thanikella bharani
-
గోపీచంద్ మలినేని చేతుల మీదుగా ' జై జవాన్' ట్రైలర్ విడుదల
సంతోష్ కల్వచెర్ల కథానాయకుడిగా పావని రామిశెట్టి కథానాయికగా తెరకెక్కిన చిత్రం 'జై జవాన్'. ప్రముఖ నటుడు తనికెళ్ల భరణి, సత్యప్రకాష్, నాగినీడు, విజయ రంగరాజు, అప్పాజీ అంబరీష్, బిహెచ్ఇఎల్ ప్రసాద్, బలగం సంజయ్ తదితరులు ఇందులో నటించారు. నాగబాబు పోటు దర్శకత్వంలో కేఎస్ క్రియేషన్స్ పతాకంపై ఈశ్వరీ కుమారి సమర్పణలో సందిరెడ్డి శ్రీనివాసరావు, పోసం మధుసూదన్ రెడ్డి, పోటు వెంకటేశ్వర్లు ఈ చిత్రాన్ని నిర్మించారు.దేశభక్తి నేపథ్యంలో దేశ సరిహద్దుకు రక్షణగా నిలుస్తున్న సైనికుడి గొప్పదనాన్ని తెలియజేసే విధంగా జై జవాన్ చిత్రాన్ని రూపొందించారు. ఇండిపెండెన్స్ డే సందర్భంగా తాజాగా ట్రైలర్‌ను ప్రముఖ దర్శకుడు గోపీచంద్ మలినేని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ చిత్రం కాన్సెప్ట్ తనకు నచ్చిందని, ట్రయిలర్ చూస్తుంటే దేశభక్తి నేపథ్యంలో రూపొందిన గొప్ప చిత్రంలా ఈ సినిమా వుండబోతుందని, ఇలాంటి ఇండిపెండెట్ ఫిల్మ్ విజయం సాధించాలని, ఈ సినిమా ద్వారా ఈ టీమ్ అందరికి మంచి పేరును తీసుకరావాలని ఆయన ఆశించారు.నిర్మాతలు మాట్లాడుతూ 'దేశభక్తి నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో సైనికుడి గొప్పతనం గురించి తెలియజేశామని తెలిపారు. సంతోష్ కల్వచెర్ల హీరోగా చక్కని ప్రతిభను కనపరిచాడని వారు అన్నారను. ఆయనకు హీరోగా మంచి భవిష్యత్ వుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్‌లు కూడా పాల్గొన్నారు. ఇక ఈ ట్రైలర్ చూస్తుంటే దేశభక్తి వున్న ప్రతి ఒక్కరిని ఆలోచింపజేసే విధంగా, సైనికుడు ఈ దేశం కోసం తమ జీవితాలను ఎలా త్యాగం చేస్తున్నారో కళ్లకు కట్టినట్లు చూపించారు. త్వరలో ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ ప్రకటించనున్నారు. -
C 202 Trailer: ఒక్క డైలాగు లేదు.. సౌండ్‌తోనే భయపెట్టారుగా!
తనికెళ్ళ భరణి, శుభలేఖ సుధాకర్, సత్య ప్రకాష్, షఫీ, చిత్రం శీను, వై విజయ ప్రధాన పాత్రలో మనోహరి కె ఎ నిర్మాతగా మున్నా కాశి హీరో గా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న హర్రర్ థ్రిల్లర్ చిత్రం 'సి 202' (C 202). ఈ చిత్రం ఆద్యంతం రాత్రిపూట చిత్రీకరించబడింది. షూటింగ్ అంత పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలలో బిజీగా ఉంది. అయితే ఈరోజు ఒక డైలాగ్ కూడా లేకుండా ముఖ్య తారాగణాన్ని చూపిస్తూ అదిరిపోయే సౌండ్ ఎఫెక్ట్స్ తో రెండు నిమిషాల ఎనిమిది సెకెన్ల ట్రైలర్ ను విడుదల చేశారు చిత్ర యూనిట్. ఈ సందర్భంగా దర్శకుడు, హీరో మున్నా కాశి మాట్లాడుతూ "ఈరోజు 'సి 202' (C 202) చిత్రం యొక్క ట్రైలర్ ను విడుదల చేసాం. ఒక్క డైలాగ్ కూడా లేకుండా క్యారెక్టర్ లను చూపిస్తూ మంచి సౌండ్ ఎఫెక్ట్స్ తో మంచి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ప్రేక్షకులకు మా సినిమా మీద అంచనాలు పెంచేలా రూపొందించాం. ఈ మూవీ షూటింగ్ అంతా రాత్రి సమయంలోనే చేశాం. కథ స్క్రీన్ ప్లే చాలా ఇంట్రెస్టింగ్గా అద్భుతమైన సస్పెన్స్ తో భయపడే హారర్ సన్నివేశాలతో మంచి త్రిల్లింగ్ ఎపిసోడ్స్ తో సినిమా ని చిత్రకరించాం. షూటింగ్ అంత పూర్తి అయింది. ప్రస్తుతానికి పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.త్వరలోనే చిత్రాన్ని విడుదల చేస్తాం’ అని తెలిపారు. -
అందుకే పద్ధెనిమిది సినిమాలు వదులుకున్నా: తనికెళ్ల భరణి
‘‘నలభై ఏళ్ల సుధీర్ఘ కెరీర్లో 800 పైగా సినిమాలు చేశాను. వీటిలో 300 పైగా తండ్రి పాత్రలు ఉన్నాయి. దీంతో తండ్రి పాత్రలు చేయాలంటే విసుగొచ్చింది. ఈ ఏడాది 18 సినిమాల్లో తండ్రి పాత్రలు చేయమని అవకాశాలు రాగా, వదులుకున్నాను. కొత్త తరహా పాత్రలు చేయాలనుకుంటున్న నాకు ‘పెదకాపు–1’లో మంచి పాత్ర దొరికింది. నా కెరీర్లో నేను గుర్తుంచుకోదగ్గ పాత్రల్లో ‘పెదకాపు 1’ ఉంటుంది’’ అన్నారు నటుడు– దర్శకుడు తనికెళ్ల భరణి. విరాట్ కర్ణ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ పెదకాపు 1’. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 29న విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం జరిగిన విలేకర్ల సమావేశంలో ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించిన తనికెళ్ల భరణి పంచుకున్న విశేషాలు. ► ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘బ్రహ్మోత్సవం’ చిత్రాల తర్వాత శ్రీకాంత్ అడ్డాలతో నేను చేసిన చిత్రం ‘పెదకాపు 1’. ఈ చిత్రంలో సమాజంపై విసిగిపోయిన ఓ టీచర్ పాత్రలో కనిపిస్తాను. శ్రీకాంత్ అడ్డాల పోషించిన పాత్రను తప్పిస్తే ఈ సినిమాలో లీడ్ రోల్ చేసిన అందరితో నాకు కాంబినేషన్ సీన్స్ ఉన్నాయి. ‘మాతృ దేవో భవ, లేడీస్ టైలర్, శివ, మన్మథుడు, అతడు’.. ఇలా నిడివితో సంబంధం లేకుండా నా కెరీర్లో నేను గుర్తుపెట్టుకోదగ్గ పాత్రలు ముప్పై వరకు ఉంటాయి. ఈ జాబితాలో ‘పెదకాపు 1’ చేరుతుంది. చాలా గ్యాప్ తర్వాత ఈ సినిమాకి కెమెరామేన్ చోటా కె. నాయుడుతో వర్క్ చేయడం థ్రిల్‌గా అనిపించింది. విరాట్ కర్ణ కొత్తవాడైనా బాగా నటించాడు. మిక్కీ జే మేయర్ సంగీతం బాగుంటుంది. మిర్యాల రవీందర్‌రెడ్డిగారు ఈ సినిమాను భారీగా నిర్మించారు. ► ‘మిథునం’ తర్వాత నా దర్శకత్వంలో మరో చిత్రం రాలేదు. నేను కమర్షియల్ సినిమాలు తీయలేను. నా దగ్గర కొన్ని కథలు ఉన్నాయి. ఆర్ట్ ఫిల్మ్ తరహా చిత్రాలను నిర్మించే నిర్మాతలు దొరకడం లేదు. నా నలభై ఏళ్ల కెరీర్లో నేను అనుకున్నవన్నీ చేశాను. అయితే ఓ అంతర్జాతీయ సినిమా తీయాలనే ఆకాంక్ష మాత్రం మిగిలిపోయి ఉంది. ప్రస్తుతం శివరాజ్‌కుమార్, ప్రభుదేవా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమాలో కీలక పాత్ర చేస్తున్నాను. శేఖర్ అనే కొత్త దర్శకుడు తీస్తున్న సినిమాలో ఓ వైవిధ్యమైన పాత్ర చేస్తున్నాను. -
ఒకే ఫొటోలో ఐదుగురు స్టార్ కమెడియన్స్.. అరుదైన దృశ్యం చూశారా?
సినిమాకు కామెడీ అనేది ప్రధానం. ఎంత పెద్దసినిమా అయినా సరే కాసింతైనా కామెడీ లేకపోతే అభిమానులు నిరాశ చెందడం ఖాయం. కథ ఎంత బలంగా ఉన్నప్పటికీ.. కామెడీ కనిపించకపోతే అబ్బే ఏదో సినిమాలో లోపించందండి అంటుంటారు. పెద్ద హీరోల సినిమాలైనా సరే కామెడీకి అంత ప్రాధాన్యత ఉంటుంది. అలా తెలుగు సినిమాలో 1990ల్లో కడుపుబ్బా నవ్వించిన వారిలో ఠక్కున వినిపించే పేర్లు బాబు మోహన్, కోట శ్రీనివాసరావు జోడీ. వీరిద్దరు చేసిన కామెడీ తెలుగు ప్రజలను బాగా ఆకట్టుకుంది. ఆ తర్వాత కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి, ఎంఎస్ సత్యనారాయణ, బ్రహ్మనందం లాంటి వాళ్లు తెలుగు సినిమా కామెడీని ఓ రేంజ్‌కు తీసుకెళ్లారు. ఇప్పట్లో కమెడియన్ అంటే వెంటనే గుర్తుకొచ్చే పేరు బ్రహ్మనందమే. ఆయన లేకుండా సినిమా లేదంటే ఓ వెలితి ఉన్నట్లే అనిపిస్తుంది. అలా తన కామెడీతో సినీ అభిమానులను అలరిస్తూనే ఉన్నాడు. (ఇది చదవండి: సినిమాల్లో స్టార్ హీరోయిన్.. కానీ ఆమె జీవితమే ఓ విషాదగాథ!) అయితే ఒక్క కమెడియన్ సినిమాలో ఉంటేనే కడుపు చెక్కలయ్యేలా నవ్వడం ఖాయం. అలా ఏకంగా ఐదుగురు స్టార్ కమెడియన్స్ ఓకే ఫోటోలో కనిపిస్తే అక్కడ పరిస్థితి ఎలా ఉంటుంది. ఇక నవ్వులే నవ్వులు. అలాంటి అరుదైన సన్నివేశం కూడా చోటు చేసుకుంది. దాదాపు 30 ఏళ్ల క్రితమే తెలుగులో స్టార్ కమెడియన్స్‌గా పేరొందిన ఆ ఐదుగురి ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. అప్పటి ఐదుగురు తెలుగు స్టార్ కమెడియన్స్ ఫోటోను నెటిజన్ ట్వీట్ చేయగా.. ప్రముఖ నటుడు, రచయిత తనికెళ్ల భరణి తన అనుభవాన్ని ట్విట్టర్లో పంచుకున్నారు. ఇది మా పాతికేళ్ల కామెడీ కుటుంబం అంటూ నెటిజన్‌కు రిప్లై ఇచ్చాడు. ఓకే ఫోటోలో బ్రహ్మనందం, బాబు మోహన్, తనికెళ్ల భరణి, కోట శ్రీనివాసరావు, చలపతిరావు నవ్వుతూ కనిపించారు. అయితే ఈ ఫోటో చూసిన అభిమానులు సైతం తెలుగు సినిమా కామెడీ కుటుంబం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కొందరైతే ఏకంగా ఆ జోక్ ఏంటో మాకు కూడా చెప్పండి సార్ అంటూ ఫన్నీ పోస్టులు పెడుతున్నారు. ఏది ఏమైనా కమెడియన్ సినిమాకు ప్రాణం అనడంలో ఎలాంటి సందేహం లేదు. (ఇది చదవండి: Kutty Padmini: కమల్, వాణి గురించి చెప్పినా శ్రీవిద్య నమ్మలేదు.. పాపం!) పాతికేళ్ల క్రితం మా కామెడీ కుటుంబం! 🥰 https://t.co/WW2dmgePOl — Tanikella Bharani (@TanikellaBharni) August 7, 2023 -
ప్రేమంటే ఇదేనా.. ఈ ఫీలింగేంటి ఇంత బాగుంది
తేజ్ కూరపాటి, అఖిల ఆకర్షణ జంటగా నటించిన చిత్రం ‘నా వెంటపడుతున్న చిన్నాడెవడమ్మా’. వెంకట్‌వందెల దర్శకుడు. ముల్లేటి నాగేశ్వరావు నిర్మాణ సారథ్యంలో ముల్లేటి కమలాక్షి, గుబ్బల వెంకటేశ్వరావు నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబరు 2న విడుదల కానుంది. ఈ చిత్రం ట్రైలర్‌ను ప్రముఖ దర్శకుడు బి. గోపాల్ విడుదల చేసి, ‘‘ఈ సినిమా సాంగ్స్, ట్రైలర్స్ బాగున్నాయి.ఈ కథ పై ఉన్న నమ్మకంతో దర్శకుడు వెంకట్ చాలా కాన్ఫిడెంట్ గా తీశాడు. అలాగే ఈ సినిమా కథను, దర్శకుడిని నమ్మి తీసిన నిర్మాతలకు ఈ సినిమా బిగ్ హిట్ అవ్వాలి’అన్నారు. ‘‘ఇది ఒక అందమైన రియలిస్టిక్ ప్రేమకథ. ఓషోలోని తత్త్వం, బుద్ధునిలోని సహనం, శ్రీశ్రీలోని రెవలిజం, వివేకానందుడిలోని గుణం ఉండేలా తనికెళ్ల భరణిగారి పాత్రను డిజైన్ చేయడం జరిగింది. నటీనటులు, టెక్నీషియన్స్ ఫుల్ సపోర్ట్ చేశారు’’ అన్నారు వెంకట్ వందెల. ‘‘నేను సోలో హీరోగా నటించిన తొలి చిత్రం ఇది’’ అన్నారు తేజ్ కూరపాటి. ‘‘ద్వారకా తిరుమలైన చిన్న తిరుపతిలో ఈ చిత్రం షూటింగ్ చేశాం. అనుకున్న టైమ్‌కు, అనుకున్న బడ్జెట్లో సినిమా పూర్తి చేశాం’’ అన్నారు ముల్లేటి కమలాక్షి. ఇక ట్రైలర్ విషయానికొస్తే..‘చరిత్ర మనకెప్పుడో చెప్పింది సాల్మన్ రాజుగారు.. మనకు కావాల్సింది దాని కోసం ఎన్ని యుద్ధాలైనా చేయమని. వదిలే ప్రసక్తే లేదు’.‘ప్రేమంటే ఇదేనా.. ఈ ఫీలింగేంటి ఇంత బాగుంది’.‘గుళ్లో దైవం..బళ్లో పుస్తకం తప్ప ఏ ధ్యాసలేని నా జీవితంలోకి ఒక్కడొచ్చాడు. వాడొవడో కూడా నాకు తెలియదు. అసలు ప్రేమంటే ఏంటి అది ఎలా ఉంటుంది. ఒక్కసారి నాకు కనబడితే నెత్తిపై ఒక్కటిచ్చి ఏడ్చేలోపే పీక పిసిగి చంపేయాలని ఉంది’ లాంటి డైలాగ్స్‌తో ఆకట్టుకుంటుంది. -
అందుకే నాకు వయసు గుర్తుకు రాదు: కె. రాఘవేంద్ర రావు
K Raghavendra Rao About Age In Wanted Pandu God Press Meet: ‘‘డైరెక్టర్ శ్రీధర్ సీపాన, సంగీత దర్శకుడు పీ.ఆర్, కెమెరామేన్ మహీరెడ్డి వంటి వాళ్లతో పనిచేయడం వల్ల నాకు వయసు గుర్తుకు రాదు’’అని ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు అన్నారు. సునీల్, అనసూయ భరద్వాజ్, బ్రహ్మానందం, ‘వెన్నెల’ కిషోర్, సప్తగిరి, శ్రీనివాస్ రెడ్డి, సుడిగాలి సుధీర్ ప్రధాన పాత్రల్లో శ్రీధర్ సీపాన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వాంటెడ్ పండు గాడ్’. ‘పట్టుకుంటే కోటి’ అన్నది ట్యాగ్‌లైన్. కె.రాఘవేంద్రరావు సమర్పణలో యునైటెడ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సాయిబాబ కోవెలమూడి, వెంకట్ కోవెలమూడి ఈ సినిమాను నిర్మించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్మీట్లో కె.రాఘవేంద్రరావు మాట్లాడుతూ– ‘‘తనికెళ్ల భరణిగారు ఈ సినిమాను డైరెక్ట్ చేద్దామనుకున్నారు. ‘పెళ్లి సందడి’కి మంచి డైలాగ్స్ అందించిన శ్రీధర్ సీపాన డైరెక్ట్ చేస్తే బావుంటుందనిపించింది. జూన్ లేదా జూలైలో ఈ సినిమా రిలీజ్ చేస్తాం’’ అని తెలిపారు. ‘‘ఈ సినిమాకు నేను ఓ అసిస్టెంట్ డైరెక్టర్లా వర్క్ చేశాను’’ అన్నారు శ్రీధర్ సీపాన. చదవండి: పాట పాడుతూ మరణించిన ప్రముఖ సింగర్.. వీడియో వైరల్ -
ఆకట్టుకుంటున్న‘ చినుకమ్మా .. నా వెంటే పడుతున్న చిన్నాడెవడమ్మా’ సాంగ్
‘హుషారు’ఫేమ్ తేజ్ కూరపాటి, అఖిల ఆకర్షణ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘ నా వెంటపడుతున్న చిన్నాడెవడమ్మా’. వెంకట్ వందెల దర్శకత్వం లో జి వి ఆర్ ఫిల్మ్ మేకర్స్ సమర్పణలో రాజధాని ఆర్ట్ మూవీస్ బ్యానర్ పై ముల్లేటి కమలాక్షి, గుబ్బల వేంకటేశ్వరావు లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రం నుంచి విడుదల చేసిన ఫస్ట్ లుక్‌కి మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ చిత్రంలోని తొలి పాటను విడుదల చేశారు మేకర్స్. ‘పుడిమిని తడిపే తొలకరి మొరుపుల చినుకమ్మా .. నా వెంటే పడుతున్న చిన్నాడెవడమ్మా ’అంటూ సాగే ఈ పాటకి డాక్టర్ భవ్య దీప్తిరెడ్డి లిరిక్స్ అందించగా.. రమ్య బెహరా అద్భుతంగా ఆలపించారు. సందీప్ కుమార్ సంగీతం అందించిన ఈ సాంగ్‌కి గణేష్ మాస్టర్ కొరియోగ్రఫి చేశారు. ఇటీవలే విడుదల చేసిన సాంగ్ ప్రోమో కి మంచి రెస్సాన్స్ వచ్చింది. ఇప్పడు ఈ సాంగ్ ని ప్రముఖ నటులు , రచయిత, దర్శకులు తణికెళ్ళ భరణి చేతుల మీదుగా లాంచ్ చేశారు. ఈ సందర్భంగా తణికెళ్ల భరణి మాట్లాడుతూ.. భవ్య దీప్తి సాహిత్యంతో గణేశ్ మాస్టర్ కొరియోగ్రఫి చాలా బాగుంది. ఈ పాటలో హీరో తేజ, అఖిల చాలా అందంగా ఉన్నారు. ఈ చిత్రం మరింత విజయం సాధించాలని కొరుకుంటున్నాను’ అన్నారు. దర్శకుడు వెంకట్ వందెల మాట్లాడుతూ.. ‘పల్లెటూరి నేపధ్యం లో సాగే చక్కటి ప్రేమకథ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. ఈ చిత్రం ఫ్యామిలి మరియు యూత్ ని ఆకట్టకుంటుంది’ అన్నారు. -
వారికిది ఆస్కార్ అవార్డుతో సమానం: తనికెళ్ల భరణి
‘పూర్వం నాటకాలను పోషించేవారిని మహారాజు శ్రీ కృష్ణదేవరాయలుతో పోల్చేవారు. ఈ రోజుల్లోను ఇంకా కృష్ణదేవరాయల కాలం నాటి మహారాజ పోషకులు సీఆర్సి కాటన్ కళా పరిషత్ రూపంలో ఉన్నారంటే అతిశయోక్తి కాదు.నాటక రంగానికి సీఆర్సీ ఫాండేషన్ చేస్తున్న కృషి వెలకట్టలేదిని’అన్నారు ప్రముఖ నటుడు, రచయిత తనికెళ్ల భరణి. వచ్చే ఏడాది రావులపాలెంలోని సీఆర్సి నాటక కళా పరిషత్ 23వ ఉగాది నాటకోత్సవాలలో జరగబోయే నాటక పోటీల కోసం ప్రత్యేకంగా శనివారం హైదరాబాద్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తనికెళ్ల భరణి మాట్లాడుతూ.. ‘22ఏళ్ల క్రితం సీఆర్సి కాటన్ కళా పరిషత్ వెలసింది. ప్రముఖ దర్శకులు ఎస్వీ. కృష్ణారెడ్డిగారు చెప్పడంతో ఓ సారి నేను రావులపాలెం సీఆర్‌సిక్లబ్‌కి వెళ్లాను. తర్వాత సీఆర్సి ఫౌండేషన్ వారు చేస్తున్న అనేక రకాలైన సేవ కార్యక్రమాలను చూసి షాకయ్యాను. ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్న మీరు నాటక కళా పరిషత్‌ను స్థాపించి మంచి నాటకాలు వేయించొచ్చు కదా అన్నాను. అప్పుడు వారు సదుపాయలు ఏం కావాలన్నా మేము చేస్తాం కాని, నాటకానికి సంబంధించిన కార్యక్రమాలను మీరు దగ్గరుండి చూసుకుంటే నాటక పరిషత్ నిర్వహించటానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదని పరిషత్ నిర్వాహకుడైనటువంటి విక్టరీ వెంకట్‌రెడ్డి గారు అనటంతో నేను గౌరవాధ్యక్షునిగా రంగప్రవేశం చేశాను. 22 ఏళ్లుగా అద్భుతమైన నాటకాలు ప్రదర్శిస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నా. కొత్త వాళ్లను ప్రొత్సహించడానికి తొలి ఉత్తమ ప్రదర్శనకు మూడు లక్షల రూపాయలు, రెండో ఉత్తమ నాటకానికి రెండు లక్షల రూపాయలు, మూడో ఉత్తమ బహుమతికి లక్ష రూపాయల ప్రైజ్‌మనీని ప్రకటించాం. ఇది భారతదేశంలోనే నాటక కళాకారులకిచ్చే పెద్ద మొత్తం. ప్రపంచంలోని నలుమూలలా ఉండే నాటక ప్రియులంతా ఈ నాటకాల్లో పాల్గొనాలని కోరుతున్నా. ఇది నిజంగా నాటకానికి మహర్దశ అనొచ్చు. నాటక కళాకారులకు ఈ అవకాశం ఆస్కార్ అవార్డుతో సమానం. కాబట్టి ఆసక్తి గల వారందరూ కొత్త నాటకాలతో రావాలని కోరుతున్నా’అన్నారు. కన్వీనర్ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ– ‘నేను బిజినెస్ మ్యాన్ని, మా పిల్లలు ఎప్పుడూ క్లాస్ ఫస్ట్ ఉండాలి అనుకుని వాళ్లను బాగా చదవాలి అని ఫోర్స్ చేసేవాడిని. కానీ పరిషత్ నాటకాలు పెట్టిన ఆరో ఏడాది ‘హింసధ్వని’ అనే నాటకం చూశాను. ఆ నాటకం చూసిన తర్వాత నేను ఎప్పుడు క్లాస్‌ఫస్ట్ రావాలని, ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలని మా పిల్లల్ని ఇబ్బంది పెట్టలేదు. అంతగా ఆ నాటకం నన్ను కదిలించింది’ అన్నారు.ఈ కార్యక్రమానికి అతిధిగా, యాంకర్‌గా ప్రముఖ నటి ఝాన్సీ వ్యవహరించారు. -
ఓటీటీలో దూసుకెళ్తున్న ‘ఏకమ్’.. రెండో స్థానంలో చోటు
కొన్ని సినిమాలో థియేటర్స్‌లో అంతగా ఆడకపోయినా ఓటీటీలో మాత్రం సూపర్ హిట్ అవుతాయి. అలాంటి వాటిలో ‘ఏకమ్’ఒకటి. పంచ భూతాల నేపథ్యంలో ఫిలసాఫికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రానికి వరుణ్ వంశీ దర్శకత్వం వహించగా.. ఎస్.ఎమ్.ఎస్ క్రియేషన్స్ పతాకంపై ఎ.కళ్యాణ్ శాస్త్రి-పూజ.ఎమ్-శ్రీరామ్.కె సంయుక్తంగా నిర్మించారు. అభిరామ్ వర్మ, శ్వేతావర్మ, తనికెళ్ళ భరణి, అదితి మ్యాకల్, కల్పిక గణేష్, దయానంద్ రెడ్డి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. అమెజాన్ ప్రైమ్ లో 503 వ చిత్రంగా విడుదలైన ‘ఏకమ్’ కేవలం పదిహేను రోజుల్లో టాప్-2కి చేరి... మొదటి స్థానం కోసం ‘పుష్ప’తో పోటీ పడుతోంది. ఈ సందర్భంగా చిత్రదర్శకుడు వరుణ్ వంశీ మాట్లాడుతూ... "ఏకమ్" చిత్రానికి అమెజాన్ లో రెండో స్థానం దక్కడం కలలా ఉంది... చాలా గర్వంగానూ ఉంది. ఇంతవరకు తెలుగులో రాని యూనీక్ జోనర్ లో రూపొందిన "ఏకమ్" చిత్రానికి అవార్డులతోపాటు రివార్డులు కూడా వస్తుండడం మరీ సంతోషంగా ఉంది" అన్నారు. -
‘ఏకమ్’చిత్రానికి ఎక్స్లెంట్ రెస్పాన్స్!
చిన్న చిత్రాలకు ఓటీటీలు వరంలా మారాయి. థియేటర్లలో రిలీజ్‌కు నోచుకోని చిత్రాలకు, విడుదలైన అంతగా ఆడలేకపోయిన సినిమాలకు మంచి వేదికగా మారాయి. ఇప్పటికే పలు చిన్న చిత్రాలు ఓటీటీలో విడుదలై.. మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. తాజాగా మరో చిన్న చిత్రం ‘ఏకమ్’ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలై విజయవంతంగా దూసుకెళ్లోంది. ప్రైమ్‌లో 503వ చిత్రంగా విడుదలైన ఈ చిత్రం.. కేవలం పది రోజుల్లో టాప్-10లో స్థానం సంపాదించుకుని అందరి దృష్టినీ విశేషంగా ఆకర్షిస్తోంది. పంచ భూతాల నేపథ్యంలో ఫిలసాఫికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రానికి వరుణ్ వంశీ దర్శకత్వం వహించగా.. ఎస్.ఎమ్.ఎస్ క్రియేషన్స్ పతాకంపై ఎ.కళ్యాణ్ శాస్త్రి-పూజ.ఎమ్-శ్రీరామ్.కె సంయుక్తంగా నిర్మించారు. అభిరామ్ వర్మ, శ్వేతావర్మ, తనికెళ్ళ భరణి, అదితి మ్యాకల్, కల్పిక గణేష్, దయానంద్ రెడ్డి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. అమెజాన్ ప్రైమ్‌లో తమ చిత్రం టాప్-10లో స్థానం సంపాదించుకోవడం పట్ల చిత్ర యూనిట్ హర్షం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా చిత్రదర్శకుడు వరుణ్ వంశీ మాట్లాడుతూ... "ఏకమ్" చిత్రాన్ని ప్రేక్షకులంతా ఏకగ్రీవంగా ఆదరిస్తుండడం చాలా సంతోషాన్నిస్తోంది. మా నిర్మాతల పెట్టుబడిని సేఫ్ గా వెనక్కి తెస్తుండడంతోపాటు... దర్శకుడిగా నాకు రెండో సినిమా వచ్చేలా చేసింది. ప్రస్తుతం అమెజాన్ లో టాప్ 10లో ఉన్న "ఏకమ్" అతి త్వరలో మొదటి రెండు మూడు స్థానాల్లో సగర్వంగా నిలుస్తుందనే నమ్మకం మాకుంది. అమెజాన్ ఆడియన్స్ తోపాటు... "ఏకమ్" చిత్ర రూపకల్పనలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను" అన్నారు. -
సంతోషం అవార్డ్స్‌లో తళుక్కుమన్న తారలు
-
గంగవ్వ నోటి వెంట శ్రీవిష్ణు ‘చోర గాథ’
శ్రీవిష్ణు హీరోగా హసిత్ గోలి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘రాజ రాజ చోర’. సునయన, మేఘా ఆకాశ్‌లు కథానాయికలుగా నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ ప్రత్యేక వీడియోను ‘చోర గాథ బై గంగవ్వ’ పేరుతో చిత్ర బృందం విడుదల చేసింది. ఇందులో ‘నీకు ఊ.. కొట్టే కథ తెలుసా? ఏది చెప్పినా ఊ.. కొట్టాలి’ అని అసలు కథ మొదలు పెడుతుంది గంగవ్వ. ‘అనగనగా ఓ సూర్యుడు ఉంటడు. ఆ సూర్యడేమో భూమికి ప్రాణం ఇచ్చాడు. భూమి నుంచి కోతి, బంగారం వచ్చాయి’ అంటూ సాగే ఆద్యంతం ఆసక్తిగా సాగింది. గంగవ్వ చెప్పుకొచ్చిన ఈ కథ రాజు, దొంగ, కిరీటం చూట్టు తిరగనుందనేది అర్థమైంది. చివరకు ఈ మూడింటి మధ్య ఏం జరిగింది, రాజు కిరీటాన్ని ఎత్తుకెళ్లిన ఆ దొంగ దొరుకుతాడా? లేదా? అనే ప్రశ్నతో ముగించిన గంగవ్వ చోర గాథ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. విభిన్న కథాంశంతో రూపొందుతోన్న ఈ చిత్రం టీజర్ జూన్ 18న విడుదల కానుంది. టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీలో తనికెళ్ల భరణి, రవిబాబు, కాదంబరి కిరణ్, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీకి వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు. -
నరుడి బ్రతుకు నటన
తల్లాడ సాయికృష్ణ, మాధురి చిగురు జంటగా తనికెళ్ల భరణి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘నరుడి బ్రతుకు నటన’. జానీని దర్శకుడిగా పరిచయం చేస్తూ శ్రీ అన్నపూర్ణ క్రియేష¯Œ ్స పతాకంపై తల్లాడ శ్రీనివాస్ నిర్మిస్తున్న ఈ చిత్రం 70శాతం టాకీ పార్ట్ పూర్తి చేసుకుంది. ‘‘హారర్ నేపథ్యంలో రూపొందుతోన్న చిత్రమిది. శివ కాకు అందించిన కథ ప్రేక్షకులకు కొత్తగా ఉంటుంది. ఇప్పటి వరకు రెండు షెడ్యూల్స్ పూర్తయ్యాయి. మరొక షెడ్యూల్‌తో టాకీ పార్ట్ పూర్తవుతుంది’’ అన్నారు శ్రీనివాస్. ‘‘జర్నలిస్ట్‌గా వృత్తి నిర్వహిస్తున్న నాకు దర్శకత్వం చేయాలనే కోరిక ఈ సినిమాతో నెరవేరింది.’’ అన్నారు జాని. ‘‘నేను నటించిన మూడు సినిమాలు వైవిధ్యమైన కథలతోనే ఉంటాయి. ఈ చిత్రం కూడా చాలా వైవిధ్యంగా ఉంటుంది. ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ చివరి షెడ్యూల్‌ను షూట్ చేసేలా ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: శ్యాం–శ్రీకాంత్. -
అమ్మ ఇంకా బతికే ఉంది!
‘మిథునం’ సినిమాతో దర్శకుడిగా మారారు రచయిత, నటుడు తనికెళ్ల భరణి. వృద్ధదంపతుల అన్యోన్యతను, పిల్లలకు దూరంగా ఉంటున్న బాధను అద్భుతంగా తెరకెక్కించారు భరణి. ‘మిథునం’లో యస్పీ బాలసుబ్రహ్మణ్యం, లక్ష్మీ జంటగా నటించారు. ఇప్పుడు దర్శకుడిగా రెండో సినిమా పట్టాలెక్కించే పనిలో ఉన్నారట తనికెళ్ల భరణి. ‘అమ్మ ఇంకా బతికే ఉంది’ అనే టైటిల్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారని సమాచారం. ఇందులో షావుకారు జానకి ముఖ్య పాత్రలో కనిపించనున్నారట. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. -
ఆట కదరా భరణీ
కార్తీకం శివుడికి ప్రీతికరమైనది. భరణికి శివుడు ప్రియాతిప్రియమైనవాడు. ‘ఆట కదరా శివా..!’ అనేంత అఫెక్షన్. ‘నావాడు’ అంటాడు. ‘నిను వీడను ఏనాడూ’ అంటాడు. కన్నప్ప శివుడికి కన్నిచ్చి భక్తకన్నప్ప అయ్యాడు. భరణి శివుడికి ఏమీ ఇవ్వలేదు. తనే శివుణ్ని లోపలికి లాగేసుకున్నాడు. శివుణ్ణే.. భక్తశివుణ్ణి చేసేసుకున్నాడు! దేవుడా.. అంటే.. ‘అవును దేవుడే.. ఇంత ఫ్లెక్సిబిలిటీ నా శివయ్య దగ్గర నాకు ఉంది’ అంటాడు. భరణి శివుడి గురించి చెబుతున్నంతసేపూ.. ‘ఆట కదరా భరణీ’ అనిపించింది మాకు!! కార్తీక మాసం అంటే శివుడికి ప్రత్యేకం. పైగా మీరు మాల కూడా ధరిస్తారు కాబట్టి ఆ విశేషాలు చెబుతారా? తనికెళ్ల: మామూలుగా ఈ మాసంలో దీక్ష తీసుకుంటాను. దేవుడు, దైవకార్యాలు ఏమైనా కూడా ఆరోగ్యంతో లింక్ అయ్యుంటాయి. అంటే ఏడాది పొడవునా ముప్పూటలా తింటాం కాబట్టి.. మండలం (40 రోజులు) పాటు ఆహార నియమాలు పాటిస్తాం. మాల ధరించిన ఆ నలభై రోజులు మన జీవన విధానం ఓ క్రమ పద్ధతిలో ఉంటుంది. సైంటిఫిక్‌గా మనలో ఉన్న టాక్సిన్స్ అన్నీ 20 రోజులకు పోతాయి. చెత్త అంతా పోయాక అక్కడ్నుంచి శక్తి ఆరంభమవుతుంది. 40 రోజులు ముగిసేసరికి ఓ కొత్త శక్తి వస్తుంది. ఆరోగ్యం బాగుపడుతుంది. శివ దీక్ష, బాబా దీక్ష, అయ్యప్ప దీక్ష.. ఏ దీక్ష అయినా 40 రోజులు అని అందుకే నిర్ణయించారు. కానీ కొందరు 20 రోజులు, 3 రోజులు... ఇలా కూడా దీక్ష తీసుకుంటుంటారు కదా? దురదృష్టవశాత్తు వాళ్ల సౌకర్యం కోసం చేసేవాళ్లు ఉన్నారు. అసలు చేయపోతే నష్టం ఏంటి? చేస్తే 40 రోజులు.. లేకపోతే ఓ నమస్కారం పెట్టుకోండి. ఏ దేవుడూ నా దీక్ష తీసుకోకపోతే నేను ‘సర్వైవల్’ కాలేను అనడు కదా. నేనైనా, ఎవరైనా... దీక్ష తీసుకుంటే పాటించాల్సిన నియమం ఏంటంటే.. ఏకభుక్తం (ఒక పూట భోజనం, సాయంత్రం అల్పాహారం) భూశయనం (నేల మీద నిద్రపోవడం), బ్రహ్మచర్యం (కామ, క్రోధ, లోభాలకు దూరంగా ఉండాలి. అలాగే మందు.. పాన్‌పరాగ్ వంటి చెత్తాచెదారానికి దూరంగా ఉండటం). సౌకర్యంలోనే కాదు.. అసౌకర్యంలో కూడా ఉండగలను అనడానికి భూశయనం. నడుము నొప్పి ఉన్నవారిని డాక్టర్ తలగడ లేకుండా కింద పడుకోమంటారు. ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఇవి అలవాటు అయితే రేపు ఆస్పత్రికి వెళ్లే ఖర్మ ఉండదు. ఒక దీక్ష వెనకాల ఇంత అర్థం ఉంటుంది. దీన్ని చాలామంది అర్థం చేసుకోవడం లేదు. కొంచెం కఠినంగానే చెబుతున్నాను. రేపు మాల వేసుకుంటున్నాడంటే తెల్లవారు జాము వరకూ మందు తాగుతాడు. మాల తీసేసిన గంటకే పాన్ పరాగ్, సిగరెట్ మొదలుపెట్టేస్తాడు. ఇలా దీక్ష తీసుకోపోతే ఏం? ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. మూడ భక్తిని మనం ప్రచారం చేయొద్దు. అవకాశం ఉంటే ఖండిద్దాం. ఎందుకంటే ఈ మధ్య భక్తి పేరుతో వ్యాపారం చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే.. సాయిబాబా అంటే ఫ్రెండ్లీగా, శివుడంటే కొంచెం భయంగా ఉంటుందని కొందరు అంటారు.. సాయిని తిరగేస్తే ‘యిసా’. యిసా అంటే శివుడే. వీడితో కూడా ఫ్రెండ్లీగా ఉండండి. దేవుడిని చూసి భయపడకండి. పాపాన్ని చూసి భయపడండి. మనకు ఉండాల్సింది దైవభక్తి, పాపభీతి. పాపం చేస్తే నాశనమవుతాం లేదా నరకానికి పోతాం అనే భయం ఉండాలి. అంతేకానీ దేవుడంటే భయం ఉండకూడదు. దేవుడు కరుణా సముద్రుడు. వాడంటే భయం ఎందుకు? దేవుడికీ దెయ్యానికీ తేడా తెలియకపోతే ఎట్లా? ఖర్మ. దేవుడిని వాడు వీడు అనొచ్చా? మనలోని మైనస్ పాయింట్లను దేవుడికి అంటకట్టాం. దేవుడు తల్లివంటివాడు. మంచి స్నేహితుడు. వాడికి గౌరవం ఇచ్చి దూరం పెట్టకండి. దగ్గర చేసుకోండి. అయ్యప్ప దీక్షకి అయితే ‘పీఠం’ పెడతారు. శివుడి దీక్షకు? శివుడికి పీఠం పెట్టక్కర్లేదు. శివుడికి తక్కువ నియమాలు ఉంటాయి. అయ్యప్ప మాల వేసుకుని, శబరిమలకే వెళ్లాలి. అయితే ‘సర్వం శివమయం’ అంటారు. శివ మాలను ఎక్కడైనా ఏ శివుడి గుడిలో అయినా తీయొచ్చు. అయ్యప్పకు చేసినట్లుగా ఇరుముడి అక్కర్లేదు. ‘ఇరుముడి’ అంటే రెండు ముడులు అని అర్థం. హోటల్స్ లేని కాలంలో ఒక మూటలో తమ వంట కోసం బియ్యం, పప్పు తీసుకెళ్లేవాళ్లు. మరో మూటలో దేవుడికి సమర్పించడానికి కొబ్బరికాయ, దానికి చిన్న చిల్లు పెట్టి, నెయ్యి పోసి తీసుకెళ్లేవారు. ఇప్పుడు ఇరుముడి అవసరంలేదు. సంప్రదాయం రాను రాను ఓ స్టాంప్ అయిపోయింది. శివమాల ఎప్పుడు మొదలుపెట్టారు? 1970ల్లో ఓ మలయాళీని చూసి మా గురువు రాళ్లపల్లిగారు అయ్యప్ప మాల వేసుకోవడం ప్రారంభించారు. ఆయన్ను చూసి నేనూ దీక్ష మొదలుపెట్టాను. ఓ పదిసార్లు శబరిమలకు వెళ్లాను. మదరాసు నుంచి హైదరాబాద్‌కి షిఫ్ట్ అయ్యాక ఓ తమాషా సంఘటన జరిగింది. నేను, నా మిత్రుడు సుబ్బారావు, దేవరకొండ కుమార్ మాల వేసుకున్నాం. వీళ్లలో ఒకరి బంధువులు పోయారు. మరొకరికి సెలవు దొరకలేదు. దాంతో విరమించుకున్నారు. మన దగ్గర అప్పుడు రూపాయిలు లేవు (నవ్వుతూ). వీళ్లతో వెళ్తే ఖర్చులు కలిసొస్తాయనుకుంటే వీళ్లిద్దరూ డ్రాప్. అప్పుడు ఏం చేద్దాం అనుకొని సర్లే.. అయ్యప్ప దగ్గరకి ఏం వెళ్తాం. అయ్యప్ప అబ్బ దగ్గరకు వెళ్దాం అని శ్రీశైలం వెళ్లాను మాల విరమణకి. అక్కడ మూడు రోజులు ఉన్నాను. అప్పుడు నాలోకి శివుడు ప్రవేశించాడు. ఆ తర్వాత ఏడాదికి దాదాపు రెండుసార్లు శివమాల వేసుకుంటున్నాను. ఏదైనా కొత్తగా రాద్దాం అనుకున్నప్పుడు మాల వేసుకుంటాను. శివమాల దాదాపు 25 సార్లు వేసి ఉంటాను. ఈసారి న్యూజిల్యాండ్ తెలుగు మహాసభలకు వెళ్లాను. అక్కడే మాల విరమణ చేశాను. ఓంకారం ప్రత్యేకత గురించి చెబుతారా? ఓంకారం ‘అ ఉ మ’ అనే మూడు శబ్దాల సంకలనం. ఓంకారంకి సైంటిఫిక్‌గా చెప్పినది ఏంటంటే గుడి గంట కొట్టినప్పుడు ఆ ఘంటారావానికి కొన్ని కోట్ల క్రిములు, సూక్ష్మజీవులు చచ్చిపోతాయి. నేల రాలిపోతాయి. సేమ్ ఎఫెక్ట్ ఓంకారానికి కూడా ఉంటుంది. ఓంకారం గనుక కరెక్ట్‌గా నేర్చుకొని చెబితే నీ చుట్టూ ఓ ‘ఆరా’ ఏర్పడుతుంది. వైబ్రేషన్స్ వల్ల నెగటివ్ ఎనర్జీ పోతుంది. రసూల్ çపుకుట్టి సౌండ్ ఇంజినీర్‌గా ఆస్కార్ అందుకున్నప్పుడు ‘ప్రపంచానికి ఓంకారం అందించిన దేశం నుంచి వచ్చాను’ అని చెప్పాడు. మంత్రం ఓంకార సహితమైనప్పుడు ఎనరై్జజ్ అవుతుంది. నమశ్శివాయ కన్నా ‘ఓం నమశ్శివాయ’ ఎక్కువ ఎఫెక్ట్. ఓంకారం దీపంలాంటిది. కార్తీక మాసంలో దీపం పెడతాం. అజ్ఞానం అనే చీకటిని దీపం తొలగిస్తుంది. వన భోజనాల గురించి? వనభోజనాలనేది అద్భుతమైన కాన్సెప్ట్. అందరం ఒక చోట కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ తలో చేయి వేసి వంట చేసుకుంటాం. అయితే వన భోజనం అంటే వనం ఉండాలి. ఇప్పుడు వనం లేదు. బయట క్యాటరింగ్ వాడికి చెప్పేసి భోజనాలు చేయిస్తున్నారు. అందులో ఉండే మూలాలు పోగేట్టేస్తున్నాం. ఇంకా ఘోరమైన విషయమేంటంటే కార్తీక భోజనాలు కులపరంగా విడిపోవడం. వాళ్ల కార్తీక వనభోజనాలు.. వీళ్ల కార్తీక భోజనాలు... అంటూ విడిపోతున్నాం. అది దౌర్భాగ్యం. ఫైనల్లీ.. శివుడితో మీకు ఉన్న మానసిక సంబంధం గురించి? శివుడిని ఏ రూపంలో చూసినా అనుభూతి చెందుతాను. ఒళ్లు పులకరిస్తుంది. ఇలాంటి అనుభూతికి చాలామంది లోనవుతారనుకుంటున్నాను. దేవుడికి ఇంటెలిజెన్స్ కన్నా ఇన్నోసెన్స్ నచ్చుతుంది. నేను దేవుడిని ఫ్రెండ్‌లా ట్రీట్ చేస్తాను. ఫ్రెండ్‌తో ఉన్న అనుబంధం ఇచ్చే అనుభూతిని మాటల్లో చెప్పడం కష్టం. – డి.జి. భవాని మాలధారణ సమయంలో పాటించే నియమాల వల్ల కలిగే మేలు గురించి కొంచెం వివరంగా చెబుతారా? దీక్షలో ఉన్నప్పుడు తెల్లవారు జాము చన్నీటి స్నానం చేస్తాం. సైన్స్ పరంగా కానీ, ఆయుర్వేదం పరంగా కానీ చన్నీటి స్నానం వల్ల చాలా మేలు జరుగుతుంది. చర్మ సౌందర్యం పెరుగుతుంది. చర్మ వ్యాధులు రావు. చెంబుడు చల్లని నీళ్లు శరీరం మీద పడగానే లోపల గిర్రున తిరగడం ప్రారంభిస్తుంది. అందుకే ఫస్ట్ చెంబుడు నీళ్లు చల్లగా ఉంటాయి. ఆ తర్వాత వెచ్చదనం మొదలవుతుంది. ఇలా మనవాళ్లు ఏం పెట్టినా ఆరోగ్యపరమైన కారణం ఉంటుంది. -
రచనల్లో జీవించే ఉంటారు
రొమాంటిక్ సాంగ్ రాయాలంటే మంచి వయసులో ఉండాలా? ఉంటేనే రాయగలుగుతారా? అలాంటిదేం లేదు. మనసులో భావాలు మెండుగా ఉండాలే కానీ ఏ వయసులోనైనా ప్రేమ పాటలు రాయొచ్చు. అందుకు ఉదాహరణగా నిలిచినవాళ్లల్లో ఇంద్రగంటి శ్రీకాంత శర్మ ఒకరు. 74 ఏళ్ల వయసులో ఆయన కలం నుంచి ‘మనసైనదేదో..’ అనే ప్రేమ పాట కాగితం మీదకు వచ్చింది. ప్రేక్షకులను సమ్మోహనపరిచింది. ఆరోగ్యం సరిగ్గా లేని సమయంలోనూ ‘సమ్మోహనం’ కోసం ఆయన ఈ పాట రాయడం విశేషం. ఇదే శ్రీకాంత శర్మ రాసిన చివరిపాట. ఎన్నో అద్భుతమైన రచనలను మిగిల్చి, ఎప్పటికీ రచనల్లో గుర్తుండిపోయే ప్రముఖ కవి, సాహితీవేత్త ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గురువారం తెల్లవారుఝామున తుది శ్వాస విడిచారు. ఏడాది కాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న శ్రీకాంత శర్మ తన స్వగృహంలోనే నిద్రలో కన్ను మూశారు. 1944, మే 29న తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురంలో జన్మించారాయన. శ్రీకాంతశర్మ తండ్రి ఇంద్రగంటి హనమచ్ఛాస్త్రి మహా పండితులు. తండ్రి బాటలోనే సాహిత్య రంగంపై తనదైన ముద్రవేశారు. కవిత్వం, లలిత గీతం, చలన చిత్రం, యక్షగానం, కథ, నవల, నాటిక, వ్యాసం, పత్రికా రచన ఇలా బహు రూపాలుగా శ్రీకాంత శర్మ ప్రతిభ వికసించింది. జర్నలిస్ట్‌గా తన కెరీర్‌ను ప్రారంభించిన శ్రీకాంత శర్మ 1976లో ఆలిండియా రేడియో విజయవాడలో అసిస్టెంట్ ఎడిటర్‌గా చేరారు. ఆ తర్వాత సినీ కవిగా మారారు. ‘కృష్ణావతారం’ సినీ రచయితగా ఆయన తొలి సినిమా. అలాగే జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన నెలవంక, రావు – గోపాలరావు, రెండు జళ్ల సీత, పుత్తడి బొమ్మ వంటì సినిమాల్లో పాటలను రాశారు శ్రీకాంత శర్మ. ఆయన సతీమణి ఇంద్రగంటి జానకీబాల ప్రముఖ రచయిత్రి. ప్రముఖ దర్శకుడు ఇంద్రగంటి మోహన కృష్ణ ఈయన తనయుడే. మోహనకృష్ణ తెరకెక్కించిన ‘గోల్కొండ హైస్కూల్, ‘అంతకుముందు ఆ తర్వాత’, సమ్మోహనం’ సినిమాల్లోనూ పాటలు రాశారాయన. ‘ఇంటిపేరు ఇంద్రగంటి’ పేరుతో తన ఆత్మకథను 2018లో విడుదల చేశారు. తన సాహిత్య జీవితం, కుటుంబ విశేషాలు, రచయితగా తన అనుభవాలు ఇందులో పొందుపరిచారు. శ్రీకాంత శర్మ మృతి పట్ల పలువురు ఇండస్ట్రీ ప్రముఖులు తమ సంతాపాన్ని తెలియజేశారు. బంగారు పూలతో అభిషేకం చేశాను – తనికెళ్ల భరణి అనుభూతి కవిత్వం అనేది ఒక ప్రక్రియ. ‘అనుభూతి గీతాలు’ టైటిల్‌తో శ్రీకాంత శర్మగారు రాశారు. కవి, పండితుడు, సంస్కృతం బాగా చదువుకున్నవాడు. ఆయనది ఒక శకం. సాహిత్యంలో ఏ డౌట్ వచ్చినా ఆయన్నే అడిగేవాణ్ణి. ‘కవికి కనకాభిషేకం’ పేరుతో నేను ఆయనకు బంగారు పూలతో అభిషేకించుకునే అవకాశం లభించింది. 50 వేల రూపాయిల బంగారం పూలతోటి వారికి అభిషేకం చేయడం ఒక పండగ. అక్కినేని నాగేశ్వరరావు కూడా వచ్చారు. నా జీవితంలో అది బెస్ట్ మూమెంట్. మర్చిపోలేనిది. ఆయన అర్హుడు. ఇవాళ ఉదయం (గురువారం) వాళ్ల ఇంటికి వెళ్లి నమస్కరించుకొని వచ్చాను. వాళ్ల కుటుంబమంతా పండితుల సమూహం. వాళ్ల తండ్రి, భార్య, కుమారుడు అందరూ సాహితీవేత్తలే. తెలుగు సాహిత్యం గురించి ఆయన ఎంత గొప్పగా చెప్పగలరో సంస్కృత సాహిత్యం గురించీ అంతే గొప్పగా చెప్పగలరు. సంస్కృత కావ్యాలు కొన్ని తెలుగులోకి అనువదించారు. సంస్కృత కావ్యాల మీద నాకు ఆసక్తి కలగడానికి కారణం పరోక్షంగా ఆయనే. తెలుగు కావ్యాలనుంచి గొప్ప సాహిత్య సంపదను పరిచయం చేశారు. శ్రీకాంత శర్మగారు ఎంతో గొప్ప జీవితాన్ని అనుభవించారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలి. -
సూపర్ స్టార్ కృష్ణ చేతుల మీదుగా ‘ఓ మనిషి నీవెవరు’
రిజ్వాన్ కల్షాన్, సుమన్, చలపతిరావు, హరి, తరుణ్ కుమార్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఓమనిషి నీవెవరు’. గాడ్ మినీస్ర్టీస్ సమర్పణలో స్వర్ణ క్రియేషన్స్ పతాకంపై కృష్ణ మూర్తి రాజ్ కుమార్ నాయుడు దర్శకత్వంలో స్వర్ణ కుమారి దొండపాటి నిర్మిస్తున్నారు. ప్రభాకర్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం సూపర్ స్టార్ కృష్ణ స్వగృహంలో ఆయన చేతుల మీదుగా జరిగింది. అనంతరం ప్రసాద్ ల్యాబ్ లో మొదటీ వీడియో సాంగ్ ను తనికెళ్ల భరణి, సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ విడుదల చేసారు. తనికెళ్ల భరణి మాట్లాడుతూ ‘జీసస్ అంటే ప్రేమ, శాంతి. ఇలాంటి సినిమా వేడుకల్లో పాల్గొనడం అంటే నాకు సంతోషంగా ఉంటుంది. ఈ సినిమా డీవోపి నాకు బంధువు. ఆ కారణంగానే వేడుకకు తప్పక హాజరు కావాల్సి వచ్చింది. సినిమా అందరికీ మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని కోరుకుంటున్నా’ అని అన్నారు. ‘ఇలాంటి సినిమాలు చేయాలంటే చాలా ధైర్యం కావాలి. చక్కని సందేశాత్మక చిత్రమిది. పాటలు బాగున్నాయి’ అని అనూప్ రూబెన్స్ అన్నారు. సుమన్ మాట్లాడుతూ ‘నాకు కులం, మతం, ప్రాంతం లాంటి బేధాలు లేవు. నా దృష్టిలో అంతా ఒక్కటే. చెన్నైలో క్రిస్టిన్స్ స్కూల్ లోనే చదువుకున్నా. నా తల్లిదండ్రుపై క్రిస్టియన్స్ ప్రభావం ఉంది. అలా నేను కూడా జీసస్ ఆకర్షితుడినే. ఈ సినిమాలో పాత్ర చెప్పగానే ఆలోచించకుండా చేస్తానని చెప్పాను. చాలా వైవిథ్యంగా, కష్టంగా ఉండే పాత్ర కూడా. ఇలాంటి సినిమాలు చేయాలంటే చాలా ధైర్యం ఉండాలి. నటులందరికీ ఎంతో కమిట్ మెంట్ ఉండాలి. అది ఈ సినిమా యూనిట్ లో చూసాను. ఇలాంటి సినిమాలు చేయాలంటే అదృష్టం కూడా ఉండాలి. ఏసు పాత్రకు రిజ్వాన్ బాగా సూటయ్యాడు. అన్ని పాటల్లో ఫీల్ ఉంది. సినిమా విజయం సాధించి అందరికీ మంచి పేరు తీసుకొస్తుందన్న నమ్మకం ఉంద’ని అన్నారు. -
నా గురించి అందరికీ తెలియాలనుకోను
‘‘నాకు నేను చాలా గొప్పవాడ్ని కావచ్చు కానీ నా గురించి అందరికీ తెలియాలి అనే ఆశ నాకు లేదు. కానీ కొన్నిసార్లు మనల్ని అభిమానించే వారి కోసం కొన్ని పనులు ఖచ్చితంగా చేయాలి. అటువంటి ప్రయత్నమే ‘విశ్వదర్శనం’. ఈ ఆలోచనకు నీరు పెట్టింది, నారు పోసింది అంతా జనార్థన మహర్షి అనటంలో అతిశయోక్తి లేదు. నా పుట్టినరోజు సందర్భంగా టీజర్ రిలీజ్ చేసినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను’’ అన్నారు కళాతపస్వి కె.విశ్వనాథ్. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై కె.విశ్వనాథ్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘విశ్వదర్శనం’. టి.జి విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. ప్రముఖ రచయిత జనార్ధనమహర్షి దర్శకత్వం వహిస్తున్నారు. నేడు విశ్వనాథ్ జన్మదినం సందర్భంగా సోమవారం ‘విశ్వదర్శనం’ టీజర్‌ను విడుదల చేశారు. ప్రముఖ నటుడు తనికెళ్లభరణి, గాయని మాళవిక తదితులు పాల్గొన్నారు. తనికెళ్ల భరణి మాట్లాడుతూ– ‘‘అందరి దర్శకులకు అభిమానులు ఉంటారు. విశ్వనాథ్‌గారికి మాత్రం భక్తులు ఉంటారు. అటువంటి ఎంతో మంది భక్తుల్లో జనార్థన మహర్షి ఒకరు. ఈ సినిమాకు డబ్బులు ఎంత వస్తాయో చెప్పలేను కానీ కీర్తి మాత్రం పుష్కలంగా వస్తుంది’’ అన్నారు. జనార్థన మహర్షి మాట్లాడుతూ– ‘‘మా అమ్మ విశ్వనాథ్‌గారి భక్తురాలు. ఆయన తీసిన సినిమాల్లోని కథలను అమ్మ చెబుతుంటే వింటూ పెరిగాను. నాకు చిన్నప్పటినుండి విశ్వనాథ్‌గారు డైరెక్టర్ కాదు, హీరో. నాకు గురువు, దైవం అయిన తనికెళ్ల భరణి గారి దగ్గర మూడేళ్లు అసిస్టెంట్‌గా పని చేసి తర్వాత 100 సినిమాలకు పైగా మాటల రచయితగా పనిచేశాను. 2011లో నా సొంత బ్యానర్‌పై తీసిన ‘దేవస్థానం’లో విశ్వనాథ్‌గారిని డైరెక్ట్ చేసే భాగ్యం నాకు దక్కింది. మళ్లీ 2019లో ఆయనతో పనిచేసే అవకాశం ఈ ‘విశ్వదర్శనం’ సినిమా ద్వారా వచ్చింది. ఈ చిత్రంలో మేం ఆయన బయోగ్రఫీ చూపించటంలేదు. ఇండియాలో ఓ మహాదర్శకుని సినిమాలవల్ల సొసైటీలో ఎలాంటి ప్రభావం ఆ రోజుల్లో పడింది అనేది మా సినిమాలో చూపించబోతున్నాం’’ అన్నారు. ‘‘విశ్వనాథ్ గారి పక్కన కూర్చుని మాట్లాడటమే అదృష్టంగా భావిస్తున్నాను’’ అన్నారు వివేక్ కూచిభొట్ల. ‘‘విశ్వనాథ్‌గారి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఆయన కథను నా గొంతుతో డబ్బింగ్ చెప్పటం నా అదృష్టంగా భావిస్తున్నాను’’ అన్నారు మాళవిక. -
ఆసక్తికరంగా ‘ది క్రైమ్’
టీనేజ్ వయసులో పిల్లలతో తల్లిదండ్రుల అనుబంధం సరిగా లేకపోతే ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుందో అని చెప్పిన లఘు చిత్రం 'ది క్రైమ్'. సమకాలీన యాంత్రిక జీవనంలో తల్లిదండ్రులు, పిల్లల మధ్య తరిగిపోతున్న రిలేషన్స్, ప్రేమానురాగాల ప్రాముఖ్యతను చాటిచెప్పిందీ ఇండిపెండెట్ ఫిలిం. ప్రముఖ నటుడు, దర్శకుడు, మాటల రచయిత తనికెళ్ల భరణి, సింధు, అంజలి, యుగ్ రామ్ నటించిన ఈ షార్ట్ ఫిలింకు ప్రేక్షకుల నుంచి విశేషంగా ప్రశంసలు లభించాయి. ఈ చిత్రానికి ప్రశాంత్ వల్లూర్ దర్శకత్వం వహించగా, రమేష్ నాయుడు నిర్మించారు. శనివారం సాయంత్రం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్‌లో జరిగిన ప్రీమియర్‌కు చిత్ర యూనిట్‌తో ప్రముఖ నిర్మాత లగడపాటి శ్రీధర్, నటుడు వంశీ చాగంటి ,టీఎన్ఆర్ తదితరులు హాజరయ్యారు. నిర్మాత రమేష్ నాయుడు మాట్లాడుతూ.. ‘ప్రశాంత్ కాన్సెప్ట్ చెప్పినప్పుడే నాకు నచ్చింది. ఓ మంచి సందేశాన్ని ప్రజలకు చేరవేయాలనుకొన్నాం. సమాజానికి ఉపయోగపడే సందేశాన్ని తనికెళ్ల భరణి గారితో చెప్పిస్తే బాగుంటుందని అనుకొని సంప్రదించాం. కాన్సెప్ట్ వినగానే ఆయన కూడా ఇంప్రెస్ అయి నటించడానికి ఆసక్తిచూపారు. ప్రతీ ఒక్కరు చూసి ఈ వీడియోను షేర్ చేయాలని కోరుకొంటున్నాం’ అని అన్నారు. దర్శకుడు ప్రశాంత్ వల్లూర్ మాట్లాడుతూ... ‘సమాజంలోని సమస్యను తీసుకొని ది క్రైమ్ మూవీని రూపొందించాం. మీరు ఈ లఘు చిత్రాన్ని చూసి అలా వదిలేయకండి. మీ కుటుంబంలో ఇలాంటి పరిస్థితి రాకుండా చూసుకొనేలా జాగ్రత్త తీసుకోండి. మీ చుట్టు ఉన్న వారికి, స్నేహితులు, సన్నిహితులకు ఈ సందేశాన్ని చేరవేయండి. ఇలాంటి సందేశాలు సమాజానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. పిల్లలు, తల్లిదండ్రుల బంధాల మధ్య దూరం పెరుగుతున్న పరిస్థితుల్లో ఇలాంటి సందేశం ఉపయోగంగా ఉంటుంది. షార్ట్ ఫిలిం అయినప్పటికీ.. ఓ సినిమా లాంటి ఫీలింగ్ రావడానికి కృష్టి చేసిన యూనిట్‌లోని ప్రతీ ఒక్కరికి నా థ్యాంక్స్’ అని అన్నారు. నిర్మాత లగడపాటి శ్రీధర్ మాట్లాడుతూ.. సమాజంలో ప్రతీ ఇంట్లో ఉండే సమస్యను ఎత్తిచూపుతూ మూవీని రూపొందించడం అభినందనీయం. తల్లిదండ్రులు గానీ, పిల్లలు గానీ, లవర్స్ మధ్య ఉండాల్సిన సున్నితమైన బంధాల గురించి చక్కగా తెరకెక్కించారు. నేను అమితంగా అభిమానించే నటుడు, దర్శకుడు, రచయిత తనికెళ్ల భరణి నటించడం, యూనిట్‌ను ప్రోత్సహించడం అభినందనీయం. ఈ సినిమా అందరిలో ధైర్యాన్ని పెంపొందిస్తుంది '' అని అన్నారు. తనికెళ్ల భరణి మాట్లాడుతూ.. ఓ మంచి ఆలోచనకు తెరరూపం కల్పించడానికి కారణమైన ప్రశాంత్ భార్యను అభినందించాలి. తెలుగు సాహిత్యంలో మహా రచయిత గుడిపాటి వెంకటాచలం 'విలువ శిక్షణ' అనే పుస్తకం రాశారు. ఆ పుస్తకంలో ముందుమాట రాస్తూ.. ఇలాంటి పుస్తకం 50 ఏళ్ల క్రితం దొరికి ఉంటే నా పిల్లలను మరింత మంచిగా, విలువలతో పెంచేవాడిని అని చెప్పారు. ద్వందార్థాలతో, బూతు కంటెంట్‌తో షార్ట్ ఫిలింస్ వస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి మంచి సందేశంతో సినిమా రావడం గొప్ప విషయం. కష్టపడి, ఇష్టంగా పనిచేసి నటించాం. అంజలి, సింధు చక్కగా నటించారు '' అని అన్నారు. ఈ లఘు చిత్రంలో తనికెళ్ల భరణి, అంజలి, యుగ రాం, సింధు వీ తదితరులు ముఖ్య పాత్రలను పోషించారు. -
నాటకానికి పంతం సేవలు అభినందనీయం
కాకినాడ కల్చరల్: నాటక రంగానికి పంతం పద్మనాభం స్మారక పరిషత్ చేస్తున్న సేవలు అభినందనీయమని ప్రముఖ నటుడు, రచయిత తనికెళ్ళ భరణి అన్నారు. స్థానిక సూర్యకళామందిర్‌లో నాలుగు రోజులుగా పంతం పద్మనాభం స్మారక కళాపరిషత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 19వ రాష్ట్రస్థాయి నాటికల పోటీలకు ఆదివారం తనికెళ్ల ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనను కళాపరిషత్ సభ్యులు ఘనంగా సత్కరించారు. మరో విశిష్ట అతిథి, సినీ నటుడు గౌతమ్‌రాజు మాట్లాడుతూ కళలకు కాణాచి కాకినాడ అన్నారు. కాకినాడ కళాకారులతో తనకు ఉన్న అనుబంధాలను వివరించారు. ఈ కార్యక్రమానికి ముందు స్వర్గీయ పి.సీతారామ బాలాజీరావు (దొరబాబు) కళా ప్రాంగణాన్ని మార్కండేయ నాటక కళాపరిషత్ వ్యవస్థాపకులు పడాల రవి ప్రారంభించారు. తదుపరి పంతం పద్మనాభం చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి వెలిగించి నివాళులు అర్పించారు. కళాపరిషత్ వ్యవస్థాప కార్యదర్శి బుర్రా పద్మనాభం మాట్లాడుతూ నాటక రంగానికి పూర్వవైభం తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. తదుపరి కళావాణి ఉభయగోదావరి సంస్థ సమర్పణలో రేలంగి మల్లిక్ రచించిన ‘ప్రపంచం నీ గుప్పెటో’్ల నాటిక ఆర్.ఉదయ్‌భాస్కర్ దర్శకత్వంలో ప్రదర్శించారు. ఇంటికి మహాలక్ష్మిగా భావించాల్సిన ఆడపిల్లలపై చూపుతున్న వివక్షకు అద్దం పట్టేలా నాటిక సాగింది. తదుపరి మీ కోసమే సంస్థ సమర్పణలో డాక్టర్ బొక్కా శ్రీనివాసరావు దర్శకత్వంలో ‘జాగా’ నాటిక ప్రదర్శించారు. వృద్ధాప్యంలో ముసలివాళ్లు అనుభవిస్తున్న నరక యాతనకు అద్దం పట్టేలా నాటిక సాగింది. గాలిబ్, రామసత్యనారాయణ, పంతం వేణు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో బాజీబోయిన వెంకటేష్ నాయుడు, తురగా సూర్యారావు, టీవీ.సత్యనారాయణరెడ్డి, ఎస్ఎస్ రాజా తదితరులు పాల్గొన్నారు. -
సోషియో ఫాంటసీ
అమర్, సంతోషి, షాలు చౌరస్య, తనికెళ్ల భరణి, పోసాని ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘అంతర్వేదమ్’. చందిన రవికిశోర్ దర్శకత్వంలో క్రౌడ్ ఫండ్‌తో నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 21న విడుదలవుతోంది. ‘‘సోషియో ఫాంటసీగా తెరకెక్కిన చిత్రమిది. క్రౌడ్ ఫండింగ్‌తో రెండేళ్లపాటు కష్టపడి తెరకెక్కించిన చిత్రమిది. ప్రేక్షకులు మా కష్టాన్ని అర్థం చేసుకొని సినిమాని ఆదరిస్తారని కోరుకుంటున్నా’’ అన్నారు రవికిశోర్. ‘‘యూనిట్ అంతా కొత్తవారే. వాళ్ల ప్యాషన్, ప్రేమ చూస్తుంటే ముచ్చటేసింది. క«థ, కథనాల పరంగా ఈ చిత్రాన్ని ది బెస్ట్‌గా రవికిశోర్ తెరకెక్కించాడు’’ అన్నారు తనికెళ్ల. ఈ చిత్రానికి సహ నిర్మాత: ఎస్.ఎన్. -
దసరాకు ఫిబ్రవరి ఘటన
అతుల్ కులకర్ణి, మనోజ్ మిశ్రా, తనికెళ్ల భరణి, యశ్పాల్ శర్మ, షిజ్జు, సంజు శివరామ్ ముఖ్య తారలుగా రాజేష్ టచ్ రివర్ దర్శకత్వంలో తెలుగు, ఒడిస్సాలో రూపొందుతోన్న క్రైమ్ థ్రిల్లర్ ‘పట్నఘడ్’. ‘23 ఫిబ్రవరి 2018, ఒడిస్సా’ అనేది ట్యాగ్‌లైన్. రేంజ్ రాయల్ సినీ ల్యాబ్స్‌పై శ్రీధర్ మార్తా నిర్మిస్తున్నారు. ఈ సినిమాను దసరాకు రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ‘ఒడిస్సాలో జరిగిన ఓ సంఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాం. ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్‌గా అతుల్ కులకర్ణి నటిస్తున్నారు’’ అన్నారు రాజేష్. ‘‘ప్రోస్థటిక్ మేకప్ డిజైనర్‌గా ఎన్.జి. రోషన్ వర్క్ చేస్తున్నారు. హిందీ చిత్రం ‘102 నాటౌట్’ ఫేమ్ జార్జి జోసెఫ్ సంగీతం అందిస్తున్నారు. ఆర్.పి. పట్నాయక్ ఈ సినిమా కోసం ఫోక్ సాంగ్‌ను కంపోజ్ చేయడం విశేషం’’ అన్నారు నిర్మాత శ్రీధర్ మార్తా. -
బంగారు దర్శకుని కథ
దక్షిణాది చలన చిత్రసీమ గర్వించదగ్గ దర్శకులు కె.విశ్వనాథ్ జీవితం వెండితెరపైకి రానుంది. రచయిత, డైరెక్టర్ జనార్ధన మహర్షి దర్శకత్వంలో ‘విశ్వదర్శనం’ పేరుతో ఈ చిత్రం తెరకెక్కనుంది. ‘వెండి తెర చెప్పిన బంగారు దర్శకుని కథ’ అన్నది ట్యాగ్‌లైన్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టి.జి.విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలు గురుపూర్ణిమ సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌లో జరిగాయి. కె. విశ్వనాథ్ దంపతులు, నటుడు తనికెళ్ల భరణి, చిత్రనిర్మాత టి.జి. విశ్వప్రసాద్, చిత్ర సహనిర్మాత వివేక్ కూచిభొట్ల సినిమా స్క్రిప్ట్‌ని జనార్ధన మహర్షికి అందజేశారు. ‘‘విశ్వనాథ్‌గారి చరిత్ర పలువురికి ఆదర్శం. ఇలాంటి మహనీయుడి చరిత్రను చూపించాలనే ఆకాంక్షతో ఈ చిత్రానికి శ్రీకారం చుట్టాం. ఆయన పుట్టుక నుంచి ఇప్పటి వరకూ ఆయన జీవితం ఎలా సాగింది? అనే నేపథ్యంలో కథ సాగుతుంది. ఆగస్టులో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం. నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో ప్రకటిస్తాం’’ అని చిత్రబృందం పేర్కొంది. సంగీతం: స్వరవీణాపాణి. -
అప్పుడు సినిమాలు చేయకూడదనుకున్నా
‘‘చాలా గ్యాప్ తర్వాత మీ ముందుకొస్తున్నా. సరైన కథ తోచక నిరాసక్తతలో ఉండి ఇక సినిమాలు చేయకపోవడమే బెటర్ అనుకుంటున్న టైమ్‌లో తనికెళ్ల భరణిగారు రాసిన ‘ఆటగదరా శివ’ పాట విన్నా. అది టైటిల్‌గా బావుంటుందనిపించింది. ఆ మరుసటిరోజే రాక్‌లైన్ వెంకటేశ్‌గారు ‘ఆటగదరా శివ’ సినిమా గురించి చెప్పారు. నాకూ రోడ్ ఫిల్మ్ చేయాలని కోరిక ఉండటంతో ఒప్పుకున్నా’’ అని దర్శకుడు చంద్రసిద్ధార్థ్ అన్నారు. ఉదయ్ శంకర్ కథానాయకుడిగా దొడ్డన్న, ‘హైపర్’ ఆది, దీప్తి, ‘చలాకీ’ చంటి, ‘చమ్మక్’ చంద్ర, భద్రం నటించిన చిత్రం ‘ఆటగదరా శివ’. ‘ఆ నలుగురు’ ఫేమ్ చంద్రసిద్ధార్థ్ దర్శకత్వంలో రాక్‌లైన్ వెంకటేశ్ నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా చంద్రసిద్ధార్థ్ మాట్లాడుతూ– ‘‘కన్నడలో హిట్ అయిన ‘రామ రామ రే’ చిత్రానికి స్పిరిచ్యువల్ యాంగిల్‌ని, ఇంకో లేయర్‌ని కలగలిపి ‘ఆటగదరా శివ’ కథ సిద్ధం చేశా. పెద్ద పెద్ద సినిమాలు చేసే వెంకటేశ్‌గారు ఈ సినిమా తీయడం ధైర్యం చేయడమే. ఇది రాగిముద్దలాంటి సినిమా. అయినా మా నటీనటులు దాన్ని తినిపించేలా కష్టపడ్డారు’’ అన్నారు. ‘‘ఆటగదరా శివ’ నిర్మాతగా సంతృప్తినిచ్చింది. నటీనటులు, టెక్నీషియన్స్ ఛాలెంజింగ్‌గా తీసుకుని ఈ సినిమా కోసం కష్టపడ్డారు. వాసుకి సంగీతం బాగుంది. పులగం చిన్నారాయణ, చైతన్యప్రసాద్ రాసిన పాటలు బాగున్నాయి’’ అని రాక్‌లైన్ వెంకటేశ్ అన్నారు. ‘‘వెంకటేశ్‌గారి బ్యానర్లో హీరోగా పరిచయం కావడం నా అదృష్టం. చంద్రసిద్ధార్థ్గారి డైరక్షన్లో చేయడం హ్యాపీ’’ అన్నారు ఉదయ్ శంకర్. ‘‘ఈ సినిమా కోసం ఆర్నెల్లు గడ్డం పెంచా’’ అన్నారు కన్నడ నటుడు దొడ్డన్న. -
పల్లెటూరు టు వండర్ వరల్డ్
రచయిత, దర్శకుడు విజయేంద్రప్రసాద్ వద్ద అసి స్టెంట్గా పనిచేసిన కొవెర హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహించిన చిత్రం ‘యు’. హిమాన్షి కాట్రగడ్డ కథానాయిక. నాగానిక సమర్పణలో విజయలక్ష్మీ కొండా, నాగానిక చాగంరెడ్డి నిర్మించిన ఈ సినిమా జూలైలో రిలీజ్ కానుంది. హీరో, దర్శకుడు కొవెర మాట్లాడుతూ– ‘‘యు’ టైటిల్‌కి కథే హీరో. విజయేంద్రప్రసాద్‌గారి వద్ద పనిచేసిన అనుభవంతో ఈ కథ రాసుకున్నా. పల్లెటూరిలో మొదలై వండర్ వరల్డ్‌లో ఎండ్ అయ్యే కథ ఇది. ఈ చిత్రం చేయడానికి మా అమ్మ, నా భార్య మద్దతుగా నిలిచారు. టాలీవుడ్లో ఇప్పటివరకూ ఎవరూ టచ్ చేయని ప్రాజెక్ట్ ఇది’’ అన్నారు.‘‘మా అబ్బాయి ప్రతిరోజూ నన్ను ‘ఒక్క చాన్స్ అమ్మ. సినిమా చేయాలి’ అని అడిగేవాడు. మా అబ్బాయి కోసం ఈ సినిమా చేశాం’’ అన్నారు విజయలక్ష్మీ కొండా. ‘‘డిజిటలైజేషన్కి సంబంధించిన కథ ఇది. దాన్ని పాజిటివ్ కోణంలో చూపించా రు’’ అన్నారు నటుడు ‘శుభలేఖ’ సుధాకర్. ‘‘సినిమా పరిశ్రమకు ఎన్నో ఆశలతో వచ్చారు కొవెర. ప్రాణం పెట్టి ఈ సినిమా చేశారు’’ అన్నారు నటుడు తనికెళ్ల భరణి. నాగానిక, హిమాన్షి, కెమెరామేన్ రాకేశ్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సినిమాకు సంగీతం: సత్య మహావీర్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: నాగశివ గణపర్తి, సహ నిర్మాత: మూర్తి నాయుడు పాదం.