ఆ సినిమాతో నా స్థాయి పెరుగుతుంది | Aruvasidai will be doing the role of an actress in Kollywood | Sakshi
Sakshi News home page

ఆ సినిమాతో నా స్థాయి పెరుగుతుంది

Published Thu, Jun 22 2017 2:57 AM | Last Updated on Tue, Sep 5 2017 2:08 PM

ఆ సినిమాతో నా స్థాయి పెరుగుతుంది

ఆ సినిమాతో నా స్థాయి పెరుగుతుంది

తమిళసినిమా: అరువాసండై చిత్రం కోలీవుడ్‌లో నా స్థాయిని పెంచుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తోంది నటి మాళవికనాయర్‌.పూర్తి డిజిటల్‌ సినిమాను సిలంది చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయం చేసిన దర్శకుడు ఆదిరాజన్‌. ఈయన తాజాగా తెరకెక్కిస్తున్న చిత్రం అరువాసండై. ఒక కబడ్డీ క్రీడాకారుడి ప్రేమ ఇతివృత్తాన్ని ఆవిష్కరించే ఈ చిత్రంలో నిజ కబడ్డీ క్రీడాకారుడు రాజా హీరోగా పరిచయం కావడం విశేషం.

కాగా నాయకిగా మాళవిక మీనన్‌ నటిస్తున్నారు. ఈ అమ్మడు ఇంతకు ముందు బ్రహ్మ చిత్రంలో శశికుమార్‌కు చెల్లెలిగానూ, ఇవన్‌ వేరమాదిరి చిత్రంలో సురభికి చెల్లెలిగానూ నటించింది.విళా చిత్రం ద్వారా నాయకిగా పరిచయమైన మాళవిక మీనన్‌ ప్రస్తుతం మలయాళంలో ఐదు చిత్రాలు, తెలుగులో రెండు చిత్రాలు అంటూ బిజీగా నటిస్తోంది.

వెట్‌ స్క్రీన్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై వి.రాజా నిర్మిస్తున్న ఈ చిత్రంలో నటించే అవకాశం రావడం గురించి చిత్ర నాయకి మాళవిక మీనన్‌ స్పందిస్తూ, ఈ చిత్ర కథ వినగానే చాలా ఆసక్తిని రేకెత్తించిందని పేర్కొంది. ముఖ్యంగా దర్శకుడు క్లైమాక్స్‌ గురించి చెప్పినప్పుడు కళ్లంబట నీరు వచ్చిందని చెప్పింది. అరువాసండై చిత్రం కోలీవుడ్‌లో నటిగా తన స్థాయిని పెంచే చిత్రం అవుతుందని అంది. మరో విషయం ఏమిటంటే పెద్ద హీరోల మాదిరి ఈ చిత్రంలో తనకు ఓపెనింగ్‌ సాంగ్‌ ఉండడం డబుల్‌ సంతోషం అని మాళవిక మీనన్‌ పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement