
టాలీవుడ్ కమెడియన్ బ్రహ్మనందం (Brahma Anandam), ఆయన కుమారుడు రాజ గౌతమ్ (Raja Gautam) బ్రహ్మ ఆనందం సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తారు. ఆర్‌వీఎస్ నిఖిల్ దర్శకత్వం వహించిన ఫిబ్రవరి 14న థియేటర్లలో విడుదలైంది. ఈ మూవీలో బ్రహ్మానందం, ఆయన తనయుడు రాజా గౌతమ్ తాతా మనవళ్లుగా నటించారు. తాజాగా ఈ మూవీ సక్సెస్ మీట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవెంట్‌కు హాజరైన రాజా గౌతమ్ తండ్రి బ్రహ్మనందం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. మీ నాన్న దగ్గర నుంచి ఏం నేర్చుకున్నారని ప్రశ్నించగా.. దానికి సమాధానమిచ్చారు.
రాజా గౌతమ్ మాట్లాడుతూ..' నాన్న దగ్గర నుంచి నేను చాలా నేర్చుకున్నా. ముఖ్యంగా ఆయనకు నుంచి వచ్చిన క్వాలిటీ గ్రాటిట్యూడ్. చిన్నప్పటి నుంచి చూస్తున్నా. ఏ ఈవెంట్ జరిగినా జంధ్యాల గారి పేరు రాకుండా ఉండదు. ఎవరైనా బాగా చేశారని తెలిస్తే వెంటనే ఫోన్ చేసి అభినందిస్తారు. రంగమార్తాండ చిత్రంలో వైఫ్ చనిపోతే చితి దగ్గర ఏడ్చే సీన్ ఉంటుంది. ఆ సీన్ కోసం నాన్న భోజనం చేయకుండా ఉన్నారు. ఆ సీన్‌లో నేను కొంచెం వీక్‌గా కనిపించాలి.. అందుకే భోజనం చేయకపోతే ఆ సీన్ ఎలివేట్ అవుతుంది అన్నారు. ఈ వయసులో కూడా ఆయన నిరూపించుకోవాలనే తపన ఉంది. అందుకే ఆయనే ఆదర్శం' అని ప్రశంసలు కురిపించారు.
కాగా.. ఈ చిత్రంలో ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్ హీరోయిన్లుగా నటించారు. సావిత్రి, ఉమేష్ కుమార్ సమర్పణలో రాహుల్ యాదవ్ నక్కా నిర్మించారు. బ్రహ్మా ఆనందం చూసిన వారు నా నటన గురించి మాట్లాడుతుండటం హ్యాపీగా ఉందని రాజా గౌతమ్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment