మాధురి, సాయికృష్ణ
తల్లాడ సాయికృష్ణ, మాధురి చిగురు జంటగా తనికెళ్ల భరణి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘నరుడి బ్రతుకు నటన’. జానీని దర్శకుడిగా పరిచయం చేస్తూ శ్రీ అన్నపూర్ణ క్రియేష¯Œ ్స పతాకంపై తల్లాడ శ్రీనివాస్ నిర్మిస్తున్న ఈ చిత్రం 70శాతం టాకీ పార్ట్ పూర్తి చేసుకుంది. ‘‘హారర్ నేపథ్యంలో రూపొందుతోన్న చిత్రమిది. శివ కాకు అందించిన కథ ప్రేక్షకులకు కొత్తగా ఉంటుంది. ఇప్పటి వరకు రెండు షెడ్యూల్స్ పూర్తయ్యాయి. మరొక షెడ్యూల్‌తో టాకీ పార్ట్ పూర్తవుతుంది’’ అన్నారు శ్రీనివాస్. ‘‘జర్నలిస్ట్‌గా వృత్తి నిర్వహిస్తున్న నాకు దర్శకత్వం చేయాలనే కోరిక ఈ సినిమాతో నెరవేరింది.’’ అన్నారు జాని. ‘‘నేను నటించిన మూడు సినిమాలు వైవిధ్యమైన కథలతోనే ఉంటాయి. ఈ చిత్రం కూడా చాలా వైవిధ్యంగా ఉంటుంది. ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ చివరి షెడ్యూల్‌ను షూట్ చేసేలా ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: శ్యాం–శ్రీకాంత్.
Comments
Please login to add a commentAdd a comment