‘సాక్షి సాగుబడి' రాంబాబు, 'సాక్షి టీవీ' కిషోర్ లకు ఉత్తమ జర్నలిస్టు అవార్డులు | Pantangi Rambabu and DVN Kishore Received Best Journalist Awards | Sakshi
Sakshi News home page

‘సాక్షి సాగుబడి' రాంబాబు, 'సాక్షి టీవీ' కిషోర్ లకు ఉత్తమ జర్నలిస్టు అవార్డులు

Published Wed, May 3 2023 4:14 PM | Last Updated on Wed, May 3 2023 5:39 PM

Pantangi Rambabu Received Best Print Agricultural Journalist Award - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘సాక్షి సాగుబడి’ ఇన్‌చార్జ్‌ పంతంగి రాంబాబు బుధవారం హైటెక్స్‌లో జరిగిన హైబిజ్‌ టీవీ మీడియా అవార్డ్స్‌ ఫంక్షన్‌లో తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలి చేతుల మీదుగా ఉత్తమ ప్రింట్‌ అగ్రికల్చరల్ జర్నలిస్ట్‌ పురస్కారాన్ని అందుకున్నారు. 37 ఏళ్లుగా పాత్రికేయుడిగా సేవలందిస్తున్న రాంబాబు గతంలో విశాలాంధ్ర, ఆంధ్రభూమి డైలీలో పనిచేశారు. గత 15 ఏళ్లుగా సాక్షిలో పనిచేస్తూ తెలుగు రాష్ట్రాల్లో ప్రకృతి వ్యవసాయం, సేంద్రియ ఇంటిపంటలు, సిరిధాన్యాల వ్యాప్తికి విశేష కృషి చేస్తూ ట్రెండ్‌ సెట్టర్‌గా పేరుగాంచారు.

ప్రతి మంగళవారం సాక్షి దిన పత్రికలో ప్రచురితమయ్యే ‘సాగుబడి’ పేజీని దశాబ్దకాలంగా రైతు జన రంజకంగా నిర్వహిస్తున్నారు. పన్నెండేళ్లుగా సేంద్రియ ఇంటిపంటలపై కథనాలు రాస్తూ ప్రాచుర్యంలోకి తెస్తున్న ఆయన గత సంవత్సరంగా ‘సాక్షి ఫన్‌డే’లో ప్రపంచవ్యాప్తంగా అర్బన్‌ అగ్రికల్చర్‌ పోకడలపై కాలమ్‌ రాస్తున్నారు. ప్రకృతి వ్యవసాయోద్యమ పితామహుడు పద్మశ్రీ పురస్కార గ్రహీత సుభాష్‌ పాలేకర్, స్వతంత్ర శాస్త్రవేత్త, పద్మశ్రీ పురస్కార గ్రహీత డా. ఖాదర్‌ వలి, మట్టి సేద్య నిపుణుడు పద్మశ్రీ పురస్కార గ్రహీత చింతల వెంకటరెడ్డి వంటి ఉద్ధండుల విశేష కృషిని తెలుగు ప్రజలకు విస్తృతంగా అందుబాటులోకి తేవటంలో రాంబాబు కృషి చేస్తున్నారు.

అదేవిధంగా, గ్రామీణులు, రైతు శాస్త్రవేత్తలు ఆవిష్కరించిన అనేక యంత్ర పరికరాలను వెలుగులోకి తేవడంలో విశేష కృషి చేసినందుకు నేషనల్‌ ఇన్నోవేషన్‌ ఫౌండేషన్‌ (ఎన్‌.ఐ.ఎఫ్‌.) 2017లో జాతీయ పురస్కారాన్ని న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో సాక్షి పత్రిక తరఫున రాంబాబు స్వీకరించిన విషయం తెలిసిందే. చేవెళ్ల ఎంపీ జి. రంజిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సాక్షి టీవీ న్యూస్ కాస్టర్ కిషోర్ తో పాటు వివిధ పత్రికలు, సోషల్ మీడియా సంస్థలు, శాటిలైట్ ఛానళ్లలో సేవలందిస్తున్న పాత్రికేయులు, ఫోటో, వీడియో జర్నలిస్టులు పలువురు పురస్కారాలు అందుకున్నారు.


 

ఇక సాక్షి టీవీలో సీనియర్ ప్రజంటర్ గా చేస్తోన్న DV నాగ కిషోర్ ఉత్తమ న్యూస్ ప్రజంటర్ గా అవార్డు అందుకున్నారు. 23 సంవత్సరాలుగా టెలివిజన్ రంగంలో న్యూస్ ప్రెజంటర్‍గా, అలాగే సీనియర్ జర్నలిస్ట్ గా పనిచేస్తున్నారు కిషోర్. రాజకీయ, సామాజిక అంశాలకు సంబంధించిన డిబేట్ లను సాక్షి టీవీ వేదికగా నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో పీజీతో పాటు ఎం.కాం., ఎంబీఏ చదువుకున్న కిషోర్, గతంలో రేడియో ప్రజంటర్ గా కూడా పని చేశారు. కర్ణాటక, రాజస్థాన్, ఢిల్లీతో పాటు పలు రాష్ట్రాల్లో రిపోర్టింగ్ చేసిన అనుభవం కిషోర్ కు ఉంది. తాజాగా కర్ణాటక ఎన్నికలపై క్షేత్ర స్థాయిలో పర్యటించి గ్రౌండ్ రిపోర్టులు అందించారు కిషోర్.

చదవండి: రోజుకు రూ. 1500.. ఎకరంన్నరలో ఏటా 4 లక్షలు! ఇలా చేస్తే లాభాలే!

విద్యార్థులకు స్కాల‌ర్ షిప్‌లు..
ఆర్థికంగా వెనుకబడిన మీడియా సిబ్బంది కుటుంబంలో చురుకైన విద్యార్థులకు హై బిజ్ టీవీ ఆస‌రాగా నిలిచింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి అలాంటి 10 మంది స్టూడెంట్స్ ను ఎంపిక చేసి వారికి రూ. 25 వేల స్కాల‌ర్ షిప్ ఇచ్చింది. రెసొనెన్స్ జూనియర్ కాలేజీల(ఐఐటీ-జేఈఈ, నీట్) స‌హ‌కారంతో ఈ ఆర్థిక సాయాన్ని అందించింది. ఈ సంద‌ర్భంగా రెసొనెన్స్ విజ‌య‌గాథ‌ను తెలియ‌జేసే కాఫీ టేబుల్ బుక్ ను మంత్రి మహమూద్ అలీ ఆవిష్క‌రించారు.

స్కాలర్ షిప్ పొందిన విద్యార్థుల వివ‌రాలు:
ఎన్. సాయిప్రియ - ప‌దో త‌ర‌గ‌తి (10 జీపీఏ) - జ‌డ్పీ స్కూల్ త‌ల‌మ‌డుగు, ఆదిలాబాద్ జిల్లా (D/O అశోక్ - రిపోర్ట‌ర్, ఆంధ్ర‌జ్యోతి)
ఇస్క‌ పునీత్ అభిషేక్, ఇంట‌ర్ (94.5%), హైద‌రాబాద్ (S/O రాజేశ్ బాబు - సూర్య డెయిలీ)
ఎం. త్రిశూల్, 9వ త‌ర‌గ‌తి (10 జీపీఏ), ప్రేర‌ణ కాన్సెప్ట్ స్కూల్, న‌ల్ల‌గొండ (S/O శ్రీనివాస్ - హ‌న్స్ ఇండియా)
ఎం. వేద స‌హ‌స్ర‌, ప్ర‌స్తుతం 9వ త‌ర‌గ‌తి, భాష్యం వ‌న‌స్త‌లిపురం, గ్రేడ్ ఏ-1 (D/O శ్రీనివాస్ - వీ6 కెమెరామెన్)
ఎం. హాసిని, 6వ త‌ర‌గ‌తి, శ్రీ చైత‌న్య టెక్నో, మెహ‌దీప‌ట్నం, ఏ+ (D/O పూర్ణ‌చంద‌ర్ - ఆర్ఎండి విభాగం, టైమ్స్ ఆఫ్ ఇండియా)
షేక్ ర‌మీజా, బీఎస్సీ (అగ్రిక‌ల్చ‌ర్) 3వ సంవ‌త్స‌రం, మ‌ల్లారెడ్డి యూనివ‌ర్సిటీ, ఏ+ (D/O షేక్ మ‌స్తాన్ - ఆంధ్ర‌జ్యోతి, రంగారెడ్డి ఎడిష‌న్)
పి. జైవంత్, 9వ త‌ర‌గతి, భ‌ద్రాచ‌లం ప‌బ్లిక్ స్కూల్, ఏ1 (S/0 పీవీ స‌త్య‌నారాయ‌ణ - హ‌న్స్ ఇండియా, ఖ‌మ్మం)
ఎ. స్ర‌వంతి, ఎంబీబీఎస్, ప్ర‌భుత్వ మెడిక‌ల్ కాలేజీ, న‌ల్ల‌గొండ (D/O శ్రీనివాస్ - జీ24 ఎక్స్ కెమెరామెన్)
హ‌జి హాసిని, ప‌దో త‌ర‌గ‌తి, టీఎస్ఎస్ డ‌బ్ల్యూ రెసిడెన్షియ‌ల్ స్కూల్, ఎక‌ర్ల‌ (D/O గోపీకుమార్, ఎక్స్ ప్ర‌జా శ‌క్తి, కామారెడ్డి)
పి. శ‌ర‌ణ్య‌, 5వ త‌ర‌గ‌తి, సెయింట్ ఆన్స్ తార్నాక‌, ఏ+ (D/O ప్ర‌వీణ్, వాయిస్ ఆఫ్ వ‌ర్డ్స్)
చదవండి: ప్రకృతిని, ఆవులను నమ్ముకున్నారు.. 40 సెంట్లు.. రూ.3 లక్షలు!

హెచ్.ఎం.ఎ-2023 కార్య‌క్ర‌మానికి డాక్ట‌ర్ రంజిత్ రెడ్డి (ఎంపీ), ఈవీ న‌ర్సింహారెడ్డి - ఐఏఎస్ (వీసీ & ఎండీ టీఎస్ ఐఐసీ), న‌రేంద్ర రామ్ నంబుల (సీఎండీ - లైఫ్ స్పాన్ ప్రైవేట్ లిమిటెడ్), పి. చ‌క్ర‌ధ‌ర్ రావు (ప్రెసిడెంట్ -ఐపిఈఎంఏ, పౌల్ట్రీ ఇండియా), ఎం. ర‌వీంద‌ర్ రెడ్డి (డైరెక్ట‌ర్ మార్కెటింగ్ - భార‌తి సిమెంట్స్), వి. రాజ‌శేఖ‌ర్ రెడ్డి (జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ - క్రెడాయ్), ఎం. రాజ్ గోపాల్ (ఎండీ - హై బిజ్ టీవీ, తెలుగు నౌ), డాక్ట‌ర్ జె. సంధ్యారాణి (సీఈవో - హై బిజ్ టీవీ, తెలుగు నౌ) త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement