సాక్షి, హైదరాబాద్: వైద్యపరికరాలు, మందుల (మెడికల్ డివైసెస్ అండ్ ఫార్మాసిటిక్స్)కు సంబంధించిన రెగ్యులేటరీ రైటింగ్ కంపెనీ క్రైటీరియన్ ఎడ్జ్ డైరెక్టర్ సాహితీ కొండపల్లిని ‘విమెన్ లీడర్స్ ఫోరం–2022’ అవార్డు వరించింది. మంగళవారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఆమె అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా ఆమెను విమెన్ లీడర్స్ ఫోరం జ్యూరీ టీమ్ అభినందించింది.
‘విమెన్ లీడర్ అవార్డ్ ఇన్ లీడర్‌షిప్’ కేటగిరీలో ఈ అవార్డును అందజేసినట్లు ఒక ప్రకటనలో తెలిపింది. సాహితి 40 మందికి పైగా మెడికల్ రైటర్స్ బృందానికి నేతృత్వం వహిస్తూ వివిధ లక్ష్యాల సాధనలో తమదైన పాత్రను, నైపుణ్యాలను చూపుతున్నారు. వైద్య, ఆరోగ్యరంగంలో ఆయా బృందాలకు నేతృత్వం వహిస్తూ నైపుణ్యాల అభివృద్ధిలో తోడ్పాటునందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment