పాక్లో టీవీ జర్నలిస్టుపై కాల్పులు | TV journalist Hamid Mir shot in Pakistan | Sakshi
Sakshi News home page

పాక్లో టీవీ జర్నలిస్టుపై కాల్పులు

Published Sat, Apr 19 2014 9:54 PM | Last Updated on Sat, Sep 2 2017 6:15 AM

TV journalist Hamid Mir shot in Pakistan

కరాచీ: పాకిస్థాన్లో ఓ టీవీ సీనియర్ జర్నలిస్టుపై దుండగులు కాల్పులు జరిపారు. జియో టీవీలో పనిచేస్తున్న హమీద్ మిర్పై కరాచీ ఎయిర్పోర్టులో నలుగురు గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. శనివారం హమీద్ ఎయిర్పోర్టు నుంచి స్టూడియోకు వెళ్తుండగా దుండగులు ఆయన కారును వెంబండించారు. ఎయిర్పోర్టులోనే అతనిపై కాల్పులు జరిపారు. ఆయన శరీరంలోకి మూడు బుల్లెట్లు దూసుకెళ్లాయి. వెంటనే ఆయనను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. తాలిబన్తో ఇతర ఉగ్రవాద సంస్థల నుంచి హమీద్కు ప్రాణహాని ఉన్నట్టు పోలీసు వర్గాలు తెలిపాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement