రిజ్వాన్ కల్షాన్, సుమన్, చలపతిరావు, హరి, తరుణ్ కుమార్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఓమనిషి నీవెవరు’. గాడ్ మినీస్ర్టీస్ సమర్పణలో స్వర్ణ క్రియేషన్స్ పతాకంపై కృష్ణ మూర్తి రాజ్ కుమార్ నాయుడు దర్శకత్వంలో స్వర్ణ కుమారి దొండపాటి నిర్మిస్తున్నారు. ప్రభాకర్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం సూపర్ స్టార్ కృష్ణ స్వగృహంలో ఆయన చేతుల మీదుగా జరిగింది. అనంతరం ప్రసాద్ ల్యాబ్ లో మొదటీ వీడియో సాంగ్ ను తనికెళ్ల భరణి, సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ విడుదల చేసారు.
తనికెళ్ల భరణి మాట్లాడుతూ ‘జీసస్ అంటే ప్రేమ, శాంతి. ఇలాంటి సినిమా వేడుకల్లో పాల్గొనడం అంటే నాకు సంతోషంగా ఉంటుంది. ఈ సినిమా డీవోపి నాకు బంధువు. ఆ కారణంగానే వేడుకకు తప్పక హాజరు కావాల్సి వచ్చింది. సినిమా అందరికీ మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని కోరుకుంటున్నా’ అని అన్నారు. ‘ఇలాంటి సినిమాలు చేయాలంటే చాలా ధైర్యం కావాలి. చక్కని సందేశాత్మక చిత్రమిది. పాటలు బాగున్నాయి’ అని అనూప్ రూబెన్స్ అన్నారు.
సుమన్ మాట్లాడుతూ ‘నాకు కులం, మతం, ప్రాంతం లాంటి బేధాలు లేవు. నా దృష్టిలో అంతా ఒక్కటే. చెన్నైలో క్రిస్టిన్స్ స్కూల్ లోనే చదువుకున్నా. నా తల్లిదండ్రుపై క్రిస్టియన్స్ ప్రభావం ఉంది. అలా నేను కూడా జీసస్ ఆకర్షితుడినే. ఈ సినిమాలో పాత్ర చెప్పగానే ఆలోచించకుండా చేస్తానని చెప్పాను. చాలా వైవిథ్యంగా, కష్టంగా ఉండే పాత్ర కూడా. ఇలాంటి సినిమాలు చేయాలంటే చాలా ధైర్యం ఉండాలి. నటులందరికీ ఎంతో కమిట్ మెంట్ ఉండాలి. అది ఈ సినిమా యూనిట్ లో చూసాను. ఇలాంటి సినిమాలు చేయాలంటే అదృష్టం కూడా ఉండాలి. ఏసు పాత్రకు రిజ్వాన్ బాగా సూటయ్యాడు. అన్ని పాటల్లో ఫీల్ ఉంది. సినిమా విజయం సాధించి అందరికీ మంచి పేరు తీసుకొస్తుందన్న నమ్మకం ఉంద’ని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment