![Ameerpet to America Trailer Launch - Sakshi](/styles/webp/s3/article_images/2018/03/12/a2a.jpg.webp?itok=LH8NfSm4)
‘అమీర్‌పేట్‌లో కళ్లు మూసుకుని అమెరికాలో ఉన్న బిల్డింగులు.. కార్లు.. డాలర్లు.. ఇట్లా అన్నీ పగటి కలలు సింగిల్ టేక్‌లో కనేస్తుంటారు మన యూత్’.. ‘అమెరికా అంటే నీకు అంత ఇష్టం ఏంటిరా బాబూ’.. ‘అమెరికా వెళ్లిన ప్రతివోడూ అమీర్‌పేట్‌లో తిరిగినోడే’... వంటి డైలాగులు ‘అమీర్ పేట్ టు అమెరికా’ సినిమాపై ఆసక్తి పెంచుతున్నాయి. బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, మణిచందన, సమ్మెటగాంధీ, రజని, మేఘనా లోకేష్, సాషా సింగ్, వైవా హర్ష ముఖ్యపాత్రల్లో చల్లా భానుకిరణ్ దర్శకత్వంలో స్వప్న కొమండూరి సమర్పణలో పద్మజ నిర్మించిన ఈ చిత్రం ట్రైలర్‌ని హైదరాబాద్‌లో విడుదల చేశారు.
నటుడు తనికెళ్ల భరణి మాట్లాడుతూ– ‘‘అమీర్‌పేట్ టు అమెరికా ప్రయాణాన్ని ఈ సినిమాలో చూపించాం. ఈ సినిమాకు రామ్మోహన్ అన్నీ తానై వ్యవహరించారు. యూత్‌ను అలరించే అన్ని అంశాలు ఉన్న ఈ చిత్రం హిట్ అవుతుంది’’ అన్నారు. ‘‘ఈనెల 23న పాటలు, 30న సినిమా విడుదల చేస్తాం’’ అన్నారు ఈ చిత్రానికి కథ, కర్మ, క్రియ అయిన రామ్మోహన్ కొమండూరి. నిర్మాత పద్మజ, సంగీత దర్శకుడు కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment