చిరు అల్లుడు విజేత | Kalyan Dev Debut Movie Title Was Announced as Vijetha | Sakshi
Sakshi News home page

చిరు అల్లుడు విజేత

Published Thu, May 24 2018 12:26 AM | Last Updated on Thu, May 24 2018 12:26 AM

Kalyan Dev Debut Movie Title Was Announced as Vijetha - Sakshi

కల్యాణ్‌ దేవ్‌

చిరంజీవి నటించిన ‘విజేత’ చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.  కోదండ రామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 1985లో రిలీజై సంచలన విజయం సాధించింది. ఇప్పుడు అదే టైటిల్‌ని చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్‌ దేవ్‌ హీరోగా పరిచయమవుతోన్న చిత్రానికి పెట్టడం విశేషం. రాకేశ్‌ శశి దర్శకత్వంలో సాయి కొర్రపాటి వారాహి సంస్థలో రజినీ కొర్రపాటి నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘విజేత’ టైటిల్‌ అనౌన్స్‌ చేశారు.

‘లైటింగ్‌ అప్‌ స్మైల్స్‌ ఆన్‌ అదర్స్‌ ఫేసెస్‌ ఈజ్‌ ఆల్సో ఎ సక్సెస్‌’ అనేది ట్యాగ్‌ లైన్‌.(ఇతరుల ముఖాల్లో వెలుగు చూడటం కూడా విజయమే అని అర్థం). ఇందులో మాళవికా నాయర్‌ కథానాయిక. ఈ సినిమా షూటింగ్‌ చివరి దశలో ఉంది. ‘బాహుబలి’ ఫేమ్‌ సెంథిల్‌ కుమార్‌ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. నాజర్, తనికెళ్ల భరణి, మురళీ శర్మ, ‘సత్యం’ రాజేష్, ప్రగతి, కల్యాణీ నటరాజన్, పోసాని, రాజీవ్‌ కనకాల, జయప్రకాశ్‌ (తమిళ్‌) తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సమర్పణ: సాయి శివాణి, సంగీతం: హర్షవర్ధన్‌ రామేశ్వర్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement