raja
-
ఏ ఆధారాలతో మాపై నిందలు వేస్తున్నారు: Gandra Venkata Ramana Reddy
-
పళ్ళు చూపించి ఫోటోలు దిగడం కాదు ...అభివృద్ధి అంటే..
-
Anand Movie: చిరంజీవి సినిమాతో పోటీ.. ఏడు నంది అవార్డులు సొంతం
ఓ మంచి సినిమా చూశామన్న ఫీలింగ్ అంటే ఏంటో తెలియాలంటే 20 ఏళ్ల క్రితం వచ్చిన ‘ఆనంద్’ను చూడాలి. ఇది ఓ మంచి కాఫీ లాంటి మూవీ. ఫీల్ గుడ్ మూవీస్ తీసే దర్శకుడిగా పేరున్న డైరెక్టర్ శేఖర్ కమ్ముల నుంచి వచ్చిన రెండో సినిమా. ఆత్మాభిమానం, ఇండిపెండెంట్ భావాలు కొంచెం ఎక్కువ గల ఓ యువతి తన లైఫ్‌లో ఎదుర్కొనే సవాళ్లు, లవ్, ఫ్రెండ్షిప్ వంటి వాటిని తెరకెక్కించిన విధానం కట్టిపడేస్తుంది. ముఖ్యంగా యూత్‌కు చాలా బాగా కనెక్ట్ అయిన సినిమా. వారి ఆలోచనలు, డ్రీమ్స్, ప్రాబ్లమ్స్ అన్నీ ఇందులో ప్రతిబింబిస్తాయి. హీరోగా రాజా, హీరోయిన్గా కమలినీ ముఖర్జీ అద్భుతంగా నటించారు.పరిణతి గల ప్రేమఈ మూవీలో లవ్ స్టోరీ చాలా నేచురల్‌గా, హానెస్టీగా ఉంటుంది. అన్ని సినిమాల్లోలా కాకుండా ఇద్దరు మెచ్యూర్డ్ యూత్ మధ్య లవ్‌ను అద్భుతంగా చూపించారు డైరెక్టర్. కేవలం కోటిన్నర బడ్జెట్‌తో ఎటువంటి భారీ కాస్టింగ్ లేకుండా సాదా సీదా స్టోరీతో రిలీజై అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. శేఖర్ కమ్ముల తొలుత 2000లో ‘డాలర్ డ్రీమ్స్’ తీశారు. ఇది విమర్శకుల మెప్పు రూపొందింది. సెకండ్ మూవీ ‘ఆనంద్’ కోసం చాలా మంది నిర్మాతల్ని కలవగా ఎవరూ ఇంట్రస్ట్ చూపలేదు. చేసేది లేక నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పోరేషన్ సాయం కోరగా ఆ సంస్థ కొంత ఇన్వెస్ట్ చేయడానికి అంగీకరించింది. తెలుగులో ఓ కమర్షియల్ మూవీకి ఇన్వెస్ట్ చేయడం ‘ఎన్ఎఫ్డీసీ’కి ఇదే తొలిసారి.పద్మారావ్ నగర్లోనే...ఆనంద్ స్టోరీని పవన్ కల్యాణ్‌ను దృష్టిలో పెట్టుకుని రాసినా ఆయన్ను ఎప్పుడూ సంప్రదించలేదని శేఖర్ కమ్ముల ఓ సందర్భంలో చెప్పారు. హీరోయిన్ గా తొలుత ఆసిన్, సదాను అనుకున్నారు. చివరికి రాజా, కమలినీ ముఖర్జీతో పూర్తి చేసేశారు. హైదరాబాదులో తానుండే పద్మారావ్ నగర్లోనే ఓ ఇంటి స్థలంలో దాదాపు సినిమా మొత్తం పూర్తి చేసేశారు డైరెక్టర్. కమలి పాత్రకి సింగర్ సునీతతో డబ్బింగ్ చెప్పించగా ఎంత సహజంగా వచ్చిందంటే అందుకు సునీతని కూడా అవార్డు వరించింది. శేఖర్ కమ్ముల హోవర్డ్ యూనివర్శిటీలో తన మాస్టర్స్ డిగ్రీ థీసిస్‌గా ఈ సినిమా స్క్రీన్ ప్లేనే సబ్మిట్ చేసారనే విషయం చాలా మందికి తెలియదు. ‘ఆనంద్’ సినిమాను తమిళంలో ‘నినైత్తాలే’ పేరుతో రీమేక్ చేశారు.ఫార్ములా సినిమాలకు భిన్నంగా...ఆనంద్ మూవీ, చిరంజీవి భారీ సినిమా ‘శంకర్ దాదా ఎంబీబీఎస్’ ఒకే రోజు రిలీజయ్యాయి. అయినా... ఆ పోటీకి నిలబడి ఇంచుమించు అంతే పేరు తెచ్చుకుంది ‘ఆనంద్’. ఫార్ములా సినిమాలకు భిన్నంగా తీసిన ఆనంద్ ఏడు నంది అవార్డుల్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాను ఇప్పటికీ చాలా మంది ఇష్టంగా చూస్తారు. మీరు ఇప్పటికీ చూడక΄ోతే కచ్చితంగా ఓ సారి చూసేయండి. – ఇంటూరు హరికృష్ణ -
భర్త అనుమానం.. పెను‘మంటలై’..
రాయచోటి: భర్త అనుమానానికి తోడు.. వేధింపుల ధాటికి తట్టుకోలేక ఇద్దరు బిడ్డలతో సహా ఓ తల్లి సజీవదహనమైన హృదయవిదారక ఘటన అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలో శనివారం ఉదయం చోటుచేసుకుంది. పలువురిని కంటతడి పెట్టించిన ఈ దారుణ ఘటన వివరాలను బంధువులు వెల్లడించారు. జిల్లాలోని లక్కిరెడ్డిపల్లి మండలం బి.ఎర్రగుడి హరిజనవాడకు చెందిన ఎర్రగుడి రాజా పది సంవత్సరాల కిందట గాలివీడుకు చెందిన గాలివీటి రమాదేవిని వివాహం చేసుకున్నారు. వీరికి మనోహర్ (8), మన్విత (5) సంతానం. జీవనోపాధి నిమిత్తం రాజా గల్ఫ్ దేశంలో ఉంటూ భార్య, పిల్లలను రాయచోటి పట్టణం బోస్‌నగర్ తొగటవీధిలో ఉంచాడు. భార్య రమాదేవి టైలరింగ్ చేసుకుంటూ ఇద్దరు పిల్లలను స్కూలుకు పంపుతూ జీవనం సాగించేది. రెండు సంవత్సరాలుగా భార్యపై అనుమానాన్ని పెంచుకున్న రాజా తను నివాసం ఉంటున్న ఇంటిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ మధ్యకాలంలో అనుమానం పెనుభూతమై వీడియో ఫోన్ ద్వారా వేధించేవాడు. వాటిని తట్టుకోలేక శనివారం ఉదయం ఆరుగంటలకు వంటగదిలో ఉన్న గ్యాస్ సిలిండర్‌ను బెడ్రూమ్లోకి తీసుకెళ్లి కన్నబిడ్డలు ఇద్దరినీ పట్టుకుని రమాదేవి (34) గ్యాస్‌బండకు నిప్పు అంటించి ఆ మంటల్లో ఆహుతి అయింది. ఇంటిలో నుంచి పొగలు రావడంతో స్థానికులు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆరి్పవేశారు. అప్పటికే మంటల్లో తల్లీ, ఇద్దరు పిల్లలు కాలిపోయారు. రమాదేవి సోదరుడు గాలివీటి నారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రాయచోటి అర్బన్ సీఐ చంద్రశేఖర్ తెలిపారు. మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి బాధిత కుటుంబసభ్యులను పరామర్శించి మృతదేహాల వద్ద నివాళులు అర్పించారు. ఈ ఘటన దురదృష్టకరమని మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి విచారం వ్యక్తం చేశారు. -
25 వసంతాలు పూర్తి చేసుకున్న 'రాజా'.. ఈ సినిమాను వదులుకున్న స్టార్ హీరోయిన్
రాజా.. 1999 మార్చి 18న ముప్పలనేని శివ దర్శకత్వంలో సూపర్ గుడ్ ఫిల్మ్స్ పతాకంపై ఆర్.బి.చౌదరి నిర్మించిన విజయవంతమైన సినిమా. ఇందులో వెంకటేష్, సౌందర్య జంటగా నటించారు. ఎస్. ఎ. రాజ్ కుమార్ అందించిన స్వరాలు విపరీతమైన ప్రజాదరణ పొందాయి. ఈ సినిమా 1998లో తమిళంలో కార్తీక్, రోజా జంటగా వచ్చిన 'ఉన్నిడతిల్ ఎన్నై కొడుతేన్' అనే సినిమాకు రీమేక్.. ఇప్పటికి టాలీవుడ్లో ఈ సినిమా విడుదలయ్యి 25 ఏళ్లు పూర్తి కావడం జరిగింది. ఒక భాషలో విజయవంతమైన చిత్రాన్ని మరో భాషలో రీమేక్ చేయడం అన్నది ఎప్పటి నుంచో ఉన్నదే. ఈ క్రమంలోనే రాజా చిత్రం తెలుగులో రీమేక్ అయి భారీ విజయాన్ని అందుకుంది. 1999లో విడుదలయిన ఈ సినిమా వెంకటేశ్- సౌందర్య జోడీని ప్రేక్షకులకు మరింత దగ్గర చేసింది. వాస్తవంగా 'రాజా'లో హీరోయిన్ మొదట సౌందర్య కాదట. ఈ సినిమాకు మొదటగా రోజాను హీరోయిన్గా అనుకున్నారట. అందుకు కారణం రాజా మాతృక అయిన 'ఉన్నిడతిల్ ఎన్నై కొడుతేన్' అనే చిత్రంలో మొదట నటించింది రోజానే కావడం. తమిళంలో వచ్చిన ఆ సినిమాతో ఆమెకు ఎనలేని క్రేజ్ వచ్చింది. తమిళంలో లీడ్ రోల్స్‌లో కార్తిక్, రోజా, అజిత్ నటించారు. తమిళంలో ఈ సినిమాకు ప్రేక్షకుల దగ్గర నుండి ప్రశంసలతో పాటు అవార్డులు కూడా చాలానే అందాయి. ఈ సినిమాకు ఉత్తమ నటిగా తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డు అందుకున్న రోజా తెలుగు రీమేక్‌లో కూడా నటించాలని నిర్ణయించుకుంది. దానికి తనకు అవకాశం లభించింది కూడా. కానీ ఆ సమయంలో రోజా వద్ద అవసరమైన డేట్స్ లేకపోవడంతో సౌందర్యను సంప్రదించి రాజా సినిమాను పట్టాలెక్కించారు. ఇందులో వెంకీ, సౌందర్య కెమిస్ట్రీకి విపరీతమైన క్రేజ్ వచ్చింది. వీరిద్దరిని ఆన్ స్క్రీన్ క్యూట్ కపుల్‌గా అనేవారు. అంతలా ప్రేక్షకులకు సినిమా కనెక్ట్ అయింది. ఆ రోజుల్లో రాజా సినిమాకు బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ వచ్చాయి. విడుదలైన అన్ని చోట్లు 50రోజులు ఆడిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ చిత్రంలో మొదట దొంగగా కనిపించిన వెంకీ ఆ తర్వాత తన సరైన నటనతో ప్రేక్షకులను కదిలించాడు. అంతే స్థాయిలో సౌందర్య తన సెంటిమెంట్‌తో కట్టిపడేసింది. 71 కేంద్రాల్లో రాజా సినిమా 100 రోజులు ఆడింది. 4 సెంటర్లలో రజతోత్సవం జరుపుకున్న చిత్రంగా వెంకటేశ్ కెరియరల్లో రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమా ఒరియా, కన్నడ, హిందీ, బెంగాలీ బంగ్లాదేశ్, బెంగాలీ భాషల్లో రీమేక్ అయ్యింది. ఈ సినిమాకు ఉత్తమ ఉత్తమ నటిగా సౌందర్యకు నంది అవార్డు దక్కింది. రాజా విడుదలయ్యి నేటితో సిల్వర్ జూబ్లీ పూర్తి చేసుకుంది. -
భారత్.. దేశం కాదు ఉపఖండం
చెన్నై: తమిళనాడుకు చెందిన అధికార డీఎంకే సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి ఎ.రాజా మరో వివాదానికి ఆజ్యం పోశారు. బీజేపీ సిద్ధాంతాలైన భరతమాత, జైశ్రీరామ్‌ను తమిళనాడు ఎప్పటికీ స్వీకరించబోదని, అవి తమకు ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు. ఇండియా ఒకే దేశం కాదని, ఇదొక ఉపఖండం మాత్రమేనని అన్నారు. ఒకే దేశం అయితే దేశమంతటా ఒకే భాష ఉండాలని చెప్పారు. మధురైలో మంగళవారం డీఎంకే కార్యక్రమంలో ఎ.రాజా ప్రసంగించారు. ‘‘రాముడికి శత్రువు ఎవరు? రాముడి గురించి, రామాయణం గురించి నాకు అంతగా తెలియదు. వాటిపై నాకు నమ్మకం లేదు. రాముడు సీతతో కలిసి అడవికి వెళ్లాడని చిన్నప్పుడు మా తమిళ టీచర్ చెప్పారు. ఒక వేటగాడిని, సుగ్రీవుడిని, విభీషణుడిని రాముడు తన సోదరులుగా స్వీకరించాడు. ఇందులో కులం, మతం ప్రసక్తి లేదని అర్థమవుతోంది. ఇండియా ఒకే దేశమని అంటున్నారు. ఒకే దేశమైతే ఒకే భాష, ఒకే సంప్రదాయం, ఒకే సంస్కృతి ఉండాలి. ఇండియాలో అలా లేదు కాబట్టి ఇదొక ఉపఖండం. ఇండియా గతంలో ఎన్నడూ ఒక దేశంగా లేదు. తమిళనాడు, కేరళ, ఢిల్లీ, ఒడిశా తదితర రాష్ట్రాల్లో వాటి సొంత సంస్కృతులు ఉన్నాయి. భిన్న జాతులు, భాషలు, సంస్కృతుల సమాహారమే ఇండియా. ఇక్కడ ఒక సామాజిక వర్గం ప్రజలు గొడ్డు మాంసం తింటారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత తమిళనాడులో డీఎంకే ఉండదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అంటున్నారు. తమిళనాడులో డీఎంకే లేకపోతే అసలు భారతదేశమే ఉండదు. ఇలా ఎందుకు చెప్తున్నానంటే.. కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే భారతదేశ రాజ్యాంగమే ఉండదు. రాజ్యాంగం లేకపోతే దేశం కూడా మనుగడ కోల్పోతుంది. భారతదేశం లేకపోతే తమిళనాడు రాష్ట్రం ఉండదు. దేశం నుంచి మేము విడిపోతాం. ఇలా జరగాలని భారతదేశం కోరుకొంటోందా?’’ అంటూ ఎ.రాజా సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజాను వెంటనే అరెస్టు చేయాలి డీఎంకే నేత ఎ.రాజా వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనను తక్షణమే అరెస్టు చేయాలని తమిళనాడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. డీఎంకే నాయకులు విద్వేషపూరిత వ్యాఖ్యలు చేయడం మానుకోవడం లేదని బీజేపీ నేత∙అమిత్ మాలవీయా విమర్శించారు. సనాతన ధర్మం గురించి ఉదయనిధి స్టాలిన్ అనుచితంగా మాట్లాడారని చెప్పారు. దేశాన్ని ముక్కలు చేయాలన్నదే డీఎంకే నేతల కుటిల యత్నమని మండిపడ్డారు. రాజాపై కఠిన చర్యలు తీసుకోవాలని తిమళనాడు డీఎంకే అధికార ప్రతినిధి తిరుపతి అన్నారు. రాజా వ్యాఖ్యలను డీఎంకే మిత్రపక్షం కాంగ్రెస్ సైతం ఖండించింది. మాట్లాడేటప్పుడు సంయమనం పాటించాలని సూచించింది. రాజా వ్యాఖ్యలతో విభేదిస్తున్నానని కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనాతే చెప్పారు. -
రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చిన టాలీవుడ్ హీరో
టాలీవుడ్ హీరో రాజా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. గతకొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరాడు. గతకొంతకాలంగా పాస్టర్‌గా దైవసేవలో మునిగి తేలుతున్న ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నాడు. విజయవాడలోని కాంగ్రెస్ కార్యాలయంలో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నాడు. ఈ సందర్భంగా రాజా మాట్లాడుతూ.. 'నాకు రాజకీయాలు కొత్తేం కాదు. ఇంతకుముందు తెర వెనుక పని చేశాను. ఇప్పుడు మీ ముందుకు వచ్చి పని చేసేందుకు రెడీ అయ్యాను. కేవలం ఒక రాష్ట్రం కోసమే కాదు, తెలుగు ప్రజలు ఎక్కడైతే ఉన్నారో వారందరికీ సేవ చేయాలనే ఉద్దేశ్యంతో పార్టీలో చేరాను' అని చెప్పుకొచ్చాడు. సినిమాలకు దూరం.. 'ఆనంద్: మంచి కాఫీలాంటి సినిమా'తో తెలుగువారికి దగ్గరయ్యాడు హీరో రాజా. 2002లోనే ఓ చిన్నదాన సినిమాతో వెండితెరపై అడుగుపెట్టినప్పటికీ 2004లో వచ్చిన ఆనంద్ మూవీతోనే అసలు సిసలైన సక్సెస్ రుచి చూశాడు. ఆ నలుగురు, వెన్నెల చిత్రాలతో మరింత గుర్తింపు సంపాదించుకున్నప్పటికీ తర్వాత సినిమాల ఎంపికలో తడబడ్డాడు. ఫలితంగా హిట్లు కరువైపోయాయి. దీంతో నెమ్మదిగా సినిమాలకు దూరమయ్యాడు. 2013 తర్వాత మరే సినిమా చేయలేదు. కాగా రాజా.. 2014లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారంలో పాల్గొన్నాడు. చదవండి: ప్రియుడితో జయసుధ? మరోసారి తెరపైకి మూడో పెళ్లి రూమర్స్! -
చంద్రబాబు వల్లే రాష్ట్రం దివాలా: మంత్రి రాజా
తుని రూరల్: చంద్రబాబు హయాంలో అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని దివాలా తీయించారని రోడ్లు భవనాలశాఖ మంత్రి దాడిశెట్టి రాజా విమర్శించారు. కాకినాడ జిల్లా తుని మండలం గెడ్లబీడు వద్ద శుక్రవారం జరిగిన జేసీఎస్ నమోదు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి రాజా మాట్లాడుతూ ఎల్లో మీడియాను అడ్డుపెట్టుకుని చంద్రబాబు, యనమల రామకృష్ణుడు చేస్తున్న తప్పుడు ప్రచారంపై ధ్వజమెత్తారు. తనపై యనమల రామకృష్ణుడు తప్పుడు ప్రచారం చేస్తుండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కోటనందూరు మండలంలో తాను 150 ఎకరాలు కొనుగోలు చేసినట్లు నిరూపిస్తే ఆ భూమిని ఆయనకే రాసిచ్చేస్తానని సవాల్ విసిరారు. -
‘గూడెం’లో నేడే ప్రజాగర్జన
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: భారత కమ్యూనిస్టు పా ర్టీ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహించనున్న ప్రజాగర్జన బహిరంగ సభకు సర్వం సిద్ధమైంది. సాయంత్రం పట్టణంలోని ప్రకాశం స్టేడియంలో జరిగే సభకు పార్టీ జాతీయ కార్యదర్శి డి.రాజా ముఖ్య అతి థిగా హాజరు కానున్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కో రుతూ ఈ ఏడాది ఏప్రిల్ 14న సీపీఐ ఆధ్వర్యంలో ప్రజాపో రు యాత్రలు చేపట్టి గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి నాయకుల వరకు తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడికక్కడ సభలు, సమావేశాలు నిర్వహించారు. పోడు సాగుదారులకు పట్టాల పంపిణీ, సింగరేణి ప్రైవేటీకరణ, రాజ్యాంగ, లౌకిక వ్యవస్థల పరిరక్షణ తదితర అంశాలపై విస్తృతంగా ప్రచారం చేశారు. ఎర్ర జెండా రెపరెపలతో..: ప్రజాగర్జన బహిరంగ సభ నేపథ్యంలో కొత్తగూడెం పట్టణం ఎరుపెక్కింది. ప్రకాశం స్టేడియంలో భారీ వేదిక ఏర్పాటు చేశారు. బహిరంగ సభకు లక్ష మంది జన సమీకరణ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనికి తగ్గట్టే గత నెలరోజులుగా పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు నేతృత్వంలో విస్తృత ప్రచారం నిర్వహించారు. బెల్లంపల్లి నుంచి ప్రత్యేక రైలు..: కొత్తగూడెంలో నిర్వహించే బహిరంగ సభకు ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ప్రధా నంగా జన సమీకరణ చేయాలని నిర్ణయించారు. ఇందుకో సం వెయ్యి బస్సులు ఏర్పాటు చేస్తున్నారు. ఇతర జిల్లాల నుంచి కూడా 300 చొప్పున బస్సుల్లో కార్యకర్తలు తరలివస్తారని పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని తెలిపారు. ఒక్క కొత్తగూడెం నియోజకవర్గం నుంచే 25 వేల మందికి పైగా ప్రజలను తరలించేందుకు వాహనాలను సిద్ధం చేశామని, భద్రాచలం, పినపాక, ఇల్లెందు, అశ్వారావుపేట నియోజకవర్గాల నుంచి పెద్ద సంఖ్యలో తరలిరానున్నారని చెప్పా రు. సింగరేణి ప్రభావిత ప్రాంతాలైన ఉమ్మడి కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల నుంచి వేలాదిగా కార్మికులు వచ్చేందుకు బెల్లంపల్లి నుంచి ప్రత్యేక రైలు ఏర్పాటు చేసిన ట్లు తెలిపారు. ఉమ్మడి నల్లగొండ, వరంగల్ జిల్లాల నుంచి కూడా కార్యకర్తలు పెద్దఎత్తున తరలివస్తారని వివరించారు. హాజరుకానున్న రాజా..: ఈ సభకు జాతీయ కార్యదర్శి డి.రాజాతో పాటు సీపీఐ జాతీయ నాయకులు కె.నారాయణ, అజీజ్ పాషా, చాడ వెంకట్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సీనియర్ నాయకులు పువ్వాడ నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట్‌రెడ్డి, వాసిరెడ్డి సీతారామయ్య, ప్రముఖ కళాకారులు గోరటి వెంకన్న, వందేమాతరం శ్రీనివాస్ తదితరులు హాజరుకానున్నారు. -
RIP Raja: మిస్ యూ రాజా
కోల్‌కతా: దేశంలో సుదీర్ఘకాలం జీవించిన రికార్డు దక్కించుకున్న పెద్ద పులి ఇక లేదు. తీవ్ర గాయాలతో చావుబతుకుల మధ్య వచ్చిన ఆ పులి.. ఇన్నేళ్లు బతుకుతుందని ఎవరూ అనుకోలేదు. అధికారిక లెక్కల ప్రకారం.. రాజా అనే పెద్దపులి 25 ఏళ్ల కంటే ఎక్కువే బతికింది. సోమవారం వేకువజామున ఎస్కేబీ(సౌత్ ఖైర్‌బరి) రెస్క్యూ సెంటర్లో అది కన్నుమూసినట్లు ఫారెస్ట్ అధికారులు ప్రకటించారు. 2008, ఆగష్టులో నార్త్ బెంగాల్ సుందర్బన్ అడవుల్లో ఓరోజు మొసలితో పోరాడి తీవ్రంగా గాయపడ్డ ఓ రాయల్ బెంగాల్ టైగర్‌ను.. సౌత్ ఖైర్‌బరి టైగర్ రెస్క్యూ సెంటర్‌కు తీసుకొచ్చారు. ఆ సమయంలో అది బతుకుతుందని ఎవరూ అనుకోలేదు. వైద్య బృందం, నిర్వాహకులు శ్రమించి దానిని సాధారణ స్థితికి తీసుకొచ్చారు. ఆ తర్వాత ‘రాజా’ దాదాపు పదిహేనేళ్లు బతికింది. తద్వారా దేశంలో సుదీర్ఘ కాలం జీవించిన పెద్దపులి(అధికారుల అంచనా)గా రాజా(25 ఏళ్ల 10 నెలలు) రికార్డుకెక్కింది. Alipurduar, WB | People pay tribute to 25-year-old tiger Raja from SKB rescue centre who passed away today (Source: DM & DFO Alipurduar) pic.twitter.com/pkxS7Q5CgP — ANI (@ANI) July 11, 2022 రాజా మృతిపై నిర్వాహకులతో పాటు పలువురు సోషల్ మీడియాలో ‘ వీ మిస్ యూ రాజా’ అంటూ నివాళులు అర్పిస్తున్నారు. దానిని చూసేందుకు సందర్శకులు చాలామంది వచ్చేవారని అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే.. ఉత్తర ప్రదేశ్ కాన్పూర్ జూలో గుడ్డు అనే పెద్దపులి 2014 జనవరిలో మృతి చెందింది. అప్పటికి దాని వయసు 26 ఏళ్లు అని నిర్వాహకులు ప్రకటించినా.. ఆ తర్వాత ఆ వయసులో తేడా ఉందని ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. దీంతో రాజా పేరిట రికార్డు ఇప్పటికీ పదిలంగానే ఉంది. పోస్ట్‌మార్టం రిపోర్ట్ వచ్చాకే.. రాజా ఎలా చనిపోయిందన్నది తేలుతుందని అధికారులు చెప్తున్నారు. Oldest surviving Royal Bengal Tiger in the country - ‘RAJA’ (25yrs 10 months) breathed last at SKB rescue center - Jaldapara, West Bengal on 11th July around 3am. Officials pay last respects @iSurendraMeena pic.twitter.com/RldxJ86viB — Pooja Mehta (@pooja_news) July 11, 2022 Integral part of #Indian way is to treat every life as sacred: hence 400M+ of vegetarians Raja, Royal Bengal tiger who was rescued as cub from crocodile attack in #Bengal, passed away today, ~26 yrs old His death is treated as that of a human being🙏#Hinduism #IncredibleIndia pic.twitter.com/1Gah7dYMKe — Santanu Bhattacharya (@SantanuB01) July 11, 2022 RIP #RAJA the tiger pic.twitter.com/S9cKgRQwdP — Abir Ghoshal (@abirghoshal) July 11, 2022 Oldest tiger in the world RAJA died today ahead of his 27th birthday in Alipurdwar. pic.twitter.com/HFZJhJFFLs — Anupam Mishra (@Anupammishra777) July 11, 2022 -
PVR Raja: షార్ట్ ఫిలిమ్స్‌లో ఆస్కార్ అవార్డే లక్ష్యం
విజయనగరం టౌన్: చిన్నప్పటి నుంచి చిత్రరంగంలో అడుగుపెట్టాలనే ఆకాంక్షే ఆ యువకుడిని షార్ట్ ఫిలిమ్స్‌లో ఉన్నతశిఖరాలు అధిరోహించేలా చేసింది. ఏ కాంటెస్ట్‌లో పాల్గొన్నా గెలుపొందిన మొదటి మూడు చిత్రాలు ఆయన రచన, సంగీత దర్శకత్వం చేసినవే కావడం విశేషం. ఇప్పటివరకూ షార్ట్ ఫిలి మ్స్‌లో వందలాది అవార్డులు అందుకున్న విజయనగరం యువకుడు పెనుమత్స వెంకట రామరాజు (పీవీఆర్రాజా) ఎప్పటికైనా షార్ట్ ఫిలిమ్స్‌లో ఆస్కార్ అవార్డ్ తీసుకోవడమే లక్ష్యమని చెబుతున్నాడు. విజయనగరంలోని కంటోన్మెంట్ ప్రాంతానికి చెందిన పెనుమత్స వెంకట రామరాజు (పీవీఆర్ రాజా) సత్యవతి, చంద్రశేఖర్ రాజుల తొలిసంతానం. బీఏ వరకూ మహారాజా కళాశాలలో చదివి, సంగీతం పట్ల మక్కువతో మహారాజా ప్రభుత్వ సంగీత, నృత్యకళాశాలలో గాత్రం, వయోలిన్, భరతనాట్యం, వీణ తదితర అంశాలలో తర్ఫీదు పొందాడు. షాలోమ్స్ మ్యూజిక్ సెంటర్లో గిటార్ తదితర ఇన్‌స్ట్రుమెంట్స్‌పై సాధన చేశాడు. రచనలు చేయడం అలవాటు. 2012 నుంచి ఇప్పటివరకూ తెలుగు, కన్నడ, హిందీ, తమిళ్, ఆంగ్ల భాషల్లో సుమారు 250కి పైగా లఘుచిత్రాలకు సంగీత దర్శకుడిగా పనిచేశాడు. 2017లో ఒకే ఏడాదిలో ఆయన సంగీతం సమకర్చిన లఘుచిత్రాలకు వరుసగా ఏడుసార్లు ఉత్తమ సంగీత దర్శకుడిగా అవార్డులు అందుకున్నారు. 2007లో చెన్నైలో ఏఆర్ రెహమాన్ నిర్వహించిన హూ.లలల్లా మ్యూజిక్ బ్యాండ్హంట్లో షాలోమ్ తరఫున టాప్ 18లో నిలిచాడు. తానా ఇంటర్నేషనల్ తెలుగు ఫిలిం ఫెస్టివల్–2017 అవార్డు దక్కింది. 2020లో రాంగోపాల్ వర్మ నిర్వహించిన స్పార్క్ ఓటీటీ షార్ట్ ఫిలిం కాంటెస్ట్‌లో తొమ్మిదివేల చిత్రాలలో పీవీఆర్ సంగీత దర్శకత్వం వహించిన మూడు చిత్రాలు టాప్ 18లో నిలిచాయి. టాప్ 5లో నిలిచిన రెండు చిత్రాలు ఉత్తమ చిత్రాల అవార్డులు సొంతం చేసుకున్నాయి. అదేవిధంగా 2020లో సైమా షార్ట్ ఫిలిం అవార్డ్స్‌లో ఎంఆర్ ప్రొడక్షన్స్ అంతరార్థం చిత్రానికి ఉత్తమ సంగీత దర్శకుడిగా ఎంపికయ్యాడు. షార్ట్ ఫిలిం మాస్ట్రోగా పేరు సంపాదించుకున్నారు. దర్శకుడు పూరీ జగన్నాథ్ సొంత నిర్మాణ సంస్ధ వైష్ణో మీడియా నిర్మించిన ఆర్య–3 లఘుచిత్రంతో పీవీఆర్ రాజా సంగీత దర్శకుడిగా పరిచయమయ్యాడు. పేపర్ బాయ్ చిత్ర దర్శకుడు జయశంకర్ దర్శకత్వంలో విటమిన్ షీ ఓటీటీ చిత్రానికి సంగీత దర్శకత్వం అందించాడు. ప్రముఖ డ్యాన్సర్ యశ్వంత్ మాస్టర్ తొలివీడియో ఆల్బం దిల్ అంత అదిరే చిత్రానికి సంగీత దర్శకత్వం వహించడంతో పాటు ఎల్బీ శ్రీరామ్ స్వీయ నిర్మాణంలో పదికి పైగా లఘు చిత్రాలకు సంగీతం సమకూర్చారు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే.. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో, సంగీతం పట్ల మక్కువతో షార్ట్ ఫిలిమ్స్ వైపు అడుగులు వేశాను. బేగంపేటలో శంకర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రద్ధ స్కూల్ ఆఫ్ స్పెషల్ నీడ్స్ చిల్డ్రన్ పాఠశాలలో పిల్లలకు సంగీతం నేర్పించడం మరిచిపోలేని అనుభూతి. ప్రతి ఒక్కరి జీవితంలో గుర్తుండిపోయేలా చిత్రాలను తీస్తాను. సంగీతంలో నేను రచించే పుస్తకం ప్రతి ఇంట్లో ఉండే పెద్ద బాలశిక్షలా ఉండిపోవాలని కోరుకుంటున్నాను. – పెనుమత్స వెంకటరామరాజు (పీవీఆర్ రాజా), సంగీత దర్శకుడు, విజయనగరం -
అందుకే ‘లక్ష్మీ’ అని పిలుస్తా : రాజా
తండ్రి ‘సిరివెన్నెల’ స్టార్ రైటర్. తనయుడు రాజా మంచి నటుడు. ఇటీవలే వెంకటలక్ష్మీ హిమబిందుతో ఏడడుగులు నడిచారు రాజా. దీపావళి సందర్భంగా సతీసమేతంగా ‘సాక్షి’ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా విషయాలు పంచుకున్నారు. ► పెళ్లికాకముందు తనను అందరూ బిందు అని పిలిచేవారట. నాకు ఆ విషయం తెలియక లక్ష్మీ అని పిలుస్తుంటే ఎవర్నో పిలుస్తున్నట్లు వెళ్లిపోయేది. అప్పుడు నేను ‘నీ పేరు లక్ష్మీ హిమబిందు కదా, అందుకే లక్ష్మీ’ అని పిలుస్తాను అన్నాను. మా ఇంట్లో అందరూ లక్ష్మీ అనే పిలవటంతో ఇప్పుడు అలవాటు అయ్యింది. ► లక్ష్మీలో నాకు బాగా నచ్చింది ఆమె కలుపుగోలుతనం అని రాజా అంటే , ‘ఏ చిన్న పని చేసినా క్రిస్టల్ క్లియర్‌గా చేస్తారు. అలాగే ఆయన క్రమశిక్షణ చాలా నచ్చుతుంది’ అని లక్ష్మీ అన్నారు. ► మా అమ్మగారికి కోడల్ని తెద్దామనుకుంటే, అత్తగారికి కూతురయ్యింది. మమ్మల్ని ఎవరు చూసినా కొత్తగా పెళ్లయినవాళ్లలా లేరు అంటున్నారు. అలాగే మా బావ త్రివిక్రమ్‌గారు ‘ఎన్నో ఏళ్లుగా ఒకరికొకరు తెలిసినవాళ్లులా ఉన్నారు మీ ఇద్దరూ’ అన్నారు. మా ఫ్యామిలీ అందరికీ లక్ష్మి నచ్చేసింది. అది అన్నిటికన్నా ఆనందం. త్రివిక్రమ్‌గారు తెలుగు సినిమా పరిశ్రమలో ఎన్సైక్లోపీడియా. అందుకే నేను ఏదైనా విషయంలో డైలమాలో ఉంటే బావ సలహా తీసుకుంటాను. ప్రస్తుతం ఉన్న టాప్‌టెన్ డైరెక్టర్స్‌తో పని చేయటంతో పాటు కొత్తగా ఏదైనా చేసి నటునిగా నిరూపించుకోవాలనుకుంటున్నా. ► డబ్బు కోసం నేను నటునిగా ప్రయాణం మొదలుపెట్టలేదు. సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా బాగానే సంపాదించేవాణ్ని. కానీ, అక్కడ తృప్తిగా అనిపించకపోవటంతో జాబ్ క్విట్ చేశాను. ► నాన్న ఏ సినిమాకైనా పాట రాస్తున్నప్పుడు ఒక వెర్షన్ రాసి దర్శకునికి వినిపిస్తే, చాలా బావుంది పాట ఇచ్చేయండి అంటారు. అప్పుడు నాన్నగారు ‘మీకు నచ్చింది కానీ నాకు కావాల్సింది ఇంకా ఏదో మిస్సయింది. అది రాగానే ఇస్తాను’ అంటారు. నేను వ్యక్తిగతంగా నాన్న దగ్గర నుండి కమిట్మెంట్, వృత్తిపట్ల ప్యాషన్ నేర్చుకుంటే అమ్మదగ్గర క్రమశిక్షణ నేర్చుకున్నాను. ► నాకు యాక్టింగ్ తర్వాత ఫిట్నెస్ ఎంతో ఇష్టం. నాకిష్టమైన పనే చేస్తాను కాబట్టి ఎప్పుడూ సెలక్టివ్ గా ఉంటాను. నేను ఫిట్నెస్ ఫ్రీక్ కాబట్టి ఇలా ఉండాలి, అలా తినాలి అని చెప్తాను. వాటివల్ల ఇంట్లో డిబేట్లు, గొడవలు అన్నీ జరుగుతాయి. ► మా నాన్న లక్ష్మీని వంకాయకూర చేయటం వచ్చా అని అడిగితే వచ్చు అని చెప్పింది. వండటం కాదు, మా అమ్మ వండినట్లు వండాలి అని తనను ఆట పట్టిస్తుంటాను -
కల్యాణం... కమనీయం
సుప్రసిద్ధ గీత రచయిత ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి రెండో కుమారుడు, నటుడు రాజా (రాజా భవానీ శంకర శర్మ) వివాహం వెంకట లక్ష్మీ హిమబిందుతో ఘనంగా జరిగింది. శనివారం హైదరాబాద్‌లో జరిగిన ఈ వేడుకకు దర్శకులు కృష్ణవంశీ, త్రివిక్రమ్, క్రిష్, వంశీ పైడపల్లి, నిర్మాతలు అల్లు అరవింద్, వెంకట్ అక్కినేని, గుణ్ణం గంగరాజు, రచయిత బుర్ర సాయిమాధవ్ తదితరులు విచ్చేసి, నూతన వధూవరులను ఆశీర్వదించారు. ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి, పద్మావతి, రాజా -
ఘనంగా సిరివెన్నెల కుమారుడి వివాహం
-
ఘనంగా సిరివెన్నెల కుమారుడి వివాహం
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి కుమారుడు, నటుడు రాజా (రాజా భవాని శంకర శర్మ) వివాహం ఘనంగా జరిగింది. హైదరాబాద్ లోని హోటల్ దస్పల్లలో ఆదివారం ఉదయం వధువు వెంకటలక్ష్మి హిమబిందు మెడలో రాజా మూడు ముళ్లు వేశారు. ఈ వివాహ వేడుకకు ప్రముఖ దర్శకులు త్రివిక్రమ్, కృష్ణవంశీ, నిర్మాతలు అల్లు అరవింద్, వెంకట్ అక్కినేని, రచయిత బుర్ర సాయిమాధవ్ తదితరులు విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించారు. కాగా నటుడు రాజా కేరెక్టర్ ఆర్టిస్టుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘ఎవడు, ఫిదా, రణరంగం, నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా, హ్యాపీ వెడ్డింగ్, అంతరిక్షం, మిస్టర్ మజ్ను, ’ చిత్రాలతో అతడికి మంచి పేరు తెచ్చాయి.ఇక ఫిదా సినిమాలో వరుణ్ తేజ్‌కు అన్నయ్యగా మంచి నటన కనబరిచాడు. అలాగే మస్తీ, భానుమతి వర్సెస్ రామకృష్ణ వెబ్ సిరీస్‌లో రాజా నటించారు. తల్లిదండ్రులతో రాజా చెంబోలు -
మిస్ యూ రాజా
సాక్షి, కోనేరుసెంటర్(మచిలీపట్నం): పరిస్థితులను పసిగట్టేతత్వం.. ఎదుటి వ్యక్తుల కదలికలను నిశితంగా గమనించే నైజం.. నిరంతరం నేర పరిశోధనా దృష్టితో పోలీసులకు సైతం అంతుచిక్కని అనేక చిక్కుముళ్లతో కూడిన కేసులను కూడా సునాయాసంగా ఛేదించి రాష్ట్ర, జాతీయ స్థాయిలో పలు పురస్కారాలు అందుకున్న జిల్లాకు చెందిన పోలీస్ జాగిలం(రాజా)శుక్రవారం అనారోగ్యంతో మృతి చెందింది. (అప్రమత్తతతోనే ముప్పు తప్పింది ) ప్రతిభకు పట్టం.. పోలీసు జాగిలం రాజా వయస్సు ఆరేళ్లు. 2015లో జిల్లా పోలీసుల వద్దకు చేరిన ఈ డాగ్.. దాదాపు 17 కేసులను ఛేదించింది. అంతేకాక రాష్ట్ర, జాతీయస్థాయిలో అనేక పోటీల్లో పాల్గొని జిల్లా పోలీసు డాగ్ టీంకు పతకాలు తెచ్చిపెట్టి జిల్లా పోలీసు ప్రతిష్టను దశదిశలా చాటింది. 2014లో హైదరాబాదు మోయినాబాద్ పోలీసు డాగ్ శిక్షణ కేంద్రంలో ఎనిమిది నెలల పాటు ప్రత్యేక తర్ఫీదు పొందిన రాజా.. శిక్షణలో మంచి ప్రతిభ కనబరచి సిల్వర్ మెడల్‌ను కైవసం చేసుకుంది. 2015లో హర్యానాలో జరిగిన ఆలిండియా పోలీసు డ్యూటీ మీట్లో పాల్గొని 29 రాష్ట్రాల్లోని పోలీసు జాగిలాలతో తలపడి తృతీయస్థానంలో బ్రాంజ్ మెడల్‌ను సొంతం చేసుకుంది. లక్ష రూపాయల రివార్డుతో పాటు ఒక ఇంక్రిమెంట్‌ను సాధించింది. 2016లో జరిగిన ఉమ్మడి రాష్ట్రాల రీఫ్రెష్ కోర్సులో 2014లో తీసుకున్న శిక్షణకు సంబంధించి నిర్వహించిన పోటీలో ప్రతిభ కనబరచి ప్రథమస్థానంలో షీల్డును అందుకుంది. నేరపరిశోధనలో హంతకుల ఆచూకీ పసిగట్టటంతో పాటు శిక్షణలో నేర్చుకున్న అనేక అంశాలతో పాటు జిల్లా పోలీసు ప్రాంగణంలో జరిగే స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవ వేడుకల్లో అనేక విన్యాసాలు చేసి అటు అధికారులు, ఇటు ప్రజాప్రతినిధులతో పాటు పిల్లలను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఐదు నిమిషాల్లో కేసు ఛేదన.. అది 2018 జూలై 29న ఏ కొండూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ హత్య జరిగింది. మరిదితో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ మహిళ తన భర్తను పచ్చడిబండతో దారుణంగా కొట్టి చంపింది. ఈ హత్యను మృతుని భార్య, తమ్ముడు కలిసి చేశారు. మరుసటి రోజు ఏ పాపం తెలియని అమాయకుల్లా శవం వద్ద కూర్చుని విలపిస్తున్నారు. ఈ హత్యపై పోలీసులకు ఎలాంటి ఆధారాలు అందలేదు. అసలు హత్య ఎందుకు జరిగి ఉంటుందనే విషయం అంతు చిక్కలేదు. అలాంటి సమయంలో పోలీసు డాగ్ రాజా రంగంలోకి దిగి.. ఐదే ఐదు నిముషాల్లో హత్య చేసిన భార్యతో పాటు మృతుని తమ్ముడిని పూర్తి ఆధారాలతో పట్టించి అధికారుల చేత శభాష్ అనిపించుకుంది. అధికార లాంఛనాలతో.. పోలీసు డాగ్ రాజాకు శుక్రవారం అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. జిల్లా ఎస్పీ ఎం. రవీంద్రనాథ్‌బాబు పుష్పగుచ్ఛంతో నివాళులు అర్పించారు. ఎస్పీతో పాటు ఏఎస్పీ మోకా సత్తిబాబు, ఏఆర్ ఏఎస్పీ బి. సత్యనారాయణ, డీఎస్పీలు మహబూబ్‌బాషా, ఉమామహేశ్వరరావు, ధర్మేంద్ర, ఇతర సిబ్బంది నివాళులు అర్పించారు. అనంతరం జిల్లా పోలీస్ పరేడ్‌గ్రౌండ్‌లో గాల్లోకి కాల్పులు జరిపి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. -
కత్తిలా బతికి వెళ్లిపోయారు...
ఎన్.టి.ఆర్, ఏ.ఎన్.ఆర్లు తెలుగు సినిమాకు రెండు కళ్లు. కాని కాంతారావు ఆ మెడలో మెరిసే చంద్రహారం. కత్తి వీరుడు కాంతారావుగా జానపద చిత్రాలు చేసి సగటు ప్రేక్షకుడికి ఆయన చేరువయ్యారు. సాంఘిక చిత్రాలలో బలమైన పాత్రలు చేసి పెద్ద హీరోలను ఢీకొట్టారు. నటుడిగా ఎంత బిజీగా ఉన్నా ఇంటిని, ఇల్లాలి చేతి వంటని, పిల్లల బాల్యాన్ని ఎప్పుడూ వదులుకోలేదు. ఆయన కనుమరుగై దాదాపు దశాబ్దం పైగానే గడిచింది. అయితేనేం చెన్నైలో ఉండే పెద్ద కుమారుడు ప్రతాప్, హైదరాబాద్ లో ఉండే నాలుగో కుమారుడు రాజా తండ్రి జ్ఞాపకాల పరిమళాలను ఎంతో సంతోషంగా సాక్షితో పంచుకున్నారు. రాజా: నాన్నగారికి మేం నలుగురు మగ పిల్లలం, ఒక ఆడపిల్ల. ప్రతాప్ పెద్దన్నయ్య, రెండో అన్నయ్య కేశవరావు, ఆ తరవాత అక్క సుశీల, నేను, నా తరవాత తమ్ముడు సత్యం. నాకు నాలుVó ళ్లు వచ్చేవరకు మాటలు రాలేదు. కుర్తాళంలో ఉన్న జలపాతం నీటికి ఔషధ గుణాలు, మహిమలు ఉన్నాయని తెలిసినవారు చెప్పటంతో నన్ను అక్కడకు తీసుకువెళ్లారు. జలపాతం నీళ్లు నా మీద పడేలా తన భుజాల మీద ఎక్కించుకున్నారు. నీటి మహిమో, యాదృచ్ఛి కమో గానీ, వారు చెప్పినట్టుగానే నాకు మాటలు రావడంతో నాన్నగారి ఆనందానికి అవధులు లేవు. ఆ సంఘటన తరచుగా చెబుతుండేవారు. నాకు చిన్నప్పటి నుంచి ఆయనతో అనుబంధం పెనవేసుకుంది. ఆయనతో మాకు ఎన్నో తీపి అనుభవాలు ఉన్నాయి. పుట్టినరోజులు బాగా జరిపేవారు. పార్టీలకు, ఫ్రెండ్స్ ఇళ్లకు వెళ్లటంలాంటి అలవాట్లు ఆయనకు లేవు. అవకాశం వచ్చినప్పుడల్లా మాతో క్యారమ్స్, షటిల్ ఆడేవారు. వినాయకచవితికి మాతో పూజ చేయించేవారు. నాన్న ఊరు వెళ్తుంటే ఏడ్చేవాళ్లం. అప్పుడప్పుడు ఔట్‌డోర్ షూటింగ్‌కి తీసుకువెళ్లేవారు. మేం షూటింగ్ చూసిన మొట్టమొదటి సినిమా సతీ సులోచన. కోదాడ వెళ్లినప్పుడు అక్కడి పొలాలకు తీసుకువెళ్లేవారు. అక్కడ మమ్మల్ని చూసి ‘కాంతారావుగారి అబ్బాయి’ అని అందరూ అంటుంటే మాకు భలే సరదాగా ఉండేది. నాన్నగారు చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చేశాక ఆయన బ్యాంకు పనులు చూడటం అలవాటు చేసుకున్నాను. హైదరాబాద్ వచ్చాక ఒకసారి నన్ను షూటింగ్‌కి తీసుకువెళ్లారు. వాళ్లు నన్ను ప్రొడక్షన్ బాయ్ అనుకుని, నేను అన్నం దగ్గర కూర్చున్న చోట నుంచి లేపి, మరోచోట కూర్చోమన్నారు. నాన్నగారు కోపంగా, ‘నాకు కూడా అక్కడే అన్నం పెట్టండి’ అన్నారు. ఏం జరుగుతోందో వాళ్లకు అర్థం కాలేదు. ‘వాడు మా అబ్బాయి, మీ పని నాకు అవమానంగా ఉంది’ అన్నారు. మద్రాసులో వారికి నేనెవరో తెలుసు. కాని హైదరాబాద్‌లో ఎవ్వరికీ తెలియకపోవటం వల్ల ఈ సంఘటన జరిగింది. మేం పెద్దగా చదువుకోకపోయినా, నాన్న ప్రేమను పరిపూర్ణంగా అందుకున్నాం. ‘సుడిగుండాలు’ చిత్రానికిగాను 1968లో అవార్డు అందుకున్నాను. అవార్డు వచ్చినందుకు సంతోషపడ్డారు కానీ, అటువంటి పాత్రలు ఎన్నడూ వేయద్దు, నా కొడుకు నా కళ్ల ముందరే ఉండాలి’ అంటూ కళ్లనీళ్లు పెట్టుకున్నారు. ఆ చిత్రంలో నేను వేసిన పాత్రలో చనిపోతాను. సినిమా రంగానికి దూరంగా ఉండమని చెప్పేవారు. హేమ ఫిలిమ్స్ పేరున మేం తీసిన ‘సప్తస్వరాలు’ చిత్రం ఫ్లాప్ కావటంతో, నాన్నగారికి గుండెపోటు వచ్చింది. ‘మీ ప్రేమే నన్ను కాపాడుతుంది. అమ్మని బాగా చూసుకో రాజా’ అన్నారు. 1971 దాకా హీరోగా చేశారు. ‘గుండెలు తీసిన మొనగాడు’ నాన్న హీరోగా చేసిన ఆఖరి సినిమా. ‘నేరము – శిక్ష’ నుంచి క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారారు. నవంబరు 16వ తేదీన నాన్నగారి పుట్టినరోజు. ఆ రోజు నాన్నగారు ఒక కార్యక్రమానికి హాజరయ్యారు. అప్పటికే నాన్న క్యాన్సర్ వ్యాధితో బాధపడుతు న్నారు. అక్కడ కొద్దిసేపు ఉండి, ఇంటికి బయలుదేరుతూ, అందరి ఎదుట, ‘నాన్నా రాజా! ఇంక నాకు ఈ కర్ర అవసరం లేదు. నువ్వే నా కుడిభుజం. అమ్మని జాగ్రత్తగా చూసుకో’ అని చెప్పారు. చివరికి అదే నిజం చేస్తూ ఏడాదికల్లా నాన్న కన్ను మూశారు. ప్రతాప్: నాన్నగారి స్వస్థలం తెలంగాణలోని కోదాడ. రజాకార్ మూవ్మెంట్ టైమ్‌లో అక్కడనుంచి చెన్నై మకాం మార్చేశారు. నాన్నగారిది ప్రేమ వివాహం. అమ్మది జగ్గయ్యపేట. అమ్మ మీద నాన్నకు విపరీతమైన అభిమానం. అమ్మ చేతి కాఫీతోనే నాన్న నిద్ర నుంచి లేచేవారు. ఇంటి వ్యవహారమంతా అమ్మే చూసుకునేది. అమ్మ సింపుల్‌గా ఉండటమే కాదు, మమ్మల్ని కూడా అలాగే పెంచింది. ఇంట్లో రెండు కార్లు ఉన్నా రిక్షాలోనే వెళ్లేది. మేం కూడా సైకిల్ లేదా బస్సుల్లో ప్రయాణించేవాళ్లం. నాన్న చాలా బిజీగా ఉండేవారు. ఒకసారి షూటింగ్‌కి వెళ్లిపోతే వారం పదిరోజుల దాకా ఆయనను చూడటానికి కుదిరేది కాదు. ప్రతి రోజూ మూడు షిఫ్టులు పనిచేసేవారు. సంవత్సరానికి పన్నెండు సినిమాలు చేయాలనుకునేవారు. 1960 – 1971 మధ్యకాలంలో ఆయన ఎంత బిజీగా ఉన్నారంటే ఆయన కాల్షీట్లు చూడటానికి ఇద్దరు సెక్రటరీలను పెట్టుకునేంత! రోజుకి మూడు గంటలు మాత్రమే నిద్రపోయేవారు. మా చిన్నతనంలో తిరుపతి వెళ్లినప్పుడు నాకు గుండు కొట్టించారు. నేను కుదురుగా ఉండకపోవటంతో కొలనులోకి దొర్లిపోయాను. నాన్నగారు వెంటనే చూడటంతో బతికి బయటపడ్డాను. మద్రాసులో సినిమా వాళ్ల పిల్లలంతా కేసరయ్య స్కూల్లోనే చదివేవారు. మేం కూడా అక్కడే చదువుకున్నాం. ఆ తరవాత రామకృష్ణ మిషన్‌లో చదివాం. కాలేజీలో నా అంతట నేనే చేరాను. తమ్ముళ్లని మాత్రం నాన్న చేర్పించారు. 1957లో అనుకుంటాను. పెళ్లికి వెళ్లి, తిరుపతి నుంచి తిరిగి వస్తున్నాం. అప్పుడు నాకు ఏడేళ్లు. ముందు సీట్లో నాన్న ఒళ్లో పడుకున్నాను. ఆయన నా మెడ మీద చేయి వేసి పడుకోబెట్టుకున్నారు. బాగా వాన పడుతుండటంతో రాణీ పేట దగ్గర కారు చక్రం స్కిడ్ కావటంతో యాక్సిడెంట్ అయ్యింది. కుడివైపు చెట్టుకి కొట్టుకుని వెనక్కి వచ్చి మళ్లీ కొట్టుకుంది. అద్దాల ముక్కలు తలలో పడ్డాయి. సరిగ్గా అప్పుడు నాన్న నన్ను కిందకి తోసేసి, తను కూడా దూకేశారు. డ్రైవర్ జంప్ చేశాడు. చెట్టు కొట్టుకోవటం వల్ల, ప్రమాదం నుంచి తప్పించుకోగలిగాం. కారు నుజ్జునుజ్జు అయిపోయింది. కారు కండిషన్ చూసినవారంతా మేం ఎలా బతికి బయటపడ్డామా అనుకున్నారు. ఆ ఏడుకొండల వాడి దయ వల్ల బతికాం అని నాన్న చెప్పేవారు. 1968లో సప్తస్వరాలు సినిమా స్వయంగా నిర్మించి అందులో నటించారు. ఆ సినిమాకి కావలసిన వస్తువులు కొంటూ నాకు 150 రూపాయలు పెట్టి సీకో వాచీ కొన్నారు. ఆ వాచీ చాలా సంవత్సరాలు వాడాను, అది పాడైపోయాక మళ్లీ చాలాకాలం వాచీ కొనుక్కోలేదు. 1974లో సింగపూరు వెళ్లినప్పుడు వాచీ కొని తెచ్చుకున్నాను. గడియారం కాలాన్ని ఎంత ముందుకు తోస్తున్నా మేము మాత్రం ఎప్పుడూ నాన్న జ్ఞాపకాల్లోనే ఉంటాం. – సంభాషణ: వైజయంతి పురాణపండ అప్పటి నుంచి మాతోనే... నేను మొదటి నుంచి నాన్నగారి ప్రొడక్షన్స్ చూసుకునేవాడిని. ఎక్కడా ఉద్యోగం చేయలేదు. చెన్నైలో ఉన్నన్ని రోజులు నాన్నగారు మా దగ్గరే ఉండేవారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపేవారు. నాకు ముగ్గురు అబ్బాయిలు. సాయికిరణ్, కార్తిక్, గుణరంజన్. ముగ్గురూ ఆస్ట్రేలియాలో ఉద్యోగాలు చేసుకుంటున్నారు. నా భార్య లక్ష్మి. మా అత్తవారు మేము ఇరుగుపొరుగు వారం. నాన్నగారితో వియ్యమందుకున్నాక, మా మావగారు పి. చంద్రశేఖర్ మా ప్రొడక్షన్లో భాగస్వాములయ్యారు. – ప్రతాప్ నా దగ్గరే... నేను ఒక చిన్న ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాను. అమ్మ హైమవతి నా దగ్గరే ఉంది. నా భార్య ఉషశ్రీ. వాళ్లది తణుకు. మా అబ్బాయి సాయి ఈశ్వర్ బిటెక్ చదువుతున్నాడు. అమ్మాయి ప్రియాంకకు వివాహం అయ్యింది. అల్లుడు మెరైన్‌లో పనిచేస్తున్నాడు. – రాజా -
తూర్పుగొదావరి జిల్లాలో టీడీపీకి షాక్
-
ప్రచారంలో ప్రతిపాడి టీడీపీ అభ్యర్థి రాజా భార్యకు చేదు అనుభవం
-
విశాఖ ఉత్తర నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్ధిగా కేకే రాజు నామినేషన్
-
రైతుల కోసం ఎందాకైనా...
సాక్షి ప్రతినిధి, తూర్పుగోదావరి, కాకినాడ : ప్రాజెక్టుల కోసమని రైతుల నుంచి భూములను సేకరిస్తుంది..పరిహారం ఇచ్చేసరికి చుక్కలు చూపిస్తోంది. న్యాయబద్ధంగా వ్యవహరించి సంతృప్తి పరచాల్సిన ప్రభుత్వం తమకేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తూ బాధిత రైతులను గాలికొదిలేసింది. నిర్లక్ష్యం ఆవరించి నిద్రావస్థలో ఉన్న ప్రభుత్వాన్ని మేల్కొల్పడానికి వైఎస్సార్సీపీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా ఉద్యమానికి సిద్ధమయ్యారు. రైతుల తరపున పోరాటంలో భాగంగా ఆమరణ నిరాహార దీక్షకు ఉపక్రమిస్తున్నారు. రైతుల కోసం ప్రాణ త్యాగమైనా చేస్తానంటూ మంగళవారం చేపట్టనున్న దీక్షతో శ్రీకారం చుట్టనున్నారు. సమస్య ఇదీ... మండలంలోని పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాన్ని రూ.1,638 కోట్ల నిధులతో నెలకొల్పారు. పురుషోత్తపట్నంలో హెడ్‌వర్క్ నుంచి పది కిలో మీటర్లు పొడవున పైప్‌లైన్ వెళ్లి దేవీపట్నం మండలం గండికోట వద్ద పోలవరం ప్రాజెక్ట్ ఎడమ కాలువలోకి గోదావరి జలాలను వదిలారు. 55 కిలోమీటర్ల ఎల్‌ఎమ్‌సీ ద్వారా వెళ్లిన నీటిని ఏలేరు రిజర్వాయర్‌లో ఎత్తిపోస్తారు. అక్కడ నుంచి విశాఖ జిల్లాకు, తాగునీరు. సాగునీరుతోపాటుగా, స్టీల్‌ప్లాంట్‌కు నీటిని సరఫరా చేస్తామన్న ఉద్దేశంతో ప్రాజెక్టు రూపకల్పన చేశారు. దీనివల్ల ఉపయోగం ఎంతుందో తెలియదు గాని రైతులకు మాత్రం అన్యాయం జరిగింది. ఈ పథకంలో మండలంలో పురుషోత్తపట్నం, వంగలపూడి, చినకొండేపూడి, నాగంపల్లి రెవెన్యూలో 334 మంది రైతులకు సంబంధించి 206 ఎకరాలు భూసేకరణ ద్వారా సేకరించారు. నాగంపల్లి రెవెన్యూలో ఉన్న భూములకు ఎకరానికి రూ.24 లక్షలు, మిగిలిన భూములకు ఎకరానికి రూ.28 లక్షలు పరిహారంగా ఇస్తామని ప్రకటించారు. 244 మంది రైతులు ముందుగానే 138 ఎకరాలు అందించారు. వీరికి రూ.24 లక్షలు, రూ.28 లక్షలు ఎకరానికి పరిహారంగా అందించారు. 89 మంది రైతులకు సంబంధించి 70 ఎకరాల భూములకు 2013 భూసేకరణ చట్టం కింద పరిహారం అందించాలని డిమాండ్ చేస్తున్నారు. చట్టాన్ని పరిగణనలోకి తీసుకుని పరిహారాన్ని లెక్కిస్తే రైతులకు మేలు జరుగుతుంది. ఒక రైతుకు చెందిన భూములు ఒకటికి రెండు మూడు ప్రాజెక్టుల్లో పోతే పరిహారం నాలుగు రెట్లు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఇక్కడదేమీ చేయకుండా తోచిన విధంగా పరిహారం ఇస్తున్నారు. ఇక, రూ. ఐదున్నర లక్షలు ఆర్ఎన్ఆర్ ప్యాకేజీ, కుటుంబంలో 18 సంవత్సరాలు వయస్సు నిండిన వారిలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాల్సి ఉంది. రైతు కూలీలకు కూడా ఇదే విధంగా ఆర్ఎన్ఆర్ ప్యాకేజీ లేదా నెలకు రూ. రెండు వేలు చొప్పున 20 సంవత్సరాలపాటు ఆ కుటుంబానికి అందజేయాలి. కానీ టీడీపీ ప్రభుత్వం దీన్ని కూడా పట్టించుకోవడం లేదు. ఈ డిమాండ్లతో 55 మంది రైతులు కోర్టును అశ్రయించారు. ఎకరాకు రూ. నాలుగు లక్షలు పెంచి పరిహారం అడుగుతుంటే మీనమేషాలు లెక్కిస్తున్న ప్రభుత్వం కోర్టులకు వెళ్లి లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టడానికే సిద్ధ పడుతుందే తప్ప రైతులకు న్యాయం చేసేందుకు ఆసక్తి చూపడం లేదు. రైతులకు బాసటగా రాజా ఆమరణ నిరాహార దీక్ష ఏళ్ల తరబడి పోరాడుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడాన్ని నిరసిస్తూ వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా రైతుల తరపున పోరాటానికి దిగారు. ఏళ్లు గడుస్తున్నా పరిహారం అందక రైతులు ఇబ్బంది పడుతున్నారని, వారికి న్యాయం జరిగే వరకూ ఉద్యమిస్తూనే ఉంటానంటూ సంకల్పించారు. అందులో భాగంగా నేటి నుంచి ఆమరణ దీక్షకు ఉపక్రమిస్తున్నారు. రఘుదేవపురం కోట దుర్గ గుడి ఎదురుగా ఉన్న స్థలంలో దీక్ష చేపట్టనున్నారు. ప్రాణ త్యాగానికైనా సిద్ధం... పురుషోత్తపట్నం ప్రాజెక్టుకు సంబంధించి భూసే కరణ జరిపి రెండు సంవత్సరాలు పూర్తికావొస్తు న్నా ఇంతవరకు ఆయా రైతులకు నష్టపరిహారా న్ని అందించకపోవడం ప్రభుత్వ దుర్మార్గపు ఆలోచన విధానానికి తార్కాణం. 2013 భూసేకరణ చట్టం ప్రకారం రైతులకు ఇవ్వాల్సిన పరిహా రాన్ని పక్కన పెట్టేసి ఇష్టానుసారంగా పంíపిణీ చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఇదే విషయాన్ని గతంలో చాలాసార్లు వ్యతిరేకించాం. పరిహారం పంపిణీ విషయంలో ఆర్అండ్ఆర్ ప్యాకేజీ వర్తించే రైతులు, రైతు కూలీలకు ఈ రోజుకు కూడా న్యాయం చేయకపోవడం బాధాకరం. వీరి న్యాయబద్ధమైన డిమాండ్ల సాధన కోసం ఆమరణ దీక్ష చేస్తున్నాను. ఎంతవరకైనా పోరాడుతాను. ప్రాణ త్యాగానికైనా సిద్ధపడతాను.– జక్కంపూడి రాజా, వైఎస్సార్సీపీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు -
అంతఃశత్రువు
పెళ్ళి చూపులకోసం సెలవు పెట్టక తప్పలేదు నాకు. పెళ్ళి ఇష్టం లేదని కాదు. కానీ ఇంకా దానిపై సరైన అభిప్రాయం ఏర్పరచుకోలేదు. అవగాహన లేకపోవడమో, నాకై నేను చెప్పలేకపోవడమో, కొంత సిగ్గూ మొహమాటం వల్లనో, పెళ్ళి గురించిన ప్రసక్తి అమ్మ తెచ్చినప్పుడల్లా ‘ఇప్పుడు కాదులేమ్మా’ అని నెట్టుకుంటూ వచ్చేస్తున్నాను. ట్రైనింగు అనీ, పనిచేస్తున్న ప్రదేశం అనుకూలం కాదనీ వంకలు పెట్టుకుంటూ గడిపాను. అయినా నాకిప్పుడెంత వయసనీ, మొన్ననే ఇరవై నాలుగెళ్ళాయి. అప్పటికే చాలా ఆలస్యం అయిపోయిందని మావాళ్ళ ఆందోళన. ప్రస్తుతం కశ్మీరు ప్రాంతంలో పనిచేస్తున్న నేను, అతికష్టం మీద పదిరోజులు సెలవు సంపాదించి ఊరికి బయలుదేరాను. ఇంజనీరింగ్ పూర్తి చేశాక నేను మిలిటరీలోకి వెళ్ళటం అమ్మకూ, నాన్నకు అస్సలు ఇష్టం లేదు. అమ్మ మరీ గొడవ చేసేసింది. ‘‘కావాలంటే ఇంకా పై చదువులు చదువు. లేదా వేరే ఉద్యోగం ఏదైనా చూసుకో. అంతేకానీ ఈ దినదినగండం మిలిటరీలో ఒద్దురా నాయనా’’ అని అమ్మ అంటే, ‘‘అమ్మా! మిలిటరీ అంటే యుద్ధమేనా. పైగా నేను ఇంజనీరును కదా. నేనెక్కడో సురక్షితమయిన చోటే పని చేస్తానమ్మా. నామాట నమ్ము’’ అని నమ్మబలికాను. చాలా బతిమాలాను. నాకు ఎలాగయినా మిలిటరీ ఉద్యోగం చెయ్యాలన్న కోరిక బలంగా ఉండటంతో, మొత్తం మీద ఒప్పించే సాధించాను. ఈరోజు అమ్మ నాకోసం ఎంత ఎదురు చూస్తూ ఉంటుందో ఊహించగలను. రెండురోజుల ప్రయాణం తరువాత మా ఊరు చేరాను. దారిపొడుగునా పచ్చని పొలాలు. అప్పుడే పొలం పనులకు జట్లు జట్లుగా వెళ్తున్న కూలీలు, పశువుల్ని మేపడానికి గుంపులుగా బయలుదేరిన పిల్లగాళ్ళూ. భలే ముచ్చటగా ఉంది పల్లెల దృశ్యం. ఈ పల్లెటూళ్ళ అందాల ముందు కాశ్మీరు దిగదుడుపే. ఎంతయినా మా ఊరు కదా! ఇంటికి చేరేటప్పటికి ఎదురుచూస్తూన్న అమ్మ హడావుడికి అంతే లేదు. ముందు పెద్ద గ్లాసెడు పాలిచ్చి స్నానం చెయ్యమని తొందరపెట్టేసింది. దగ్గరుండి వళ్ళంతా మీగడ రాయించి, నలుగు పెట్టించి, కుంకుళ్ళతో తలంటు పోయించింది మా మంగలి వెంకటస్వామితో. తడి తలకు ఒకటీ, వంటికి మరోటి తువ్వాళ్ళతో ఎంత ఒద్దన్నా నా వొళ్ళంతా తుడిచింది. పొయ్యికి దగ్గర్లోనే పీట వేసి కూర్చోబెట్టి, పలహారంలోకి కుడుములు, గారెలు ఇంకా పిండి అట్టు అంటూ వేసి బలవంతంగా తినిపించేసింది. అమ్మ అనురాగానికి కరిగిపోయాను. కళ్ళు చెమ్మగిల్లాయి. తలొంచుకున్నాను. అట్టు వేస్తున్నదల్లా ఇటుతిరిగిన అమ్మ కంగారుపడిపోయి ఒక్క ఉదుటున లేచి నన్ను పట్టుకుని వణికే కంఠంతో ‘‘ఏవిరా నాయనా కళ్ళు తడి చేసుకుంటున్నావు? అక్కడ నీకు తిండి సౌకర్యం కుదరడం లేదా ఏవిటీ. వెర్రినాగన్నా. ఎలా చిక్కిపోయావురా. మరేవీ ఇబ్బంది లేదు కదా అక్కడ. అలా అయితే ఉద్యోగం వదిలేసి చక్కా వచ్చెయ్యి. ఇక్కడ మాత్రం రాజాలాగ బతకలేకనా’’ అంది కంగారుగా. ‘‘అదేంలేదమ్మా, అక్కడ చాలా బావుంటుంది. అది సరే, నాన్న ఎన్నింటికి వస్తారు’’ అని మాట మార్చేశాను. నువ్వు కాస్త కాఫీ పుచ్చుకుని నిద్రపో. ఎంత ప్రయాణం చేసి వచ్చావో! అవును కాఫీయేనా, టీ తాగుతావా?’’ అడిగింది అమ్మ. మా ఇంట్లో కాఫీ అలవాటు లేదు. నాకోసమని తెప్పించి ఉంచిందేమో! ‘‘అమ్మా! నువ్వు ముందు టిఫిన్ తిను. తరువాత ఇద్దరం కాఫీ తాగుదాం. నువ్వు ముందు కుడుములు తింటూ ఉండు. అట్టు నేనే వేస్తాను నీకు’’ అనంటూ అమ్మను భుజం పట్టుకు లేపాను పొయ్యిదగ్గరనుండి. ‘‘అయ్యో నువ్వు అట్టు వెయ్యడవేంట్రా మగబిడ్డవి? అయినా నేనేవీ తినను కానీ, కాఫీ కలిపేస్తానుండు’’ అంది అమ్మ. నేను ఊరుకోకుండా అమ్మను పీట మీద కూర్చోబెట్టి ఒక అట్టు వేయించి అమ్మ ప్లేటులో వేశాను. నాకో ముక్క తినిపించి ‘‘ఎంత దోరగా వేశావురా అట్టు. ఎవరికి రాసి పెట్టి ఉందో కానీ, నీకొచ్చే పెళ్ళాం సుఖపడుతుందిరా నాయనా’’ అంటూ మధ్య మధ్యలో కళ్ళు కొంగుతో ఒత్తుకుంటూ మహానందంగా తింటోంది అమ్మ. మరో అట్టు వేశాను, అమ్మ వద్దని ఎంత మొత్తుకుంటున్నా. ‘‘అది సరే! అసలు సంగతి చెప్పనియ్యి. ఇప్పుడు నువ్వు చూడబోయే సమ్మంధం, సుబ్బారాయుడుగారనీ, మనకంటే కాస్త మోతుబరి అంట. మీనాన్న ఇక్కడ పంచాయితి ప్రెసిడెంటు అయితే, అక్కడ ఆయన మండలానికి ప్రెసిడెంటు అంట. అవన్నీ నాకెందుకు కానీ, పిల్ల చక్కని చుక్క అటరా, గుణాల రాశి అట. మనకు బాగా కావాల్సినావిడ, సత్యోతమ్మగారనీ, ఆవూరేలే, ఆవిడ చెప్పింది. ఆవిడకు ఆ పిల్లలంతా బాగా అలవాటట. అలాంటి మంచిపిల్ల దొరికి నా బంగారుకొండను సుఖపెట్టేదయితే నాకీజన్మలో ఇంకేంకావాలీ. నాన్నకు బాగా మోజుగా ఉంది ఈ సంబంధం కలుపుకోవాలని. ఆ రాజకీయాల్లో కూడా ఇంకో మెట్టు ఎక్కినట్టవుతుందని కావును. అయినా నీకు నచ్చాలి కదా’’ అని ఆగి నా మొహం వంక చూసింది అమ్మ. ‘‘అది సరే అమ్మా. అక్క రేపు రావడం ఏంటి, ఇవ్వాళే వచ్చి ఉండొచ్చుకదా?’’ అన్నాను మాట మారుస్తూ. ‘‘రేపీపాటికి ఇక్కడ ఉంటుందిరా. దానికి మాత్రం నిన్ను చూడాలని ఎంత ఆత్రంగా ఉందనీ. ఇంకాస్సేపట్లో ఫోను చేసేస్తుంది చూడు.’’ అంది అమ్మ, గిన్నెలు మూతలు పెట్టి సర్దుకుంటూ. ‘‘ఎలా ఉందమ్మా అక్క? పిల్లల్ని తీసుకొస్తుంది కదా. బావ కూడా వస్తుంటే ఎంత బావుణ్ణు కదా అమ్మా’’ అన్నాను. మూడోనాడు మా పంతులుగారు చెప్పిన టైముకే బయల్దేరదీశారు నాన్న. మేం నలుగురం కాక, మా దూరపు బంధువు రాఘవ మావయ్యతో బయల్దేరాం. నేను కారు నడుపుతానంటే అమ్మ, నాన్న ససేమిరా అన్నారు. పెళ్ళికొడుకు హోదాకి భంగం అట. డ్రైవరుతో కలిసి ఇరుగ్గా సర్దుకున్నాం అంబాసిడరు కారులో. గంటన్నరలో పెళ్ళికూతురు ఇల్లు చేరాం. పట్నం కాదు కానీ పెద్ద ఊరు. మండల కేంద్రం. మర్యాదలూ, పలకరింపులూ అయ్యాక హాలులో కూర్చున్నాం. అక్కడ అన్ని పళ్ళూ, పలహారాలూ పెట్టారు, కానీ ఎవ్వరూ ముట్టుకోలేదు. వాళ్ళూ మొహమాటపెట్టలేదు. కతికితే అతకదట. నాకు ముందే చెప్పి పెట్టింది మా అక్క. అమ్మాయి తల్లి మా అక్కను లోపలికి పిల్చుకెళ్ళి, పెళ్ళికూతుర్ని వెంటబెట్టుకొచ్చారు. మరో ఇద్దరు అమ్మాయిలు, కొందరు ముత్తయిదువులూ గుమ్మాల్లోనుండే నవ్వులాడుకుంటూ, గుసగుసలాడుతూ చూస్తున్నారు. అమ్మాయి పేరు చంద్రిక అట. ఆమెతోనే చెప్పించారు. అందరికీ నచ్చినట్టే ఉంది. అక్కడ ఉన్న అందరూ ఇక పెళ్ళే తరువాయి అన్నంత ధీమాగా ఉన్నట్టు కనిపించారు. అమ్మాయి తండ్రి ‘‘అమ్మాయి నచ్చిందా బాబూ, ఏవన్నా అడగాలా’’ అన్నారు కొంచెం గంభీరంగానే. ‘‘అబ్బే ఏవీ అక్కర్లెద్దండి’’ అన్నాను కంగారుగా. ‘‘సరే మిలిటరీలో అంటకదా, ఏవిటి పని బాబూ’’ ఆయనే అడిగారు మళ్ళీ. అప్పటివరకూ అమ్మాయినే కళ్ళారా చూసుకుంటూ, అమ్మాయి తల్లితో ఏవో చెప్పేస్తున్న మా అమ్మ, ఉలిక్కిపడినట్టు ఒక్కసారి కలగచేసుకుని ‘‘అన్నయ్యగారూ! అబ్బాయి మిలిటరీలో అన్నమాటేకానీ, వాడు ఇంజనీరు కదా యుద్ధాలకీ వాటికీ అస్సలు సబంధమే లేని ఉద్యోగం. సరిహద్దు దగ్గరక్కూడా వెళ్ళే పని ఏవి ఉండదు వాడికి’’ అంది. అందరూ మొహాలు చూసుకుంటున్నారు. నాకు ఏం మాట్లాడాలో అయోమయం అయిపోయింది. సుబ్బారాయుడుగారు కొంచెం నుదురు ముడేసి ‘‘అంతేనా అబ్బాయ్’’ అన్నారు నావంక చూస్తూ. నేను కొంచెం సర్దుక్కూర్చుని, ‘‘కాదండి, మా అమ్మకు నా ఉద్యోగం గురించి అంత అవగాహన లేదండి. నేను చేస్తున్నది ఇంజనీరుగానే అయినా, యుద్ధాలకు దగ్గర్లో పని చెయ్యవలసి వస్తుంది. సరిహద్దుల్లో ఉండటం కూడా ఉద్యోగంలో భాగమే. అయినంతమాత్రాన మాకు భద్రత లేకపోవడం ఏవీ ఉండదు. అందరికీ ఉండే అభద్రతా పరిస్థితే మాకూ ఉంటుంది.’’ అని ఆగాను. అందరూ నిశ్శబ్దం అయిపోయారు. అప్పటివరకూ తలవంచుకుని అమ్మ, అక్క అడిగినవాటికి మెల్లగా సమాధానాలు చెప్తున్న పెళ్ళికూతురు, నేను మాట్లాడుతున్నంతసేపూ కళ్ళెత్తి తదేకంగా నావంకే చూస్తూ ఉంది. ఆమెను క్రమంగా ఏదో భయం ఆవహించినట్టు అయ్యింది. ఆ గంభీర వాతావరణంలోంచి ఎలా తేలికపడాలా అని అందరికీ ఉన్నట్టే ఉంది. సుబ్బారాయుడుగారే కలగజేసుకుని, నాన్న వంక తిరిగి ‘‘భోజనాలు చేసి వెళితే బాగుండును. అయినా పెద్దలు చెప్పిన మాటొకటుంది కదండి. పట్టించుకోవాల్లెండి. అబ్బాయి ఎప్పటివరకు ఉంటాడు? ఇంకా మా కుటుంబ పెద్దలతో చెప్పలేదు. వాళ్ళకూ చెప్పి అప్పుడు ఏ సంగతీ కబురు చేస్తాం. ఏవంటారు?’’ నాన్న, అమ్మ కూడా కళవళపడుతూ ‘‘అలాగే మరి. పెద్దలకు చెప్పండి. అప్పటివరకూ ఎదురుచూస్తాం. ఇక సెలవామరి.’’ అని లేచారు. చంద్రికకు ఇది అనుకోని పరిణామమేమో. అలాగే కూర్చుండిపోయింది, అందరూ లేచినా. ఆమె వణుకుతున్న చేతులు నలుపుకుంటోంది తల వంచుకుని. ‘‘అమ్మాయిని లోపలికి తీసుకెళ్ళవే’’ అన్నారు సుబ్బారాయుడుగారు ఒకింత విసుగు ధ్వనిస్తున్న కంఠంతో. ఇంటికి తిరిగొచ్చాక అమ్మ బాధపడింది. అక్క నిర్లిప్తంగా తన ఊరికి ప్రయాణం అయ్యింది. నాన్న రుసరుసలాడేరు. ప్రత్యేకంగా ఉద్యోగం సంగతి నేను ఎందుకు అలా చెప్పానని వాళ్ళకు కోపం, బాధ. నాకంత ఇష్టమయిన సొంత ఊరిలో, సొంత ఇంటిలో అమ్మ దగ్గర మరో నాలుగురోజులు సెలవు గడపటం కష్టమయ్యింది. కాశ్మీరుకు బయల్దేరుతూ అమ్మకు చెప్పాను ‘‘అమ్మా! ఉన్న విషయం దాచి పెళ్ళి చేసుకోవడం ఏవంత మంచిది కాదని నీకు తెలియదా? అయినా నా ఉద్యోగంలో నాకున్న భద్రత గురించి వాళ్ళకు అనుమానాలుంటే ఆ సమ్మంధం మాట మరిచిపోవడం మంచిది. నువ్వు నా పెళ్ళి గురించి బాధపడకు. నాకు ప్రాణమయిన ఉద్యోగం వల్లే నాకు ప్రాణహాని ఉంటుందన్న తప్పుడు భావన, భయం నీకు లేకపోతే నాకు అంతే చాలమ్మా. నచ్చిన పిల్ల రాకపోయినా, వచ్చిన పిల్ల నచ్చొచ్చు కదమ్మా. ఈ విషయంలో నీ కర్మ సిద్ధాంతాన్ని నమ్ము. నాకు కాస్తంత ఊరట. నాకోసం నువ్వు ఎంతో ఇష్టంగా చేసి డబ్బాల్లో పెట్టిన సున్నుండలు, జంతికలు, పాలకోవ బిళ్ళలు నాకేవీ రుచించవు అమ్మా, నువ్వు నవ్వుతూ మనస్పూర్తిగా సాగనంపకపోతే’’ ఇక నాకు గొంతు పెగల్లేదు. తల వంచుకున్నాను. అమ్మ అమాంతం కౌగిలించుకుని వీపు నిమిరి ముద్దులు పెట్టేసి, కన్నీళ్ళతోటే నవ్వుతూ సాగనంపింది. మళ్ళీ నా ఉద్యోగంలో పడిపోయాను. అమ్మ ఓరోజు ఫోనులో చంద్రిక సంగతి ఎత్తింది. ‘‘సుబ్బారాయుడుగారు మళ్ళీ ప్రస్తావన తేకపోయినా, ఆ పిల్ల మనింటి కోడలయితే బావుణ్ణని ఉందటరా. సత్యోతమ్మగారని, అంతకుముందు నీకు చెప్పాను చూడు ఆ ఊరావిడ, ఆవిడ చెప్పిందిరా’’ అంది ఆశగా. ‘‘పెద్దవాళ్ళకు ఇష్టం లేనప్పుడు మనం ఏం చేస్తాంలేమ్మా. ఇక మర్చిపో’’ అని సరిపెట్టాను అమ్మని. తీరిక చేసుకుని అమ్మకు ఉత్తరం వ్రాశాను, వారం వారం ఫోనులో మాట్లాడుతున్నా కూడా. ఉత్తరం అందుకున్నాక పొంగిపోయి ఫోను చేసింది అమ్మ. ఎన్నిసార్లు ఫోనులో మాట్లాడినా అమ్మకు తనివి తీరదట. కానీ ఆ ఒక్క ఉత్తరం వందసార్లు చదువుకున్నానని చెప్పింది. ఎంతటి శక్తి ఉంది చేతివ్రాతలో! అప్పటినుండీ నెలకొక్కటయినా అమ్మకు ఉత్తరం వ్రాయాలని నిశ్చయించుకున్నాను. నేను ఆఫీసులో ఉన్నవేళ మా ఇంటి దగ్గర నుండి ఫోను వచ్చిందని కబురొచ్చింది. ‘ఇలాంటి వేళల్లో ఎప్పుడూ మావాళ్ళు చెయ్యరే,’ అనుకుంటూ గాభరాగా టెలిఫోను ఆపరేటరు దగ్గరకు వెళ్ళి ఫోను అందుకున్నాను. అవతల నాన్న కంఠం, ‘‘సుబ్బారాయుడుగార్ని రాత్రి ఎవరో చంపేసార్రా. హత్య. నేనక్కడికే వెళుతున్నాను. ఇదిగో అమ్మ వివరాలు చెబుతుంది’’. నేను మ్రాన్పడిపోయాను. అంతలో అమ్మ గొంతు. చాలా భయంగానూ కంగారుగానూ ‘‘ఘోరం జరిగిపోయిందిరా నాయనా’’ అంటూ వెక్కుతూ ఆయాసపడుతోంది. ‘‘అమ్మా! నువ్వు కాస్త నెమ్మదించు. మెల్లగా చెప్పమ్మా’’ అన్నాను అమ్మకు ఏమన్నా తేడా వస్తుందేమోనన్న భయంతో. ‘‘ఏవో ముఠా తగాదాలట. పాత కక్షలు. ఆ పాడు రాజకీయాలు మనకొద్దు అంటే మీ నాన్న వినరు. నాకేవీ పాలుపోవడం లేదురా నాయనా. గుండెల్లో అంతా ఒకటే గాభరాగా ఉందిరా. నువ్వు ఇలాంటి సమయంలో ఇక్కడ ఉంటే బావుణ్ణని మనసు పీకుతోందిరా’’ అంటూ ఆయాసపడుతూ ఆగింది. ‘‘అమ్మా నేను రేపు మళ్ళీ ఫోను చేస్తాను. అయిపోయినదాన్ని మనమెవరం ఏం చెయ్యలేము కదా. నీ ఆరోగ్యం జాగ్రత్త. అక్కను రమ్మనీ, నాల్రోజులిక్కడే ఉండమను. నాన్నను జాగ్రత్తగా ఉండమని చెప్పు. నేను రాత్రికే ఫోను చేస్తానులే. కంగారుపడకమ్మా. నేనూ తొందరగానే వస్తాను’’ అంటూ పెట్టేశాను. రెండు రోజుల తర్వాత, వెళ్ళాలా వద్దా అన్న సంకోచంలో ఉండి ఇంటికి ఫోను చేశాను. అమ్మతో మాట్లాడాను. అప్పటికి సుబ్బారాయుడుగారి హత్య జరిగి ఐదు రోజులయ్యింది. నాన్న ఇంట్లో లేరు. పొద్దున్నే వెళ్ళిపోయి రాత్రివరకూ సుబ్బారాయుడుగారి ఊళ్ళోనే ఉంటున్నారట. అక్కడి రాజకీయాలు, గ్రూపులు, తగాదాలు, కోర్టులు, పోలీసులు ఇవే విషయాలతో ఉక్కిరిబిక్కిరిగా ఉంటున్నారట. ఇవన్నీ చెప్పి అమ్మ ‘‘నువ్వు శ్రద్ధగా ఒక విషయం వినాలిరా నాయనా! ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. నువ్వొకసారి నాల్రోజులు సెలవు పెట్టుకుని వారి పెద్ద కర్మ నాటికి రావాలి. ఆ అమ్మాయి చాలా ఢీలా పడిపోయిందిరా. నేను ఆ చావు రోజున వెళ్ళడవే. నన్ను పట్టుకుని వదల్లేదు చంద్రిక. ఏకధారగా ఏడుస్తూనే ఉంది. తరువాత కూడా ఈ నాల్రోజుల్నించీ తిండీ, నిద్రా లేకుండా ఓ కుమిలిపోతోందట. వాళ్ళ అమ్మగారికి భర్త పోయిన దుఃఖం కంటే ఈ పిల్ల శోకాన్నే తట్టుకోలేకపోతున్నారట. సత్యోతమ్మ గారు రోజూ నాకు ఫోను చేస్తున్నారు అక్కడి సంగతులన్నీ చెబుతూ. చంద్రిక నీతో ఒక్కసారి మాట్లాడాలంటోందటరా నాయనా. అర్థం చేసుకోలేనివాళ్ళకు ఇది విడ్డూరంగానో, తప్పుగానో అనిపించొచ్చు కానీ, ఇంతటి విపత్తులో ఆ పిల్ల అలా అడుగుతోందంటే ఒకసారి ఆలోచించాలి బాబూ. సంతోషాలకీ, సంబరాలకీ అందరూ ఉంటారు. దుఃఖసమయంలో వెన్నంటి ఉన్నవాళ్ళే ఆత్మబంధువులవుతారు నాయనా. ఆ పిల్ల మన వల్ల కలిగే ఎలాంటి సాంత్వన కోరుకుంటోందో మరి. పెద్ద మనసు చేసుకొని ఆ పెద్దకర్మ నాటికి వస్తే మర్నాడో ఎప్పుడో ఒక్కసారి చంద్రికను చూసి వద్దాం. ఏవంటావు?’’ అమ్మకు ఏం సమాధానం చెప్పాలో పాలుపోవడం లేదు. ‘‘అలాగేనమ్మా’’ అన్నాను యాంత్రికంగా. వారం సెలవు మీదే బయలుదేరాను. పెద్ద కర్మ రోజున పెద్ద జన సందోహమే అక్కడ. చుట్టుపక్కల జనంతోబాటూ అనేకమంది నాయకులు కూడా వచ్చారు. నాన్న అందర్నీ పలకరిస్తూ ఏర్పాట్లు చేస్తూ హడావిడిగానే ఉన్నారు. మధ్యాహ్నం తరువాత చాలామంది వెళ్ళిపోయారు. అయినా ఇంకా చాలామంది గుంపులు గుంపులుగా ఉండి మాట్లాడుకుంటున్నారు. నాకేవీ తోచడం లేదు. వాళ్ళంతా సుబ్బారాయుడుగారి చావు పట్ల విచారంగా కంటే, గుంభనంగా, గంభీరంగా ఉన్నట్టు కనిపించారు. నాన్న నన్ను పిలిచి అమ్మను తీసుకుని ఊరికి వెళ్ళమన్నారు. తనకు ఇంకా ఆలస్యం అవుతుందన్నారు. అప్పటికే అక్కడ మిగిలిన జనం దగ్గర్లో ఉన్న తోటలకేసి వెళుతున్నారు. ఏవో సమాలోచనలకు అని అర్థమవుతోంది. ధైర్యాన్ని అంతా కూడగట్టుకొని నాన్నతో చెప్పాను గొంతు తగ్గించి. ‘‘నాన్నా! మీకు చెప్పదగినవాణ్ణి కాదు కానీ, చెప్పక తప్పడం లేదు. ఇక్కడ మీరంతా ఏమి ఆలోచిస్తారో, ఏమి చెయ్యాలనుకుంటారో, అందరూ ఊహించగలిగేదే. అమ్మనీ, మమ్మల్నీ దృష్టిలో పెట్టుకుని ఇక ఈ తరహా ముఠారాజకీయాలు విరమించండి నాన్నా. సుబ్బారాయుడుగారి అమ్మాయి అడిగింది అదేనట నాన్నా. మీరు ఈ ఊబిలో ఉండొద్దని ఆమె కోరిక. అందుకే ఆమె ఏడుస్తోంది ఏకధాటిగా. అక్కతో ఇదే విషయం రోజంతా చెబుతూనే ఉందట.’’ ‘‘ఆపిల్ల అలా అందా? మన గురించి భయపడుతోందా, బాధపడుతోందా’’ అన్నారు నాన్న ఆశ్చర్యంగా. ‘‘తీరిగ్గా ఇంటిదగ్గర మాట్లాడుకుందాం నాన్నా. దయచేసి ఈ ముఠా రాజకీయాలు తగాదాలు వదిలెయ్యండి నాన్నా. మా గురించైనా లేక సుబ్బారాయుడుగారి అమ్మాయి వేడుకున్నదాని గురించైనా మీరివి వదిలెయ్యండి. సుబ్బారాయుడు గారు నాది బతుకు భద్రత లేని ఉద్యోగం అనుకొని వాళ్ళ అమ్మాయిని ఇవ్వడానికి ఇష్టపడలేదు. ఆ అమ్మాయి ఇక్కడే ఎవరికీ భద్రత లేదని మిమ్మల్ని ఈ రొంపిలోంచి తప్పుకోమంటోంది. ఎవరి భద్రత ఎంతో ఇప్పటికైనా తెలిసిందా. ఇంతకంటే ఇంకేమీ చెప్పలేను. తొందరగా వచ్చెయ్యండి నాన్నా. మీకోసం ఎదురు చూస్తుంటాం’’ అని వెనుతిరిగాను. ‘‘ఆగరా అబ్బాయ్ నేనూ వస్తున్నాను’’ అంటూ నాతో వచ్చేశారు వెనకనుండి చాలామంది పిలుస్తున్నా వెనక్కి చూడకుండా. వచ్చి వెనుతిరుగుతున్న నా భుజంపై చెయ్యి వేసి నాన్న అన్న మాట నాకు ఆశ్చర్యం కలిగించింది. ‘‘ఇప్పుడు ఆ అమ్మాయిని పెళ్ళి చేసుకుంటావట్రా అబ్బాయ్?’’ ‘‘అదేంటి నాన్నా, ఇంత శోకంలో ఉన్న కుటుంబంలో...’’ అని నేను సందేహిస్తూ అంటుండగా నాన్న గంభీరంగా అన్నారు – ‘‘ఆ అమ్మాయికి మనం పెళ్ళిచూపులకు వెళ్ళిన రోజునుండే ఇష్టం కలిగిందట. నువ్వు నీ ఉద్యోగం గురించి నిష్కర్షగా నిజం చెప్పినప్పుడు ఆ అమ్మాయి మనసులో నువ్వు స్థానం పొందావు. అమ్మ నాకు ఈ విషయాలన్నీ చెబుతూనే ఉంది. అంతేకాదు. దేశాన్ని రక్షించే మీ ప్రాణాలకు భద్రత లేదనీ, మేం ఊరి మధ్య ఉండి మహా భద్రతగా ఉన్నామనీ అనుకునేదంతా ఉత్తి భ్రమ. మా భద్రతలోని డొల్లతనం సుబ్బారాయుడు గారి లాంటి అనేకమంది హత్యోదంతాలు కళ్ళకు కడుతున్నాయి. అందుకే ఆ అమ్మాయి ఇక్కడి భద్రతకన్నా నువ్విచ్చే భరోసాపట్ల విశ్వాసం కలిగి ఉంది. మరో విషయం, మంచికో చెడ్డకో మనలో ఒక ఆచారం ఉంది. తండ్రి చనిపోయిన ఇంట్లో పెళ్ళికెదిగిన ఆడపిల్ల ఉంటే యజమాని మరణం తరువాత ఏడాదిలోగా పెళ్ళి జరిగితే మంచిదంటారు. నీకిష్టమయితే, నెమ్మది మీద వాళ్ళకు తెలియపరుస్తాను.’’ నా భుజంపై నాన్న చెయ్యి మెత్తగా హత్తుకున్నట్టయ్యింది. ‘‘మీ అందరికీ ఇష్టమయితే అలాగే నాన్నా’’ అంటూ ముందుకు నడిచాను నాన్నతో కలిసి. - జి.కె.యస్.రాజా -
తాగి గొడవకు దిగిన నటుడు..
కాన్పూర్, ఉత్తరప్రదేశ్ : నటుడు రాజా చౌదరి మరో కాంట్రావర్సీలో చిక్కుకున్నారు. శుక్రవారం కాన్పూర్‌లో మద్యం సేవించిన ఆయన పలువురితో గొడవపడ్డారు. దీంతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై మాట్లాడిన పశ్చిమ కాన్పూర్ ఎస్పీ సంజీవ్ సుమన్ మెడికల్ టెస్టుల కోసం రాజాను ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు. బిగ్‌బాస్-2 సీజన్‌తో రాజా పాపులర్ అయ్యారు. కాగా, రాజాకు 1998లో శ్వేత తివారీతో వివాహం జరిగింది. ఆయనపై గృహ వేధింపుల కేసు కూడా నమోదైంది. 2007లో శ్వేతతో ఆయన విడిపోయారు. 2012లో అధికారికంగా ఇరువురికి విడాకులు మంజూరు అయ్యారు. 2011లో పొరుగు ఇంటి వ్యక్తి పేరు మీద సెల్‌ఫోన్ కనెక్షన్‌కు రాజా దరఖాస్తు చేశారు. ఈ విషయం తెలుసుకున్న సదరు వ్యక్తి రాజాపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు రాజాను అరెస్టు చేశారు. 2013లో ముంబైకి చెందిన అభినవ్ కోహ్లి అనే యువతిని రాజా వివాహం చేసుకున్నారు. ఆమెతో విభేదాలు రావడంతో విడిపోయారు. అనంతరం 2015లో ఢిల్లీకి చెందిన స్నేహితురాలు శ్వేత సూద్‌ను పెళ్లి చేసుకున్నారు. -
'గిప్పటికి దొరికిండు' దొంగ రాజు
సాక్షి, చిత్తూరు : ఇటీవల గుడిపాల మండలంలో జరిగిన జంట హత్యల కేసు ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే. చివరకు సీజింగ్ రాజాను చిత్తూరు జిల్లా పోలీసులు ఈ రోజు అరెస్టు చేశారు. సీజింగ్ రాజా చెన్నై తాంబరం ప్రాంతానికి చెందినవాడుగా పోలీసులు గుర్తించారు. తమిళనాడులో సీజింగ్ రాజా పేరు చెబితే అక్కడి వాసులకు వణుకే. అయితే జంట హత్యల కేసుతో పాటు న్యాయస్థానాన్ని, పోలీసుల దర్యాప్తును తప్పుదారి పట్టించడానికి యత్నించడం కింద రాజాపై చిత్తూరు పోలీసులు కేసులు నమోదు చేశారు. సీజింగ్ రాజా తమిళనాడులో సెటిల్ మెంట్ల ద్వారా వందల కోట్లు ఆర్జించాడు. ఈయనపై చెన్నై నగరంలో 33 కేసులు ఉన్నాయి. హత్యా , దోపిడి , హత్యాయత్నం , కిడ్నాప్ కేసులే అధికం. తమిళనాడు పోలీసులకు కొరకరాని కొయ్యగా మారిన సీజింగ్ రాజాపై భారీ ఎత్తున కేసులున్నాయి. మే 10వ తేదీన గుడిపాల మండలంలో జాతీయ రహదారి పై ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు హత్యకు గురయ్యారు. ఈ హత్యను ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారు. సినీ ఫక్కీలో అసలైన నిందితుడు సీజింగ్ రాజా బదులు పోలీసుల కన్నుకప్పడానికి చిత్తూరు కోర్టులో ఐదుగురు డూప్లికేట్ నిందితులు లొంగిపోయాడు. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి వారిని అదుపులో తీసుకుని అసలు నిందితుడైన సీజింగ్ రాజాను అరెస్ట్ చేయడానికి మూడు టీంలుగా విడిపోయి తమిళనాడులోని సీజింగ్ రాజా కదలికలపై నిఘా ఉంచి అరెస్టు చేశారు, పోలీసుల విచారణలో అతని గురించి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయని పోలీసులు తెలిపారు. -
అమ్మ రాజా..!
చిత్తూరు అర్బన్: పది రోజుల క్రితం గుడిపాల మండలంలో జరిగిన జంట హత్యల కేసు ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఇందులో చెన్నైకు చెందిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తుల్ని అతి దారుణంగా నడిరోడ్డుపై నరికి చంపారు. పోలీసులు రెండు రోజుల తరువాత మృతులు అశోక్, గోపినాథ్లుగా గుర్తించారు. అయితే ప్రధాన నిందితుడిని గుర్తించే లోపే అయిదుగురు చెన్నై వాసులు హత్య చేసింది తామేనంటూ చిత్తూరు కోర్టులో లొంగిపోవడానికి వచ్చి పోలీసుల చేతికి చిక్కారు. క్రైమ్ స్టోరీలా మలుపులు, థ్రిల్లింగ్‌ను తలపించిన ఈ ఘటనలో ప్రధాన నిందితుడు చెన్నైకు చెందిన గ్యాంగ్‌స్టర్ సీజింగ్ రాజాగా పోలీసులు గుర్తించారు. రూ.వందల కోట్లకు పడగలెత్తిన ఇతడిని పట్టుకోవడం ఆషా మాషీ విషయం కాదని గుర్తించిన పోలీసులు కదలికలపై నిఘా పెట్టారు. అయితే అనూహ్యంగా సీజింగ్ రాజా చిత్తూరు నగరంలోనే పోలీసులకు దొరికిపోయాడు. నిందితుడిని విచారిస్తే తెలిసిన విషయాలు ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. చిత్తూరులోనే మకాం.. చెన్నై తాంబరం ప్రాంతానికి చెందిన సీజింగ్ రాజా పేరు చెబితే అక్కడి వాసులకు వణుకే. భూ తగాదాలు, సెటిల్మెంట్లు, హత్యలు, కిడ్నాప్‌లు, దోపిడీల్లాంటి 32కు పైగా కేసులు ఇతనిపై నమోదయ్యాయి. నాలుగు సార్లు పీడీ యాక్టు పెడితే తమిళ పోలీసుల కళ్లుగప్పి తప్పించుకున్నాడు. అశోక్, గోపినాథ్‌లను హత్య చేసిన తరువాత ఇతడిని పట్టుకోవడానికి చిత్తూరు ఎస్పీ రాజశేఖర్‌బాబు ఓ ప్రత్యేక బృందాన్ని నియమించారు. వీరు మఫ్టీలో చెన్నై, తాంబరం ప్రాంతాల్లో సీజింగ్ రాజా కోసం తీవ్రంగా గాలించారు. ఒకసారి కనిపించిన ఇతను మరోమారు చిత్తూరు పోలీసులకు కనిపించలేదు. అయితే సీజింగ్ రాజాను గుర్తించిన పోలీసులు నీడలా వెంటా డారు. ఈ క్రమంలోనే ఇతను బస్సులో చిత్తూరు నగరానికి రావడాన్ని గుర్తించారు. వెంబడించిన పోలీసులు బాలాజీ కాలనీలో సీజింగ్ రాజాను ఆదివారం చాకచక్యంగా పట్టుకున్నారు. రేషన్, ఆధార్ కార్డులు.. నిందితుడిని తమదైన శైలిలో విచారించిన పోలీసులు అతడు మాటలతో షాక్‌కు గురయ్యారు. చెన్నై ప్రాంత వాసి అయినా ఇతను చిత్తూరు నగర పౌరుడిగా కొనసాగుతున్నాడు. బాలాజీకాలనీ చిరునామాతో రేషన్‌కార్డు ఉండటంతో పాటు ప్రతీనెలా నిత్యావసర వస్తువులు కూడా సీజింగ్ రాజా తీసుకుంటున్నాడు. ఆధార్ కార్డు సైతం ఇదే చిరునామా పేరిట ఉన్నట్లు గుర్తించారు. పెగా ప్రతీ ఆదివారం చిత్తూరులో సినిమాలు చూస్తూ ఓ సాధారణ పౌరుడిగా ఎవరికీ సందేహం రాకుండా తన కార్యకలాపాలను కొనసాగిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. రెండు రోజుల్లో అరెస్టు.. జంట హత్యల కేసుతో పాటు న్యాయస్థానాన్ని, పోలీసుల దర్యాప్తును తప్పుదారి పట్టించడానికి యత్నించడం కింద రాజాపై చిత్తూరు పోలీసులు కేసులు నమోదు చేశారు. హత్యలు చేసిన తీరును రాజా నుంచి పోలీసులు రాబట్టారు. హత్య జరిగిన ప్రదేశానికి తీసుకెళ్లి వాంగ్మూలం నమోదు చేయాల్సి ఉంది. మొత్తం సాక్ష్యాలు సేకరించి రెండు రోజుల్లో రాజాను చిత్తూరులో అరెస్టు చేయడానికి పోలీసులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. రాజాను పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించిన డీఎస్పీ సుబ్బారావు, రామకృష్ణ బృందంతో పాటు చిత్తూరు పశ్చిమ సీఐ ఆదినారాయణలను ఎస్పీ రాజశేఖర్‌బాబు అభినందించారు. -
మళ్లీ కటకటాల్లోకి రాకెట్‌రాజా
టీ.నగర్: హత్యకేసులో పోలీసు కస్టడీ ముగియడంతో రాకెట్‌రాజాను మళ్లీ మంగళవారం జైల్లో నిర్బంధించారు. తూత్తుకుడి జిల్లా, కొడియన్కుళంకు చెందిన కుమార్, నాడార్ మక్కల్ శక్తి ఇయక్కం అధ్యక్షుడు రాకెట్‌రాజా మద్దతుదారులకు పాళయంకోట్టైలో స్థలం విషయంలో ఘర్షణ ఏర్పడింది. ఫిబ్రవరి 26న పాళయంకోట్టై, అన్నానగర్‌లోని కుమార్ ఇంటిపై రాకెట్‌రాజా మద్దతుదారులు బాంబులతో దాడి జరిపారు. దాడిలో కుమార్ అల్లుడు ప్రొఫెసర్ సెంథిల్‌కుమార్ హత్యకు గురయ్యారు. చెన్నైలోని నక్షత్ర హోటల్లో తలదాచుకున్న నిందితుడు రాకెట్‌రాజాను పోలీసులు అరెస్టు చేసి కోయంబత్తూరు సెంట్రల్ జైల్లో నిర్బంధించారు. సోమవారం నెల్లై ప్రత్యేక కోర్టులో రాకెట్‌రాజాను పోలీసులు హాజరుపరిచారు. ఆ సమయంలో రాకెట్‌రాజాను రెండు రోజుల పోలీసు కస్టడీకి తీసుకుని విచారించాల్సిందిగా న్యాయమూర్తి ఉత్తర్వులిచ్చారు. దీంతో పాళయంకోట్టై పోలీసు స్టేషన్లో రాకెట్‌రాజా వద్ద పోలీసు డిప్యూటీ కమిషనర్ విజయకుమార్ విచారణ జరిపారు.మంగళవారం విచారణ పూర్తికావడంతో వైద్య పరీక్షల అనంతరం రాకెట్‌రాజాను మళ్లీ నెల్లై కోర్టులో హాజరుపరిచారు. కేసు విచారణ ఈనెల 23వ తేదీకి వాయిదా పడింది. దీంతో రాకెట్ రాజాను కోయంబత్తూరు జైలుకు తరలించారు. -
వీడు సామాన్యుడు కాదు
చిత్తూరు అర్బన్: గుడిపాలలో జరిగిన జంట హత్యల కేసు చిక్కుముడి వీడింది. తమిళనాడుకు చెందిన అశోక్, గోపిలను హత్య చేసింది చెన్నైకు చెందిన స్టీరింగ్ రాజా (42)గా తేలింది. కేసుతో తమకు సంబంధం లేకున్నా పోలీసులు వేధింపులకు గురిచేస్తుండటంతో తమకు రిమాండు విధించాలని రమేష్, శివ, కార్తిక్, సోమేష్, కులందయ్యలు సోమవారం చిత్తూరు కోర్టులో లొంగిపోవడానికి వచ్చి పోలీసుల చేతికి చిక్కిన విషయం తెలిసిందే. వీళ్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించగా ప్రధాన నిందితుడు రాజా అని అంగీకరించారు. కోర్టును తప్పుదారి పట్టించడం, దర్యాప్తు కోణాన్ని మార్చడానికి చూసినందుకు నిందితులు అయిదుగురిని రిమాండుకు తరలిం చినట్లు సీఐ ఆదినారాయణ పేర్కొన్నారు. హత్యలకు కారణం.. చెన్నైలోని తాంబరానికి చెందిన స్టీరింగ్ రాజాకు కుండ్రకొత్తూరుకు చెందిన గోపి, అశోక్‌కుమార్‌లకు పరిచాయాలున్నాయి. తిరువళ్లూరులోని బీఎ స్పీ పార్టీకి చెందిన తిమ్మరసు అనే వ్యక్తిని 2017లో స్టీరింగ్ రాజ, అశోక్‌కుమార్‌లు కలిసి హత్య చేశా రు. ఈ కేసులో వీరు కొద్ది రోజులు జైల్లో కూడా ఉన్నారు. తన అన్నను హత్య చేసిన వాళ్లపై పగతీర్చుకోవడంలో భాగంగా తిమ్మరుసు తమ్ముడు బాంబురవి అనే వ్యక్తి స్టీరింగ్ రాజా గ్రూపునకు చెందిన ఓ వ్యక్తిని హత్య చేసి జైలుకెళ్లాడు. ఇతనితో అశోక్‌కుమార్, గోపీలు సన్నిహితంగా ఉండటంతో వీళ్లిద్దరినీ హతమార్చాలని స్టీరింగ్ రాజా నిర్ణయించుకున్నాడు. అలా ఇద్దరినీ ఈనెల 10న కిడ్నాప్ చేసి గుడిపాలలోని పానాటూరు వద్ద హత్య చేశారు. రాజాపై ఎన్నో కేసులు... స్టీరింగ్ రాజ అలియాస్ నర్సింగ్ రాజా అలియాస్ రైజింగ్ రాజా పేరు చెబితే చెన్నైలోని తాంబరం ప్రాంతం వణికిపోతుంది. పేరుమోసి గ్యాంగ్‌స్టర్‌గా గుర్తింపు ఉంది. భూ తగాదాలను సెటిల్ చేయడం, కమీషన్లు తీసుకోవడం, అడ్డొచ్చినవాళ్లను హత్య చేయడం వృత్తిగా ఎంచుకున్నాడు. ఇతనిపై తమిళనాడులో 32 కేసులు ఉన్నాయి. తిరుపతి స్టేషన్లో సైతం ఓ కిడ్నాప్ కేసు ఉంది. చెన్నై పోలీసులు ఇతనిపై నాలుగుమార్లు పీడీ యాక్టులు పెట్టగా, ఒక్కసారి కూడా పట్టుకోలేకపోయారు. రూ.వంద కోట్లకు పైనే ఆస్తులున్న స్టీరింగ్ రాజా ఓ సామ్రాజ్యాన్నే నడుపుతూ గ్యాంగ్‌స్టర్‌గా కొనసాగుతున్నాడు. ఇతన్ని పట్టుకోవడానికి చిత్తూరు ఎస్పీ రాజశేఖర్‌బాబు ఆధ్వర్యంలో ఓ ప్రత్యేక బృందం గాలింపు చేపడుతోంది. -
చాంప్స్ సాహితి, రాజా రిత్విక్
సాక్షి, హైదరాబాద్: ఆసియా యూత్ చెస్ చాంపియన్‌షిప్‌లో తెలుగు క్రీడాకారులు సత్తా చాటారు. థాయ్‌లాండ్‌లో ముగిసిన ఈ టోర్నీలో బాలుర అండర్–14 క్లాసిక్ విభాగంలో రాజా రిత్విక్ (హైదరాబాద్)... అండర్–12 విభాగంలో డి.గుకేశ్ (ఆంధ్రప్రదేశ్)... అండర్–12 బాలికల విభాగంలో ఎం. సాహితి వర్షిణి (ఆంధ్రప్రదేశ్) విజేతలుగా నిలిచారు. సాహితి ర్యాపిడ్ విభాగంలో స్వర్ణం, బ్లిట్జ్ ఈవెంట్లో కాంస్యం కూడా సాధించడం విశేషం. బాలుర అండర్–8 క్లాసిక్ విభాగంలో ఆదిరెడ్డి అర్జున్, అండర్–14 విభాగంలో కుశాగ్ర మోహన్ కాంస్యాలు సాధించారు. -
‘సైందవ’గా యంగ్ హీరో
ఛలో సినిమాతో సూపర్ హిట్ అందుకున్న యంగ్ హీరో నాగశౌర్య వరుస సినిమాలతో బిజీ అవుతున్నాడు. ఇప్పటికే మరోసారి స్వీయ నిర్మాణంలో తెరకెక్కిస్తున్న నర్తనశాల సినిమాను ప్రారంభించాడు. ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న కణం, అమ్మమ్మగారిల్లు సినిమాలు రిలీజ్‌కు రెడీగా ఉన్నాయి. తాజాగా నాగశౌర్య మరో సినిమాకు అంగీకరించాడు. భవ్య క్రియేషన్స్ బ్యానర్‌పై వి. ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్న సినిమాలో నాగశౌర్య హీరోగా నటించనున్నాడు. ఈ సినిమాతో రాజా దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కనున్న ఈ సినిమాకు సైందవ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాలో నాగశౌర్య సరసన అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్గా నటించే అవకాశముంది. -
మనసే మందిరం
సీనియర్ నటి రాజశ్రీ అనగానే ఎన్టీఆర్‌తో చేసిన ‘గోపాలుడు భూపాలుడు’, అక్కినేనితో చేసిన ‘గోవుల గోపన్న’,కాంతారావుతో చేసిన ‘ప్రతిజ్ఞాపాలన’, శోభన్‌బాబుతో చేసిన ‘సత్తెకాలపు సత్తయ్య’ వంటి ఎన్నో హిట్ సినిమాలు జ్ఞప్తికి వస్తాయి. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో 200లకు పైగా చిత్రాల్లో నటించారామె. జానపద, పౌరాణిక సినిమాల్లో భక్తికి సంబంధించిన అనేక సన్నివేశాల్లో, పాటల్లో నటించారు. చెన్నైలో ఉంటున్న రాజశ్రీ ‘నేను– నా దైవం’ గురించి... మీకు ఆధ్యాత్మికత ఎలా పరిచయం అయ్యింది? నా పేరులోనే ఆధ్యాత్మికత ఉందండీ. నా అసలు పేరు ‘కుసుమ కుమారి’. మా అమ్మకు బెంగాల్లో చాలా ప్రముఖంగా వాసికెక్కి తెలుగు నాట కూడా చాలామందికి ఆరాధ్యనీయమైన కుసుమ హరనాథ్ బాబా అంటే విశ్వాసం ఎక్కువ. ‘ద్వేషానికి మించిన పాపం లేదు’ అని బోధించిన బాబా ఆయన. ఆయన పట్ల ఆరాధనతో నాకు కుసుమ కుమారి అనే పేరు పెట్టింది. పేరు ప్రభావమో ఏమో నాకు ఏ ఆధ్యాత్మిక ధోరణి పట్ల ప్రేమే ఉంది తప్ప ద్వేషం లేదు. మా ఇంట్లో అందరు దేవుళ్లకు పూజలు చేసేవాళ్లం. వేంకటేశ్వరస్వామిని ఇలవేల్పుగా కొలిచేవాళ్లం. ఏడాదికి ఒకసారి తప్పనిసరిగా తిరుమలకు వెళ్లి శ్రీవారికి కల్యాణం జరిపించేవాళ్లం. ఇక నా సినిమా ప్రయాణం అయితే శివాలయం నుంచే మొదలైంది. అదెలా? మేము చెన్నైలోనే ఉండేవాళ్లం. మా ఊరి నుంచి బంధువులొస్తే ఏవీఎం స్టూడియోలో సినిమా షూటింగ్ చూడటం కోసం వెళ్లాను. అపుడు నా వయసు పదేళ్లు. దండాయుధపాణి అనే డ్యాన్స్ మాస్టర్, నటి జమున, ఏవీఎం చెట్టియార్ కూర్చుని పిల్లల చేత డ్యాన్స్ చేయిస్తూ సెలెక్షన్స్ చేస్తున్నారు. జమునగారు నన్ను గమనించి, ఈ పిల్ల బాగుంటుంది అని చూపారు. శివాలయం సెట్లో శివలింగం ముందు డ్యాన్స్ చేయడం నా తొలి పాత్ర. ఆ సినిమా పేరు ‘నాగదేవతై’. అంటే, దేవతామూర్తుల పాత్రలూ వేశారన్నమాట. తమిళం ‘ఆదిపరాశక్తి’లో లక్ష్మీ, తెలుగు ‘భక్తశబరి’లో సీతగా వేశాను. దైవ పాత్రలు వేసినప్పుడు మాంసాహారం తినను. మహిళగా కొన్ని దినాల్లో దైవ పాత్రల షూటింగ్‌కు వెళ్లేదాన్ని కాదు. శివుని కంఠాభరణమైన పాములతోనే నృత్యం చేశారని మీ గురించి తెలిసినవారు చెబుతుంటారు, నిజమేనా ? నిజమే. ‘స్వర్ణగౌరి’ అనే సినిమాలో కృష్ణకుమారి, కాంతారావు హీరో హీరోయిన్లు. నేను నాగ కన్యగా వేషం వేశాను. నాగలోకం సెట్లో షూటింగ్. 18 ఏళ్ల వయసులో ఉన్న నేను షూటింగ్ విరామంలో నిద్రపోతుంటే లేపి మగత నిద్రలో ఉన్న నా రెండు చేతులకు పాములు అందించి డైలాగ్...డైలాగ్...అని డైరెక్టర్ కేకలు పెట్టారు. భయంతో డైలాగ్‌లు మర్చిపోయి నోటమాటరాలేదు. వదిలితే అవి జారిపోతాయి. అలా వాటితో యాక్ట్ చేశాను. అలాగే ‘అదృష్ట దేవత’ సినిమాలో నాగలోకం సెట్లో చాలా పాములు తీసుకువచ్చి నేను డ్యాన్స్ చేస్తుంటే పైకి విసిరారు. పౌర్ణమి రోజున పాములకు పళ్లు వస్తాయట. అవి నాపైకి పడగ విసిరేవి. అయినా భయం లేకుండా చేశాను. భయం గురించిన ప్రస్తావన వచ్చింది. అసలు భయం లేని జీవితం గడపాలంటే దైవ సహాయం అవసరం అంటారా? తప్పక అవసరం. చాలామంది దైవ భక్తి అంటే ‘మాకలాంటి నమ్మకాలు ఏవీ లేవండి’ అని.. ఏవేవో కథలు చెబుతుంటారు. . కాని కష్టం వచ్చినప్పుడు, ఓ సవాలు ఎదురైనప్పుడు ప్రతి మనిషికీ ఒక నిస్సహాయ పరిస్థితి వస్తుంది. సాటి మనిషి ఆదరణ ఎంత లభించినా అంతకు మించిన శక్తి కావాల్సి వస్తుంది. ఆ శక్తిని దైవం అంటారో ప్రకృతి అంటారో ఎవరి ఇష్టం వారిది. కుటుంబాన్ని బట్టి ఆధ్యాత్మిక అలవాట్లు ఉంటాయి. పుట్టిపెరిగిన వాతావరణం ఎంతో ప్రభావం చూపుతుంది. నాకు తెలిసినంత వరకు నాస్తికుల్లోనూ అంతర్లీనంగా భక్తి ఉంటుంది. అయితే కొందరు దాన్ని శాస్త్ర, సాంకేతిక శక్తి అనుకుంటారు. ఆ సాంకేతిక శక్తిలో కూడా శక్తి ఉంది కదా. ఆధ్యాత్మిక మార్గానికి మతం ఏ మేరకు సాయపడగలదు? ప్రతి మనిషి గమ్యం లౌకిక విషయాల నుంచి, ఇహ లోకపు మాయ నుంచి విముక్తం కావడం. దానికి మతం ఒక సోపానం. ప్రపంచంలో అనేక మతాలున్నాయి. అవన్నీ ఈ గమ్యానికి చేర్చే సోపానాలే. ఎవరు ఏ సోపానమైనా తీసుకోవచ్చు. నేను జన్మతః హిందువును కావచ్చు. కాని ఆధ్యాత్మిక సాక్షాత్కారం కోసం ఒక్క హిందూ మతం పైనే ఆధారపడాల్సిన అవసరం లేకపోవచ్చు. ఇస్లాం, క్రైస్తవంలో ఉన్న మంచి విషయాలను కూడా మనం గ్రహించవచ్చు. పాటించవచ్చు. నేను అలాగే పాటించాను కూడా. ఇస్లాం, క్రిస్టియానిటీతో కూడా మీకు పరిచయం ఉన్నట్టుంది.. నేను ఐదు భాషల్లో నటించాను. నేను వేసిన పాత్రలు, షూటింగ్‌లకు వెళ్లిన ప్రాంతాలు అనేకానేక సంస్కృతులను, మత భావాలను పరిచయం చేశాయి. అనేక మలయాళ సినిమాల్లో క్రైస్తవ, ముస్లిం పాత్రలు పోషించాను. క్రైస్తవులైన మలయాళ నిర్మాతలతో కలిసి ఆ సమయంలో కేరళలోని అనేక చర్చిలకు వెళ్లేదాన్ని. చాలా ప్రశాంతత కలిగేది. ‘ప్రేమజీవులు’ తెలుగు సినిమాలో నేను పోషించిన క్రైస్తవ పాత్ర నన్ను ఎంతో ప్రభావితం చేసింది. మా బాబును బీసెంట్ నగర్‌లోని సెయింట్ జాన్స్ స్కూల్లో చేర్చడం వల్ల అక్కడి సెయింట్ థామస్ చర్చి అలవడి ప్రార్థనలు చేసేదాన్ని. అలాగే ప్రసిద్ధ నాగూర్ దర్గాకు అనేక సార్లు డబ్బు ఎంఓ చేసేదాన్ని. నాగూర్ దర్గాలో నిద్రచేస్తే దోషాలు పోతాయని అంటారు. నేనూ నమ్ముతాను. చెన్నై మౌంట్‌రోడ్డులోని దర్గాకు, ట్రిప్లికేన్‌లోని బడా దర్గాకు వెళ్లేదాన్ని. పళని మురుగన్‌కు కూడా తరచు డబ్బులు పంపేదాన్ని. భక్తురాలిగా మీ జీవితంలో దైవానికి సంబంధించి మరిచిపోలేని అనుభవం..? ఒకసారి షూటింగ్ నిమిత్తం నేను, కాంతారావు, రాజబాబు విమానంలో వెళుతున్నాం. అదే విమానంలో సత్యసాయిబాబా ఉన్నారు. ప్రార్థించడమేగానీ ఆయనను చూడటం అదే మొదటిసారి. ఆ అనుభూతి ఎంతో గొప్పగా అనిపించింది. ఆయన చెన్నైకు వచ్చినప్పుడు నేను దర్శనానికి వెళ్లి ఎంతో వెనుకాల నిలబడ్డాను. ముందు వరుసలో ఉంటే బాబాను బాగా దర్శించుకోవచ్చని అనుకున్నాను. నా మనసులో మాట విన్నట్లుగా అందరికీ విభూతి ఇస్తూ వెనుక వైపున్న నాకు కూడా ఇచ్చి బాబా వెళ్లిపోయారు. ధ్యానం గురించి కూడా మీకు పరిచయం ఉందని తెలిసింది. దైవ ప్రార్ధనలో ఎలాంటి నియమాలు పాటించాలంటారు? నిష్ట, నియమాలతో గంటలు గంటలు దేవుడి ముందు కూర్చోవడం కాదు. ఒక సెకండ్ అయినా ఏకాగ్రతతో దేవుణ్ణి ప్రార్థిస్తే చాలు. గుడికి వెళ్లడం అంటే.. అక్కడి స్థల మహాత్మ్యం కోసమే. మనసులోనే దైవాన్ని చూడగలగాలి. నటిగా బిజీగా ఉండే సమయంలో మీలోని ఆధ్యాత్మిక హృదయాన్ని ఎలా సంతృప్తిపరిచేవారు.? షూటింగ్ సెట్లో విరామాల్లో రామకోటి లాగా ఓం నమో శ్రీ వేంకటేశాయ, తెలుగులో ఓం సాయిరాం అని రాసేదాన్ని. ఆ పుస్తకాలను తిరుమలకు వెళ్లినపుడు హుండీలో వేసేదాన్ని. సహనటులు ఏంది లెక్కలు రాస్తున్నావా అని అడిగేవారు. దేవుడు ప్రత్యక్షమైతే ఏం వరం కోరుకుంటారు? అమ్మో..!! దేవుడు ప్రత్యక్షమైతే మాటలు వస్తాయా?!! మనకు ఏమి కావాలో దేవుడికి తెలియదా! దేవుడిని కోరుకోడానికి. దేవుడిని చూడటమే అదృష్టం. అంతకంటే ఇంకేమికావాలి. అన్నమైనా, సంపదైనా మనకు ఎంత ప్రాప్తం ఉంటే అంతే లభిస్తుంది. ఇంకా ఇంకా కావాలని ఆశించడం వల్ల ప్రయోజనం లేదు. సర్వేజనః సుఖినోభవంతు అని ప్రార్థిస్తాను. – కొట్రా నందగోపాల్, సాక్షి ప్రతినిధి, చెన్నై రాజశ్రీ పశ్చిమగోదావరిలోని ఏలూరులో పుట్టి చెన్నై చిత్రసీమలో మెరిశారు. దక్షిణ భారతదేశ చిత్రపరిశ్రమలో 1956 నుంచి 1979 వరకు నటిగా రాణించారు. బాలనటిగా చిత్రరంగ ప్రవేశం చేసిన రాజశ్రీ ఆ తర్వాత అగ్రకథానాయకులైన ఎన్టీఆర్, ఏఎన్నార్, కాంతారావు వంటి ప్రముఖ తారాగణంతో కలిసి పనిచేశారు. కాంతారావు–రాజశ్రీ నటించిన సినిమాలు బాక్సాఫీసు వద్ద అఖండ విజయం సాధించాయి. తెలుగులో 76 సినిమాలలో నటించిన రాజశ్రీ తమిళ, కన్నడ, మలయాళ, హిందీ సినిమాలలోనూ నటిగా గుర్తింపు పొందారు. -
ఒక పల్లవి నాలుగు చరణాలు
అమ్మాయిలని నోట్స్ అడగడం కూడా చాలా కష్టమైన రోజులు అవి. వారి కళ్లల్లో కళ్లు పెట్టి చూడటం తప్పు. పలకరించడం నేరం. కాఫీకి పిలవాలంటే న్యూక్లియర్ ఫార్ములాను డిరైవ్ చేసినంత పని. ఇక లవ్ లెటర్... హడల్. అబ్బాయిలు వేరు... అమ్మాయిలు పూర్తిగా వేరు అనుకునే 1990ల రోజులు అవి. పొడుగు జడలు, పవిటా పావడాలు, బిఎస్ఏ ఎస్సల్లార్ ఎక్కి తల వొంచుకుని వెళ్లి చదువుకునే అలాంటి రోజుల్లో ఇవాళ అమెరికాలో జరుగుతున్నట్టుగా, ఇండియాలో ఇంకా మొదలు కాలేదు, ఒక అమ్మాయి నలుగురు అబ్బాయిలు ఒకే గదిలో ఉంటే? వారు రూమ్‌ను షేర్ చేసుకుంటే? స్నేహాన్ని పంచుకుంటే... ఒకరిని ఒకరు గౌరవించుకునేలా ఉంటే? ఇలాంటి కథా? ఇలాంటి కథే అన్నాడు త్రివిక్రమన్. తీశాడు. ప్రేక్షకుల ముందు ఉంచాడు. జనం ఏం చేశారు? వాళ్లల్లో ఒకడు తనను తాను ఎస్.పి.బి అనుకున్నాడు. ఇంకొకడు ఇళయరాజా అనుకున్నాడు. మరొకడు కె.వి.మహదేవనో, పుహళేందో. నలుగురూ మద్రాసు చేరారు మ్యూజిక్ రంగంలో రాణిద్దామని. ఎవరూ ఆదరించలేదు. ఏవీఎం, విజయా గార్డెన్స్ గేట్లు వారి కోసం తెరుచుకోలేదు. పాట అందుకుంటే, కీర్తన ఆలపిస్తే కడుపు నిండదు. తినడానికి డబ్బులు కావాలి. వారి దగ్గర లేవు. ఆత్మాభిమానానికి ఆకలి ప్రథమ శత్రువు. వాళ్లు నలుగురు స్ట్రీట్ సింగర్స్‌గా మారారు. చెట్టు కింద, పేవ్మెంట్ మీద, బీచ్‌లో, బస్టాండ్ సమీపంలో గుడ్డ పరిచి పాట మొదలుపెట్టారు. రోజూ నాలుగు చోట్ల కచ్చేరీలు. దారిన పోయేవాళ్లు ఆగి కాసేపు విని చిల్లర పడేస్తే ఆ పూటకు భోజనం. లేకుంటే లేదు. వాళ్లు బతకడమే కష్టం అనుకుంటే ఇంకో పొట్ట కూడా తోడు చేరింది. అమ్మాయి. ఇప్పుడేమవుతుంది? మద్రాసులో ఏదో అడ్రస్ కోసం వెతుక్కుంటూ ఆ అమ్మాయి ఊరు విడిచి వచ్చింది. ఆ అడ్రస్‌లో ఆమెకు కావలిసినవారు లేరు. వీళ్లు కనిపించారు. ఆ అమ్మాయి వీరి వెంట నడిచింది. వయసులో ఉన్న కుర్రాళ్లందరూ గోడలు దూకేవాళ్లే అయి ఉండరు. కొందరు ఆశ్రయం కోరేవారికి పైకప్పుగా కూడా నిలబడగలుగుతారు. ఆ అమ్మాయి కష్టంలో ఉందని ఆ నలుగురు గ్రహించారు. తమ గదిలోనే చోటు ఇచ్చారు. వీధి ఆశ్చర్యపోయింది. హౌస్ ఓనరమ్మ ముక్కున వేలేసుకుంది. కాని మన ప్రవర్తనే మనకు సర్టిఫికెట్ ఇస్తుంది. త్వరలోనే వారిని ఆ వాడ యాక్సెప్ట్ చేసింది. డాబా మీద గది. రోజూ కనిపించే చందమామ. పిసినారితనం చూపకుండా హాయిగా వీచే చల్లగాలి. కొద్దిగా తిన్నా కడుపు నింపగల అన్నం. చేయగలిగిన కూర. బోలెడన్ని కబుర్లు. శ్వాస అంత సులభంగా తోడుగా ఉండే పాట. పాటలలోన జీవితమే పలికేను అంట.. మాటలలో చందనమే వెదజల్లేనంట... ఒక పల్లవికి నాలుగు చరణాలు తోడయ్యాయి. వాళ్లు జీవితంలో పైకి రావాలంటే వీధుల వెంట పాడటం మాని మంచి అవకాశాల కోసం ప్రయత్నించాలి అని ఆ అమ్మాయి వారికి చెబుతుంది. దాని కోసం జరిగే కాంపిటీషన్లో పాల్గొనడానికి ఏరోజుకారోజు డబ్బు కూడబెట్టేలా చేస్తుంది. ఈ లోపు ఆమె గతం కూడా వారికి చెబుతుంది. ఆమె ప్రేమించినవాడు దేశంలో లేడు. రేపో మాపో వస్తాడు... వస్తే అతడిని పెళ్లి చేసుకోవాలి... అందుకోసమే ఎదురు చూస్తోంది... ఆ విషయం తెలిసి వాళ్లు నలుగురు సంతోషపడతారు. అందరూ ఆ రాబోయేవాడి కోసం ఎదరు చూస్తూ ఉంటారు. కాని వచ్చేవాడు ఫల్గుణుడు కాదు. ఫాల్తు వెధవ. కుసంస్కారి. ఆడపిల్లకు వ్యక్తిత్వం ఉందని లోకం అంగీకరించదు. మగవాళ్లు స్నేహానికి, వ్యక్తిత్వానికి విలువ ఇస్తారన్నా లోకం నమ్మదు. ఒక అమ్మాయి నలుగురు అబ్బాయిలు ఒకే గదిలో సంవత్సరం పాటు ఉంటున్నారంటే వాళ్ల మధ్య ఏమీ ఉండకుండా ఉంటుందా? కథ చూస్తున్న ప్రేక్షకులకు వారి మధ్య ఏమీ లేదని తెలుస్తూ ఉంటుంది. కాని పాత్రధారి అయిన ఆ అమ్మాయి ప్రియుడికి మాత్రం తెలియదు. అతడు తెలివి మీరుతాడు. ఏకంగా ఆ అమ్మాయిని తీసుకెళ్లి కన్యత్వ పరీక్ష చేయిస్తాడు. అమ్మాయి హర్ట్ అవుతుంది. ఎందుకు చేయించావ్ అని అడిగితే పావలా రీఫిల్ కొనేటప్పుడు కూడా నాలుగుసార్లు రాసి చూసి కొంటాము... జీవితాంతం చూసుకోవాల్సిన వ్యక్తి ఎలా ఉందో తెలుసుకోవాల్సిన అవసరం లేదా అంటాడు. సీతకు కూడా అగ్నిపరీక్ష ఉందని అంటాడు. ‘సీత చెడిపోవాలనుకుంటే అయోధ్యలోనే చెడిపోయి ఉండవచ్చు. అశోకవనంలోనే కాదు’ అంటుంది ఆ అమ్మాయి. ‘ఎవరైతే నన్ను నమ్మాలో నువ్వు నన్ను నమ్మలేదు. ఎవరినైతే నేను అనుమానంగా చూడాలో వారు నన్ను నమ్మారు. ఇక నీకూ నాకూ పడదు. గుడ్‌బై’ అని ఆ అమ్మాయి అతణ్ణి వదిలి తను ఇష్టపడే, గౌరవించే నలుగురు స్నేహితుల దగ్గరకు వచ్చేస్తుంది. వాళ్ల ట్రూప్‌లో సభ్యురాలిగా ఉండిపోతుంది. ఆ ఐదుగురు కలిసి ఇప్పుడొక స్నేహగీతం అయ్యారు. దానిని సరిగా వినగలిగే సంస్కారం ఉన్నవాళ్లే వాళ్లకు తోడవుతారు. లేకుంటే? వాళ్ల దారిలో వారలా సాగిపోతూనే ఉంటారు. అమ్మాయి అబ్బాయి అనగానే ప్రేమ, కామం అని స్థిరపడిన లోకానికి వారి మధ్య స్నేహం కూడా సాధ్యమే అని చాలా తర్కబద్ధంగా, సంస్కారవంతంగా నిరూపించిన కథ కొద్దిగా అయినా ప్రేక్షకులను మారుస్తుంది. ఈ సినిమా అవసరం ఆ కాలం కంటే ఈ కాలం ఎక్కువగా ఉంది. ప్రేమ కోసం కత్తిపట్టుకునే వాళ్లంతా ఈ సినిమా డీవీడీ పట్టుకుంటే ఎంత బాగుండు? పుదు వసంతం దర్శకుడు విక్రమన్ తన తొలి సినిమాగా ప్రేక్షకుల మీదకు సంధించిన ఈ కొత్త తరహా కథ ‘పుదు వసంతం’గా 1990లో విడుదలయ్యి తమిళంలో సినిమా కథా ధోరణినే మార్చేసింది. పాడే హీరోలు, స్నేహం చేసే హీరోలు, నలుగురు కుర్రాళ్ల కథలు... ఇలాంటివి భారతీయ భాషలలో పుంఖాను పుంఖాలుగా రావడానికి ఈ సినిమా బీజం వేసింది. తమిళ నటుడు మురళి, ఆనంద్ బాబు, సితార వీళ్లంతా ఈ సినిమాతో చాలా పేరు సంపాదించుకున్నారు. సంగీత దర్శకుడు ఎస్.ఏ.రాజ్ కుమార్ ఈ సినిమా పాటలతో ఇళయరాజా ధాటికి తట్టుకుని నిలబడగలిగాడు. ‘స్త్రీని పరీక్షించే పురుష స్వభావాన్ని’ ప్రశ్నించినందుకే ఈ సినిమా హిట్ అయ్యిందని చెప్పాలి. ప్రఖ్యాత దర్శకుడు కె.ఎస్.రవికుమార్ ఈ సినిమాకు అసిస్టెంట్‌గా పని చేశారు. దీని ప్రభావంతో చిరంజీవి, సాక్షి శివానంద్లతో ‘ఇద్దరు మిత్రులు’ తీశారుకాని సఫలం కాలేదు. అలాగే తరుణ్ హీరోగా ఇదే ధోరణిలో 2002లో ఒక ‘నవ వసంతం’ వచ్చింది. సూపర్‌గుడ్ ఫిలిమ్స్ చౌదరి, విక్రమన్ కాంబినేషన్లో వచ్చిన హిట్ సినిమాలలో ‘శుభాకాంక్షలు’, ‘రాజా’, ‘మా అన్నయ్య’, ‘సూర్యవంశం’ తదితర భారీ హిట్స్ ఉన్నాయి. తమిళంలో విక్రమన్ది ఒక శకం. – కె -
'మన్మోహన్ జీ.. ఇప్పుడైనా నాకు అండగా ఉండండి'
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర టెలికం శాఖ మాజీ మంత్రి ఏ రాజా మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్‌కు ఓ లేఖ రాశారు. ఇప్పటికైనా తనకు అండగా నిలవాలని ఆ లేఖలో కోరారు. 2 జీ స్పెక్ట్రం కేసులో రాజా, కనిమొళితోసహా 14 మంది నిర్దోషులుగా బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఆ కేసులో నుంచి బయటపడిన తర్వాత ఒకప్పుడు మాజీ ప్రధాని మన్మోహన్ మంత్రి మండలిలో ఒకరైనా రాజా తొలిసారి ఆయనకు లేఖ రాశారు. ఆ లేఖలో .. 'మీరు నాకు బహిరంగంగా మద్దతు ఇచ్చేందుకు ఎన్నో కారణాలు అడ్డుకుంటున్నాయని నాకు తెలుసు. ఈ రోజు నేను నిర్దోషిగా నిలబడ్డాను. ఈ విషయం మీకు తెలిసే ఉంటుందని అనుకుంటున్నాను. మీకు ఎప్పటికీ నమ్మదగినవాడినని, విశ్వసనీయుడినని మరోసారి గుర్తుచేసుకుంటున్నాను. 2 జీ కేసులో నిజమేమిటో వెలుగులోకి వచ్చింది. ఇప్పటికైనా గతంలో మాదిరిగా కాకుండా నాకు అండగా ముందుకొస్తారని అనుకుంటున్నాను. 2జీ కేసు యూపీఏ ప్రభుత్వాన్ని మూల్యం చెల్లించుకునేలా చేసింది. 15 నెలల జైలు జీవితంతోపాటు నా ఏడేళ్ల జీవితాన్ని తీసుకెళ్లింది' అంటూ ఆయన లేఖలో పేర్కొన్నారు. -
కోర్టులో రాజా భార్య, కూతురు కంటతడి
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో సంచలనం సృష్టించిన 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణం కేసులో తీర్పు వెలువడగానే ఈ కేసులో ప్రధాన నిందితుడైన టెలికం మాజీ మంత్రి రాజా భార్య, కూతురు కోర్టులో కంటతడి పెట్టారు. ఈ కేసులో రాజా నిర్దోషి అంటూ పాటియాలా కోర్టు న్యాయమూర్తి సింగిల్ లైన్ తీర్పు ఇచ్చిన నేపథ్యంలో వారిద్దరు ఆనంద భాష్పాలు రాల్చారు. అనంతరం రాజాను ఆలింగనం చేసుకొని బావోద్వేగంతో చూస్తూ బయటకు వెళ్లిపోయారు. ఇక డీఎంకే అధినేత కరుణానిధి కూతురు ఈ కేసులో మరో నిందితురాలు కనిమొళి కూడా కంటతడి పెట్టారు. ఈ కేసు దర్యాప్తు సమయంలో తమకు అండగా తమ వెన్నంటి ఉన్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు అని మీడియా ద్వారా చెప్పారు. దాదాపు రూ.లక్షా 70వేల కోట్ల విలువైన ఈ కేసులో రాజా, కనిమొళితోపాటు మొత్తం 17మంది డీఎంకే నేతలు నిందితులుగా ఉన్న విషయం తెలిసిందే. వీరంతా కూడా నిర్దోషులని కోర్టు ప్రకటించడంతో డీఎంకే పార్టీలో సందడి నెలకొంది. ఇక కనిమొళి సోదరుడు స్టాలిన్ స్వీట్లు పంచారు. కోర్టు బయట వారి మద్దతుదారులు చిందులు వేశారు. -
2జీ స్పెక్ట్రమ్ కుంభకోణంలో సంచలన తీర్పు
-
2జీ స్పెక్ట్రమ్ కుంభకోణం : సంచలన తీర్పు
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో సంచలనం రేపిన 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణం కేసులో నిందితులు రాజా, కనిమొళిలు సహా అందరిని నిర్దోషులుగా ప్రకటిస్తూ పటియాలా కోర్టు తీర్పు వెలువరించింది. పటియాలా కోర్టు తీర్పుతో డీఎంకే శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. మరోవైపు నిందితులకు శిక్ష విధించడంలో న్యాయవ్యవస్థ విఫలమైందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం వరుసగా రెండుసార్లు అధికారంలోకి వచ్చింది. ఈ రెండుసార్లూ మిత్రపక్షమైన డీఎంకేకు కేంద్ర మంత్రివర్గంలో ప్రత్యేక ప్రాధాన్యతే లభించింది. తమ పార్టీ నేతల వ్యాపార అవసరాలకు అనుగుణమైన మంత్రిత్వ శాఖలనే కరుణానిధి పట్టుపట్టి కేంద్రం నుంచి సాధించుకున్నారు. ఇందులో భాగంగానే డీఎంకేకి చెందిన రాజా టెలికమ్యూనికేషన్ శాఖ మంత్రిగా పనిచేశారు. ఈ సమయంలో 2జీ స్పెక్ట్రం కేటాయింపుల్లో భారీ అవినీతి జరిగినట్లు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. 2జీ స్పెక్ట్రం అక్రమ కేటాయింపుల వల్ల రూ.1.76 లక్షల కోట్లు నష్టం ఏర్పడినట్లు కేంద్ర ప్రభుత్వానికి కాగ్ ఒక నివేదిక సమర్పించింది. భారీ మొత్తంలో కుంభకోణం కావడంతో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) రెండు కేసులు పెట్టింది. అలాగే ఎన్ఫోర్సుమెంటు డైరక్టరేట్ (ఈడీ) మరో కేసు నమోదు చేసింది. సీబీఐ పెట్టిన రెండు కేసుల్లో రాజా, డీఎంకే అధినేత కరుణానిధి కుమార్తె, రాజ్యసభ సభ్యురాలు కనిమొళి తదితరులు చిక్కుకున్నారు. వీరితోపాటు టెలికమ్యూనికేషన్స్ మాజీ కార్యదర్శి సిద్దార్థ్ బెహురా, రాజా మాజీ ప్రయివేటు కార్యదర్శి ఆర్కే సంతాలియా తదితర 14 మందిపై చార్జిషీటు దాఖలైంది. పదేళ్ల క్రితం నాటి 2జీ స్పెక్ట్రం కుంభకోణం అప్రతిష్టపాలు చేసిన ఫలితంగా యూపీఏ ప్రభుత్వం గడిచిన పార్లమెంటు ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. -
2జీ స్పెక్ట్రం కేసులో నేడే తీర్పు
-
జైలుకా.. ఇంటికా..!
‘2జీ’. ఈ రెండు అక్షరాలు వింటే డీఎంకే శ్రేణుల గుండెల్లో గత ఆరేళ్లుగా రైళ్లు పరుగెడుతున్నాయి. పదేళ్ల క్రితం నాటి రూ.1.76 లక్షల కోట్ల భారీ కుంభకోణం, ఆరేళ్లుగా సాగుతున్న సీబీఐ, ఈడీ కేసుల విచారణే వారి భయానికి కారణం. ఈ కేసులో గురువారం తీర్పు వెలువడనుండగా రాజా, కనిమొళి దోషులుగా జైలుకా, నిర్దోషులుగా ఇంటికా అనేది మరి కొన్ని గంటల్లో తేలిపోతుంది. ఓవైపు 2జీ స్పెక్ట్రం కేసులో తీర్పు.. ఇదే రోజు ఆర్కే నగర్ ఉప ఎన్నిక.. 2జీ కేసులో శిక్ష పడితే ఆర్కే నగర్ పోలింగ్ సరళిని తారుమారు చేస్తుందని.. రాబోయే అసెంబ్లీ ఎన్నికలపై ఈ ప్రభావం పడుతుందని డీఎంకే నాయకుల్లో ఉత్కంఠ నెలకొంది. సాక్షి, చెన్నై: పదేళ్ల కిత్రం జరిగిన 2జీ స్పెక్ట్రం కుంభకోణానికి గురువారం ముగింపు కార్డు పడనుంది. డీఎంకే నాయకులు రాజా, కనిమొళి ఈ కేసులో చిక్కుకుని ఉండడం.. మరోవైపు ఆర్కే నగర్ ఉప ఎన్నిక కూడా ఇదే రోజు కావడంతో ఆ పార్టీ నేతల్లో ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం వరుసగా రెండుసార్లు అధికారంలోకి వచ్చింది. ఈరెండుసార్లూ మిత్రపక్షమైన డీఎంకేకు కేంద్ర మంత్రివర్గంలో ప్రత్యేక ప్రాధాన్యతే లభించింది. తమ పార్టీ నేతల వ్యాపార అవసరాలకు అనుగుణమైన మంత్రిత్వ శాఖలనే కరుణానిధి పట్టుపట్టి కేంద్రం నుంచి సాధించుకున్నారు. ఇందులో భాగంగానే డీఎంకేకి చెందిన రాజా టెలికమ్యూనికేషన్ శాఖ మంత్రిగా పనిచేశారు. ఈ సమయంలో 2జీ స్పెక్ట్రం కేటాయింపుల్లో భారీ అవినీతి జరిగినట్లు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. 2జీ స్పెక్ట్రం అక్రమ కేటాయింపుల వల్ల రూ.1.76 లక్షల కోట్లు నష్టం ఏర్పడినట్లు కేంద్ర ప్రభుత్వానికి కాగ్ ఒక నివేదిక సమర్పించింది. భారీ మొత్తంలో కుంభకోణం కావడంతో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) రెండు కేసులు పెట్టింది. అలాగే ఎన్ఫోర్సుమెంటు డైరక్టరేట్ (ఈడీ) మరో కేసు నమోదు చేసింది. సీబీఐ పెట్టిన రెండు కేసుల్లో రాజా, డీఎంకే అధినేత కరుణానిధి కుమార్తె, రాజ్యసభ సభ్యురాలు కనిమొళి తదితరులు చిక్కుకున్నారు. వీరితోపాటు టెలికమ్యూనికేషన్స్ మాజీ కార్యదర్శి సిద్దార్థ్ బెహురా, రాజా మాజీ ప్రయివేటు కార్యదర్శి ఆర్కే సంతాలియా తదితర 14 మందిపై చార్జిషీటు దాఖలైంది. కరుణ సహధర్మచారిణిని ప్రశ్నించాలనుకున్న సీబీఐ స్వాన్ టెలికం సంస్థకు 2జీ స్పెక్ట్రం కేటాయింపులకు ప్రతిఫలంగా డీఎంకేకి సొంతమైన కలైంజర్ టీవీ, టీపీ గ్రూపు సంస్థలకు రూ.200 కోట్లు లంచం ఇచ్చిన కేసును సైతం అసలు కేసులోనే చేర్చారు. ఈ కేసులను ఢిల్లీలోని సీబీఐ ప్రత్యేకకోర్టు న్యాయమూర్తి ఓపీ సైనీ విచారణ చేపట్టారు. రిలయన్స్ టెలికం, స్వాన్ టెలికం, యూనీటెక్ వైర్లెస్ సంస్థలు సైతం కేసు విచారణలను ఎదుర్కొన్నారు. కలైంజర్ టీవీ డైరక్టర్ వ్యవహరిస్తున్న కరుణ సహధర్మచారిణి దయాళుఅమ్మాళ్ను కూడా సీబీఐ ప్రశ్నించాలని భావించింది. అయితే అనారోగ్య కారణాల వల్ల ఆమెకు జ్ఞాపకశక్తి పూర్తిగా పోయిందని, ఏమీ మాట్లాడుతారో ఆమె తెలియదని కరుణ కుటుంబీకులు నిరాకరించారు. సీబీఐ సిఫార్సు మేరకు కేంద్రం నుంచి వైద్యులు బృందం సైతం చెన్నైకి వచ్చి దయాళుఅమ్మాళ్ను పరీక్షించింది. 2జీ కేసులో మిత్రపక్షం డీఎంకే అని కూడా చూడకుండా కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మెతకవైఖరి అవలంభిస్తోందని ఆగ్రహించిన కరుణానిధి యూపీఏ నుంచి వైదొలిగారు. ఆ తరువాత దయాళూఅమ్మాళ్ను విచారించే అంశం మరుగున పడింది. 2జీ స్పెక్ట్రం హక్కులను 122 మందికి కేటాయింపుల వల్ల ప్రభుత్వానికి రూ.30,984 కోట్లు నష్టం సంభవించినట్లు ప్రచార మాధ్యమాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఆరేళ్లు సాగినకేసు గత ఆరేళ్లుగా సాగిన ఈ కేసు విచారణ ఈ ఏడాది ఏప్రిల్ 26వ తేదీతో ముగియగా, 21వ తేదీన తీర్పు చెప్పబోతున్నట్లు న్యాయమూర్తి ఓపీ సైనీ ఇటీవల ప్రకటించారు. గురువారం చెప్పబోయే తీర్పుతో పదేళ్ల కిత్రం జరిగిన కుంభకోణానికి ముగింపు కార్డు పడనుంది. తీర్పు చెప్పుతున్నందున కోర్టుకు హాజరుకావాల్సిందిగా రాజా, కనిమొళిలకు ఆదేశాలు అందాయి. పదేళ్ల క్రితం నాటి 2 జీ స్పెక్ట్రం కుంభకోణం అప్రతిష్టపాలు చేసిన ఫలితంగా యూపీఏ ప్రభుత్వం గడిచిన పార్లమెంటు ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయింది. పదేళ్ల క్రితం నాటి కుంభకోణం, ఆరేళ్లుగా న్యాయస్థానంలో నలుగుతున్న కేసుపై గురువారం తీర్పు వెలువడనుంది. రాజా, కనిమొళిలను కోర్టు దోషులుగా నిర్ధారించి జైలు బాటపట్టిస్తుందా, నిర్దోషులుగా పేర్కొని ఇంటికి పంపుతుందా అనేది మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. ఒకే రోజు రెండు టెన్షన్లు దురదృష్టమో, కాకతాళీయమో తెలియదు కానీ కరుణానిధి, స్టాలిన్ సహా డీఎంకే శ్రేణులు గురువారం రెండు టెన్షన్లను ఎదుర్కొంటున్నారు. 2 జీ కేసులో శిక్ష పడితే పార్టీకి చెరగని మచ్చగా మారి ఆర్కేనగర్ ఉప ఎన్నికల పోలింగ్ సరళిని తారుమారు చేస్తుందని భయం. అలాగే రాబోయే అసెంబ్లీ ఎన్నికలపైనా ప్రభావం చూపుతుంది. అన్నాడీఎంకేకి రాబోయే ఎన్నికల్లో ఒక ప్రచారాస్త్రంగా మారుతుంది. -
విజేత రాజా రిత్విక్
సాక్షి, హైదరాబాద్: జాతీయ జూనియర్ అండర్–17 చెస్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ క్రీడాకారులకు రెండు పతకాలు లభించాయి. తమిళనాడులోని కోయంబత్తూర్‌లో బుధవారం ముగిసిన ఈ చాంపియన్‌షిప్ ఓపెన్ విభాగంలో రాజా రిత్విక్ చాంపియన్‌గా అవతరించగా... ఎరిగైసి అర్జున్ రన్నరప్‌గా నిలిచాడు. నిర్ణీత 11 రౌండ్ల తర్వాత రిత్విక్ తొమ్మిది పాయింట్లతో అగ్రస్థానాన్ని సంపాదించగా... అర్జున్ 8.5 పాయింట్లతో రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. రిత్విక్ ఎనిమిది గేముల్లో గెలిచి, రెండింటిని ‘డ్రా’ చేసుకొని... మరో గేమ్‌లో ఓడిపోయాడు. అర్జున్ ఏడు గేముల్లో నెగ్గి, మూడింటిని ‘డ్రా’ చేసుకొని, మరో గేమ్‌లో ఓటమి చవిచూశాడు. ఇదే చాంపియన్‌షిప్ బాలికల విభాగంలో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణులు తోషాలి, సీహెచ్ నిహారిక వరుసగా ఆరు, ఏడు స్థానాల్లో నిలిచారు. -
'ఇంత జరుగుతుంటే మోదీ ఏం చేస్తున్నారు?'
న్యూఢిల్లీ: వర్షాకాల పార్లమెంటు సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. ప్రతిపక్ష పార్టీలన్నీ బీజేపీపై ఉమ్మడి దాడి మొదలుపెట్టాయి. గురువారం నాటి రాజ్యసభ సమావేశంలో పలువురు సీనియర్ నేతలు దళితులపై జరుగుతున్న దాడులను, గోసంరక్షణ పేరిట ముస్లింలను కొట్టి చంపుతున్న సంఘటనలపై పలువురు నేతలు కేంద్రప్రభుత్వాన్ని ప్రశ్నించారు. జేడీయూ సీనియర్ నేత శరద్ యాదవ్ మాట్లాడుతూ మీరు ప్రభుత్వంలో ఉన్నారు ప్రజలకు మంచిని చేయండి. గోసంరక్షణ పేరిట చేస్తున్న నాటకాలన్నీ ఆపేయండి. ధనవంతులు మాత్రమే స్వాతంత్ర్యాన్ని అనుభవిస్తున్నారు. పేదలకు, ఆదివాసీలకు అది అందడం లేదు. ఈ దేశంలో ఇక ఏ మాత్రం రైతుల ఆత్మహత్యలు జరగనివ్వకూడదు. పెద్ద నోట్ల రద్దు ప్రభావం వ్యవసాయ రంగంపై బాగా పడింది. చేతుల్లో డబ్బు లేక అప్పులు చేయలేక రైతన్న ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. దళితులపై దాడులు (ఈసమయంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆత్మహత్యకు పాల్పడిన రోహిత్ విషయం గుర్తుచేశారు) జరుగుతుంటే ఏం చేస్తున్నారు. ఓ వ్యక్తిపై మూకపడి కొట్టి చంపడానికి తాలిబన్‌కు పెద్ద తేడా ఏమీ లేదని అన్నారు. అలాగే, కాంగ్రెస్ పార్టీ నేత కపిల్ సిబల్ మాట్లాడుతూ గోసంరక్షణ పేరిట దాడులు జరుగుతుంటే తమకు సంబంధం లేదని బీజేపీ నేతలు అంటున్నారని, అయితే, గో సంరక్షక దళాన్ని విశ్వహిందూపరిషత్ నియమిస్తోందని, వారికి భజరంగ్దల్వాళ్లు శిక్షణ ఇస్తున్నారని దీనికి ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ఇంత జరుగుతున్న ప్రధాని ఏం చేస్తున్నారని, ఎందుకు బీజేపీ నేతలు సీరియస్‌గా స్పందిండచం లేదని మండిపడ్డారు. ఇక సీపీఐ నేత డీ రాజా కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పౌరులకు రక్షణ ఇవ్వడంలో ఉమ్మడిగా విఫలమయ్యామని అన్నారు. 70ఏళ్ల తర్వాత వ్యక్తులపై దాడి చేసి కొట్టడం అనే అంశాన్ని సభలో మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని, దీనిని చూసి సిగ్గుపడాల్సిన అవసరం ఉందన్నారు. దళితులకు, మహిళలకు ఇక మనపై ఎలాంటి సానుభూతి చూపించే ఉద్దేశం లేకుండా పోయిందని, ప్రతినిధులుగా వారికి భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. -
టీడీపీకి ప్రజలే గుణపాఠం చెబుతారు
–ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా తొండంగి (తుని) : ప్రజలకు అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం చేస్తున్న ఆగడాలకు త్వరలో ఓటు ద్వారా ప్రజలే గుణపాఠం చెబుతారని వైఎస్సార్ సీపీ తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా అన్నారు. మంగళవారం తొండంగి మండలం ఏవీ నగరంలో పార్టీ నాయకుడు కొయ్యా శ్రీనుబాబు గృహంలో పార్టీ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాకినీడి గాంధీ, పార్టీ మండల కన్వీనర్ బత్తుల వీరబాబు, మండల యూత్ కన్వీనర్ ఆరుమిల్లి ఏసుబాబు, ఇతర నాయకులతో సమావేశమై పార్టీకి సంబంధించి పలు అంశాలపై చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అధికారాన్ని అడ్డం పెట్టుకుని టీడీపీ నాయకులు చేస్తున్న పింఛన్లు, భూకబ్జాలు, ఇసుక దందా, వంటి ఆగడాలకు త్వరలోనే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు. ప్రభుత్వంపై రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు. నియోజకవర్గంలో అధికార పార్టీ నేతలు అధికారాన్ని అడ్డం పెట్టుకుని చేసిన ప్రతీ పనికి కచ్చితంగా జవాబు చెప్పాల్సి వస్తుందన్నారు. ప్రతిపక్ష నేతగా తాను ఎట్టి పరిస్ధితుల్లోనూ అధికారపార్టీ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడుతానన్నారు. ఇంతటి దుష్టపాలన చేస్తున్న టీడీపీకి వచ్చే ఎన్నికల్లో రెండంకెల సీట్లు దక్కించుకోవడం కూడా కష్టమన్నారు. ఎమ్మెల్యే వెంట పార్టీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోతుకూరి వెంకటేష్, తొండంగి సొసైటీ డైరెక్టర్ అంబుజాలపు పెద సత్యనారాయణ ఉన్నారు. -
ఆ సినిమాతో నా స్థాయి పెరుగుతుంది
తమిళసినిమా: అరువాసండై చిత్రం కోలీవుడ్‌లో నా స్థాయిని పెంచుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తోంది నటి మాళవికనాయర్.పూర్తి డిజిటల్ సినిమాను సిలంది చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయం చేసిన దర్శకుడు ఆదిరాజన్. ఈయన తాజాగా తెరకెక్కిస్తున్న చిత్రం అరువాసండై. ఒక కబడ్డీ క్రీడాకారుడి ప్రేమ ఇతివృత్తాన్ని ఆవిష్కరించే ఈ చిత్రంలో నిజ కబడ్డీ క్రీడాకారుడు రాజా హీరోగా పరిచయం కావడం విశేషం. కాగా నాయకిగా మాళవిక మీనన్ నటిస్తున్నారు. ఈ అమ్మడు ఇంతకు ముందు బ్రహ్మ చిత్రంలో శశికుమార్‌కు చెల్లెలిగానూ, ఇవన్ వేరమాదిరి చిత్రంలో సురభికి చెల్లెలిగానూ నటించింది.విళా చిత్రం ద్వారా నాయకిగా పరిచయమైన మాళవిక మీనన్ ప్రస్తుతం మలయాళంలో ఐదు చిత్రాలు, తెలుగులో రెండు చిత్రాలు అంటూ బిజీగా నటిస్తోంది. వెట్ స్క్రీన్ ప్రొడక్షన్స్ పతాకంపై వి.రాజా నిర్మిస్తున్న ఈ చిత్రంలో నటించే అవకాశం రావడం గురించి చిత్ర నాయకి మాళవిక మీనన్ స్పందిస్తూ, ఈ చిత్ర కథ వినగానే చాలా ఆసక్తిని రేకెత్తించిందని పేర్కొంది. ముఖ్యంగా దర్శకుడు క్లైమాక్స్ గురించి చెప్పినప్పుడు కళ్లంబట నీరు వచ్చిందని చెప్పింది. అరువాసండై చిత్రం కోలీవుడ్‌లో నటిగా తన స్థాయిని పెంచే చిత్రం అవుతుందని అంది. మరో విషయం ఏమిటంటే పెద్ద హీరోల మాదిరి ఈ చిత్రంలో తనకు ఓపెనింగ్ సాంగ్ ఉండడం డబుల్ సంతోషం అని మాళవిక మీనన్ పేర్కొంది. -
బాబు మహా‘డప్పు’ సభ..
టీడీపి మహానాడుపై జక్కంపూడి రాజా విసుర్లు సీతానగరం (రాజానగరం) : విశాఖలో నిర్వహిస్తున్న టీడీపీ మహానాడు.. బాబు మహాడప్పు సభగా మారిందని వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అద్యక్షుడు జక్కంపూడి రాజా ఎద్దేవా చేశారు. స్థానిక ప్రభుత్వ కళాశాలలో ఆదివారం నిర్వహించిన లంకూరు మెగా క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు అధికారం కోసం మామ ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి, మహానాడులో ఆయన ఫోటోకు భజన చేస్తున్నారన్నారు. టీడీపీ వారసత్వాన్ని నందమూరి వంశీయులకు కాకుండా లోకేష్‌కు అప్పగించడానికి ప్రయత్నిస్తున్నట్టు ఆరోపించారు. లోకేష్‌కు దొడ్డిదారిన మంత్రి పదవి ఇచ్చి, పార్టీకి వారసత్వం ఇచ్చేందుకు తంటాలు పడుతున్నారని విమర్శించారు. ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి అధికారం చేపట్టారని, ఆ తర్వాత 1999లో బీజేపీ పొత్తుతో గెలిచిన చంద్రబాబు.. తిరిగి 2014లో బీజేపీ పొత్తు, జనసేన సహకారంతో అధికారంలోకి వచ్చారన్నారు. పొత్తు లేకుండా ఎన్నికలలో చంద్రబాబు గెలిచిన సందర్బం లేదన్నారు. ఆడపడుచులకు పార్టీలో పెద్దపీట వేశామని డప్పు కొట్టుకునే టీడీపీలో మహిళలతో కన్నీరు పెట్టిస్తున్నారన్నారు. టీడీపీ నాయకురాలు, సినీ నటి కవిత మహానాడులో జరిగిన అవమానంకు కంటతడి పెట్టారని గుర్తు చేశారు. వందేళ్ల చరిత్ర కలిగిన ఆంధ్రా యూనివర్సిటీని దెయ్యాల కొంప అని టీడీపీ ఎమ్మెల్సీ అనడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. టీడీపీలోకి చేరేందుకు ఇతర పార్టీల ద్వారా వచ్చిన పదవులకు రాజీనామా చేయాలని ఎన్టీఆర్ తొలి మహానాడులో తీర్మానం చేశారని, చంద్రబాబు ఈ తీర్మానానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు వైఖరిని ప్రజలు గమనిస్తున్నారని, టీడీపీకి డిపాజిట్ గల్లంతు అయ్యే రోజులు దగ్గర పడుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు డాక్టర్ బాబు, వలవల రాజా, చల్లమళ్ళ సుజీరాజు, వలవల వెంకట్రాజు తదితరులు పాల్గొన్నారు. -
నిజమైన ఫ్యాక్షనిస్టులు ఆ సోదరులే
అవినీతిని ప్రోత్సహిస్తున్న మంత్రి యనమల ఏరియా ఆసుపత్రిలో దోపిడీ చేస్తున్న తమ్ముళ్లు ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా తుని : రాష్ట్రంలో ఏకైక ఫ్యాక్షనిస్టు మంత్రి యనమల రామకృష్ణుడే నని తుని శాసనసభ్యుడు దాడిశెట్టి రాజా అన్నారు. శుక్రవారం స్థానిక శాంతినగర్‌లోని పార్టీ కార్యాలయ ఆవరణలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఎంతో అనుభవం ఉన్న మంత్రి యనమల రామకృష్ణుడు ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఫ్యాక్షనిస్టని విమర్శించడం మాని, ముందు తుని నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్లు అరాచకాలను అరికట్టాలని హితువుపలికారు. అధికారం ఉందనే బలుపుతో ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలు, ప్రజలను పోలీసులతో మానసిక క్షోభకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యం కోసం నీతులు చెప్పడం కాదు.. మీ పార్టీ నాయకులను కట్టడి చేసి చూపాలని సవాల్ చేశారు. తుని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో వైద్యం కోసం వచ్చే పేదలను జలగల్లా పీడుస్తున్న విషయం మీకు తెలియదా? అని ప్రశ్నించారు. సర్కారీ ఆసుపత్రికి వచ్చే పేదల నుంచి మీ బినామీలు డబ్బులు వసూలు చేస్తున్న విషయం గురువారం బయటపడిందన్నారు. రాష్ట్రంలోని ఎక్కువ డెలివరీలు చేస్తున్న ఏరియా ఆసుపత్రిలో అవినీతి జలగలు సామాన్యుల రక్తాన్ని పీల్చుతున్నాయన్నారు. సగటున రోజుకు 40 వరకు కాన్పులు జరుగుతుండగా.. ఒకొక్కరి నుంచి రూ.నాలుగు వేలు వసూలు చేస్తున్నారని, అంటే రోజుకు రూ. లక్ష తమ్ముళ్ల జేబులోకి వెళుతోందని ఆరోపించారు. ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రతిపక్షంలో ఉన్న మనం కట్టడి చేసేందుకు ప్రయత్నించాలని కార్యకర్తలకు సూచించారు. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదని, మీకు నేను అండగా ఉంటానని కార్యకర్తలకు రాజా భరోసా కల్పించారు. జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు చేపట్టిన ధర్నాకు వందల సంఖ్యలో తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. -
మొగల్తూరులో జరిగినవి ప్రభుత్వ హత్యలే
-
మొగల్తూరులో జరిగినవి ప్రభుత్వ హత్యలే
అమరావతి: మొదటి రోజు నుంచి ఇవాళ్టి వరకు అసెంబ్లీ సమావేశాలు జరిగిన తీరును ప్రజలు చూస్తూనే ఉన్నారని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభలో ఏ వాయిదా తీర్మానం ఇచ్చినా ప్రభుత్వం పట్టించుకోలేదని ఆమె విమర్శించారు. శుక్రవారం అసెంబ్లీలో మొగల్తూరు ఆక్వా మరణాలలపై చర్చకు వైఎస్ఆర్ సీపీ పట్టుబట్టగా.. స్పీకర్ అంగీకరించలేదు. దీనిపై మీడియా పాయింట్ వద్ద రోజా మాట్లాడుతూ.. ప్రజాసమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, ప్రతిపక్షాన్ని తిట్టడానికే సభా సమాయాన్ని వృధా చేస్తున్నారని విమర్శించారు. ప్రజలకు సంబంధించిన సమస్యలను సభలో ప్రస్తావించకుండా.. ప్రభుత్వం సభలో తప్పించుకునే ప్రయత్నం చేసిందన్నారు. చంద్రబాబు సెటిల్మెంట్ల సీఎంగా మారారని విమర్శించారు. ప్రత్యేక హోదా, అగ్రీగోల్డ్, ఆక్వా మరణాలు తదితర అంశాలపై చర్చకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాయిదా తీర్మానాలు ఇచ్చినా అవకాశం ఇవ్వలేదు అని రోజా ఆవేదన వ్యక్తం చేశారు. మొగల్తూరులో ఆక్వా కాలుష్యం మూలంగా ఐదుగురు చనిపోతే.. ముఖ్యమంత్రి చిన్న విషయంగా పేర్కొనడం బాధాకరమని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా అన్నారు. బాధిత కుటుంబాలను సీఎం పరామర్శించకపోవడం దారుణమన్నారు. ప్రతిపక్షనేత ఘటనా స్థలానికి వెళుతున్నారని తెలిసిన తరువాతే.. ముగ్గురు మంత్రులను అక్కడకు పంపారని విమర్శించారు. కాలుష్యం వెదజల్లుతున్న ఇటువంటి పరిశ్రమలపై సభలో చర్చించాల్సిన అవసరం లేదా అని ఆయన ప్రశ్నించారు. మరో ఎమ్మెల్యే సురేష్ మాట్లాడుతూ.. మొగల్తూరులో జరిగినవి ప్రభుత్వ హత్యలే అని మండిపడ్డారు. కాలుష్యకారక పరిశ్రమలను ఎందుకు రద్దు చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. -
‘ఎత్తిపోతల’ పేరుతో దోపిడీ
- వైఎస్సార్ సీపీ యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా - కోర్టును ఆశ్రయించి, న్యాయం పొందిన రైతులు అభినందనీయులు - ప్రభుత్వం కళ్ళు తెరవాలని హితవు సీతానగరం (రాజానగరం) : ఎత్తిపోతల పథకాల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం దోపిడీకి పాల్పడుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా ఆరోపించారు. సీతానగరం మండలం ఇనుగంటివారిపేటలో శుక్రవారం పర్యటించిన ఆయన విలేకర్లతో మాట్లాడారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం పేరుతో ప్రభుత్వ పెద్దలు అందినకాడికి వేలాది కోట్లు దోచుకున్నారన్నారు. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం పేరుతో తిరిగి దోపిడీకి పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. ఒకవైపు పోలవరం ప్రాజెక్ట్ పూర్తవుతుందంటూనే మరోపక్క ఎత్తిపోతల పథకం ఏర్పాటు చేస్తున్నారని, సీఎం జేబులు నింపుకోవడానికే ఈ పథకాలని ఆరోపించారు. పోలవరం పూర్తయితే ఎత్తిపోతల పథకాలు దేనికని ప్రశ్నించారు. ఎత్తిపోతల పథకం పైపులైన్ మార్గంలో భూములు కోల్పొయే రైతులను అధికారులు, ప్రజాప్రతినిధులు భయాందోళనలకు గురి చేసి సంతకాలు చేయించారని విమర్శించారు. కొంతమంది రైతులు హైకోర్టును ఆశ్రయించి, న్యాయం పొందారన్నారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం భూములు తీసుకోవాలని హైకోర్టు తీర్పు ఇచ్చిందని, తద్వారా రైతులు విజయం సాధించారని కొనియాడారు. ప్రజా శ్రేయస్సు కోసం పాటుపడాల్సిన ప్రభుత్వం ప్రజలకు, రైతులకు వ్యతిరేకంగా పని చేస్తోందని, అధికార పార్టీ నేతలు ప్రజాధనాన్ని దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం రైతుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని 2013 భూసేకరణ చట్టం ప్రకారం రైతులకు పరిహారం అందించాలని, ఆ చట్టం ప్రకారం వర్తించాల్సిన అంశాలను అమలు చేయాలని రాజా కోరారు. కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ పెదపాటి డాక్టర్‌బాబు, రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి, రాష్ట్ర సేవాదళ్ కార్యదర్శి వలవల రాజా, చళ్ళమళ్ళ సుజీరాజు, జిల్లా కార్యదర్శి వలవల వెంకట్రాజు, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు అంబటి రాజు తదతరులు పాల్గొన్నారు. -
అసెంబ్లీ దృష్టికి నర్సరీ మీటర్ల సమస్య
వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా కడియం (రాజమహేంద్రవరం రూరల్) : ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల దృష్టికి తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ద్వారా నర్సరీలకు విద్యుత్ మీటర్ల అంశాన్ని తీసుకువెళ్లనున్నట్టు వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా అన్నారు. కడియం మండలం మాజీ జెడ్పీటీసీ దొంతంశెట్టి వీరభద్రయ్య చేతికి గాయం కావడంతో ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వీరవరంలోని దొంతంశెట్టి స్వగృహంలో బుధవారం ఆయన్ను పరామర్శించిన అనంతరం స్థానిక విలేకరులతో జక్కంపూడి రాజా మాట్లాడారు. ఉద్యోగుల ట్రాన్స్ఫర్లలో సైతం డబ్బులు దండుకుంటున్న రూరల్ ఎమ్మెల్యే గోరంట్లకు నర్సరీ రైతులు ఇబ్బందులు కన్పించడం లేదన్నారు. నర్సరీ రైతుల సమస్యను జగన్ ద్వారా అసెంబ్లీలో ప్రస్తావింపజేస్తామని జక్కంపూడి తెలిపారు. అంతే కాకుండా సమస్య పరిష్కారానికి అవసరమైతే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని వెల్లడించారు. రాజా వెంట మండల యూత్ కన్వీనర్ కొత్తపల్లి మూర్తి ఉన్నారు. -
అధికారుల తీరుపై న్యాయపోరాటం చేస్తా
ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా దివీస్ బాధిత రైతులు చేపట్టిన దీక్షకు మద్దతు తొండంగి : దివీస్ యాజమాన్యానికి వత్తాసు పలుకుతూ అధికారులు, పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై హైకోర్టులో న్యాయపోరాటం చేస్తానని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా దివీస్ వ్యతిరేక పోరాట కమిటీ సభ్యులకు, ప్రజలకు భరోసా ఇచ్చారు. సాగు భూముల్లో దివీస్ యాజమాన్యం చేపట్టిన అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని బాధిత రైతులు ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు స్పందిం చకపోవడం దారుణమన్నారు. కొత్తపాకలు గ్రామంలో దివీస్ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో కొత్తపాకలు, పంపాదిపేట, తాటియాకులపాలెం తదితర గ్రామాల రైతులు చేపట్టిన రిలే నిరాహార దీక్షకు ఎమ్మెల్యే రాజా పార్టీ మండల కన్వీనర్ బత్తుల వీరబాబు, నాయకులు కొయ్య శ్రీనుబాబు, పేకేటి సూరిబాబు, మద్దకూరి చిన్నబ్బులు తదితరులు సోమవారం మద్దతు పలికారు. దీక్షలో కూర్చున రైతులు, మహిళలు, సీపీఎం జిల్లా కార్యదర్శి దువ్వాశేషుబాబ్జితో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ప్రోత్సాహంతోనే దివీస్ యాజమాన్యం బలప్రయోగానికి దిగుతుందన్నారు. బాధిత రైతులకు పూర్తిగా న్యాయం జరిగే వరకూ వెనుకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు. ప్రజల ఆరోగ్యం గుర్తురాలేదా? ప్రజల ఆరోగ్యంతో ఉండాలన్న లక్ష్యంతో యనలమ ఫౌండేషన్‌ను స్థాపించామని చెబుతున్న ఆర్థిక మంత్రి యనమలకు కోన ప్రజలు, రైతుల ఆరోగ్యం గుర్తురాలేదా అని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా ప్రశ్నించారు. దీర్ఘకాలం ఈ ప్రాంత ప్రజల మద్దతుతో రాజకీయంగా ఎదిగిన యనమల ఇప్పుడా ఆ ప్రజల మనుగడ ప్రశ్నార్థకంగా మారేలా వ్యవహరించడం తగదన్నారు. ఎమ్మెల్యే వెంట వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోతుకూరి వెంకటేష్, నాయకులు మద్దుకూరి వెంకటరామయ్య చౌదరి, మేరుగు ఆనందహరి, యూత్ కన్వీనర్ ఆరుమిల్లి ఏసుబాబు, పెరుమాళ్లలోవరాజు, కాలిన అప్పారావు, కొంజెర్ల వీరబ్బాయి, మేడిశెట్టి సుబ్బారావు, వెల్నాటి బుజ్జి, కందాబాబ్జి, చొక్కా కోదండం, చొక్కా రామచంద్రరావు, గాబురాజు, మేడిÔð ట్టి ఈశ్వరరావు, మేడిశెట్టి దారబాబు ఉన్నారు. రైతులను అడ్డుకున్న పోలీసులు దివీస్ చేపట్టిన అక్రమ నిర్మాణాలు జరిగిన ప్రాంతానికి బాధిత రైతులు, ప్రైవేటు సర్వేయర్లు, సీపీఎం జిల్లా కార్యదర్శి దువ్వా శేషుబాబ్జి తదితరులు వెళ్లే ప్రయత్నం చేశారు. వీరిని పోలీసులు అడ్డుకోవడంతో కొంత వాగ్వివాదం జరిగింది. దీంతో శాంతియుతంగా చేపట్టిన దీక్షల నేపథ్యంలో రైతులంతా చట్టపరంగానే పోరాటం చేస్తామంటూ దీక్షాబిరానికి చేరుకున్నారు. బాధిత రైతులు లేకుండా కేవలం గంటలోనే ఆదివారం అధికారులు సర్వే పూర్తి చేసి ఎటువంటి ఆక్రమణలు దివీస్ యాజమాన్యం నిర్మించలేదని చెప్పడం విడ్డూరంగా ఉందని సీపీఎం జిల్లా కార్యదర్శి దువ్వాశేషుబాబ్జి అన్నారు. బాధిత రైతులకు న్యాయం జరిగేంత వరకూ తాము ఉద్యమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఆయన వెంట సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కేఎస్ శ్రీనివాసరావు, జిల్లా నాయకుడు కె.సింహాచలం, కొవిరి అప్పలరాజు, సీఐటీయూ మండల నాయకుడు బద్ది శ్రీను ఉన్నారు. -
జైలులో ప్రేమ కథ.. బెంగుళూరు గజగజ..!
జైలులో బీజం పడిన ఓ ప్రేమ కథ కారణంగా ఇప్పుడు బెంగుళూరు నగరం గజగజలాడుతోంది. దొంగతనాలే జీవిత పరమార్ధంగా ఎంచుకున్న ఇద్దరు ప్రేమించుకుంటే ఏం జరుగుతుంది అనే కోణంలో సినిమా తీస్తే ఈ కథకు వంద మార్కులు పడతాయనడంలో ఆశ్చర్యమే లేదు. 2011లో పరప్పనా అగ్రహారా జైలులో ఈ ప్రేమ కథ మొదలైంది. పట్టపగలు దోపిడీలకు పాల్పడే ముఠా నాయకుడు కోటి రెడ్డిని కలవడానికి అతని సోదరి సుమ(25) తరచూ పరప్పనా అగ్రహారా జైలుకు వెళ్లేది. అదే సమయంలో ఓ రోజు జైలులో ఉన్న పేరుమోసిన రౌడీ షీటర్ రాజా అలియాస్ క్యాట్ రాజా(28)ని చూసింది. పిల్లికళ్లతో ఉండే రాజా.. తనకంటూ ప్రత్యేకతను మెయింటైన్ చేసేవాడు. అతని కళ్లు పిల్లి కళ్లలా ఉండటంతో అందుకు తగిన బ్రాండ్ల టీ షర్ట్ లనే ధరించేవాడు. రాజా తీరు నచ్చిన సుమ అప్పటికప్పుడు జైల్లోనే అతనికి ప్రపోజ్ చేసింది. సుమ ప్రపోజల్ ను ఒప్పుకున్న రాజా జైలు నుంచి విడుదల కాగానే (మూడేళ్ల క్రితం) వివాహం చేసుకున్నాడు. దీంతో కోటి రెడ్డి సామ్రాజ్యానికి రాజా వారసుడయ్యాడు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత రాజా వేగంగా ఎదిగాడు. పోలీసులను ముప్ప తిప్పలను పెడుతున్న రాజా ఈ ఏడాది జులైలో ఓ రాజకీయ నాయకుడి హత్య కేసులో అరెస్టు అయ్యాడు. భర్త అరెస్టుతో గ్యాంగ్ పగ్గాలను చేపట్టిన సుమ.. జైలు నుంచి భర్త చెబుతున్న సూచనలను పాటిస్తూ క్రిమినల్ యాక్టివిటీస్ ను కొనసాగిస్తోంది. రాజా అరెస్టు తర్వాత గ్యాంగ్ లోని ఎనిమిది మంది సభ్యులను పోలీసులు అరెస్టు చేసినా సుమ మాత్రం పోలీసులకు ఇంకా చిక్కలేదు. ప్రతి దోపిడీ తర్వాత ఆ డబ్బు మొత్తాన్ని గ్యాంగ్ సుమకు అప్పజెప్తుందని బెంగళూరు రూరల్ డిప్యూటీ ఎస్పీ ఎస్ కే ఉమేశ్ చెప్పారు. ఆ తర్వాత ఎవరెవరికీ ఎంతెంత ఇవ్వాలనేది ఆమె నిర్ణయిస్తుందని వెల్లడించారు. పేరు మోసిన రౌడీ భార్య కావడంతో ఆమె తరచూ స్ధావరాలను మారుస్తూ ఉంటుందని చెప్పారు. రాజా అరెస్టు తర్వాత ఇప్పటివరకూ అతని గ్యాంగ్ 40కు పైగా దోపిడీలకు పాల్పడిందని తెలిపారు. గ్యాంగ్ సభ్యులు అరెస్టు అవుతున్నా సుమ సాయంతో రాజా కొత్తవారిని సభ్యులుగా నియమించుకుంటూ కార్యకలాపాలు సాగిస్తున్నట్లు చెప్పారు. -
ఆనంద్ రాజా
రాజా చాలా హ్యాపీగా ఉన్నాడు.‘ఆనంద్’ సినిమా హిట్ అయినప్పుడుకంటే ఇంకా హ్యాపీగా ఉన్నాడు.‘ఆనంద్’ సినిమాతో స్టార్ అయ్యాడు. ఇప్పుడు‘దేవుని సేవకుడి’గా ఇంకాగొప్ప ఆనంద్ అయ్యాడు.పవిత్రమైన సేవలో పరిశుద్ధ ఆనందాన్ని పంచుతున్నాడు. ఇప్పుడురాజా స్టార్ సేవకుడు అయ్యాడు. ఆనంద రాజా అయ్యాడు గ్లామర్ ప్రపంచానికి పూర్తిగా దూరమై దైవ సేవకునిగా ఆధ్యాత్మిక బాట పట్టారు. ఈ లైఫ్ ఎలా ఉంది? రాజా: నిజం చెప్పాలంటే సినిమాల కన్నా ఇప్పుడే హ్యాపీగా ఉంది. ఎప్పుడైతే దేవుణ్ణి తెలుసుకుని స్పిరిచ్యువల్ లైఫ్ మొదలుపెట్టానో అప్పుడు ఈ లోకంలో దక్కించుకోలేనివి చాలా దక్కించుకున్నా. మొట్టమొదటిది నా భార్య అమ్రిత. రెండోది నా కూతురు లియోరా. ఎబౌవ్ ఆల్... దేవుణ్ణి తెలుసుకున్నందుకు హ్యాపీగా ఉంది. చెప్పాలంటే ఒకప్పటి కన్నా చాలా చాలా ఆనందంగా ఉన్నాను. సినిమా ఫేమ్‌ని సులువుగా ఎలా వదులుకోగలిగారు? సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పుడు చాలానే ఎంజాయ్ చేశాను. సక్సెస్, డబ్బు, దేశాలు – అన్నీ చూశాను. కానీ, సినిమాలనేవి శాశ్వతం కాదు. సక్సెస్‌లో ఉన్నంతవరకూ జనాలు గుర్తుపెట్టుకుంటారు. ఫేడ్ అవుట్ అయితే మర్చిపోతారు. కానీ, దేవుడికి మన లైమ్లైట్తో సంబంధం లేదు. చీకట్లో ఉన్నా దేవుడి ప్రేమ మారదు. ఆ ప్రేమ ఎలా ఉంటుందో నేను తెలుసుకున్నా. హీరోగా కెరీర్ అంతంత మాత్రంగా సాగుతున్న టైమ్‌లో ఇది ఫ్రస్ట్రేషన్లో తీసుకున్న నిర్ణయం అనుకోవచ్చా? ఇండస్ట్రీలో చాలా సమస్యలు ఎదుర్కొన్నా. కానీ, వీటి నుంచి పారిపోవడానికి లేదు. నిర్మాత, డైరెక్టర్, ఇతర టెక్నీషియన్స్ – అంతా హీరోపై ఆధారపడి ఉంటారు. సక్సెస్ అయితే ఎవరూ ఏమీ అనరు. కానీ ఫ్లాప్ వస్తేనే ఇబ్బంది. ఇతరుల ఇబ్బందులకు నేను కారణం కాకూడదనుకున్నా. అందుకే దైవ సహాయకుడిగా మారా. ఒకప్పుడు నేను క్లబ్బులు, పబ్బుల బయట కనిపించేవాణ్ణి. ఇప్పుడు చర్చి బయట కనిపిస్తున్నా. దేవుడు నాకు చాలా స్వాతంత్య్రం, స్వేచ్ఛ ఇచ్చాడు. చీకటిలో ఉన్న నా లైఫ్‌ని వెలుగులోకి తీసుకొచ్చాడు. చెడు అలవాట్లకు బానిసలవుతున్నవాళ్లకూ, క్రుంగిపోతున్నవారికీ దేవుడు ఒక కౌన్సెలర్. వాళ్లకు వెలుగుగా నిలుస్తాడు. నా ఈ ఆధ్యాత్మిక బాటలో నేను అలాంటివాళ్లకు సర్వీస్ చేయగలుగుతున్నా. ‘రాజా ఏం చేస్తున్నాడు? నిజంగానే ఆధ్యాత్మిక బాటలోనే ఉన్నాడా’ అన్నది కొందరి సందేహం? అలా సందేహించేవాళ్లు ఉన్నారు. ఆ విషయం నాకూ తెలుసు. ముఖ్యంగా ఫిల్మ్ సర్కిల్లోనే ఎక్కువ మంది అలా మాట్లాడుకుంటారు. వీడు నిజంగా మారాడా? లేకపోతే తాత్కాలికమా? అనుకుంటారు. నన్ను దగ్గరగా చూసినవాళ్లకు నిజమేంటో తెలుస్తుంది. నిజమైన సహాయకుడిగా నువ్వు ఉండగలిగితే దేవుడు తప్పక ఆశీర్వదిస్తాడు. మినిస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఎన్నో రకాలుగా దేవుడు నన్ను హెచ్చించాడు. చెప్పాలంటే... సినిమాల్లో చేసినప్పటికన్నా రాజా అనే వ్యక్తి ఈ రూట్‌కి వచ్చాక ఇంకా చాలామందికి తెలిశాడు. ఆ హెచ్చింపు, ఘనత దేవుడిచ్చినదే. ‘సహాయకుడి’గా మారాక ఆరేళ్లలో తెలుసుకున్నదేంటి? ఈ లోకంలో కష్టాల్లో ఉన్నవాళ్లకు ఏ విధంగా సహాయపడగలను అనేది తెలుసుకున్నా. మంచితో పాటు దైవత్వాన్ని పంచి పెట్టడం అనేది గొప్ప విషయమని అర్థమైంది. ప్రజల్ని ఆధ్యాత్మికత వైపు మళ్లించడమనేది మంచి కార్యం. ఆ మధ్య బెంగళూరులో ఉన్న ఒకబ్బాయి ఫోన్ చేసి ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నా అన్నాడు. అతని సమస్య తెలుసుకుని దాదాపు నెల రోజులు కౌన్సెలింగ్ ఇచ్చా. ఇప్పుడతను దేవుడి మార్గంలో నడుస్తూ కౌన్సెలరై, ఎందరికో స్ఫూర్తి అయ్యాడు. చిన్న వయసులోనే ఈ విధంగా మారడం చిన్న విషయం కాదేమో? తొందరగా పిలుపు వచ్చినందుకు సంతోషిస్తున్నా. చిన్న, పెద్ద వయసని ఏం లేదండి. నాకన్నా ఎంతో చిన్నవాళ్లు, టీనేజ్‌లో ఉన్నవాళ్లు దేవుడి సేవలో ఉండటం నేను చూశా. వాళ్లను చూసి, అయ్యో నేను ఆ ఏజ్‌లో ఎందుకు రాలేకపోయానని బాధపడుతుంటా. ఇప్పుడు ప్రశాంతంగా కనిపిస్తున్నారు. ఒకప్పుడు కొంచెం హైపర్గానే ఉండేవారు కదా? అవునండి. ఇంతకు ముందు నాకు చాలా కోపం, అహంకారం, భయంకరమైన మాటలు, పదాలు నా నోటి నుంచి వచ్చేవి. బట్.. దేవుడు అన్నీ తీసేశాడు. ఈ లోకంలో ప్రతి విషయానికీ ఓ జడ్జిమెంట్ ఉంటుంది. ఉదాహరణకు సీట్ బెల్టు పెట్టుకోకుండా, రెడ్ సిగ్నల్ దాటి వెళ్తే ఫైన్ ఉంటుంది కదా? ఇంత చిన్న విషయాలకు మీకు తీర్పు ఉన్నప్పుడు మీ పాపాలకు తీర్పుండదా? కచ్చితంగా ఉంటుం ది. నా పాపాలకు తీర్పు నా బదులుగా నా దేవుడిచ్చాడు. నన్ను క్షమించాడు. ‘నీ పాపములను నేను ఎన్నడూ జ్ఞాపకం చేసుకోను’ అని చెప్పిన ఏకైక వ్యక్తి ఏసుక్రీస్తు. ఆధ్యాత్మిక బాటలో వెళ్లేవాళ్లు ఉద్యోగాలు చేసుకోకూడదా? మీరెందుకు సినిమాలు వదిలేశారు? రెండు పడవలపై కాలు వేసి, నడిపించలేం. నా దృష్టిలో నువ్వు సేవకుడిగా ఉంటే సినిమాలు చేయకూడదు. నువ్వు బిలీవర్ అయితే అది నీ ఛాయిస్. బట్ ఎవరైతే సేవలో ఉంటారో వారు కచ్చితంగా సినిమాలు చేయరు. దైవ సహాయకులు పెళ్లి చేసుకోవచ్చా? ఎందుకు చేసుకోకూడదు. ఫస్ట్ కమాండ్మెంట్ ఏంటి? దేవుడు మనుషుల్ని సృష్టించినప్పుడు ‘ఫలించండి’ అన్నాడు. ‘బి ఫ్రూట్‌ఫుల్ అండ్ మల్టీప్లై’ అన్నాడు. అయితే రోమన్ క్యాథలిక్స్‌లో దేవుడి సేవకు అంకితం చేసుకున్న ఫాదర్స్, బ్రదర్స్, సిస్టర్స్ చేసుకోరు. ఇలాంటి విషయాలేమీ తెలుసుకోకుండా కొంతమంది అదో రకంగా మాట్లాడతారు. అంతెందుకు? క్రిస్టియానిటీని సినిమాల్లో ప్రెజెంట్ చేసే తీరు చాలా ఎగతాళిగానే ఉంటుంది. జనరల్‌గా కమర్షియల్ సినిమాల్లో ఫాదర్ రోల్స్ పెట్టించి వారి చేత కామెడీలు చేయిస్తారు. అడ్వాంటేజ్ తీసుకుంటారు. అది చాలా శోచనీయం. మీది లవ్ మ్యారేజా? ఎరేంజ్డా? ఎరేంజ్డ్ మ్యారేజ్. రెండు ఫ్యామిలీలు మాట్లాడుకున్న తర్వాత మేం మాట్లాడుకున్నాం. ఒకరికొకరు నచ్చాం. 2014లో పెళ్లయింది. ఇండస్ట్రీలోని మీ ఫ్రెండ్స్ టచ్‌లో ఉన్నారా? స్పిరిచ్యువల్ లైఫ్‌లో ఉన్నాను కదా. అందుకని ఎవరూ టచ్‌లో లేరు. కనీసం ఫోన్ కూడా చేయరు. మీరు సమస్యల్ని చూసే విధానం అంతకు ముందుకీ, ఇçప్పటికీ మారిందా? ఇప్పుడు ఏదైనా ప్రార్థన ద్వారానే. ‘ఐ డోంట్ ఫైట్ విత్ మై ప్రాబ్లమ్స్. నా సమస్యలతో నువ్వే ఫైట్ చేయా ల’ని దేవుడితో చెప్తాను. ‘నువ్వు నిలకడగా, నిబ్బరంగా ఉండు. భయపడకు, యుద్ధము నాది’ అని దేవుడు మాట ఇచ్చాడు. కావాలని దేవుడు మనకు సమస్యలను ఇవ్వడు. సమస్యలన్నీ మనం సృష్టించుకున్నవే. వాటిని కూడా తప్పిస్తానని మాట ఇచ్చాడంటే దేవుడు ఎంతో గొప్పవాడు. ‘దేవుడు నన్ను ఎలా క్షమించాడు’ అని కొన్నిసార్లు నేనే ఆశ్చర్యపోతాను. కలలోనో, మెలకువలోనో దేవుడు దర్శనమిచ్చాడా? దేవుడి దర్శనాలు తప్పకుండా అవుతాయండి. నాకు చాలాసార్లు దేవుడి దర్శనం అయ్యింది. ఓ రోజు ప్రార్థనలో ఉండగా పెద్ద వెలుగు కనిపించింది. అందులో దేవుడి ముఖం నాకు పూర్తిగా కనిపించలేదు. కానీ, ఆయన ఆకారం కనిపించింది. బైబిల్లోని కీర్తనలో దుడ్డుకర్ర అని ఒకటి ఉంటుంది. ఆ వెలుగు నుంచి ఓ చేయి ముందుకు వచ్చి నేను ప్రార్థన చేస్తుండగానే దుడ్డుకర్ర నా చేతిలో పెట్టారు. నాకు అది స్పష్టంగా అర్థమవుతోంది. నా జీవితంలో అందమైన క్షణాలవి. ఆ తర్వాత కొన్నాళ్లకు దర్శనాలకు అర్థం చెప్పే ఓ వ్యక్తిని కలిశా. నా దర్శనం గురించి చెప్పి దీనికి అర్థం ఏమిటి? అని అడిగాను. ‘దేవుడు నీకు అధికారం ఇస్తున్నాడు. చాలా అంశాలను అధిగమించడానికి, మిగతా ప్రజలు కూడా అధిగమించడంలో సహాయం చేయడాని నీకు అధికారం ఇచ్చాడు’ అని చెప్పారు. ఇటువంటి దర్శనం రెండుసార్లు కలిగింది. ఓ సహాయకుడిగా ప్రస్తుతం మీరేం చేస్తున్నారు? ఎక్కువగా మీటింగ్స్‌లో ఉంటా. ఇప్పుడు మూమిన్ పేట్ గ్రామాన్ని దత్తత తీసుకున్నా. మూడు ఎకరాల స్థలాన్ని కమ్యూనిటీ సర్వీసెస్ కోసం కొన్నా. అక్కడ అనాథాశ్రమం, మెడికల్ డే కేర్ సెంటర్, ఒక చర్చ్ కట్టడానికి ప్రయత్నిస్తున్నా. రెండు ఆర్వో వాటర్ ప్లాంట్స్, బోర్వెల్, 25 టాయిలెట్స్ నిర్మిస్తానని గ్రామస్థులకు మాటిచ్చా. క్రిస్మస్ సందర్భంగా ఈ పండుగ గురించి చెబుతారా? క్రిస్మస్ అంటే వెలుగుల పండుగ. ఈ లోకానికి దేవుడు వెలుగులా వచ్చాడు. అందుకే ప్రతి ఒక్కరూ లైట్స్ పెట్టుకుంటారు. వెలుగనేది మనసులో ఉండాలి. ఉంటే తప్పకుండా బయట కనిపిస్తుంది. అందుకని మనసులో వెలుగు నింపుకోవాలి. రత్నాలు, వజ్రాల కన్నా గొప్పది! నాకూ, నా భార్యకూ లభించిన గొప్ప వరం – మా పాప. ‘ఒక బిడ్డను తను వెళ్ళవలసిన మార్గంలో నువ్వు నడిపించగలిగితే... ఆ మార్గం నుంచి ఎన్నడూ తప్పిపోడు’ అని బైబిల్లో దేవుడు చెప్పాడు. నాలుగైదేళ్ల తర్వాత మా పాపకు అలాంటి ట్రైనింగ్ ఉంటుంది. బైబిల్లో ఓ స్త్రీకి ఇచ్చిన విలువ పురుషుడికి కూడా లేదండి. కెంపులు, రత్నాలు, వజ్రాల కంటే స్త్రీ ఎంతో గొప్పదని దేవుడు అన్నాడు. అసలు భార్య దొరకడమే మేలు అంటాడు. అమ్రిత వచ్చిన తర్వాతే నా నివాసాన్ని ఓ ఇల్లుగా మార్చింది. నాకు ఒక భర్త టైటిల్ ఇచ్చి, నాకు తండ్రి బిరుదు ఇచ్చి... అంతా మేలే చేసింది. నా జీవితంలో ప్రతిదాన్నీ రెట్టింపు చేసింది. ఐయామ్ వెరీ హ్యాపీ. హీరోగా ఉన్నప్పుడు మీరు చేసిన పనులన్నీ మీ భార్య దగ్గర పెళ్లికి ముందే చెప్పారా? రాజా: పెళ్లయ్యాక ఎవరో నా గురించి చెప్పడం కంటే ముందే నేను చెబితే మంచిది కదా. అందుకే దాచుకోకుండా నా గతమంతా చెప్పాను. అయినా నన్ను వివాహం చేసుకోవడానికి అంగీకరించింది. ఐయామ్ వెరీ గ్రేట్ఫుల్. రాజాలో ఏం నచ్చి, మీరు పెళ్లి చేసుకున్నారు? అమ్రిత: అందరూ అనుకుంటున్నట్లు ఆయన యాక్టర్ అని మాత్రం పెళ్లి చేసుకోలేదు. అసలు రాజా హీరో అనే సంగతి కూడా నాకు తెలీదు (మధ్యలో రాజా అందుకుంటూ.. నేను వెబ్సైట్లో కూడా యాక్టర్ అని పెట్టలేదు). మా ఇంట్లో పెళ్లి ప్రస్తావన వచ్చాక వెళ్లి రాజాను కలిశా. యేసు గురించి రాజా ప్రబోధిస్తున్న ఓ వీడియో చూశా. ‘నాకు సరైన వ్యక్తిని చూపించు దేవుడా! స్పిరిచ్యువల్ మైండ్ ఉన్న మంచి వ్యక్తిని చూపించు’ అని నేను ప్రార్థిస్తున్న సమయంలో ఆ వీడియో చూశా. అప్పుడు నాలోని హోలీ స్పిరిట్ ‘ఇతనే నీకు సరైన వ్యక్తి. ఇతనితో నీ జీవితం సంతృప్తికరంగా ఉంటుంది’ అని చాలా స్పష్టంగా చెప్పింది. మా ఇంటికి (పెళ్లి చూపులకు) వచ్చిన మొదటి వ్యక్తి కూడా రాజానే. అప్పటి నుంచి ఇప్పటివరకూ దేవుడు మాకు ఇచ్చిన ప్రశాంతతలో ఏ విధమైన మార్పూ లేదు. రాజా: నేను నటించిన ఒక్క సినిమా కూడా మా ఆవిడ చూడలేదు. ‘నా భర్త నా వాడు. పరాయి స్త్రీతో నేను చూడలేను. అది తెరమీదైనా...’ అనుకుంటుంది. మరణించేవరకూ ఒకరితో మరొకరం నిజాయితీగా ఉండాలని ప్రమాణం చేసుకున్నాం. నా జీవితాన్ని ముందుకు తీసుకు వెళ్ళడానికి వచ్చిన ఓ గొప్ప సహాయకురాలు ఆమె. దేవుడి దయ వల్ల మా ఇద్దరి మధ్య ఎలాంటి విబేధాలు లేవు. ఎప్పుడూ గొడవలు, కొట్లాటలు వంటివి రాలేదు. ఎప్పటికీ రావు కూడా. అమ్రిత: యస్. ప్రతి ఏడాదికీ మా బంధం మరింత మెరుగవుతోంది. ‘చూడు.. దేవుడు నీకు ఎంత సరైన వ్యక్తిని ఇచ్చాడో’ అని నాకు నేను చెప్పుకుంటూ ఉంటాను. – డి.జి. భవాని -
జగన్ బహిరంగ సభను జయప్రదం చేయాలి
ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా తొండంగి : దివీస్ వ్యతిరేక పోరాటానికి మద్దతుగా వైఎస్సార్ సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి ఈ నెల 22న నిర్వహించనున్న బహిరంగ సభను అన్ని వర్గాల ప్రజలు విజయవంతం చేయాలని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా పిలుపునిచ్చారు. దివీస్ బాధిత గ్రామాల ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు ఈ నెల 22న వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి పర్యటించనున్న నేపథ్యలో బహిరంగ సభ ఏర్పాట్లను రాజా శనివారం పరిశీలించారు. మండలంలోని దానవాయిపేట పంచాయతీ తాటియాకులపాలెం సమీపంలో బీచ్ రోడ్డు వద్ద బహిరంగ సభలో జగన్మోహన్రెడ్డి ప్రసంగించనున్నారు. ఎమ్మెల్యే రాజాతో పాటు పార్టీ సీనియర్ నాయకులు మాకినీడి గాంధీ, మండల కన్వీనర్ బత్తుల వీరబాబు, మేరుగు ఆనందహరి తదితరులు సభా స్థలాన్ని పరిశీలించారు. ఏర్పాట్లపై పార్టీ నాయకులకు పలు సూచనలు చేశారు. జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో అభిమానులు, కార్యకర్తలు, నాయకులు తరలివస్తారని వారు తెలి పారు. వారికి ఎటువంటి అసౌకర్యం కలుగకుండా నియోజకవర్గంలోని తుని, తొండంగి, కోటనందూరు మండలాల పార్టీ నాయకులంతా సమన్వయంతో కృషి చేయాలని ఎమ్మెల్యే సూచించారు. ఆయన వెంట వైఎస్సార్ సీపీ ఎస్సీసెల్ జిల్లా కన్వీనర్ శివకోటి ప్రకాష్, గాబురాజు, నాగం గంగబాబు తదితరులున్నారు. భారీగా తరలిరావాలి కోటనందూరు : గత 80 రోజులుగా 144 సెక్షన్ కారణంగా ఎన్నో ఇబ్బందులు పడుతున్న దివీస్ బాధితులకు మద్దతు తెలిపేందుకు వస్తున్న వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్మోహనరెడ్డి పర్యటనను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా పిలుపునిచ్చారు. మండలంలో కేఓ అగ్రహరం, లక్ష్మిపురం, కొత్తకొట్టాం, పాతకొట్టాం, కేఏ మల్లవరం గ్రామాల్లో శనివారం ఆయన కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించారు. దివీస్ బాధితులకు సంఘీభావంగా ఈ నెల 22న తొండంగి మండలంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ సభకు వేలాదిగా ప్రజలు, పార్టీ శ్రేణులు హాజరై మద్దతు తెలపాలన్నారు. కార్యక్రమంలో పార్టీ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి మోతుకూరి వెంకటేష్, నాయకులు లగుడు శ్రీను, బొంగు ఉమారావు, చింతకాయల చినబాబు, వేముల రాజబాబు, కురసా మల్లయ్య, చింతల వెంకట చెల్లారావు, పైల వీరాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. -
మెట్ట గ్రామాల్లో పర్యటించిన ఎమ్మెల్యే రాజా
17న దివీస్ బాధిత గ్రామాల్లో జగన్ పర్యటనను విజయవంతం చేయండి తొండంగి : కోన ప్రాంతంలో దివీస్ బాధిత గ్రామాలకు చెందిన రైతులు, ప్రజల ఇబ్బందులను తెలుసుకునేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి బాధిత గ్రామాల్లో పర్యటిస్తారని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా అన్నారు.బుధవారం ఆయన పార్టీ మండల కన్వీనర్ బత్తుల వీరబాబు, యూత్ కన్వీనర్ ఆరుమిల్లి ఏసుబాబు ఇతర నాయకులతో కలిసి బెండపూడి, పి.ఇ.చిన్నాయపాలెం, ఎ.కొత్తపల్లి, శృంగవృక్షం గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 17న వై.ఎస్.జగన్ మోన్ రెడ్డితోపాటు పార్టీకి చెందిన ముఖ్య నేతలంతా కలిసి తీరప్రాంత గ్రామాలైన పంపాదిపేట, కొత్తపాకలు, తాటియాకులపాలెం, నర్శిపేట గ్రామాల్లో పర్యటిస్తారన్నారు. దీన్ని విజయవంతం చేసేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు మద్దుకూరి వీరవెంకట సత్యనారాయణ చౌదరి, ముద్దకూరి వెంకటరామయ్య చౌదరి, మద్దుకూరి అప్పారావు చౌదరి, తొండంగి పీఏసీఎస్ ఉపాధ్యక్షుడు వనపర్తి సూర్యనాగేశ్వరరావు, బెండపూడి హైస్కూలు విద్యా కమిటి ఛైర్మన్ బూసాల గణప తి, చిన్నాయపాలెం ఉపసర్పంచి దూళిపూడి ఆం జనేయులు, అడపా సూరచక్రం, కందబాబ్జి, దేవుల పల్లి శ్రీను, వడ్డి వెంకన్న, గర్లంకి బాబ్జి, గునిమానికల ఏసుబాబు, కటకం శివ, తదితరులు ఉన్నారు. -
బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలి
రాజమహేంద్రవరం రూరల్ : అగ్నిప్రమాద బాధితులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా డిమాండ్ చేశారు. సోమవారం కొంతమూరు జంగాలకాలనీలో అగ్ని బాధితులను ఆయన పరామర్శించారు. బా ధితులకు పక్కా ఇళ్లు నిర్మిస్తామని రెం డేళ్లక్రితం ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి ఇచ్చిన హామీ నెరవేర్చి ఉంటే ఈ కష్టం వచ్చేది కాదన్నారు. వైఎస్సార్ సీపీ తరఫున బాధితులను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. అలాగే పార్టీ రూరల్ కో–ఆర్డినేటర్ గిరజాల వీర్రాజు(బాబు) బాధితులను పరామర్శిం చారు. బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చియ్యచౌదరి మాట్లాడుతూ.. బాధితులకు పక్కా ఇళ్లు నిర్మిస్తామని చెప్పారు. ఆయన ఇచ్చిన హామీపై బాధిత మహిళలు నిలదీశారు. ఆగ్రహించిన యువకుల ను పోలీసులు అడ్డుకున్నారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజు, డీసీసీ అధ్యక్షుడు కందుల దుర్గేష్, మాజీ ఎంపీ మిడియం బాబూరావు తదితరులు బాధితులను పరామర్శించారు. సహాయక చర్యలు సంఘటన విషయం తెలిసిన వెంటనే రాజమహేంద్రవరం నుంచి రెండు, అనపర్తి, మండపేట, జగ్గంపేట, కొవ్వూరు నుంచి ఒకొక్క ఫైరింన్ తో పాటు జేగురుపాడు జీవీకే ఫైరింజన్ అక్కడకు చేరుకున్నాయి. జిల్లా ఫైర్ ఆఫీసర్ ఉదయకుమార్ ఆధ్వర్యంలో సిబ్బంది మంటలను అదుపుచేశారు. రాజమహేంద్రవరం రూరల్ తహసీల్దార్ జి.భీమారావు, తూర్పు మండల డీఎస్పీ రమేష్‌బాబు సహాయక చర్యలను పర్యవేక్షించారు. రాజమహేంద్రవరం ఇన్ చార్జి సబ్ కలెక్టర్ పటంశెట్టి రవి సహాయక చర్యలపై ఆరా తీశారు. బాధితులకు కోలమూరులోని మొసానిక్ లాడ్జిలో పునరావాసం కల్పించారు. బాధితులకు జైన్ ట్రస్టు నిర్వాహకుడు విక్రమ్‌జైన్ భోజన ఏర్పాట్లు చేశారు. దుప్పట్లు పంపిణీ చేశారు. -
6వ తేదీలోగా కేసులు, 144 సెక్షన్ తొలగించాలి
బాధితుల తరఫున ఉద్యమిస్తాం బాధిత గ్రామాల్లో పర్యటించిన తుని ఎమ్మెల్యే రాజా తొండంగి : దివీస్ ల్యాబొరేటరీస్ ఏర్పాటును వ్యతిరేకించిన ఆ ప్రాంత మహిళలపై ప్రభుతం పెట్టిన అక్రమ కేసులను, ఇక్కడ విధించిన 144 సెక్షన్ నవంబర్ ఆరో తేదీలోగా ఎత్తివేయాలని తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా డిమాండ్ చేశారు. దీనిపై ఇప్పటికే ఎస్పీతో చర్చించామని, అవసరమైతే కలెక్టర్‌ను కూడా కలుస్తామని ఆయనన్నారు. దివీస్ ప్రతిపాదిత భూముల్లో రెవెన్యూ అధికారులు చెట్లను తొలగించిన నేపధ్యంలో అక్కడి పరిస్థితులు తెలుసుకునేందుకు ఎమ్మెల్యే రాజా శనివారం పంపాదిపేట, కొత్తపాకలు గ్రామాల్లో పర్యటించారు.అక్కడి బాధిత రైతుల సమస్యలు తెలుసుకున్న అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. కాలుష్య పరిశ్రమ ఏర్పాటుకు తీరప్రాంత పేద రైతుల భూములను ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. పోలీసులను చూసి ప్రజలు భయాందోళన చెందడమే గాకుండా శుభకార్యాలు చేసుకోవడానికి కూడా జంకుతున్నారన్నారు. డ్వాక్రా మహిళలు సమావేశాలు కూడా నిర్వహించుకునే పరిస్థితి ఈగ్రామాల్లో ప్రస్తుతం లేదన్నారు. తమ భూముల్లోని పచ్చని చెట్లను అధికారులు అన్యాయంగా తొలగించారని అంతకుముందు రైతులు, మహిళలు ఎమ్మెల్యేకు వివరించారు. -
మాఫియా.. ప్రేమయా...
ఒకప్పుడు హజీ మస్తాన్, కరీంలాలా, దావూద్ ఇబ్రహీం వంటి అండర్‌వరల్డ్ బాద్షాలు అధికారం చెలాయించిన మాఫియా ఇలాఖా డోంగ్రీలో ఇప్పుడు సరికొత్త బాద్షా ‘రాజా’ వచ్చాడు. అతడికి సలాం చేసినోళ్లకు ఏ సమస్యా ఉండదు.. ఎదురు తిరిగినోళ్లను అడ్డు తొలగిస్తాడు. డోంగ్రీలో రాజ్యమేలుతోన్న రాజా మనసులో సామ్రాజ్యాన్ని మాత్రం ఓ అమ్మాయి ఏలుతోంది. మాఫియా ఇలాఖాలో ఈ ప్రేమకథ ఏ కంచికి చేరిందనే కథతో రూపొందుతోన్న సినిమా ‘డోంగ్రీ కా రాజా’. హదీ అలీ అబ్రార్ దర్శకత్వంలో పీఎస్ ఛట్వాల్ నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా గష్మీర్ మహాజని, రిచా సిన్హా హీరో హీరోయిన్లుగా పరిచయం అవుతున్నారు. రోణిత్ రాయ్ కీలక పాత్ర చేస్తున్నారు. ఇటీవల ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. ‘నవంబర్ 11న చిత్రాన్ని విడుదల చేస్తున్నాం’’ అని పీఎస్ ఛట్వాల్ తెలిపారు. -
పేదల భూములు బంధువులకు సంతర్పణ
సీఎంపై ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా విమర్శ దివీస్‌తో ప్రజలకు ఎంతో నష్టం 3 వేల ఉద్యోగాల కోసం 10వేల మంది పొట్ట కొడతారా దానవాయిపేట (తుని రూరల్) : అభివృద్ధి పేరుతో పేదల భూముల్ని లాక్కుని బంధువులకు, అనుంగులకు భూ సంతర్పణ చేయడం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి తగదని తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను అభివృద్ధి నిరోధకులంటూ ప్రజలను సీఎం తప్పుదారి పట్టిస్తున్నారన్నారు. దివీస్ పరిశ్రమను స్థానిక ఎమ్మెల్యేగా తాను అడ్డుకుంటున్నట్టు పలు సందర్భాల్లో సీఎం అనడం విడ్డూరంగా ఉందన్నారు. తొండంగి మండలం దానవాÄæుపేటలో మేరుగుల ఆనంద లహరి ఇంటివద్ద ఆదివారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ప్రమాదకర దివీస్ పరిశ్రమ ఏర్పాటు వల్ల ప్రజలకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. దివీస్‌కు ఎస్ఈజెడ్ భూములను కేటాయించినట్టు చెప్పడం పచ్చి అబద్ధమన్నారు. దివీస్ పరిశ్రమ నుంచి 17 రకాల ప్రమాదకర రసాయనాలు వెలువడడం వల్ల స్థానికులు వ్యాధుల బారిన పడే ప్రమాదముందని చెప్పారు. విశాఖ జిల్లా ప్రజలు తరిమికొట్టడంతో ఈ ప్రాంతంలో తిష్ట వేసేందుకు దివీస్ యాజమాన్యం ప్రయత్నిస్తోందన్నారు. దివీస్ పరిశ్రమలో రోజుకు 13,500 లీటర్ల నీటిని రసాయనాల్లో వినియోగిస్తారని, ఆ నీటిని శుద్ధి చేస్తామనడం హాస్యాస్పదమని రాజా విమర్శించారు. తయారు చేసిన మందులవల్ల వచ్చే మొత్తాన్ని ఖర్చు చేసినా ఆ నీటిని శుద్ధి చేయడానికి చాలదన్నారు. వ్యర్థ రసాయనాలు సముద్రంలో చేరడంవల్ల మత్స్యసంపదకు, మత్స్యకారులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని చెప్పారు. ఈ పరిశ్రమవల్ల 3 వేల మందికి వచ్చే ఉద్యోగాలు కోసం 10 వేల మంది రైతులు, పేదలు, మత్స్యకారుల పొట్ట కొట్టడం ఎంతవరకూ సమంజసమని ప్రశ్నించారు. తొండంగి మండలం జిల్లాలోనే ప్రశాంతంగా ఉండే ప్రాంతమని, ఇక్కడ క్రైం రేటు తక్కువగా ఉంటుందని వివరించారు. దానవాÄæుపేట కలెక్టర్ దత్తత గ్రామమని, 48 రోజులుగా 144 సెక్షన్ అమలులో ఉన్నా ఇక్కడ ఏం జరుగుతోందో ఆయన పరిశీలించకపోవడమేమిటని ప్రశ్నించారు. దివీస్ బాధితులకు అండగా ఉంటామని రాజా మరోమారు స్పష్టం చేశారు. సీపీఎం జిల్లా కార్యదర్శి దువ్వా శేషుబాబ్జీ మాట్లాడుతూ, కోస్టల్ రెగ్యులేటరీ జోన్ చట్ట ప్రకారం సముద్ర తీరం నుంచి అరకిలోమీటరు లోపు ఎటువంటి పరిశ్రమలూ ఏర్పాటు చేయరాదని, అటువంటిది ఇక్కడ దివీస్ పరిశ్రమ పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. చట్టాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదని, అటువంటిది దివీస్ పరిశ్రమకు పోలీసుల రక్షణ కల్పించడమేమిటని నిలదీశారు. హైకోర్టు స్టేటస్కో ఉండగా పోలీసుల సహాయంతో పనులు చేయించడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ప్రజలు తమ అభిప్రాయం తెలియజేసేందుకు సభ పెట్టుకునేందుకు అనుమతి ఇవ్వడం లేదని, దీనిపై కోర్టును ఆశ్రయించామని, అనుమతి లభించిన వెంటనే సభ నిర్వహిస్తామని చెప్పారు. విశాఖలో దివీస్‌ను తరిమేసినట్టే ఇక్కడ నుంచి కూడా తరిమేస్తామని హెచ్చరించారు. విలేకర్ల సమావేశంలో వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ బత్తుల వీరబాబు, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు చొక్కా కాశి తదితరులు పాల్గొన్నారు. -
ప్రమాణాలొద్దు.. విచారణకు సిద్ధం కండి
ఎమ్మెల్యే పెందుర్తికి జక్కంపూడి ప్రతి సవాల్ ఫరిజల్లిపేట (రాజానగరం) : అవినీతి ఆరోపణలను నిరూపించేందుకు గుడిలో ప్రమాణాలు కాదు, ధైర్యం ఉంటే సీబీఐతో విచారణ జరిపించాలని వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా స్థానిక ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్‌కు ప్రతి సవాల్ చేశారు. నియోజకవర్గంలో మట్టి, ఇసుక మాఫియాను ప్రోత్సహిస్తున్నారంటూ వచ్చిన ఆరోపణలపై స్పందించిన ఎమ్మెల్యే పెందుర్తి స్థానిక గాంధీ బొమ్మ సెంటర్లో ఆదివారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. మట్టి, ఇసుక మాఫియాను ఏనాడు ప్రోత్సహించలేదని, కోరుకొండ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో తన తల్లిపై ప్రమాణం చేయడానికి తాను సిద్ధమని, మీరూ సిద్ధమా? అంటూ సవాల్ చేయడంపై రాజా ప్రతిస్పందించారు. ప్రమాణాలతో ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేయవద్దని, చిత్తశుద్ధి ఉంటే సీబీఐ విచారణను కోరాలని డిమాండ్ చేశారు. అందుకు గవర్నర్‌ను, సీఎంను కలిసేందుకు తాను కూడా వస్తానని చెప్పారు. ముగ్గళ్ల, కాటవరం, వంగలపూడి, సింగవరం ర్యాంపుల్లో ఎక్కడెక్కడ, ఎవరి వద్ద ఎంత తీసుకున్నారనేది ప్రజలందరికీ తెలుసని రాజా పేర్కొన్నారు. కాటవరం ర్యాంపులో శనివారం రాత్రి రూ.10 లక్షలు తీసుకుని, కార్యకర్తలకు ఆదివారం భోజనాలు పెట్టిన మాట నిజం కాదా? అని ప్రశ్నించారు. సీతానగరం మండలంలో ఇసుక అక్రమ రవాణా ద్వారా సుమారు రూ.ఆరు కోట్ల కుంభకోణం జరిగిందని ఆరోపించారు. ఇసుక అక్రమ రవాణా కారణంగా జాలిముడి వద్ద దుర్గ అనే పేద మహిళ మరణిస్తే, ఇంతవరకు ఆ కుటుంబానికి ఎటువంటి సాయం అందించలేదని చెప్పారు. చెవిలో పువ్వు, ముక్కున వేలుతో నిరసన సీఎం చంద్రబాబు, నియోజకవర్గంలో ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ ప్రజలను మభ్యపెడుతున్నారంటూ రాజాతో పాటు పార్టీ నేతలు చెవిలో పూలు పెట్టుకుని, ముక్కున వేలు పెట్టి ఫరిజల్లిపేటలో నిరసన ప్రదర్శన చేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే వెంకటేష్ తగిన సమాధానం చెప్పలేక, నల్లబ్యాడ్జీలతో నిరసన అంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. అలాగే ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయి కూడా, న్యాయాన్ని ఎదుర్కొనే ధైర్యం లేక చంద్రబాబు కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకోవడం నీతిమాలిన చర్యగా పేర్కొన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ ఉండమట్ల రాజబాబు, పార్టీ మండల కన్వీనర్ మండారపు వీర్రాజు, రాష్ట్ర, జిల్లా కమిటీల నాయకులు పేపకాయల విష్ణుమూర్తి, అనదాస సాయిరామ్, అడబాల చినబాబు, నాతిపాము సూర్యచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. కేసు నుంచి తప్పించుకునేందుకే స్టే ఈదరాడ (మామిడికుదురు) : ఓటుకు నోటు కేసులో సాక్ష్యాధారాలతో దొరికిపోయిన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా ఆరోపించారు. పార్టీ మండల శాఖ అధ్యక్షుడు బొలిశెట్టి భగవాన్ అధ్యక్షతన ఆదివారం ఇక్కడ జరిగిన సమావేశంలో రాజా మాట్లాడారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి ఓటుకు నోటు కేసులో తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. దోపిడీ, బరితెగింపు ధోరణిలో టీడీపీ ప్రభుత్వ విధానం ఉందని ఎద్దేవా చేశారు. ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వు చూడాలన్నదే దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆలోచన అని, అదే బాటలో వైఎస్ జగన్మోహన్రెడ్డి పయనిస్తున్నారని రాజోలు కో–ఆర్డినేటర్ బొంతు రాజేశ్వరరావు పేర్కొన్నారు. సమావేశంలో పార్టీ నాయకులు నల్లి డేవిడ్, తోరం సూర్యభాస్కర్, జక్కంపూడి వాసు, రావి ఆంజనేయులు, విస్సా నాగేశ్వరరావు, అడబాల బ్రహ్మాజీ తదితరులు పాల్గొన్నారు. -
నన్ను కొనాలనుకున్న వారికి వార్నింగ్ ఇచ్చా!
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన 2జీ స్పెక్ట్రమ్ స్కాంలో జైలు శిక్ష అనుభవించి, ప్రస్తుతం బెయిల్ పై ఉన్న మాజీ టెలికాం శాఖ మంత్రి ఏ.రాజా తన వెర్షన్ ను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సన్నద్ధమయ్యారు. భారతదేశంలో జరిగిన అతి పెద్ద కుంభకోణాల్లో ఒకటైన 2జీ స్కాంలో రాజా(53) నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. కాగా 2జీ కుంభకోణంపై రాజా రాసిన పుస్తకం ఈ ఏడాది నవంబర్ లో విడుదల కానుంది. ప్రస్తుతం పబ్లిషర్ల వద్ద ఉన్న రాజా పుస్తకంలోని కొన్ని అంశాలు ఇలా ఉన్నాయి. తాను టెలికాం శాఖ మంత్రిగా ఉన్నప్పుడు శాఖా పరమైన నిర్ణయాలన్నీ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తీసుకున్నారని ఆరోపించారు. ప్రధాని చేసిన సూచనల ప్రకారం కేబినేట్ లో కీలక మంత్రులైన చిదంబరం, ప్రణబ్ ముఖర్జీలు పర్యవేక్షించేవారని తెలిపారు. ప్రజలకు ఉపయోగపడేలా నిర్ణయాలు తీసుకున్నారని తాను భావించినట్లు చెప్పారు. 2జీ స్పెక్ట్రమ్ కేటాయింపుల్లో 1.76లక్షల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని 2010లో కాగ్ ప్రకటనతో షాక్ గురైనట్లు పేర్కొన్నారు. టెలికాం కంపెనీలకు మార్కెట్ ధరల కంటే అతి తక్కువ ధరలకే స్పెక్ట్రమ్ ను కేటాయించినట్లు కాగ్ పేర్కొన్న విషయం తెలిసిందే. కావలసిన కంపెనీలకు లంచం తీసుకుని మాజీ మంత్రి రాజా స్పెక్ట్రమ్ కేటాయింపులు చేసినట్లు కాగ్ వ్యాఖ్యానించింది. కాగా టెలికాం స్కాం కార్పొరేట్ సంస్థల మధ్య యుద్ధం, ఒత్తిళ్ల కారణంగా జరిగిందని రాజా పేర్కొనడం విశేషం. కుంభకోణంపై కాగ్ ప్రకటన చేసిన మూడు నెలల తర్వాత రాజా జైలు పాలయ్యారు. 2జీ స్పెక్ట్రమ్ కు లైసెన్స్ లు అందజేయడానికి కొద్ది నెలల ముందు తాను ప్రధానిని కలిసినట్లు రాజా ఆ పుస్తకంలో పేర్కొన్నారు. కార్పొరేట్ కంపెనీలు, కొంతమంది మంత్రులు లైసెన్స్ లు ఇవ్వడాన్ని ఆలస్యం చేయాలని ఒత్తిడి చేస్తున్నట్లు ప్రధానికి వివరించినట్లు చెప్పారు. తనను కొనాలని చూస్తున్న వారికి వార్నింగ్ ఇచ్చినట్లు చెప్పానని పేర్కొన్నారు. అనుకున్న సమయానికి బిడ్డింగ్ ప్రాసెస్ జరగాలని ప్రధాని రాజాను కోరినట్లు వివరించారు. కొత్త లైసెన్స్ లు ఇవ్వడానికి ముందు కొన్ని దిగ్గజసంస్థలు లాబీకు తన వద్దకు వచ్చినట్లు చెప్పారు. జీఎస్ఎం ప్లాట్ ఫాం(ఎయిర్ టెల్, వొడాఫోన్)ను వాడుతున్న సంస్థలు సీడీఎమ్ఏ ఫ్లాట్ ఫాం(రిలయన్స్) ఉపయోగిస్తున్న సంస్థలను బిడ్డింగ్ నుంచి తప్పించాలని కోరినట్లు పుస్తకంలో రాశారు. రియల్ ఎస్టేట్ నుంచి టెలికాంలోకి అడుగుపెట్టాలని చూస్తున్న యూనిటెక్ కంపెనీ కూడా లాబీ చేసినట్లు పేర్కొన్నారు. 2జీ స్పెక్ట్రమ్ కు లైసెన్స్ లు ఇవ్వడానికి ముందు యూనిటెక్ ప్రమోటర్ సంజయ్ చంద్రాను, స్వాన్ రియాల్టీ కంపెనీ అధినేత షాహిద్ బల్వాను రాజా కలిసినట్లు సీబీఐ ఆరోపించింది. అక్రమంగా 2జీ హక్కులు దక్కించుకునేందుకు రాజా యూనిటెక్ తో కలిసి కుట్రపన్నారని పేర్కొంది. రాజాతో పాటు ఇద్దరిని సీబీఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కాగా 2007లో సునీల్ మిట్టల్ ను ఆయన నివాసంలోనే తాను కలిసినట్లు రాజా పుస్తకంలో రాయడం విశేషం. ఆ సమావేశాన్ని మాజీ కేంద్రమంత్రి చిదంబరం తనయుడు కార్తి చిదంబరం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. దీనిపై స్పందించిన కార్తి బడా వ్యాపారవేత్త మిట్టల్ కు తన అవసరం ఏముంటుందని ఆశ్చర్యపోయినట్లు చెప్పారు. ఈ విషయంపై మిట్టల్ కంపెనీ ప్రతినిధిని సంప్రదించగా ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న రాజాపై విచారణ కొనసాగుతోంది. -
రాజానాయుడుని స్ఫూర్తిగా తీసుకోవాలి
సంగం : నీలాయపాలెం ప్రజల్లో చైతన్యం తెచ్చి గ్రామాన్ని బహిరంగ మలవిసర్జనరహిత గ్రామంగా తీర్చిదిద్దిన సర్పంచ్ రాజానాయుడుని స్ఫూర్తిగా తీసుకోవాలని ఎంపీడీఓ జయరామయ్య కొనియాడారు. మండలంలోని నీలాయపాలెం పంచాయతీలో సర్పంచ్ చొరవతో నూరుశాతం మరుగుదొడ్లు నిర్మాణం పూర్తికావడంతో బుధవారం అభినందనసభ ఏర్పాటుచేశారు. తొలుత గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎంపీపీ దగ్గుమాటి కామాక్షమ్మ మాట్లాడుతూ నీలాయపాలెం బహిరంగ మలవిసర్జనరహిత గ్రామంగా మండలంలో ప్రధమ స్థానంలో నిలిచిందన్నారు. తహసీల్దార్ రామాంజనేయులు, జెడ్పీటీసీ సభ్యుడు దేవసహాయం, సంగం వైధ్యాధికారిని డా.రాగిణి ప్రసంగించారు.అనంతరం సర్పంచ్‌ను సన్మానించారు. మొక్కలు నాటారు. ఆర్డబ్ల్యూఎస్ ఏఈ గౌస్‌అహ్మద్, పీఆర్ ఏఈఈ మల్లికార్జున, హౌసింగ్ ఏఈ రాజారావు, ఏపీఎం రవిశంకర్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్ ఏటూరు సుధాకర్‌రెడ్డి, సీహెచ్ కష్ణారెడ్డి, వెంగారెడ్డిపాళెం వైఎస్సార్సీపీ నేత కనుమూరి సుధాకర్‌రెడ్డి పాల్గొన్నారు. -
దయ చూపని ఢిల్లీ ప్రభుత్వం!
న్యూఢిల్లీః సహాయం అడిగితే చీదరింపులు ఎదురయ్యాయి. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ నెలల తరబడి 'వీల్స్' అరిగేలా తిరిగినా ఉపయోగం లేకపోయింది. చివరికి సీఎంనే కలసి తన గోడు వెళ్ళబోసుకుందామనుకున్న వికలాంగ వ్యక్తికి... అక్కడా కనికరం కలుగలేదు. తన వీల్ ఛైర్ విరిగిపోయిందని, కొత్త ఛైర్ కొనిమ్మని ఢిల్లీ పెద్దల కాళ్ళా వేళ్ళా పడినా పట్టించుకున్నవారే లేకపోయారు. దేశ రాజధాని నగరంలో ఓ వికలాంగ వ్యక్తికి ఎదురైన ఛీత్కారాలు సాధారణ ప్రజలకు, చూపరులకు ఆందోళన కలిగించాయి. కొత్త వీల్ ఛైర్ కోసం ఆరు నెలలపాటు ఎక్కిన గుమ్మం ఎక్కకుండా తిరిగినా అధికారుల మనసు కరుగలేదు. రెండుకాళ్ళూ లేక వీల్ ఛైరే ఆధారంగా బతుకుతున్న రాజా.. తకు కొత్త వీల్ ఛైర్ కావాలంటూ సంబంధిత ప్రభుత్వ కార్యాలయాల్లో ఎన్నో అర్జీలు పెట్టుకున్నాడు. అయతే ప్రభుత్వంనుంచి ఎటువంటి సమాధానం దొరకలేదు. చివరికి పెద్ద బాస్ (సీఎం కేజ్రీవాల్) నే కలసి తన బాధను వివరిద్దామనుకున్నాడు. అక్కడకూడా తీవ్ర అవమానాలను ఎదుర్కొన్న రాజా.. చివరికి చేసేది లేక వెనుదిరిగాడు. అనంతరం రాజా కష్టాలను విన్న ఓ మనసున్న మారాజు అతడికి వీల్ ఛైర్ ను బహూకరించాడు. ఢిల్లీ పౌరుడు, ఫిల్మ్ మేకర్.. గౌరవ్ ఆగ్రే బహూకరించిన ఛైర్ తో అతని కళ్ళలో చూసిన ఆనందాన్ని వర్ణిస్తూ అతడి ఫొటోలను గౌరవ్ ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. -
'అమ్మ' కేబినెట్లో ఇద్దరు తెలుగోళ్లు
చెన్నై: అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మంత్రివర్గంలో మరో నలుగురికి చోటు దక్కింది. 'అమ్మ' మంత్రివర్గంలో ఇద్దరు తెలుగువాళ్లకు స్థానం దక్కింది. తెలుగువాడైన హోసూయ ఎమ్మెల్యే బాలకృష్ణారెడ్డికి మంత్రి పదవి, రాజాకు ఐటీ శాఖను జయలలిత కేటాయించింది. కొత్తగా 13 మందిని తన మంత్రివర్గంలోకి తీసుకున్న జయలలిత.. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు తమిళనాడు సీఎంగా ఆరోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఆమెతో పాటు 28 మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారానికి కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు, డీఎంకే నేత స్టాలిన్ హాజరయ్యారు. గవర్నర్ రోశయ్య మద్రాసు వర్సిటీ అన్నా శత జయంతి స్మారక ఆడిటోరియంలో జయలలితతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఆమె తమిళంలో ప్రమాణం చేశారు. -
మనసున్న మా‘రాజా’
పంజగుట్ట: ‘మానవ సేవే మాధవ సేవ’గా భావించిన అతను రోడ్డుపై పడి ఉన్న అభాగ్యులను అక్కున చేర్చుకుని సేవచేస్తున్నాడు. వైద్య సేవలు అందించేందుకు డాక్టర్లు ముందుకు రాకపోయినా తనే స్వయంగా వారికి అవసరమైన అన్ని సేవలు చేస్తున్నాడు. అతనే బెంగళూరుకు చెందిన ఆటో రాజా. 18 ఏళ్ల క్రితం బెంగళూరులో ‘హోం ఆఫ్ హోప్’ పేరుతో ఆశ్రమం ఏర్పాటు చేసి వేలాదిమందికి చేయూతనందించిన రాజా తెలుగు రాష్ట్రాల్లోనూ తన సేవలు విస్తరింపజేస్తానని తెలిపారు. సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. 1998లో మథర్ థెరీస్సాను ఆదర్శంగా తీసుకుని సహాయ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్లు తెలిపాడు. ఇందుకుగాను ఒక ఇల్లు అద్దెకు తీసుకుని 18 మంది అభాగ్యులకు ఆశ్రయం కల్పించాడు. తరువాత దాతల సహకారంతో సేవా కార్యక్రమాలను మరింత విస్తతృతం చేశానన్నాడు. సేవచేయడంలో ఉన్న ఆనందం మరెందులోనూ లేదని పేర్కొంటున్న రాజా తన ఆశ్రమం స్త్రీ, పురుషులు, పిల్లలకు వేర్వేరుగా వసతి కల్పిస్తున్నట్లు తెలిపాడు. తన భార్య దేవకృప, ముగ్గురు పిల్లలు ఇందులో భాగస్వాములవుతున్నట్లు తెలిపాడు. ‘హోమ్ ఆఫ్ హోప్’లో ప్రస్తుతం 540 మంది ఆశ్రమం పొందుతున్నారని, వారికి మూడు పూటలా భోజనం, వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపాడు. రాజా సేవలను గుర్తించి ఎన్నో అవార్డులు వరించాయి. సిఎన్ఎన్, ఐబీఎన్ మీడియా ఆధ్వర్యంలో ముఖేష్ అంబానీ చేతులమీదుగా ‘రియల్ హీరో 2010’ అవార్డు అందుకున్నారు. ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండుల్కర్ తనను స్వయంగా అభినందించారన్నారు. స్టార్‌ప్లస్‌లో ఆజ్‌కీ రాత్ జిందగీ కార్యక్రమంలో ప్రముఖ నటుడు అమితాబచ్చన్ అభినందనలు అందుకున్నాడు. కర్ణాటక ప్రభుత్వం ‘బెంగళూరు ఎంజిల్’ అవార్డు, కర్ణాటక రాజ్యోత్సవ సమాజ సేవ 2013 అవార్డు అందించారు. హైదరాబాద్‌లోనూ తన సేవా కార్యక్రమాలు ప్రారంభించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. -
ఫిరాయింపులను ప్రోత్సహించడం అనైతికం
► సైద్ధాంతిక కారణాలైతే పార్టీకి, పదవులకు రాజీనామా చేయాలి ► అసెంబ్లీ స్థానాల పెంపునకు పార్లమెంట్ ఆమోదం ఉండాల్సిందే ► ‘సాక్షి’తో సీపీఐ జాతీయ కార్యదర్శి డి.రాజా సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల్లో అధికారపార్టీలు ప్రతిపక్ష ఎమ్మెల్యేల ఫిరాయింపులను ప్రోత్సహించడం అనైతికమని సీపీఐ జాతీయ కార్యదర్శి డి.రాజా అన్నారు. ఢిల్లీలో సోమవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. ఒక పార్టీ ఎన్నికల గుర్తుపై గెలిచిన ప్రజాప్రతినిధులు వేరే పార్టీలోకి ఫిరాయించడాన్ని ప్రస్తావిస్తూ.. సైద్ధాంతిక అంశాలపై పార్టీ మారితే అర్థం చేసుకోవచ్చని, అయితే ఫిరాయింపుదారులు తప్పనిసరిగా పార్టీకి, పార్టీ ద్వారా సంక్రమించిన పదవులకు రాజీనామా చేయాల్సిందేనని పేర్కొన్నారు.అలా చేయలేదంటే స్వార్థ ప్రయోజనాల కోసమే వారు పార్టీ ఫిరాయించినట్లు స్పష్టమవుతుందన్నారు. ఏపీ, తెలంగాణలో మాత్రమే కాదని.. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలు ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఫిరాయింపుల వ్యతిరేక చట్టంలో లొసుగులను వాడుకొని రాజకీయ నాయకులు తమ స్వార్థం కోసం ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని చెప్పారు. ఫిరాయింపుల వ్యతిరేక చట్టాన్ని మరింత పటిష్టం చేయాలని అవసరముందన్నారు. దీనిపై పార్లమెంట్లో చర్చ జరగాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 26లో చిన్న సవరణ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాల పెంపుపై స్పష్టత లేదన్నారు. పార్లమెంట్ ఆమోదంతోనే అసెంబ్లీ స్థానాల పెంపు సాధ్యమన్నారు. అందుకు అవసరమైన బిల్లును పార్లమెం ట్లో ప్రవేశపెట్టిన తర్వాతే ఈ విషయంపై స్పష్టత వస్తుందని రాజా చెప్పారు. -
నటుడి ఆత్మహత్య: టీవీ నటి అరెస్ట్
ఒడిషాలోని పాపులర్ టీవీ నటి ప్రలిప్త ప్రియదర్శిని అలియాస్ జెస్సీని పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. సహనటుడి ఆత్మహత్యకు ప్రేరేపించిందన్న ఆరోపణలపై ఆమెను అదుపులోకి తీసుకున్నారు. మరో టీవీ నటుడు రంజిత్ పట్నాయక్ అలియాస్ రాజా అనుమానాస్పద పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకోవడం సంచలనం రేపింది. ఫిబ్రవరి 6న ఏర్పాటుచేసిన ఒక సంగీత కార్యక్రమంలో టీవీ నటులు జెస్పీ, చందన్ పాల్గొనాల్సి ఉంది. రాజాను పిలవకపోయినా అతడు ఆ కార్యక్రమానికి హాజరయ్యాడు. అయితే అసలు వెళ్లాల్సిన చందన్ మాత్రం గైర్హాజరయ్యాడు. దీంతో నిర్వాహకుల అభ్యర్థన మేరకు రాజా షో లో పాల్గొన్నాడు. షో ముగిసిన తరువాత రాజాకు రూ. 2వేలు, జెస్సీకి రూ. 27,000 చెల్లించడంతో గొడవ మొదలైంది. ఇద్దరు కారులో వెడుతుండగా వివాదం మరింత ముదిరింది. రాజాను అవహేళన చేసిన జెస్సీ.. అతడిపై అనుచిత వ్యాఖ్యలు చేసింది. దీన్ని అవమానంగా భావించిన అతను డ్రైవర్‌ను కారు ఆపమని చెప్పి వంతెన పిట్టగోడ మీద నుంచి దూకేశాడు. దీనిపై రాజా బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇద్దరి మధ్య నెలకొన్న ఆర్థిక వివాదం, ప్రొఫెషనల్ విభేదాలే ఘర్షణకు కారణమని ఎస్పీ నితిశేఖర్ మీడియాకు తెలిపారు. జెస్సీతో పాటుఈవెంట్ కో ఆర్డినేటర్ ప్రాలే జెనా, డ్రైవర్ ధానేశ్వర్లకు పోలీగ్రాఫ్ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఆరుగురు సభ్యులతో కూడిన కమిటీని విచారణకు నియమించామని ఎస్పీ తెలిపారు. -
ఈ మద్య తెగ కనిపిస్తున్నా!!
-
'హోదా అంశాన్ని పార్లమెంట్లో లేవనెత్తుతాం'
న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన వల్ల తలెత్తిన సమస్యలు పరిష్కరించాలంటూ వామపక్ష నేతలు డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అంశాన్ని పార్లమెంట్లో లేవనెత్తుతామని సీపీఐ నేత రాజా పేర్కొన్నారు. న్యూఢిల్లీలో ఆదివారం మీడియాతో ఆయన మాట్లాడారు. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలను కేంద్రం నిలబెట్టుకోవాలని ఈ సందర్భంగా సీపీఐ నేత రాజా డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన సమయంలో ఇచ్చిన వాగ్దానాలు ఏమయ్యాయని, వాటిని ఎప్పుడు నెరవేరుస్తారని కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏపీ ప్రజలు నిలదీయాలని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పిలుపునిచ్చారు. విభజన సమయంలో తీసుకున్న తొందరపాటు నిర్ణయాల వల్లే ఈ గందరగోళం తలెత్తిందని ఏచూరి అభిప్రాయపడ్డారు. -
కాబోయే భర్త హత్యపై డెమో చూపించింది!
చెన్నై: ప్రియుడితో కలిసి కాబోయే భర్తను హత్య చేసిన తీరును యువతి డెమో చూపించడంతో పోలీసులు షాక్‌కు గురయ్యారు. తిరువళ్లూరు జిల్లా చిత్తుకాడు గ్రామంలోని ఇటుక బట్టీ వద్ద అనుమానాస్పద స్థితిలో ప్లాస్టిక్ డబ్బాలో తలవేరు చేసిన మృతదేహన్నీ పోలీసులు గుర్తించిన విషయం తెలిసిందే. ఈ కేసును ఛేదించడానికి ఎస్పీ శ్యామ్సన్ మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి విచారణ చేపట్టారు. విచారణలో మృతి చెందిన వ్యక్తి చెన్నై పెరుంగుడి ప్రాంతానికి చెందిన హరికృష్ణన్ కుమారుడు రాజా(34)గా గుర్తించారు. ఇతను చెన్నైలోని యూటీఐ కంపెనీలో పనిచేస్తున్నాడు. అతనికి కొరట్టూరు ప్రాంతానికి చెందిన సత్యతో ఆగస్టులో నిశ్చితార్థం జరిగింది. నవంబర్ 15న వివాహం జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో రాజా నాలుగో తేదీన ప్లాస్టిక్ డబ్బాలో శవమై కనిపించడం స్థానికంగా కలకలం సృష్టించింది. రాజా కాల్ డేటా ఆధారంగా ఆవడికి చెందిన సగాయం, సత్య తదితరులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. విచారణలో సత్య, సగాయంకు మధ్య పదేళ్లుగా వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలిసింది. సత్య, సగాయం సంబంధానికి అడ్డువస్తాడనే కారణంతోనే రాజాను హత్య చేసిసినట్టు సగాయం వాగ్మూలం ఇచ్చినట్టు పోలీసులు వివరించారు. ఈ విషయాన్ని సత్య పోలీసులకు డెమో ఇవ్వడం చర్చనీయాంశమైంది. రాజాపై దాడి చేసిన వ్యక్తుల్లో ఆవడికి చెందిన మదన్(29)ను ఆదివారం రాత్రి అరెస్టు చేశారు. మరో ముగ్గురి కోసం గాలిస్తున్నారు. -
నవంబర్ 9న పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు
ఈరోజు మీతోపాటు పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు: రాజా (నటుడు), అను ప్రభాకర్ (కన్నడ నటి) ఈరోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 10. ఇది సూర్యసంఖ్య. మీరు పుట్టిన తేదీ 9. ఇది కుజసంఖ్య. దీనివల్ల మీ మీద ఉన్న చెడు ప్రభావం అంటే చెడుస్నేహాల వ ంటి దుర్గుణాల నుండి విముక్తి కలిగి కొత్త జీవితం ప్రారంభిస్తారు. నవగ్రహాలలో సూర్యుడు రాజు, కుజుడు సేనాపతి అవడం వల్ల ఈ సంవత్సరం అవివాహితులకు వివాహం అవడం, సంతానప్రాప్తి కలగడం, సొంతు ఇంటి కల నెరవేరడం వంటి మంచి మార్పులు కలుగుతాయి. వచ్చే పుట్టిన రోజు వరకు మీ పుట్టిన రోజు, వ్యక్తిగత సంవత్సర సంఖ్య పరస్పర మిత్ర సంఖ్యలు అయినందువల్ల ఈ సంవత్సరం మీరు తలచిన పనులు ఆటంకాలు లేకుండా విజయవంతమవుతాయి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగాలు, మైన్స్, మెకానికల్, మెటీరియల్ రంగాలలో ఉన్న వారికి ఊహించని లాభాలు వస్తాయి. కుజప్రభావం వల్ల పై అధికారులతో, యజమానులతో మొండిగా వాదించి గొడవలు పడి, ఉన్న ఉద్యోగాన్ని ఊడగొట్టుకునే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. అలాగే వాహనాలను నడపడంలోనూ, మారణాయుధాల వాడకంలోనూ అప్రమత్తంగా ఉండటం అవసరం. లక్కీ నంబర్స్: 1,3,6,9; లక్కీ కలర్స్: రోజ్, ఆరంజ్, రెడ్, పర్పుల్; లక్కీ డేస్: ఆది, సోమ, మంగళ, శుక్రవారాలు. సూచనలు: సుబ్రహ్మణ్యేశ్వరునికి అభిషేకం, సూర్యారాధన, తండ్రిని కాని, తండ్రితో సమానులైన వారిని కానీ ఆదరించడం, పేదరోగులకు ఆహార పంపిణీ చేయడం మంచిది. - డాక్టర్ మహమ్మద్ దావూద్, ఆస్ట్రో న్యూమరో గ్రాఫో థెరపిస్ట్ -
'మోదీవి సిగ్గుమాలిన ప్రకటనలు'
న్యూఢిల్లీ: విదేశాలకు వెళ్లినప్పుడు ప్రధాని నరంద్రమోదీ తాను ప్రధాని అనే విషయాన్ని మర్చిపోతున్నారని సీపీఐ ఆరోపించింది. పార్లమెంటులో ఎవరి అభిప్రాయం తెలుసుకోకుండానే ఆయన విదేశాల్లో ప్రభుత్వ విధానాలు ప్రకటిస్తున్నారని పేర్కొంది. ప్రస్తుతం నరేంద్రమోదీ న్యూయార్క్‌లో ఉన్న విషయం వెలిసిందే. ఈ నేపథ్యంలో సీపీఐ జాతీయ కార్యదర్శి డీ రాజా స్పందిస్తూ ప్రధాని చెప్పే మాటలన్నీ కూడా ఖండించదగినవని, సిగ్గుమాలిన ప్రకటనలనీ తీవ్రంగా వ్యాఖ్యానించారు. విదేశాలకు వెళ్లిన ప్రతిసారి ఆయన ఇంకా ప్రచారంలోనే మునిగిపోయి ఉన్నట్లుగా కనిపిస్తుందన్నారు. మోదీ లౌకిక వ్యవస్థపై దాడి కొనసాగిస్తున్నట్లుగా ఉందని అందుకు జపాన్ వెళ్లినప్పుడు భగవద్గీత అందించడం, ఐర్లాండ్ పర్యటనలో సంస్కృత శ్లోకాలు వినడంలాంటివన్నీ నిదర్శనాలని చెప్పారు. ఇది భారతీయ గౌరవాన్ని విదేశాల్లో అమ్ముకోవడంలాంటి చర్యలు తప్ప మరొకటి కావని ఆరోపించారు. -
కాపురానికి పంపలేదని కత్తితో దాడి
గుంతకల్ (అనంతపురం): భార్యను కాపురానికి పంపలేదన్న కోపంతో ఓ వ్యక్తి తన ముగ్గురు బావమరదులపై కత్తితో విచక్షణా రహితంగా దాడి చేశాడు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన అనంతపురం జిల్లా గుంతకల్‌లోని హనుమేష్‌నగర్‌లో మంగళవారం సాయంత్రం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆటో డ్రైవర్ అయిన ధనుంజయ్ స్థానికంగా పోర్టర్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. ఆయన భార్య నందిని ఆరు నెలల గర్భిణి. ఆమె మూడు రోజుల క్రితం పట్టణంలోని హనుమేష్‌నగర్‌లో తన పుట్టింటికి వెళ్లింది. భార్యను వెంటనే కాపురానికి పంపించాలని ధనుంజయ్ ఫోన్ ద్వారా ఆమె కుటుంబ సభ్యులను కోరాడు. ఆమెకు ఆరోగ్యం బాగాలేదని, కుదుటపడిన తర్వాత పంపిస్తామని చెప్పారు. ఈ క్రమంలో బావకు సర్ది చెబుదామని నందిని సోదరులు గణేశ్, అనిల్, రాజా మంగళవారం సాయంత్రం ధనుంజయ్ ఇంటికి వెళ్లారు. కోపంతో ధనుంజయ్ కత్తితో వారిపై దాడి చేశాడు. గాయపడిన ముగ్గురినీ కర్నూలు ప్రభుత్వ ఆస్ప్రత్రికి తరలించారు. వీరిలో గణేశ్, రాజా పరిస్థితి విషమంగా ఉంది. -
జగన్నాయకుడొస్త్తున్నాడు!
మూడు తరాలకు చెందిన కుటుంబ కథతో పీసీ రెడ్డి దర్శకత్వంలో వీఏ పద్మనాభరెడ్డి నిర్మించిన చిత్రం ‘జగన్నాయకుడు’. రాజా, పరిణిక, మమతా రావత్ నాయకా నాయికలుగా రూపొందిన ఈ చిత్రంలో శిరీష. ఆమని, సుమన్, భానుచందర్, చంద్రమోహన్ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. ఈ నెల 19న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో చిత్రనిర్మాత మాట్లాడుతూ - ‘‘సెన్సార్ పరంగా ఎదుర్కొన్న సమస్యల కారణంగా ఈ చిత్రం విడుదలలో జాప్యం జరిగింది. ఎట్టకేలకు అన్ని సమస్యలఠ్టి అధిగమించాం. ఇందులో తాత, గ్రామ పెద్దగా ప్రసాద్‌బాబు, ముఖ్యమంత్రిగా భానుచందర్, ఆయన తనయుడిగా రాజా నటించారు. కథ మీద నమ్మకంతో ఈ సినిమా తీశాం. ఎలాంటి అసభ్యతజ్టు తావు లేని ఈ చిత్రాన్ని కుటుంబ సమేతంగా చూడొచ్చు’’ అని చెప్పారు. ఇందులో తనది మంచి పాత్ర అని భానుచందర్ తెలిపారు. పాటలకు మంచి ఆదరణ లభించిందనీ, చిత్రం కూడా ప్రేక్షకాదరణ పొందుతుందనే నమ్మకం ఉందని సంగీత దర్శకుడు ప్రమోద్‌కుమార్ చెప్పారు. ఈ సమావేశంలో పాల్గొన్న నైజాం పంపిణీదారుడు రాజేంద్ర, దర్శకుడు త్రిపురనేని వరప్రసాద్ (చిట్టి), ఛాయాగ్రాహకుడు నాగశ్రీనివాసరెడ్డి తదితరులు చిత్రం విజయం సాధించాలనే ఆకాంక్షను వ్యక్తపరిచారు. ఈ చిత్రానికి మాటలు: సింహప్రసాద్, సమర్పణ: వల్లూరు శకుంతలారెడ్డి. -
దూరం పెంచే... దుష్టశక్తి!
ఎన్నో కలలతో ఆ యువతీ యువకుడు పెళ్లి చేసుకున్నారు. అనుకోకుండా ఓ దుష్టశక్తి వారి జీవితాల్లోకి ప్రవేశించి, ఇద్దరి మధ్య దూరం పెంచింది. ఈ నేపథ్యంతో మహేష్ స్వీయదర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘కలయా నిజమా’. రాజా, గీతా భగత్ జంటగా నటించిన ఈ చిత్రానికి వంశీకృష్ణ పాటలు స్వరపరిచారు. ఈ నెల 27న పాటలను విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ -‘‘ఈ చిత్రానికి గ్రాఫిక్స్, పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. వచ్చే నెల రెండో వారంలో చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి కో-ప్రొడ్యూసర్స్: హిమబిందు, చిన్న పెరుమాళ్లు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: నవీన్. -
మూడు తరాల కథతో...
‘‘మా ‘జగన్నాయకుడు’ చిత్రం ఎప్పుడో విడుదల కావాలి. కానీ, సెన్సార్ ఇబ్బందుల కారణంగా ఇప్పుడు విడుదలకు నోచుకుంటోంది’’ అని వి.ఎ. పద్మనాభరెడ్డి చెప్పారు. గతంలో పీసీ రెడ్డితో ‘భోగ భాగ్యాలు’వంటి విజయవంతమైన చిత్రాన్ని నిర్మించిన పద్మనాభరెడ్డి మళ్లీ ఆయన దర్శకత్వంలోనే ఈ చిత్రం నిర్మించారు. రాజా, పరిణిక, మమతా రావత్, శిరీష. ఆమని, సుమన్, భానుచందర్, చంద్రమోహన్లు ముఖ్య తారలు. డిసెంబర్ మొదటి వారంలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా పద్మనాభరెడ్డి మాట్లాడుతూ -‘‘ఢిల్లీలో ట్రిబ్యునల్ ద్వారా సెన్సార్ సర్టిఫికెట్ దక్కించుకున్నాం. ఒకే కుటుంబానికి చెందిన మూడు తరాల కథతో ఈ చిత్రం సాగుతుంది. ప్రజాసంక్షేమానికై తపించిన తాత... ఆ బాటలోనే పయనిస్తూ ఒక వైద్యునిగా, జన హృదయనేతగా ప్రజల హృదయాల్లో చెరగని సంతకాన్ని లిఖించిన తనయుడు... తాతనూ, తండ్రినే ఆదర్శంగా తీసుకొని నవ శకానికి నాంది పలికిన మనవడు... ఈ ముగ్గురి జీవితమే ‘జగన్నాయకుడు’ చిత్రం. ఏ నేతకూ, ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన కథ కాదిది. ఎవర్నీ బాధపెట్టే విధంగా ఉండదు. ప్రస్తుత రాజకీయాలు కలుషితమైన నేపథ్యంలో విలువైన రాజకీయా లెలా ఉండాలి? అని సందేశ మిచ్చే చిత్రం’’ అని తెలిపారు. -
జగన్నాయకుడు మూవీ స్టిల్స్
-
రాజా, కనిమొళి,అమ్మాళ్‌పై అభియోగాలు
న్యూఢిల్లీ: 2జీ స్పెక్ట్రమ్ కేటాయింపుల కుంభకోణానికి సంబంధించి మనీలాండరింగ్ కేసులో టెలికం మాజీ మంత్రి ఎ.రాజా, డీఎంకే ఎంపీ కనిమొళి, డీఎంకే చీఫ్ కరుణానిధి భార్య దయా ళు అమ్మాళ్తో పాటు 16 మందిపై ఢిల్లీ ప్రత్యేక కోర్టు అభియోగాలను ఖరారు చేసింది. నవంబర్ 10 నుంచి వీరిపై విచారణను ప్రారంభించనున్నట్టు శుక్రవారం వెల్లడించింది. ఈ కేసులో అభియోగాలు రుజువైతే రాజా, కనిమొళి ఇతర నిందితులకు గరిష్టంగా ఏడేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. 2జీ స్పెక్ట్రమ్ కేటాయింపులకు సంబంధించి ఇది రెండో కేసు. ఈ కేసుకు సంబంధించి ప్రత్యేక కోర్టు పది మంది వ్యక్తులు, తొమ్మిది కంపెనీలపై మనీలాండరింగ్ నిరోధక చట్టంలోని పలు సెక్షన్ల కింద అభియోగాలు ఖరారు చేసింది. ఈ కుంభకోణంలో రాజా, కనిమొళితోపాటు స్వాన్ టెలికాం ప్రమోటర్లు షాహిద్ ఉస్మాన్ బాల్వా, వినోద్ గోయంకాల పాత్రపై కోర్టు విచారణ జరపనుంది. ఏప్రిల్ 25న ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన ఛార్జిషీట్లో పేర్కొన్న నిందితులందరిపైనా అభియోగాలకు సంబంధించి ప్రాథమిక ఆధారాలు ఉన్నట్టు ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఓపీ సైనీ స్పష్టం చేశారు. 208 పేజీల ఉత్తర్వుల్లో రాజా, కనిమొళి, అమ్మాళ్ , శరద్‌కుమార్ రూ. 200 కోట్లు అక్రమంగా చేతులు మారడానికి సహకరించారని, షాహిద్ బాల్వా, వినోద్ గోయెంకా ఈ మొత్తాన్ని కలైంగర్ టీవీలోకి అక్రమంగా తరలించారని పేర్కొన్నారు. -
అమ్మ, తమ్ముడు చనిపోయారు
బంధువులకు సమాచారమిచ్చిన నాలుగేళ్ల చిన్నారి సాక్షి, తిరుమల: విధి వక్రించింది. అప్పటివరకు సంతోషంగా గడిపిన ఆ కుటుంబం పాలిట విద్యుదాఘాతం శాపంగా పరిణమించింది. ‘‘అమ్మా.. తంబీ ఎరందిటాంగ.. (అమ్మా, తమ్ముడు చనిపోయారు)’’ అంటూ నాలుగేళ్ల చిన్నారి రాజా వెక్కివెక్కి ఏడుస్తూ సెల్ఫోన్లో బంధువులకు చెబుతుంటే తండ్రి వెంకటేష్‌తో పాటు బంధువులకు కన్నీళ్లాగలేదు. భార్య, బిడ్డ మృతదేహాలను చూసిన కుటుంబ పెద్ద వెంకటేష్ కుప్పకూలిపోయాడు. ‘‘అమ్మ.. తంబీ ఎరందిటాంగ.. (అమ్మ, తమ్ముడు చనిపోయారు)’’ అంటూ సెల్ఫోన్లో నాలుగేళ్ల రాజా బంధువులకు చెబుతుంటే ఏడుస్తున్న తండ్రి వెంకటేష్ తమిళనాడుకు చెందిన తల్లి లక్ష్మి(24), ఏడాది బిడ్డ మహేశ్ సోమవారం తిరుమలలో క్యూ లైన్లో మరణించడం తెలిసిందే. ఇందుకు విద్యుదాఘాతమే కారణమని వైద్యులు నిర్ధారించారు. మృతదేహాలకు మంగళవారం రుయా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. పోస్టుమార్టం తర్వాత మధ్యాహ్నం 2.30 గంటలకు మృతదేహాలను బంధువులకు అప్పగించారు. టీటీడీ అంబులెన్స్‌లో మృతదేహాలను సొంతూరుకు తరలించారు. తక్షణ ఖర్చుల కోసం టీటీడీ అదనపు సీవీఎస్వో శివకుమార్‌రెడ్డి రూ. 10వేలు ఇచ్చారు. మృతుల కుటుంబానికి టీటీడీ రూ. 8 లక్షల ఎక్స్‌గ్రేషియా టీటీడీ ఈవో గిరిధర్ గోపాల్ మంగళవారం ఉదయం సంఘటన స్థలాన్ని పరిశీలించాక మీడియాతో మాట్లాడారు. యాక్సిడెంట్ నిబంధన కింద రూ. 4 లక్షలతో పాటు టీటీడీ వంతుగా మరో రూ. 4 లక్షలు చెల్లిస్తామన్నారు. జరిగిన సంఘటనపై సమగ్ర విచారణ చేయించి, బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. -
నమస్తే మూవీ స్టిల్స్
-
‘నమస్తే’ ఆడియో ఆవిష్కరణ
-
నా జీవితంలో అదే జరిగింది : రాజా
‘‘ఓ మంచి కథాంశంతో ఈ చిత్రం రూపొందింది. మనిషికి దేవుడి అండ ఉంటే, ఈ ప్రపంచంలో ఎవరూ అనాథలు కాదు. నా జీవితంలో అదే జరిగింది. నా చిన్నప్పుడే మా అమ్మా నాన్న చనిపోయారు. ఒక అనాథకు మరో అనాథ తోడై అసలు అనాథలే లేకుండా ఎలా చేశారు? అనేదే ఈ చిత్రం కథాంశం. పృథ్వీ రత్నం మంచి పాటలు స్వరపరిచారు’’ అని హీరో రాజా చెప్పారు. మాస్టర్ వరుణ్ జీ సమర్పణలో ఎ. రామ్‌కిషన్ జీ నిర్మించిన చిత్రం ‘నమస్తే’. రాజా, గెహనా వశిష్ట జంటగా నటించిన ఈ చిత్రానికి పానుగంటి శశిధర్ దర్శకుడు. హైదరాబాద్‌లో ఈ చిత్ర ఆడియో వేడుకలో పాల్గొన్న రచయిత చిన్నికృష్ణ సీడీని ఆవిష్కరించి, తెలంగాణ ఫిల్మ్ చాంబర్ అధ్యక్షుడు విజయేం దర్‌రెడ్డికి అందించారు. ప్రచార చిత్రాలను దర్శకుడు వి. సముద్ర, దేవీప్రసాద్ ఆవిష్క రించారు. సినిమా మీద మక్కువతో వ్యాపార రంగం నుండి ఇక్కడికొచ్చాననీ, ఈ చిత్రాన్ని దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించా రనీ నిర్మాత చెప్పారు. -
రూ. 200కోట్ల లావాదేవీల్లో రాజా, కనిమొళి అక్రమాలు
కళైనార్ టీవీకి సొమ్ము బదిలీ, ప్రత్యేక కోర్టుకు ఈడీ నివేదన న్యూఢిల్లీ: 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణంలోని మనీ ల్యాండరింగ్ అభియోగాల కేసులో నిందితులైన మాజీ కేంద్ర మంత్రి ఏ రాజా, డీఎంకే మాజీ ఎంపీ కనిమొళి దాదాపు రూ. 200 కోట్ల మేర లావాదేవీల్లో అక్రమాలకు పాల్పడ్డారని ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) మంగళవారం ఢి ల్లీ ప్రత్యేక కోర్టుకు నివేదించింది. రాజా, కనిమొళిలపై దాఖలైన మనీ లాండరింగ్ అభియోగాలపై ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆనంద్ గ్రోవర్ మంగళవారం ప్రత్యేక న్యాయమూర్తి ఓపీ సైనీ కోర్టులో తమ వాదనలు వినిపించారు. డీబీ గ్రూప్ కంపెనీనుంచి కనిమొళి గ్రూపు కంపెనీనుంచి వివిధ కంపెనీల ద్వారా డీఎంకే యాజమాన్యంలోని కలైనార్ టీవీకి జరిపిన రూ 200 కోట్ల మేర బదిలీలో నిబంధలను పాటించలేదని ఆనంద్ గ్రోవర్ కోర్టుకు తెలిపారు. ఈ లావాదేవీల్లో కుసేగావోన్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ ప్రైవేట్ లిమిటెడ్, సినీయుగ్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలను కేవలం డబ్బు బదిలీకోసమే వినియోగించారన్నారు. కాగా, 2జీ కేసులోనే ఈడీ డిప్యూటీ డెరైక్టర్ రాజేశ్వర్ సింగ్ సహా మరి కొందరిని సాక్షులుగా పిలిపించాలని కోరుతూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌పై ప్రతిస్పందించేందుకు తమకు మరి కొంత వ్యవధి ఇవ్వాలని రాజా, కనిమొళి సహా 15మంది నిందితులు ప్రత్యేక కోర్టును కోరారు. దీంతో కోర్టు కేసు విచారణను వచ్చే నెల 9కి వాయిదా వేసింది. బొగ్గు స్కామ్‌పై తుది తీర్పు నేడే అక్రమమని సుప్రీంకోర్టు పేర్కొన్న 218 బొగ్గు గనుల కేటాయింపుల భవితవ్యం నేడు తేలనుంది. వాటికి సంబంధించిన తుది తీర్పును బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకు సుప్రీంకోర్టు వెలువరించనుంది. ఆగస్ట్ 25న ఆ కేటాయింపులను తీవ్రంగా ఆక్షేపిస్తూ పర్యవసానాలను దృష్టిలో పెట్టుకుని వాటిని రద్దు చేయడంలేదని సుప్రీంకోర్టు పేర్కొన్న విషయం తెలిసిందే.