సాక్షి, హైదరాబాద్: ఆసియా యూత్ చెస్ చాంపియన్‌షిప్‌లో తెలుగు క్రీడాకారులు సత్తా చాటారు. థాయ్‌లాండ్‌లో ముగిసిన ఈ టోర్నీలో బాలుర అండర్–14 క్లాసిక్ విభాగంలో రాజా రిత్విక్ (హైదరాబాద్)... అండర్–12 విభాగంలో డి.గుకేశ్ (ఆంధ్రప్రదేశ్)... అండర్–12 బాలికల విభాగంలో ఎం. సాహితి వర్షిణి (ఆంధ్రప్రదేశ్) విజేతలుగా నిలిచారు. సాహితి ర్యాపిడ్ విభాగంలో స్వర్ణం, బ్లిట్జ్ ఈవెంట్‌లో కాంస్యం కూడా సాధించడం విశేషం. బాలుర అండర్–8 క్లాసిక్ విభాగంలో ఆదిరెడ్డి అర్జున్, అండర్–14 విభాగంలో కుశాగ్ర మోహన్ కాంస్యాలు సాధించారు.
Comments
Please login to add a commentAdd a comment