sahithi
-
Sahithi chiluveru: టెకీ ఉద్యోగం నుంచి టేస్టీ ఫుడ్ బిజినెస్ వరకు
ఒక అందమైన ఆలోచనను సక్రమంగా అమలులో పెడితే పల్లెటూరు నుంచి కూడా విదేశాలకు విస్తరించవచ్చు అని నిరూపిస్తుంది చిలువేరు సాహితి. చేస్తున్న కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలేసి పాకశాస్త్ర ప్రావీణ్యంతో ఉపాధిని సృష్టిస్తోంది. 26 ఏళ్ల వయసులో తనతోపాటు మరో ఇరవై మంది మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. తెలంగాణలోని మంచిర్యాల జిల్లా నెన్నెల మండల కేంద్రంలో వ్యవసాయాధారిత జీవనాల మధ్య వెలుగుతున్న సాహితిని పలకరిస్తే విజయావకాశాన్ని వంటలతో అందిపుచ్చుకుంటున్నానని వివరిస్తుంది.‘‘నాకు రుచికరమైన ఆహారం అంటే చాలా ఇష్టం. అయితే ఆ ఇష్టం నాకో ఉపాధిని కల్పిస్తుంది అని మాత్రం ఊహించలేదు. బీటెక్ కంప్లీట్ అయ్యాక హైదరాబాద్ టీసీఎస్ కంపెనీలో నాలుగేళ్లు ఉద్యోగం చేశాను. కోవిడ్ సమయంలో వర్క్ ఫ్రమ్ హోమ్ రావడంతో ఊరు వచ్చేశాను. ఆ టైమ్‌లో మా అమ్మ కన్యాకుమారి చేసే వంటలను ఆస్వాదిస్తూ ఉండేదాన్ని. ఖాళీ సమయంలో సరదాగా తీసుకున్న వంటల ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో ‘ఫ్లేవర్స్ ఆఫ్ తెలుగు’ పేజీ క్రియేట్ చేసి పోస్ట్ చేసేదాన్ని. ఆ పోస్టులకు లైకులు వెల్లువెత్తుతుండేవి. ఒకటి నుంచి మొదలు.. ఓరోజున ఉన్నట్టుండి ఒక ఫాలోవర్ నుంచి ‘మాకు స్వీట్స్ చేసి పంపుతారా’ అంటూ ఒక పోస్ట్ వచ్చింది. కాదనటమెందుకులే, ఒకసారి ప్రయత్నం చేసి చూద్దాం అని... ఆ ఆర్డర్ పూర్తిచేసి, కొరియర్ ద్వారా పంపించాం. ఆ తర్వాత మరో రెండు ఆర్డర్లు వచ్చాయి. అలా నెలకు ఒకటి రెండు ఆర్డర్లు రావడం మొదలయింది. క్రమంగా ఆర్డర్లు పెరిగాయి. నా వంటలకు మంచి డిమాండ్ ఉందని అర్థమైంది. దానినే ఉపాధిగా ఎందుకు చేసుకోకూడదూ అని... చేస్తున్న ఉద్యోగాన్ని వదిలేసి, ఫుడ్ తయారీనే వ్యాపారంగా ఎంచుకున్నాను. ముందు మా ఇంటివరకే పనులు ఉండేవి. తర్వాత పనులు పెరగడంతో ఊళ్లోనే ఉన్న మా చుట్టుపక్కల మహిళలను ఫుడ్ తయారీకి నియమించుకున్నాం. స్నాక్స్, ఊరగాయలు, స్వీట్లు, మసాలా పొడులతో పాటు మిల్లెట్ ఉత్పత్తులు, ఇన్స్టంట్ మిక్స్‌లు తయారు చేయడం మొదలుపెట్టాం. ఇప్పుడు నెలకు 30 నుంచి 40 ఆర్డర్లు వస్తున్నాయి.మరో 20 మందికి...పదిహేనేళ్లుగా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న ఒక ఉద్యోగికి వచ్చే ప్యాకేజీని ఇప్పుడు నా వ్యాపారం ద్వారా పొందుతున్నాను. నాతోపాటు మరో 20 మంది మహిళలకు ఉపాధి కల్పించే స్థితికి చేరుకున్నాను. వీరిలో పదిమంది తమ ఇళ్ల నుంచే పచ్చళ్లు, పొడులు, ఇతర పిండి వంటలు తయారు చేసి వాటిని అందంగా ΄్యాక్ చేసి ఇస్తారు. మా ఇంటి మొదటి అంతస్తులోని రెండు గదులను నా కంపెనీ ‘ఫ్లేవర్స్ ఆఫ్ తెలుగు’కి కేటాయించుకున్నాను. పదిహేను రకాల పచ్చళ్లు, 40 రకాల పిండి వంటలు, ఇన్స్టంట్ ఫుడ్ మిక్సర్లు, మసాల పొడులు.. దాదాపు 70 ర కాల వంటకాలు తయారు చేస్తుంటాం. మన దేశంలోనే కాకుండా అమెరికా, ఆస్ట్రేలియా, జర్మనీ.. దేశాలలో ఉండే మన తెలుగువారికి కొరియర్ ద్వారా పచ్చళ్లు, పొడులు పంపిస్తున్నాను.ఎక్కడా ప్లాన్ లేదు.. ఏ మాత్రం ప్లాన్ లేకుండా నా వ్యాపారం వృద్ధి చెందుతూ వస్తోంది. ఇంట్లో పెట్టిన ఆవకాయతో ఆరంభమైన ఈ బిజినెస్‌లో వచ్చిన ఆర్డర్ల ప్రకారం పెట్టుబడి పెడుతూ, ఆదాయాన్ని పొందుతున్నాను. ఫుడ్ బిజినెస్ కాబట్టి ఏడాది క్రితం లైసెన్స్ కూడా తీసుకున్నాను. మా ఊరికి మరింత పేరుతెచ్చేలా ‘ఫ్లేవర్స్ ఆఫ్ తెలుగు’ బ్రాండ్ ఉత్పత్తులను విస్తరించాలనుకుంటున్నాను. కానీ, తయారీ మాత్రం మా ఊరి నుంచి, మా ఇంటి నుంచే చేస్తుంటాను.సవాళ్లను అధిగమిస్తూ.. రుచికరమైన వంటకాల తయారీలో పదార్థాలు కూడా అంతే నాణ్యమైనవి ఉండాలి. సరైన శుభ్రత పాటించాలి. ముఖ్యంగా ఆర్గానిక్ ఉత్పత్తులను సేకరించడం, వాటిని సమయానుకూలంగా తయారీలో వాడటం పెద్ద సవాల్‌గానే ఉంటోంది. అలాగే, సీజనల్‌గా ఉండే సమస్యల్లో ముఖ్యంగా వర్షాకాలం ΄్యాకింగ్లు తడవడం వంటివి అప్పుడప్పుడు జరుగుతుంటాయి. ఎప్పుడైనా సమస్య వచ్చినప్పుడు తిరిగి రీప్లేస్ చేయడం వంటి జాగ్రత్తలు తీసుకుంటాను. చాలా మందితో డీల్ చేయాలి, కస్టమర్స్ అందరూ ఒకేలా ఉండరు కాబట్టి సహనంతో ఉండాలి. ఈ ప్రయాణం నన్ను నేను కొత్తగా ఆవిష్కరించుకోవడానికి ఉపయోగపడుతుంది. ‘చిన్న అమ్మాయివే కానీ, మా ఇంట్లో బామ్మలు చేసిన వంటకాల రుచి చవి చూస్తున్నాం’ అంటూ మా వంటకాలను రుచి చూసినవారు నాకు ఫోన్ల ద్వారా, మెసేజ్‌ల ద్వారా ప్రశంసలు తెలియచేస్తుంటారు. నాణ్యత ద్వారా వారి ఆశీస్సులను, అభిమానాన్ని, మద్దతును ఎప్పటికీ అలాగే నిలబెట్టుకుంటాను అంటూ ఆనందంగా వివరిస్తుంది సాహితి.– నిర్మలారెడ్డి -
డీ గ్లామర్ పాత్రలే కాదు బోల్డ్ సీన్స్‌లోనూ రచ్చచేసే బ్యూటీ (ఫోటోలు)
-
కుర్చీ మడతపెట్టి సాంగ్ అదరగొట్టిన సింగర్ సాహితి..!
-
Sekhar Master Daughter Sahithi Birthday: శేఖర్ మాస్టర్ కూతురు బర్త్ డే.. ఫోటోలు వైరల్!!
-
సాహితీ కొండపల్లికి ‘విమెన్ లీడర్స్ ఫోరం’ అవార్డు
సాక్షి, హైదరాబాద్: వైద్యపరికరాలు, మందుల (మెడికల్ డివైసెస్ అండ్ ఫార్మాసిటిక్స్)కు సంబంధించిన రెగ్యులేటరీ రైటింగ్ కంపెనీ క్రైటీరియన్ ఎడ్జ్ డైరెక్టర్ సాహితీ కొండపల్లిని ‘విమెన్ లీడర్స్ ఫోరం–2022’ అవార్డు వరించింది. మంగళవారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఆమె అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా ఆమెను విమెన్ లీడర్స్ ఫోరం జ్యూరీ టీమ్ అభినందించింది. ‘విమెన్ లీడర్ అవార్డ్ ఇన్ లీడర్షిప్’ కేటగిరీలో ఈ అవార్డును అందజేసినట్లు ఒక ప్రకటనలో తెలిపింది. సాహితి 40 మందికి పైగా మెడికల్ రైటర్స్ బృందానికి నేతృత్వం వహిస్తూ వివిధ లక్ష్యాల సాధనలో తమదైన పాత్రను, నైపుణ్యాలను చూపుతున్నారు. వైద్య, ఆరోగ్యరంగంలో ఆయా బృందాలకు నేతృత్వం వహిస్తూ నైపుణ్యాల అభివృద్ధిలో తోడ్పాటునందిస్తున్నారు. -
హీరోయిన్గా ఎంట్రీ ఇస్తున్న శేఖర్‌మాస్టర్ కూతురు?
టాలీవుడ్ టాప్ కొరియోగ్రాఫర్లలో శేఖర్ మాస్టర్ ఒకరు. ఓ ప్రముఖ డ్యాన్స్‌తో గుర్తింపు తెచ్చుకున్న ఈయన స్టార్ కొరియోగ్రాఫర్‌గా పాపులర్ అయ్యాడు. ఒకవైపు సినిమాల్లో పనిచేస్తూనే మరెవైపు బుల్లితెరపై కూడా పలు షోలతో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ఇండస్ట్రీలో బిజీయెప్ట్ కొరియోగ్రాఫర్‌గా శేఖర్ మాస్టర్‌కి పేరుంది. అయితే ఇప్పుడు శేఖర్ మాస్టర్ కూతురు సాహితీ హీరోయిన్గా ఎంట్రీ ఇస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే టిక్‌టాక్ సహా డ్యాన్స్ వీడియోలతో గుర్తింపు తెచ్చుకున్న ఆమె హీరోయిన్గా నటించేందుకు సిద్ధమైందట. ఇప్పటికే దీని కోసం ఓ కొత్త దర్శకుడు కథ చెప్పగా, శేఖర్ మాస్టర్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం క్రేజ్ ఉన్న ఓ యంగ్ హీరోను ఈ సినిమాలో భాగం చేసేందుకు శేఖర్ మాస్టర్ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. -
ఎంబీబీఎస్ రాక.. బీడీఎస్ ఇష్టం లేక..
నాగోలు: ఎంబీబీఎస్ చదవాలనే కోరికున్నా.. అది రాకపోవడంతో బీడీఎస్ కోర్సులో చేరింది ఓ విద్యార్థిని. అయితే ఎంబీబీఎస్ రాలేదని ఎప్పుడూ అసంతృప్తిగానే ఉండేది. ఈ క్రమంలో మానసిక ఒత్తిడికి గురై అపార్ట్మెంట్లోని 14వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్బీనగర్ సాగర్ రింగ్ రోడ్ సమీపంలోని అలేఖ్య టవర్స్‌లో 14వ అంతస్తులో రఘురాం, పద్మ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరి కుమార్తె కేపీఎస్ సాహితీ (25) కోఠిలోని ఉస్మానియా ప్రభుత్వ డెంటల్ కాలేజీలో బీడీఎస్ నాలుగో సంవత్సరం చదువుతోంది. గతంలో రెండుసార్లు ఎంబీబీఎస్ పరీక్షలు రాసినా సీటు రాలేదు. తల్లిదండ్రులు నచ్చజెప్పడంతో అయిష్టంగానే బీడీఎస్‌లో చేరింది. అప్పుడప్పుడూ ఈ కోర్సు చేయడం ఇష్టం లేదని.. ఎంబీబీఎస్ సీటు వస్తే బాగుండేదని తల్లిదండ్రులతో అంటుండేది. కాగా, ఫిబ్రవరిలో సాహితీ అన్నయ్య కృష్ణ భరద్వాజ్ అమెరికా నుంచి భార్యతో కలసి వచ్చాడు. లాక్డౌన్ కారణంగా వారు ఇక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో సికింద్రాబాద్‌లోని ఓ రియల్ ఎస్టేట్ కంపెనీలో పనిచేస్తున్న రఘురాం ఎప్పటిలాగానే మంగళవారం విధులకు వెళ్లారు. బీడీఎస్ కోర్సు చేయడం ఇష్టం లేని సాహితీ మానసికంగా ఆందోళనకు గురై.. మధ్యాహ్నం 12 గంటల సమయంలో అపార్ట్మెంట్ 14వ అంతస్తులోని బాల్కనీలో ఉన్న గ్రిల్స్ తొలగించి పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఇది గమనించిన అపార్ట్మెంట్ వాచ్‌మన్ ఇంట్లో ఉన్న తలిక్లి సమాచారం అందించాడు. తల్లి, ఇతర కుటుంబసభ్యులు కిందకు వచ్చి సాహితీని పరిశీలించే సరికే ఆమె రక్తపు మడుగులో మృతి చెంది ఉంది. వెంటనే కుటుంబసభ్యులు రఘురాం కు సమాచారం ఇచ్చారు. కూతురి మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ‘సోమవారం సాయంత్రమే.. ఎంబీబీఎస్ చేస్తే బాగుండేది. బీడీఎస్ కోర్సు అయిష్టంగా చదవాల్సి వస్తోంది. దీనికి భవిష్యత్ అవకాశాలు కూడా సరిగా లేవని వాపోయింది. ఇంత పని చేస్తుందని ఊహించలేద’ని రఘురాం పేర్కొన్నారు. ఆత్మహత్య సమాచారం అందుకు న్న ఎల్బీనగర్ డీఐ కృష్ణమోహన్, ఎస్ఐ ఎస్.సుధాకర్ ఘటనాస్థలికి చేరుకు ని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. తండ్రి రఘురాం ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. -
నాన్నను తలిస్తే ధైర్యం
ఎన్నో సినిమాలకు డైలాగ్స్ రాసినా, దర్శకత్వం వహించినా జంధ్యాల ఇష్టపడింది మాత్రం ‘ఆపద్బాంధవుడు’లో చేసిన ఆడపిల్ల తండ్రి పాత్రనే. స్త్రీలు కూడా సరదాగా తీసుకునేలా ఆయన వారిపై జోకులు వేశారు గానీ నొచ్చుకునేలా కాదు. ఆయనకు దేవుడు ఇద్దరు అమ్మాయిలను ఇచ్చాడు. ఆయన దేవుడి దగ్గరకు వెళ్లిపోయినా ఆయన జ్ఞాపకాలు వారికి స్థైర్యాన్ని ఇస్తూనే ఉన్నాయి. హాస్యబ్రహ్మగా పేరు సంపాదించుకున్న జంధ్యాలకు కొంచెం లేటు వయసులో సాహితి, సంపద కవలపిల్లలుగా పుట్టారు. వారి ముద్దుమురిపాలు పూర్తిగా చూడకుండానే, ‘మాకు హాస్యాన్ని పంచడానికి రావయ్యా’ అంటూ స్వర్గలోకం నుంచి పిలుపు వచ్చినట్టుంది వెళ్లిపోయారు.‘నాన్న ప్రేమను ఆస్వాదించినది తక్కువ రోజులే అయినా ఆ ఆప్యాయతను మరచిపోలేం. సినిమాల ద్వారా నాన్న చిరంజీవిగా ఉండిపోయారు’ అంటూ తండ్రి జ్ఞాపకాలను తడుముకోకుండా సాక్షితో పంచుకున్నారు సాహితి, సంపద. సాహితి: మాకు నాలుగేళ్ల వచ్చేసరికి నాన్న మాకు దూరమైపోయారు. ఇప్పుడు నేను ఆర్కిటెక్చర్ ఆఖరి సంవత్సరం ఇంటెర్న్‌షిప్‌లో ఉన్నాను. నాన్నని ఎక్కువ కాలం చూడకపోయినా, ఆయన జ్ఞాపకాలను అందరినోటా విని తెలుసుకుంటున్నాం. నాన్న గురించి మాట్లాడమని ఎవరడిగినా నాన్న సినిమాలే గుర్తుకు వస్తాయి. సంపద: మేమిద్దరం కవల పిల్లలం. సాహితి కంటె నేను ఒక్క నిమిషం చిన్నదానిని. బి.కామ్. సిఏ చేస్తున్నాను. సాహితి – సంపద: మా బారసాలకు మేమే అందరినీ ఆహ్వానిస్తున్నట్లుగా ఆహ్వాన పత్రిక వేయించారు నాన్న. సాహితి: బారసాలలో నేను పెన్ను ముట్టుకున్నాను. సంపద: నేను డబ్బులు ముట్టుకున్నాను. సాహితి – సంపద: మా పుట్టిన రోజుకి తీసిన సీడీలు చూస్తే ఎంత గ్రాండ్‌గా చేశారో అర్థం అవుతుంది. ఏనుగులు, గుర్రాలు, ఎర్ర తివాసీ... ఎంతో ఘనంగా చేశారు. సినిమా పరిశ్రమ తరలి వచ్చింది. ఏయన్నార్ అంకుల్, ‘ఏమిటయ్యా! పెళ్లిలా చేస్తున్నావు’ అన్నారట నాన్నతో. నాన్న బతికి ఉంటే ప్రతి పుట్టినరోజు ఇలాగే చేసేవారేమో. సాహితి: నేను నారాయణరెడ్డి తాతగారి జేబులో నుంచి పెన్ను తీసుకున్నానట. అప్పుడు ఆయన ‘పేరుకి తగ్గట్టు పెన్ను తీశావు’ అన్నారట. మేం అన్నం తినకుండా మారాం చేస్తుంటే నాన్న మమ్మల్ని కారులో నెక్లెస్రోడ్కి తీసుకెళ్లి తినిపించేవారని అమ్మ చెబుతుంటే, నాన్నకు మా మీద ఎంత ప్రేమో అనిపిస్తుంది. అవకాశం ఉన్నప్పుడు ఇంటిల్లిపాదినీ ప్రివ్యూకి తీసుకెళ్లే వారట నాన్న. నాన్న తీసిన సినిమాలలో ‘అహనా పెళ్లంట’ చిత్రంలోని బ్రహ్మానందంగారి కామెడీ, డైలాగులు ఇష్టం. హాస్య సంభాషణలే నాన్న ప్రత్యేకత. ‘నాలుగు స్తంభాలాట’, ‘వివాహæభోజనంబు’ సినిమాలు బాగా ఇష్టం. ‘వివాహభోజనంబు’లో సుత్తి వీరభద్రరావు అంకుల్, ‘హైదరాబాదు, సికింద్రాబాదు, అహమ్మదాబాదు...’ అంటూ నగరాల పేర్లు, విజయవాడ వీధుల పేర్లన్నీ చెప్పిన సీన్లు బాగా ఇష్టం. సంపద: ‘చంటబ్బాయ్’లో శ్రీలక్ష్మి ఆంటీ ‘నన్ను కవిని కాదన్నవాడిని కత్తితో పొడుస్తాను’ అని కవిత్వం చెప్పడం సరదాగా అనిపిస్తుంది. సాహితి: చాలా సీన్లు చూస్తుంటే, మా ఇంట్లో జరిగిన సంఘటనలు గుర్తుకు వస్తుంటాయి. జీవితంలో తాను ప్రేరణ పొందిన వాటిని పాత్రలుగా సృష్టించి, హాస్యాన్ని పండించారు నాన్న. ‘రావూ – గోపాలరావూ’ చిత్రంలో రాధాకుమారి ‘స్టీల్ సీత’ పాత్ర అమ్మ వాళ్ల ఫ్రెండ్‌ను చూసి తీశారని అమ్మే చెప్పింది. సంపద: ‘మొగుడు – పెళ్లాలు’ చిత్రంలో ఒక దృశ్యంలో ఇంటికి వచ్చిన బంధువులంతా ఎక్కడా కాలు పెట్టడానికి లేకుండా పడుకుంటారు. అది నాన్న జీవితంలో జరిగిందే. అమ్మవాళ్లు వాళ్ల పెళ్లిరోజున బయటకు వెళదామనుకున్నారుట. ఈలోగా అమ్మ వాళ్ల చుట్టాల వాళ్లు ఒక బస్సులో మా ఇంటికి వచ్చేశారట. ఇల్లంతా నిండి మెట్ల మీద పడుకున్నారట. సాహితి: ‘ఆనందభైరవి’ చిత్రంలో శ్రీలక్ష్మి పాత్రకు ఈల వేయడం అలవాటు. రాజమండ్రి లో ఉంటున్న మా అత్త కామేశ్వరిని చూసి ఆ సీన్లు పెట్టారట. ఆవిడ సినిమాకి వెళ్లినప్పుడు మంచి సీన్ వస్తే విజిల్ వేస్తారు. సంపద: అమ్మవాళ్లు చెన్నైలో ఉండగా నీళ్ల ఇబ్బందులు ఉండటంతో, నీళ్లు వదిలినప్పుడు చిన్న చిన్న గ్లాసుల్లో కూడా పట్టుకునేవారుట. ఆ సీన్‌ని దృష్టిలో ఉంచుకుని, ‘అహ నా పెళ్లంట’ చిత్రంలో నీళ్ల కరవు సీన్‌ను హాస్యం చేశారట నాన్న. తన జీవితంలో ఎక్కడ ఏ మేనరిజమ్ చూసినా దానిని తన సినిమాలలో పెట్టే వారని మా గణేశ్ బావ ఇప్పటికీ చెబుతుంటాడు. సాహితి: నాన్న రాసిన ‘పరమబోరింగ్ మొహం’ డైలాగులని డబ్స్మాష్లో చేశాను. ‘చంటబ్బాయ్’, ‘అహ నా పెళ్లంట’ చిత్రాలలో సన్నివేశాలు కూడా చేశాను. మా సంపద ఏదైనా సినిమా చూస్తే బ్యానర్ నుంచి శుభం కార్డు వరకు కథ ఆపకుండా చెప్తుంది. నాన్న ఉండి ఉంటే ‘శ్రీవారికి ప్రేమలేఖ’ చిత్రంలో శ్రీలక్ష్మి పాత్ర పుట్టింది అనుకునేవారేమో. సంపద: ‘ష్!గప్‌చుప్’ చిత్రంలో ఏవిఎస్ పాత్ర భలే నవ్వొస్తుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్, అనిల్ రావిపూడి, హరీశ్ శంకర్ల కామెడీ బాగా ఇష్టం. వారంతా నాన్న సినిమాలు వేసుకుని చూసి సినిమాలు తీస్తారని చెప్పడం విన్నాను. సాహితి: నాన్న రాసిన నాటకాలను షార్ట్ ఫిల్మ్స్‌లా తీయాలనుకుంటున్నాం. అందులో మేమే నటించాలనుకుంటున్నాం. నాన్న రాసుకున్న స్క్రిప్ట్ మా దగ్గర రెడీగా ఉన్నాయి. వాటిని ప్రచురించాలని కూడా ఉంది. సాహితి: నాన్న అంటే ఒక ధైర్యం. సంపద: నాన్న అంటే అభిమానం, గౌరవం. – సంభాషణ: వైజయంతి పురాణపండ చాలా కాలం తరవాత ఇద్దరం పుట్టడంతో ‘నేను ఒకటి కోరుకుంటే నాకు భగవంతుడు రెండు ఇచ్చాడు’ అన్నారట. నాన్న ఏది చేసినా చాలా ప్రత్యేకంగా విలక్షణంగా ఉంటుంది. నేను (సాహితి) కొంచెం సన్నగా ఉంటాననని నన్ను రస్కు అని, నేను (సంపద) కొద్దిగా బొద్దుగా ఉంటానని నన్ను బన్ను అని పిలిచేవార ని అమ్మ చెప్పింది. – సాహితి నాన్న బయటకు నవ్వేవారు కాదట. సీరియస్ గా ఉంటూ, అందరినీ నవ్వించేవారట. అమ్మ తెలుగు మాట్లాడుతూ ఒత్తులు సరిగ్గా పలకలేకపోతే ‘ఒత్తుల డబ్బా పక్కన పెట్టుకో’ అనేవారని అమ్మచెబుతూ ఉంటుంది. నాయనమ్మతో కలిసి అమ్మ మైసూర్‌పాక్ వంటివి చేస్తుంటే ‘రాళ్లు పెట్టి కొట్టుకుని తినాలా, మామూలుగానే చేశావా’ అని సరదాగా ఆట పట్టించేవారట. – సంపద -
చాంప్స్ సాహితి, రాజా రిత్విక్
సాక్షి, హైదరాబాద్: ఆసియా యూత్ చెస్ చాంపియన్‌షిప్‌లో తెలుగు క్రీడాకారులు సత్తా చాటారు. థాయ్‌లాండ్‌లో ముగిసిన ఈ టోర్నీలో బాలుర అండర్–14 క్లాసిక్ విభాగంలో రాజా రిత్విక్ (హైదరాబాద్)... అండర్–12 విభాగంలో డి.గుకేశ్ (ఆంధ్రప్రదేశ్)... అండర్–12 బాలికల విభాగంలో ఎం. సాహితి వర్షిణి (ఆంధ్రప్రదేశ్) విజేతలుగా నిలిచారు. సాహితి ర్యాపిడ్ విభాగంలో స్వర్ణం, బ్లిట్జ్ ఈవెంట్లో కాంస్యం కూడా సాధించడం విశేషం. బాలుర అండర్–8 క్లాసిక్ విభాగంలో ఆదిరెడ్డి అర్జున్, అండర్–14 విభాగంలో కుశాగ్ర మోహన్ కాంస్యాలు సాధించారు. -
ఈ అమ్మాయికి పేరు పెట్టలేం...
రోజా పువ్వుని ఏ పేరుతో పిలిస్తేనేమి? పరిమళం గొప్పగానే ఉంటుంది కదా! దేవుడిని ఏ పేరుతో పిలుచుకుంటేనేమి? దీవెనలు అద్భుతంగానే ఉంటాయి కదా! అందుకేనేమో తెలుగులో ఈ నుడికారం వచ్చింది ‘పేరు పెట్టలేం’ అని! ప్రతిభే సహజలక్షణమైన వాళ్లకు ఏం వంకలు పెట్టగలమని? సాహితీ పింగళి పేరెంట్స్ ఆ పేరును ప్రేమతో పెట్టుకున్నారు ప్రతిభను చూసి కాదు.. ఇప్పుడు ఆ అమ్మాయి ప్రతిభను చూసి ఓ గ్రహానికే ఈమె పేరు పెట్టారు! అందుకే ఈ అమ్మాయికి ఏవిధంగానూ మనం పేరు పెట్టలేం.. ఆకాశంవైపు చూసి చప్పట్లు కొట్టగలం! బెంగళూరు.. ఖాళీ సమయాల్లో తమ అపార్ట్మెంట్లోని తన గది కిటికీలోంచి బయట కనిపిస్తున్న దృశ్యాలను చూడ్డం పధ్నాలుగేళ్ల సాహితికి చాలా ఇష్టం. ఆలా రోజూ చూస్తూంటే ఓ విశాలమై ప్రదేశం కనిపించింది ఒకరోజు. అదేంటో అర్థంకాలేదు కాని ప్రతిరోజూ గమనించడం మొదలుపెట్టింది. అక్కడే జరుగుతున్న భవన నిర్మాణ కార్మికులు సాయంకాలం వెళుతూ వెళుతూ.. ఆ ప్రదేశంలో ఏదో పారేయడం.. టిఫిన్ బాక్స్‌ల్లో మిగిలినవి, వాటర్ బాటిల్స్‌లోని నీళ్లను అందులో పారబోయడం.. ఆమె కంట పడింది. డంప్‌యార్డ్ కోబోలు అనుకుంది. ఎందుకనో.. దాని మీద ఇంట్రెస్ట్ కలిగింది ఆ అమ్మాయికి. ఒక ఆదివారం.. చూసొద్దామని బయలుదేరింది. తీరా దగ్గరకు వెళ్లాక తెలిసింది అది డంప్‌యార్డ్ కాదు.. చెరువు. కైకొండ్రహళ్లి చెరువు. అప్పటి నుంచి నీటి కాలుష్యం ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లోని చెరువులు, సరస్సుల కాలుష్యం మీద అధ్యయనం చేయాలనే ఆసక్తి పెరిగింది సాహితీ పింగళికి. కార్యరూపం ఇచ్చింది. యేడాది పాటు పరిశీలించి పరిశోధించింది. చెరువుల్లోని నీటి కాలుష్యాన్ని కనుగొనే యాప్‌కు రూపమిచ్చింది. కేవలం పదహారేళ్ల వయసులో ఆమె సాధించిన ఈ విజయాన్ని ఎమ్ఐటి (మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ)లోని లింకన్ ల్యాబరేటరీ, ఐఏయూ (ఇంటర్నేషనల్ ఆస్ట్రనామికల్ యూనియన్) అబ్బురపడ్డాయి. పాలపుంతలోని పేరులేకుండా ఉన్న ఎన్నో చిన్నగ్రహాల్లో ఒకదానికి ఆమెపేరును ఖాయం చేసి సాహితికి అపూర్వ సత్కారాన్నిచ్చాయి. సంకల్పం ఉంటే సాధించలేనిది లేదు.. ఆకాశం కూడా హద్దు కాదఅని నిరూపించింది. ఈ ఘనతే బయోగ్రఫీకి ఎంచుకునేలా చేసింది. కుటుంబం.. సాహితి తండ్రి గోపాల్ పింగళి.. సైంటిస్ట్, ఐబీఎమ్ వైస్ ప్రెసిడెంట్. అరుణ.. భరతనాట్య కళాకారిణి, నాట్య గురువు. కొన్నాళ్లు అమెరికాలో ఉన్నారు. సాహితీ అక్కడే పెరిగింది. ఆమెకు ఇద్దరు చెల్లెళ్లు లలిత, శ్రీకరి. సాహితి మొదటి నుంచీ చురుకైన పిల్లే. అయిదు, ఆరు తరగతుల్లోనే రచయిత కావాలనుకుంది. తర్వాత సైన్స్, మ్యాథ్స్, ఎన్విరాన్మెంటల్ సైన్స్ అంటే ఇష్టం పెంచుకుంది. ‘ఇక్కడి కన్నా అమెరికాలో పర్యావరణ స్పృæ ఎక్కువ. అక్కడే పెరగడం వల్లేమో మరి నాకు ఎన్విరాన్మెంటల్ సైన్స్ అంటే ఇంట్రెస్ట్ ఎక్కువైంది’ అని చెప్తుంది. ప్రస్తుతం మిషిగన్ సివిల్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ఇంటర్న్‌షిప్ చేస్తోంది. నింగిలో నిలబెట్టింది ‘మా కుటుంబంలోని వాళ్లెవరైనా ఎప్పుడైనా ఇలా అంతర్జాతీయ సదస్సుకు మన దేశం తరపున ప్రాతినథ్యం వహిస్తారని ఎన్నడూ ఊహించలేదు. సాహితి వల్ల ఊహించనిది నిజమైంది. ఈ సంతోషాన్ని పంచుకోవడానిక మాటలు రావడంలేదు. ఇప్పుడు నా కూతురు ఇండియా తరపున ఈ విజయం సాధించింది. తండ్రినైన నాకూ స్ఫూర్తినిచ్చింది నా బిడ్డ. మా కుటుంబం పేరును నింగిలో నిలబెట్టింది’ అంటూ పుత్రికోత్సాహం పొందుతున్నాడు సాహితి తండ్రి గోపాల్. క్లాస్ పుస్తకాలు పక్కన పడేసి.. ఈ పరిశోధనలో నిమగ్నమైతే.. మా పిల్లకు పిచ్చిపట్టిందనుకున్నాం నేను, నా భార్య’అంటూ సాహితి పరిశోధనా రోజులను గుర్తు చేసుకున్నారాయన. సాహితి ఒక్కతే కాదు ఈ తరం పిల్లలంతా పర్యావరణ స్పృహతోనే ఉన్నారు’ అని ఆయన ఇప్పటి పిల్లలకు కితాబునిచ్చారు. కలర్‌కోడింగ్ సాహితి తయారు చేసిన యాప్ ప్రకారం... చెరువులోని నీరు బ్లూకలర్‌లో మార్క్ అయితే.. అవి తాగడానికి యోగ్యమైనవన్నమాట. ఉదా రంగులో మార్క్ అయితే స్నానానికి మాత్రమే పనికివస్తాయని అర్థం. పసుపు రంగులో మార్క్ అయితే చేపలు వంటి వాటికి మంచివని సూచన. ఇమాజిన్.. హౌ ద వరల్డ్ వుడ్ బీ విదవుట్ ఎనీ టెక్నాలజీ.. పర్ఫెక్ట్ షెడ్యూల్ ప్రకారమే వెళ్తుంది సాహితి. రోజువారీకార్యక్రమాలైనా.. అధ్యయనాలైనా! ఏ పనినైనా వారానికి ప్లాన్ చేసుకుంటుంది. మిన్ను విరిగి మీద పడ్డా ఆ ప్రణాళిక తప్పదు. ఉదయం నాలుగింటికే నిద్ర లేస్తుంది. రాత్రి తొమ్మిదింటికల్లా పడుకుంటుంది. పరీక్షలున్నా సరే. ఎనిమిదో తరగతిలోనే కాలేజ్ లెవల్ పుస్తకాలు చదివేది. ఇంటర్నేషనల్ సీనియర్ లెవెల్ పరీక్షలు రాసింది. తనకు నచ్చింది చదవడంలోనే స్వేచ్ఛను ఆస్వాదిస్తానంటుంది. పదేళ్ల వయసులో ‘ఇమాజిన్.. హౌ ద వరల్డ్ వుడ్ బీ విదవుట్ ఎనీ టెక్నాలజీ.. ఇమాజిన్.. దట్ దేర్ వర్ నో స్క్ర్యూ ఇఫ్ యు హాడ్ టు హోల్డ్ థింగ్స్ టుగెదర్.. దేర్ వుడ్ బీ నథింగ్ టు డూ యువర్ డెస్క్ వుడ్ బ్రేక్ అండ్ డోర్స్ వుడ్ ఫాల్ ఫ్లాట్.. ఇమాజిన్ ఆల్ ద ప్రాబ్లమ్స్ కాజ్డ్ బికాజ్ ఆఫ్ దట్’అని కవిత రాసి బ్లాగ్‌లో పోస్ట్ చేసింది. ఇప్పటి వరకు వీళ్లు... భారతీయుల్లో... సీవీ రామన్.. భౌతికశాస్త్రంలో నోబెల్గ్రహీత, గ్రహం పేరు.. 55753 రామన్.., టెంజింగ్ నార్గే.. ఎవరెస్ట్ అధిరోహి, గ్రహం పేరు.. 6481, రబీంద్రనాథ్ టాగూర్.. కవి.. గ్రహం పేరు.. 7855 టాగూర్, అనౌష్క శంకర్, సితార్ విద్వాంసురాలు, గ్రహం పేరు.. 292872, విశ్వనాథన్ ఆనంద్, చెస్ క్రీడాకారుడు.. గ్రహం పేరు.. 4538 విశ్యానంద్, మాధవ్ పాఠక్.. బ్రెయిలీస్లేట్ను ఆ«ధునీకరించినందుకు.. గ్రహం పేరు.. 12509 పాఠక్, విష్ణు జయప్రకాష్, మైక్రోబయెల్ ఫ్యూయెల్ సెల్‌ను కనుగొన్నందుకు, గ్రహం పేరు.. 25620 జయప్రకాష్, మరికొందరు కూడా ఉన్నారు. బహుముఖ ప్రజ్ఞ... సాహితీ పింగళి... చదువులో ఫస్ట్. ఆటల్లో మేటి. సంగీతం అంటే ప్రాణం. పియానో, వీణ వాయిస్తుంది. భరతనాట్య కళాకారిణి కూడా. ‘డాన్స్చేసేటప్పుడు అందులో నిమగ్నమైపోతుంది’ అని చెప్తుంది సాహితి తల్లి అరుణ. హ్యారీపాటర్ అంటే పిచ్చి ఇష్టం. హారీపాటర్లో ఉన్నట్టు నిజంగా కూడా మ్యాజికల్ బీస్స్›్ట ఉంటే ఎంత బాగుండు. అవి మన చెరువులన్నీ శుభ్రం చేసేవి’ అని కళ్లు ఇంతింత చేసుకొని చెప్తుంది ఈ కుర్ర శాస్త్రవేత్త. ప్లాస్టిక్ మగ్గు.. మొబైల్ యాప్ ‘అవర్ లేక్స్.. అవర్ వాయిస్’లో తమ చుట్టూ ఉన్న చెరువులను పరిశీలించేందుకు సాహితికి ఒక టీమ్ ఉండేది. ప్రతి శని, ఆదివారాలు తన జట్టు సభ్యులతో కలిసి వర్తూర్ చెరువుకు వెళ్లేది. బ్లూ, గ్రీన్ రంగు ప్లాస్టిక్ మగ్గు, జనపనారుతో అల్లిన తాడు తీసుకొని చెరువుకు వెళ్లేది. జాగ్రత్తగా మోకాళ్ల లోతు వరకు చెరువులోకి దిగేది. జనపనారు తాడుతో కట్టిన మగ్గుతో నీటిని చేదేది. ఇదంతా గమనిస్తున్న వాళ్లకు అదో పిల్ల చేష్టగా.. ఆటగా అనిపించేది. సాహితి నీటి మగ్గుతో ఇంటికి వెళ్లి మగ్గులోని నీటిని ఓ బాటిల్లో నింపేది. తాను చెరువుల నుంచి తెస్తున్న నీటిలోని కాలుష్యాన్ని పరీక్షించడానికి కావాల్సిన పరికరాల సేకరణ, ఆ ప్రాసెస్ వ్యయప్రయాసలతో కూడుకున్నదని అర్థమైంది. అప్పుడామె దృష్టి.. కాలుష్యాన్ని కనిపెట్టే పరికరాల పరిశోధన మీదకు మళ్లింది. అతి తక్కువ ఖర్చుతో సామాన్య జనానికి సైతం అందుబాటులో ఉండే పరికరం కావాలి. అది ఎప్పుడూ వెంట తీసుకెళ్లేట్టుగా బ్యాగ్‌లో, పర్సులో.. అరచేతిలో ఇమిడేట్టు ఉండాలి... ఎలా? ఆలోచించింది.. శోధించింది. మారిన టెక్నాలజీ ఊతంతో యేడాది శ్రమించింది. ఓ మోబైల్ యాప్‌ను తయారు చేసింది. మనం వాడుతున్న స్మార్ట్‌ఫోన్‌లో ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకుంటే చాలు.. ఎక్కడ ఏ చెరువును చూసినా.. అందులో కాలుష్యం ఎంతుందో ఇట్టే కనిపెట్టేయొచ్చు. నివారణకు మార్గం చూడొచ్చు. కొన్ని ఎలక్ట్రానిక్ సెన్సార్స్, కెమికల్ టెస్ట్ స్ట్రిప్స్‌తో ఈ యాప్ పనిచేస్తుంది. అంతేకాదు ఇలా కాలుష్యాన్ని పరీక్షించిన డాటా మొత్తం ఆన్లైన్ డాటా బ్యాంక్‌లో స్టోర్ అవుతుంది. పాలపుంతలోపేరు సాహితి రూపొందించిన యాప్ స్కూల్ యాజమాన్యానికి బాగా నచ్చింది. ఈ యేడు గత నెలలో (జూన్) అమెరికా టెక్సాస్ రాష్ట్రంలోని హ్యూస్టన్‌లో జరిగిన ‘ది ఇంటర్నేషనల్ సస్టెయినబుల్ వరల్డ్ ఇంజనీరింగ్ ఎనర్జీ ఎన్విరాన్మెంట్ ప్రాజెక్ట్ ఒలింపియాడ్’కు పంపేందుకు సాహితి పేరును, ఆమె యాప్ వివరాలనూ పంపారు. ఎంపికైంది. అంతేకాదు ఆ సైన్స్ సదస్సుకు దేశం నుంచి ఎంపికైన యువ శాస్త్రవేత్తలందరికీ పదహారేళ్ల ఆ అమ్మాయే నేతృత్వం వహించింది. సదస్సు ప్రారంభమైంది. మొత్తం 62 దేశాల నుంచి యువప్రతినిధులు హాజరయ్యారు వాళ్ల ప్రాజెక్ట్స్‌తో. పర్యావరణ పరిరక్షణ కోసం చేసిన అధ్యయన పత్రాలు, పరికరాలతో ఉత్సాహంగా పాల్గొన్నారు. అవన్నీ చూస్తుంటే మన యువకిశోరాలకు లోపల కొంచెం బెరుకు, భయంగానే ఉంది. కాని సాహితిలో మాత్రం చెదరని చిరునవ్వు. పోతపోసిన ఆత్మవిశ్వాసం. వచ్చిన నిపుణులకు తన యాప్ గురించి వివరించింది .. ప్రెజెంటేషన్ ఇచ్చింది తొణక్కుంగా.. బెణక్కుండా! కొన్ని క్షణాలు.. ఎక్స్పర్ట్స్ చప్పట్లు కొట్టడం ప్రారంభించారు. అంతే వేల కరతాళ ధ్వనులు మారుమ్రోగాయి. ఆ పోటీలో ఇన్నోవేటివ్ రీసెర్చ్ విభాగంలో సాహితికి బంగారు పతకం బహుకరిస్తున్నట్టు వెల్లడించారు. కరతాళ ధ్వనులు మిన్నంటాయి. సాహితిలో.. అదే చిరునవ్వు.. అంతే ఆత్మవిశ్వాసం! తలవంచి వినమ్రంగా ధన్యవాదాలు తెలిపింది. అక్కడి నుంచి సాహితి మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలోని లింకన్ ల్యాబరేటరీ కొలాబరేషన్‌తో జరిగిన ఇన్టెల్ ఇంటర్నేషనల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఫెయిర్ (ఇంటెల్ ఐఎస్ఈఎఫ్)లో పాల్గొంది. ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మాకమైన ప్రీకాలేజ్ సైన్స్ కాంపీటీషన్. ఇందులో ఆమె ప్రాజెక్ట్‌ను చూసిన మహుమహులంతా .. ముక్కుపచ్చలారని ఈ పిల్లేంటి? ఈ అచీవ్మెంట్ ఏంటి అని ఆనందశ్చర్యాలకు లోనయ్యారు. ఆరిజోనా స్టేట్ యూనివర్శిటీ, సౌదీ అరేబియా కింగ్ ఫౌండేషన్ ఫర్ గిఫ్టెడ్నెస్ అండ్ క్రియేటివిటీ, యూఎస్ ఎజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ వాళ్ల ప్రత్యేకమైన అవార్డులూ పొందింది. ఆ తర్వాత కొద్ది సమయంలోనే మరో వార్త.. ఐఏయూ, ఎమ్ఐటీ నుంచి.. పాలపుంతలోని ఒక గ్రహానికి ఆమె పేరును ఖరారు చేస్తున్నట్టు. అప్పుడు సాహితి ఆడియెన్స్ గ్యాలరీలో తన చెల్లెళ్లిద్దరి మధ్య కూర్చొని ఉంది. ఆ మాట విన్నవింటనే ప్రపంచంలో చావడానికి సిద్ధంగా ఉన్న చెరువలన్నీ ఒక్కసారిగా ఉత్తేజితమయ్యాయి. ఆక్సిజన్ లెవెల్స్ సమస్థాయికి వచ్చినట్టు తరంగాలు .. తెరలుతెరలుగా.. కదిలాయి! గాలితో సయ్యాటలాడుతూ సందడి చేశాయి. నిజానికి అంత పెద్ద సత్కారం.. ఆ చిన్నపాపను ఆకాశానికి ఎత్తేయాలి. కాని సాహితి.. ఎప్పటిలాగే చిరునవ్వు. అదే సమయంలో... సాహితి చదివిన ఇన్వెంచర్ అకాడమీలో ఆ రాత్రి (భారతకాలమానం ప్రకారం) యాన్యువల్ స్లీప్ ఓవర్‌కోసం గ్యాదర్ అయిన 700 మంది విద్యార్థులు హ్యూస్టన్‌లో తమ స్కూల్‌మేట్ పొందిన సన్మానం చూసి రోమాంఛితులయ్యారు. ఆ పిల్లల హర్షధ్వానాలతో అకాడమీ పులకించిపోయింది. ‘ఇక నుంచి టెలిస్కోప్‌లో సాహితిని చూస్తాం..’ అన్నారు అకాడమీలోని సాహితీ మిత్రులు! చదువు.. చెరువు సాహితి కుటుంబం న్యూయార్క్ నుంచి బెంగళూరుకు మారాక.. బెంగుళూరులోని ఇన్వెంచర్ అకాడమీ స్కూల్లో చేరింది. దేశంలోని బెస్ట్ ఇంటర్నేషనల్ స్కూళ్లలో ఇది ఒకటి. పాఠాలతోపాటు ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలు, సామాజిక బాధ్యత కూడా పాఠ్యాంశాల్లో భాగమే. పిల్లల్లో సామాజిక స్ప్రహ పెంచే కార్యక్రమమైన ‘చేంజ్ మేకింగ్ ఇనిషియేటివ్’ లో పాలుపంచుకునేది సాహితి. కైకొండ్రహళ్లి చెరువును పరిశీలించడం.. ముందు అదొక మురికికాలువలా ఉండి.. తర్వాత మంచి నీటి చెరువుగా మారడం.. ఇవన్నీ ఆమె ‘చేంజ్ మేకింగ్ ఇనిషియేటివ్’లో భాగమైన ‘అవర్ లేక్స్ అవర్ వాయిస్’లో చేరింది. బెంగళూరులోని అత్యంత కాలుష్యమైన వర్తూర్, బెళందూర్ చెరువులను ఎన్నుకుంది. ముందుగా వర్తూర్ చెరువు మీద దృష్టి కేంద్రీకరించింది. – శరాది -
ప్రపంచీకరణతో పెట్టుబడిదారీ వ్యవస్థ బలోపేతం
సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత శివశంకర్ రాజమహేంద్రవరం కల్చరల్ (రామమహేంద్రవరం సిటీ) : ప్రపంచీకరణతో పెట్టుబడీదారి వ్యవస్థ బలోపేతమై సామాజిక జీవితం ధ్వంసమైందని సాహిత్య అకాడమీ పురస్కారగ్రహీత డాక్టర్ పాపినేని శివశంకర్ అన్నారు. సాహితీగౌతమి ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ప్రపంచీకరణపై ప్రసంగించారు. దీంతో అంతటా నైతిక అంధత్వం వ్యాపించిందన్నారు. మీటనొక్కితే విశ్వవ్యాప్త సమాచారం లభిస్తోందని అయితే సమాచారం, విజ్ఞానం వేర్వేరన్నారు. రాజధాని నిర్మాణం పేరిట వేలాది పంట పొలాలను సేకరిస్తోన్న ప్రభుత్వం ఉద్యోగాలు వస్తాయని చెబుతోందని, కొన్ని ఉద్యోగాలు రావచ్చేమో కాని పరిశ్రమల వల్ల వచ్చే రూ.కోట్ల ఆదాయం ఎవరి జేబులోకి వెడుతోందని ప్రశ్నించారు. సజ్జ, జొన్నరొట్టె, రాగి సంగడికి బదులు వచ్చిన జంక్ ఫుడ్‌తో ఆరోగ్యాలు ధ్వంసమవుతున్నాయన్నారు. ప్రపంచీకరణ వలన ఉద్యోగ భద్రత, స్థిరత్వం పోయాయని, అతి పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ ఉద్యోగికి తెల్లారేటప్పటికి ఉద్వాసన వచ్చే పరిస్థితి ఏర్పడందని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగం తీసేస్తే కోర్టుకు వెళ్లే హక్కు ఉంటుందన్నారు. అమెరికాలో ఉద్యోగి జీవితకాలంలో కనీసం 11 ఉద్యోగాలు మారతాడన్నారు. ప్రపంచం ఎట్లా ఉంది? ఎలా ఉండాలి? అనే అంశంపై దృష్టి సారించాలని ఆయన కోరారు. సాహితీ గౌతమి వ్యవస్ధాపకుడు పి.విజయకుమార్, ఆదిత్య విద్యాసంస్థల డైరెక్టర్ ఎస్పీ గంగిరెడ్డి, కమ్యూనిస్టు, హేతువాది వెలమాటి సత్యనారాయణ, అరసం జాతీయ కార్యదర్శి పెనుగొండ లక్ష్మీనారాయణ, ప్రముఖ పర్యావరణ వేత్త తల్లావఝుల పతంజలి శాస్త్రి, రాష్ట్రపతి పురస్కార గ్రహీత చింతలపాటి శర్మ, విద్యార్థులు హాజరయ్యారు. -
అరవిరిసిన నాట్యపారిజాతం
కృష్ణసాహితి కూచిపూడి అరంగేట్రం రాజమహేంద్రవరం కల్చరల్: పువ్వు పుట్టగానే పరిమళించింది. మూడో తరగతి విద్యార్థిని కడియం కృష్ణసాహితి తన హావభావాలు, అభినయాలతో ప్రేక్షకులకు కనువిందు చేసింది. ధవళేశ్వరానికి చెందిన శ్రీరాధాకృష్ణ సంగీత నృత్య కళాక్షేత్ర ఆధ్వర్యంలో శిక్షణ పొందుతున్న కృష్ణసాహితి కూచిపూడి రంగప్రవేశం (అరంగేట్రం) ఆదివారం సాయంత్రం రివర్‌బే ఆహ్వానం హాలులో ఘనంగా జరిగింది. ’గం గణపతికివే నా ప్రణతులు’ (గణపతి కౌతం), ’వలచి వచ్చియున్నానురా’ (నవరాగమాలిక వర్ణం), బాలగోపాల (తరంగం), మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ (దశావతార శబ్దం), జయజయ దుర్గే (దుర్గాసూక్తి), ’నారాయణ తే నమోనమో’ (అన్నమయ్య కీర్తన), ధిరతాన ధీంతా (తిల్లాన)లకు ఆమె చేసిన నృత్యాభినయం ప్రేక్షకుల కరతాళ ధ్వనులను అందుకుంది. కృష్ణసాహితిని అతిథులు, నిర్వాహకులు సత్కరించారు. ముందుగా నాట్యాచారిణి గోరుగంతు ఉమాజయశ్రీకు కృష్ణ సాహితి గురుపూజ నిర్వహించింది. శ్రీ రాధాకృష్ణ సంగీత, నృత్యకళాక్షేత్ర విద్యార్ధులు బృందగానాలు ఆలపించారు. ప్రియాంక వ్యాఖ్యాతగా వ్యవహరించారు. సంస్థ డైరెక్టర్ జి.రాధాకృష్ణ స్వాగత వచనాలు పలికారు. కళారత్నహంస అవార్డు గ్రహీత డి.రాజకుమార్ వుడయార్, హైదరాబాద్‌కు చెందిన నాట్యకళాకారిణి డాక్టర్ పి.ఇందిరా హేమ, కూచిపూడి నాట్యకళాకారుడు పసుమర్తి శ్రీనివాసు, అయినవిల్లి సర్పంచ్ కె.రామచంద్రమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
సాహితీ నర్తనం
ఎల్కేజీలో గజ్జె కట్టి.. మూడేళ్లలో 45 ప్రదర్శనలిచ్చి.. పదుగురి ప్రశంసలు అందుకుని.. నేడు అరంగేట్రానికి సిద్ధమైన కృష్ణసాహితి రాజమహేంద్రవరం కల్చరల్ : కృష్ణసాహితి కాలికి గజ్జె కట్టింది ఎల్కేజీ రోజుల్లో.. మూడో తరగతికి వచ్చేసరికి ఆమె ఇచ్చిన ప్రదర్శనలు 45.. గోదావరి, కృష్ణ పుష్కరాల్లో ఆమె నాట్య ప్రదర్శన ప్రజల ప్రశంసలందుకుంది. ఆసక్తి ఎలా కలిగిందంటే.. జిల్లాలోని అయినవిల్లి గ్రామంలో 2007 అక్టోబర్ రెండున కృష్ణసాహితి జన్మించింది. తండ్రి వీరవెంకట సుబ్రహ్మణ్యం, తల్లి సత్యకుమారిలకు నాట్యంలో అభినివేశం లేకపోయినప్పటికీ చిన్ననాడే రాజమండ్రి వచ్చిన ఆ చిన్నారి నగరంలో అనునిత్యం జరిగే నాట్య ప్రదర్శనలు చూసి ఆ రంగంపై మక్కువ పెంచుకుంది. ఆమె ఆసక్తికి తల్లితండ్రులూ చేయూతనివ్వడంతో ధవళేశ్వరానికి చెందిన శ్రీరాధాకృష్ణ సంగీత నృత్య కళాక్షేత్రలో చేరి కూచిపూడి నేర్చుకుంది. కృష్ణసాహితిలోని ప్రతిభను గుర్తించిన సంస్థ వ్యవస్థాపకుడు రాధాకృష్ణ ఆనం కళాకేంద్రంలో తమ బ్యానర్‌పై ప్రదర్శించిన నక్షత్రమాలికా చరితంలో ఆమెకు తొలిసారిగా శ్రీకృష్ణునిగా నర్తించే అవకాశం ఇచ్చారు. మూడో తరగతికి వచ్చేనాటికి 45 ప్రదర్శనలు గోదావరి ఆది, అంత్యపుష్కరాలు, విజయవాడలో కృష్ణాపుష్కరాల్లో సైతం ఆమె నర్తించి ఎన్నో పురస్కారాలు అందుకుంది. ప్రదర్శనలలో పాల్గొని కృష్ణసాహితి ఎన్నో పురస్కారాలను అందుకుంది. గణపతి కౌతం, నవరాగమాలిక వర్ణం, తరంగం, దశావతార శబ్దం, దుర్గాస్తుతి, అన్నమయ్య కీర్తనలు, థిల్లాన తదితర అంశాలపై ఆమె చక్కని పట్టు సాధించి తొలిసారిగా ఆదివారం కూచిపూడి అరంగేట్రానికి సిద్ధమవుతోంది. ఈ అంశాలపై పట్టు సాధించినప్పుడే కూచిపూడి నాట్యం సంపూర్ణంగా అభ్యసించినట్టు నాట్యకోవిదులు భావిస్తారు. నేడు హేమాహేమీల సన్నిధిలో: ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు రివర్‌బే హోటల్ వేదికపై కృష్ణసాహితి నాట్యానికి ప్రియాంక వ్యాఖ్యాతగా పాల్గొననున్నారు. హైదరాబాద్‌కు చెందిన డాక్టర్.పి.ఇందిరా హేమ, ప్రఖ్యాత కూచిపూడి నాట్యాచార్యుడు పసుమర్తి శ్రీనివాసులు, ఇతర నాట్యరంగ ప్రముఖులు, ప్రముఖ శిల్పి రాజకుమార్ ఉడయార్ తదితరులు ఈ చిన్నారికి ఆశీస్సులు అందజేయనున్నారు. -
పదసౌకమార్యం... పారిజాతాప హరణం
భావ పరిమళాల జల్లు భువన విజయం సాహితీ ప్రసంగంలో డాక్టర్ రాఘవేంద్రరావు రాజమహేంద్రవరం కల్చరల్ : శ్రీకృష్ణదేవరాయల అష్టదిగ్గజాలలో ఒకరైనంది తిమ్మన రచించిన పారిజాతాపహరణ ప్రబంధాన్ని భామా విజయంగా, సత్యభామా విజయంగా పేర్కొనవచ్చునని రిటైర్డ్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్.వి.రాఘవేంద్రరావు తెలిపారు. నన్నయ వాజ్మయ వేదిక, పద్యసారస్వత పరిషత్, జిల్లా శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ఆదిత్య డిగ్రీ కళాశాల ఆడిటోరియంలో నిర్వహిస్తున్న భువన విజయ సాహితీ ప్రసంగ పరంపరలలో భాగంగా, సోమవారం ఆయన పారిజాతాపహరణంపై ప్రసంగించారు. పదసౌకుమార్యానికి, భావ పరిమళాలకు నంది తిమ్మన రచన అచ్చంగా పారిజాతమేనని ఆయన అభివర్ణించారు. 'అల్లసానివారి’ అల్లిక జిగిబిగి, ముక్కుతిమ్మనార్యుని ముద్దుపలుకు, పాండురంగవిభుని పదగుంభనంబు' అని ఒక చాటువు ఆయా కవులరచనా విశిష్టతను తెలియచేస్తున్నదని రాఘవేంద్రరావు తెలిపారు. తెలుగు సాహిత్యంలో పదిమంది అగ్రప్రబంధ నాయకులలో సత్యభామ ఒకరన్నారు. ఆభిజాత్యం, అభిమానం, ఆత్మీయత, కోరికను సాధించుకునే పట్టుదలలో ఆమెకు ఆమే సాటి అని ఆయన చెప్పారు. ఐదు ఆశ్వాసాలలో, 512 పద్యగద్యాలలో నందితిమ్మన పారిజాతాపహరణం ప్రబంధాన్ని విరచించాడని, హరివంశంలో ఒక చిన్న కథ దీనికి ఆధారమని ఆయన తెలిపారు. ఆంధ్ర సాహిత్యంలో మూడు ప్రసిద్ధి చెందిన ఏడుపు పద్యాలు ఉన్నాయని చెప్పారు. అల్లసాని పెద్దన మనుచరిత్రలో వరూధిని అల్లిబిల్లిగా ఏడ్చింది. భట్టుమూర్తి వసుచరిత్రలో గిరికాదేవి బావురుమని ఏడ్చింది. నందితిమ్మన పారిజాతాపహరణంలో సత్యభామ ముద్దుముద్దుగా ఏడిచిందని ఆయన పేర్కొన్నారు. పద్యాలను రాగ, భావయుక్తంగా ఆలపించి రాఘవేంద్రరావు సాహిత్యాభిమానులను ఆకట్టుకున్నారు. సభకు అధ్యక్షత వహించిన కళాగౌతమి వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ బి.వి.ఎస్.మూర్తి మాట్లాడుతూ తెలుగుభాషను బతికిస్తున్నది ప్రవాసాంధ్రులు, విదేశాలలో ఉన్న తెలుగువారేనని తెలిపారు. పారిజాతాపహరణంలో నిజమైన గెలుపు సత్యభామది కాదని, రుక్మిణిదేనని ఆయన చెప్పారు. చింతలపాటి శర్మ, జోరా శర్మ, మంగళంపల్లి పాండురంగ విఠల్ తదితరులు హాజరయ్యారు. నేటి భువన విజయంలో అందరూ మహిళలే అమలాపురానికి చెందిన ద్విశతావధానిని ఆకెళ్ళ బాలభాను మొల్లరామాయణంపై మంగళవారం ప్రసంగిస్తారు. కార్యక్రమంలో పాల్గొనే అతిథులంతా మహిళలే కావడం విశేషం -
‘ఆస్తి కోసమే సాహితిని హతమార్చారు’
హైదరాబాద్ : నగరంలోని బోడుప్పల్లో 17 ఏళ్ల సాహితి అనే యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆమెను ఆస్తి కోసం మేనత్త, మేనమామ హత్య చేశారని సాహితి తరపు బంధువులు ఆరోపిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా మేడిపల్లికి చెందిన సాహితి చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయి నానమ్మతో కలిసి ఉంటోంది. అయితే మేనమామ నివాసానికి వచ్చిన సాహితి గతరాత్రి బాత్రూమ్లో జారిపడి మృతి చెందినట్లు ఆమె మేనత్త చెప్పటం పలు అనుమానాలకు తావు ఇస్తోంది. అంతేకాకుండా గుట్టుచప్పుడు కాకుండా మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా మరో పదిరోజుల్లో సాహితికి మైనార్టీ తీరునున్న నేపథ్యంలో ఆస్తి కోసమే హతమార్చినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
‘ఆస్తి కోసమే సాహితిని హతమార్చారు’
-
వెలుగులకు తొలి చిరునామా చిరునవ్వేనమ్మా...
పాటతత్వం ‘వెంకీ’ సినిమాలో హీరో ఫ్రెండ్స్‌తో ఆడిపాడే ఓ మాస్ సాంగ్ రాయాలి. ట్యూన్ కూడా రెడీ. సాధారణంగా దేవిశ్రీ ప్రసాద్ పాటలకు మొదటి లైన్లను తనే సూచిస్తాడు. అలానే, ఈ పాటలోని పల్లవి మొదటి లైన్లను చెప్పేశారు. రెండు, మూడు రోజులు పట్టింది. వెంటనే దేవికి పాట పంపించేశాను. కట్ చేస్తే, దేవి చెప్పిన లైన్లను అస్సలు వాడలేదు. ‘సిలకేమో శీకాకుళం...’ లైన్‌తో మొదలయ్యేలా పాట రాశాను. దేవి శ్రీప్రసాద్కి తెగ నచ్చేసింది. ఈ సినిమా కోసం రెండు పాటలు రాయిద్దామనుకున్న దేవిశ్రీ ప్రసాద్-దర్శకుడు శ్రీనువైట్ల మిగతా పాటలన్నీ నాతోనే రాయించేద్దామని నిర్ణయించుకున్నారు. ఆ నేపథ్యంలోనే ఓ మంచి పాట రాసే అవకాశం వచ్చింది. హీరోయిన్ తండ్రి చనిపోతాడు. ఒక పక్క విలన్ల నుంచి అపాయం, ఇంకో పక్క తనకు ఎవరూ లేరన్న ఫీలింగ్... ఈ సమయంలోనే హీరో ఆమెకు తోడుగా ఉంటాడు. ఈ క్రమంలోనే ఆమె పుట్టినరోజు వస్తుంది. అమ్మా, నాన్న తానై పెంచిన తండ్రి లేడు... ఇలా నిరాశలో కూరుకుపోయిన హీరోయిన్ మనసుకు ఊరట కలిగేలా ఓ పాట రాయాలి. అదేదో కష్టమైన పదాలతో కాకుండా చాలా సింపుల్‌గా అందరికీ కనెక్ట్ కావాలి. అనగనగా కథలా ఆ నిన్నకు సెలవిస్తే/అరె కనులను వెలిగించే ప్రతి ఉదయం మనదేలే కొన్ని అనుకోని సంఘటనల కారణంగా సాఫీగా సాగుతున్న జీవితంపై కారు చీకట్లు కమ్ముకుంటాయి. ఆ ఆలోచనలతో నిత్యం మనసొక చితి మంటగా మారుతుంది. అప్పుడే వాటిని తట్టుకుంటూ, వారు మిగిల్చిన జ్ఞాపకాలతో మరింత మానసిక స్థైర్యంతో జీవితంలో ముందుకు సాగాలి. ఓ కథలా జరిగిన విషాదాన్ని మర్చిపోయి, నిన్నటికి సెలవిచ్చేసి, రేపటి కోసం కొత్త ఆలోచనలు... కొత్త మనసులకు చోటివ్వాలి. లోకాన చీకటిని తిడుతూనే ఉంటామా/ఓ చిన్నదీపాన్ని వెలిగించుకోలేమా? ఆ వెలుగులకి తొలి చిరునామా అది ఒకటే చిరునవ్వేనమ్మా! పగలు, రాత్రి ఇవన్నీ ప్రకృతిలో ఎంత సహజమో... కన్నీళ్లు, కష్టాలు, సంతోషాలు... ఇవన్నీ జీవితంలో మనకెప్పుడూ ఎదురయ్యేవే. కానీ, బాధ వచ్చినప్పుడు మాత్రం దాన్ని చిరునవ్వుతో తుడిచేయాలి. బాధలో కన్నులే కందినంత మాత్రాన... పోయిన కాలమూ పొందలేముగా! రేగిన గాయమే ఆరనంత మాత్రాన... కాలమే సాగక ఆగిపోదుగా! జీవితంలో ఎన్నో జరుగుతూ ఉంటాయి. కొన్ని కదిలించేవి, కొన్ని మురిపించేవైతే, ఇంకొన్ని వ్యథగా మిగిలిపోయేవి. వాటిని తలుచుకుంటూ నిన్నటిలోనే ఉండిపోతే, ఇక భవిష్యత్తుకు చోటేది? ఇప్పటికీ చాలా మందిలో జరుగుతున్న మానసిక సంఘర్షణ ఇది. రేగిన గాయాన్నే తలుచుకుంటూంటే, జరిగిన వాటిని సరిదిద్దలేం... వచ్చే కాలాన్ని ఆపలేం. అరె ఈ నేలా ఆకాశం ఉందే మన కోసం వందేళ్ల సంతోషం అంతా మన సొంతం ఈ సరదాలు ఆనందాలు అలలయ్యేలా అల్లరి చేద్దాం! ఎవరైనా కష్టాలు అనే అధ్యాయం దగ్గరే ఆగిపోతే... ఇక జీవితంలో రానున్న సంతోషాలను అనుభవించేదెవరు? సంతోషాలకు పునాదులు వేసేవే కన్నీళ్లు... కష్టాలు... అవి లేకపోతే జీవితం విలువ ఎవరికీ తెలీదు. ఎందుకో ఏమిటో ఎంత మందిలో ఉన్నా నా ఎదే నీ జతే కోరుతుందిగా! ఒంటరి దారిలో నాకు తోడువైనావు ఎన్నడూ నీడగా వెంట ఉండ వా! అయినవాళ్లు దూరమైన బాధ నుంచి ఓ మంచి స్నేహితుడు దొరికాడన్న ఆనందం హీరోయిన్‌కి లభిస్తుంది. ఆ స్నేహం కాస్తా ప్రేమగా మారుతుంది. అప్పటివరకూ ‘నీకు భరోసాగా నేనుంటా’ అని ఓ స్నేహితుడిలా లాలించిన హీరో తర్వాత ఆమె మనసులో ప్రియుడిగా కూడా స్థానం సంపాదించుకుంటాడు. ఈ క్రమంలో ఒంటరిగా మిగిలిన హీరోయిన్‌కి భరోసా ఇచ్చే పాటలా మొదలై, తర్వాత ఈ ఇద్దరూ పాడుకునే ప్రేమగీతంలా మారడం ఈ పాట ప్రత్యేకత. హే కలలే నిజమైనాయి... కలలే ఒకటయ్యి కలిపేస్తూ నీ చెయ్యి..అడుగే చిందెయ్యి మన స్నేహాలు సావాసాలు కలకాలాలకు కథ కావాలి మరో ప్రత్యేకత ఏంటంటే.. ఈ ప్రేమికులిద్దరికీ స్నేహితులు కూడా జతకలిసి, వాళ్ల ప్రేమ సక్సెస్ అయినందుకు ఆనందంగా పాడతారు. సంతోషాన్ని పంచుకోవడానికి ఎవరైనా ఉంటారు. కానీ బాధలను పంచుకునే స్నేహితులు తోడుగా ఉంటే ఎంత కష్టమైనా బలాదూర్. ఈ సినిమాలో హీరోకు కూడా ఇలాంటి స్నేహితులే ఉంటారు. తమ ఫ్రెండ్ లవ్ సక్సెస్ అయితే అంతకు మించిన ఆనందం ఏముంటుంది? అదే ఈ లైన్లలో వ్యక్తం చేశాను. ప్రతి లైన్ ఎండింగ్‌లోనూ స్ఫూర్తి కలిగించేలా ఓ మాట వచ్చేలా జాగ్రత్త తీసుకున్నా. దేవిశ్రీ ప్రసాద్‌ను చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు ఒకసారి చూశాను. మళ్లీ సంగీత దర్శకుడు అయ్యాక ‘వెంకీ’ సినిమా కోసం కలిశాను. ఈ సినిమా కోసం దేవిశ్రీ ప్రసాద్, నేను ఎంతో కష్టపడ్డాం. తెల్లవారుజామున రెండు గంటలకు ఫోన్ చేసి ఇంకా ఏదైనా చేస్తే బాగుంటుందేమో అని దేవి అడిగేవాడు. ఇలా చివరి నిమిషం వరకు పనిచేసిన మాకు ఈ సినిమా పాటల రిజల్ట్ ఇచ్చిన సంతోషం అంతా ఇంతా కాదు. ‘వెంకీ’ ముందు వరకూ నా కెరీర్ కాస్త కుదుపుల్లో ఉంటూ వచ్చింది. ‘వెంకీ’ నన్ను తెలుగు సినీ పరిశ్రమకు కొత్తగా పరిచయం చేసి, నాకు మరెన్నో మంచి పాటలు రాసే అవకాశం కల్పించింది. సేకరణ: శశాంక్.బి -
ఇదేం బాల్యం
ఎగిరిపోతే ఎంత బాగుంటుంది.. గుండె గుబులుని గంగకు వదిలి.. ముందు వెనుకలు ముంగిట వదిలి.. గదులను వదిలి, ముడులను వదిలి.. గడబిడలన్నీ గాలికి వదిలి ఎగిరిపోతే ఎంత బాగుంటుంది’ సాహితి గారు రాసిన ఈ పాట వినగానే పెద్దవాళ్లందరికీ ఏ బాదరబందీలు లేని బాల్యంలోకి ఎగిరిపోవాలనిపిస్తుంటుంది. నిజం చెప్పండి.. ఈ తరం బాల్యంలో మీరు ఇమడగలరా..? బాల్యం అంటే బాధ్యతలెరుగని జీవితమని ఏదో మాటవరుసకు అంటున్నాం. కానీ, ఒక్కసారి ఇప్పటి బాల్యంలోకి తొంగి చూడండి.. కఠోరమైన వాస్తవం మిమ్మల్ని పలకరిస్తుంది. పేదరికం ముసురుకున్న చిన్నారుల గురించి కాదు నేను మాట్లాడుతున్నది. మన ఇంట్లో.. అపురూపంగా పెరుగుతున్న బాల్యం గురించి. గదులను వదిలి ముడులను వదిలి మన పిల్లలు ఎగిరిపోగలరేమో అని చిన్నారులను అడిగి చూడండి. పుస్తకాల బరువుకు నడుం వంగిపోతోందని రోజూ బాధపడే మనం ఆ వ్యవస్థను మార్చడానికి ముందుకురాము. పాఠశాలల్లో ఆటస్థలాలు లేవని ఏకరువు పెడతామే గానీ అది పిల్లల హక్కు అని గట్టిగా వాదించం. అవే పాఠశాలలకు పిల్లలను సంచుల్తో సహా బస్సుల్లో, ఆటోల్లో కుక్కి మరీ పంపిస్తాం. ఈ బాల్యానికి ఎగిరే స్థలం ఏది..? కనీసం నేల మీద ఆడుకునే ప్రదేశం ఎక్కడుంది ? బ్రాండెడ్ సంకెళ్లు.. ముందు వెనుకలు గాలికి వదిలి మన పిల్లలు ఎగిరిపోగలరేమో అడిగి చూడండి. వారు ఎగురగలరేమో కానీ, కట్టి పడేసింది మనమే. బ్రాండెడ్ బట్టలు, వస్తువులు లేనిదే బాల్యం అందంగా ఉండదని మనమే ముచ్చటపడతాం. ట్యాబ్‌లు, ప్యాడ్లు, ఫోన్లు, యాప్‌లు ఇవన్నీ స్మార్ట్ అని ప్రకటించే పెద్దరికం వీటిని వాడే పిల్లలు కూడా స్మార్ట్ అని సర్టిఫికెట్ ఇవ్వగలరా..? బొటన వేలు, చూపుడు వేలు మాత్రమే చలాకీగా ఉండే స్మార్ట్‌నెస్ మన పిల్లల్లో ఉందని మురిసిపోదామా..? పందెం కోళ్లు.. ర్యాంకుల పందెంలో పరుగెత్తుతున్న బాల్యం.. జీవిత పాఠాలు నేర్చుకునేది ఎప్పుడని ఆలోచించం. పౌల్ట్రీ ఫామ్స్‌లో కోళ్లలా అటూ ఇటూ సంచరించేందుకు వీల్లేని గదులు కేటాయించి.. కేవలం దాణా తింటూ వెనుక నుంచి గుడ్డు పెట్టే బ్రాయిలర్ కోడి జీవితం మన పిల్లల బాల్యం. అందుకే గుండెల్లో గుబులు పుట్టించే బాల్యం నుంచి త్వరగా ‘పెద్ద’వాళ్లమయిపోవాలనే ఆరాటంలో మన పిల్లలు అనవసరమైన పెద్దరికం పోకడలన్నీ అలవాటు చేసుకుంటున్నారు. 13 ఏళ్లు రాకుండానే ఈ-మెయిల్, ఫేస్బుక్, వాట్సప్‌లు తెరిచేస్తున్నారు. తెలిసీ తెలియని వయసులోనే ఇంటర్నెట్ వలలో చిక్కుకుపోతున్నారు. రెండు నిమిషాలు కళ్లలోకి కళ్లు పెట్టి నోరారా మాట్లాడేందుకు ఇష్టపడని టీనేజర్లు ప్రతి ఇంట్లో కనిపిస్తారు. కానీ, ప్రతిక్షణం సామాజిక నెట్‌వర్క్‌లో స్టేటస్ అప్డేట్ చేయడంలో మాత్రం ముందుంటారు. ఇంట్లో దొరకని ఐడెంటిటీ కోసం బయట వర్చువల్ ప్రపంచంలో పాకులాడే బాల్యం తయారవడానికి కారణం మనం కాదా! మసితనం మనకొద్దు.. ‘ఎగిరిపోతే ఎంత బాగుంటుందీ’ అని ఇప్పుడు పాడుతున్నది పెద్దలు కాదు తడబడుతున్న బాల్యం. ర్యాంకులే పరమావధిగా, బ్రాండులే గుర్తింపుగా, గాడ్జెట్లే ఆసరాగా భావించే తరాన్ని తయారు చేసిన పెద్దలందరికీ నమస్కారం. దయచేసి విద్యారంగంలో మార్పులకు స్వాగతం పలకండి. మార్కెట్ ఉధృతిలో బాల్యం కొట్టుకుపోకుండా కాపాడండి. పసితనంలోనే అమాయకత్వం కోల్పోయే మసకబారే బాల్యం మనకొద్దు. we want happy children.