ఆప్‌లో చేరిన అశుతోష్
Published Sat, Jan 11 2014 11:33 PM | Last Updated on Wed, Apr 4 2018 7:42 PM
న్యూఢిల్లీ: ప్రముఖ పాత్రికేయుడు అశుతోష్ శనివారం ఆమ్ ఆద్మీ పార్టీలో చేరా రు. ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించారు. ఈసందర్భంగా ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో కేజ్రీవాల్‌తోపాటు ఆ పార్టీ నేత సంజయ్ సింగ్ పాల్గొన్నారు. ఐబీఎన్7లో మేనేజింగ్ డెరైక్టర్‌గా కొనసాగుతున్న అశుతోష్ తన పదవికి రాజీ నామా చేయడంతో గురువారమే ఆయన ఆప్‌లో చేరనున్న వార్త గుప్పుమంది. ఈ వార్తలను నిజం చేస్తూ ఆయన శనివారం ఆప్‌లో చేరారు. లోక్‌సభకు పోటీ చేసేందుకే ఆప్‌లో చేరారా? అన్న ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ... ‘చరిత్ర నాకో అవకాశాన్నిచ్చింది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్నా.
అయితే లోక్‌సభకు పోటీ చేయడానికి మాత్రమే ఆప్‌లో చేరలేదు. పార్టీ ఏది చెబితే అది చేస్తా. పాత్రికేయ వృత్తిలో 23 సంవత్సరాలకుపైగా ఉన్నాను. దేశంలోని అన్ని రాజకీయ పార్టీలతో పరిచయం ఉంది. ఈ పరిచయాన్ని ఇన్నాళ్లూ పాత్రికేయుడిగానే కొనసాగించాను. అయితే ఆప్ విధానాలు నచ్చడంతో ఆ పార్టీలో చేరాన ’ని చెప్పారు. ఇదిలాఉండగా వృత్తి లో కొనసాగినన్ని రోజులు ఆయన పాత్రికేయుడిగా న్యాయం చేయలేదని, ఏదో ఆశించే ఆప్‌లో చేరారని పలువురు జర్నలిస్టులు విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీ కూడా అశుతోష్ చేరికపై విమర్శలు సంధించాయి. వీటిపై అశోతోష్ స్పం దిస్తూ.. ‘జర్నలిస్టుగా కొనసాగినన్ని రోజులు సమతుల్యంగానే వ్యవహరిం చాను. నా సొంత అభిప్రాయాలనెప్పుడే న్యూస్‌రూమ్‌పై రుద్దలేద’న్నారు.
Advertisement