మహారాష్ట్రలో టీవీ జర్నలిస్టు అరెస్టు   | TV Journalist Rahul Kulkarni Arrested In Mumbai | Sakshi
Sakshi News home page

మహారాష్ట్రలో టీవీ జర్నలిస్టు అరెస్టు  

Published Thu, Apr 16 2020 7:21 AM | Last Updated on Thu, Apr 16 2020 7:21 AM

TV Journalist Rahul Kulkarni Arrested In Mumbai - Sakshi

బాంద్రాలో పెద్దసంఖ్యలో గుమికూడిన వలస కూలీలను చెదరగొడుతున్న పోలీసులు

ముంబై: లాక్‌డౌన్‌ మంగళవారం ముగుస్తుందని, ప్రత్యేక రైళ్ల రాకపోకలు మొదలవుతాయంటూ ప్రచారం చేసి, ముంబైలోని బాంద్రా రైల్వేస్టేషన్‌కు వందలాది వలసకూలీల రాకకు కారణమైన టీవీ జర్నలిస్టు రాహుల్‌ కులకర్ణిని పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. మహారాష్ట్రలోని ఉస్మానాబాద్‌లో ఆయనను అరెస్ట్‌చేశారు.æ కులకర్ణి ఓ మరాఠి న్యూస్‌ చానల్లో పని చేస్తున్నారు. వలస కూలీలను వారి సొంత ప్రాంతాలకు చేర్చడానికి జన్‌ సాధారణ్‌ ప్రత్యేక రైళ్లు మంగళవారం నుంచి ప్రారంభమవుతాయని ఆయన ఇటీవల తమ చానల్‌లో వార్త ప్రసారం చేశారు. ఇది నిజమేనని నమ్మిన వేలాది మంది వలస కూలీలు ముంబైలోని బాంద్రా రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement