకరిపట్ల ఒకరికి ఆపేక్ష, భావోద్వేగాలు కలగలసి ఉంటాయని వెల్లడించారు. పోర్నోగ్రఫీలో కామం మాత్రమే ఉంటుందని వివరించారు. సాహిత్య ఆజ్‌తక్ కార్యక్రమంలో భాగంగా ‘రైటింగ్ ఎరోటికా ఇన్ ఇండియా’ అంశంపై జరిగిన చర్చలో మాధురి బెనర్జీతో కలిసి ఆమె పాల్గొన్నారు. మన భావాలను స్వేచ్ఛగా వెల్లడించే అవకాశం పుస్తకాలు కల్పిస్తాయని, అందుకే తాను రాయడం మొదలుపెట్టానని అమృత వెల్లడించారు. ‘కష్టపడి పనిచేసే మనుషులున్న దేశంగానే స్వాతంత్ర్యం వచ్చాక మనదేశం గుర్తింపు కోరుకుంది. హార్డ్‌వర్క్, లైంగికత రెండింటినీ కలపలేదు. స్వాతంత్ర్యం వచ్చాక సాంస్కృతిక వారసత్వంలో ఈ అంశాన్ని మనం వదిలేశాం. మన దేశానికి ఇంగ్లీషు పరిచయమైన కొత్తలో మనల్ని అనాగరీకులుగా చూశారు. మనం కూడా అలాగే వ్యవహరించాం. నైతిక విలువలను మధ్యతరగతి మీద రుద్దడంతో అది కూడా ఇలాగే కొనసాగింది. ఎందుకంటే దేశాన్ని ప్రమోట్ చేయడానికి ఈ ఇమేజ్ అవసరమైంది. అయితే పుస్తకాలు చదివినంతమాత్రాన ప్రజలు స్వతంత్రులుగా మారరు. తమంతట తామే ప్రజలు స్వేచ్ఛ సాధించాలి. దీనికి కచ్చితంగా పుస్తకాలు సహాయపడతాయ’ని అమృత వివరించారు. క్లినికల్ సైకాలజిస్ట్ అయిన ఆమె పారెట్స్ ఆఫ్ డిజైర్, ఏ ప్లెజెంట్ కెండ్ ఆఫ్ హెవీ వంటి పుస్తకాలు రాశారు. భారతదేశ శృంగార చరిత్రపై పరిశోధన కూడా సాగించారు. మాధురి బెనర్జీ మాట్లాడుతూ.. ‘కామసూత్ర’ స్థాయిలో ‘తమిళ సంగం’ పుస్తకాలకు పేరు రావాల్సివుందని అభిప్రాయపడ్డారు. ఈ పుస్తకాల్లో భావోద్వేగాలు ఉంటాయని, కామసూత్రలో ఎటువంటి ఎమోషన్స్ ఉండవని చెప్పారు. శృంగార సాహిత్యంవైపు ఎందుకు మొగ్గుచూపారని ప్రశ్నించగా.. ‘నేను మానవ సంబంధాల గురించి మాట్లాడుతున్నాను. మహిళ కన్యత్వాన్ని కోల్పోతే సమాజం ఎలా స్పందిస్తుందనే దాని గురించి నా మొదటి పుస్తకంలో రాశాను. మన దేశంలో సెక్సువాలిటీ గురించి బహిరంగంగా మాట్లాడరు. నా పుస్తకం 2010లో విడుదలైంది. లైంగికత గురించి చర్చ జరగాలని ఈ పుస్తకం రాశాను. కానీ నా లక్ష్యం నెరవేరలేదు. నా పుస్తకాలు లైంగికత, శృంగారానికి పరిమితం కావు. మానవ సంబంధాలను లోతుగా చర్చిస్తాయి. శృంగార సాహిత్యాన్ని మన విద్యావ్యవస్థలో భాగం చేయాలి. లైంగికత గురించి గోప్యత పాటిస్తుండటంతో పిల్లలు ఇంటర్నెట్ను ఆశ్రయించి పెడతోవ పడుతున్నారు. లైంగికతపై పిల్లలకు సదావగాహన కల్పించి, వారి భావాలను స్వేచ్ఛగా వెల్లడించేలా చేయాల’ని చెప్పారు. మాధురి బెనర్జీ.. లాసింగ్ మై వర్జినిటీ, గాళ్స్ నైటవుట్, మై క్లింజీ గాళ్‌ఫ్రెండ్, అడ్వాంటేజ్ లవ్, ఫర్బిడెన్ డిజైర్స్ వంటి శృంగార సాహిత్య పుస్తకాలు రాశారు. (చదవండి: పోర్న్ ఎక్కువగా చూడటం వల్ల...) -
టీవీ..సెల్‌ఫోన్‌కు దూరంగా ఉన్నా
కర్నూలు :కార్డియాలజిస్ట్‌గా పేదలకు సేవ చేస్తానని ఆల్ ఇండియా ర్యాంకర్ మాధురీరెడ్డి తెలిపారు. గత నెల 5న నిర్వహించిన నీట్ పరీక్షకు దేశ వ్యాప్తంగా సుమారు 14 లక్షల మంది హాజరయ్యారు. బుధవారం వెలువడిన ఫలితాల్లో శిరివెళ్ల మండలం గోవిందపల్లెకు చెందిన మాధురీరెడ్డి ఆల్ ఇండియా లెవల్లో 7వ ర్యాంకు సాధించారు. గురువారం కర్నూలుకు వచ్చిన మాధురీరెడ్డికి బంధువులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ‘సాక్షి’తో మాట్లాడారు. ప్రశ్న: మీ కుటుంబ నేపథ్యం? జ: మాది శిరివెళ్ల మండలం గోవిందపల్లె. నాన్న జి.తిరుపతిరెడ్డి హైదరాబాదులో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పని చేస్తున్నారు. అమ్మ జి.పద్మావతి గృహిణి. తమ్ముడు 8వ తరగతి చదువుతున్నాడు. ప్రశ్న: పాఠశాల, కాలేజీ విద్య ఎక్కడ పూర్తి చేశారు? జ: హైదరాబాదులోని క్రిక్ స్కూల్లో 1 నుంచి 7వ తరగతి వరకు, మాదాపూర్‌లోని నారాయణ స్కూల్లో 8 నుంచి 10 వరకు చదివాను. ఇంటర్మీడియెట్ కూడా మదాపూర్‌లోని నారాయణ జూనియర్ కాలేజీలో చదివి 982 మార్కులు సాధించాను. ప్రశ్న:నీట్ కోసం ఎలా ప్రిపేర్ అయ్యారు? జ: ఇంటర్మీడియెట్‌తో పాటు నీట్‌కు ప్రిపేర్ అయ్యాను. ప్రతి రోజు 10 నుంచి 12 గంటలు చదువుకే కేటాయించాను. నీట్ కోసం ప్రత్యేక ప్రణాళికను తయారు చేసుకొని అధ్యాపకుల సలహాలు, సూచనలతో ఒక్కో సబ్జెక్టుకు సమయం కేటాయించుకొని చదివాను. ప్రతి రోజు తరగతి గదిలో క్లాస్‌లో నోట్ తయారు చేసుకొని ఏవైనా డౌట్స్ వస్తే వెంటనే సంబంధిత సబ్జెక్టు లెక్చరర్‌ను అడిగి క్లారీఫై చేసుకునేదాన్ని. ప్రతి అంశాన్ని లోతుగా చదవడం వల్ల అన్ని సబ్జెక్టులపై తక్కువ సమయంలో పట్టు సాధించగలిగాను. ప్రశ్న: నీట్లో ఆల్ ఇండియా స్థాయిలో 7వ ర్యాంకు వస్తుందని అనుకున్నారా? జ: ముందుగానే టాప్ టెన్ లక్ష్యంగా పెట్టుకొనే ప్రిపేర్ అయ్యాను. ఇందు కోసం టీవీ, సెల్‌ఫోన్, ఇంటర్నెట్కు దూరంగా ఉండి చదివాను. ఏపీ ఎంసెట్‌లో రాష్ట్ర స్థాయిలో 5వ ర్యాంకు వచ్చింది. నీట్లో ఆల్ ఇండియా లెవెల్లో 7వ ర్యాంకు రావడం సంతోషంగా ఉంది. ప్రశ్న: నీట్‌కు ప్రిపరేషన్లో పేరెంట్స్ సహకారం ఎలా ఉండేది? జ: అమ్మ, నాన్న చదువులో ఎంతో ప్రోత్సాహించే వారు. లెక్చరర్ల సహకారం కూడా మరువలేనిది. ఎప్పుడైనా టైడ్ అనిపిస్తే బ్యాడ్మింటన్ ఆడి రిలాక్స్ అయ్యేదాన్ని. ప్రశ్న:మెడిసిన్ పూర్తయ్యాక మీ లక్ష్యం? జ: మెడిసిన్ పూర్తయ్యాక కార్డియాలజీ పూర్తి చేసి కార్డియాలజిస్ట్‌గా పేదలకు సేవ చేస్తా. -
‘నీట్’ అమ్మాయిల్లో టాపర్ మాధురీ
అమ్మాయిలే టాప్... 7,97,042 మంది విద్యార్థులు నీట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. ఉత్తీర్ణత శాతం 56.27గా నమోదైంది. ఉత్తీర్ణులైన వారిలో అత్యధికం అమ్మాయిలే. ఈసారి జనరల్ విభాగంలో కటాఫ్ మార్కు 134. టాప్ 50లో నాలుగు... తెలుగు విద్యార్థుల్లో మాధురీరెడ్డి తరువాత ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఖురేషి అస్రా.. 16వ ర్యాంకు, పిల్లి భాను శివతేజ.. 40వ ర్యాంకు, సోడం శ్రీనందన్‌రెడ్డి.. 42 ర్యాంకు సాధించారు. సాక్షి, హైదరాబాద్: జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్)లో తెలంగాణ బిడ్డ మాధురీరెడ్డి దేశవ్యాప్తంగా ఏడో ర్యాంకు సాధించగా, అమ్మాయిల విభాగంలో మొదటి స్థానంలో నిలిచింది. జాతీయస్థాయి టాపర్‌గా రాజస్తాన్‌కు చెందిన నలిన్ ఖండేల్వాల్ 720 మార్కులకుగాను... 701 మార్కులతో మొదటి ర్యాంకు సాధించగా, 695 మార్కులు సాధించి తెలంగాణ విద్యార్థిని జి.మాధురీరెడ్డి ఏడో ర్యాంకులో మెరిసింది. టాప్ 50 ర్యాంకులు సాధించిన విద్యార్థుల మధ్య మార్కుల తేడా 16 మాత్రమే ఉండటం గమనార్హం. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఖురేషి అస్రా.. 16వ ర్యాంకు, పిల్లి భాను శివతేజ.. 40, సోడం శ్రీనందన్‌రెడ్డి.. 42వ ర్యాంకు సాధించారు. గతేడాది కంటే పేపర్ సులువుగా రావడంతో కటాఫ్ మార్కు కూడా పెరిగింది. గతేడాది జనరల్ విభాగంలో కటాఫ్ మార్కు 107 కాగా, ఈసారి 134కు పెరిగింది. దేశవ్యాప్తంగా ఉన్న వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్–2019 ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. మే 5న దేశవ్యాప్తంగా 154 నగరాల్లో 2,546 కేంద్రాల్లో నీట్ పరీక్ష నిర్వహించారు. 15,19,375 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. 14,10,754 మంది పరీక్షకు హాజరయ్యారు. ఒడిశాలో ఫొని తుపాను, కర్ణాటకలో రైలు ఆలస్యం కారణంగా అక్కడి అభ్యర్థుల కోసం గత నెల 20న మరోసారి పరీక్ష నిర్వహించారు. దీంతో ఫలితాలు ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయన్న సందేహాలు నెలకొన్నప్పటికీ... ముందుగా పేర్కొన్నట్లుగానే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఫలితాలు విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 7,97,042 మంది విద్యార్థులు నీట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. మొత్తం ఉత్తీర్ణతా శాతం 56.27గా నమోదైంది. ఉత్తీర్ణులైన వారిలో అత్యధికంగా అమ్మాయిలే ఉన్నారు. 4,45,761 మంది అమ్మాయిలు, 3,51,278 మంది అబ్బాయిలు అర్హత సాధించారు. ఇక ఏపీలో 70.72 శాతంతో 39,039 మంది, తెలంగాణలో 67.44 శాతంతో 33,044 మంది విద్యార్థులు అర్హత సాధించారు. మొత్తం 11 భాషల్లో పరీక్ష నిర్వహించారు. తెలుగు భాషలో రాయడానికి 1796 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మే 29న నీట్ ప్రిలిమినరీ ‘కీ’ని ఎన్టీఏ విడుదల చేసింది. జూన్ 1 వరకు అభ్యర్థుల నుంచి అభ్యంతరాలను స్వీకరించిన అనంతరం తుది ‘కీ’ఫలితాలను వెల్లడించింది. 15 శాతం సీట్లకు అఖిల భారత కౌన్సిలింగ్... నీట్ పరీక్షలో జనరల్ కేటగిరి అభ్యర్థులకు కనీస అర్హత మార్కులను 50 పర్సంటైల్‌గా, ఎస్టీ, ఎస్సీ, బీసీ అభ్యర్థులకు 40 పర్సంటైల్‌గా, దివ్యాంగులకు 45 పర్సంటైల్‌గా నిర్ణయించారు. సీట్ల కేటాయింపులో ఎస్సీ అభ్యర్థులకు 15 శాతం, ఎస్టీ అభ్యర్థులకు 7.5 శాతం, ఓబీసీ అభ్యర్థులకు 27 శాతం రిజర్వేషన్లు వర్తిస్తాయి. నీట్–2019 ద్వారా అఖిల భారత కోటా సీట్లు, రాష్ట్ర ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో సీట్లు, డీమ్డ్ యూనివర్సిటీలు, కేంద్ర సంస్థలు అన్నింటిలోనూ ఈ ర్యాంకుల ఆధారంగానే కేటాయిస్తారు. ఎయిమ్స్, పాండిచ్చేరిలోని జిప్మర్ మినహా అన్నింటిలో ఎంబీబీఎస్ ప్రవేశాలకు నీట్ ర్యాంకుల ద్వారానే భర్తీ చేస్తారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోని 15 శాతం సీట్లను నేషనల్ పూల్‌లోకి తీసుకున్నారు. వాటన్నింటినీ అఖిల భారత కౌన్సిలింగ్లో భర్తీ చేస్తారు. నీట్ ర్యాంకుల ఆధారంగానే రాష్ట్రాల వారీగా మెరిట్ జాబితా రూపొందించి ప్రవేశాలు కల్పిస్తారు. నీట్ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థుల మెరిట్ జాబితాను ‘మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్’ఆధ్వర్యంలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్‌తో పాటు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రూపొందిస్తాయి. నీట్ మెడికల్ మెరిట్ లిస్ట్ ఆధారంగానే ప్రవేశాల ప్రక్రియ జరుగుతుంది. విద్యార్థులు 15 శాతం అఖిల భారత సీట్లకు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వివరాలకు ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఎంసీసీ.ఎన్ఐసీ.ఇన్’వెబ్‌సైట్‌ను సందర్శించాలని ఎన్టీఏ సూచించింది. ఇక రాష్ట్రస్థాయిలో ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో ఎంబీబీఎస్‌లో ప్రవేశాలకు సంబంధించి ఆయా రాష్ట్రాలు ప్రత్యేకంగా నోటిఫికేషన్లు జారీచేస్తాయి. అందుకోసం రాష్ట్రస్థాయి నీట్ ర్యాంకులను ప్రకటిస్తారు. వాటి ఆధారంగా కన్వీనర్, మేనేజ్మెంట్, ఎన్ఆర్ఐ, మైనారిటీ సీట్లను భర్తీ చేస్తారు. తుది ‘కీ’తో దక్షిణాది విద్యార్థులకు అన్యాయం! మే 29న నీట్ ప్రిలిమినరీ ‘కీ’ని ఎన్టీఏ విడుదల చేసింది. జూన్ 1 వరకు అభ్యర్థుల నుంచి అభ్యంతరాలను స్వీకరించింది. అనంతరం బుధవారం ఫలితాలతోపాటు తుది ‘కీ’ని విడుదల చేసింది. దీనిపై తెలంగాణకు చెందిన విద్యా నిపుణులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. మొదట విడుదల చేసిన ప్రాథమిక ‘కీ’కెమిస్ట్రీలో రెండు, ఫిజిక్స్‌లో రెండు ప్రశ్నలకు ఇచ్చిన జవాబులను తుది ‘కీ’లో మార్చినట్లు శ్రీచైతన్య కూకట్పల్లి జూనియర్ కాలేజీ డీన్ శంకర్రావు చెప్పారు. మొదటి ‘కీ’లో ఇచ్చిన జవాబులు సరైనవని, వాటినే మన విద్యార్థులు రాశారని ఆయన అన్నారు. తుది ‘కీ’లో వీటిని మార్చడంతో దక్షిణాది విద్యార్థులకు అన్యాయం జరిగిందన్నారు. ప్రాథమిక ‘కీ’లో వచ్చిన మార్కులు తుది ‘కీ’లో పోయాయన్నారు. అలా రెండు ప్రశ్నలకు కలిపి 8 మార్కులు, వాటికి మైనస్ మార్కులతో కలిపి 10 మార్కులు కోల్పోయినట్లు ఆయన విశ్లేషించారు. దీంతో ర్యాంకుల్లో భారీ తేడా వచ్చిందన్నారు. ఉత్తరాది వారు రాసిన దానికి అనుగుణంగా ఇలా జరిగిందన్న భావన విద్యార్థుల్లో నెలకొందన్నారు. దీంతో గతేడాది జాతీయస్థాయి 10 ర్యాంకుల్లో తెలంగాణకు చెందినవారు నలుగురుంటే, ఈసారి ఒకరే ఉన్నారన్నారు. అలాగే వందలోపు ర్యాంకులు వచ్చినవారు గతేడాది 16 మంది ఉంటే, ఈసారి పదిలోపే పరిమితం కావాల్సి వచ్చిందన్నారు. అలాగే గతేడాది తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులకు మొదటి 50 ర్యాంకుల్లో ఏడు ర్యాంకులుంటే, ఈసారి నాలుగు ర్యాంకులే ఉన్నాయన్నారు. –––––––––––––––––––––––– దేశవ్యాప్తంగా ‘నీట్’పరీక్షలో అర్హులైనవారు.. –––––––––––––––––––––––– కేటగిరీ పర్సంటైల్ కటాఫ్ మార్కు అర్హులు –––––––––––––––––––––––– జనరల్ 50 701–134 7,04,335 ఓబీసీ 40 133–107 63,789 ఎస్సీ 40 133–107 20,009 ఎస్టీ 40 133–107 8,455 ––––––––––––––––––––––––– కార్డియాలజిస్టును అవుతా – మాధురీరెడ్డి నీట్–2019 ఫలితాల్లో జాతీయ స్థాయిలో 7వ ర్యాంకు, అమ్మాయిల్లో తొలి ర్యాంకు సాధించిన గంగదాసరి మాధురీరెడ్డి ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరతానని చెప్పారు. కార్డియాలజిస్ట్ కావాలన్నదే తన లక్ష్యమన్నారు. మాదాపూర్ నారాయణ కాలేజీలో చదివానని, ప్రతీ రోజు ఉదయం 7 నుంచి రాత్రి 10 గంటల దాకా నీట్ పరీక్ష కోసం చదివానన్నారు. తండ్రి తిరుపతిరెడ్డి ఐటీ కంపెనీలో పనిచేస్తుండగా, తల్లి పద్మ గృహిణి. తన విజయంలో తల్లిదండ్రుల పాత్ర కీలకమన్నారు. డీన్ సాయి లక్ష్మి, టీచర్ల ప్రోత్సాహం మరవలేనిదని చెప్పారు. -
హైదరాబాద్‌లో చదివి..
సాక్షి, హైదరాబాద్: సమాజానికి సేవ చేయాలనే తపన. జీవితంలో ఉన్నతస్థానానికి ఎదగాలనే ఆలోచన. తమకంటూ ఒక గుర్తింపును పొందాలనే ఉత్సాహం. నిరంతర శ్రమ, అకుంఠిత దీక్షతో విజయతీరాలను చేరుకున్నారీ ట్రిపుల్ ఐటీ పూర్వ విద్యార్థినులు. ఇటీవల వెలువడిన సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో ట్రిపుల్ ఐటీ– హైదరాబాద్‌లో బీటెక్ 2015 బ్యాచ్‌కు చెందిన మాధురి గడ్డం జాతీయస్థాయిలో 144వ ర్యాంకు సాధించగా, బీటెక్ అండ్ ఎంఎస్ రీసెర్చ్ (డ్యుయల్ డిగ్రీ) గరిమా అగర్వాల్ 241వ ర్యాంకు సాధించడం విశేషం. మాధురి సొంత ప్రాంతం హైదరాబాద్ నగరం కాగా, గరిమది మాత్రం మధ్యప్రదేశ్ రాష్ట్రం ఖర్గోన్. సివిల్ సర్వీసెస్‌కు ఎంపికైన వీరు సివిల్స్‌కు ప్రిపేయిన విధానం, తమకు స్ఫూర్తినిచ్చిన వ్యక్తులు, కష్టపడిన పద్ధతులు తదితర అనుభవాలను సాక్షికి వివరించారు. ఇంటర్వ్యూ విశేషాలివీ.. అధ్యాపకుల బోధన ఎంతో ఉపకరించింది: మాధురి ట్రిపుల్ ఐటీ హైదరాబాద్‌లో చదవడం ఎంతో మేలు చేకూర్చిందని మాధురి అభిప్రాయపడ్డారు. మావనతా విలువలకు సంబంధించిన కోర్సులో చాలా నేర్చుకున్నాను. ముఖ్యంగా అధ్యాపకులు కమల్, రాధిక, కన్నన్ శ్రీనాథన్, నందకిషోర్ ఆచార్య చర్చలు, తరగతి గదిలో చెప్పిన పాఠాలు ఎంతో తోడ్పాటును అందించాయి. ట్రిపుల్ఐటీ తర్వాత దేనికోసం చదివారు? హైదరాబాద్ ట్రిపుల్ ఐటీలో బీటెక్ పూర్తి చేశాక సివిల్ సర్వీసెస్ పరీక్షలకు సిద్ధం కావాలనుకున్నా. మూడేళ్లపాటు కష్టపడ్డాను. రెండోసారి రాసి 144వ ర్యాంకు సాధించాను. సివిల్స్‌నే ఎందుకు ఎంపిక చేసుకున్నారు? ప్రజలు, సొసైటీకి సేవ చేయాలన్నదే లక్ష్యం. ఒకవేళ సివిల్ సర్వీసెస్‌లో ఎంపిక కాకపోయినా మంచి నాలెడ్జి సాధించాననే తృప్తి మిగిలేది. కానీ రావడం ఎంతో సంతోషానిచ్చింది. సివిల్ సర్వీసెస్‌కు ఎలా ప్రిపేరయ్యారు? సివిల్ సర్వీసెస్ ఒక లాంగ్ప్రాసెస్. మూడు దశల్లో పరీక్ష ఉంటుంది. మొదటి దశలో ప్రిలిమ్స్ దశలో నెగెటివ్ మార్కులుండే విధానం. రెండో దశలో డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్ తొమ్మిది పేపర్లు ఉంటాయి. చివరిదశలో 30 నిమిషాలు పర్సనాలిటీ టెస్ట్ ఓరల్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంజినీరింగ్ చదివిన వారికి లాభనష్టాలు రెండూ ఉంటాయి. సివిల్స్ పరీక్షలకు ఎవరైనా తోడ్పాటు అందించారా? సీనియర్లు పంకజ్ కుమావత్, హిమానుజన్, గరిమా అగర్వాల్ తోడ్పాటు అందించారు. ప్రస్తుతం బీటెక్ పూర్తి చేసేవారు కూడా సివిల్స్‌కు ప్రిపేర్ కావాలి. ఇక్కడ ట్రిపుల్ ఐటీ చదవడం ఎంతో లాభించింది: గరిమా అగర్వాల్ ట్రిపుల్ ఐటీ హైదరాబాద్‌లో చదవడం ఎంతో ప్రయోజనం చేకూర్చిందని, పృథ్వి హౌజ్‌లో కల్చరల్ ప్రతినిధిగా ఉన్నానని గరిమా అగర్వాల్ పేర్కొన్నారు. 2014లో ఏఏ ఎంఏఎస్–2016లో సింగపూర్ సదస్సులో సర్టిఫికెట్ ఎక్స్‌లెన్స్ అవార్డు పొందడం మరిచిపోలేని సంఘటన. ప్రొఫెసర్లు కౌల్, కమలార్ కర్లపాలెమ్ ఎంతగానో స్పూర్తినిచ్చారు. ట్రిపుల్ఐటీ తర్వాత ఏం చదివారు? ట్రిపుల్ఐటీ చదివిన తర్వాత జర్మనీలోని యూనివర్సిటీ ఆఫ్ బాన్‌లో రోబోటిక్స్‌లో ఇంటర్న్‌షిప్ చేశాను. అనంతరం న్యూఢిల్లీకి వెళ్లి సివిల్స్ కోసం ప్రిపేర్ అయ్యా. సివిల్స్‌లో 241వ ర్యాంకు సాధించడం సంతోషంగా ఉంది. సివిల్స్ ఎందుకు ఎంపిక చేసుకున్నారు? సమాజానికి ఏమైనా చేయాలనే తపనతోనే సివిల్స్‌కు ప్రిపేరయ్యా. ట్రిపుల్ ఐటీలో చదువు పూర్తి చేశాక విదేశాల్లో పరిశ్రమలు, పరిశోధనలో అవకాశాలు వచ్చాయి. కానీ సివిల్స్ ప్రిపేర్ కావాలని గ్రేడ్ 4లోనే ఉన్నప్పుడు నిర్ణయించుకున్నా. మధ్యప్రదేశ్‌లో సంయుక్త కార్యదర్శిగా పనిచేసే అల్కా ఉపాధ్యాయ యూపీఎస్సీ టాపర్‌గా నిలిచింది ఆమెను స్పూర్తిగా తీసుకొని చదివాను. సివిల్స్‌కు ఎలా ప్రిపేర్ అయ్యారు? న్యూఢిల్లీలో సివిల్స్ కోచింగ్ తీసుకున్నా. జనరల్ స్టడీస్. ప్రణాళికాబద్ధంగా చదవడం, టైమ్‌టేబుల్ ఏర్పాటు చేసుకొన్నా. ఇంజినీరింగ్ పూర్తి చేసిన తర్వాత సివిల్స్ ప్రిపేర్ కావడం ఇబ్బందే అయినా ఇంజినీర్ల సైంటిఫిక్ టెంపర్మెంట్, లాజిక్ అప్రోచ్ నన్ను సివిల్స్ రాణించేలా చేశాయి. ఎవరెవరు తోడ్పాటునందించారు? ఐఏఎస్ అధికారి హిమాన్షు జైన్, ఐపీఎస్ అధికారి పంకజ్ కుమావత్, కమల్‌సర్ సివిల్స్ సర్వీసెస్‌లో ర్యాంకు సాధించడంలో ఎంతో తోడ్పాటును అందించారు. -
ఆకతాయి వేధింపులు తాళలేక యువతి ఆత్మహత్య
శ్రీకాకుళం సిటీ: బంగారం దొంగిలించడంతో ఓనర్ మందలించాడు. దీంతో ఆ యువకుడు యజమానిపై పగ పెంచుకున్నాడు. చివరకు ఓనర్ కుమార్తె, తాను ప్రేమించుకుంటున్నామని అందరిని నమ్మించే ప్రయత్నం చేశాడు. యువతి ప్రతిఘటించడంతో నీ పరువు, నీ కుటుంబం పరువు తీస్తానంటూ బెదిరించాడు. దిక్కుతోచని స్థితిలో ఆ యువతి సోమవారం ఆత్మహత్యకు పాల్పడింది. తన మరణానికి గల కారణాలను వివరిస్తూ లెటర్ రాసి బలవన్మరణానికి పాల్పడింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరం చంపాగల్లి వీధిలో కండవెల్లి శ్రీనివాసరావుకు ఓ జ్యూయలరీ వర్క్‌షాపు ఉంది. ఇందులో కొటినూరి ప్రశాంతికుమార్ ఐదేళ్లుగా పనిచేస్తున్నాడు. దుకాణంలో ప్రశాంత్ ఇటీవల బంగారాన్ని చోరీ చేస్తుండడంతో యజమాని శ్రీనివాసరావు మందలించాడు. దీంతో అతడిపై ప్రశాంత్‌కుమార్ కక్ష పెంచుకున్నారు. శ్రీనివాసరావుకు బీఎస్సీ కంప్యూటర్స్ చేసిన కుమార్తె మాధురి(25) ఉంది. బావతో ఆమెకు పెళ్లి కూడా నిశ్చయమైంది. ప్రశాంత్ కుమార్ ప్రేమ పేరుతో మాధురిని వేధించడం మొదలుపెట్టాడు. తాను చెప్పినట్లు వినకపోతే కుటుంబ పరువు తీస్తానని బెదిరించాడు. ఈ విషయం కుటుంబసభ్యుల దృష్టికి తీసుకు వెళ్లడంతో ప్రశాంత్‌కుమార్‌ను పనిలోంచి తొలగించారు. ఏప్రిల్ 24న పని మానేసిన ప్రశాంత్.. మళ్లీ మాధురిని వేధించడం మొదలుపెట్టాడు. సోమవారం ఉదయం బాత్‌రూమ్‌కిని వెళ్లిన మాధురి బంగారంలో వేసే సైనేడ్‌ని మింగి ఆత్మహత్యకు పాల్పడింది. నోటి నుంచి నురగలు రావడంతో కుటుంబసభ్యులు ఆస్పత్రిలో చేర్పించేందుకు తీసుకెళ్లగా.. అప్పటికే మాధురి మృతిచెందింది. ‘ప్రశాంతికుమార్ నా పరువు, నా కుటుంబం పరువు తీశాడు. నాపై తప్పుడు ప్రచారం చేశాడు’ అంటూ ఆమె సూసైడ్‌నోట్‌లో పేర్కొంది. మృతురాలి తండ్రి శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఒకటో పట్టణ ఎస్ఐ ఇ.చిన్నంనాయుడు పేర్కొన్నారు. ప్రశాంత్‌కుమార్ పరారీలో ఉన్నాడని, త్వరలోనే పట్టుకుంటామన్నారు. -
నాన్నకు తోడుగా..
కలిగిరి: మండలంలోని కృష్ణారెడ్డిపాలెం గ్రామానికి చెందిన రావుల దశరథరామిరెడ్డి, పద్మలకు ముగ్గురు కుమార్తెలు. మొదటి కుమార్తె సావిత్రి వివాహం చేసుకుని చెన్నైలో ఉంది. రెండో కుమార్తె సునీత వివాహం చేసుకుని నెల్లూరులో ఉంటున్నారు. చివరి కుమార్తె మాధురి మాత్రం 10వ తరగతితో చదువుకు స్వస్తి పలికింది. అప్పటినుంచి తండ్రికి తోడుగా వ్యవసాయ పనుల్లో సహకారం అందిస్తోంది. కుమార్తె మాధురి సహకారంతో దశరథరామిరెడ్డి సుమారు 10 ఎకరాల మాగాణి పొలంలో సంవత్సరానికి రెండుసార్లు వరి పంటను సాగుచేస్తున్నాడు. వరినారు పోసినప్పటి నుంచి గింజలు ఇంటి వచ్చే వరకు తండ్రితో రోజు మాధురి పొలానికి వెళుతుంది. గ్రామంలో మగవాళ్లకు ధీటుగా వ్యవసాయ పనులు చేస్తుంది. పొలం నుంచి ఇంటికి వచ్చినప్పటికి తర్వాత పశువుల పనిలో బిజీగా ఉంటుంది. సేంద్రియ పద్ధతుల్లో పెరటి సాగు ఇంట్లో ఉన్న ఖాళీ స్థలంలో మాధురి సేంద్రియ పద్ధతుల్లో ఆరటి, కూరగాయలు, పండ్ల మొక్కలు సాగుచేస్తోంది. మొక్కలకు పశువుల ఎరువులను మాత్రమే వాడుతుంది. ఇంటి చుట్టు పెంచుతున్న అరటి చెట్లు ప్రత్యేక ఆకర్షణ. కొడుకు ఉన్నా మాధురిలా పనుల్లో సహాకారం అందించేవాడు కాదేమే అని తండ్రి గర్వంగా అందరి వద్ద చెప్పుకుంటుంటాడు. నాన్నకు సహకరించడంతో తృప్తి ముగ్గురు కుమార్తెలను మా తల్లిదండ్రులు ఎంతో ప్రేమగా పెంచారు. మాకు ఏ లోటు లేకుండా చూస్తున్న తండ్రికి వ్యవసాయ పనుల్లో పూర్తి సహకారం అందించడం సంతృప్తిగా ఉంది. అవకాశం ఉన్న వాళ్లు సేంద్రియ పద్ధతుల్లో ఇళ్ల వద్ద కూరగాయాలు, పండ్ల మొక్కలు సాగు చేసుకుంటే ఆరోగ్యానికి మంచిది.– మాధురి -
యాసిడ్ దాడి బాధితురాలి మృతి
-
యాసిడ్ దాడి బాధితురాలి మృతి
కరీమాబాద్: ఐనవోలు మండలం గర్మిళ్లపల్లి గ్రామ సమీపంలోని దుబ్బగుట్ట వద్ద వరంగల్ ఎంజీఎం ప్రాంతానికి చెందిన వివాహిత బోయిన మాధురి అలియాస్ మాధవిపై యాసిడ్ (తేజాబ్) దాడి చేసిన నిందితులు మిల్స్‌కాలనీ పోలీసులు అదుపులో ఉన్నట్లు తెలిసింది. ఈ ఘటనలో నిందితులైన మిల్స్‌కాలనీ పీఎస్ పరిధిలోని సాకరాసికుంటకు చెందిన ఆటోడ్రైవర్ చందు, అదే ప్రాంతానికి చెందిన అతడి స్నేహితుడు రాకేష్‌లతో పాటు ఎస్‌ఆర్‌ఆర్‌తోటకు చెందిన మరో స్నేహితుడు అనిల్‌లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. బాధితురాలైన మాధురి బుధవారం మధ్యాహ్నం మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో ఎంజీఎం ప్రాంతం నుంచి ఆటోలో ఎక్కించుకుని ఐనవోలు మండలం గర్మిళ్లపల్లి దుబ్బకుంట వద్ద మాధురిని చున్నీతో కట్టేసి, మోహంపై యాసిడ్‌పోసి(తేజాబ్) హతమార్చే ప్రయత్నం చేశారు. బాధితురాలు మాధురికి భర్తతో గొడవల కారణంగా గత కొంత కాలంగా వరంగల్ ఎంజీఎం వద్ద గల తన తల్లి వద్దే ఉంటుందని, ఈ క్రమంలో హంటర్ రోడ్‌లోని ఓ పెట్రోల్‌బంక్‌లో పనిచేస్తుండగా అక్కడ ఆటో డ్రైవ ర్ చందు పరిచయమయ్యాడు. ఈ క్రమంలో వారిద్దరూ వేములవాడలో వివాహం చేసుకున్నట్లు సమాచారం. ఐతే కొంతకాలం వారు కలిసి ఉండడం జరిగినా ఇటీవల ఎవరికీ చెప్పకుండా మాధురి చందు ఇంటి నుంచి వెళ్లిపోవడంతో పాటు మరో వ్యక్తితో సన్నిహితంగా ఉండడం.. తనకు ఒక పాప ఉందన్న విషయం ఆటో డ్రైవర్ చందుతో చెప్పక పోవడంతో మాధురిని ఎలాగైనా హతమార్చాలనే కుట్రతో ఇలా తన స్నేహితులు అనిల్, రాకేష్‌తో కలిసి ఆటో డ్రైవర్ చందు యాసిడ్(తేజాబ్) దాడి చేశారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే మాధురిని హతమార్చేందుకు వాడిన తేజాబ్ను చందుకు చెందిన మరో స్నేహితుడు అందించాడన్న ప్రచారం జరుగుతుంది. అది ఎక్కడి నుంచి, ఎప్పుడు సేకరించాడనే విషయం తెలియాల్సి ఉంది. ఈ సంఘటన పోలీసులు పూర్తి వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. చికిత్స పొందుతున్న మాధురి మృతి ఎంజీఎం: ఐనవోలు మండలం గర్మిళ్లపల్లి సమీపంలోని చెట్లపొదల్లో యాసిడ్ దాడిలో తీవ్ర గాయాలపాలైన మాధురి ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందింది. బుధవారం ఆస్పత్రిలో అడ్మిట్ అయిన మాధురికి వైద్యులు మెరుగైన వైద్యం అందించినప్పటికీ పరిస్థితి విషమంగా మారడంతో మృతి చెందింది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. కాగా మాధురిని జిల్లా న్యాయసేవా అధికార సంస్థ కార్యదర్శి అనిరోజ్ క్రిస్టియాన్ సందర్శించి బాధితురాలి కుటుంబ సభ్యుల నుంచి ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. -
వివాహితపై యాసిడ్ దాడి కలకలం
సాక్షి, వరంగల్ : వివాహితపై యాసిడ్ దాడి ఘటన స్థానికంగా కలకలం రేపింది. జనగామ జిల్లా జఫర్ ఘడ్ సమీపంలోని గరిమిల్లపల్లి వద్ద ...ఆమెను కొంతమంది యువకులు చేతులు, కాళ్లు కట్టివేసి యాసిడ్ దాడికి పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడిన ఆమె అరుపులు విన్న బాటసారులు వెంటనే పోలీసులకు సమాచారం అందించి ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో న్యాయమూర్తి వాగ్మూలం తీసుకొన్నారు. కాగా వరంగల్‌లోని కొత్తవాడ ప్రాంతానికి చెందిన మాధురి కొద్దిరోజులుగా భర్త చందుకు దూరంగా ఉంటూ పుట్టింట్లోనే ఉంటోంది. ఆమెకు ఒక కొడుకు కూడా ఉన్నాడు. కొద్ది రోజుల క్రితం చంటి అనే వ్యక్తితో మాధురికి మళ్లీపెళ్లి అయినట్లు తెలుస్తోంది. ఇటీవల అతనితో కూడా గొడవపడినట్లు తెలుస్తోంది. అసలు మాధవి ఆ గ్రామానికి ఎందుకు వెళ్లింది? ఎలా వెళ్లింది? దాడి ఎవరు, ఎందుకు చేశారు? అనే విషయాలపై పోలీసులు దృష్టి పెట్టారు. ఈ ఘటన జిల్లాలో కలకలం రేపుతోంది. -
గ్రూప్–1 టాపర్ మాధురి
సాక్షి మెటీరియల్ ఎంతో ఉపయోగపడింది గ్రూప్–1లో ఫస్ట్ ర్యాంక్ రావడం సంతోషంగా ఉంది. మాది భూపాలపల్లి జిల్లా ఏటూరునాగారం మండలం మంగపేట. ఎంటెక్ పూర్తి చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నా. మూడుసార్లు యూపీఎస్సీ ఇంటర్వ్యూ వరకూ వెళ్లినా ర్యాంకు రాలేదు. సాక్షి భవితను నిత్యం అనుసరించా, అందులో మెటీరియల్ ఎంతగానో ఉపయోగపడింది. – ఆర్డీ మాధురి సాక్షి, హైదరాబాద్: టీఎస్పీఎస్సీ శనివారం ప్రకటించిన గ్రూప్–1 ఫలితాల్లో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన వారే ఎక్కువ టాప్ ర్యాంకులు సాధించారు. రంగారెడ్డి జిల్లా హైదర్‌నగర్‌కు చెందిన ఆర్డీ మాధురి గ్రూప్–1లో అత్యధిక స్కోర్‌తో మొదటి ర్యాంకర్‌గా నిలిచి డిప్యూటీ కలెక్టర్ పోస్టుకు ఎంపికయ్యారు. ఆమెతోపాటు మరో 9 మంది టాప్–10లోపు ర్యాంకులను సాధించి ఉత్తమ పోస్టులకు ఎంపికయ్యారు. నల్లగొండ పట్టణం హౌసింగ్ బోర్డుకు చెందిన ఎన్.ఉదయ్‌రెడ్డి రెండో ర్యాంక్ సాధించి డీఎస్పీ కేడర్‌ను ఎంచుకున్నారు. రంగారెడ్డి జిల్లా సఫిల్‌గూడకు చెందిన రోహిత్ సింగ్ మూడో ర్యాంకు సాధించి డిప్యూటీ కలెక్టర్ కేడర్‌ను ఎంచుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన బెన్షలోమ్ 8వ ర్యాంకు సాధించి డిప్యూటీ కలెక్టర్ పోస్టును ఎంపిక చేసుకున్నారు. అభ్యర్థుల వయస్సు, సామాజిక వర్గం, పోస్టుల రోస్టర్ పాయింట్ల ఆధారంగా సర్వీసులను టీఎస్పీఎస్సీ కేటాయించింది. మరోవైపు టాప్–10లో ఏడుగురు పురుషులు ఉండగా, ముగ్గురు మహిళలు ఉన్నారు. 2011లో జారీ చేసిన నోటిఫికేషన్‌కు సంబంధించిన మెయిన్ పరీక్షలను, ఇంటర్వ్యూలను ఇటీవల పూర్తి చేసిన టీఎస్పీఎస్సీ 127 పోస్టుల్లో 121 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. సుహృద్భావ వాతావరణంలో ఇంటర్వ్యూలు.. గ్రూప్–1 ఇంటర్వ్యూలు సుహృద్భావ వాతావరణంలో జరిగాయని పలువురు అభ్యర్థులు వెల్లడించారు. ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగానికి సంబంధించిన అంశాల్లోనే ఎక్కువ ప్రశ్నలు అడిగారని చెప్పారు. క్షేత్ర స్థాయిలో పరిస్థితులను ఎలా డీల్ చేస్తారన్న కోణంలో, ప్రజలకు అందించాల్సిన సేవలకు సంబంధించిన పనితీరుపైనే ప్రశ్నలు అడిగారని, దానికి తోడు రాష్ట్రంలో సామాజిక పరిస్థితులు, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి సంబంధించిన అంశాలపై ప్రశ్నలు అడిగినట్లు అభ్యర్థులు వివరించారు. మొదటి ప్రయత్నంలోనే.. ఐబీఎం, డెలాయిట్, విప్రోలో పనిచేసిన వంశీకృష్ణ సివిల్స్ లక్ష్యంగా పెట్టుకుని తొలి ప్రయత్నంలోనే గ్రూప్–1 ర్యాంకు సాధించారు. మంచిర్యాల జిల్లాకు చెందిన ఆయన పదో తరగతి వరకు అక్కడే చదువుకున్నారు. కరీంనగర్లో ఇంటర్.. అనంతపురం జేఎన్టీయూలో బీటెక్ పూర్తి చేశారు. తండ్రి నాగేందర్, తల్లి లలిత. భార్య మేథ వ్యవసాయ అధికారిగా మంచిర్యాలలో పని చేస్తున్నారు. పిల్లలను చూసుకుంటూ.. తాను చదువుకుంటూ.. 9వ ర్యాంక్ సాధించిన వి.ప్రశాంతి పిల్లలను చూసుకుంటూ.. తానూ చదువుకున్నారు. ప్రస్తుతం రామంతాపూర్‌లో నివాసం ఉంటున్న ఆమెకు 18వ ఏటే వివాహమైంది. ఆ తర్వాత పట్టుదలతో ఐదేళ్ల న్యాయ విద్య కోర్సు, ఎంబీఏ పూర్తి చేశారు. ఓయూ లా కాలేజీలో 5వ ర్యాంకు సాధించారు. ఎంబీఏలో టాప్ ర్యాంకర్‌గా నిలిచారు. భర్త రవి ప్రకాశ్ వ్యాపారం చేస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. బీహెచ్ఈఎల్లో ఉద్యోగం చేస్తూనే.. ఆరో ర్యాంకు సాధించిన సంతోష్ బీహెచ్ఈఎల్ డిప్యూటీ మేనేజర్‌గా పని చేస్తున్నారు. సివిల్స్ సాధించాలన్న లక్ష్యంతో పోటీ పరీక్షలకు సిద్ధమయ్యారు. మూడు సార్లు సివిల్స్ ఇంటర్వ్యూకు హాజరయ్యారు. గ్రూప్–1లో ఆరో ర్యాంకు సాధించారు. వరంగల్ ఎన్ఐటీ నుంచి ఈఈఈ పూర్తి చేసిన ఆయనకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. తల్లిదండ్రులు భాస్కర్‌రెడ్డి, విజయభారతి, భార్య శ్రీదేవి ప్రోత్సాహం ఎంతగానో ఉందన్నారు. ఆత్మస్థైర్యం కోల్పోవద్దు ప్రజలకు సేవ చేయాలనే కోరిక, ఐఏఎస్ కావాలనే బలమైన ఆకాంక్షతో పట్టువదలని విక్రమార్కుడిలా చదివి డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగాన్ని సంపాదించారు రోహిత్‌సింగ్. సివిల్స్ సాధించాలన్నా.. గ్రూప్–1 ఉద్యోగం పొందాలన్నా ధృడ సంకల్పం, అంతకుమించిన గుండె ధైర్యం ఉండాలంటున్నారు. ఏపీ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్లో రిటైర్డ్ డిప్యూటీ మేనేజర్ శివ్‌చరణ్‌సింగ్ కుమారుడైన రోహిత్ హైస్కూల్ చదువు ఖమ్మంలో ఇంటర్, బీఈ హైదరాబాద్‌లో సాగింది. ఎప్పుడూ ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా సెల్ఫ్ మోటివేషన్ చేసుకుంటూ ఉండాలని, ఎన్ని గంటలు చదివామన్నది కాదు ఇష్టంతో ఆరు గంటలు కూర్చున్నా మంచి ఫలితాలు సాధించవచ్చని రోహిత్ చెప్పారు. వ్యవసాయ కుటుంబం నుంచి.. మహబూబ్‌నగర్ జిల్లా మర్రిపల్లిలోని వ్యవసాయ కుటుంబానికి చెందిన దేప విష్ణువర్ధన్ రెడ్డి జెన్కో(నాగార్జునసాగర్)లో పనిచేస్తూనే గ్రూప్–1లో ఏడో ర్యాంకు సాధించి డివిజనల్ ఫైర్ ఆఫీసర్ పోస్టుకు ఎంపికయ్యారు. కల్వకుర్తిలో టెన్త్, హైదరాబాద్‌లోని ప్రైవేటు కాలేజీలో బీటెక్, వరంగల్ ఎన్ఐటీలో ఎంటెక్ పూర్తి చేశారు. -
మాధురి.. ఉద్యమ దీప్తి
అందరిలానే ఆమె ఈ భూమిపైకి వచ్చింది. ఎదుగుతుండగా ప్రకృతి సిద్ధంగా వచ్చిన లోపాలను గుర్తించింది. తాను ప్రత్యేకంగా ఉన్నానని గమనించింది. ఆ మేరకు తన పేరును రాజశేఖర్గౌడ్కు బదులుగా మాధురిగా మార్చుకుంది. ప్యాంటూ, షర్ట్ బదులుగా లంగా, ఓణి, గాగ్రాచోలీ, పంజాబీ డ్రెస్‌లు వేయడం ప్రారంభించింది. మొదట్లో ఆమె వ్యవహార శైలిని కుటుంబసభ్యులతో పాటు ఉపాధ్యాయులు, పలువురు విద్యార్థులు వ్యతిరేకించారు. ఆమె నుంచి ఎవరికీ ఇబ్బంది లేకపోవడంతో చదువుకోవడానికి ప్రోత్సహించారు. డిగ్రీ పరీక్షలు రాసేందుకు నిరాకరించగా పోరాడి సాధించుకుంది. ఇప్పుడు పీజీ అడ్మిషన్నూ నిరాకరిస్తున్నారు. ఆమెతో ఉన్న సమాజం మారి ప్రోత్సహిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం స్పందించడం లేదు. హిజ్రాలకు విద్య, ఉద్యోగ అవకాశం కోసం మాధురి ఉద్యమం ప్రారంభిస్తోంది. కర్నూలు : మిడుతూరు మండలం వీపనగండ్ల గ్రామానికి చెందిన కె. మాధురి(రాజశేఖర్‌గౌడ్) తల్లిదండ్రులతో పాటు అక్క, అన్న ఉన్నారు. ఆమె 7వ తరగతి వరకు స్వగ్రామంలోనే చదువుకుంది. 8 నుంచి 10వ తరగతి వరకు మిడుతూరులోని గాం«ధీ మెమోరియల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అభ్యసించింది. ఆ తర్వాత ఇంటర్ మీడియట్, డిగ్రీలను నందికొట్కూరులోని సాయిరామ్ డిగ్రీ కళాశాలలో పూర్తి చేసింది. అయితే బాల్యం నుంచే మగపిల్లలకన్నా ఆమె ఆడపిల్లలతోనే ఎక్కువగా ఆడుకునేది. టీనేజి వయస్సు వచ్చాక అమ్మాయి లక్షణాలు కనిపించాయి. అప్పటి నుంచి ఆమె స్త్రీలు ధరించే వస్త్రాలు ధరించడం మొదలుపెట్టింది. ఈ దశలో మొదట్లో పాఠశాల ఉపాధ్యాయులు వ్యతిరేకించినా తర్వాత ఆమె నుంచి ఎవ్వరికీ ఇబ్బంది లేకపోవడంతో అనుశాలు కల్పించేందుకు జీవోలు జారీ మతించారు. పదో తరగతి చదువుతుండగానే ఆమె ముంబయి వెళ్లి లింగమార్పిడి ఆపరేషన్ చేయించుకుంది. ఇది తెలిసి ఆమె తండ్రి రెండేళ్ల వరకు మాట్లాడటం మానేశారు. ఆ తర్వాత అర్థం చేసుకుని ఆమె అభివృద్ధికి ప్రోత్సాహం అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె తల్లిదండ్రుల వద్దే స్వగ్రామంలో నివసిస్తోంది. డిగ్రీ పరీక్షలు రాసేందుకు నిరాకరణ డిగ్రీలో చేరేందుకు కళాశాల యాజమాన్యం అనుమతించలేదు. దీంతో ఆమె రాయలసీమ యూనివర్సిటీ అధికారులతో పాటు లోక్‌అదాలత్ కోర్టును ఆశ్రయించింది. 8–2–2011 తేదిన జారీ చేసిన జీవో ఎంఎస్ నెం. 653 ప్రకారం ఆమెకు విద్యాభ్యాసం చేసేందుకు అనుమతివ్వాలని కోర్టు మందలించింది. దీంతో మాధురి డిగ్రీ పరీక్షలు రాయగలిగింది. పీజీ అడ్మిషన్ కోసం ఉద్యమం డిగ్రీ పూర్తి చేసుకున్న మాధురి ఆపై పీజీ చేయాలని కలలు కంది. 2015, 2016లలో వరుసగా రెండుసార్లు పీజీ సెట్ పరీక్ష రాసి మంచి ర్యాంకును తెచ్చుకుంది. అయితే ఆమెను అడ్మిషన్ సమయంలోనే యూనివర్సిటీ అధికారులు నిరాకరించారు. మేల్‌గా సీటిస్తాము గానీ ట్రాన్స్‌జెండర్(హిజ్రా)కు ఇవ్వలేమని తెగేసి చెప్పారు. దీంతో తనకు ఉన్నత విద్యాభ్యాసం చదువుకునేందుకు అనుమతివ్వాలని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తితోపాటు స్థానిక ఎమ్మెల్యే ఐజయ్య, జెడ్పీ చైర్మన్ మల్లెల రాజశేఖర్‌గౌడ్, ఉన్నత విద్యామండలి చైర్మన్‌ను కలిసి విన్నవించినా ఫలితం లేకపోయింది. ఎవరి వద్దకు వెళ్లినా ప్రయత్నం చేస్తామని చెప్పడమే గానీ ఆమె పోరాటానికి ఫలితం దక్కడం లేదు. ప్రభుత్వం జీవో చేస్తే తప్ప తామేమీ చేయలేమని చేతులెత్తేస్తున్నారు. ఇందుకోసం తాను ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. తనకు సీటు రాకపోయినా తనలాంటి వారికోసమైనా పోరాటం చేస్తానని ఆమె చెబుతోంది. సబ్ ఇన్స్పెక్టర్ కావాలన్నదే లక్ష్యం 'సబ్ ఇన్స్పెక్టర్ కావాలన్నదే నా లక్ష్యం. ఇందుకు ప్రతిరోజూ గ్రామంలో రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాను. నాపై ఎవరూ వివక్ష చూపడం లేదు. నన్ను ప్రోత్సహిస్తున్నారు. అలాగే ప్రభుత్వమూ స్పందించాలి. నాకు ఓటుహక్కుతో పాటు ఆధార్‌కార్డు ఉంది. ఓటు వేసే హక్కు ఉన్నప్పుడు విద్య, ఉద్యోగ అవకాశాలు ఎందుకు కల్పించరు. కేంద్ర ప్రభుత్వంతో పాటు తమిళనాడు ప్రభుత్వమూ మాలాంటిæ వారికి విద్య, ఉద్యోగాలు ఇచ్చి ప్రోత్సహిస్తున్నాయి. అలాగే రాష్ట్ర ప్రభుత్వమూ సహకరించి ఆదుకోవాలి' అని చెబుతోంది మాధురి. -
ఎస్పీ వద్ద మనసులో మాట చెప్పిన హిజ్రా
సారూ.. ఎస్ఐ కావాలనుంది..! - ఎస్పీ రవికృష్ణను కోరిన హిజ్రా మాధురి నంద్యాల: ‘సారూ.. నాకు ఎస్ఐ కావాలనుంది, సాయం చేయండి’ అని మాధురి అనే హీజ్రా జిల్లా ఎస్పీ రవికృష్ణను కోరింది. దీనిపై ఆయన స్పందిస్తూ ఎస్ఐ సెలక్షన్లకు కోచింగ్ ఇప్పిస్తానని, పుస్తకాలు అందజేస్తానని చెప్పారు. నేత్రదానం కార్యక్రమంలో భాగంగా ఎస్పీ బుధవారం నంద్యాలలోని మహానంది రస్తా పాత కేసీ కెనాల్ భవన సముదాయంలో ఉన్న సమతా హిజ్రాల సంఘం కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మాధురి మాట్లాడుతూ నందికొట్కూరు తాలూకా విపనగండ్ల గ్రామానికి చెందిన తాను డిగ్రీ వరకు చదివానని చెప్పారు. తర్వాత ఎంకాం చేయడంకోసం ఆర్యూ పీజీ సెట్ లో మంచి ర్యాంకు తెచ్చుకున్నా హిజ్రా అనే కారణంతో సీటు నిరాకరించారంటూ కన్నీరు పెట్టుకుంది. విషయంపై ఉన్నత విద్యామండలి చైర్మన్ వేణుగోపాల్‌రెడ్డిని కలిసినా ప్రయోజనం లేకపోయిందన్నారు. ఈ ఏడాది మేలో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నిర్వహించిన రాత పరీక్షకు హాజరైనట్లు చెప్పింది. హిజ్రాలకు కేంద్ర ప్రభుత్వం గుర్తింపునిచ్చినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో నష్టపోతున్నట్లు చెప్పింది. తమిళనాడులో ఓ హిజ్రా ఎస్ఐ పోస్టుకు ఎంపికైందని, తాను కూడా అలా కావాలని చెప్పింది. దీనిపై ఎస్పీ రవికృష్ణ స్పందిస్తూ తమిళనాడులో హిజ్రా.. మహిళల కోటాలో ఎస్ఐ పోస్టు సాధించినట్లు చెప్పారు. ఎస్ఐ సెలక్షన్‌కు హాజరు కావడానికి సాయం చేస్తానని, మెటీరియల్ అందిస్తామని హామీ ఇచ్చారు. -
నాటి శిశువు...నేటి వధువు
వెంగళరావునగర్: కొన్నేళ్ల క్రితం ఓ పసిగుడ్డు యూసుఫ్‌గూడలోని శిశువిహార్‌కు చేరింది. అక్కడి సిబ్బంది ఆమెను అక్కున చేర్చుకున్నారు. కన్నబిడ్డలా ఆదరించారు. కాలం శరవేగంగా పరుగులెత్తింది. వెంగళరావు నగర్ డివిజన్ పరిధిలోని మహిళా శిశు సంక్షేమశాఖ ఆవరణలో ఉన్న శిశువిహార్‌లో బుధవారం మాధురి అనే యువతికి దత్తాత్రి అనే యువకుడితో ఘనంగా వివాహమైంది. ఒకప్పటి అనాథ శిశువే ఈ మాధురి.ఉదయం 11.55 గంటలకు కుంభలగ్నంలో వారి వివాహమైంది. అమ్మ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో... మోహన్‌నగర్‌లోని విద్యార్థినుల వసతి గృహం సూపరింటెండెంట్ ఇందిరాదేవి దంపతులు మాధురి తరఫున కన్యాదానం చేశారు. తాళిబొట్టుతో పాటు ఇతర ఆభరణాలను ఆమెకు అందజేశారు. అమ్మ ఆర్గనైజేషన్, జంట నగరాల రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇతర పెళ్ళి ఖర్చులు, భోజనాలు, పట్టుచీరలు సమకూరాయి. హాజరైన ప్రజాప్రతినిధులు... మాధురి వివాహానికి అటు అధికారులు, ఇటు ప్రజా ప్రతినిధులు తరలివచ్చారు. తమ స్థాయిలో కానుకలు అందజేసి ఆశీర్వదించారు. ఈ వివాహ కార్యక్రమానికి దత్తాత్రి తల్లి ద్రుపతాభాయి, కు టుంబ సభ్యులతో పాటు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, మహిళా శిశు సంక్షేమశాఖ రీజనల్ జాయింట్ డెరైక్టర్ కె.రాజ్యలక్ష్మి, ప్రాజెక్ట్ డెరైక్టర్ కేఆర్ఎస్ లక్ష్మీదేవి, శిశువిహార్, చిల్డ్రన్స్‌హోం, స్టేట్‌హోం, ఓల్డేజ్‌హోం, సర్వీస్‌హోంల ఇన్చార్జులు స్వరూపరాణి, లక్ష్మీకుమారి, గిరిజ, రసూల్‌బీ సుల్తానా, సీడీపీఓలు ప్రజ్వల, సుకేసిని, సత్యవతి, నర్సింగరావు, నేతలు ఆర్.సాంబశివరావు, పి.వి.రవిశేఖర్‌రెడ్డి, లక్ష్మీరెడ్డి, స్టేట్‌హోం సిబ్బంది, కాలనీ సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. ఇప్పుడు అనాథ కాదు... శిశువిహార్‌లో పెరిగి పెద్దదై కాలేజ్ ఎట్ హోంలో ఉంటున్న మాధురి ఇప్పుడు అనాథ కాదని మోహన్‌నగర్ హోం సూపరింటెండెంట్ ఇందిర అన్నారు. తమ బిడ్డను కన్యాదానం చేసినంత ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వం తరఫున ఆ దంపతులకు ఇల్లు మంజూరుకుఅధికారులు సన్నాహాలు చేస్తున్నారని తెలిపారు. చాలా ఆనందంగా ఉంది... తమ వివాహానికి అధికారులు... ప్రజా ప్రతినిధులు హాజరు కావడం చాలా ఆనందంగా ఉందని నూతన జంట మాధురి, దత్తాత్రిలు తెలిపారు. తాము ఒక్కటి కావడానికి సహకరించిన సూపరింటెండెంట్‌తో పాటు కమిషనర్, ఆర్డీడీ, పీడీలకు రుణపడి ఉంటామని చెప్పారు. తన కన్న తల్లిదండ్రులైనా ఇంత ఘనంగా వివాహం జరిపించి ఉండేవారు కాదేమోనని సంతోషం వ్యక్తం చేసింది. -
అదిరిందయ్యా..
ఇంద్రభవనం వంటి ఇల్లు లేకున్నా.. ఇంటీరియర్స్ కలర్ఫుల్గా కనిపిస్తే.. బొమ్మరిల్లులో కూడా ఇంద్రధనుస్సు వెల్లివిరుస్తుంది. అలాగని ఇంటికి వల్లెవేసి అందంగా ముస్తాబు చేస్తే.. ‘అదిరిందయ్యా చంద్రం’ అని అనిపించుకోలేం. రంగులు ఎంచుకోవడంలో మీ టేస్ట్‌ను బట్టి మీ ఇంటి అందం ఆధారపడి ఉంది. మారుతున్న ట్రెండ్‌ను అందుకుంటేనే.. మీ నెలవు సప్తవర్ణాల లోగిలిగా మారుతుంది. ఒకప్పుడు ఇంటికి రంగులు వేయాలంటే లైట్ కలర్స్‌ను ఎక్కువగా ప్రిఫర్ చేసేవారు. మారుతున్న కాలాన్ని అందిపుచ్చుకున్న నగరవాసులు తమ ఇళ్ల గోడలు మల్టీకలర్స్లో మెరిసిపోయేలా చేస్తున్నారు. గతంలో ఇంటి బయటివైపు ఓ రంగు.. లోపలి వైపు ఒక రంగుతో సరిపెట్టుకున్న యజమానులు.. ఇప్పుడు ట్రెండ్ మార్చారు. ఒక్కో రంగులో ఒక్కో గదిని చూసుకోవాలని తాపత్రయపడుతున్నారు. ఒకే గదిలోని నాలుగు గోడలూ నాలుగు డిఫరెంట్ కలర్స్ వేయిస్తున్నారు. గోడలకు అమర్చే షెల్ప్‌లు, పెయింటింగ్స్, ఫర్నిచర్ సహా ప్రతిదీ కలర్ ఫుల్‌గా ఉండేలా తీర్చి దిద్దుకుంటున్నారు. కలర్‌ఫుల్... ఇల్లు చిన్నదా పెద్దదా కాదు.. ఎంత అందంగా ఉందనేదే ముఖ్యమైపోయింది. వెయిటింగ్ రూమ్, మెయిన్ హాల్, మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్, కిచెన్‌కు సెపరేట్ కలర్స్ వేస్తూ ఇల్లంతా ఆధునికతకు ఆలవాలంగా మార్చేస్తున్నారు. ఫర్నిచర్ కూడా గోడల రంగులకు సూటయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఫ్లోరింగ్నూ వదలట్లేదు. చిల్డ్రన్స్ బెడ్రూమ్ గోడలపై బొమ్మలు వేయిస్తే వారికి అంతకన్నా మంచి గిఫ్ట్ ఉండదంటున్నారు ఇంటీరియర్ డిజైనర్లు. మాస్టర్ లుక్... మాస్టర్ బెడ్రూమ్ గోడలకు గతంలో లైట్ బ్లూ ఎక్కువగా ఫ్రిఫర్ చేసేవారు. కానీ ఇప్పుడు మల్టీకలర్స్ ఉండటమే ఫ్యాషన్ అంటున్నారు ఇంటీరియర్ డిజైనర్లు. గదికి మూడు వైపులా ఒకే రంగు వేసినా.. నాల్గో వైపు గోడకు, దానికి అమర్చే షెల్ఫ్‌లకు రకరకాల రంగులను చొప్పించి మల్టీ కలర్ లుక్ తీసుకొస్తున్నారు. మనసుకు ప్రశాంతత కలిగించే గులాబీ, నీలం, వంకాయ రంగుల్లోని షేడ్స్ వాడటమే కాకుండా వీటికి మ్యాచయ్యే ఫర్నిచర్‌ను అమరుస్తున్నారు. వంటగది, డైనింగ్ హాల్‌ను కూడా డిఫరెంట్ కలర్స్‌లో ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నారు. బాత్రూమ్ల విషయానికి వస్తే ముదురు రంగులైతే క్లీన్ చేయడం సులువని చెబుతున్నారు. డూప్లెక్ల్స్లూ, విల్లాలు వంటి వాటికి ఇంట్లోనే మెట్లు కామన్. వాటికి లైట్ కలర్స్ కాకుండా బ్రైట్ కలర్స్ ఇప్పుడు చాలా మంది ప్రిఫర్ చేస్తున్నారు. అలాగే ఇంట్లో ఏదైనా ఒక కార్నర్‌ను కూడా రకరకాలా కలర్స్‌తో ప్రత్యకంగా డిజైన్ చేస్తే చాలా బాగుంటుంది. సో మోర్ కలర్‌ఫుల్ ఈజ్ మోస్ట్ బ్యూటిఫుల్ అన్నది నేటి ట్రెండ్. - మాధురీ, ఇంటీరియర్ డిజైనర్ -
కేజీబీవీల్లో కుర్చీలాట
ఎస్వో, ఎంఈవోలతో సిబ్బంది సతమతం రికార్డులు అందజేయని పాత ఎస్వోలు సిబ్బందికి రాని రెండు నెలల జీతాలు కొయ్యూరు : మన్యంలోని 11 కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల్లోనూ కుర్చీలాట కొనసాగుతుంది. గతంలో ఆయా పాఠశాలల్లో పనిచేసిన ప్రత్యేకాధికారి(ఎస్వో), కొత్తగా బాధ్యతలు అప్పగించిన వారి మధ్య వివాదం సాగుతోంది. కొయ్యూరులో డెప్యుటేషన్‌పై పనిచేసిన మాధురిని తొలగించినట్టుగా అధికారులు చెబుతుంటే ఆమె మాత్రం రికార్డుల్లో సంతకాలు చేస్తున్నారు. మరో రిజిష్టర్‌లో ఇంఛార్జీగా ఉన్న ఎంఈవో బోడం నాయుడు కూడా సంతకాలు చేస్తున్నారు. పాఠశాలలు తెరచినా ఇంత వరకు వంటపాత్రలు నుంచి ఇతర రికార్డులు ఏవీ కూడా పాత ఎస్వో అందజేయలేదు. దీంతో బాలికలు వస్తే ఎలా వంట చేయాలో తెలియక అక్కడ సిబ్బంది సతమతం అవుతున్నారు. దీనికితోడు ఈ యేడాది మార్చిలో పదో తరగతి పరీక్షలు రాసిన ఏడుగురు బాలికలకు టీసీలు ఇచ్చేందుకు కూడా వాటి పుస్తకం లేదు. ఇప్పుడు ఆ పుస్తకం కోసం దరఖాస్తు చేశారు. మూడు సంవత్సరాల నుంచి ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన మాధురి డెప్యూటేషన్‌పై కస్తూరిబా ఎస్‌వోగా పనిచేస్తున్నారు. అయితే ప్రభుత్వం ఇటీవల డెప్యూటేషన్లపై వచ్చిన వారిని తొలగించింది. వారికి బదులుగా పదవీ విరమణ చేసిన వారిని లేదా నిరుద్యోగులను నియమించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఆమెను తొలగించారు. అయితే తనకు రావలసిన డైట్ బిల్లులపై ఆమె కోర్టును ఆశ్రయించడంతో వెంటనే వాటిని చెల్లించాలని ఆదేశాలు ఇచ్చింది. తనకు బిల్లులు చెల్లించిన తరువాతనే మానేస్తానని, అంత వరకు మానేది లేదని ఆమె అంటూ క స్తూరిబాలో పనిచేశారు. రాజీవ్ విద్యా మిషన్ పీవో నగేస్ ఏప్రిల్‌లో ఎంఈవోలకు ఇంచార్జీ బాధ్యతలు ఇస్తూ ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఎంఈవో ఇంచార్జీగా వ్యవహరిస్తున్నారు. 12 మంది సిబ్బంది ఉన్న కస్తూరిబాలో రోజూ ఎంఈవోతో పాటు పాత ఎస్వో కూడా సంతకాలు చేయడం విశేషం. పాత ఎస్వో ఎంఈవోకు ఇంత వరకు రికార్డులను, వంట పాత్రలను కూడా అందజేయలేదు. బాలికలు వస్తే వారిని ఆకలితో ఉంచాల్సి వస్తుందన్న భయం ఒక వైపు.. నిల్వల రిజిస్టర్లు లేనిదే తహశీల్దారు కార్యాలయం నుంచి విడుదల ఆదేశాలు(ఆర్వో) రాదని మరోవైపు భయపడుతున్నారు. ఇంత జరుగుతున్నా ఆర్వీఎం పీవో ఈ సమస్యలను చక్కదిద్దడంలో విఫలమయ్యారు. దీనిపై ఎంఈవో బోడం నాయుడును శుక్రవారం వివరణ కోరగా టీసీల కోసం లేఖ రాశామని, తనకు పాత ఎస్వో ఇంత వరకు రికార్డులు, ఇతర వస్తువులు అందజేయలేదని పేర్కొన్నారు. వాటిని ఆమె నుంచి తీసుకుని బాలికలకు ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు. ఆమె క్యాష్ పుస్తకం ఇస్తే సిబ్బంది జీతాలను కూడా చెల్లిస్తామన్నారు. ఏజెన్సీలోని అన్ని కస్తూర్బా పాఠశాలల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. -
శేఖర్ చంద్ర మ్యారేజ్ రిసెప్షన్ ఫోటోలు
టాలీవుడ్ సంగీత దర్శకుడు శేఖర్ చంద్ర వివాహం మాధురితో ఇటీవల జరిగింది. వారి వివాహాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన రిసెప్షన్ కు టాలీవుడ్, రాజకీయ ప్రముఖులు తరలివచ్చి నూతన దంపతుల్ని ఆశీర్వదించారు. శేఖర్ చంద్ర దంపతులతో ప్రముఖ దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ తదితరులు నూతన దంపతులకు ఈనాడు సంస్థల అధినేత రామోజీ రావు ఆశీస్సులు శేఖర్ చంద్ర దంపతులతో సినీ గేయ రచయిత భాస్కరభట్ల రిసెప్షన్ కు హాజరైన వారిలో హీరో నిఖిల్, నిర్మాత స్రవంతి రవికిషోర్, దర్శకుడు వంశీ, యువ సినీ గాయకులు, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. -
తప్పతాగి రోడ్డుపై సినీతార రచ్చ రచ్చ
*మద్యం మత్తులో పట్టపగలే హల్చల్ చేసిన నటి మాధురి, ఫ్యాషన్ డిజైనర్ రమేష్ దిమ్లా * పోలీసుల అదుపులో ఐదుగురు *కేసు నమోదు చేస్తామన్న డీసీపీ పాటిల్ బెంగళూరు, న్యూస్‌లైన్ : మద్యం మత్తులో నడిరోడ్డుపై పట్టపగలే ఓ నటి, ఫ్యాషన్ డిజైనర్‌తో సహా ఐదుగురు న్యూసెన్స్ సృష్టించారు. సంఘటనకు సంబంధించి స్థానికుల ఫిర్యాదు మేరకు వారిని మల్లేశ్వరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆలస్యంగా వెలుగు చూసిన సంఘటన వివరాలను మీడియా సమావేశంలో ఉత్తర విభాగం డీసీపీ సందీప్ పాటిల్ శుక్రవారం వెల్లడించారు. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ రమేష్ దిమ్లా, శ్యాండిల్‌వుడ్ నటి మాధురి(ర్యాంబో ఫేం)తో సహా ఐదుగురు గురువారం ఉదయం 8.30గంటలకు మల్లేశ్వరం 17వ క్రాస్‌లోని వీణా స్టోర్స్ వద్దకు విలాసవంతమైన కారు (కేఏ 05 ఎన్కే 7275)లో చేరుకున్నారు. అనంతరం కారు ముందుకు చేరుకుని బీరు బాటిల్స్ చేతిలో పట్టుకుని తాగారు. ఆ సమయంలో వారిని స్థానికులు నిలదీయడంతో రమేష్ దిమ్లా రెచ్చిపోయాడు. షర్ట్ తీసి రోడ్డుపై గిరాటేసి, ప్యాంట్‌ను మోకాళ్ల వరకు ఎత్తి చూసుకుందాం రండని సవాల్ విసిరాడు. అర్ధనగ్న దుస్తులు వేసుకున్న మాధురి, మరో యువతి అసభ్యంగా ప్రవర్తిస్తుండడంతో మహిళలు తలలు దించుకుని వెళ్లిపోయారు. ఆ సన్నివేశాలను కొందరు మొబైల్లో చిత్రీకరించారు. వీరి ప్రవర్తన విషమిస్తుండడంతో సహనం కోల్పోయిన స్థానికులు ఫిర్యాదు చేయడంతో మల్లేశ్వరం పోలీసులు అక్కడకు చేరుకుని అదుపులోకి తీసుకున్నారు. దీనిపై కొందరు రాజకీయ పెద్దలు జోక్యం చేసుకుని వారిని వదిలిపెట్టాలంటూ పోలీస్ అధికారులపై ఒత్తిడి పెంచారు. శుక్రవారం ఉదయం ఆ సన్నివేశాలను కొన్ని టీవీ చానెల్స్ ప్రసారం చేయడంతో విషయం వెలుగు చూసింది. తమ అదుపులో ఉన్న ఐదుగురిని మల్లేశ్వరం జనరల్ ఆస్పత్రిలో వైద్యపరీక్షలు నిర్వహించామని, వారిలో కొందరు మద్యం సేవించినట్లు వైద్య నివేదికలో వెలుగు చూసిందని డీసీపీ తెలిపారు. కాగా, వారిని వదిలిపెట్టాలంటూ తమపై ఎలాంటి ఒత్తిడులు లేవని, కేసు నమోదు చేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. -
కింగ్ ఆఫ్ రొమాన్స్‌కి క్వీన్స్ నీరాజనం
‘దిల్ తో పాగల్ హై’ తీసినప్పుడు యశ్ చోప్రా వయసు 65 ఏళ్లు. కృష్ణా రామా అనుకునే ఆ వయసులో ఓ టీనేజర్లా మారిపోయి అద్భుతంగా ఆ సినిమాలో ప్రణయ రసాన్ని ఆవిష్కరించారు. అసలు బాలీవుడ్లో రొమాన్స్‌ని అంత చక్కగా, చిక్కగా ఇంకెవరూ తీయలేరేమో! అందుకే ఆయన్ని ‘కింగ్ ఆఫ్ రొమాన్స్’గా అభివర్ణిస్తుంటారు. గత ఏడాది అక్టోబర్ 21న ఆయన పరమపదించారు. యశ్ చోప్రా లేని లోటుని ఇప్పటికీ బాలీవుడ్ జీర్ణించుకోలేకపోతోంది. ఏదో ఒక సందర్భంలో ఆయన్ని గుర్తు చేసుకుంటూనే ఉంది. సెప్టెంబర్ 27 ఆయన 81వ పుట్టిన్రోజు. ఈ సందర్భంగా ఆయన జయంతి వేడుకలను ముంబైలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. యశ్ సినిమాల్లో నటించిన పలువురు నటీనటులు, ఇతర తారలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రేఖ, శ్రీదేవి, మాధురీ దీక్షిత్, జూహి చావ్లా, రాణి ముఖర్జీ, ప్రీతి జింతా, కత్రినా కైఫ్, అనుష్కశర్మ, పరిణీతి చోప్రా ఇత్యాది బ్యూటీ క్వీన్స్ అంతా ర్యాంప్ వాక్ చేశారు. అలాగే ఈ తొమ్మిది మంది తారలతో షారుక్ ఖాన్ కూడా ర్యాంప్ వాక్ చేశారు. యశ్‌తో తమకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా అందరూ గుర్తు చేసుకున్నారు.