
నవంబర్ 9న పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు
ఈరోజు మీతోపాటు పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు:
రాజా (నటుడు), అను ప్రభాకర్ (కన్నడ నటి)
ఈరోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 10. ఇది సూర్యసంఖ్య. మీరు పుట్టిన తేదీ 9. ఇది కుజసంఖ్య. దీనివల్ల మీ మీద ఉన్న చెడు ప్రభావం అంటే చెడుస్నేహాల వ ంటి దుర్గుణాల నుండి విముక్తి కలిగి కొత్త జీవితం ప్రారంభిస్తారు. నవగ్రహాలలో సూర్యుడు రాజు, కుజుడు సేనాపతి అవడం వల్ల ఈ సంవత్సరం అవివాహితులకు వివాహం అవడం, సంతానప్రాప్తి కలగడం, సొంతు ఇంటి కల నెరవేరడం వంటి మంచి మార్పులు కలుగుతాయి. వచ్చే పుట్టిన రోజు వరకు మీ పుట్టిన రోజు, వ్యక్తిగత సంవత్సర సంఖ్య పరస్పర మిత్ర సంఖ్యలు అయినందువల్ల ఈ సంవత్సరం మీరు తలచిన పనులు ఆటంకాలు లేకుండా విజయవంతమవుతాయి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగాలు, మైన్స్, మెకానికల్, మెటీరియల్ రంగాలలో ఉన్న వారికి ఊహించని లాభాలు వస్తాయి. కుజప్రభావం వల్ల పై అధికారులతో, యజమానులతో మొండిగా వాదించి గొడవలు పడి, ఉన్న ఉద్యోగాన్ని ఊడగొట్టుకునే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. అలాగే వాహనాలను నడపడంలోనూ, మారణాయుధాల వాడకంలోనూ అప్రమత్తంగా ఉండటం అవసరం.
లక్కీ నంబర్స్: 1,3,6,9; లక్కీ కలర్స్: రోజ్, ఆరంజ్, రెడ్, పర్పుల్; లక్కీ డేస్: ఆది, సోమ, మంగళ, శుక్రవారాలు. సూచనలు: సుబ్రహ్మణ్యేశ్వరునికి అభిషేకం, సూర్యారాధన, తండ్రిని కాని, తండ్రితో సమానులైన వారిని కానీ ఆదరించడం, పేదరోగులకు ఆహార పంపిణీ చేయడం మంచిది.
- డాక్టర్ మహమ్మద్ దావూద్, ఆస్ట్రో న్యూమరో గ్రాఫో థెరపిస్ట్