TV journalist
-
టీవీ పాత్రికేయురాలి అనుమానాస్పద మృతి
ఢాకా: బంగ్లాదేశ్‌లో ఒక టీవీ జర్నలిస్టు రాజధాని ఢాకాలో ఓ సరస్సులో శవమై తేలారు. ఆమె ఆత్మహత్య చేసుకున్నారా, చంపి ఎవరైనా నీళ్లలో పడేశారా అనేది తెలియరాలేదు. మృతురాలిని గాజీ మీడియా గ్రూప్‌లోని బెంగాలీ బాషలో ప్రసారమయ్యే గాజీ టీవీ న్యూస్‌రూమ్ ఎడిటర్ సారా రహనుమాగా పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని ఢాకాలోని హతిర్జహీల్ సరస్సు నుంచి మంగళవారం అర్ధరాత్రి దాటాక 2గంటలపుడు పోలీసులు స్వా«దీనం చేసుకున్నారు. చనిపోవడానికి ముందు సారా ఫహీమ్ ఫైజల్ అనే వ్యక్తిని ట్యాగ్ చేస్తూ ఫేస్బుక్ ఖాతాలో ఒక పోస్ట్ పెట్టింది. ‘‘ నీలాంటి స్నేహితుడిని పొందడం సంతోషంగా ఉంది. నీ కలలను నెరవేర్చలేకపోతున్నందుకు క్షమించు. నీ జీవిత గమనంలో దేవుడు నీకు తోడుగా నిలుస్తాడు’ అని రాసుకొచి్చంది. ‘‘చస్తూ బతకడం కంటే చావడమే ఉత్తమం’ అంటూ అంతకుముందు మరో పోస్ట్ పెట్టింది. -
‘సాక్షి సాగుబడి' రాంబాబు, 'సాక్షి టీవీ' కిషోర్ లకు ఉత్తమ జర్నలిస్టు అవార్డులు
సాక్షి, హైదరాబాద్: ‘సాక్షి సాగుబడి’ ఇన్చార్జ్ పంతంగి రాంబాబు బుధవారం హైటెక్స్‌లో జరిగిన హైబిజ్ టీవీ మీడియా అవార్డ్స్ ఫంక్షన్లో తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలి చేతుల మీదుగా ఉత్తమ ప్రింట్ అగ్రికల్చరల్ జర్నలిస్ట్ పురస్కారాన్ని అందుకున్నారు. 37 ఏళ్లుగా పాత్రికేయుడిగా సేవలందిస్తున్న రాంబాబు గతంలో విశాలాంధ్ర, ఆంధ్రభూమి డైలీలో పనిచేశారు. గత 15 ఏళ్లుగా సాక్షిలో పనిచేస్తూ తెలుగు రాష్ట్రాల్లో ప్రకృతి వ్యవసాయం, సేంద్రియ ఇంటిపంటలు, సిరిధాన్యాల వ్యాప్తికి విశేష కృషి చేస్తూ ట్రెండ్ సెట్టర్‌గా పేరుగాంచారు. ప్రతి మంగళవారం సాక్షి దిన పత్రికలో ప్రచురితమయ్యే ‘సాగుబడి’ పేజీని దశాబ్దకాలంగా రైతు జన రంజకంగా నిర్వహిస్తున్నారు. పన్నెండేళ్లుగా సేంద్రియ ఇంటిపంటలపై కథనాలు రాస్తూ ప్రాచుర్యంలోకి తెస్తున్న ఆయన గత సంవత్సరంగా ‘సాక్షి ఫన్డే’లో ప్రపంచవ్యాప్తంగా అర్బన్ అగ్రికల్చర్ పోకడలపై కాలమ్ రాస్తున్నారు. ప్రకృతి వ్యవసాయోద్యమ పితామహుడు పద్మశ్రీ పురస్కార గ్రహీత సుభాష్ పాలేకర్, స్వతంత్ర శాస్త్రవేత్త, పద్మశ్రీ పురస్కార గ్రహీత డా. ఖాదర్ వలి, మట్టి సేద్య నిపుణుడు పద్మశ్రీ పురస్కార గ్రహీత చింతల వెంకటరెడ్డి వంటి ఉద్ధండుల విశేష కృషిని తెలుగు ప్రజలకు విస్తృతంగా అందుబాటులోకి తేవటంలో రాంబాబు కృషి చేస్తున్నారు. అదేవిధంగా, గ్రామీణులు, రైతు శాస్త్రవేత్తలు ఆవిష్కరించిన అనేక యంత్ర పరికరాలను వెలుగులోకి తేవడంలో విశేష కృషి చేసినందుకు నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ (ఎన్.ఐ.ఎఫ్.) 2017లో జాతీయ పురస్కారాన్ని న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో సాక్షి పత్రిక తరఫున రాంబాబు స్వీకరించిన విషయం తెలిసిందే. చేవెళ్ల ఎంపీ జి. రంజిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సాక్షి టీవీ న్యూస్ కాస్టర్ కిషోర్ తో పాటు వివిధ పత్రికలు, సోషల్ మీడియా సంస్థలు, శాటిలైట్ ఛానళ్లలో సేవలందిస్తున్న పాత్రికేయులు, ఫోటో, వీడియో జర్నలిస్టులు పలువురు పురస్కారాలు అందుకున్నారు. ఇక సాక్షి టీవీలో సీనియర్ ప్రజంటర్ గా చేస్తోన్న DV నాగ కిషోర్ ఉత్తమ న్యూస్ ప్రజంటర్ గా అవార్డు అందుకున్నారు. 23 సంవత్సరాలుగా టెలివిజన్ రంగంలో న్యూస్ ప్రెజంటర్గా, అలాగే సీనియర్ జర్నలిస్ట్ గా పనిచేస్తున్నారు కిషోర్. రాజకీయ, సామాజిక అంశాలకు సంబంధించిన డిబేట్ లను సాక్షి టీవీ వేదికగా నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో పీజీతో పాటు ఎం.కాం., ఎంబీఏ చదువుకున్న కిషోర్, గతంలో రేడియో ప్రజంటర్ గా కూడా పని చేశారు. కర్ణాటక, రాజస్థాన్, ఢిల్లీతో పాటు పలు రాష్ట్రాల్లో రిపోర్టింగ్ చేసిన అనుభవం కిషోర్ కు ఉంది. తాజాగా కర్ణాటక ఎన్నికలపై క్షేత్ర స్థాయిలో పర్యటించి గ్రౌండ్ రిపోర్టులు అందించారు కిషోర్. చదవండి: రోజుకు రూ. 1500.. ఎకరంన్నరలో ఏటా 4 లక్షలు! ఇలా చేస్తే లాభాలే! విద్యార్థులకు స్కాలర్ షిప్‌లు.. ఆర్థికంగా వెనుకబడిన మీడియా సిబ్బంది కుటుంబంలో చురుకైన విద్యార్థులకు హై బిజ్ టీవీ ఆసరాగా నిలిచింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి అలాంటి 10 మంది స్టూడెంట్స్ ను ఎంపిక చేసి వారికి రూ. 25 వేల స్కాలర్ షిప్ ఇచ్చింది. రెసొనెన్స్ జూనియర్ కాలేజీల(ఐఐటీ-జేఈఈ, నీట్) సహకారంతో ఈ ఆర్థిక సాయాన్ని అందించింది. ఈ సందర్భంగా రెసొనెన్స్ విజయగాథను తెలియజేసే కాఫీ టేబుల్ బుక్ ను మంత్రి మహమూద్ అలీ ఆవిష్కరించారు. స్కాలర్ షిప్ పొందిన విద్యార్థుల వివరాలు: ఎన్. సాయిప్రియ - పదో తరగతి (10 జీపీఏ) - జడ్పీ స్కూల్ తలమడుగు, ఆదిలాబాద్ జిల్లా (D/O అశోక్ - రిపోర్టర్, ఆంధ్రజ్యోతి) ఇస్క పునీత్ అభిషేక్, ఇంటర్ (94.5%), హైదరాబాద్ (S/O రాజేశ్ బాబు - సూర్య డెయిలీ) ఎం. త్రిశూల్, 9వ తరగతి (10 జీపీఏ), ప్రేరణ కాన్సెప్ట్ స్కూల్, నల్లగొండ (S/O శ్రీనివాస్ - హన్స్ ఇండియా) ఎం. వేద సహస్ర, ప్రస్తుతం 9వ తరగతి, భాష్యం వనస్తలిపురం, గ్రేడ్ ఏ-1 (D/O శ్రీనివాస్ - వీ6 కెమెరామెన్) ఎం. హాసిని, 6వ తరగతి, శ్రీ చైతన్య టెక్నో, మెహదీపట్నం, ఏ+ (D/O పూర్ణచందర్ - ఆర్ఎండి విభాగం, టైమ్స్ ఆఫ్ ఇండియా) షేక్ రమీజా, బీఎస్సీ (అగ్రికల్చర్) 3వ సంవత్సరం, మల్లారెడ్డి యూనివర్సిటీ, ఏ+ (D/O షేక్ మస్తాన్ - ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి ఎడిషన్) పి. జైవంత్, 9వ తరగతి, భద్రాచలం పబ్లిక్ స్కూల్, ఏ1 (S/0 పీవీ సత్యనారాయణ - హన్స్ ఇండియా, ఖమ్మం) ఎ. స్రవంతి, ఎంబీబీఎస్, ప్రభుత్వ మెడికల్ కాలేజీ, నల్లగొండ (D/O శ్రీనివాస్ - జీ24 ఎక్స్ కెమెరామెన్) హజి హాసిని, పదో తరగతి, టీఎస్ఎస్ డబ్ల్యూ రెసిడెన్షియల్ స్కూల్, ఎకర్ల (D/O గోపీకుమార్, ఎక్స్ ప్రజా శక్తి, కామారెడ్డి) పి. శరణ్య, 5వ తరగతి, సెయింట్ ఆన్స్ తార్నాక, ఏ+ (D/O ప్రవీణ్, వాయిస్ ఆఫ్ వర్డ్స్) చదవండి: ప్రకృతిని, ఆవులను నమ్ముకున్నారు.. 40 సెంట్లు.. రూ.3 లక్షలు! హెచ్.ఎం.ఎ-2023 కార్యక్రమానికి డాక్టర్ రంజిత్ రెడ్డి (ఎంపీ), ఈవీ నర్సింహారెడ్డి - ఐఏఎస్ (వీసీ & ఎండీ టీఎస్ ఐఐసీ), నరేంద్ర రామ్ నంబుల (సీఎండీ - లైఫ్ స్పాన్ ప్రైవేట్ లిమిటెడ్), పి. చక్రధర్ రావు (ప్రెసిడెంట్ -ఐపిఈఎంఏ, పౌల్ట్రీ ఇండియా), ఎం. రవీందర్ రెడ్డి (డైరెక్టర్ మార్కెటింగ్ - భారతి సిమెంట్స్), వి. రాజశేఖర్ రెడ్డి (జనరల్ సెక్రటరీ - క్రెడాయ్), ఎం. రాజ్ గోపాల్ (ఎండీ - హై బిజ్ టీవీ, తెలుగు నౌ), డాక్టర్ జె. సంధ్యారాణి (సీఈవో - హై బిజ్ టీవీ, తెలుగు నౌ) తదితరులు హాజరయ్యారు. -
మహారాష్ట్రలో టీవీ జర్నలిస్టు అరెస్టు
ముంబై: లాక్డౌన్ మంగళవారం ముగుస్తుందని, ప్రత్యేక రైళ్ల రాకపోకలు మొదలవుతాయంటూ ప్రచారం చేసి, ముంబైలోని బాంద్రా రైల్వేస్టేషన్‌కు వందలాది వలసకూలీల రాకకు కారణమైన టీవీ జర్నలిస్టు రాహుల్ కులకర్ణిని పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. మహారాష్ట్రలోని ఉస్మానాబాద్‌లో ఆయనను అరెస్ట్‌చేశారు.æ కులకర్ణి ఓ మరాఠి న్యూస్ చానల్లో పని చేస్తున్నారు. వలస కూలీలను వారి సొంత ప్రాంతాలకు చేర్చడానికి జన్ సాధారణ్ ప్రత్యేక రైళ్లు మంగళవారం నుంచి ప్రారంభమవుతాయని ఆయన ఇటీవల తమ చానల్లో వార్త ప్రసారం చేశారు. ఇది నిజమేనని నమ్మిన వేలాది మంది వలస కూలీలు ముంబైలోని బాంద్రా రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. -
జర్నలిస్టుపై చేయి చేసుకున్న డీసీపీ
-
జర్నలిస్టు మీద చేయి చేసుకున్న డీసీపీ : వీడియో వైరల్
కోల్‌కతా : వార్తలను కవర్ చేయడానికి వెళ్లిన టీవీ జర్నలిస్టు మీద ఓ పోలీస్ ఆఫీసర్ చేయి చేసుకున్నారు. ఆదివారం జరిగిన ఈ సంఘటన తాలూకు వీడియో సోమవారం వెలుగులోకి రావడంతో సంచలనంగా మారింది. వివరాల్లోకెళితే.. పశ్చిమ బెంగాల్లో బీజేపీ, టీఎంసీ కార్యకర్తల మధ్య శనివారం నుంచి ఘర్షణలు జరుగుతున్నాయి. శనివారం బీజేపీ నేత, బరాక్‌పూర్ ఎంపీ అర్జున్ సింగ్ తలకు గాయమవడంతో ఆదివారం ఈ ఘర్షణలు హింసాత్మకంగా మారాయి. ఈ నేపథ్యంలో ఎంపీ అర్జున్ సింగ్ నివాసమైన ‘మజ్దూర్ భవన్’ లో ప్రవేశించడానికి డీసీపీ అజయ్ ఠాకూర్ ప్రయత్నించాడు. ఈ సంఘటనలను కవర్ చేయడానికి వెళ్లిన స్థానిక టీవీ జర్నలిస్టును డిప్యూటీ కమిషనర్ అజయ్ ఠాకూర్ చెంప మీద కొట్టిన వీడియో బయటపడింది. అయితే ఇంతకు ముందు కూడా అజయ్ ఠాకూర్ ఇలా ప్రవర్తించాడని అక్కడి జర్నలిస్టులు ఆరోపిస్తున్నారు. అంతేకాక, పోలీస్ కమిషనర్ మనోజ్ వర్మ కొట్టడం వల్లనే తన తలకు గాయమైందని ఎంపీ అర్జున్ సింగ్ ఆరోపించిన విషయం తెలిసిందే. -
మహిళా టీవీ జర్నలిస్ట్ దారుణ హత్య
ఢాకా: బంగ్లాదేశ్ లో సుబర్ణ నోది(32) అనే మహిళా జర్నలిస్ట్ దారుణ హత్య కలకలం రేపింది. పాబ్నా నగరంలో తన ఇంటి వద్ద తెలియని దుండగులు ఆమెను గొంతుకోసి హత్య చేశారు. స్థానిక మీడియా అందించిన సమాచారం ప్రకారం మోటార్ సైకిళ్లపై దాదాపు 10-12 మంది సాయుధులు రాత్రి 10 గంటల సమయంలో ఆమె ఇంటికి వచ్చారు. అనంతరం కాలింగ్ బెల్ మోగించారు. ఆమె తలుపు తీయగానే ముందస్తు పథకం ప్రకారం పదునైన ఆయుధంతో దాడి చేసి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన ఆమెను స్థానికులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందిందని వైద్యులు ప్రకటించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేశామనీ అదనపు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఇబ్నె మిజాన్ తెలిపారు. హత్యకు గల కారణాలు ఇంకా తెలియలేదనీ, విచారణ జరుగుతోందన్నారు.మరోవైపు పాబ్నాలోని పాత్రికేయులు ఈ హత్యను తీవ్రంగా ఖండించారు. హంతకులకు కఠినమైన శిక్ష విధించాలని పిలుపునిచ్చారు. కాగా సుబర్ణ నోది ఆనంద టీవీ ఛానల్లో న్యూస్ కరస్పాండెంట్‌గా పనిచేస్తున్నారు. డైలీ జాగృతో బంగ్లా పత్రికకు జర్నలిస్టుగా కూడా సేవలందించారు. తొమ్మిదేళ్ల కూతురితో కలిసి జీవిస్తున్న ఆమె భర్త నుంచి విడాకులు తీసుకున్నట్టు తెలుస్తోంది. -
థరూర్ ఇంటర్వ్యూకు వెళ్లిన మహిళా జర్నలిస్టును..
సాక్షి, బెంగళూరు : జర్నలిస్టును వేధించిన ఆరోపణల కింద ఓ సెక్యూరిటీ గార్డును పోలీసులు అరెస్టు చేశారు. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. గత నెల (సెప్టెంబర్) 27న శశిథరూర్ బెంగళూరు వచ్చి ఓ హోటల్లో దిగారు. దీంతో ఆయనను ఇంటర్వ్యూ చేసేందుకు ఓ మహిళా టీవీ జర్నలిస్టు అక్కడి హోటల్‌కు చేరుకున్నారు. ఆయన అనుమతి కూడా ముందే తీసుకున్నారు. అయితే, ఆ హోటల్ ముందు ఉన్న సిబ్బంది మాత్రం ఆమెను తీవ్రంగా ఇబ్బంది పెట్టారు. లైంగికంగా తడమడంతోపాటు చేయి కూడా చేసుకున్నారు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ సెక్యూరిటీ గార్డుల్లో ఒకరిని వేలాయుధన్ అనే వ్యక్తిగా గుర్తించారు. అతడిది మహదేవపురా అని తెలుసుకొని అరెస్టు చేశారు. మరో ఇద్దరిని అరెస్టు చేయాల్సి ఉంది. -
గేల్ కూతురు ‘సిగ్గుల మొగ్గ’...
బుధవారం పుట్టిన తన కూతురికి విండీస్ బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్.. బ్లష్ (సిగ్గుతో బుగ్గలు ఎరుపెక్కడం) అని పేరు పెట్టాడు. కొన్నాళ్ల క్రితం ఆస్ట్రేలియాలో బిగ్‌బాష్ లీగ్ సందర్భంగా ‘మనం కలిసి డ్రింక్ చేద్దాం. నాతో వచ్చేందుకు సిగ్గుపడవద్దు బేబీ’ అంటూ ఒక మహిళా టీవీ జర్నలిస్ట్‌తో వ్యాఖ్యానించడం వివాదాస్పదమైంది. దాంతో నాటి ఘటనను దృష్టిలో ఉంచుకొనే తన పాపకు ‘బ్లష్’ అనే పేరు పెట్టినట్లు భావిస్తున్నారు. మరోవైపు ‘అంకుల్ విరాట్’ అని పిలిపించుకోవడం సంతోషంగా ఉందంటూ కోహ్లి కూడా గేల్‌కు అభినందనలు తెలిపాడు. -
వీళ్లా మగాళ్లు!
మహిళకు ఎక్కడా రక్షణ లేదు. రోడ్డు మీద, బస్సులో, స్కూల్లో, ఆఫీస్‌లో... చివరికి ఇంట్లో కూడా లేదు! ఇన్ని భూతాలతో మహిళ నిత్యం పోరాడుతుంటే... ఇప్పుడు ఇంకో భూతం తయారైంది. దీని భూతం అనాలా? బూతు అనాలా? ఇంటర్నెట్లో అమ్మాయిల ఫొటోలు మార్ఫింగ్ చేసి నగ్నంగా చూపించడం... నోటికొచ్చినట్లు కామెంట్ చెయ్యడం... మళ్లీ వీటన్నిటినీ సర్కులేట్ చెయ్యడం..! డర్టీ మగాళ్ల పిరికి బిహేవియర్ ఇది. ఈ సిగ్గులేని, నీతిమాలిన పిరికిపందలు మగాళ్లెలా అవుతారు?! సాగరికా ఘోష్ ప్రసిద్ధ టీవీ జర్నలిస్ట్. ట్విట్టర్లో ఆమె చాలా చురుకుగా ఉండేవారు. అయితే సడన్‌గా ఆమె ట్విట్టర్ జోలికే వెళ్లడం మానేశారు. కారణం. తనపై వచ్చిన బ్యాడ్ కామెంట్స్. మొదటైతే ఆ కామెంట్స్‌ని సాగరిక పట్టించుకోలేదు. టీనేజ్‌లో ఉన్న తన కూతురినీ ఆ కామెంట్స్ టార్గెట్ చేయడంతో ఆమె చాలా డిస్టర్బ్ అయ్యారు. ఏం చేయాలో అర్థంకాలేదు. కొన్నాళ్లు మాటకు మాట ఇచ్చారు కానీ, కామెంట్లు శృతిమించడంతో ట్విట్టర్‌ని వదిలేశారు. ప్రఖ్యాత మహిళా కార్యకర్త కవితా కృష్ణన్దీ ఇలాంటి అనుభవమే. ఒకసారి ఆమె మహిళల మీద హింసకు వ్యతిరేకంగా ఆన్లైన్లో చాట్ చేస్తుంటే.. ఉన్నట్టుండి ఓ వ్యక్తి హఠాత్తుగా ‘నిన్ను రేప్ చేయడానికి కండోమ్‌తో వస్తాను. ఎక్కడికి రావాలో చెప్పు’ అంటూ అసభ్యంగా చాట్ చేయసాగాడు. అంతే వెంటనే ఆ చాట్లోంచి సైన్ ఆఫ్ అయిపోయారు కవిత. ‘‘నేను చాట్‌చేసిన సైట్ రెడిఫ్ డాట్ కామ్. అలాంటి పదజాలంతో ఉన్న ఆ చాట్‌ను రెడిఫ్ డాట్ కామ్ బ్లాక్ చేయకపోవడం పట్ల చాలా బాధేసింది’’ అన్నారు కవితా కృష్ణన్ నాటి సంఘటనను గుర్తు చేసుకుంటూ. వీళ్లిద్దరి కంటే కొంచెం గుండె దిటవైన మనిషి సోనాక్షీ సిన్హా. ఆమె ‘లావు’ గురించి ట్విటర్లో చాలాకాలం పాటు బ్యాడ్ కామెంట్స్ వచ్చాయి. వాటిని సోనాక్షీ తిప్పి కొట్టగలిగారు. ఆ ఇష్యూ అక్కడితో ముగిసిపోయింది. సోషల్ మీడియాను కొందరు మగాళ్లు ఎలా దుర్వినియోగం చేస్తున్నారో కళ్లకుకటే ్ట‘సైబర్ బుల్లీయింగ్’ సంఘటనలివి. ఇంటర్నెట్ను, సోషల్ నెట్వర్క్ వెబ్సైట్లనూ ఉపయోగించి, సంఘంలో పేరు ప్రతిష్ఠలు, సెలబ్రిటీ హోదా ఉన్న వ్యక్తులపై ఆకతాయిలు అసభ్యకరమైన కామెంట్లు పెట్టడం ఇటీవల ఎక్కువైపోయింది. బుల్ అంటే దున్నపోతు. అంటే జడివాన కురిసినా, చలనం లేనట్టుండే బండ జంతువు. సైబర్ బుల్లీయింగ్ కూడా అంతే. అవతలి వారు ఏమైపోతే నాకేం అన్నట్టు... ప్రవర్తించే మానవ మృగాలు చేసే పని కాబట్టి ఆ ప్రవృత్తిని అలా అనడం సమంజసమే! ఫొటోలు మార్ఫింగ్ చేయడం, ఫేక్‌బుక్ అకౌంట్లు ఓపెన్ చేయటం, వారి పేరుతో ఇతరులకు అభ్యంతరకరమైన కామెంట్లు చేయటం, రకరకాల వెకిలి చేష్టలు చేయటం, అశ్లీలమైన ఫొటోలు పోస్ట్ చేయటం... ఇలాంటివన్నీ సైబర్ బుల్లీయింగ్ కిందికే వస్తాయి. సైబర్ బుల్లీయింగ్ బారిన పడి ఎన్నో ఎన్నో కాపురాలు కూలిపోయాయి. మరెందరి జీవితాలో బలయ్యాయి. పరువే ప్రాణంగా బతికే సున్నిత మనస్కులు మనస్తాపంతో ఆత్మహత్యలకు ప్రయత్నించే ప్రమాదం ఉంది. అగ్గిపుల్లతో దీపాన్ని వెలిగించి, వెలుగును పంచవచ్చు, ఇంటి చూరుకు నిప్పు పెట్టి, బతుకును బుగ్గిపాలూ చేయవచ్చు. సాంకేతిక పరిజ్ఞానాన్ని మనం దీపం వెలిగించి, వెలుగును పంచడానికే వినియోగించుకోవాలి తప్ప కుసంస్కారంతో సాటి మనుషులను బాధపెట్టకూడదు. సంస్కారవంతులు పెరగాలి ఫోటోషాప్‌లో మొహాలు మార్చేసే ‘మార్ఫింగ్’ ప్రక్రియ నెట్లో చాలా జోరుగా సాగుతోంది. అసభ్యంగా ఉండే ఫొటోలకు, అభ్యంతరకర వీడియోలకు సెలబ్రిటీల మొహాలు అతికించేసి, కొంతమంది పైశాచిక ఆనందం పొందుతున్నారు. అంతేకాదు, తమకు ఏ అమ్మాయి మీద అయినా పగ ఉంటే, ఆ అమ్మాయి పరువు తీయడానికి కూడా ఇలాంటి పనులు చేస్తుంటారు. ఇది చాలా దారుణమైన విషయం. - అదా శర్మ, కథానాయిక బహిర్గతం చెయ్యకూడదు ముఖ్యంగా అమ్మాయిల పట్ల ఈ సైబర్ ప్రపంచం పెనుభూతంగా మారిందనే చెప్పాలి. ఈ నేరాలు ఎంత దారుణంగా ఉంటున్నాయంటే ఏకంగా జీవితాలనే నాశనం చేసేస్తున్నాయి. ఆన్లైన్లో అపరిచితులకు వ్యక్తిగత విషయాలు చెప్పడం శ్రేయస్కరం కాదు. ముఖ పరిచయం లేనివారితో మాట్లాడకపోవడమే క్షేమం. - నందిత, నటి చట్టాలేవీ లేవు సైబర్ బుల్లీయింగ్‌కి సంబంధించి పటిష్ఠమైన చట్టాలేవీ మన దేశంలో లేవు. ఇప్పుడున్న సైబర్ లా (ఇండియన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000) కూడా సైబర్ బుల్లీయింగ్‌కి సంబంధించిన అంశాల మీద చురుగ్గా ఏమీ స్పందించట్లేదు. అందుకే దీన్ని సైబర్ లాతో అనుసంధానించకుండా సైబర్ బుల్లీయింగ్‌కి ప్రత్యేకమైన చట్టం తేవాల్సిన అవసరం ఉంది. అలాగే ఈ నేరం చేసిన వాళ్లకు కనీసం ఏడేళ్ల జైలు శిక్షతోపాటు 50 లక్షల రూపాయల జరిమానా విధించాలి. అలాగే బాధితులకు జరిగిన న ష్టాన్ని, మనస్తాపాన్ని బట్టి వాళ్లకు 50 కోట్ల రూపాయల నష్టపరిహారాన్నీ ఇప్పించాలి. - పవన్ దుగ్గల్, సైబర్ లా ఎక్స్పర్ట్, సుప్రీంకోర్టు న్యాయవాది కంప్లయింట్ ముఖ్యం ఫేస్బుక్ లాంటి వాటిల్లో అబ్యూజ్ లాంగ్వేజ్, న్యూడ్ఫోటో పోస్టింగ్స్లాంటివి పెట్టి... బాధితులు కంప్లయింట్ చేసినా ఏమీ చేయలేని పరిస్థితీ ఉంటుంది. ఎందుకంటే ఫేస్బుక్ అమెరికన్ సంస్థ. అక్కడి చట్టాల ప్రకారం అది రూపొందింది. ఇండియాలో ఫేస్బుక్ ద్వారా ఎదుర్కొంటున్న కొన్ని సమస్యల మీద చర్య తీసుకోవడానికి వివరాలు కావాలని ఆ సంస్థకు పంపిస్తే స్పందించదు. ఇండియాలో అయితే ఇన్వెస్టిగేషన్ టీమ్ అడిగిన ఏ వివరాన్నయినా ఇటు ప్రైవేట్ అటు పబ్లిక్ ఏజెన్సీ ఏదైనా చెప్పి తీరాల్సిందే. అందుకు బాధితుల ఫిర్యాదు ముఖ్యం. - రాజశేఖర్, సీఐ (సైబర్ క్రైమ్), హైదరాబాద్ వెంటనే స్టాప్ చేయాలి ప్రధానంగా టీనేజ్ పిల్లలు గుర్తుపెట్టుకోవాల్సిందేమిటంటే... మనం ఆన్లైన్లో చేసే కామెంట్ ఏదీ అంతమైపోదు. ఎవరో ఒకరి వాల్ మీద జీవించే ఉంటుంది. దాన్ని గుర్తెరిగి, మనం సంభాషించాలి. ఇక మనమీద వేధింపులు మొదలు కాగానే వాటిని మొగ్గలోనే తుంచేయడం మేలు. ఇక అజ్ఞాతంగా చేసే కామెంట్స్‌నూ లేదా వేధింపులు జరుగుతుంటే అది ఎక్కడి నుంచి జరుగుతోందన్న విషయాలను తవ్వి తీయగల సాంకేతిక సామర్థ్యం ఇప్పుడు అందుబాటులో ఉంది. దాంతోపాటు దీనికి తల్లిదండ్రులు, స్కూల్ యాజమాన్యాల మద్దతు ఉండాలి. - డాక్టర్ పద్మా పాల్వాయి, సైకియాట్రిస్ట్, హైదరాబాద్ -
రేవంత్ -విలేకరి మధ్య వాగ్వాదం!
-
పాక్‌లో టీవీ జర్నలిస్టుపై కాల్పులు
కరాచీ: పాకిస్థాన్‌లో ఓ టీవీ సీనియర్ జర్నలిస్టుపై దుండగులు కాల్పులు జరిపారు. జియో టీవీలో పనిచేస్తున్న హమీద్ మిర్‌పై కరాచీ ఎయిర్‌పోర్టులో నలుగురు గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. శనివారం హమీద్ ఎయిర్‌పోర్టు నుంచి స్టూడియోకు వెళ్తుండగా దుండగులు ఆయన కారును వెంబండించారు. ఎయిర్‌పోర్టులోనే అతనిపై కాల్పులు జరిపారు. ఆయన శరీరంలోకి మూడు బుల్లెట్లు దూసుకెళ్లాయి. వెంటనే ఆయనను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. తాలిబన్‌తో ఇతర ఉగ్రవాద సంస్థల నుంచి హమీద్‌కు ప్రాణహాని ఉన్నట్టు పోలీసు వర్గాలు తెలిపాయి. -
ఆప్‌లో చేరిన అశుతోష్
న్యూఢిల్లీ: ప్రముఖ పాత్రికేయుడు అశుతోష్ శనివారం ఆమ్ ఆద్మీ పార్టీలో చేరా రు. ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించారు. ఈసందర్భంగా ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో కేజ్రీవాల్‌తోపాటు ఆ పార్టీ నేత సంజయ్ సింగ్ పాల్గొన్నారు. ఐబీఎన్7లో మేనేజింగ్ డెరైక్టర్‌గా కొనసాగుతున్న అశుతోష్ తన పదవికి రాజీ నామా చేయడంతో గురువారమే ఆయన ఆప్‌లో చేరనున్న వార్త గుప్పుమంది. ఈ వార్తలను నిజం చేస్తూ ఆయన శనివారం ఆప్‌లో చేరారు. లోక్‌సభకు పోటీ చేసేందుకే ఆప్‌లో చేరారా? అన్న ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ... ‘చరిత్ర నాకో అవకాశాన్నిచ్చింది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్నా. అయితే లోక్‌సభకు పోటీ చేయడానికి మాత్రమే ఆప్‌లో చేరలేదు. పార్టీ ఏది చెబితే అది చేస్తా. పాత్రికేయ వృత్తిలో 23 సంవత్సరాలకుపైగా ఉన్నాను. దేశంలోని అన్ని రాజకీయ పార్టీలతో పరిచయం ఉంది. ఈ పరిచయాన్ని ఇన్నాళ్లూ పాత్రికేయుడిగానే కొనసాగించాను. అయితే ఆప్ విధానాలు నచ్చడంతో ఆ పార్టీలో చేరాన ’ని చెప్పారు. ఇదిలాఉండగా వృత్తి లో కొనసాగినన్ని రోజులు ఆయన పాత్రికేయుడిగా న్యాయం చేయలేదని, ఏదో ఆశించే ఆప్‌లో చేరారని పలువురు జర్నలిస్టులు విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీ కూడా అశుతోష్ చేరికపై విమర్శలు సంధించాయి. వీటిపై అశోతోష్ స్పం దిస్తూ.. ‘జర్నలిస్టుగా కొనసాగినన్ని రోజులు సమతుల్యంగానే వ్యవహరిం చాను. నా సొంత అభిప్రాయాలనెప్పుడే న్యూస్‌రూమ్‌పై రుద్దలేద’న్నారు.