Malavikanaiyar
-
చిరు అల్లుడు విజేత
చిరంజీవి నటించిన ‘విజేత’ చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. కోదండ రామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 1985లో రిలీజై సంచలన విజయం సాధించింది. ఇప్పుడు అదే టైటిల్‌ని చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ దేవ్ హీరోగా పరిచయమవుతోన్న చిత్రానికి పెట్టడం విశేషం. రాకేశ్ శశి దర్శకత్వంలో సాయి కొర్రపాటి వారాహి సంస్థలో రజినీ కొర్రపాటి నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘విజేత’ టైటిల్ అనౌన్స్ చేశారు. ‘లైటింగ్ అప్ స్మైల్స్ ఆన్ అదర్స్ ఫేసెస్ ఈజ్ ఆల్సో ఎ సక్సెస్’ అనేది ట్యాగ్ లైన్.(ఇతరుల ముఖాల్లో వెలుగు చూడటం కూడా విజయమే అని అర్థం). ఇందులో మాళవికా నాయర్ కథానాయిక. ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ‘బాహుబలి’ ఫేమ్ సెంథిల్ కుమార్ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. నాజర్, తనికెళ్ల భరణి, మురళీ శర్మ, ‘సత్యం’ రాజేష్, ప్రగతి, కల్యాణీ నటరాజన్, పోసాని, రాజీవ్ కనకాల, జయప్రకాశ్ (తమిళ్) తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సమర్పణ: సాయి శివాణి, సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్. -
టాక్సీవాలాది విచిత్రమైన కథ – అల్లు అరవింద్
‘‘టాక్సీవాలా’ నాకో కొత్త ఎక్స్పీరియన్స్. విజయ్ దేవరకొండ కథ విని ఎగ్జయిట్ అయ్యాడు. ఎస్.కె.ఎన్ నిర్మాతగా విజయ్ దేవరకొండతో ఈ సినిమా చేశాడు. నిర్మాతగా తనకు మంచి భవిష్యత్ ఉండాలి. విచిత్రమైన సబ్జెక్ట్ ఇది. కొత్తగా ఉంటుంది. విజయ్ దేవరకొండ జెన్యూన్ ఆర్టిస్ట్. తనకు గొప్ప భవిష్యత్ ఉంటుంది’’ అని నిర్మాత అల్లు అరవింద్ అన్నారు. విజయ్ దేవరకొండ హీరోగా, మాళవికా నాయర్, ప్రియాంక జవాల్కర్ హీరోయిన్స్‌గా రాహుల్ సంక్రితియాన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘టాక్సీవాలా’. జిఏ 2, యూవీ పిక్చర్స్‌పై ఎస్.కె.ఎన్ నిర్మించిన ఈ సినిమా టీజర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ‘‘ది ఎండ్’ తర్వాత నా దర్శకత్వంలో వస్తోన్న చిత్రమిది. ఎక్కడా తగ్గకుండా సినిమాను కంప్లీట్ చేశాం. చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. గ్రాఫిక్స్ పనులు జరుగుతున్నాయి. సినిమా అందరికీ నచ్చేలా ఉంటుంది’’ అన్నారు రాహుల్ సంక్రితియాన్. ‘‘ఒకప్పుడు గీతా ఆర్ట్స్‌లో వచ్చిన చిరంజీవిగారు, పవన్‌కల్యాణ్‌గారి సినిమాలకు బ్యానర్స్ కట్టేవాణ్ణి. ఇప్పుడు ఆ బ్యానర్లో నిర్మాతగా నా పేరు రావడం గొప్ప విషయంగా భావిస్తున్నా’’ అన్నారు ఎస్.కె.ఎన్. ‘‘మంచి టాలెంట్, సినిమాపై ప్యాషన్ ఉన్నవారి కోసం అల్లు అరవింద్‌గారి ఆశీర్వాదంతో జీఏ2 స్టార్ట్ చేశాం. ‘టాక్సీవాలా’ జర్నీలో యు.వి.క్రియేషన్స్ వారు నాకు సపోర్ట్ ఇచ్చారు’’ అన్నారు నిర్మాత ‘బన్ని’ వాసు. ‘‘మే 18న మా సినిమా విడుదలవుతుంది. సినిమా చూసి అందరూ పడి పడినవ్వుకుంటారు’’ అన్నారు విజయ్ దేవరకొండ. ‘‘ఓ మంచి చిత్రంలో నటించినందుకు ఆనందంగా ఉంది’’ అన్నారు కథానాయికలు మాళవికా నాయర్, ప్రియాంక జవాల్కర్. -
అల్లుడి సినిమాకి మామ క్లాప్
సన్ ఇన్ లా... అంటే అల్లుడు అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందులోనే ‘సన్’ కూడా ఉంది. అంటే కుమారుడు. ఓన్ సన్ రామ్‌చరణ్‌ని సక్సెస్ఫుల్ హీరోగా చూస్తున్న చిరంజీవి ఇప్పుడు అల్లుడు కల్యాణ్ దేవ్లోనూ సన్ని చూసుకుంటారని ఊహించవచ్చు. చిరు చిన్న అల్లుడు కల్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అవుతోన్న సినిమా బుధవారం ప్రారంభమైంది. ‘ఈగ’, ‘లెజెండ్’ వంటి భారీ చిత్రాలతో పాటు ‘ఊహలు గుసగుసలాడె’, ‘దిక్కులు చూడకు రామయ్య’ వంటి స్మాల్ బడ్జెట్ హిట్ మూవీస్ కూడా తీసిన వారాహి చలన చిత్రం పై ఈ చిత్రం రూపొందనుంది. ‘జత కలిసె’ ఫేమ్ రాకేష్ శశి దర్శకత్వంలో రజని కొర్రపాటి ఈ సినిమా నిర్మిస్తున్నారు. ‘ఎవడే సుబ్రమణ్యం’ ఫేమ్ మాళవికా నాయర్ కథానాయిక. దేవుని పటాలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి చిరంజీవి క్లాప్ ఇవ్వగా, దర్శకుడు రాజమౌళి గౌరవ దర్శకత్వం వహించారు. సంగీత దర్శకుడు కీరవాణి కెమెరా స్విచ్చాన్ చేశారు. నిర్మాత సాయి కొర్రపాటి మాట్లాడుతూ– ‘‘చిరంజీవిగారి అల్లుడు కల్యాణ్ దేవ్‌ని మా సినిమాతో టాలీవుడ్‌కి పరిచయం చేయడం చాలా ఆనందంగా ఉంది. రాకేష్ శశి తయారు చేసిన అద్భుతమైన కథను ఎక్కడా రాజీపడకుండా భారీ నిర్మాణ విలువలతో తెరకెక్కిస్తాం. ‘బాహుబలి’ చిత్రానికి పని చేసిన సెంథిల్ కుమార్ మా సినిమాకి కెమెరా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అతి త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం’’ అన్నారు. ఎన్వీ ప్రసాద్, గుణ్ణం గంగరాజు, కల్యాణ్ కోడూరి, అవసరాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. తనికెళ్ల భరణి, పోసాని కృష్ణమురళి, నాజర్, రాజీవ్ కనకాల, మురళీశర్మ, ‘సత్యం’ రాజేష్, ప్రగతి, కళ్యాణి నటరాజన్, తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: యోగేష్, సమర్పణ: సాయి శివాని, నిర్మాణం: సాయి కొర్రపాటి. -
ఆ సినిమాతో నా స్థాయి పెరుగుతుంది
తమిళసినిమా: అరువాసండై చిత్రం కోలీవుడ్‌లో నా స్థాయిని పెంచుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తోంది నటి మాళవికనాయర్.పూర్తి డిజిటల్ సినిమాను సిలంది చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయం చేసిన దర్శకుడు ఆదిరాజన్. ఈయన తాజాగా తెరకెక్కిస్తున్న చిత్రం అరువాసండై. ఒక కబడ్డీ క్రీడాకారుడి ప్రేమ ఇతివృత్తాన్ని ఆవిష్కరించే ఈ చిత్రంలో నిజ కబడ్డీ క్రీడాకారుడు రాజా హీరోగా పరిచయం కావడం విశేషం. కాగా నాయకిగా మాళవిక మీనన్ నటిస్తున్నారు. ఈ అమ్మడు ఇంతకు ముందు బ్రహ్మ చిత్రంలో శశికుమార్‌కు చెల్లెలిగానూ, ఇవన్ వేరమాదిరి చిత్రంలో సురభికి చెల్లెలిగానూ నటించింది.విళా చిత్రం ద్వారా నాయకిగా పరిచయమైన మాళవిక మీనన్ ప్రస్తుతం మలయాళంలో ఐదు చిత్రాలు, తెలుగులో రెండు చిత్రాలు అంటూ బిజీగా నటిస్తోంది. వెట్ స్క్రీన్ ప్రొడక్షన్స్ పతాకంపై వి.రాజా నిర్మిస్తున్న ఈ చిత్రంలో నటించే అవకాశం రావడం గురించి చిత్ర నాయకి మాళవిక మీనన్ స్పందిస్తూ, ఈ చిత్ర కథ వినగానే చాలా ఆసక్తిని రేకెత్తించిందని పేర్కొంది. ముఖ్యంగా దర్శకుడు క్లైమాక్స్ గురించి చెప్పినప్పుడు కళ్లంబట నీరు వచ్చిందని చెప్పింది. అరువాసండై చిత్రం కోలీవుడ్‌లో నటిగా తన స్థాయిని పెంచే చిత్రం అవుతుందని అంది. మరో విషయం ఏమిటంటే పెద్ద హీరోల మాదిరి ఈ చిత్రంలో తనకు ఓపెనింగ్ సాంగ్ ఉండడం డబుల్ సంతోషం అని మాళవిక మీనన్ పేర్కొంది.