
దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి అన్న మాటను సెలబ్రిటీలు తు.చ. తప్పకుండా పాటిస్తారు. ఓ పక్క సినిమాలు చేస్తూనే అవకాశం దొరికినప్పుడల్లా వివిధ కార్యక్రమాలు, షోరూమ్‌ల ప్రారంభోత్సవానికి వెళ్తుంటారు. మలయాళ హీరోయిన్ మాళవిక మీనన్ (Malavika C Menon) కూడా ఇదే చేస్తోంది. అయితే అదే పనిగా వరుసపెట్టి కార్యక్రమాలకు వెళ్తూ ఉన్నందుకు కొందరు విమర్శలు కూడా గుప్పించారు. సినిమాల్లో మంచి పాత్రల కోసం ఆరాటపడకుండా ఇలా ప్రోగ్రామ్‌ల వెనక పరిగెట్టడం దేనికని బుగ్గలు నొక్కుకున్నారు.
ఎన్ని ఖర్చులుంటాయనుకున్నారు!
అయితే ఇలాంటి ప్రోగ్రామ్‌లకు వెళ్తే వచ్చే డబ్బు తనకు ఖర్చులకే సరిపోతోందని చెప్తోంది మాళవిక. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ఒక కార్యక్రమానికి వెళ్లాలంటే నువ్వు చాలా ఖర్చుపెట్టాల్సి ఉంటుంది. మొదట నీ దుస్తుల కోసం.. తర్వాత నువ్వు ప్రయాణించడానికి ఓ వాహనం కావాలి. అందులోనూ అమ్మాయైతే ఆ ఖర్చు రెట్టింపవుతుంది. మేకప్ సామాను కొనుక్కోవాలి, డ్రెస్సులు కొనుగోలు చేయాలి. దానిపైకి మ్యాచ్ అయ్యే జ్యువెలరీ కొనాలి.
(చదవండి: నీ భర్త కంటే విజయ్ నయం.. జ్యోతిక ఏమందో తెలుసా?)
కెరీర్ మొదట్లో ఇబ్బందిపడ్డా..
కొన్నిసార్లు మనమే రెడీ అయినా సమయం లేకపోతే మేకప్ ఆర్టిస్టును పిలిపించుకోవాలి. అలాగే హెయిర్ స్టయిలిస్ట్. కొన్నిసార్లు మన లుక్ సరిగ్గా ఉండేందుకు స్టయిలిస్ట్ అవసరం కూడా ఉండొచ్చు. వీళ్లందరికీ మనం డబ్బులివ్వాలిగా! తమ పనిని వదిలేసుకుని వచ్చినందుకు వారి డిమాండ్‌ను బట్టి డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. ట్రావెలింగ్ ఖర్చులు ఉండనే ఉన్నాయి. కెరీర్ మొదట్లో ఆర్థికంగా చాలా ఇబ్బందిపడ్డాను.

ప్రతి పైసాను గౌరవిస్తా..
ఆ సమయంలో కుటుంబమే నా అవసరాలు తీర్చింది. నేను వెనకడుగు వేయకుండా ప్రోత్సహించింది. కొన్నిసార్లు ఇంట్లోనూ పరిస్థితులు కఠినంగా ఉండేవి కానీ అవి నాకు తెలియనిచ్చేవారు కాదు. ఒకసారైతే నేను కనుబొమ్మలు గీయించుకోవడానికి కూడా డబ్బులేదు. ఇప్పుడా పరిస్థితి మారింది. అందుకే ప్రతి పనిని, ప్రతి పైసాను గౌరవిస్తాను. తెరపై సెలబ్రిటీలను చూసి వారిది రంగుల జీవితం అనుకుంటాం కానీ అలా ఏం ఉండదు. వాళ్లకూ ఎన్నో కష్టాలుంటాయి.
ఏదీ శాశ్వతం కాదు
నేను కూడా ఎన్నోసార్లు అవమానాలకు గురయ్యాను. అయితే ఏదీ శాశ్వతం కాదని బలంగా నమ్ముతూ ముందడుగు వేస్తాను అని చెప్పుకొచ్చింది. కాగా మాళవిక.. నిద్ర, హీరో, నాదన్, నదేవయానం, ఎంజన్ మరికుట్టి, జోసెఫ్, మామంగం, ఏఐ మల్లు, పెయి మామ వంటి పలు మలయాళ, తమిళ చిత్రాల్లో నటించింది. తెలుగులో లవ్ కె రన్, అమ్మాయిలు అంతే అదో టైప్ సినిమాలు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment