Ashutosh
-
రూ.1 కోటి ప్రైజ్‌మనీ.. అగ్రిమెంట్ ప్రకారం 30 శాతం ఇచ్చేయాలట!
రియాలిటీ షోల వల్ల సెలబ్రిటీలకు పేరుకు పేరు, డబ్బుకు డబ్బు వస్తోంది. అందుకే ఏదో ఒక షోతో సరిపెట్టుకోకుండా వీలైనన్నిచోట్లా కనిపించేందుకు ప్రయత్నిస్తున్నారు. బాలీవుడ్ నటుడు అషుతోష్ కౌశిక్ కూడా అదే చేశాడు. ఎమ్‌టీవీ రోడీస్ ఐదో సీజన్ (2007)లో పాల్గొన్న ఇతడు ఆ షో టైటిల్ విజేతగా రూ.2.5లక్షలు గెలుచుకున్నాడు. అయితే ఇందులో మెజారిటీ భాగం టాక్స్ కట్టడానికే పోయిందట. రూ.1 కోటి ప్రైజ్మనీఆ మరుసటి ఏడాది అంటే 2008లో హిందీ బిగ్‌బాస్ రెండో సీజన్లో పాల్గొన్నాడు. ఈ షోలో ఏకంగా రూ.1 కోటి గెలుచుకున్నాడు. అయితే ఇక్కడే అసలు సమస్య మొదలైందట.. దీని గురించి అషుతోష్ మాట్లాడుతూ.. బిగ్‌బాస్ షోలో నేను రూ.1 కోటి గెలుచుకున్నాను. అందులో రూ.30 లక్షలు తమకు ఇవ్వాలని ఎమ్‌టీవీ డిమాండ్ చేసింది. అదేమంటే నేను రుణపడి ఉన్నానంది. వారి అగ్రిమెంట్ ప్రకారం రెండేళ్లపాటు నేను సంపాదించినదానిలో 30 శాతం ఎమ్టీవీకే ఇవ్వాలి.డమ్మీ వీజేగా పెట్టి..నాకు పెద్దగా చదువు రాదు. దీంతో అగ్రిమెంట్ చదవకుండానే సంతకం చేశాను. కానీ బిగ్‌బాస్ ప్రైజ్‌మనీ గిఫ్ట్ కిందకు వస్తుందని, అది జీతం కిందకు రాదని వాదించాను. పైగా బిగ్‌బాస్ ఆఫర్ వచ్చినప్పుడే ఎమ్‌టీవీ వాళ్లను సంప్రదించాను. వాళ్లు నాకు ఎలాంటి సలహాలు, సూచనలు ఇవ్వలేదు. అసలు పట్టించుకోలేదు. చివరగా ఓ ఒప్పందానికి వచ్చాం. వారికోసం రెండేళ్లపాటు వీజేగా పని చేశాను. అప్పుడు నాకు నెలకు రూ.1.5 లక్షలు ఇచ్చారు అని చెప్పుకొచ్చాడు.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ఆప్టిమ్హైర్లో నియామకాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఐటీ రంగానికి నియామక సేవలు అందిస్తున్న హైదరాబాద్ కంపెనీ ఆప్టిమ్‌హైర్ ఈ ఏడాది చివరికల్లా ఉద్యోగుల సంఖ్యను 300లకు చేర్చనుంది. ప్రస్తుతం కంపెనీలో 120 మంది సిబ్బంది ఉన్నారు. మూడేళ్ల క్రితం ప్రారంభించిన ఈ కంపెనీకి 120కి పైచిలుకు క్లయింట్లు ఉన్నారు. ఇప్పటి వరకు ఆరు లక్షల మంది అభ్యర్థుల ముందస్తు ఇంటర్వ్యూలు పూర్తి చేశామని ఆప్టిమ్‌హైర్ ఫౌండర్, సీఈవో లక్ష్మి ఎం కొడాలి తెలిపారు. కో–ఫౌండర్ సీహెచ్.పవన్ కుమార్ రావు, మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ అశుతోష్ వ్యాస్‌తో కలిసి గురువారమిక్కడ ఆయన మీడియాతో మాట్లాడారు. ‘మిడ్, సీనియర్ లెవెల్ ఉద్యోగి నియామకానికి కంపెనీలకు ఆరు నెలల దాకా సమయం పడుతోంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమేషన్ సాయంతో ఈ సమయాన్ని 12 రోజులకు కుదించగలిగాం. రెండు, మూడు ఇంటర్వ్యూ దశలను తగ్గించేలా అభ్యర్థులను వడపోస్తాం. మా వేదిక ద్వారా 5,700 మందికి ఉద్యోగాలు లభించాయి. వీరి గరిష్ట వేతనం భారత్‌లో రూ.80 లక్షలు, యూఎస్‌లో రూ.3 కోట్ల వరకు ఉంది. రెఫరల్ పార్ట్నర్స్ 2,000 మంది ఉన్నారు. అభ్యర్థులను రెఫర్ చేయడం ద్వారా వీరు నెలకు రూ.6 లక్షల వరకు సంపాదిస్తున్నారు’ అని వివరించారు. -
బిహార్ ‘చాణక్యుడు’ ఏకాకి అయినట్లేనా?
బిహార్ చాణక్యుడిగా పేరొందినవాడు ఇప్పుడు ఏకాకి అయ్యాడు. మిత్రులు, ప్రత్యర్థులు ఇరువురూ తనను ఇప్పుడు వదిలిపెట్టేశారు. ఇప్పుడు బిహార్ ప్రజలు మాత్రమే ఆయన ఆశాకిరణం. నితీశ్‌పై, ఆయన రాజకీయాలపై ఈ ఎన్నికలు ఒక రెఫరెండం లాంటివి. 69 ఏళ్ల వయసులో నితీశ్ తన రాజకీయ జీవితంలోనే అతి పెద్ద సమరంలో తలపడుతున్నారు. బీజేపీతో కూటమి ఇప్పుడు ఒక ముసుగు మాత్రమే. తగినన్ని స్థానాలు గెల్చుకోకపోతే నితీశ్‌ని బీజేపీ చెత్తబుట్టలోకి తోసేస్తుంది. ‘ఎన్డీఏకి నితీశ్ ప్రతిరూపం వంటివాడని, ఎన్నికల తర్వాత ఆయనే ముఖ్యమంత్రి’ అని అమిత్ షా అన్న పదాలకు అర్థం నితీశ్‌కి బాగా తెలుసు. అది ఎలాంటి విశ్వాసమూ లేకుండానే పునరుద్ధరించే హామీ వంటిది. నమ్రతకు మారుపేరుగా నిలిచిన నితీశ్ మొదటిసారిగా బహిరంగ సభల్లోనే ఉన్నట్లుండి ఆగ్రహ ప్రదర్శన చేస్తున్నారంటే ఆశ్చ ర్యపడాల్సింది లేదు. అది ఆయన ఒంటరితనానికి చక్కని వ్యక్తీకరణగా కూడా చెప్పవచ్చు. పరిమితమైన ఆకర్షణా శక్తి, బలహీనమైన రాజకీయ పార్టీ కలిగి ఉన్నప్పటికీ భారతీయ చరిత్రలో మూడు దఫాలు ముఖ్యమంత్రిగా కొనసాగిన ఏకైక రాజకీయ నేత బహుశా నితీశ్ మాత్రమే కావచ్చు. తన పార్టీకి 20 శాతం ఓట్ల దన్ను మాత్రమే ఉన్నప్పటికీ బిహార్‌లో ఇప్పటికీ ప్రశ్నించలేని గొప్పనేత ఆయన. 1994లో జార్జి ఫెర్నాండెజ్‌తో కలిసి లాలూయాదవ్ నుంచి వేరుపడిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా కూడా పెద్దగా ముద్రవేయని జనతాదళ్ (యునైటెడ్) పార్టీని ఈయన ముందుండి నడిపించాడు. ఇద్దరు బలమైన శత్రువుల మధ్య చీలికల నుంచి పుట్టుకొచ్చే ఉప ఉత్పత్తి చందాన నితీశ్ బిహార్ రాజకీయాల్లో అగ్రస్థానంలోకి వచ్చారు. బీజేపీ, ఆర్జేడీలు రెండు భిన్న భావజాలాలతో ఘర్షిస్తూ వచ్చాయి. లాలూయాదవ్ ఆర్జేడీ ప్రబోధించిన మండల్ రాజకీయాలకు పూర్తి వ్యత్యాసంగా బీజేపీ హిందుత్వ కొనసాగుతూ వచ్చింది. మండల్ రాజకీయాలకు చెందిన అసలుసిసలు యోధుడైన నితీశ్ ఇంతకాలంగా బీజేపీ శకటంమీదే ప్రయాణిస్తూ వచ్చారు కానీ బీజేపీ ప్రధాన బ్రాండ్ అయిన హిందుత్వను నితీశ్ స్వీకరించలేదు. బిహార్ చాణక్యుడిలా నితీశ్ రాజకీయ చతురతకు, సహజ జ్ఞానానికి మారుపేరులా గుర్తింపు పొందేవారు. పై రెండు భిన్న పార్టీలకు నిత్యం ఒకరిపైకి మరొకరిని ఎగదోలుతూనే గత 15 సంవత్సరాలుగా బిహార్‌లో కీలకనేతగా మనగలుగుతూ వచ్చారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆ రెండు పార్టీలుకూడా నితీశ్ జేడీయూ కంటే పెద్దవే కానీ అన్నివేళలా ద్వితీయ స్థానంలో ఉండిపోవడానికి అంగీకరించేవి. లాలూయాదవ్‌ను అధికారానికి దూరం పెట్టాలని బీజేపీ కోరుకుంటే, బీజేపీని దూరం పెట్టాలని లాలూయాదవ్ ప్రయత్నించేవారు. ఈ ఇద్దరి వాంఛను నితీశ్ బ్రహ్మాం డంగా నెరవేరుస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు బీజేపీ ఇక చాలు అనే అభిప్రాయానికి వచ్చేసింది. తనకు ఏమాత్రం కాస్త అధికంగా అసెంబ్లీ స్థానాలు దక్కితే నితీశ్‌ను తోసిపారేసేందుకు కూడా బీజేపీ సిద్ధమైనట్లు కనిపిస్తోంది. ఈసారి నితీశ్ ఛాయలో మనుగడ సాధించడం కాకుండా తన సొంత దారిలో తాను పయనించాలని బీజేపీ నిర్ణయించేసుకుంది. బీజేపీ ఆకాంక్షను రెండు విషయాలు ప్రజ్వరిల్లచేశాయి. ఒకటి, నితీశ్ ప్రజాదరణ ఇప్పుడు పూర్తిగా పడిపోయింది. ప్రతి సర్వే ఈ అంశాన్ని చాటి చెబుతోంది. లోక్‌నీతి–సీఎస్డీఎస్ సర్వేలో, 43 శాతం మంది ఓటర్లు మళ్లీ నితీశ్ ప్రభుత్వం రాకూడదని కోరుకుంటున్నట్లు తేలింది. 38 శాతం మంది మాత్రమే ఆయన మళ్లీ అధికారం చేపట్టాలని కోరుకుంటున్నారు. ఇక తన రేటింగులను చూస్తే నితీశ్ ప్రజాదరణ మరింతగా పడిపోయింది. 2010లో నితీశ్‌కు 77 శాతం మంది ఓటర్ల ఆమోదం ఉండేది. ఇక 2015 అసెంబ్లీ ఎన్నికల్లో అయితే అది 80 శాతానికి పెరిగింది. కానీ ఆ తర్వాతి నుంచి అది తగ్గుతూ 52 శాతానికి పడిపోయింది. మరీ దారుణంగా 2020 ఎన్నికల నాటికి అది 28 శాతానికి పడిపోవడం గమనార్హం. ఇకపోతే సీ–ఓటర్ సర్వే ప్రకారం చూస్తే, నితీశ్ ప్రభుత్వ పనితీరు పట్ల 25 శాతంమంది మాత్రమే సంతోషం వ్యక్తం చేస్తుండగా, 46 శాతం మంది అసమ్మతి వ్యక్తం చేశారు. నితీశ్ ఇప్పుడు తమకు ఏరకంగానూ విలువైన వ్యక్తి కాదని బీజేపీకి అర్థమైపోయింది. రెండు, 1990ల నుంచి బిహార్ ఎన్నికలను మండల్ యోధులే శాసిస్తూ వచ్చారు. తొలి 15 ఏళ్లలో అంటే 2005 సంవత్సరం వరకు రాష్ట్రంలో మండల్ ఉద్యమానికి లాలూయాదవ్ బలమైన ప్రతినిధిగా ఉండేవారు. అలాంటి లాలూ ఇప్పుడు జైలులో ఉన్నారు. లాలూ కుమారుడు తేజస్వి పార్టీ నాయకత్వాన్ని చేజిక్కించుకున్నారు. లాలూ యాదవ్ వారసత్వాన్ని మరుగునపర్చి తన సొంత ప్రతిష్టను పెంచుకోవడం కోసం తేజస్వి ప్రయత్నిస్తున్నారు. అణచివేతకు గురైన వెనుకబడిన కులం చైతన్యాన్ని తన తండ్రి లాలూ మేల్కొల్పడం కాదనలేని వాస్తవమని తేజస్వి గుర్తించాడు. తన తండ్రి కారణంగా ఆర్జేడీ సామాజిక పునాది చెక్కుచెదరలేదని తేజస్వికి తెలుసు కానీ ఎన్నికల్లో గెలవడానికి అది మాత్రమే సరిపోదని గ్రహించాడు. కొత్త సామాజిక పునాదిని తాను సృష్టించుకోవాలని, కొత్త ఆకాంక్షలను వ్యక్తపరుస్తున్న వర్గం విశ్వసనీయతను సాధించుకోవాలని బోధపర్చుకున్నాడు. అందుకే తాను గెలిస్తే 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను సృష్టిస్తానని హామీ ఇచ్చాడు. ఇది ఎన్నికల ఫలితాలను సమూలంగా మార్చగలుగుతుందా అనేది ఇకపై తేలాల్సి ఉంది. నితీశ్ కూడా మండల్ యోధుడే. వెనుకబడిన, పీడిత కులాల సామాజిక, రాజకీయ సాధికారతకు లాలూ బాధ్యుడు కాగా, ఈ సామాజిక బృందం ఆకాంక్షలకు నితీశ్ సాధనమయ్యారు. తన తొలి దఫా పాలనలో లాలూ అరాచకత్వాన్ని అరికట్టడానికి నితీశ్ ప్రయత్నిస్తూనే పీడిత కులాల ప్రాథమిక అవసరాలను తీర్చడానికి కృషి చేశారు. కానీ రెండో దఫా పాలనలో వాటిని పట్టించుకోలేదు. ఇక మూడోదశ పాలన మొత్తం అనిశ్చితి, అనాసక్తతతో గడిచింది. ఈ అన్నింటి పరిణామాల నేపథ్యంలో బీజేపీని వాడుకునే కళలో నితీశ్ రాటుదేలుతూ వచ్చారు. అధికారంలో ఉండటానికి తాను బీజేపీని వాడుకుంటే, మండల్ రాజకీయాల ప్రభావాన్ని తటస్థం చేయాడనికి బీజేపీ నితీశ్‌ని వాడుకుంది. అంతకుమించి హిందుత్వ రాజకీయాలను నితీశ్ ప్రోత్సహించలేదు. ఇప్పుడు నితీశ్ ఈ ఎన్నికల్లో గెలుపు సాధించకపోతే చిరాగ్ పాశ్వాన్‌ను దరిచేర్చుకుని నీతీశ్‌ని లక్ష్యంగా చేసుకోవాలని బీజేపీ చూస్తోంది. రాముడికి హనుమాన్ లాగా తాను మోదీని సేవించడానికి సిద్ధమని చిరాగ్ ప్రకటించేశాడు కాబట్టి బీజేపీ వెనక్కు తిరిగి చూసుకోవలసిన పనిలేదు కూడా. మరి నితీశ్ పరిస్థితి ఏమిటి? బిహార్ రాజకీయాల్లో ఆయన స్థానం వేగంగా పడిపోతోంది. అశుతోష్ – వ్యాసకర్త రచయిత, జర్నలిస్టు -
చర్చల కోసం ఒత్తిడే చైనా లక్ష్యం
సరిహద్దుల్లో భారత బలగాలపై చైనా ఆకస్మిక దాడి 1962 తర్వాత భారత్‌ను మరోసారి తీవ్ర సంక్షోభ పరిస్థితుల్లోకి నెట్టింది. 2014లో నరేంద్రమోదీ గద్దెకెక్కిన తర్వాత కేంద్రప్రభుత్వం ఎదుర్కొంటున్న అత్యంత తీవ్రమైన సంక్షోభంగా చెప్పుకోవచ్చు. భారత సైన్యం చైనా వాస్తవ ఉద్దేశాన్ని అర్థం చేసుకోవడంలో విఫలమైంది. ఇరు దేశాల సైనిక నేతలు పరిష్కారం కోసం చర్చిస్తున్న సమయంలోనే చైనా బలగాలు భారత్‌ను దెబ్బతీయాలని నిర్ణయించుకున్నాయి. అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ దేశాల కూటమిలో భారత్ భాగమవుతుండటం, జి7 దేశాల కూటమిలో భారత్ భాగస్వామి కావాలని అమెరికా సూచిస్తుండటంతో భారత్ ప్రచ్ఛన్న క్రీడలో పాల్గొంటోందన్న సందేహం చైనాకు బలంగా ఏర్పడింది. ఫలితంగానే భారత్‌కు ముగుదాడు వేయడం లక్ష్యంగా చైనా సైనిక దాడిని తలపెట్టింది. ఒక అగ్రరాజ్యం స్థాయికి చేరుకున్న చైనా భారత్‌తో పూర్తి స్థాయి యుద్ధాన్ని ప్రారంభించే ఉద్దేశంతో మన భూభాగంలోకి ప్రవేశించలేదు. 1962లో మావో జెడాంగ్ పేర్కొన్నట్లుగానే భారత్‌ను చర్చల ప్రక్రియకు ఒత్తిడి పెట్టటమే చైనా ఉద్దేశం. ఇది భారత్ ఆగ్రహంతో స్పందించాల్సిన సమయం కాదు. హెన్రీ కిసింజర్ కంటే ఉత్తమంగా చైనాను మరే దౌత్యవేత్త కూడా అర్థం చేసుకోలేరు. 1962లో భారత్–చైనా యుద్ధ నేపథ్యంలో కిసింజర్ ఒక ఆసక్తికరమైన ఘటనను వర్ణించారు. 1962 అక్టోబర్‌లో నాటి చైనా అధినేత మావో జెడాంగ్ బీజింగ్‌లో చైనా అత్యున్నత సైనిక కమాండర్లు, రాజకీయ నేతలతో సమావేశానికి పిలుపునిచ్చిన ఘటనను కిసింజర్ గుర్తు చేశారు. అది భారతదేశంతో చైనా సైనిక సంఘర్షణలో మునిగి ఉన్న సమయం. ఆనాటి ప్రతిష్టంభనను తేల్చిపడేయాలని మావో నిర్ణయించుకున్నారు. చైనా, భారత్‌లు శాశ్వత శత్రుత్వంతో అంతరించిపోవని మావో ఆ సమావేశానికి హాజరైన వారితో చెప్పారు. ఇరుదేశాలు మళ్లీ సుదీర్ఘ శాంతి కాలాన్ని గడుపుతాయని, కానీ అలా జరగాలంటే చైనా బలప్రయోగంతో భారత్‌ను దెబ్బతీసి తిరిగి చర్చల బల్లవద్దకు తీసుకురావాల్సి ఉంటుందని మావో చెప్పారు. ఆ తర్వాతే చైనా అనూహ్యంగా, భారత్ భూభాగంపై విధ్వంసకర దాడికి దిగి మళ్లీ మునుపటి ఆధీన రేఖకు తరలిపోయింది. ఈ క్రమంలో భారత్ నుంచి కైవసం చేసుకున్న భారీ ఆయుధాలను కూడా చైనా వెనక్కు ఇచ్చేసింది. నేడు, చైనా 1962 తర్వాత భారత్‌ను మరోసారి తీవ్ర సంక్షోభ పరిస్థితుల్లోకి నెట్టింది. గాల్వాన్ లోయలో చైనా బలగాలతో తాజాగా జరిగిన దొమ్మీలో 20 మంది భారతీయ సైనికులు అమరులయ్యారు. గాయపడిన సైనికుల సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉంటుంది. తూర్పు లద్దాఖ్‌లో 60 చదరపు మైళ్ల విస్తీర్ణంలో భారత భూభూగాన్ని చైనా ఆక్రమించిందని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. దీన్ని 2014లో నరేంద్రమోదీ గద్దెకెక్కిన తర్వాత కేంద్రప్రభుత్వం ఎదుర్కొంటున్న అత్యంత తీవ్రమైన సంక్షోభంగా చెప్పుకోవచ్చు. ఈ సంక్షోభం ఏప్రిల్ నెలలోనే ఉన్నట్లుండి మొదలైంది కానీ భారత సైన్యం చైనా వాస్తవ ఉద్దేశాన్ని అర్థం చేసుకోవడంలో విఫలమైంది. చైనా దూకుడు చర్యకు ఒక్క నిర్దిష్ట కారణాన్ని కూడా భారత ప్రభుత్వం కానీ, నిపుణులు కానీ ఎత్తి చూపలేకపోయారు. చైనా కూడా తన దూకుడు చర్యకు కారణాన్ని ఇప్పటివరౖకైతే వెల్లడించలేదు. కానీ చైనా బలగాలు ప్రదర్శించిన పరమ నిర్లక్ష్య వైఖరి గాభరా కలిగిస్తుంది. ఈ సమస్యకు ఇరు దేశాల సైనిక నేతలు పరిష్కారం కోసం చర్చిస్తున్న సమయంలోనే చైనా సైనిక బలగాలు భారత్‌ను చావు దెబ్బ కొట్టాలని నిర్ణయించుకున్నాయి. ఇరుసైన్యాల కమాండర్ల మధ్య చర్చలు జరిగిన తర్వాత చైనా, భారత బలగాలు కొన్ని కిలోమీటర్ల వెనక్కు తరలిపోయినట్లు సమాచారం. అయితే ఆధీన రేఖను దాటివచ్చింది చైనా బలగాలు అయితే భారత సైనిక బలగాలు ఎందుకు తిరోగమించాయి అన్నది నా అవగాహనకు అందనిది. భారతీయ భూభాగంలోకి ప్రవేశించింది చైనా బలగాలే. దీనివెనుక స్పష్టమైన ఉద్దేశం వెల్లడి కానందున, భారతీయ సైనికులను ఇలా చావుదెబ్బ తీయడం అనేది భారత్‌పై ఒత్తిడి ప్రయోగించి దాన్ని చర్చల బల్ల వద్దకు తీసుకొచ్చే ప్రయత్నాల్లో భాగంగానే జరిగిందని చెప్పవచ్చా? మరి సమస్య ఇదే అయితే చర్చలు దేనిపై జరుపుతారు, ఎందుకు జరపుతారు అనేది మరో ప్రశ్న. గత రెండు వారాలుగా భారత్‌పై తన ఆగ్రహానికి పలు కారణాలను పేర్కొంటూ చైనా ప్రభుత్వ అధికార వాణి అయిన ది గ్లోబల్ టైమ్స్ సూచనప్రాయంగా తెలుపుతూ వచ్చింది. దీనికి రెండు బలమైన కారణాలు బయటకు కనిపిస్తున్నాయి. వాటిలో మొదటిది అమెరికాతో భారత్ సన్నిహితంగా మెలగడం క్రమంగా పెరుగుతోంది. ఇండియా–పసిఫిక్ రీజియన్‌లో చైనా వ్యతిరేక కూటమిని సృష్టించడానికి భారతదేశం, అమెరికా ప్రయోజనాల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటోందని చైనా బలంగా నమ్ముతోంది. అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ దేశాల కూటమిలో భారత్ భాగమవుతుండటం, జి7 దేశాల కూటమిలో భారత్ భాగస్వామి కావాలని అమెరికా సూచిస్తుండటంతో అమెరికా తరపున భారత్ ప్రచ్ఛన్న క్రీడలో పాల్గొంటోందన్న సందేహం చైనాకు బలంగా ఏర్పడిపోయింది. తర్వాత భారత ప్రధాని నరేంద్రమోదీ అమెరికాలో హౌడీ మోదీ కార్యక్రమంలో డొనాల్డ్ ట్రంప్‌కు గౌరవ ఆహ్వానం పలకడం, అహమ్మదాబాద్‌లో నమస్తే ట్రంప్ కార్యక్రమంలో ట్రంప్‌కు భారీ ఎత్తున స్వాగతం పలకడం అనేవి చైనాను మండించాయి. భారత్‌తో అమెరికా మైత్రీ భాషణను చైనా చూస్తూ ఊరుకోలేదని 2020 ఫిబ్రవరి 23వ తేదీనే గ్లోబల్ టైమ్స్ పత్రిక రాసింది కూడా. ట్రంప్ భారత్ పర్యటనలో ఉన్నప్పుడు ఆ పత్రిక అలా రాసిందని మర్చిపోకూడదు. కాగా, 2020 జూన్ 5న గ్లోబల్ టైమ్స్ మరొక వ్యాసం ప్రచురించింది. మోదీ రెండో దఫా పాలనను ప్రారంభించినందున, చైనా పట్ల భారత్ వైఖరి మారిపోయింది. చైనాను లక్ష్యంగా చేసుకుంటున్న అమెరికా పధకాలు చాలావాటిలో భారత్ క్రియాశీలకంగా పాల్గొం టోందని చెప్పడం న్యాయంగా ఉంటుందన్నది ఆ వ్యాససారాంశం. ఆ తర్వాత స్పష్టంగానే చైనా తన వైఖరి గురించి సూచనలు పంపడం మొదలెట్టింది. చైనా హెచ్చరికలను భారత నాయకత్వం పట్టించుకోవలసి ఉండింది. నిస్సందేహంగానే ఒక దేశం ఆదేశాలకు అనుగుణంగా భారత్ వంటి సౌర్వభౌమాధికారం కలిగిన దేశం తన విదేశీ విధానాన్ని నిర్వహించుకోవడం వంటి ఒత్తిళ్లకు తలొగ్గలేదు. కానీ తన పొరుగునే ఉన్న చైనా వంటి శక్తివంతమైన దేశం అభిప్రాయాలను భారత్ విస్మరించలేదన్నది కూడా వాస్తవమే. రెండు, జమ్మూ కశ్మీర్ భౌగోళిక ముఖచిత్రాన్ని మార్చివేయడానికి మోదీ ప్రభుత్వం తలపెట్టిన ప్రయత్నం చైనా నాయకత్వానికి ఇష్టం లేదు. ఆర్టికల్ 370 రద్దుపై పార్లమెంటులో చర్చ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ, లద్దాక్‌లోని అక్సాయి చిన్ని కూడా భారత్ తన భూభాగంగా చూస్తోందని చెప్పడం చైనాను రెచ్చగొట్టింది. ఈ విషయమై చైనా సీనియర్ అధికారి వాంగ్ షిదా ఇటీవలే ఒక వ్యాసం రాశారుకూడా. ఆర్టికల్ 370 రద్దు అనేది పాకిస్తాన్, చైనాల సార్వభౌమాధికారానికి తీవ్ర సవాలుగా నిలిచిందని వాంగ్ ఆ వ్యాసంలో పేర్కొన్నారు. ఆ క్రమంలోనే ఆర్టికల్ 370 రద్దు తర్వాత పాకిస్తాన్‌కు చైనా బలంగా మద్దతునివ్వడం ప్రారంభించింది. చైనా ఒత్తిడి కారణంగానే గత 50 సంవత్సరాలలో మొదటిసారిగా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో కశ్మీర్ అంశం లాంఛనప్రాయంగా చర్చకు వచ్చింది. కాబట్టి, భారత భూభాగంలోని గాల్వన్ లోయ వంటి ప్రాంతాల్లోకి చైనా దళాలు ప్రవేశించడం అనేది సాధారణమైన ఘటన కాదని, ఆ దేశానికి ఇంకా పెద్ద కారణాలు ఉన్నాయనడానికి ఇది ఒక సంకేతం మాత్రమే. దీనికి అనుగుణంగానే భారతదేశం తన దౌత్యాన్ని నిర్వహించుకోవలసి ఉంది. ఈ మొత్తం వ్యవహారంలో ప్రధాని నరేంద్రమోదీకి తప్పు సలహాలు ఇచ్చినట్లు కనబడుతోంది. చైనా అగ్రనాయకత్వాన్ని సంతృప్తిపరచడానికి భారత ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నం చేపట్టలేదు. ఇప్పుడు ఆధీనరేఖలో భారతీయ సైనికుల హత్యా ఘటనతో ప్రధాని తన పదవీ బాధ్యతలను నిర్వహించడం కష్టమవుతుంది. పైగా మితిమీరిన జాతీయవాదాన్ని, యుద్ధోన్మాదాన్ని జపిస్తున్న తన పార్టీలోని సైద్ధాంతిక శ్రేణులు కాని, బయటి శక్తులు కానీ ఇప్పుడు కంటికి కన్ను, పంటికి పన్ను మాత్రమే ఇప్పుడు సరైన పరిష్కారమని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావచ్చు. ఈ ఒత్తిడికి లోబడకపోతే మోదీ నాయకత్వంపై వీరు దాడి చేయవచ్చు కూడా. అయితే ఇక్కడ వివాదాస్పదమైన ప్రశ్న ఏమిటంటే, భారత్ మరింత దూకుడుగా వ్యవహరించాల్సి ఉంటుందా? రెండు కారణాలతో ఈ ప్రశ్నకు లేదు అన్నదే సమాధానం అని చెప్పాల్సి ఉంటుంది. మొదటిది, చైనా తన సైనిక చర్యల సమయాన్ని అత్యంత జాగ్రత్తగా ఎంచుకుంది. భారత్ కరోనా వైరస్ నేపథ్యంలో లాక్ డౌన్లో ఉన్నప్పుడు, కుప్పకూలిపోయిన ఆర్థిక వ్యవస్థతో తలమునకలై ఉన్నప్పుడు భారతీయ భూభాగంలోకి చైనా అడుగుపెట్టింది. రెండు, చైనా ప్రతి సంవత్సరం 261 బిలియన్ డాలర్లు రక్షణరంగంపై వెచ్చిస్తుండగా, భారత్ 71 బిలియన్ డాలర్లను మాత్రమే రక్షణ రంగంపై వెచ్చిస్తోంది. 2000 సంవత్సరం నుంచి చైనా పకడ్బందీ పథకం అమలు చేస్తూ 2049 నాటికల్లా ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సైన్యాన్ని తయారు చేయాలని కంకణం కట్టుకుంది. ఇక బీజేపీ నాయకులు, మద్దతుదారుల విషయానికి వస్తే మోదీ నాయకత్వంలోని భారత్ 1962 నాటి నెహ్రూ పాలన నాటి భారత్‌లా లేదని గర్వంగా ప్రకటిస్తున్నారు. జాతీయ టీవీ చానెల్స్ కూడా ఇలాంటి వాణినే డాంబికంగా ప్రసారం చేస్తున్న నేపథ్యంలో ఇలాంటి ప్రకటనలు ఆకర్షణీయంగానే ధ్వనించవచ్చు. కానీ వాస్తవం ఏమిటంటే నేడు చైనా ఒక అగ్రరాజ్యం. ప్రపంచ రాజకీయాల్లో అత్యంత ప్రభావితంగా ఉంటున్న అమెరికాను ఆ స్థానం నుంచి తొలగించాలనే స్పష్టమైన ఆకాంక్షతో చైనా ముందుకెళుతోంది. పైగా భారత్ ఒక బాధ్యతాయుతమైన దేశం. సరిహద్దు ఘర్షణలను తగ్గించడానికి దౌత్యపరమైన, తెరవెనుక చర్చలపైనే భారత్ ఆధారపడాలి. భారత్‌తో పూర్తి స్థాయి యుద్ధాన్ని ప్రారంభించే ఉద్దేశంలో చైనా మన భూభాగంలోకి ప్రవేశించలేదు. 1962లో మావో జెడాంగ్ పేర్కొన్నట్లుగానే భారత్‌ను చర్చల ప్రక్రియకు ఒత్తిడి పెట్టటమే చైనా ఉద్దేశం. ఈ నేపథ్యంలో ఇది భారత్ ఆగ్రహంతో స్పందించాల్సిన సమయం కాదు. అశుతోష్ వ్యాసకర్త జర్నలిస్టు, రచయిత -
మహీంద్రా కొత్త ఈక్విటీ స్కీం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మహీంద్రా మ్యూచువల్ ఫండ్ ‘టాప్ 250 నివేష్ యోజన’ పేరుతో కొత్త ఈక్విటీ స్కీంను ప్రవేశపెట్టింది. ఈ ఓపెన్ ఎండెడ్ ఈక్విటీ స్కీం డిసెంబరు 6న ప్రారంభమై అదే నెల 20న ముగుస్తుంది. ఈక్విటీ, ఈక్విటీ సంబంధ సెక్యూరిటీల్లో 80 శాతం మొత్తాన్ని ఇన్వెస్ట్ చేస్తామని కంపెనీ ఎండీ అశుతోష్ బిష్ణోయ్ శుక్రవారమిక్కడ మీడియాకు తెలిపారు. లార్జ్, మిడ్ క్యాప్ కంపెనీల్లో 65 శాతం వరకు ఈ పెట్టుబడి ఉంటుందని చెప్పారు. 20 శాతం వరకు డెట్, మనీ మార్కెట్ సెక్యూరిటీస్‌లో ఇన్వెస్ట్ చేసేందుకు ఏర్పాటు చేశామన్నారు. కంపెనీ నుంచి ఇది ఎనిమిదవ పథకం. మహీంద్రా మ్యూచువల్ ఫండ్ నిర్వహిస్తున్న ఏడు ఈక్విటీ పథకాల్లో రాబడులు 17–20 శాతం ఉన్నాయని ఆయన వెల్లడించారు. -
ఆమ్ ఆద్మీ పార్టీకి మరో షాక్..
సాక్షి, న్యూఢిల్లీ : ఆమ్ ఆద్మీ పార్టీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత ఆశుతోష్ పార్టీని వీడి వారం గడవక ముందే మరో నేత ఆశిష్ ఖేతన్ పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఆగస్ట్ 15నే ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు పంపినట్లు అశిష్ ఖేతన్ ప్రకటించారు. తాను లీగల్ ప్రాక్టీస్ చేసేందుకు, కుటుంబ సభ్యులతో గడిపేందుకు క్రీయాశీల రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటున్నట్లు బుధవారం సోషల్ మీడియా పోస్ట్ చేశారు. ప్రభుత్వ సలహా మండలైన ఢిల్లీ డైలాగ్ డెవలప్మెంట్ కమిషన్ నుంచి గత ఏప్రీల్‌లోనే ఖేతన్ వైదొలిగిన విషయం తెలిసిందే. జర్నలిస్ట్‌గా తన ప్రయాణాన్ని ప్రారంభించిన ఖేతన్ ఆప్ ఏర్పడిన మొదటిలోనే పార్టీలో చేరి కీలక నేతగా ఎదిగారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో న్యూఢిల్లీ లోక్‌సభ స్థానం నుంచి పోటీచేసి.. బీజేపీ అభ్యర్థి మీనాక్షీ లేఖీ చేతిలో ఓటమిపాలైయారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ టికెట్ ఆశిస్తున్నారని, దానికి పార్టీ వర్గాలు అభ్యంతరం వ్యక్తం చేసిందుకే ఆయన పార్టీకి రాజీనామా చేశారని ఆప్ వర్గాలు వెల్లడించాయి. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీ సీనియర్ నేతల రాజీనామాలు ఆప్‌ను కలవరపెడుతున్నాయి. -
ఆప్‌కు కీలక నేత రాజీనామా...
న్యూఢిల్లీ: ఢిల్లీలో అధికార ఆమ్ ఆద్మీ పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. పార్టీ వ్యవస్థాపక నేతల్లో ఒకరైన అశుతోష్ బుధవారం ఆప్‌కు రాజీనామా చేశారు. అత్యంత వ్యక్తిగత కారణాలరీత్యా తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ‘ప్రతి ప్రయా ణానికి ముగింపు ఉంటుంది. ఆమ్ ఆద్మీ పార్టీతో నా అనుబంధం చాలా అందమైనది, విప్లవాత్మకమైంది. దీనికి కూడా ముగింపు ఉంటుంది. పార్టీకి రాజీనామా చేశా. పార్టీకి, నాకు ఇన్నాళ్లు మద్దతుగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు’ అంటూ ట్విట్టర్లో పేర్కొన్నారు. ఓ వ్యాపార వేత్తను పార్టీ తరఫున రాజ్యసభకు ఎంపీగా పంపడంపై అశుతోష్ అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. అంతేగాక తనకు ఆ టికెట్ ఇవ్వలేదని కినుక వహిస్తున్నట్లు కొందరు పేర్కొంటున్నారు. అయితే ఈ వార్తలను ఆప్ కన్వీనర్ గోపాల్ రాయ్ కొట్టిపారేశారు. రాజీనామాపై కేజ్రీవాల్ స్పందిస్తూ.. ‘‘మీ రాజీనామాను ఎలా ఆమోదించాలి. నా, ఇస్ జన్మ్ మే తో నహీ(ఈ జన్మలో ఇది సాధ్యం కాదు)’’అంటూ వివరించారు. అశుతోష్ జర్నలిస్ట్ నుంచి రాజకీయ నేతగా మారారు. రాజీనామాను వెనక్కు తీసుకోవాల్సిందిగా కోరుతున్నట్లు ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ తెలిపారు. -
ఈ జీవితకాలంలో అది సాధ్యం కాదు
సాక్షి, న్యూఢిల్లీ : ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సీనియర్ నేత, ప్రముఖ జర్నలిస్ట్ అశుతోష్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించగా.. దానిని పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తిరస్కరించారు. వ్యక్తిగత కారణాల వల్ల పార్టీకి నుంచి తప్పుకుంటున్నట్లు అశుతోష్ బుధవారం ట్వీట్ చేశారు. కేజ్రీవాల్‌కి అత్యంత సన్నిహితుడైన అశుతోష్.. ప్రస్తుతం పబ్లిక్ అఫైర్స్ కమిటీ (పీఏసీ) సభ్యుడిగా ఉన్నారు. గత రెండు నెలలుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ఆశుతోష్.. అనూహ్య నిర్ణయంతో కేజ్రీవాల్ షాక్ తిన్నారు. వెంటనే ఆయన రాజీనామాను నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తున్నట్టు ప్రకటించారు. ‘మీ రాజీనామాను ఎలా ఆమోదిస్తామని అనుకున్నారు? నా జీవితకాలంలో అది సాధ్యం కాదు’ అని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. సర్, మేమంతా మిమ్మల్ని ప్రేమిస్తున్నామంటూ మరో ఆప్ సీనియర్ నేత గోపాల్‌రాయ్ ట్వీట్ చేశారు. రాజీనామాను ఉపసంహరించుకోవాలని, ఏవైనా భేదాభిప్రాయాలు ఉంటే చర్చించుకుందామని పార్టీ నేతలు అశుతోష్‌కు నచ్చజెప్తున్నట్టు తెలుస్తోంది. అశుతోష్ గత ఎన్నికల్లో ఢిల్లీలోని చాందిని చౌక్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. గతంలో ఢిల్లీ నుంచి రాజ్యసభకు ఎన్నికవుతారంటూ వార్తలు వచ్చినా కేజ్రీవాల్ ఆయన స్థానంలో మరొకరికి అవకాశం ఇచ్చిన విషయం తెలిసిందే. ఆప్‌తో తన ప్రయాణం ఇక ముగిసిందని, తనకు అండగా నిలిచిన పార్టీ శ్రేణులందరికీ ధన్యావాదాలంటూ అశుతోష్ అంతకుముందు ట్విటర్లో పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో అశుతోష్ రాజీనామా పార్టీపై తీవ్ర ప్రభావం చూపుతుందని, ఈ నిర్ణయాన్ని ఆయన ఉపసంహరించుకునేలా చూడాలని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. -
ఆప్‌కి షాక్ ఇచ్చిన సీనియర్ నేత
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌కి దేశ స్వాతంత్ర్య దినోత్సవం రోజున షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, ప్రముఖ జర్నలిస్ట్ అశుతోష్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. వ్యక్తిగత కారణాల వల్లన పార్టీకి నుంచి తప్పుకుంటున్నట్లు బుధవారం ట్వీట్ చేశారు. కేజ్రీవాల్‌కి అత్యంత సన్నిహితుడైన అశుతోష్.. ప్రస్తుతం పబ్లిక్ అఫైర్స్ కమిటీ (పీఏసీ) సభ్యుడిగా ఉన్నారు. గత రెండు నెలలుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ఆశుతోష్.. అనూహ్య నిర్ణయంతో పార్టీ నేతలు షాక్ తిన్నారు. గత ఎన్నికల్లో ఢిల్లీలోని ఛాందిని చౌక్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. గతంలో ఢిల్లీ నుంచి రాజ్యసభకు ఎన్నికవుతారంటూ వార్తలు వచ్చినా కేజ్రీవాల్ ఆయన స్థానంలో మరోకరికి అవకాశం ఇచ్చిన విషయం తెలిసిందే. ఆప్‌తో తన ప్రయాణం ఇక ముగిసిందని, తనకు అండగా నిలిచిన పార్టీ శ్రేణులందరికీ ధన్యావాదాలని ట్విటర్లో పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో అశుతోష్ రాజీనామా పార్టీపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. Every journey has an end. My association with AAP which was beautiful/revolutionary has also an end.I have resigned from the PARTY/requested PAC to accept the same. It is purely from a very very personal reason.Thanks to party/all of them who supported me Throughout.Thanks. — ashutosh (@ashutosh83B) August 15, 2018 -
'నన్ను ఉరి తీయాలంటారా?'
న్యూఢిల్లీ: మాజీ మంత్రి సందీప్ కుమార్ వీడియో టేపు వ్యవహారంపై స్పందిస్తూ ఆప్ అధికార ప్రతినిధి అశుతోష్ ఓ టీవీ చానెల్ కు రాసిన కాలమ్ వివాదాస్పదమైంది. మహిళలపై అభ్యంతరకమైన కామెంట్లు చేశారంటూ ప్రతిపక్షాలు ఈ మేరకు కేంద్ర మహిళా కమిషన్(సీడబ్ల్యూసీ)కు ఫిర్యాదు చేశాయి. ఫిర్యాదులు స్వీకరించిన సీడబ్ల్యూసీ ఆప్ నేత అశుతోష్ ను తన ముందు హజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది. సీడబ్ల్యూసీ ఆదేశాలపై స్పందించిన అశుతోష్.. కాలమ్ రాస్తే తనను ఉరితీస్తారా? అని ట్విట్టర్ ద్వారా ప్రశ్నించారు. భారత్ నియంతృత్వ దేశంగా మారుతోందా? అంటూ మరో ట్వీట్ చేశారు. దేశంలో చాలా మంది బడా నేతలకు చీకటి చరిత్రలు ఉన్నాయని అశుతోష్ కాలమ్ లో రాశారు. వాటి కారణంగా వారు రాజకీయం ఏనాడు నష్టపోలేదని అన్నారు. మీడియా సందీప్ విషయంలో ఎక్కువగా స్పందించిందని ఘాటుగా వ్యాఖ్యానించారు. పలు రకాల దృష్టి కోణాల కారణంగా పార్టీ సందీప్ ను తొలగించిందని ఆయన తన కాలమ్ లో పేర్కొన్నారు. అశుతోష్ విచారణకు హజరుకావాలనే ఆదేశాలపై ఎన్ డబ్ల్యూసీ చైర్మన్ లలిత కుమారమంగళం మీడియాతో మాట్లాడారు. గురువారం ఎన్ డబ్ల్యూసీ ముందు హాజరుకావాలనే ఆదేశాలను అశుతోష్ గౌరవిస్తారని భావిస్తున్నామని అన్నారు. సందీప్ కుమార్ ను సమర్ధిస్తూ ఆయన కాలమ్ లో రాసిన విషయాలు తప్పని ఒప్పుకోవాలని అన్నారు. అశుతోష్ రాసిన కాలమ్ మహిళలను కించపరిచేవిధంగా ఉందని చెప్పారు. -
కష్టాల్లో మరో ఆప్ నేత!
ముంబయి: మరో ఆమ్ ఆద్మీ పార్టీ నేత కష్టాల్లో పడే అవకాశం ఉంది. తమ పార్టీ నేతకు మద్దతిచ్చే క్రమంలో జాతీయ నాయకులపై నిందలు వేసినట్లుగా మాట్లాడటమే ఈ పరిస్థతికి కారణమైంది. లైంగిక దాడికి పాల్పడినట్లు ఓ సీడీ లీకవడమే కాకుండా.. బాధితురాలు కూడా ఫిర్యాదు చేయడంతో ఆప్ బహిష్కృతమంత్రి సందీప్ కుమార్‌పై కేసు నమోదుచేసిన పోలీసులు అరెస్టు చేసి అనంతరం ఒక రోజు కస్టడీకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమ్ ఆద్మీ పార్టీ నేత అశుతోష్ మాట్లాడుతూ జవహార్ లాల్ నెహ్రూ, మహాత్మాగాంధీకి కూడా అక్రమ వ్యవహారాలు ఉన్నాయని ఆరోపించారు. ఈ నేపథ్యంలో అఖిలేశ్ తివారీ అనే వ్యక్తి ఆయనపై ఫిర్యాదు చేశాడు. నెహ్రూ, గాంధీవంటి జాతీయ నాయకులపై ఆరోపణలు చేసి దేశం మొత్తాన్ని అవమానించారని, ప్రజలను ఇబ్బంది పెట్టారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే, ఫిర్యాదు తీసుకున్న పోలీసులు ఈ కేసు నమోదు విషయాన్ని పరిశీలిస్తున్నారు. ఆధారాల కోసం దర్యాప్తు చేస్తున్నారు. ముంబయిలోని సకానికా స్టేషన్లో ఈ ఫిర్యాదు చేశారు. -
ఎక్కడ వినాశనం జరిగినా కేంద్ర మంత్రి ఇక్కడే!
కేంద్ర మంత్రి మనోహర్ పారికర్ పై గోవా ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్ర విమర్శలు చేసింది. ఆప్ అధికార ప్రతినిధి అశుతోష్ మీడియాతో మాట్లాడారు. పంజాబ్ లోని పఠాన్ కోట్ లో ఉగ్రదాడులు జరిగినప్పుడు, మహారాష్ట్ర పుల్గావ్ లోని ఆర్మీ డిపోలో పేలుడు సంభవించినప్పుడు రక్షణశాఖ మంత్రి మనోహర్ పారికర్ సొంత రాష్ట్రం గోవాలోనే ఉన్నారని మండిపడ్డారు. ఆయన కేంద్ర మంత్రిగా ఉండటం వల్ల దేశ రక్షణకే ముప్పు వాటిల్లే అవకాశాలున్నాయని ఆరోపించారు. రాష్ట్ర పాలనా వ్యవహారాల్లో తలదూర్చడం మాని దేశ రక్షణ వ్యవహారాలను చూసుకోవాలని సూచించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికైనా పారికర్ కు పుల్గావ్ కి వెళ్లి అక్కడ పరిస్థితులను చూడాలని చెప్పాలని పేర్కొన్నారు. గోవాను ఇద్దరు పరిపాలిస్తున్నారని చెప్పారు. ఒకరు ప్రస్తుత సీఎం లక్ష్మీకాంత్ పర్సేకర్ కాగా, రెండో వ్యక్తి మనోహర్ పారికర్ అని పేర్కొన్నారు. గోవా ముఖ్యమంత్రి ఎవరన్నది తమకు అర్థం కావడం లేదని అశుతోష్ వ్యాఖ్యానించారు. యూపీఏ హయాంలో ఫైళ్లను చక్కబెట్టేందుకు అధికారులు కాంగ్రెస్ అధినేత్రి సోనియాను కలిసేవారని, అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ను కాదు అని బీజేపీ విమర్శలు చేసేది. సీఎంగా పర్సేకర్ ఉన్నా, పారికర్ తన క్యాంపు ఆఫీసులో సెక్రటరీలు, ఉన్నతాధికారులతో చర్చలు జరుపుతున్నారు. గతంలో యూపీఏ చేస్తే సహించలేదు.. ఇప్పుడు బీజేపీ అదే పని చేస్తోందంటూ ఆప్ ముఖ్యనేతలు విమర్శించారు. -
కళాశాల యాజమాన్యం వేధింపులు తాళలేక...
కళాశాల యాజమాన్యం వధింపులు తాళలేక ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. వివరాలు.. హయాత్‌నగర్ మండలం గుంతపల్లిలో కన్సెల్టెన్సీ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న బీహార్‌కు చెందిన ఆశుతోష్ అనే వ్యక్తి నోవా ఇంజనీరింగ్ కళాశాలలో తన కన్సల్టెన్సీ ద్వార విద్యార్థులని జాయిన్ చేయించాడు. దానికి సంబంధించి రావాల్సిన డబ్బులు కళాశాల యాజమాన్యం ఇవ్వకపోవడంతో.. మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ఇది గుర్తించిన స్థానికులు అతన్ని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
'ఉగ్రవాదిని చంపినట్టూ నిన్నూ చంపేస్తాం'
న్యూఢిల్లీ: జేన్యూ వివాదంపై స్పందించినందుకు తనను చంపేస్తామని 24 గంటల్లో తనకు రెండుసార్లు బెదిరింపులు వచ్చాయని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సీనియర్ నేత అశుతోష్ తెలిపారు. జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ)లో ఉగ్రవాది అఫ్జల్ గురుకు అనుకూలంగా కార్యక్రమం నిర్వహించడం, ఈ విషయంలో విద్యార్థులను అరెస్టు చేయడంతో వివాదం రోజురోజుకు తీవ్రతరమవుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో తనను చంపేస్తామంటూ బెదిరింపులు వస్తున్నాయని ఆప్ నేత అశుతోష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 'జేఎన్‌యూ వ్యవహారంలో చంపేస్తామంటూ వాట్సాప్‌లో నాకు బెదిరింపులు వస్తున్నాయి. ఉగ్రవాదిని చంపినట్టే మేం నిన్ను చంపేస్తామని హెచ్చరించారు. 24 గంటల్లో ఇలా బెదిరింపులు రావడం రెండోసారి. దీని గురించి పోలీసులకు తెలియజేశా' అని అశుతోష్ ట్విట్టర్లో తెలిపారు. -
దేశవ్యాప్తంగా ఢిల్లీ మోడల్
న్యూఢిల్లీ : ఢిల్లీ మోడల్‌ను వచ్చే ఐదు సంవత్సరాల్లో దేశవ్యాప్తంగా విస్తరిస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకుడు ఆశుతోశ్ చెప్పారు. తాను రచించిన ‘ముఖోతా కా రాజధర్మ’ అనే పుస్తకాన్ని ఢిల్లీ అంతర్జాతీయ పుస్తక మేళాలో మంగళవారం ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తొలుత పంజాబ్‌పై దృష్టి సారిస్తామన్నారు. 2017లో పంజాబ్ శాసనసభకు జరగనున్న ఎన్నికల్లో భారీఎత్తున బరిలోకి దిగుతామన్నారు. ‘రానున్న ఐదు సంవత్సరాల వ్యవధిలో రాజకీయాల్లో కచ్చిత ంగా ఓ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతాం. పంజాబ్ ఎన్నికల్లో ఘనవిజయం సాధిస్తాం. ఏదిఏమైనప్పటికీ ఢిల్లీని ఓ మోడల్‌గా తీర్చిదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉంది.’ అని అన్నారు. ‘భారత్ మారిపోతోందని భావిస్తున్నా. అయితే రాజకీయాల్లో మాత్రం మార్పు రావడం లేదు. రాజకీయాలకు నేను తగనని మొదట్లో భావించేవాడిని. అయితే అది పొరపాటనే విషయం తర్వాత అర్ధమైంది. రాజకీయ నేతలకు నిజాయతీ నిజాయితీ ఉండాలనేది నా అభిప్రాయం ’ అని అన్నారు. కాగా 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఆప్... పంజాబ్‌లో నాలుగు స్థానాలను కైవసం చేసుకున్న సంగతి విదితమే. -
నాన్న ప్రేమ కోసం...
టీవీక్షణం తల్లిదండ్రుల ప్రేమే పిల్లలకు బలం. అలాంటిది తన కన్నతండ్రికి తనమీద ప్రేమే లేదని తెలిస్తే ఆ కూతురి పరిస్థితి ఎలా ఉంటుంది?! మనసు బాధతో కుమిలిపోతుంది. ఆవేదన పొంగి పొరలుతుంది. అంజలికి కూడా అలానే అవుతుంది. 21 ఏళ్ల వయసులో తన తండ్రి ఆడపిల్లను వద్దనుకున్నాడని, అందుకే అతడికి తన మీద ప్రేమ లేదన్న నిజం తెలిసి షాక్ తింటుందామె. అతడి మనసులో ఎలాగైనా చోటు సంపాదించాలని తహతహలాడుతుంది. దానికోసం తీరకుండా మిగిలిపోయిన అతడి కలను తన కలగా చేసుకుంటుంది. ఆయన అందుకోలేకపోయిన లక్ష్యాన్ని తాను అందుకోవాలి, ఆయన సాధించలేకపోయిన విజయాన్ని తాను సాధించి చూపించాలని నిర్ణయించుకుంటుంది. ఏమిటా లక్ష్యం? దాన్ని ఆమె సాధిస్తుందా, తండ్రి ప్రేమను పొందుతుందా అన్నది తెలుసుకోవాలంటే... ‘స్టార్ ప్లస్’లో ప్రసారమయ్యే ‘ఎవరెస్ట్’ సీరియల్ చూడాలి. బాలీవుడ్ దర్శకుడు, నిర్మాత అశుతోష్ గోవారికర్ తను రాసిన కథతో నిర్మిస్తోన్న ఈ సీరియల్, ఆదిలోనే సక్సెస్ టాక్ తెచ్చుకుంది. హీరోయిన్ తండ్రికి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాలన్న వైవిధ్యభరితమైన లక్ష్యాన్ని పెట్టడం, అది తీరకపోవడంతో కూతురు ఎవరెస్ట్ ఎక్కి, తండ్రి కలను నెరవేర్చాలని తపించడం అన్న పాయింట్‌తో కథని అల్లడంలోనే అశుతోష్ సగం విజయాన్ని సాధించేశారు. దానికితోడు అంజలి పాత్రకు షమతా ఆచన్ చక్కగా సరిపోయింది. ఆమె అందం, ఆకర్షణ, నటన కచ్చితంగా సీరియల్‌కి ప్లస్ పాయింట్సే. ఇక తొలిసారిగా రెహమాన్ సంగీతం అందించిన సీరియల్ ఇదే కావడం... ఇంకో పెద్ద ప్లస్. ఇన్ని ప్లస్సులు కలిసినప్పుడు ఆ సీరియల్ సక్సెస్‌ను ఎవరు మాత్రం ఆపగలరు! -
న్యూఢిల్లీ నుంచే కేజ్రీవాల్ పోటి: ఆప్
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచే పోటి చేస్తారని ఆప్ ఆద్మీ పార్టీ నేత అశుతోష్ అన్నారు. కేజ్రీవాల్ నియోజకవర్గం మార్చుకుంటారని వస్తున్న వార్తల్ని అశుతోష్ ఖండించారు. కేజ్రివాల్ నియోజకవర్గం మార్చుకోవడం లేదు. న్యూఢిల్లీ అసెంబ్లీ సీటు నుంచే పోటి చేస్తారని, అతని నాయకత్వంలోనే పార్టీ ఎన్నికల్లో పోటి చేస్తుందని ఆయన తెలిపారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల కోసం విడుదల చేసిన జాబితాలో కేజ్రీవాల్ పేరు కనిపించకపోవడంతో మీడియా అడిగిన ప్రశ్నలకు అశుతోష్ స్పందించారు. -
హాట్‌టాపిక్: ప్రతిష్టాత్మక చాందినీచౌక్
చాందినీచౌక్ చరిత్రాత్మక ప్రదేశం. మొఘల్ చక్రవర్తి షాజహాన్(1628-1658) తన రాజధానిని ఆగ్రా నుంచి ఢిల్లీకి మార్చాలనుకున్నప్పుడు యమునా నది తీరాన ఎర్రకోటను నిర్మించారు. ఎర్రకోటలో నివసించే వారి కోసం ఒక బజారు అవసరమని భావించిన షాజహాన్ కుమార్తె జంహా ఆరా చాందినీ చౌక్ బజార్‌కు రూపకల్పన చేశారు. చంద్రుడి వెన్నెల ప్రతిబింబించేలా అప్పట్లో ఈ బజారు మధ్యలో ఓ కొలను ఏర్పాటు చేశారు. కాలక్రమంలో కొలను పూడుకుపోయినా బజారు పేరు చాందినీ చౌక్ చిర స్థాయిగా నిలిచిపోయింది. ఢిల్లీలో ప్రసిద్ది చెందిన చాందినీచౌక్ పేరును మార్చి, సచిన్ టెండూల్కర్ పేరు పెట్టాలన్న ప్రతిపాదన మూడేళ్ల క్రితం ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌కు వచ్చింది. దానిని అందరూ తీవ్రంగా వ్యతిరేకించారు. చాందినీచౌక్ పేరు మార్చడమంటే దేశ సాంస్కృతిక వారసత్వాన్ని అవమానించినట్లుగా భావించారు. చాందినీచౌక్‌ను షాజహాన్ నిర్మించాడని, ఈ పేరును మార్చడం ఈ నగరానికి ఉన్న చరిత్రను కించపర్చడమే అవుతుందని పలువురు పేర్కొన్నారు. దేశరాజధానిలోని ప్రముఖ వాణిజ్య కేంద్రమైన చాందినీచౌక్‌లోని అన్ని వ్యాపార సంస్థలను ఆన్లైన్లో పెట్టినట్లు గూగల్ ఇండియా తెలిపింది. ఇక్కడ వివిధ కేటగిరీలకు సంబంధించి మొత్తం 2500 వ్యాపార సంస్థలున్నాయి. వీటన్నింటికి ప్రత్యేకంగా ఒక్కో వెబ్‌సైట్‌ను కూడా రూపొందించారు. చాందినీ చౌక్ ప్రాంతంలో వ్యాపారస్తులే అధికం. అందుకే లోక్‌సభ, శాసనసభ ఎన్నికల్లో ఈ ప్రాంతం నుంచి వ్యాపారులు లేదా ఆ వర్గానికి చెందిన వారే గెలుస్తూ ఉంటారు. ఇంతటి చారిత్రక ప్రాముఖ్యత గల ఈ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఈ సారి ముగ్గురు హేమాహేమీలు పోటీపడుతున్నారు. ఈ నెల10న ఇక్కడ ఎన్నికలు జరుగనున్నాయి. కాంగ్రెస్ తరపున కేంద్ర న్యాయ శాఖ మంత్రి కపిల్ సిబల్, బిజెపి నుంచి పార్టీ సీనియర్ నేత హర్షవర్థన్, ఆమ్ అద్మీ పార్టీ నుంచి ప్రముఖ జర్నలిస్ట్ టీవీ యాంకర్ అషుతోష్ పోటీ చేస్తున్నారు. కపిల్ సిబల్: పంజాబ్‌కు చెందిన కపిల్ సిబల్ గత ఎన్నికలలో ఇక్కడ నుంచే గెలుపొందారు. సాదారణంగా ఇక్కడ నుంచి వ్యాపారులు లేక ఆ వర్గానికి చెందినవారే గెలుస్తూ ఉంటారు. చాందినీ చౌక్ ప్రాంతంలో పంజాబీల సంఖ్య అధికం. తన రాష్ట్ర ఓటర్ల బలంతోనే గతంలో ఆయన ఇక్కడ నుంచి విజయం సాధించారు. అయితే ప్రస్తుత పరిస్థితులలో సిబల్ మళ్లీ ఇక్కడ నుంచి పోటీ చేయడానికి ఇష్టపడలేదు. పంజాబ్‌లోని ఏదో ఒక లోకసభ నియోజకవర్గం నుండి పోటీ చేస్తానని ఆయన కాంగ్రెస్ అధిష్టానికి చెప్పారు. ఫలితంలేదు. ఆయన మాట అధిష్టానం వినలేదు. విధిలేని పరిస్థితులలో సిబల్ మరోసారి చాందినీ చౌక్ నుంచి పోటీకి సిద్ధపడ్డారు. హర్షవర్థన్: వ్యాపార వర్గానికి చెందిన హర్షవర్ధన్ బిజెపి సీనియర్ నేత. హర్షవర్థన్ ఇటీవల ఢిల్లీ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచారు. బిజెపికి తగిన సంఖ్యాబలం ఉంటే ఆయనే ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించి ఉండేవారు. స్థానికుడైన హర్షవర్థన్‌కు ఓటర్లతో సన్నిహిత సంబంధాలున్నాయి. వృత్తిపరంగా వైద్యుడైన ఆయనను మిత్రులు, ప్రత్యర్థులు కూడా ‘డాక్టర్ సాబ్’ అని పిలుస్తారు. అషుతోష్: ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి అషుతోష్ ప్రముఖ టీవీ చానల్లో పనిచేసి ఢిల్లీ ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు. ఆ టీవీ చానల్లో యాంకర్‌గా పని చేసినంత కాలం వైశ్య కులాన్ని సూచించే పేరు ‘గుప్తా’ను పెట్టుకోలేదు. ఇప్పుడు నామినేషన్ వేసే సమయంలో మాత్రం తన పేరు చివర ‘గుప్తా’ను తగిలించుకున్నారు. చాందీనీ చౌక్‌లో గణనీయ సంఖ్యలో ఉన్న వైశ్యుల మద్దతు సంపాదించేందుకే ఆయన ‘గుప్తా’గా పరిచయం చేసుకున్నారు. ఈ ముగ్గురిలో ఎవరి అంచనాలు వారికి ఉన్నాయి. ఇక్కడ ముస్లిం ఓటర్ల సంఖ్య కూడా గణనీయంగానే ఉంది. బిజెపి ప్రధాన మంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీపై ఉన్న వ్యతిరేకత వల్ల ముస్లిం ఓట్లు తనకే పడతాయని కపిల్ సిబల్ ఆశ. వ్యాపార వర్గం ఓట్లు తనకే పడతాయన్నది హర్షవర్థన్ అభిప్రాయం. ఇక మిగిలిన సామాన్య ఓటర్ల మద్దతు తనకేనన్నది అశుతోష్ గుప్తా అంచనా. -
ఆప్ సభపై దాడి
ఢిల్లీ చాందినీ చౌక్ లో ఆమ్ ఆద్మీ పార్టీ బహిరంగసభపై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. చాందినీ చౌక్ నియోజకవర్గంలోని సీతారామ్ బాజార్ లో ఆప్ సభ జరుగుతూండగా దగ్గర్లోని ఒక భవనం నుంచి బాటిళ్లు విసిరారు. దీనితో సభలో గందరగోళ వాతావరణం నెలకొంది. ఎక్కడివారక్కడ పరుగులు తీశారు. సభలో చాందినీ చౌక్ అభ్యర్థి అశుతోష్, మరికొందరు నాయకులు ఉన్నారు. ఒక మహిళా కార్యకర్త ప్రసంగిస్తూండగా ఈ దాడి జరిగింది. అయితే అదృష్ట వశాత్తూ ఈ దాడిలో ఎవరూ గాయపడలేదు. తక్షణమే పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఆ తరువాత ఒక ముప్పావుగంటకి మళ్లీ సభ మొదలైంది. 'ఇలాంటి దాడులను అందరూ గర్హించాలి. ఇది ప్రజాస్వామ్యం కానేకాదు. మాకు ఇలాంటి దాడులంటే భయం లేదు. మేం ముందుకు సాగుతూనే ఉంటాం' అని అశుతోష్ అన్నారు. చాందినీ చౌక్ నియోజకవర్గంలో ఢిల్లీ బిజెపి అధ్యక్షుడు, ముఖ్యమంత్రి అభ్యర్థి డా. హర్షవర్ధన్ కూడా పోటీలో ఉన్నారు. -
‘లోక్‌సభ’ సమరానికి ఆప్ సై
20 మందితో తొలి జాబితా న్యూఢిల్లీ: ఢిల్లీలో అధికారం నుంచి అస్త్రసన్యాసం చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) మరో నెలలో జరగనున్న లోక్‌సభ ఎన్నికలపై గురిపెట్టింది. అవినీతి మంత్రులు, ఎంపీలను మరోసారి పార్లమెంటులోకి అడుగుపెట్టనీయబోమన్న ఆప్.. అందుకు తగినట్లుగానే ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల తొలి జాబితాను వెల్లడించింది. ఢిల్లీలో 2, ఉత్తరప్రదేశ్‌లో 7, మహారాష్ట్రలో 6, హర్యానా, అరుణాచల్‌ప్రదేశ్, ఒడిశా, మధ్యప్రదేశ్, పంజాబ్ నుంచి ఒక్కో స్థానానికి.. మొత్తం 20 మంది పేర్లతో జాబితా వెలువడింది. వీరిలో ప్రముఖ సామాజిక ఉద్యమకారిణి మేధాపాట్కర్, అవినీతి వ్యతిరేక ఉద్యమకారిణి అంజలి దమానియా కూడా ఉన్నారు. ఎవరు ఎక్కడి నుంచి.. రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ నుంచి ముందుగా అనుకున్నట్లుగా కుమార్ విశ్వాస్ పోటీ చేయనున్నారు. టీవీ జర్నలిస్టు నుంచి రాజకీయ నేతగా మారిన అశుతోష్ ఢిల్లీలోని చాందినీ చౌక్ స్థానంలో పోటీకి దిగుతారు. ఇక్కడ కేంద్ర మంత్రి కపిల్‌సిబల్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరో కేంద్ర మంత్రి ఖుర్షీద్ ప్రాతినిధ్యం వహిస్తున్న యూపీలోని ఫరూకాబాద్ టికెట్‌ను మాజీ జర్నలిస్టు ముకుల్ త్రిపాఠీకి ఇచ్చారు. ఎస్పీ అధినేత ములాయం సింగ్ యాదవ్‌కు కంచుకోట అయిన మెయిన్‌పురి స్థానంలో హర్దేవ్ సింగ్ తలపడనున్నారు. అంజలి దమానియా నాగ్‌పూర్‌లో బీజేపీ మాజీ అధ్యక్షుడు నితిన్ గడ్కారీపై పోటీ చేయనున్నారు. ఈశాన్య ముంబై టికెట్ మేధాపాట్కర్‌కు కేటాయించారు. దీంతో సిట్టింగ్ ఎంపీ ఎన్సీపీ నేత సంజయ్పాటిల్కి ఇబ్బందికర పరిస్థితేనని విశ్లేషకులు భావిస్తున్నారు. క్రికెటర్ అజహరుద్దీన్ ప్రాతినిధ్యం వహిస్తున్న మొరాదాబాద్ నుంచి ఖలీద్పర్వేజ్, కల్మాడీ ప్రాతినిధ్యం వహిస్తున్న పుణే నుంచి సుభాష్ వారే, గుర్గావ్ నుంచి యోగేంద్ర యాదవ్ పోటీ చేస్తారు. -
ఆప్‌లో చేరిన అశుతోష్
న్యూఢిల్లీ: ప్రముఖ పాత్రికేయుడు అశుతోష్ శనివారం ఆమ్ ఆద్మీ పార్టీలో చేరా రు. ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించారు. ఈసందర్భంగా ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో కేజ్రీవాల్‌తోపాటు ఆ పార్టీ నేత సంజయ్ సింగ్ పాల్గొన్నారు. ఐబీఎన్7లో మేనేజింగ్ డెరైక్టర్‌గా కొనసాగుతున్న అశుతోష్ తన పదవికి రాజీ నామా చేయడంతో గురువారమే ఆయన ఆప్‌లో చేరనున్న వార్త గుప్పుమంది. ఈ వార్తలను నిజం చేస్తూ ఆయన శనివారం ఆప్‌లో చేరారు. లోక్‌సభకు పోటీ చేసేందుకే ఆప్‌లో చేరారా? అన్న ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ... ‘చరిత్ర నాకో అవకాశాన్నిచ్చింది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్నా. అయితే లోక్‌సభకు పోటీ చేయడానికి మాత్రమే ఆప్‌లో చేరలేదు. పార్టీ ఏది చెబితే అది చేస్తా. పాత్రికేయ వృత్తిలో 23 సంవత్సరాలకుపైగా ఉన్నాను. దేశంలోని అన్ని రాజకీయ పార్టీలతో పరిచయం ఉంది. ఈ పరిచయాన్ని ఇన్నాళ్లూ పాత్రికేయుడిగానే కొనసాగించాను. అయితే ఆప్ విధానాలు నచ్చడంతో ఆ పార్టీలో చేరాన ’ని చెప్పారు. ఇదిలాఉండగా వృత్తి లో కొనసాగినన్ని రోజులు ఆయన పాత్రికేయుడిగా న్యాయం చేయలేదని, ఏదో ఆశించే ఆప్‌లో చేరారని పలువురు జర్నలిస్టులు విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీ కూడా అశుతోష్ చేరికపై విమర్శలు సంధించాయి. వీటిపై అశోతోష్ స్పం దిస్తూ.. ‘జర్నలిస్టుగా కొనసాగినన్ని రోజులు సమతుల్యంగానే వ్యవహరిం చాను. నా సొంత అభిప్రాయాలనెప్పుడే న్యూస్‌రూమ్‌పై రుద్దలేద’న్నారు. -
'ఆప్'లో చేరిన ఐబీఎన్ -7 ఎండీ అశితోష్
న్యూఢిల్లీ : ఇటీవల జరిగిన ఎన్నికల్లో చీరుపుతో దుమ్ము దులిపేసిన ఆమ్ ఆద్మీ పార్టీలో చేరేందుకు ప్రముఖులు క్యూ కడుతున్నారు. రాజకీయ జీవితాన్ని ప్రారంభించాలని ఉవ్విళూరుతున్న వారికి ఆమ్ ఆద్మీ పార్టీ మంచి వేదికగా మారుతోంది. తాజాగా ఐబీఎన్ -7 మేనేజింగ్ ఎడిటర్ అశితోష్ గురువారం ఆపార్టీలో చేరారు. ఢిల్లీలోని చాందినీ చౌక్ నుంచి లోక్‌సభకు పోటీ చేయాలని అశితోష్ భావిస్తున్నారు. చాందినీచౌక్ టిక్కెట్‌పై ఆయనకు పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు సమాచారం. ఈ హామీ మేరకే ఐబీఎన్ -7, మేనేజింగ్ డైరెక్టర్ పదవికి అశితోష్ రాజీనామా చేశారు. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీకి బద్ధ విరోధిగా ముద్రపడ్డ వారంతా.... ఒక్కొక్కరుగా ఆమ్ ఆద్మీ పార్టీలో చేరుతున్నారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. గోద్రా అల్లర్లపై మోడిని.... జాతీయ స్థాయిలో ముప్పతిప్పలు పెట్టిన వారిలో అశుతోష్ ఒకరని బీజేపీ నేతలు అంటున్నారు. కాగా ప్రముఖ నృత్యకారిణి, సామాజిక కార్యకర్త మల్లికా సారాభాయి ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)లో చేరిన విషయం తెలిసిందే.