బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలి
రాజమహేంద్రవరం రూరల్ : అగ్నిప్రమాద బాధితులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా డిమాండ్ చేశారు. సోమవారం కొంతమూరు జంగాలకాలనీలో అగ్ని బాధితులను ఆయన పరామర్శించారు. బా ధితులకు పక్కా ఇళ్లు నిర్మిస్తామని రెం డేళ్లక్రితం ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి ఇచ్చిన హామీ నెరవేర్చి ఉంటే ఈ కష్టం వచ్చేది కాదన్నారు. వైఎస్సార్ సీపీ తరఫున బాధితులను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. అలాగే పార్టీ రూరల్ కో–ఆర్డినేటర్ గిరజాల వీర్రాజు(బాబు) బాధితులను పరామర్శిం చారు. బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చియ్యచౌదరి మాట్లాడుతూ.. బాధితులకు పక్కా ఇళ్లు నిర్మిస్తామని చెప్పారు. ఆయన ఇచ్చిన హామీపై బాధిత మహిళలు నిలదీశారు. ఆగ్రహించిన యువకుల ను పోలీసులు అడ్డుకున్నారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజు, డీసీసీ అధ్యక్షుడు కందుల దుర్గేష్, మాజీ ఎంపీ మిడియం బాబూరావు తదితరులు బాధితులను పరామర్శించారు.
సహాయక చర్యలు
సంఘటన విషయం తెలిసిన వెంటనే రాజమహేంద్రవరం నుంచి రెండు, అనపర్తి, మండపేట, జగ్గంపేట, కొవ్వూరు నుంచి ఒకొక్క ఫైరింన్ తో పాటు జేగురుపాడు జీవీకే ఫైరింజన్ అక్కడకు చేరుకున్నాయి. జిల్లా ఫైర్ ఆఫీసర్ ఉదయకుమార్ ఆధ్వర్యంలో సిబ్బంది మంటలను అదుపుచేశారు. రాజమహేంద్రవరం రూరల్ తహసీల్దార్ జి.భీమారావు, తూర్పు మండల డీఎస్పీ రమేష్‌బాబు సహాయక చర్యలను పర్యవేక్షించారు. రాజమహేంద్రవరం ఇన్ చార్జి సబ్ కలెక్టర్ పటంశెట్టి రవి సహాయక చర్యలపై ఆరా తీశారు. బాధితులకు కోలమూరులోని మొసానిక్ లాడ్జిలో పునరావాసం కల్పించారు. బాధితులకు జైన్ ట్రస్టు నిర్వాహకుడు విక్రమ్‌జైన్ భోజన ఏర్పాట్లు చేశారు. దుప్పట్లు పంపిణీ చేశారు.