
సాక్షి, హైదరాబాద్: జాతీయ జూనియర్ అండర్–17 చెస్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ క్రీడాకారులకు రెండు పతకాలు లభించాయి. తమిళనాడులోని కోయంబత్తూర్‌లో బుధవారం ముగిసిన ఈ చాంపియన్‌షిప్ ఓపెన్ విభాగంలో రాజా రిత్విక్ చాంపియన్‌గా అవతరించగా... ఎరిగైసి అర్జున్ రన్నరప్‌గా నిలిచాడు. నిర్ణీత 11 రౌండ్ల తర్వాత రిత్విక్ తొమ్మిది పాయింట్లతో అగ్రస్థానాన్ని సంపాదించగా... అర్జున్ 8.5 పాయింట్లతో రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు.
రిత్విక్ ఎనిమిది గేముల్లో గెలిచి, రెండింటిని ‘డ్రా’ చేసుకొని... మరో గేమ్‌లో ఓడిపోయాడు. అర్జున్ ఏడు గేముల్లో నెగ్గి, మూడింటిని ‘డ్రా’ చేసుకొని, మరో గేమ్‌లో ఓటమి చవిచూశాడు. ఇదే చాంపియన్‌షిప్ బాలికల విభాగంలో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణులు తోషాలి, సీహెచ్ నిహారిక వరుసగా ఆరు, ఏడు స్థానాల్లో నిలిచారు.
Comments
Please login to add a commentAdd a comment