అల్లుడి సినిమాకి మామ క్లాప్‌ | Chiranjeevi Claps for His Son in Law Kalyan Dev's Debut Movie | Sakshi
Sakshi News home page

అల్లుడి సినిమాకి మామ క్లాప్‌

Published Thu, Feb 1 2018 12:31 AM | Last Updated on Tue, Sep 18 2018 8:13 PM

Chiranjeevi Claps for His Son in Law Kalyan Dev's Debut Movie - Sakshi

సాయి కొర్రపాటి, గుణ్ణం గంగరాజు, కల్యాణ్‌ దేవ్, చిరంజీవి, సెంథిల్, కీరవాణి, రాజమౌళి, మాళవికా నాయర్, రాకేష్‌ శశి, ఎన్వీ ప్రసాద్‌

సన్‌ ఇన్‌ లా... అంటే అల్లుడు అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందులోనే ‘సన్‌’ కూడా ఉంది. అంటే కుమారుడు. ఓన్‌ సన్‌ రామ్‌చరణ్‌ని సక్సెస్‌ఫుల్‌ హీరోగా చూస్తున్న చిరంజీవి ఇప్పుడు అల్లుడు కల్యాణ్‌ దేవ్‌లోనూ సన్‌ని చూసుకుంటారని ఊహించవచ్చు. చిరు చిన్న అల్లుడు కల్యాణ్‌ దేవ్‌ హీరోగా పరిచయం అవుతోన్న సినిమా బుధవారం ప్రారంభమైంది. ‘ఈగ’, ‘లెజెండ్‌’ వంటి భారీ చిత్రాలతో పాటు ‘ఊహలు గుసగుసలాడె’, ‘దిక్కులు చూడకు రామయ్య’ వంటి స్మాల్‌ బడ్జెట్‌ హిట్‌ మూవీస్‌ కూడా తీసిన వారాహి చలన చిత్రం పై ఈ చిత్రం రూపొందనుంది.

‘జత కలిసె’ ఫేమ్‌ రాకేష్‌ శశి దర్శకత్వంలో రజని కొర్రపాటి ఈ సినిమా నిర్మిస్తున్నారు. ‘ఎవడే సుబ్రమణ్యం’ ఫేమ్‌ మాళవికా నాయర్‌ కథానాయిక. దేవుని పటాలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి చిరంజీవి క్లాప్‌ ఇవ్వగా, దర్శకుడు రాజమౌళి గౌరవ దర్శకత్వం వహించారు. సంగీత దర్శకుడు కీరవాణి కెమెరా స్విచ్చాన్‌ చేశారు. నిర్మాత సాయి కొర్రపాటి మాట్లాడుతూ– ‘‘చిరంజీవిగారి అల్లుడు కల్యాణ్‌ దేవ్‌ని మా సినిమాతో టాలీవుడ్‌కి పరిచయం చేయడం చాలా ఆనందంగా ఉంది.

రాకేష్‌ శశి తయారు చేసిన అద్భుతమైన కథను ఎక్కడా రాజీపడకుండా భారీ నిర్మాణ విలువలతో తెరకెక్కిస్తాం. ‘బాహుబలి’ చిత్రానికి పని చేసిన సెంథిల్‌ కుమార్‌ మా సినిమాకి కెమెరా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అతి త్వరలో రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభిస్తాం’’ అన్నారు. ఎన్వీ ప్రసాద్, గుణ్ణం గంగరాజు, కల్యాణ్‌ కోడూరి, అవసరాల శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. తనికెళ్ల భరణి, పోసాని కృష్ణమురళి, నాజర్, రాజీవ్‌ కనకాల, మురళీశర్మ, ‘సత్యం’ రాజేష్, ప్రగతి, కళ్యాణి నటరాజన్, తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: యోగేష్, సమర్పణ: సాయి శివాని, నిర్మాణం: సాయి కొర్రపాటి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement