గీత స్మరణం
రాజ్ - కోటి
పల్లవి :
ఆమె: వానజల్లు గిల్లుతుంటే ఎట్టాగమ్మా
నీటిముల్లే గుచ్చుకుంటే ఎట్టాగమ్మా
సన్న తొడిమంటి నడుముందిలే
లయలే చూసి లాలించుకో...
అతడు: ఓ... వానజల్లు గిల్లుడింక
తప్పదమ్మా
ఒంటిమొగ్గ విచ్చుకోక తప్పదమ్మా
చితచితలాడు ఈ చిందులో
జతులాడాలి జతచేరుకో
శ్రీశ్రీ॥
చరణం : 1
ఆ: వానవిల్లు చీరచాటు వన్నెలేరుకో
వద్దు లేదు నా భాషలో
అ: మబ్బుచాటు చందమామ సారెపెట్టుకో
హద్దులేదు ఈ హాయిలో
ఆ: కోడె ఊపిరే తాకితే ఈడు ఆవిరే ఆరదా
అ: కోకగాలులే... హోయ్...
సోకితే కోరికన్నదే రేగదా
ఆ: వడగటే ్టసి బిడియాలనే
ఒడిచేరాను వాటేసుకో
॥
చరణం : 2
అ: అందమంత ఝల్లుమంటె
అడ్డుతాకునా చీరకట్టు తానాగునా
ఆ: పాలపుంత ఎల్లువైతే
పొంగుదాగునా జారుపైట తానాగునా
అ: కొత్త కోణమే ఎక్కడో పూలబాణమై తాకగా
ఆ: చల్లగాలిలో సన్నగా కూనిరాగమే సాగదా
అ: తొడగొట్టేసి జడివానకే గొడుగేశాను
తలదాచుకో
॥
చిత్రం : యముడికి మొగుడు (1988)
రచన : వేటూరి సుందరరామమూర్తి
సంగీతం : రాజ్-కోటి
గానం : ఎస్.పి.బాలు, ఎస్.జానకి
నిర్వహణ: నాగేష్