
ఢాకా: బంగ్లాదేశ్‌లో ఒక టీవీ జర్నలిస్టు రాజధాని ఢాకాలో ఓ సరస్సులో శవమై తేలారు. ఆమె ఆత్మహత్య చేసుకున్నారా, చంపి ఎవరైనా నీళ్లలో పడేశారా అనేది తెలియరాలేదు. మృతురాలిని గాజీ మీడియా గ్రూప్‌లోని బెంగాలీ బాషలో ప్రసారమయ్యే గాజీ టీవీ న్యూస్‌రూమ్ ఎడిటర్ సారా రహనుమాగా పోలీసులు గుర్తించారు.
మృతదేహాన్ని ఢాకాలోని హతిర్‌జహీల్ సరస్సు నుంచి మంగళవారం అర్ధరాత్రి దాటాక 2గంటలపుడు పోలీసులు స్వా«దీనం చేసుకున్నారు. చనిపోవడానికి ముందు సారా ఫహీమ్ ఫైజల్ అనే వ్యక్తిని ట్యాగ్ చేస్తూ ఫేస్‌బుక్ ఖాతాలో ఒక పోస్ట్ పెట్టింది. ‘‘ నీలాంటి స్నేహితుడిని పొందడం సంతోషంగా ఉంది. నీ కలలను నెరవేర్చలేకపోతున్నందుకు క్షమించు. నీ జీవిత గమనంలో దేవుడు నీకు తోడుగా నిలుస్తాడు’ అని రాసుకొచి్చంది. ‘‘చస్తూ బతకడం కంటే చావడమే ఉత్తమం’ అంటూ అంతకుముందు మరో పోస్ట్ పెట్టింది.